మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్‌ బైక్‌లు వచ్చేస్తున్నాయ్‌ | Addmotor Foldtan M-160 Folding E-bike Review | Sakshi
Sakshi News home page

మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్‌ బైక్‌లు వచ్చేస్తున్నాయ్‌

Published Sun, Aug 20 2023 9:39 AM | Last Updated on Sun, Aug 20 2023 10:28 AM

Addmotor Foldtan M-160 Folding E-bike Review - Sakshi

గందరగోళం ట్రాఫిక్‌లో వాహనాలను నడపటమే ఒక పరీక్ష అయితే, వాటిని భద్రంగా పార్క్‌ చేయడం మరో పెద్ద పరీక్ష. తేలికగా నడపటానికి, సులువుగా పార్క్‌ చేసుకోవడానికి వీలుగా మడిచేసుకోవడానికి అనువైన ఈ–బైక్‌ అందుబాటులోకి వచ్చేసింది. సాదాసీదా సైకిల్‌లా కనిపించే ఈ ద్విచక్ర వాహనం రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. బ్యాటరీ చార్జింగ్‌ తోవలో అయిపోయినా, దీని పెడల్స్‌ తొక్కుతూ ముందుకు సాగిపోవచ్చు.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ‘యాడ్‌మోటార్స్‌’ ఇటీవల ‘ఫోల్డ్‌టాన్‌ ఎం–160’ పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ప్రయాణం పూర్తయ్యాక దీనికి క్షణాల్లోనే మడతపెట్టేసుకోవచ్చు.

దీనిపై ఆఫీసులకు వెళ్లేవారు ఆఫీసులకు చేరుకున్నాక, దీన్ని మడిచేసుకుని తాము పనిచేసే చోట టేబుల్స్‌ కింద భద్రపరచుకోవచ్చు. పార్కింగ్‌ ఇబ్బందులు తొలగించడానికి రూపొందించిన ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర 1899 డాలర్లు (రూ.1.55 లక్షలు) మాత్రమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement