Electric Bike
-
ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ నుంచి సరికొత్త 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.కొత్త చేతక్ రూ.1.2 లక్షల ధరతో మిడ్ వేరియంట్ 3502, రూ.1.27 లక్షల ధరతో టాప్–ఎండ్ వేరియంట్ 3501 మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. బేస్ వేరియంట్ అయిన 3503 కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. డెలివరీలు డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభం అతుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్స్ అందుకునేలా స్మార్ట్ టచ్‌స్క్రీన్ పొందుపరిచారు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఏర్పాటు ఉంది. స్టోరేజ్ స్థలం పరంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇదే అత్యధికం. రిమోట్ ఇమ్మొబిలైజేషన్, గైడ్ మీ హోమ్ లైట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 3501 మూడు గంటల్లో, 3502 వేరియంట్ 3 గంటల 25 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. -
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
అదిరిపోయే ఎలక్ట్రిక్ ట్రెక్కింగ్ బైక్ (ఫొటోలు)
-
రిపేర్ బిల్లు రూ.90,000.. కోపంతో బండిని గుల్లగుల్ల చేసిన కస్టమర్...
-
HYD:పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ఎనిమిది బైకులు దగ్ధం
సాక్షి,హైదరాబాద్: నగరంలో మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం బ్యాటరీ పేలింది. రామంతాపూర్ వివేక్‌నగర్‌లో బుధవారం(నవంబర్ 27) తెల్లవారుజామున 3గంటల30నిమిషాలకు ఘటన జరిగింది.పార్క్ చేసి ఉన్న బైక్‌లో ఉన్న బ్యాటరీ పేలింది.పేలుడు దాటికి బైకు పూర్తిగా దగ్ధమైంది.మంటల తీవ్రతకు పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ఎనిమిది బైకులు కాలి బూడిదయ్యాయి. ఇదీ చదవండి: ఫ్యాబ్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం -
కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై హీరో కసరత్తు
న్యూఢిల్లీ: మధ్య స్థాయి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీపై కసరత్తు చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్ భాగస్వామ్యంలో ఈ వాహనం అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.జీరో మోటర్‌సైకిల్స్ ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్, పవర్‌ట్రెయిన్స్ తయారు చేస్తుంది. 2022 సెప్టెంబర్‌లో జీరోలో 60 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు హీరో బోర్డు ఆమోదముద్ర వేసింది. మరోవైపు, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని మరింతగా విస్తరిస్తున్నట్లు గుప్తా చెప్పారు.వచ్చే ఆరు నెలల్లో వివిధ ధర శ్రేణుల్లో, కస్టమర్ సెగ్మెంట్లలో తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని వివరించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కి చెందిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో అమ్ముడవుతున్నాయి. -
ఛార్జింగ్ పెడితే పేలిన ఎలక్ట్రిక్ బండి
-
జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే..
సాక్షి, జగిత్యాల జిల్లా: కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే ఎలక్ట్రిక్ బైక్ పేలిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఛార్జింగ్ పెడుతుండగా ఘటన జరిగింది. ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం ఐదు నిమిషాల్లోనే బైక్ పేలిపోయింది.బైక్ పేలడంపై బాధితుడు బేతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసమవ్వగా, స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. బైక్ డిక్కీలోనే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు లక్షా 90 వేల రూపాయలున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.కాగా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్ పేలుడుపై టీవీఎస్ మోటార్ డీలర్‌తో బాధితుడు వాగ్వాదానికి దిగారు. ఇన్సూరెన్స్ ద్వారా నష్టం పూడ్చే ప్రయత్నం చేస్తామని కంపెనీ డీలర్ తెలిపారు. వరసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ బైక్‌ల పేలుడు ఘటనలతో వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో టెన్షన్ కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘ఈవీ’లు... టైంబాంబులు! -
ఈవీ బైక్ షోరూం యజమాని అరెస్టు
బనశంకరి: బెంగళూరులోని రాజ్‌కుమార్ రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్, మేనేజర్ యువరాజ్‌ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఇష్టపడి కొంటే.. బూడిదైందికృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్ని కొన్నారు. పికప్ లేదని, సర్వీసింగ్ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్ చేసి బైక్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్‌ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. -
ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ''ప్యూర్ ఈవీ'' (Pure EV).. క్లారియన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనుబంధ సంస్థ 'అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ'తో చేతులు కలిపింది. ఈ సహకారంతో కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతాల వినియోగదారులకు చెరువవుతుంది.ప్యూర్ ఈవీ, అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ సహకారంతో.. ద్విచక్ర వాహనాల పంపిణీ, విక్రయాలను చేపట్టడం వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ మొదటి బ్యాచ్‌లో 50,000 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయనుంది. ఆ తరువాత నుంచి సంవత్సరానికి 60,000 యూనిట్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం.ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'నిశాంత్ డొంగరి' (Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం అమ్మకాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చేరువవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో కూడా మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇదీ చదవండి: పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎలక్ట్రిక్ బైకులలో 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft), 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X) ఉంటాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్), రూ. 1,49,999 (ఎక్స్ షోరూమ్). ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జీతో 151 కిమీ రేంజ్ అందిస్తే.. ఈట్రిస్ట్ ఎక్స్ 171 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ రెండు బైకులు ఉత్తమంగానే ఉంటాయి. -
హోండా మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (ఫొటోలు)
-
ఎలక్ట్రిక్ టూరర్ బైక్స్ ఎప్పుడైనా చూశారా?.. మతిపోగొడుతున్న ఫోటోలు
-
ఇక నుంచి అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
-
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
-
ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
టూవీలర్ వాహన మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ‘ఫ్లైయింగ్ ఫ్లీ’ పేరుతో దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. విభిన్న వేరియంట్ల ద్వారా 250-750 సీసీ సామర్థ్యం కలిగిన బైక్‌లకు ధీటుగా ఈవీను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.రాయల్ ఎన్ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ్ లాల్ మాట్లాడుతూ..‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6, స్క్రాంబ్లర్-స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ ఎస్6 పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈవీ టెక్నాలజీకి కస్టమర్లలో ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తులను అందిస్తుంది. కంపెనీ ఆవిష్కరించిన ఈవీ బైక్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు’ అని అన్నారు.రెండో ప్రపంచ యుద్ధం నాటి బైక్అక్టోబర్ చివరి వారంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పారాచూట్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువులపై దండెత్తడానికి బైక్‌లను పారాచూట్ ద్వారా ల్యాండ్ చేశారు. అందుకు తగ్గట్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ తేలికపాటి బైక్‌లు తయారు చేసింది. అదే మాదిరి ఈ బైక్ టీజర్ విడుదల సమయంలో పారాచూట్ ద్వారా ల్యాండ్ చేసినట్లు చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అభివృద్ధి చేసిన తేలికపాటి మోటార్‌సైకిళ్లను యుద్ధం తర్వాత విక్రయించారు.ఇదీ చదవండి: హైదరాబాద్ గోదామును డీలిస్ట్ చేసిన జొమాటోఫ్రేమ్: అల్లైడ్ అల్యూమీనియ్ ఫ్రేమ్బ్యాటరీ: బరువు తక్కువగా ఉండేందకు వీలుగా మెగ్నీషియమ్ బ్యాటరీ వాడారు.డిజైన్: రౌండ్ హెడ్‌లైట్, ఫాక్స్ ఫ్యుయెల్ ట్యాంక్ మాదిరిగా కనిపించే డిజైన్, ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది.డిస్ప్లే: టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ.సేఫ్టీ: ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఏబీఎస్, ముందు, వెనక డిస్క్ బ్రేకులుంటాయి.రేంజ్: ఒకసారి ఛార్జీ చేస్తే 150-200 కి.మీ ప్రయాణం చేసేందుకు వీలుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి ఈవీ బైక్ చూశారా? (ఫొటోలు)
-
ఎలక్ట్రిక్ వాహనాలు.. ఎన్నెన్నో అనుమానాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల్లో విద్యుత్ వాహనాలపై అనేక అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా విద్యుత్ వాహనాల వినియోగం విరివిగా పెరిగింది. దీనికితోడు ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా ఓ కారణం అయితే, మెయింటెనెన్స్ కూడా మరో కారణంగా పలువురు వినియోగదారులు చెబుతున్నారు.అయితే ధరల విషయంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని, సామాన్యులకు అందుబాటులో లేవని పలువురి వాదనలు వినిపిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశంలో అనేక కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని బ్రాండెడ్ కాగా మరికొన్ని హైబ్రిడ్ వెహికల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే విద్యుత్ వాహనాల గురించి సమాచారం తెలుసుకునే వారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.కంపెనీల వారీగా వాహనాల ధర, ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చు. మన్నిక, లేటెస్ట్ ఫీచర్స్, ఇతర అంశాలపై ఆన్లైన్లో శోధించడం పరిపాటిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని, అన్నింటినీ సరిపోల్చుకున్నాకే నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే విద్యుత్తు మోటారు సైకిల్ వరకూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నా, కార్లు, ఆటో రిక్షాల విషయంలో వినియోగదారుల మన్ననలు పొందలేకపోతున్నాయి.ఛార్జింగ్ స్టేషన్ల కొరత.. ప్రధానంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు వెనుకాడటానికి నగరంలో సరైన ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడమే అనే వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా నగర పరిధి దాటి బయటకు వెళ్లాలనుకుంటే మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాలకు ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లను విద్యుత్ ఛార్జింగ్ విషయంలో కనిపించడం లేదు. దీంతో లోకల్లో తిరగడానికి మాత్రమే విద్యుత్ వాహనాలు ఉపయోగపడతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నగరంలో విద్యుత్ వాహనాల అమ్మకాల సంఖ్య సైతం దీన్నే సూచిస్తోంది. టూవీలర్ కొనుగోలుకు సై.. ఇప్పటి వరకూ సుమారు 1.20 లక్షల విద్యుత్ మోటారు సైకిళ్లు మార్కెట్లో అమ్మకాలు జరగగా, కార్లు, ఆటో రిక్షా, ఇతర వాహనాలన్నీ కలపి సుమారు 16 వేలు అమ్ముడయ్యాయి. సాధారణంగా మోటారు సైకిళ్లు 70 శాతం ఉంటే, ఇతర వాహనాలు 30 శాతం ఉంటాయి. విద్యుత్తు వాహనాల విషయంలో ఇతర వాహనాల సంఖ్య 15 శాతం కంటే తక్కువ ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.లాంగ్‌డ్రైవ్ వెళ్లాలంటే ఇబ్బంది హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలనుకుంటే బస్సు, ట్రైన్ నమ్ముకుంటే సమయానికి చేరుకోలేము. డ్యూటీ అయ్యాక రాత్రి బయలుదేరితే ఉదయం విశాఖ చేరుకునేట్లు ప్లాన్ చేసుకుంటాం. విద్యుత్ కారులో పోవాలంటే ఛార్జింగ్ సరిపోదు. ప్రతి 300 కిలో మీటర్లకు ఒక దఫా ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఎక్కడైనా ఛార్జింగ్ పెడదాం అంటే సుమారు 6 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు అన్నారు. ఆ తరువాత కారు విలువలో సుమారు 40 శాతం బ్యాటరీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పెట్రోల్ కారు తీసుకున్నాను. – వై.రాజేష్, కేపీహెచ్‌బీ నెలకు రూ.3 వేల ఖర్చు తగ్గిందిరెండేళ్ల క్రితం ఈవీ మోటారు సైకిల్ కొన్నాను. ప్రతి 5 వేల కిలో మీటర్లకు సర్వీసింగ్ చేయించాలి. ఫుల్ ఛార్జింగ్ చేశాక ఎకానమీ మోడ్‌లో వెళితే 105 కిలో మీటర్లు వస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో వెళితే 80 కిలో మీటర్లు వస్తుంది. పెట్రోల్ స్కూటీకి నెలకు రూ.3,500 పెట్రోల్ అయ్యేది. ఈవీ కొన్నాక నెల కరెంటు బిల్లు రూ.500 నుంచి రూ.700కి పెరిగింది. అదనంగా రూ.200 పెరిగినా పెట్రోల్ రూ.3,500 వరకూ తగ్గింది. – గాదిరాజు రామకృష్ణంరాజు, హైటెక్ సిటీ -
ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్
ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్సైకిల్స్పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు. -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా
-
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ - వీడియో చూశారా?
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీదారు 'రాయల్ ఎన్ఫీల్డ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2024 నవంబర్ 4న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సంబంధించిన ఓ టీజర్ విడుదల చేసింది. అయితే నవంబర్ 4న రాయల్ ఎన్ఫీల్డ్ ఆవిష్కరించే ఎలక్ట్రిక్ బైక్ కేవలం కాన్సెప్ట్ అయి ఉండొచ్చని, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అవుతుందని సమాచారం.ఇప్పటికి లీకైన సమాచారం ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో బహుశా స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చని సమాచారం. పేటెంట్ ఇమేజ్ సింగిల్-సీట్ లేఅవుట్‌ను కలిగి ఉండనున్నట్లు వెల్లడిస్తున్నప్పటికీ.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగం అల్యూమినియం స్వింగ్ఆర్మ్, మోనోషాక్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ బైక్ ఎలక్ట్రిక్01 అనే కోడ్ నేమ్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా చాలా వివరాలు అధికారికంఘా వెల్లడి కావాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయితే ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. View this post on Instagram A post shared by Royal Enfield (@royalenfield) -
ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీలో ఉన్న ఓలాపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత, అమ్మకాల తర్వాత సేవకు సంబంధించి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించకపోవడంతో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలాకు నోటీసును జారీ చేసింది. నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) ఏడాది కాలంగా ఓలా ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిందిగా కంపెనీలో ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించినా వారు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ క్లాస్ యాక్షన్ కోసం ఈ ఫిర్యాదులను పరిశీలించడం ప్రారంభించింది.ఏడాదిలో ఎన్‌సీహెచ్‌కు 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని గుర్తించింది. చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సీసీపీఏ వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, సేవల్లో లోపాలు, తప్పుదారి పట్టించే దావాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంభించడంతో సీసీపీఏ అక్టోబర్ 7న ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రతిస్పందించడానికి కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. సీసీపీఏ నుండి షోకాజ్ నోటీసు అందుకున్నట్టు అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇవీ ఫిర్యాదులు..ఉచిత సేవా వ్యవధి/వారంటీ సమయంలో చార్జీల వసూలు, సేవలు ఆలస్యం కావడంతోపాటు అసంతృప్తికరం, వారంటీ ఉన్నప్పటికీ సర్వీసు తిరస్కరణ లేదా ఆలస్యం, సరిపోని సేవలు, పునరావృతం అవుతున్న లోపాలు, అస్థిర పనితీరు, అధిక చార్జీలు, ఇన్వాయిస్లో తేడాలు ఉంటున్నాయని ఓలాపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రీఫండ్ చేయకపోవడం, డాక్యుమెంటేషన్‌ను అందించడంలో వైఫల్యం, వృత్తిపర ప్రవర్తన, పరష్కారం కానప్పటికీ ఫిర్యాదుల మూసివేత, బ్యాటరీ, వాహన విడి భాగాలతో బహుళ సమస్యలను వినియోగదార్లు ఎదుర్కొంటున్నారు.చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!కాగా, నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌ను (ఎన్సీహెచ్) డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ పునరుద్ధరించింది. వ్యాజ్యానికి ముందు దశలో ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒకే పాయింట్‌గా ఎన్సీహెచ్ ఉద్భవించింది. ఇది దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు 17 భాషలలో టోల్–ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915 ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్, ఎస్ఎంఎస్, మెయిల్, ఎన్సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమంగ్ యాప్‌ల ద్వారా బాధితులు తమ సౌలభ్యం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.తగ్గుతున్న విక్రయాలు.. భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్‌లో 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. యూనిట్ల పరంగా అమ్మకాలు 11 నెలల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెప్టెంబర్‌లో ఇది 27 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 52,136 యూనిట్లను కంపెనీ విక్రయించింది. చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొద్ది నెలల్లోనే బజాజ్ చేతక్ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్‌లు
ప్రస్తుతం దేశమంతా పండుగ సీజన్ నడుస్తోంది. ఈ ఉత్తేజకరమైన సమయంలో మీరు బైక్ కొనాలనుకుంటున్నారా? అది కూడా మంచి రేంజ్, స్పీడ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ల చూస్తున్నారా? అయితే మీ కోసమే రయ్‌మంటూ దూసుకెళ్లే టాప్10 లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ (Revolt RV400 BRZ) భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌గా ప్రసిద్ధి చెందింది. అధిక పనితీరు, సొగసైన డిజైన్, ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ లాంచ్‌తో కంపెనీ ఇటీవలే ఆర్వీ400ని అప్డేట్ చేసింది. దీని రేంజ్ 150 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ప్రారంభ ధర రూ.1.09 లక్షలు.ఓలా రోడ్‌స్టర్ ప్రో ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ఓలా రోడ్‌స్టర్ సిరీస్ విడుదలతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది అత్యుత్తమ రేంజ్, పనితీరు, ఫీచర్లను అందిస్తుంది. విడుదల చేసిన మోడళ్లలో టాప్-ఎండ్ వేరియంట్, ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro). దీని ప్రారంభ ధర రూ.1,99,999. అత్యధిక రేంజ్ 579 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 194 కిలో మీటర్లు.రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ఇటీవల రివోల్ట్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ (Revolt RV1 and RV1+)లను విడుదల చేసింది. ఆర్వీ1, ఆర్వీ1 ప్లస్ ఇప్పుడు దేశ మొట్టమొదటి కమ్యూటర్ మోటార్‌సైకిళ్లుగా నిలిచాయి. బేస్ మోడల్ ధర రూ. 84,990, ప్లస్ వెర్షన్ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్). టాప్ రేంజ్ 160 కిలో మీటర్లు.ఒబెన్ రోర్బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ (Oben Rorr). ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. స్టైలిష్ నియో-క్లాస్ డిజైన్ లుక్స్‌తో ఉన్న ఈ బైక్ ప్రతి రైడర్‌ను ఆకట్టుకుంటుంది. దీని రేంజ్ 187 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లు. ధర రూ.1,49,999.అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్‌లలో అల్ట్రావయోలెట్ అత్యంత ఇష్టమైన పేర్లలో ఒకటి. బెంగుళూరుకు చెందిన ఈ సంస్థ ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఉత్తమ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) దాని ఎఫ్77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా విడుదలైంది. దీని రేంజ్ 323 కి.మీ. కాగా టాప్ స్పీడ్ 155 కి.మీ. ప్రారంభ ధర రూ.2,99,000.కొమాకి రేంజర్ ఎక్స్పీకొమాకి రేంజర్ పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. అవి రేంజర్, ఎం16. రేంజర్‌ను భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్‌గా చెప్తారు. ఇది భారీ, దృఢమైన చక్రాలు, అద్భుతమైన క్రోమ్ ఎక్స్టీరియర్స్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. కొమాకి రేంజర్ ఎక్స్పీ (Komaki Ranger XP) రేంజ్ 250 కిలో మీటర్లు కాగా స్పీడ్ 70-80 కిలో మీటర్లు. ఇక దీని ధర రూ.1,84,300.మ్యాటర్ ఏరామ్యాటర్ ఎనర్జీ కంపెనీ గత ఏడాది తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఏరా (Matter Aera)ను విడుదల చేసింది. ఇది సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్తో స్పష్టమైన, వినూత్న సాంకేతికతను మిళితం చేస్తూ బోల్డ్, స్ఫుటమైన డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ రేంజ్ 125 కి.మీ.కాగా ధర రూ.1,73,999 నుంచి ప్రారంభమవుతుంది.టోర్క్ క్రాటోస్-ఆర్ అర్బన్పుణెకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌మేకర్ టోర్క్ మోటార్స్ కొత్త క్రాటోస్-ఆర్ మోడల్ ( Tork Kratos R Urban)ను విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్‌ను రోజువారీ ప్రయాణాల కోసం, అర్బన్ రైడర్లకు సౌకర్యంగా రూపొందించారు. దీని ధర రూ.1.67 లక్షలు. ఇది 105 కిలో మీటర్ల టాప్ స్పీడ్, 120 కిలో మీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది.ఒకాయ ఫెర్రాటో డిస్రప్టర్ఒకాయ ఈవీ ఈ ఏడాది మార్చిలో తన కొత్త ప్రీమియం అనుబంధ బ్రాండ్ ఫెర్రాటోను ప్రారంభించింది. ఇదే క్రమంలో ఫెర్రాటో బ్రాండ్ కింద డిస్రప్టర్ (Okaya Ferrato Disruptor)పేరుతో మొదటి మోడల్‌ను పరిచయం చేసింది.ఫెర్రాటో డిస్రప్టర్ ఆధునిక, ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కి.మీ. కాగా 129 కిలో మీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ధర రూ.1,59,999.ఓర్క్సా మాంటిస్ఓర్క్సా ఎనర్జీస్ గత సంవత్సరం మాంటిస్ (Orxa Mantis) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రీమియం ధర కలిగిన మాంటిస్, పదునైన ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్ట్రైకింగ్ ట్యాంక్ కౌల్, విలక్షణమైన కట్లు,క్రీజ్‌లతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.3.6 లక్షలు. 221 కి.మీ.రేంజ్‌ను, 135 కి.మీ టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 ద్వారా అందించిన రాయితీలు దేశంలోని మొత్తం ప్రజల సొమ్మని కేరళ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. ఇటీవల ఓలా వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు అందిస్తున్న సేవలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దాంతో కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీను ట్యాగ్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది.‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అయ్యే ఖర్చు భారత ప్రజలందరిది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల పెంపునకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా రాయితీలిచ్చింది. మే 2023 కంటే ముందు విక్రయించిన ఓలా ఎస్1 ప్రో మోడల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్యాక్స్‌తో సహా రూ.1.16 లక్షలు రాయితీ అందించాయి. ఒక స్కూటర్‌కు ఇది భారీ రాయితీ. వినియోగదారులు, వారి భద్రత, సర్వీసును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందించిన రాయితీలు ఏమేరకు ప్రయోజనం కలిగించాయో ప్రభుత్వం తెలుసుకోవడం చాలాముఖ్యం’ అని తెలిపింది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు‘మన దేశాన్ని బ్రాండ్ ఇమేజ్ సమస్య వెంటాడుతోంది. చైనా చౌకైన, తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారీ చేస్తుందనే బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కొన్ని భారతీయ కంపెనీలు ఎలాంటి రెగ్యులేటర్ పరిశీలన లేకుండా కస్టమర్ భద్రతను విస్మరించి తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దాంతో దేశంలోని ఇతర బ్రాండ్లపై ప్రభావం పడుతోంది. అందువల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న నాణ్యమైన వాహనాలను ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంలో ‘చైనా బ్రాండ్’ ఇమేజ్‌నే మూటగట్టుకునే ప్రమాదముంది. కాబట్టి వాహనాల తయారీ, సర్వీసు అందించడంలో ప్రభుత్వం రెగ్యులేటర్‌గా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనదైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి’ అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.Dear @nitin_gadkari,The reported quality issues with @OlaElectric or any other Electric Vehicle company for that matter is not between the company and their customers. It concerns each and every tax payer of this country.We've been giving huge subsidies to these companies… pic.twitter.com/rbCbkTHOhL— Congress Kerala (@INCKerala) October 7, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
విద్యార్థులు అద్భుత సృష్టి.. ఏకంగా నాలుగు రికార్డ్స్! (ఫొటోలు)