
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30-షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 424.90 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 75,748.72 నుండి 75,112.41 పరిధిలో ట్రేడైంది.
ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 కూడా 127.25 పాయింట్లు లేదా 0.51 శాతం తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,921ను నమోదు చేయగా, కనిష్ట స్థాయి 22,720 గా ఉంది. నిఫ్టీ 50లోని 50 కాంపోనెంట్ స్టాక్‌లలో 35 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, విప్రో షేర్లు 6.20 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
శుక్రవారం నిఫ్టీ మిడ్‌క్యాప్100, నిఫ్టీ స్మాల్‌క్యాప్100 సూచీలు వరుసగా 1.32 శాతం, 0.70 శాతం నష్టాలతో స్థిరపడటంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్‌మార్క్‌లను ప్రతిబింబించాయి. నిఫ్టీ మెటల్ తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఇది 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, రియాల్టీ, ఫార్మా, ఓఎంసీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టంతో స్థిరపడ్డాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment