జనవరి–జూలైలో 10,75,060 యూనిట్లు
2023తో పోలిస్తే సేల్స్ 28 శాతం జూమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) అమ్మకాలు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏడు నెలల కాలంలో ఒక మిలియన్ యూనిట్ల విక్రయాల మార్కును చేరుకోవడం విశేషం. 2024 జనవరి–జూలైలో దేశవ్యాప్తంగా 10,75,060 ఈవీలు రోడ్డెక్కాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైతో ముగిసిన ఏడు నెలల్లో ఈ–టూ వీలర్స్ 29 శాతం దూసుకెళ్లి 6,34,770 యూనిట్లు నమోదయ్యాయి. ఈ–త్రీ వీలర్స్ 26 శాతం ఎగసి 3,77,439 యూనిట్లను తాకాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ (కార్, ఎస్‌యూవీ, ఎంపీవీ) రిటైల్ అమ్మకాలు 21 శాతం అధికమై 56,207 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ–కమర్షియల్ వెహికిల్స్ ఏకంగా 190 శాతం వృద్ధి చెంది 6,308 యూనిట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 2,13,036 ఎలక్ట్రిక్ వెహికిల్స్ కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. జూలైలో 1,78,948 యూనిట్లు రోడ్డెక్కాయి.
ఈ ఏడాది 2 మిలియన్లపైనే..
ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి 2024లో ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు 20 లక్షల యూనిట్లను దాటడం ఖాయంగా కనిపిస్తోందని పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. 2023లో ఈవీల విక్రయాలు దేశవ్యాప్తంగా 50 శాతం వృద్ధితో 15.3 లక్షల యూనిట్లను నమోదు చేశాయి. 2022లో ఈ సంఖ్య 10.2 లక్షల యూనిట్లు మాత్రమే. మొత్తం వాహన రంగంలో ఎలక్ట్రిక్ విభాగం 2023లో 6.38 శాతానికి చేరింది. 2021లో ఇది 1.75 శాతమే. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఈ– టూ వీలర్స్, ఈ– త్రీ వీలర్స్ వాటా ఏకంగా 95 శాతంపైమాటే. ఇక ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను (ఈఎంపీఎస్) 2024 సెపె్టంబర్ వరకు పొడిగించింది. వాస్తవానికి ఈఎంపీఎస్ సబ్సిడీ పథకం జూలై 31న ముగియాల్సి ఉంది.
మౌలిక వసతులు ‘చార్జింగ్’..
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల మార్కెట్ దేశంలో ఊహించనంతగా వృద్ధి చెందుతోంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల సంఖ్య భారత్‌లో 2022 ఫిబ్రవరిలో 1,800 ఉంది. 2024 మార్చి నాటికి ఈ సంఖ్య ఏకంగా 16,347కు చేరిందని ప్రొఫెషనల్ సరీ్వసుల్లో ఉన్న ఫోరి్వస్ మజర్స్ నివేదిక వెల్లడించింది. పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, అధికం అవుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఈవీల డిమాండ్ దేశంలో దూసుకెళుతోంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌లోని మొత్తం ప్రయాణికుల వాహనాల మార్కెట్లో దాదాపు మూడింట ఒక వంతు ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా బలమైన మౌలిక సదుపాయాల విస్తరణ కీలకం. 2030 నాటికి భారత రోడ్లపై 5 కోట్ల ఈవీలు పరుగెడతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. 40 వాహనాలకు ఒక కేంద్రం చొప్పున లెక్కిస్తే ఏటా భారత్‌లో 4,00,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఫోరి్వస్ మజర్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment