Automobile industry
-
వాహన పరిశ్రమ నెమ్మది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎండల తీవ్రత.. మరోవైపు ఎన్నికలు. వెరసి దేశవ్యాప్తంగా మే నెలలో వాహన పరిశ్రమపై ఈ రెండు అంశాలు ప్రభావం చూపాయి. షోరూంలకు వచ్చే కస్టమర్ల సంఖ్య గత నెలలో 18 శాతం తగ్గినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) వెల్లడించింది. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు మే నెలలో 5.28 శాతం క్షీణించాయి. 2023 మే నెలతో పోలిస్తే గత నెల విక్రయాల్లో 2.61% వృద్ధి నమోదైంది. మే నెలలో మొత్తం 20,89,603 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.61% తగ్గి 15,34,856 యూనిట్లకు చేరాయి. -
కియా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతోంది. ఏప్రిల్ 1 నుంచి సవరించిన ధరలు అమలులోని రానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ముడిసరుకు ధరలు, సరఫరా సంబంధిత వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ధరలను పెంచడం ఈ ఏడాది ఇదే తొలిసారి అని కియా తెలిపింది. -
భారత్‌కు జపాన్ కంపెనీ.. పక్కా ప్లాన్‌తో వచ్చేస్తోంది
ఒకప్పుడు భారతదేశంలో లాన్సర్, పజెరో వంటి మోడల్స్ విక్రయించిన మిత్సుబిషి 2016లో తమ ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది. ఆ తరువాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ కార్ డీలర్‌షిప్‌లను నిర్వహిస్తున్న టీవీఎస్ మొబిలిటీలో 30 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసినట్లు సమాచారం. మిత్సుబిషి కంపెనీ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి 33 మిలియన్ డాలర్ల నుంచి 66 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. టీవీఎస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని 30శాతం వాటాను కొనుగోలు చేయడంతో.. ప్రస్తుత నెట్‌వర్క్‌లో దాదాపు 150 అవుట్లెట్లను ఉపయోగించుకుని, ప్రతి కార్ బ్రాండ్‌కు ప్రత్యేక స్టోర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ పూర్తయిన తరువాత మిత్సుబిషి భారతదేశంలో అతిపెద్ద స్వతంత్ర కార్ డీలర్‌షిప్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కంపెనీ దేశీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వాహన విక్రయాలతో పాటు, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నిర్వహణ అపాయింట్మెంట్లు, ఇన్సూరెన్స్ వంటివి సులభతరం చేయడం వంటి వినూత్న సేవలను ప్రవేశపెట్టాలని మిత్సుబిషి యోచిస్తోంది. భారత ఆటోమోటివ్ మార్కెట్లో పోటీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమ్మకాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా సంస్థ యోచిస్తోంది. ఇదీ చదవండి: హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా? -
2024లో ఆటో సూపర్స్టార్ట్
ముంబై: దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త సంవత్సరం శుభారంభం ఇచి్చంది. పలు ఆటో సంస్థలు 2024 జనవరిలో గత సంవత్సరం ఇదే నెలతో పోలి్చతే గణనీయమైన అమ్మకాలు జరిపాయి. మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా జనవరి అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం అమ్మకాలలో దేశీయ పరిమాణం జనవరిలో 2,78,155 నుండి 3,82,512 యూనిట్లకు పెరిగింది. ఇక ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 102 శాతం పెరిగి 36,883 యూనిట్లుగా ఉన్నాయి. -
ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!
ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్ ఫ్యూయల్) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ రెఫరెన్స్ ఫ్యూయల్? రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి. చాలా డబ్బు ఆదా రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. -
కార్ డిజైనర్ థార్ డిజైనర్!
మహింద్రా థార్‌ను చూసి భలే ఉందే అనుకున్నారా? దానిని డిజైన్ చేసింది ఒక స్త్రీ అని చాలామంది అనుకోరు. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మగవారి ప్రాబల్యం ఎక్కువ. కాని క్రిపా అనంతన్ గొప్ప కార్ డిజైనర్‌గా ఈ రంగంలో తన ప్రభావం చూపుతోంది. మహింద్రాలో హిట్ అయిన అనేక ఎస్‌యువీలను ఆమే డిజైన్ చేసింది. ఇపుడు ఓలాకు డిజైన్ హెడ్‌గా పని చేస్తూ ఉంది. మహింద్రా సంస్థకు గొప్ప పేరు తెచ్చిన ‘థార్’ను క్రిపా అనంతన్ డిజైన్ చేసింది. ఆమె వయసు 53. పూర్తి పేరు రామ్క్రిపా అనంతన్ అయితే అందరూ క్రిపా అని పిలుస్తారు. ‘ఆటోమొబైల్ డిజైనర్ కూడా చిత్రకారుడే. కాకపోతే చిత్రకారుడు కాగితం మీద రంగులతో గీస్తే మేము లోహాలకు రూపం ఇస్తాం... శక్తి కూడా ఇచ్చి కదలిక తెస్తాం’ అంటుంది క్రిపా. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన క్రిపా ఆ తర్వాత ఐ.ఐ.టి ముంబైలో ఇండస్ట్రియల్ డిజైన్ చదివి 1997లో మహింద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా చేరింది. ఆ సమయంలో తయారైన వాహనాలు– బొలెరో, స్కార్పియోలకు ఇంటీరియర్ డిజైన్ పర్యవేక్షించింది. ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ కొత్త ఎస్‌యువిని తేదలిచి దాని డిజైనింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. సాధారణంగా ప్రయాణాలంటే ఇష్టపడే క్రిపా తన టూ వీలర్– బజాజ్ అవెంజర్ మీద మనాలి నుంచి శ్రీనగర్ వరకూ ఒక్కతే ప్రయాణిస్తూ వాహనం ఎలా ఉండాలో ఆలోచించింది. అంతేకాదు దాదాపు 1500 మందిని సర్వే చేయించి ఎస్యువి ఎలా ఉంటే బాగుంటుందో సూచనలు తీసుకుంది. ‘మహింద్రా ఏ బండి తయారు చేసినా దాని రూపం ఘనంగా ఉండాలి. చిన్నబండి అయినా తన ముద్ర వేయాలి. నేను సాధారణంగా ప్రకృతి నుంచి అటవీ జంతువుల నుంచి వాహనాల డిజైన్లు చూసి ఇన్‌స్పయిర్ అవుతాను. చీటాను దృష్టిలో పెట్టుకుని నేను అనుకున్న డిజైన్ తయారు చేశాను’ అందామె. ఆ విధంగా ఆమె పూర్తిస్థాయి డిజైన్‌తో మహింద్రా ఎస్యువి 500 మార్కెట్లోకి వచ్చింది. పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహిళా డిజైనర్‌గా క్రిపా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇతర వాహనాల డిజైన్ల బాధ్యత కూడా ఆమెకే అప్పజెప్పారు. ‘ప్రతి మనిషికీ ఒక కథ ఉన్నట్టే ప్రతి వాహనానికీ ఒక కథ ఉండాలి. అప్పుడే జనానికి కనెక్ట్ అవుతుంది’ అంటుంది క్రిపా. ఆమె తయారు చేసిన ‘ఎస్యువి 300’ మరో మంచి డిజైన్‌గా ఆదరణ పొందింది. ఇక ‘థార్’ అయితే అందరూ ఆశపడే బండి అయ్యింది. ఇప్పుడు థార్ అమ్మకాలు భారీగా ఉన్నాయి. మహింద్రా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఉపక్రమిస్తుండగా 2021లో తన సొంత ఆటోమొబైల్ డిజైన్ స్టూడియో ఏర్పాటు కోసం సంస్థ నుంచి బయటకు వచ్చింది క్రిపా. అయితే ఇప్పుడు ఓలా గ్రూప్‌కు డిజైన్హెడ్గా పని చేస్తోంది. అంటే ఇకపై ఓలా గ్రూప్ నుంచి వెలువడే వాహనాలు ఆమె రూపకల్పన చేసేవన్న మాట. ఇరవైమంది డిజైనర్లతో కొత్త ఆలోచనలకు పదును పెట్టే క్రిపా తన బృందంలో కనీసం 5గురు మహిళలు ఉండేలా చూసుకుంటుంది. మహిళల ప్రతిభకు ఎప్పుడూ చోటు కల్పించాలనేది ఆమె నియమం. క్రిపాకు ఏ మాత్రం సమయం దొరికినా పారిస్కో లండన్‌కో వెళ్లిపోతుంది. అక్కడ ఏదైనా కేఫ్‌లో కూచుని రోడ్డు మీద వెళ్లే స్పోర్ట్స్ కార్లను పరిశీలిస్తూ ఉండటం ఆమెకు సరదా. ‘2050 నాటికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఇవాళ్టి నుంచి మన పనిని తీర్చిదిద్దుకోవాలి’ అంటుందామె.ఇంత దార్శనికత ఉన్న డిజైనర్ కనుక విజయం ఆమెకు డోర్ తెరిచి నిలబడుతోంది. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
గందరగోళం ట్రాఫిక్‌లో వాహనాలను నడపటమే ఒక పరీక్ష అయితే, వాటిని భద్రంగా పార్క్ చేయడం మరో పెద్ద పరీక్ష. తేలికగా నడపటానికి, సులువుగా పార్క్ చేసుకోవడానికి వీలుగా మడిచేసుకోవడానికి అనువైన ఈ–బైక్ అందుబాటులోకి వచ్చేసింది. సాదాసీదా సైకిల్లా కనిపించే ఈ ద్విచక్ర వాహనం రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. బ్యాటరీ చార్జింగ్ తోవలో అయిపోయినా, దీని పెడల్స్ తొక్కుతూ ముందుకు సాగిపోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘యాడ్మోటార్స్’ ఇటీవల ‘ఫోల్డ్టాన్ ఎం–160’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రయాణం పూర్తయ్యాక దీనికి క్షణాల్లోనే మడతపెట్టేసుకోవచ్చు. దీనిపై ఆఫీసులకు వెళ్లేవారు ఆఫీసులకు చేరుకున్నాక, దీన్ని మడిచేసుకుని తాము పనిచేసే చోట టేబుల్స్ కింద భద్రపరచుకోవచ్చు. పార్కింగ్ ఇబ్బందులు తొలగించడానికి రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర 1899 డాలర్లు (రూ.1.55 లక్షలు) మాత్రమే! -
పండుగ సీజన్లో 10 లక్షల కార్లు కొంటారు! పరిశ్రమ అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్లో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (కార్లు మొదలైనవి) అమ్మకాలు 10 లక్షల మార్కును దాటేయవచ్చని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనా వేస్తోంది. వీటిలో యుటిలిటీ వాహనాల విక్రయాలు అత్యధికంగా ఉండొచ్చని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈసారి ఆగస్టు 17న మొద లయ్యే పండుగల సీజన్ నవంబర్ 14 వరకు 68 రోజుల పాటు కొనసాగనుంది. సాధారణంగా వాహన విక్రయాల్లో దాదాపు 22–26 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది ప్యాసింజర్ వాహన విక్రయాలు 40 లక్షల స్థాయిలో ఉండొచ్చని, అందులో 10 లక్షల యూనిట్లు పండుగ సీజన్వి ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
6 నెలల్లో 20 లక్షల వాహన విక్రయాలు
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధం వాహన పరిశ్రమకు అత్యుత్తమంగా నిలిచింది. ప్యాసింజర్ విభాగంలో మొత్తం 20 లక్షల వాహనాలు విక్రమయ్యాయి. ఇక నెలవారీగా జూన్ ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్దగా కలిసిరాలేదు. మొత్తం 3.37 లక్ష వాహన అమ్మకాలు జరిగాయి. ఏడాది ఇదే నెలలో సరఫరా చేసిన 3.21 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 1.9% మాత్రమే అధికంగా ఉంది. కార్ల తయారీ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్.. అమ్మకాల్లో ఓ మోస్తరు వృద్ధి నమోదైంది. ► మారుతి సుజుకీ జూన్‌లో మొత్తం 1,33,027 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలి్చతే కేవలం ఎనిమిది శాతం (1,22,685 యూనిట్లు) వృద్ధి నమోదైంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలు విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాల్లో కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. కంపెనీ ఈ కాలంలో 50,001 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ► టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎంజీ మోటార్, టాటా మోటార్స్ విక్రయాలు వరుసగా 19%, 14%, ఒక శాతం పెరగగా కియా, హోండా కార్ల విక్రయాలు మాత్రం వరుసగా 19%, 35% మేరకు క్షీణించాయి. -
2024లో ఆటో విడిభాగాల జోరు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజాగా అంచనాలు వెలువడ్డాయి. ఇందుకు దేశ, విదేశీ మార్కెట్ల నుంచి ఊపందుకోనున్న డిమాండు దోహదపడనున్నట్లు ఆటోమోటివ్ విడిభాగాల తయారీ అసోసియేషన్(ఏసీఎంఏ) పేర్కొంది. యూఎస్, యూరప్ తదితర ప్రధాన మార్కెట్లలో ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలున్నప్పటికీ దేశీ ఆటో విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 23 శాతం ఎగసింది. 56.5 బిలియన్ డాలర్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ బాటలో మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 15 శాతం పుంజుకోగలదని ఏసీఎంఏ అంచనా వేసింది. ఐసీఈ ఎఫెక్ట్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్స్(ఐసీఈ) తయారీలో వినియోగించే ఆటో విడిభాగాల కోసం ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. యూఎస్, యూరప్ తదితర పశ్చిమ దేశాల మార్కెట్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లుతుండటం ప్రభావం చూపుతోంది. దీంతో దేశీ విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనుంది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(2022 మార్చి– డిసెంబర్) ఎగుమతులు, దిగుమతులు బ్యాలన్స్డ్గా 15.1 బిలియన్ డాలర్ల చొప్పున నమోదైనట్లు పారిశ్రామిక సమాఖ్య ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఏసీఎంఏ డైరెక్టర్ విన్నీ మెహతా వెల్లడించారు. పశ్చిమ దేశాలలో ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీ ఆటో విడిభాగాల ఎగుమతులు అంచనాలకు అనుగుణంగా పుంజుకోనున్నట్లు అంచనా వేశారు. ఎగుమతుల్లో ఎలాంటి మందగమన పరిస్థితులనూ గమనించలేదని తెలియజేశారు. దేశీ ఆటో మార్కెట్ అత్యంత పటిష్టంగా ఉన్న కారణంగా దిగుమతుల్లో సైతం వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు. వృద్ధి కొనసాగుతుంది ఏడాది కాలంగా పలువురు ప్రస్తావిస్తున్నట్లు యూఎస్ తదితర ప్రధాన మార్కెట్లలో ఎలాంటి మాంద్య పరిస్థితుల సంకేతాలూ కనిపించలేదని ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ పేర్కొన్నా రు. నిజానికి ఆటో విడిభాగాల పరిశ్రమ వృద్ధి బాటలోనే పయనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ నుంచి లభించిన వివరాల ప్రకారం జనవరిలోనూ పటిష్ట అమ్మకాలు నమోదుకాగా.. ఇకపైన కూడా ఈ జోరు కొనసాగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. వృద్ధిరీత్యా దేశీ మార్కెట్ అత్యంత సానుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతు ల్లో బలహీనతలున్నప్పటికీ దేశీ డిమాండ్ ఆదుకోగలదని అంచనా వేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీలవైపు ప్రయాణించడంలో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనున్నట్లు వివరించారు. ఈవీల కారణంగా ఐసీఈ విభాగంలో డిజైన్, డెవలప్మెంట్ కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో దేశీ విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు తెలియజేశారు. -
వాహన రేట్ల పెంపు యోచనలో వీఈసీవీ
న్యూఢిల్లీ: ఏప్రిల్ నుంచి మరింత కఠినతర ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను 5 శాతం వరకూ పెంచాలని వీఈ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) యోచిస్తోంది. బీఎస్–4, బీఎస్–6 ప్రమాణాలతో పోలిస్తే రేట్ల పెంపు తక్కువ స్థాయిలోనే.. 3–5 శాతం శ్రేణిలో ఉండవచ్చని అనలిస్టులతో సమావేశంలో కంపెనీ ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మోడల్స్‌లో కూడా దశలవారీగా మార్పులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. యూరో–6 ప్రమాణాలకు సరిసమానమైన భారత్ స్టేజ్ 6 (బీఎస్–6) రెండో దశకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దడంపై దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మరింత అధునాతనమైన పరికరాలను ఫోర్ వీలర్లు, వాణిజ్య వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉద్గారాల పరిశీలించేందుకు వాహనంలో సెల్ఫ్–డయాగ్నోస్టిక్ డివైజ్ కూడా ఉండాలి. ఒకవేళ ఉద్గారాలు నిర్దిష్ట స్థాయి దాటితే వార్నింగ్ లైట్ల ద్వారా తక్షణం సర్విసుకు ఇవ్వాలనే సంకేతాలను డివైజ్ పంపుతుంది. -
దిగ్గజ కంపెనీల మధ్య అమ్మకాల పోటీ, భారీగా తగ్గిన టాటా ఎలక్ట్రిక్ కారు ధర
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో దిగ్గజ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో ఒక సంస్థతో మరో సంస్థ పోటీపడుతున్నాయి. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్ర ఈవీ ఎస్యూవీ 400ను విడుదల చేసింది. ఆ కారు విడుదలైన మరుసటి రోజే ఈవీ మార్కెట్లో కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న నెక్సాన్ ఈవీ కారు ధరల్ని తగ్గిస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్ వేరియంట్‌కు పోటీగా ఎక్స్‌యూవీ 400 మార్కెట్లో విడుదలైంది. దాని ధర రూ.18.99 లక్షలుగా ఉంది. ఇప్పుడు దానికి గట్టిపోటీ ఇచ్చేలా నెక్సా ఈవీ ధరల్ని తగ్గించడం గమనార్హం. నెక్సాన్ ఈవీ కారు ఇంతకుముందు రూ.14.99 లక్షలు ఉండగా.. ధర తగ్గించడంతో ఇప్పుడు అదే కారును రూ.14.49 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. నెక్సాన్ వేరియంట్లో లేటెస్ట్గా విడుదలైన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ. 16.49లక్షలుగా ఉంది. వ్యూహాత్మకంగా ఈ సందర్భంగా టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..మేం పక్కా స్ట్రాటజీతో టియాగో నుంచి నెక్సాన్ ఈవీ కార్ల వరకు కస్టమర్లను ఆకట్టుకునేలా తయారు చేస్తున్నాం. స్మార్ట్ ఇంజనీరింగ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మా లక్ష్యాలను చేరుకునేందుకు దోహదం చేస్తున్నాయి. కొనుగోలు దారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను అందియ్యగలుగుతున్నామని అన్నారు. టాటా మోటార్స్ ఫోర్ట్ పోలియోలో మూడు ఈవీ కార్లు టాటా మోటార్స్ ఫోర్ట్ ఫోలియోలో టియాగో, టైగోర్,నెక్సాన్ ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.18.99లక్షల మధ్యలో ఉన్నాయి. ఇక ఎంట్రీ లెవల్ టిగాయో యూవీ మార్కెట్ ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79లక్ష మధ్యలో ఉండగా టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ.12.49లక్షల నుంచి రూ.13.75లక్షల మధ్య ధరతో సొంతం చేసుకోవచ్చు. -
బెంట్లీ కొత్త కారు.. ధర రూ.6 కోట్లు
న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బెంట్లే (బెంట్లీ) తాజాగా భారత్‌లో సరికొత్త బెంటేగా ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ ఎస్యూవీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6 కోట్లు. 4.0 లీటర్ 550 పీఎస్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుపరిచారు. రెండవ తరం బెంటేగా ఆధారంగా రూపుదిద్దుకుంది. వీల్‌బేస్, రేర్ క్యాబిన్ స్థలం 180 మిల్లీమీటర్లు అదనంగా విస్తరించింది. కారు డెలివరీకి 7–8 నెలల సమయం పడుతుంది. 2023లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు బెంట్లే భారత డీలర్‌గా వ్యవహరిస్తున్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ తెలిపింది. 2022లో దేశంలో కంపెనీ 40 యూనిట్లు విక్రయించిందని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బగ్లా వెల్లడించారు. ‘అల్ట్రా లగ్జరీ కార్ల విభాగం దేశంలో పెరుగుతోంది. అధిక దిగుమతి సుంకాలే ఈ విభాగానికి ఉన్న ఏకైక సమస్య. దిగుమతి సుంకాలను క్రమంగా ప్రభుత్వం మరింత హేతుబద్ధం చేస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమొబైల్ జోరు
ముంబై: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచిగా కోలుకుందని, వచ్చే ఆర్థిక సంవ్సరంలో సింగిల్ డిజిట్లో అధిక వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, రవాణా కార్యకలాపాలు పెరగడం వృద్ధికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. విభాగాల వారీగా చూస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6–9 శాతం మధ్య, వాణిజ్య వాహనాల అమ్మకాలు 7–10 శాతం మధ్య వృద్ధిని చూస్తాయని ఇక్రా తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6–9 శాతం మధ్య, ట్రాక్టర్ల విక్రయాలు 4–6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విభాగంలో డిమాండ్ ఆరోగ్యకరంగా ఉందని తెలిపింది. కానీ, ద్విచక్ర వాహన విభాగం ఇప్పటికీ సమస్యలను చూస్తోందని, విక్రయాలు ఇంకా కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించలేదని వివరించింది. ఇటీవల పండుగలు, వివాహ సీజన్లో విక్రయాలు పెరిగినప్పటికీ.. స్థిరమైన డిమాండ్ రికవరీ ఇంకా కనిపించలేదని తెలిపింది. ఆరంభ స్థాయి కార్ల విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ధరల పెంపు ప్రభావం.. ‘‘కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాలు, సవాళ్లను అధిగమించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకునేందుకు వాహనాల ధరలను కంపెనీలు గణనీయంగా పెంచాయి. దీంతో దిగువ స్థాయి వాహన వినియోగదారుల కొనుగోలు శక్తి తుడిచిపెట్టుకుపోయింది. 2023–24లో అన్ని రకాల వాహన విభాగాల్లో గరిష్ట స్థాయి సింగిల్ డిజిట్ (8–9 శాతం) అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నాం’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. ద్విచక్ర వాహన విభాగంలో మాత్రం వృద్ధి మోస్తరుగా ఉండొచ్చన్నారు. ‘‘2023–24 బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద గ్రామీణ ఉపాధి కోసం, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇరిగేషన్ వసతుల పెంపునకు, పంటల బీమా పథకం కోసం కేటాయింపులు పెంచొచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కు మద్దతునిస్తుంది’’ అని దేవాన్ అంచనా వేశారు. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
భారత్‌లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర రూ.1.22 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ తాజాగా ఎక్స్7 ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.1.22 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నై ప్లాంటులో ఈ కార్లను తయారు చేస్తున్నారు. 3 లీటర్ 6 సిలిండర్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పెట్రోల్ వర్షన్ 5.8 సెకన్లలో, డీజిల్ వర్షన్ 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ ప్రకటన తెలిపింది. -
సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్!
సాక్షి, బిజినెస్ డెస్క్: బిల్డ్ యువర్ డ్రీమ్స్.. మీ కలలను సాకారం చేసుకోండి. ఇదేదో ట్యాగ్‌లైన్ కాదు. ఓ చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ పేరు. సంక్షిప్త రూపం బీవైడీ. ఈ బీవైడీనే ఇప్పుడు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాను కలవరపెడుతోంది. అంతటి పెద్ద కంపెనీని కూడా డిస్కౌంట్ల బాట పట్టించింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా నిల్చింది. ఇప్పుడు భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ మరింతగా విస్తరిస్తోంది. రెండు దశాబ్దాలుగా.. ప్రాథమికంగా రీచార్జబుల్ బ్యాటరీల ఫ్యాక్టరీగా బీవైడీ కంపెనీని వాంగ్ చౌన్ఫు 1995లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్స్ పరికరాల విభాగాల్లోకి విస్తరించారు. ఆ క్రమంలోనే కార్ల తయారీ లైసెన్సు ఉన్న క్విన్చువాన్ ఆటోమొబైల్ కంపెనీని 2002లో కొనుగోలు చేసి దాన్ని 2003లో బీవైడీ ఆటో కంపెనీగా బీవైడీ మార్చింది. ప్రస్తుతం బీవైడీ కంపెనీలో బీవైడీ ఆటోమొబైల్, బీవైడీ ఎలక్ట్రానిక్ అని రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి. బీవైడీ ఆటోమొబైల్.. ప్యాసింజర్ కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ సైకిళ్లు వంటి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను (పీహెచ్ఈవీ) తయారు చేస్తోంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టేందుకు గతేడాది మార్చి నుంచి పెట్రోల్ వాహనాలను నిలిపివేసింది. 2021 ఆఖరు నాటికి పీహెచ్ఈవీ, బీఈవీ విభాగంలో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద కంపెనీగా ఎదిగింది. 2022లో దాదాపు 19 లక్షల పైగా విద్యుత్ వాహనాలు (హైబ్రిడ్ కూడా కలిపి) విక్రయించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా నిల్చింది. బఫెట్ పెట్టుబడులు.. మార్కెట్ క్యాప్‌పరంగా టెస్లా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీగా ఉండగా.. అమ్మకాలపరంగా మాత్రం బీవైడీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. టెస్లా మార్కెట్ వేల్యుయేషన్ 386 బిలియన్ డాలర్లుగా ఉండగా బీవైడీది సుమారు 100 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. లాభాలు, ఆదాయాలపరంగా టెస్లా ఇంకా గ్లోబల్ లీడర్‌గానే ఉన్నప్పటికీ బీవైడీ వేగంగా దూసుకొస్తోంది. యూరప్, ఆస్ట్రేలియా మొదలైన మార్కెట్లలోకి కూడా ఎగుమతులు మొదలుపెడుతోంది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ .. టెస్లాలో కాకుండా చైనా కంపెనీ బీవైడీలో పెట్టుబడులు పెట్టారు. ఇతర ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలతో పోలిస్తే బీవైడీకి ఓ ప్రత్యేకత ఉంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ కంట్రోల్ అనే మూడు రకాల ఎన్ఈవీలకు సంబంధించిన టెక్నాలజీల్లోనూ నైపుణ్యం ఉంది. ఇలా వినూత్న టెక్నాలజీల్లోనే కాకుండా ధరపరంగా కూడా టెస్లాకు బీవైడీ గట్టి పోటీ ఇస్తోంది. బీవైడీ కార్ల ధరలు చైనా మార్కెట్లో 30,000 డాలర్ల లోపే ఉంటుండగా, టెస్లా చౌకైన కారు మోడల్ 3 ప్రారంభ ధరే 37,800 డాలర్ల పైచిలుకు ఉంటోంది. 25,000 డాలర్ల రేంజిలో కారును కూడా తెస్తామంటూ టెస్లా ప్రకటించింది. భారత్‌లోనూ బీవైడీ జోరు.. 2030 కల్లా భారత్‌లో అమ్ముడయ్యే ప్రతి మూడు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్‌దే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో మన మార్కెట్‌పై బీవైడీకి భారీ లక్ష్యాలే ఉన్నాయి. 2030 నాటికల్లా దేశీ ఈవీ మార్కెట్లో 40 శాతం వాటాను దక్కించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. 2007లోనే బీవైడీ ఇండియా విభాగం ఏర్పాటైంది. గతేడాది భారత్‌లో అటో 3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఈ6 ఎలక్ట్రిక్ ఎంపీవీలను ప్రవేశపెట్టింది. సీల్ పేరిట మరో కారును ఈ ఏడాది ప్రవేశపెడుతోంది. ఇప్పుడు విక్రయిస్తున్న కార్ల రేట్లు రూ. 29 లక్షల నుంచి ఉంటుండగా 700 కి.మీ. వరకు రేంజి ఉండే సీల్ రేటు దాదాపు రూ. 70 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. దిగుమతి సుంకాల భారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రస్తుతం చెన్నైలోని ప్లాంటులో ఎలక్ట్రిక్ వాహనాలను సెమీ నాక్డ్–డౌన్ కిట్స్ (ఎస్కేడీ)లాగా అసెంబుల్ చేస్తోంది. రెండో దశలో డిమాండ్‌ను బట్టి పూర్తి స్థాయిలో ఇక్కడే అసెంబుల్ చేసే అవకాశాలనూ పరిశీలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 20 డీలర్లు ఉండగా ఈ ఏడాది ఆఖరు నాటికి భారత్‌లో తమ డీలర్‌షిప్‌ల సంఖ్యను 53కి పెంచుకునే యోచనలో ఉంది. గతేడాది సుమారు 700 వాహనాలు విక్రయించగా ఈ ఏడాది ఏకంగా 15,000 పైచిలుకు అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు కనెక్షన్.. తెలుగు రాష్ట్రాల కంపెనీతో కూడా బీవైడీకి అనుబంధం ఉంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌తో బీవైడీకి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. బీవైడీ సాంకేతికత సహకారంతో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. ఇక భారత్‌లో సొంత ఉత్పత్తుల విస్తరణలో భాగంగా కంపెనీ హైదరాబాద్‌తో పాటు వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లోనూ స్టోర్స్ ఏర్పాటు చేసింది. చదవండి: ShareChat Layoffs: ‘ఉద్యోగాల ఊచకోత’.. వందల మందిని తొలగిస్తున్న షేర్ చాట్! -
ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం, టెస్లా కార్ల ధరలు భారీగా తగ్గింపు!
సీఈవో ఎలాన్ మస్క్ టెస్లా కార్ల ధరల్ని భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ట్విటర్ కొనుగోలు అనంతరం మస్క్ పూర్తిగా ఆ సంస్థకే అంకితమవ్వడం, మార్కెట్లో టెస్లాకు పోటీగా కొత్త కంపెనీలు పుట్టుకొని రావడం,టెస్లా షేర్ హోల్డర్లు అపనమ్మకం వంటి ఇతర కారణాల వల్ల టెస్లా కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. ఈ తరుణంలో తిరిగి కార్ల అమ్మకాలు పుంజుకునేలా టెస్లా ధరల్ని భారీగా తగ్గించారు ఎలాన్ మస్క్. ఇందులో భాగంగా అమెరికాలో మోడల్ 3 సెడాన్, మోడల్ వై ఎస్యూవీ కార్ల ధరలు తగ్గాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. డిస్కౌంట్ ముందు కార్ల ధరలతో పోలిస్తే.. డిస్కౌంట్ తర్వాత కార్ల ధరలు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. జర్మనీలో సైతం టెస్లా మోడల్ 3, మోడల్ వై ధరలను దాదాపు 1శాతం నుంచి 17శాతం వరకు తగ్గించింది. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో సైతం ధరల్ని అదుపులోకి వచ్చాయి. ఈ నెలలో అమలులోకి వచ్చిన యూఎస్ ప్రభుత్వం ఈవీ కార్లపై అందించే సబ్సిడీతో కలిపి కొత్త టెస్లా ధర 31శాతంగా ఉంటుంది. అయితే టెస్లా సంస్థ కార్ల ధరల తగ్గింపు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ టాక్స్ క్రెడిట్‌కు అర్హత కోసమే ఈ నిర్ణయమంటూ పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి
గ్రేటర్ నోయిడా: భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో 2023 బుధవారం ప్రారంభమైంది. 2022లో జరగాల్సిన ఈ కార్యక్రమం కోవిడ్–19 కారణంగా వాయిదాపడింది. ఈసారి షోలో ఎలక్ట్రిక్ వాహనాలు హైలైట్. 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి ఎక్స్‌పోలో తళుక్కుమంటున్నాయి. వీటిలో మారుతీ 5 డోర్ జిమ్మీ, నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివల్, ఎంజీ ఎయిర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ అయానిక్–5 ఉన్నాయి. జనవరి 18 వరకు ప్రదర్శన ఉంటుంది. సుజుకీ ఈవీఎక్స్ 550 కిలోమీటర్లు వాహన తయారీ దిగ్గజం జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మధ్యస్థాయి ఎస్యూవీ ‘ఈవీఎక్స్’ తొలిసారిగా అంతర్జాతీయంగా దర్శనమిచ్చింది. 2025లో ఈ కారు మార్కెట్లో అడుగుపెట్టనుంది. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ వెల్లడించారు. మొత్తం 16 వాహనాలను మారుతీ ప్రదర్శిస్తోంది. వీటిలో వేగన్–ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్, బ్రెజ్జా ఎస్–సీఎన్జీ, గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వంటివి ఉన్నాయి. హ్యుందాయ్: అయానిక్–5 ఈవీ ప్రపంచంలో తొలిసారిగా ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్లో ధర తొలి 500 మంది కస్టమర్లకు రూ.44.95 లక్షలు. 72.6 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 217 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయానిక్–6 ఎలక్ట్రిక్ సెడాన్ సైతం కొలువుదీరింది. 53, 77 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఎంజీ: హెక్టర్, హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కొలువుదీరాయి. ఆల్ ఎలక్ట్రిక్ మిఫా 9 ఎంపీవీ తొలిసారిగా భారత్‌లో తళుక్కుమన్నది. దీనిలో 90 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. 440 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎంజీ–4 హ్యాచ్‌బ్యాక్, ఎంజీ 5 ఎలక్ట్రిక్ స్టేషన్ వేగన్ (ఎస్టేట్), ఈఎంజీ6 హైబ్రిడ్ సెడాన్ సైతం ప్రదర్శనలో ఉంది. బీవైడీ: సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించింది. 2023 చివరి త్రైమాసికంలో రానుంది. లెక్సస్: ఎల్ఎం 300హెచ్ ఎంపీవీ (టయోటా వెల్ఫైర్) భారత్‌లో అడుగుపెట్టింది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రూపుదిద్దుకుంది. 150 హెచ్‌పీ, 2.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ ఏర్పాటు ఉంది. కొత్త ఆర్ఎక్స్ ఎస్యూవీ భారత్‌లో ప్రవేశించింది. ఎల్ఎఫ్–30, ఎల్ఎఫ్–జడ్ ఈవీ కాన్సెప్ట్ మోడళ్లు ఉన్నాయి. టయోటా: ల్యాండ్ క్రూజ్ ఎల్సీ 300 ఎస్యూవీ కొత్త రూపులో చమక్కుమంటోంది. బీజడ్4ఎక్స్ భారత్‌లో అడుగుపెట్టింది. 71.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 450 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. టాటా: అందరినీ ఆశ్చర్యంలో పడేస్తూ హ్యారియర్ ఈవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 2024లో మార్కెట్లోకి రానుంది. డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ ఉంది. 2025లో రంగ ప్రవేశం చేయనున్న సియర్రా ఈవీ కాన్సెప్ట్ సైతం మెరిసింది. చదవండి: ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా -
మూడేళ్ల విరామం.. మళ్లీ కనువిందు చేయనున్న ఆటో ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఎక్స్పో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ కనువిందు చేయనుంది. జనవరి 11న ప్రారంభం కానుంది. 11–12 తేదీల్లో మీడియాకు, 13–18 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో వాస్తవానికి 2022లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా నిర్వహించలేదు. ఈసారి షోలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్, ఎంజీ మోటర్ ఇండియా తదితర సంస్థలు పాల్గోనున్నాయి. అలాగే కొత్త అంకుర సంస్థలు.. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా వీటిలో ఉండబోతున్నాయి. అయిదు అంతర్జాతీయ లాంచింగ్‌లతో పాటు 75 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఇందులో ఆవిష్కరించనున్నారు. 2020 ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి అత్యధికంగా 46 వాహన తయారీ కంపెనీలతో పాటు 80 పైగా సంస్థలు పాల్గొంటున్నట్లు ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. కొన్ని కంపెనీలు దూరం.. ఈసారి ఆటో షోలో కొన్ని సంస్థలు పాల్గొనడం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, నిస్సాన్.. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి మొదలైనవి వీటిలో ఉన్నాయి. అటు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటర్ వంటి ప్రధాన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా కేవలం ఫ్లెక్స్ ఫ్యుయల్ ప్రొటోటైప్ వాహనాలకే పరిమితం కానున్నాయి. తమలాంటి లగ్జరీ బ్రాండ్స్‌పై ఆసక్తి ఉండే కస్టమర్లు ఈ తరహా ఆటో ఎక్స్పోలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని గమనించిన నేపథ్యంలో ఈసారి షోలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నట్లు మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దానికి బదులుగా కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అటు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోల్చ్ కూడా భారత్‌లో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడంపైనే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. వేదిక చాలా దూరంగా ఉండటం, వ్యయాలు తడిసి మోపెడవుతుండటం వంటి అంశాలు ఆటో షోలో పాల్గొనడానికి ప్రతికూలాంశాలుగా ఉంటున్నాయని గతంలో పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తెలిపాయి. చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే! -
టయోటా ఇన్నోవా హైక్రాస్.. అదిరే లుక్, డెలివరీ అప్పటినుంచే!
వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్.. హైబ్రిడ్ మల్టీపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వర్షన్ ధరను వేరియంట్‌ను బట్టి రూ.18.3– 19.2 లక్షలుగా నిర్ణయించింది. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. సెల్ఫ్‌చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వర్షన్ ధర వేరియంట్‌ను బట్టి రూ.24–29 లక్షలుగా ఉంది. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 23.24 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లోనూ లభిస్తుంది. మైలేజీ లీటరుకు 16.13 కిలోమీటర్లు. బుకింగ్స్ నవంబర్ 25 నుంచే ప్రారంభం అయ్యాయి. 2005లో భారత్‌లో అడుగుపెట్టిన ఇన్నోవా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా యూనిట్లు రోడ్డెక్కాయి. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం పైమాటే. చదవండి: టెక్ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్! -
వావ్! ఎలక్ట్రిక్ వెహికల్‌గా..లూనా మళ్లీ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: చిన్న బండి లూనా గుర్తుంది కదూ. ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ మోపెడ్ కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ లూనా రూపంలో వస్తోంది. కినెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ దీనిని ప్రవేశపెట్టనుంది. చాసిస్, ఇతర విడిభాగాల తయారీ ఇప్పటికే మొదలైందని కినెటిక్ గ్రూప్ ప్రకటించింది. నెలకు 5,000 యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్రత్యేక యూనిట్ సైతం అహ్మద్‌నగర్ ప్లాంటులో ఏర్పాటైంది. లూనా అమ్మకాల ద్వారా వచ్చే 2–3 ఏళ్లలో ఏటా రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందని కినెటిక్ ఇంజనీరింగ్ ఎండీ ఆజింక్యా ఫిరోదియా తెలిపారు. -
భవిష్యత్‌లో ఆ కార్లకే డిమాండ్.. వచ్చే ఏడాది పెరగనున్న సేల్స్!
త్వరలో ఆటో మొబైల్ మార్కెట్లో ట్రెండ్‌కు తగ్గట్లు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొనుగోలు దారుల అవసరాలకు అనుగుణంగా కార్ల మోడళ్లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోట్రాఫిక్ రద్దీలో వాహనదారులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా మారుతి సుజుకీ మరిన్ని మోడళ్లలో ‘ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్)’ సిస్టంను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఏజీఎస్ సిస్టమ్ వల్ల డ్రైవర్‌గా గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కి బ్రేక్ వేయనవసరం లేదు. అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గేర్ మారుతూ ఉంటుంది. 2013-14లో సెలేరియోతో ఏజీఎస్ సిస్టమ్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి.. ఇప్పుడు ఆల్టో కే-10, వ్యాగనార్, డిజైర్, ఇగ్నిస్, బ్రెజా, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బాలెనో మోడల్ కార్లలో అమర్చింది. వచ్చే ఏడాదిలో ఈ లేటెస్ట్ టెక్నాలజీ కార్ల సేల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీవాత్సవ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రీ లెవల్ కారు మోడళ్లలో సాధారణ ట్రాన్స్మిషన్ లేదా ఏజీఎస్ వేరియంట్ కార్లలో తేడా కేవలం రూ.50 వేలు మాత్రమేనని అన్నారు. ఖర్చు తక్కువ కాబట్టే భవిష్యత్‌లో ఈ కార్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. -
బడ్జెట్ ధరలో హోండా సిటీ కారు
భారత ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ ‘హోండా సిటీ’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కస్టమర్లలో ఈ కంపెనీ కార్లకు ప్రత్యేమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది అందులోనూ ముఖ్యంగా హోండా సిటీ సెడాన్ కార్లకు. అయితే ఇటీవల ఈ కారు కాస్త ఖరీదుగా మారిందనే చెప్పాలి. అయితే హోండా లవర్స్ కోసం తక్కువ ధరలో మంచి ఇంజన్ కండీషన్‌తో హోండా సిటీ సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు, విక్రయించేందుకు ఉన్న ఆన్లైన్ ప్లాట్‌ఫాం Cars24 (కార్స్ 24) లో పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో ఉన్నసెకండ్ హ్యాండ్ హోండా సిటీ కార్ల జాబితా ఓ లుక్కేద్దాం. హోండా సిటీ S MT( Honda City S MT): 2013 హోండా సిటీ S MT మోడల్ హోండా సిటీ. దీని ధర రూ. 5,33,000. ఈ కారు ఇప్పటివరకు 45వేల కి.మీ ప్రయాణించింది. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు సీఎన్జీ పై కూడా నడుస్తుంది. నోయిడాలో ఈ కారు విక్రయానికి అందుబాటులో ఉంది. హోండా సిటీ SV MT(Honda City SV MT): 2014 హోండా సిటీ SV MT మోడల్ కారు. దీని ధర రూ.5,48,000. ఈ కారు రీడింగ్ 60,214 కి.మీ. ఇది పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. హోండా సిటీ V MT(Honda City V MT): 2015 హోండా సిటీ V MT కారు. ధర రూ.6,23,000. ఇది పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఈ కారుకు రెండవ యజమాని ఉపయోగిస్తున్నారు. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. హోండా సిటీ VX CVT (Honda City VX CVT): 2014 హోండా సిటీ వీఎక్స్ సీవీటి మోడల్ కారు. దీని ధర రూ.6,71,000. రీడింగ్ 82,622 కి.మీ. ఇది పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. -
వాహన పరిశ్రమ వృద్ధికి విఘాతం
న్యూఢిల్లీ: చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని కార్లకు ఒకే పన్ను రేటు వర్తింపచేయడం సరికాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వృద్ధికి ఇలాంటి ధోరణి మంచిది కాదని ఆయన చెప్పారు. దేశీ ఆటో పరిశ్రమలో కీలక విభాగమైన చిన్న కార్లపై అత్యధికంగా నియంత్రణ నిబంధనలపరమైన భారం ఉంటోందని భార్గవ తెలిపారు. తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితే దేశ ఆర్థిక వృద్ది రేటు కూడా అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విధానాలు పూర్తిగా అమలు కాకపోతుండటం వల్ల అలా జరగడం లేదని భార్గవ చెప్పారు. ‘పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై నియంత్రణపరమైన మార్పుల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇదే మొత్తం మార్కెట్ ధోరణులను మార్చేస్తోంది. ఇది కార్ల పరిశ్రమకు గానీ దేశానికి గానీ మంచిది కాదని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. చిన్నా, పెద్ద కార్లకు ఒకే రకమైన పన్నును విధించడం సరికాదని ఆయన తెలిపారు. దాదాపు 50 శాతం స్థాయి పన్నుల భారంతో పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. ఏ దేశంలో కూడా ఇంత పన్నులతో ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమ వృద్ధి చెందలేదని భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతంగా ఉండగా, వాహనం రకాన్ని బట్టి 1–22% వరకు సెస్సు అదనంగా ఉంటోంది. పూర్తిగా తయారైన రూపంలో (సీబీయూ) దిగుమతయ్యే కార్లపై కస్టమ్స్ సుంకం 60–100% వరకూ ఉంటోంది. ఆటో ఎక్స్‌పోలో మారుతీ ఎలక్ట్రిక్ కారు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. జనవరిలో జరిగే ఆటో ఎక్స్పో వేదికగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది. అలాగే రెండు సరికొత్త ఎస్‌యూవీలు సైతం కొలువుదీరనున్నాయి. మొత్తం 16 మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
కేంద్రం కీలక నిర్ణయం, వీటి ధరలు పెరగనున్నాయా?
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్నీ రాష్ట్రాల్లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌పై ఒకే విధమైన పన్ను విధించాలని భావిస్తోంది. ఈ కొత్త మార్గ దర్శకాలు అమల్లోకి వస్తే ఎస్యూవీ వెహికల్స్ ధరలు పెరగడంతో పాటు ఆ వెహికల్స్‌పై అధిక పన్ను కట్టాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో 15 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా.. కేవలం 8 అంశాలపై చర్చలు జరిపి అసంపూర్ణంగా ముగించారు. అయితే ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్ధిక మంత్రి, కౌన్సిల్ సభ్యులు ఎంయూవీ, ఎస్‌యూవీగా పరిగణలోకి తీసుకోవాలంటే కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు ఉండాలని సూచించారు. ఎస్యూవీ అంటే? వాటిలో ఎస్‌యూవీకి ఈ ప్రమాణాలు ఉంటేనే ఆ వెహికల్‌ను ఎస్‌యూవీగా నిర్ధారించాల్సి ఉంటుందని వెల్లడించారు. కార్ ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీకి మించి ఉండాలి.వాహనం పొడవు 4000 మిమీల కన్నా ఎక్కువ ఉండాలి.170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. ఈ ప్రమాణాలు ఉంటేనే అవి ఎస్యూవీ వెహికల్స్ అని స్పష్టం చేసింది. ఈ వాహనాలపై 28శాతం జీఎస్టీ, 22శాతం సెస్‌తో మొత్తంగా 50శాతం పన్ను విధించాలని ఆదేశించింది. కాగా, ఆర్ధిక శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇతర వాహనాలపై అసెస్మెంట్ 22శాతం చెల్లించాలనే విషయంపై సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్ అథారిటీ (ఫిట్మెంట్ కమిటీ) సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ అంటే ఏమిటి? జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్ధం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌కు అధ్యక్షత వహించేది ఎవరు? కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. -
గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్!
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వాహన మార్కెట్ గాడిన పడుతోంది. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు ఇటీవలి నెలల్లో పుంజుకోవడంతో ఆటోమొబైల్ కంపెనీల్లో భవిష్యత్ డిమాండ్ పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ సెంటిమెంట్ మెరుగుపడిన దానికి ఇది నిదర్శనం. ద్విచక్ర వాహనాలు, కార్లకు గ్రామీణ మార్కెట్ కీలకంగా ఉండడం గమనార్హం. కరోనాతో ఏర్పడిన పరిస్థితులతో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గడం తెలిసిందే. ఆ డిమాండ్ ఇంకా బలంగా పుంజుకోలేదు. ఇప్పుడు సెంటిమెంట్‌లో మార్పు కనిపిస్తుండడం ఆశావహం. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఈ విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ల పాత్ర బలంగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) తర్వాత తిరిగి గత నెలలోనే ట్రాక్టర్ల విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. ఆల్టో కారుకు డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే చిన్న కారు మారుతి ఆల్టో.. గత మూడు నెలల కాలంలో(సెప్టెంబర్–నవంబర్) రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. అమ్మకాలు 42.5 శాతం పెరిగి 61,767 యూనిట్లుగా ఉన్నాయి. ఆల్టో కే10 పేరుతో నవీకరించిన మోడల్‌ను మారుతి సుజుకీ ఇండియా ఈ ఏడాది ఆగస్ట్‌లో మార్కెట్‌కు పరిచయం చేసింది. విక్రయాల్లో దీని పాత్ర కూడా బలంగానే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విక్రయ ధోరణలను పరిశీలిస్తే డిమాండ్ మెరుగుపడుతున్నట్టు తెలుస్తోందని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ‘‘గత నెల విక్రయాలు కొంత నిదానించడాన్ని చూశాం. గ్రామీణ డిమాండ్ ఎప్పుడూ సీజనల్‌గా ఉంటుంది. వర్షాలు గత మూడు నాలుగేళ్లుగా మెరుగ్గా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. రబీ సాగు కూడా వేగంగానే ఉంది. సాగు తర్వాత వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని శ్రీవాస్తవ వివరించా రు. మారుతీ సుజుకీ వాహన విక్రయాల్లో గ్రామీణ ప్రాంత వాట గత ఆర్థిక సంవత్సరంలో 43.3 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అది 43.8 శాతానికి పుంజుకుంది. టూ వీలర్లదీ అదే దారి.. ద్విచక్ర వాహన విక్రయాల మార్కెట్ కూడా పుంజుకుంటోంది. గత త్రైమాసికంలో విక్రయాల్లో ఒక అంకె వృద్ధి నమోదు కాగా, రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్‌లో విక్రయాలు 41 శాతం పెరిగితే, నవంబర్‌లో 24 శాతం వృద్ధి ఉన్నట్టు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) డేటా తెలియజేస్తోంది.దేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో కార్ప్.. సానుకూల వినియోగ సెంటిమెంట్, ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో రానున్న త్రైమాసికంలో విక్రయాలు పెరుగుతాయన్న అంచనాలను వ్యక్తం చేసింది. సాగు బలంగా ఉండడం, వివాహాల సీజన్‌ను ఉదాహరణలుగా పేర్కొంది. ఎఫ్ఎంసీజీకి అనుకూలం.. గ్రామీణ ప్రాంతాల్లో సన్నగిల్లిన ఎఫ్ఎంసీజీ డిమాండ్.. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావంతో గత నాలుగు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం దిగొస్తుండడం, మరోవైపు బలమైన సాగు, పంటల మద్దతు ధరలతో డిమాండ్ ఇక మీదట బలపడుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వచ్చే త్రైమాసికంలో డిమాండ్ స్థిరంగా ఉంటుందని భావిస్తున్నాయి. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా!
భారత ఆటోమొబైల్ రంగం వృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా కరోనా మహ్మమారి తర్వాత కాలం నుంచి కార్ల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఖరీదైన కార్ల కొనుగోళ్లు సైతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లంబోర్ఘిని, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు మన దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మెక్లారెన్ ప్రవేశించింది. ముంబైలో ఇటీవలే తన మొదటి డీలర్ షిప్‌ను ప్రారంభించిన ఈ కంపెనీ ఆ వేడుకల్లో తన సూపర్ కార్ మెక్ లారెన్ 765 LTని ( MCLAREN 765LT SPIDER) లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కాస్ట్లీ కార్లలో మెక్లారెన్ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ భారత్‌లో మొదటి కస్టమర్‌కు ఈ కారును డెలివరీ చేసింది. అత్యంత ఖరీదైన ఈ కారును ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు. ఈ కారు ఖచ్చితమైన ధర తెలియనప్పటికీ.. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జుడ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారుచేయబడింది. ఇందులో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ కన్వర్టిబుల్ కారు పైకప్పు కేవలం 11 సెకన్లలో తెరుచుకుంటుంది. మెక్లారెన్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత వేగవంతమైన కన్వర్టిబుల్‌లలో అద్భుతమైన కార్లలో ఇదీ ఒకటి. ఈ కారుని సొంతం చేసుకున్న నసీర్ ఖాన్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయన ఎన్నో ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు ఇప్పటికే ఈయన వద్ద ఫెరారీ, లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by NASEER KHAN (@naseer_khan0054) చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్ -
ఇప్పటి వరకు ఇదే అత్యధికం..రికార్డ్ స్థాయిలో వెహికల్స్ అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్‌లో వాహన అమ్మకాలు నవంబరులో 23,80,465 యూనిట్లు నమోదయ్యాయి. 2021 నవంబర్‌తో పోలిస్తే 26 శాతం అధికం. అంతేగాక భారత వాహన పరిశ్రమలో ఈ స్థాయి విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘బీఎస్–4 నుంచి బీఎస్–6 ప్రమాణాలకు మళ్లిన నేపథ్యంలో 2020 మార్చిలో జరిగిన అత్యధిక అమ్మకాలను మినహాయించాలి. పండుగల సీజన్ ముగిసినప్పటికీ పెళ్లిళ్ల కారణంగా గత నెలలో విక్రయాల జోరు కొనసాగింది. విభాగాలవారీగా ఇలా.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ప్యాసింజర్ వెహికిల్స్ గత నెలలో 21 శాతం వృద్ధితో 3 లక్షల మార్కును దాటాయి. కార్ల లభ్యత, కొత్త మోడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ఈ వృద్ధికి కారణం. కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్‌యూవీల జోరు కొనసాగింది. టూ వీలర్లు 24 శాతం అధికమై 18,47,708 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 81 శాతం, ట్రాక్టర్లు 57 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాలు 33 శాతం దూసుకెళ్లి 79,369 యూనిట్లుగా ఉంది. మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టిసారించడం, కొత్త మైనింగ్ ప్రాజెక్టుల రాక, పాత వాహనాల స్థానంలో కొత్తవి చేరికతో కమర్షియల్ విభాగం మెరుగ్గా ఉంది. డిస్కౌంట్లు సైతం.. చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. మరోవైపు స్టాక్ క్లియర్ చేసుకోవడానికి బేసిక్ వేరియంట్లతోపాటు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. రెపో రేటు పెరగడంతో కస్టమర్లపై రుణ భారం పెరిగి ద్విచక్ర వాహనాలు, ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా లాక్డౌన్ కారణంగా సెమికండక్టర్ల సరఫరా మందగించే చాన్స్ ఉంది. ఇదే జరిగితే విక్రయాల స్పీడ్‌కు బ్రేకులు పడతాయి. తద్వారా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండదు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
హిందుజా టెక్ చేతికి డ్రైవ్ సిస్టమ్
చెన్నై: ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ డ్రైవ్ సిస్టమ్ డిజైన్‌ను కొనుగోలు చేసినట్లు హిందుజా టెక్ తాజాగా పేర్కొంది. తద్వారా అభివృద్ధి నుంచి ఉత్పత్తివరకూ ఈమొబిలిటీ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజం హిందుజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ డీల్ విలువను వెల్లడించలేదు. డ్రైవ్ సిస్టమ్ అంతర్జాతీయస్థాయిలో విశ్వాసపాత్ర ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసులందిస్తున్నట్లు తెలియజేసింది. ఎలక్ట్రిఫైడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌కు కొత్తతరహా సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. యూకే, యూఎస్, ఆసియాలలో ఆటోమోటివ్, వాణిజ్య వాహనాలు, ఆఫ్‌హైవే, వైమానిక పరిశ్రమలకు అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ సేవలందిస్తున్నట్లు పేర్కొంది. -
రూ.23 లక్షల కోట్లు అవసరం..ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మర్చేందుకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు అవసరమని ఒక నివేదిక వెల్లడించింది. నీతి అయోగ్ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ శ్వేత పత్రం ప్రకారం..చివరి గమ్యస్థానం కోసం, అలాగే పట్టణాల్లో డెలివరీకి ఉపయోగించే వాహనాలే దేశంలో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల స్వీకరణను ముందుండి నడిపిస్తున్నాయి. పూర్తిగా ఎలక్ట్రిక్‌కి మారబోయే మొదటి విభాగాలుగా వీటిని చెప్పవచ్చు. ముందస్తు కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉండడం, కొత్త సాంకేతికతపై విశ్వాసం లేకపోవడం, హామీ లేని విశ్వసనీయత, పునఃవిక్రయం విలువ స్థిరీకరించకపోవడం కారణంగా ఎలక్ట్రిక్‌కు మారడానికి డ్రైవర్–కమ్–ఓనర్లు వెనుకాడుతున్నారు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం వెహికిల్స్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 80 శాతం ఉంది. కొన్నేళ్లుగా ఈవీల వాడకం పెరుగుతోంది. నిర్వహణ ఖర్చు తక్కువ.. భారత్‌లో ధ్రువీకరణ పొందిన 45 కంపెనీలు ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల తయారీలో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను విక్రయించాయి. 25 కోట్ల మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల వాటా అతిస్వల్పమే. భారత్‌లో పెరుగుతున్న ఆదాయాలు, వాహన యాజమాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సంఖ్య మొత్తం 27 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. వీటిలో 26.4 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.80,000 చొప్పున, అలాగే 60 లక్షల యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.2.8 లక్షలుగా లెక్కించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నప్పటికీ.. వాటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. యాజమాన్య ఖర్చుతో అంచనా వేసినప్పుడు రోజువారీ అధికంగా వినియోగించే రైడ్–హెయిలింగ్, లాస్ట్–మైల్ డెలివరీ ఫ్లీట్స్‌కు ఈవీలు ఇప్పటికే అనువైనవని పరిశ్రమ గుర్తించిందని నివేదిక వివరించింది. -
ఈ కార్లకు జనాల్లో ఫుల్ క్రేజ్..కానీ ఇప్పుడు షెడ్డుకు చేరిన వేల కార్లు!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 9,125 కార్లను రీకాల్ చేస్తోంది. మార్కెట్లో విపరీతంగా అమ్ముడు పోతున్న సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా కార్లలో ముందు వరుస సీట్ల బెల్ట్లలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి 2022 నవంబర్ 2–28 తేదీల్లో తయారైనవని కంపెనీ తెలిపింది. షోల్డర్ హైట్ అడ్జెస్టర్ ఉప భాగాలలో ఒకదానిలో లోపం ఉందని అనుమానిస్తున్నామని, ఇది అరుదైన సందర్భంలో సీట్ బెల్ట్ విడదీయడానికి దారితీయవచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది. వాహనాలను తనిఖీ చేసి, లోపం ఉన్న భాగాన్ని భర్తీ చేయడం కోసం ఉచితంగా రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. అధీకృత వర్క్‌షాప్‌ల నుండి సంబంధిత కార్ల యజమానులకు సమాచారం వెళుతుందని తెలిపింది. -
రోబోటిక్ వీల్‌చైర్..శరీరాన్ని వంచితే చాలు..దానంతట అదే వెళ్తుంది!
నడవలేని స్థితి ఎదురైనప్పుడు ఎవరైనా వీల్‌చైర్‌ను ఆశ్రయించక తప్పదు. వీల్‌చైర్‌లో కూర్చుంటే, వెనుక నుంచి ఎవరో ఒకరు ముందుకు నెడితే తప్ప కదలడం సాధ్యం కాదు. వీల్చైర్ల తయారీలోనూ ఇటీవల అధునాతన మార్పులు వస్తున్నాయి. తాజాగా, జపాన్‌కు చెందిన బహుళజాతి వాహనాల తయారీ సంస్థ ‘హోండా’ ఈ రోబోటిక్ వీల్‌చైర్‌ను రూపొందించింది. మోటార్‌తో రూపొందించిన కొన్ని వీల్చైర్లను చేతులతో కోరుకున్న దిశకు నడపాల్సి ఉంటుంది. హోండా తయారుచేసిన ఈ వీల్‌చైర్ మాత్రం చేతులకు శ్రమపెట్టదు. ఇది పూర్తిగా రోబోటిక్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో కూర్చున్న వ్యక్తి ఎటువైపుగా వెళ్లాలనుకుంటే, అటువైపుగా కాస్త శరీరాన్ని వంచితే చాలు. ఇది దానంతట అదే ఆ దిశగా ముందుకు సాగుతుంది. దీనిని స్టార్ట్ చేయాలన్నా, స్థిరంగా నిలపాలన్నా కావలసిన బటన్లు చేతికి అందుబాటులో ఉంటాయి. ‘యూని–వన్’ పేరిట రూపొందించిన ఈ రోబోటిక్ వీల్‌చైర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ
న్యూఢిల్లీ: వినియోగదారులకు సేవలు అందించే విషయంలో ఎంజీ ఇండియా వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచినట్టు జేడీ పవర్ తెలిపింది. ఇండియా కస్టమర్ సర్వీసెస్ ఇండెక్స్ అధ్యయనాన్ని నీల్సన్ ఐక్యూ భాగస్వామ్యంతో జేడీ పవర్ నిర్వహించింది. సర్వీస్ అభ్యర్థనల ధ్రువీకరణ, సర్వీస్‌కు ముందు, సర్వీస్‌కు తర్వాత కస్టమర్ల అభిప్రాయం, ఎప్పటికప్పుడు సర్వీస్‌కు సంబంధించి తాజా సమాచారం అందించే విషయంలో ఎంజీ ఇండియా సేవల పట్ల ఎక్కువ మంది కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంజీ ఇండియా 25 ఇండెక్స్ పాయింట్లు (మొత్తం 1,000 పాయింట్ల స్కేల్‌పై) పెంచుకుంది. సర్వీసు నాణ్యత బాగుందని 80 శాతం మంది కస్టమర్లు చెప్పారు. ఇండెక్స్‌లో ఎంజీ ఇండియా అత్యధికంగా 860 స్కోర్ సంపాదించింది. హోండా 852, టయోటా 852 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేయొచ్చు! -
దేశంలో తొలి మోడల్.. ఫోర్స్ మోటార్స్ అర్బేనియా వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్స్ మోటార్స్ తయారీ అర్బేనియా కొద్ది రోజుల్లో రోడ్డెక్కనుంది. యాత్రలు, కార్యాలయ సిబ్బంది ప్రయాణానికి ఇది ఉపయుక్తం. మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌నుబట్టి డ్రైవర్‌తోసహా 18 మంది కూర్చునే వీలుంది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది. 115 హెచ్‌పీ, 350 ఎన్ఎం పీక్ టార్క్‌తో మెర్సిడెస్ ఎఫ్ఎం 2.6 సీఆర్ ఈడీ టీసీఐసీ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. ఈ సెగ్మెంట్లో దేశంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, రోల్ఓవర్ ప్రొటెక్షన్‌తో తయారైన తొలి మోడల్ ఇదే. మోనోకాక్ స్ట్రక్చర్, హిల్ హోల్డ్ అసిస్ట్, కొలాప్సిబుల్ స్టీరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీల్డ్ పనోరమిక్ విండోస్, 17.8 సెంటీమీటర్ల ఎల్సీడీ టచ్‌స్క్రీన్ వంటి హంగులు ఉన్నాయి. 15 రోజుల్లో డీలర్‌షిప్‌లకు అర్బేనియా వాహనాలు చేరనున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. రూ.1,000 కోట్లతో అర్బేనియా వాహనాల అభివృద్ధి, తయారీ ప్రాజెక్టును ఫోర్స్ మోటార్స్ చేపట్టింది. -
ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!
ఇటీవల ప్రజలు కారు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వాటి సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అయితే హ్యుందాయ్ కంపెనీలోని ఓ మోడల్ కారుని ప్రజలు ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. గతంలో ఈ కారుకి ఫుల్ డిమాండ్. మధ్యతరగతి ప్రజలు ఈ కార్లే కావాలని కొనేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క కారు కూడా కొనలేదు హ్యుందాయ్ కంపెనీలోని శాంత్రో (Santro) మోడల్ కారు మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే పలు కారణాల వల్ల సంస్థ ఈ కారు ఉత్పత్తిని మే 2022లో కంపెనీ నిలిపివేసినప్పటికీ, దాని మూసివేత ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఈ కారు స్టాక్‌ను క్లియర్ చేయాలనుకోవడం దీనికి కారణం. వాస్తవానికి, ఇప్పటికీ కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ కారు జాబితా ఉంచి ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయినా స్టాక్ క్లియర్ చేయలేకపోతోంది. మరోవైపు ఈ కారు సేల్స్ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. అలా ఏకంగా గత అక్టోబర్ నెలలో దీన్ని అమ్మకాలు జీరోగా ఉంది. ఇది కంపెనీకి భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఫ్యామిలీ కారుగా గుర్తింపు సాధించింది శాంత్రో ప్రస్తుతం దాని సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా నిరాశపరిచింది. ఏడాది కిందట చూస్తే.. శాంట్రో అమ్మకాలు 2877 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2018లో శాంత్రో కారును రీలాంచ్ చేసి దీని ప్రారంభ ధర రూ. 3.9 లక్షలుగా నిర్ణయించింది. అయితే నాలుగేళ్ల కాలంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.7 లక్షలకు చేరింది. ఇక ధర పెరగడంలో కొనే వారు కరువైనట్లు తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్! -
ఎస్‌యూవీల జోరు.. లాభాల్లో మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44% జంప్‌చేసి రూ. 2,773 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ.1,929 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు ఎగసింది. ఆటోమోటివ్ విభాగం టర్నోవర్ రూ.8,245 కోట్ల నుంచి రూ.15,231 కోట్లకు దూసుకెళ్లగా.. వ్యవసాయ పరికరాల బిజినెస్ రూ. 6,723 కోట్ల నుంచి రూ.7,506 కోట్లకు బలపడింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.2,974 కోట్లకు చేరింది. ఎస్‌యూవీల జోరు: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎం అండ్ ఎం స్టాండెలోన్ నికర లాభం 46% జంప్‌చేసి రూ. 2,090 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 57% వృద్ధితో రూ. 20,839 కోట్లకు చేరింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 75% దూసుకెళ్లి 1,74,098 యూనిట్లను తాకగా, ట్రాక్టర్ల అమ్మకాలు 5% బలపడి 92,590కు చేరాయి. ఎక్స్‌యూవీ 700, స్కార్పియో–ఎన్ వాహనాలకు భారీ డిమాండ్ వలకల వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు కంపెనీ ఈడీ రాజేష్ జెజూరికర్ చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఎస్యూవీ తయారీ సామ ర్థ్యాన్ని నెలకు 39,000 యూనిట్లకు, తదుపరి వచ్చే ఏడాది చివరికల్లా 49,000 యూనిట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 2.6 లక్షల యూనిట్లకు బుకింగ్స్ ఉన్నట్లు తెలియజేశారు. 2027కల్లా ఎస్‌యూవీల అమ్మకాలలో 20–30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఆక్రమించవచ్చని అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు 0.8% నీరసించి రూ. 1,287 వద్ద ముగిసింది. -
ఆటోమొబైల్ కంపెనీలపై సర్వే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ప్రతి రంగంలోనూ కంపెనీలు పాటించాల్సిన రూల్స్, చట్టాలు బోలెడు ఉంటాయి. సంస్థలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, కార్యక్రమాలు జరపాలన్నా వీటిని తప్పక పాటించాలి. అయితే ప్రస్తుత దేశీ ఆటోమొబైల్ కంపెనీల్లో ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఆయా కంపెనీల మేనేజ్మెంట్లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ అంశం టీమ్‌లీజ్ రెగ్‌టెక్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్ కంపెనీలపై రెగ్‌టెక్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు. చదవండి: ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
71 వేల కియా కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా తన సంస్థకు చెందిన 71వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కేంద్రంగా కియా కార్లలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కార్లలో లోపాల్ని పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా 2008 -2009కి చెందిన 71వేల స్పోర్టేజ్ కార్లను రీకాల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ఉన్న యాంటీ లాక్ బ్రేక్ సిస్టం (ఏబీఎస్)లోని హైడ్రాలిక్ కంట్రోల్ యూనిట్‌లోని లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కార్లలోని లోపాల్ని సరి చేసేందుకు సిద్ధమైనట్లు కియా వెల్లడించింది. 2017 నుంచి కియా 2017 నుంచి తన 8 స్పోర్టేజ్ స్పోర్ట్ యుటిలిటి వెహికల్స్ (ఎస్యూవీ)లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం, 15 రకాల మెల్టింగ్, డ్యామేజ్లాంటి ప్రమాదాలు గుర్తించింది. 2016 నుంచి ఆ వెహికల్స్‌లోని లోపాల్ని సరిచేయడం ప్రారంభించింది. దూరంగా పార్కింగ్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) తో కియా దాఖలు చేసిన ప్రకారం , రీకాల్ పూర్తయ్యే వరకు యజమానులు నిర్మాణాలు లేదా ఇతర వాహనాలకు వెలుపల, దూరంగా పార్క్ చేయాలని కియా,ఎన్హెచ్టీఎస్ఏ సమావేశంలో ఈ సమస్యల పరిష్కార మార్గంగా చర్చించాయి. -
మీ కారు, బైక్ ఏ కంపెనీవి..దొంగలు టార్గెట్ చేస్తున్న వాహనాల జాబితా ఇదే!
వాహన కొనుగోలు దారులకు అలెర్ట్. ఇప్పటికే కింద పేర్కొన్న కార్లు కొనుగోలు చేసినా, లేదంటే కొనుగోలు చేయాలని అనుకున్నా తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే? దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సెలక్ట్ చేసుకొని మరి దొంగతనం చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా బ్రాండెడ్ కార్లపై వాళ్ల మనసు పడిందా అంతే సంగతులు. ఇన్సూరెన్స్ కంపెనీ ఎకో (acko) నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 56 శాతం కంటే ఎక్కువ వాహనాలు ఢిల్లీ- ఎన్సీఆర్లలో చోరీకి గురైనట్లు తేలింది. ఈ ప్రాంతం దేశంలో కార్ల యజమానులకు హాని కలిగించే ప్రాంతంగా మారినట్లు నివేదిక పేర్కొంది. ఎకో వెహికల్ థెఫ్ట్ రిపోర్ట్ ప్రకారం, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కార్లు జాబితాలో స్థానం సంపాదించగా.. హీరో స్ల్పెండర్ బైక్‌లను దొంగలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అత్యధికంగా దొంగిలించబడిన టాప్ - 5 కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ / మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ శాంత్రో హోండా సిటీ హ్యుందాయ్ ఐ10 అత్యధికంగా దొంగతనానికి గురైన టాప్ -5 టూ వీలర్లు హీరో స్ప్లెండర్ హోండా యాక్టివా బజాజ్ పల్సర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 టీవీఎస్ అపాచీ దేశంలో సురక్షితమైన ప్రాంతాలు భారతదేశంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే నగరాల గురించి ఈ ఎకో నివేదిక హైలెట్ చేసింది. దేశంలో వాహన దొంగతనాల విషయానికి వస్తే, వాహన దొంగతనాల కేసుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ తర్వాత బెంగళూరు 9 శాతం, చెన్నై 5 శాతం ఉన్నాయి. కాగా, దేశంలోనే అతి తక్కువ వాహనాల దొంగతనాలు జరుగుతున్న నగరాలుగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతా నిలిచాయి. అత్యంత ఇష్టపడే కారు రంగు కారు రంగు విషయానికి వస్తే తెల్లటి కార్లు ఎక్కువగా దొంగతనానికి గురవుతాయి. తెల్ల కార్లను దొంగతనం చేయడానికి కారణం..ట్రాఫిక్‌లో గుర్తించ లేకపోవడం, తెల్లటి కార్ల రంగును మార్చడం చాలా సులభం. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 లాంచ్ చేసిన నిమిషాల్లోనే రికార్డు బుకింగ్స్ సొంతం చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తోంది. ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్ల క్రేజ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. అందుకే అధిక కస్టమర్లు మహీంద్రా వాహనాల వైపే మొగ్గు చూపుతుంటారు. నేపథ్యంలో స్కార్పియో, XUV700 వంటి కొన్ని మోడళ్లపై 24 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడింది. అయినా వీటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదట. కాగా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో N దాని ప్రీమియం, ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. SUVలోని Z8, Z6 వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంతలా అంటే కస్టమర్లు ఈ వాహనం కావాలంటే 24 నెలల వరకు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు Z8L దాదాపు 20 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్లు మార్కెట్లో తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి. మహీంద్రా XUV700 మహీంద్రా XUV700కి కూడా మార్కెట్లో డిమాండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతోంది. ఈ SUV మీద ప్రస్తుతం కస్టమర్లు ఎంచుకునే వేరియంట్‌పై ఆధారపడి 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్లతో పోల్చినప్పుడు డీజిల్ మోడల్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్! -
దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు!
అక్టోబర్ నెల రావడంతో పండగ కల వచ్చేస్తోంది. ప్రారంభంలో దసరాతో వచ్చి పోతూ పోతూ దీపావళితో ధూం ధాం చేసి వెళ్తుంది. పండుగా వస్తే చాలు.. ప్రజలు సాధారణ రోజుల కంటే ఈ రోజుల్లోనే కాస్త ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లకు హాయ్ చెబుతుంటాయి. ఈ దీపావళి సందర్భంగా మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. పండుగ సీజన్లో పలు కంపెనీలు తమ కార్లపై భారీగా తగ్గింపులు, బెనిఫిట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai Motor India) తాజాగా మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ అందిండంతో పాటు ఏకంగా రూ. లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. హ్యుందాయ్ కోనా(Hyundai Kona Electric) హ్యుందాయ్ కోనా కారు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఇటీవలే రెండు కొత్త కలర్స్‌ని కూడా లాంచ్ చేసింది. కోనా ఎలక్ట్రిక్ ధర రూ. 23.84 లక్షల నుంచి 24.03 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్(Hyundai Grand i10 Nios) కంపెనీ శాంట్రో నిలిపివేయడంతో, ప్రస్తుతం హ్యుందాయ్ ఎంట్రీ-లెవల్ మోడల్‌గా గ్రాండ్ i10 నియోస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.43 లక్షల నుంచి 8.45 లక్షల వరకు ఉంది. దీనిపై దాదాపు రూ. 48 వేల తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 (hyundai i20) హ్యుందాయ్ ఐ20 (hyundai i20) కారుపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉన్నాయి. ఈ ఆఫర్లు i20 Magna, Sportz వేరియంట్లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఐ20 ధర రూ.7.07 లక్షల నుంచి రూ.11.62 లక్షల మధ్య ఉంది. ఉంటుంది. ఇక ఈ మోడల్‌పై కార్పొరేట్ డిస్కౌంట్లు లేవని తెలిపింది. హ్యుందాయ్ ఆరా(Hyundai Aura) హ్యుందాయ్ ఆరా మోడల్‌పై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ కారుపై రూ. 33 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేలు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వంటివి కూడా కలిసి ఉన్నాయి. ఇతర వేరియంట్లు రూ. 18,000 వరకు గరిష్టంగా ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఆరా ప్రారంభ ధర రూ. 6.09 లక్షల నుంచి గరిష్టంగా 8.87 లక్షలు ఉంది. గమనిక:పైన పేర్కొన్న ఆఫర్లు. నగరం లేదా రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు, మరిన్ని వివరాల కోసం మీ సమీప డీలర్‌షిప్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇవి పండుగ ఆఫర్లు కాబట్టి అక్టోబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి: బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్! -
కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు..తగ్గే ప్రసక్తే లేదు
కార్ల విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పని సరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. Considering the global supply chain constraints being faced by the auto industry and its impact on the macroeconomic scenario, it has been decided to implement the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 01st October 2023. — Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022 ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎయిర్ బ్యాగుల అంశంపై స్పందించారు. ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్ సప్లయి చైన్ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్ (స్థూల ఆర్థిక) పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 వేరియంట్) కార్ల ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్1, 2023 వరకు ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని నితిన్ గడ్కరీ ట్వీట్లో పేర్కొన్నారు. కార్ల ధరలు పెరుగుతాయ్ కేంద్రం ఈ ఏడాది అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలనే నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని కార్ల తయారీ సంస్థలు వ్యతిరేకించాయి. ఎయిర్ బ్యాగుల్ని పెంచితే.. కార్ల ధరలు పెరుగుతాయని తద్వారా ఆ భారం తయారీ సంస్థలపై, కార్ల కొనుగోలు దారులపై పడుతుందని స్పష్టం చేశాయి. నిబంధనల సవరింపు ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలన్న నిబంధనల్ని సవరించింది. కేవలం 8 సీట్లున్న (ఎం -1 వేరియంట్ కార్లు) కార్లలో మాత్రమే ఎయిర్ బ్యాగులు ఉండాలని తెలిపింది. -
సుజుకీ గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నుంచి మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ గ్రాండ్ విటారా భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.10.45 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య ఉంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. ఆరు వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ మోడల్స్‌లో లభిస్తుంది. మైలేజీ వేరియంట్‌నుబట్టి లీటరుకు 21.1 కిలోమీటర్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 27.97 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హ్యారియర్‌కు ఇది పోటీ ఇవ్వనుంది. 57 వేల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు. మారుతీ సుజుకీ, టయోటా సంయుక్తంగా ఈ కారును అభివృద్ధి చేశాయి. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలో నెలకు రూ.27 వేల చందాతో గ్రాండ్ విటారా సొంతం చేసుకోవచ్చు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
పర్యావరణ అనుకూల పరిష్కారాలు కావాలి
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, దేశ స్వావలంబనకు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహన ఆవిష్కరణలపై ఆటోమొబైల్ పరిశ్రమ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) 62వ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. దీన్ని సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకవ చదవి వినిపించారు. ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించాల్సిన అమృత కాల అవకాశం మన ముందుందని పేర్కొంటూ, అందుకు ఆటోమొబైల్ రంగం కూడా అతీతం కాదన్నారు. ఉపాధి కల్పన, దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆటోమొబైల్ రంగానికి భవిష్యత్తు బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేసే విషయంలో పరిశ్రమ నిపుణులు, తయారీదారులు, విధానకర్తలు వార్షిక సదస్సులో భాగంగా చర్చలు నిర్వహించాలని సూచించారు. వాహన తయారీలో నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించడంలో పరిశ్రమ పాత్రను మెచ్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ పరిశ్రమ సాధించిన ఈ విజయాలు దేశ ఆర్థిక పునరుజ్జీవానికి తోడ్పడినట్టు చెప్పారు. తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. మానవాభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ వృద్ధికి నాణ్యమైన, సౌకర్యమైన రవాణా కీలకమన్నారు. నాణ్యత ముఖ్యం.. ధర కాదు: గడ్కరీ వాహన తయారీ సంస్థలు నాణ్యతకే ప్రాముఖ్యం ఇవ్వాలి కానీ, ధరకు కాదని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఎందుకంటే వాహనదారుల ప్రాధాన్యతలు మారుతున్నట్టు చెప్పారు. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించడం.. రహదారులు, వాహన భద్రతపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో మంత్రి సూచన గమనార్హం. ప్రపంచంలో టాప్–2లో భారత్: సియామ్ వాహన తయారీలోని ప్రతి విభాగంలోనూ భారత్‌ను ప్రపంచంలోని రెండు అగ్రగామి దేశాల్లో ఒకటిగా వచ్చే 25 ఏళ్లలో చేర్చడమే తమ లక్ష్యమని సియామ్ ప్రకటించింది. సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా వినోద్ అగర్వాల్ ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) నూతన ప్రెసిడెంట్‌గా 2022–23 సంవత్సరానికి వినోద్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కెనిచి అయుకవ ఈ బాధ్యతలు నిర్వహించారు. వినోద్ అగర్వాల్ వోల్వో ఐచర్ కమర్షియల్ వెహికల్స్‌కు ఎండీ, సీఈవోగా పనిచేస్తున్నారు. సియామ్ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర ఎన్నికయ్యారు. దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ సీఈవో, ఎండీ సత్యకమ్ ఆర్యను ట్రెజరర్‌గా సియామ్ ఎన్నుకుంది. -
అత్యంత సంతృప్తి చెందిన డీలర్ల జాబితా విడుదల..అగ్రస్థానంలో కియా ఇండియా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార సాధ్యాసాధ్యాలు, న్యాయమైన వ్యాపార విధానం విషయంలో వాహన తయారీదారుల నుండి డీలర్లు అధిక పారదర్శకతను ఆశిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. కంపెనీల విధాన రూపకల్పనలో డీలర్లనూ భాగస్వాములను చేయాలని ఫెడరేషన్ ప్రధానంగా ఆశిస్తోంది. ద్విచక్ర వాహనాల విషయంలో మిగిలిపోయిన సరుకు, అమ్మకాలపై మార్జిన్స్ పట్ల డీలర్లు ఆందోళనగా ఉన్నారు. వ్యాపారంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నందున తయారీ సంస్థలు దీనిపై దృష్టిసారించాలని పరిశ్రమ కోరుతోంది. ఉత్పత్తి విశ్వసనీయత, కస్టమర్లకు అందించే మోడళ్లతో డీలర్లు సంతోషంగా ఉన్నారు. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో విడిభాగాల డెలివరీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు, డెలివరీ, విక్రయానంతర సేవల్లో తయారీ కంపెనీల శ్రమను స్వాగతిస్తున్నట్టు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. కియా ఇండియా అగ్రస్థానం.. డీలర్ల సంతృప్తిపై 2022 అధ్యయనాన్ని ఫెడరేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం అత్యంత సంతృప్తి చెందిన డీలర్ల జాబితాలో కార్ల విభాగంలో కియా ఇండియా అగ్రస్థానంలో ఉంది. హ్యుండై మోటార్ ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా వరుసగా ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. వాహన తయారీ దగ్గజం మారుతీ సుజుకీ ఎనమిదవ స్థానంలో నిలిచింది. టూ వీలర్స్ విభాగంలో హోండా మోటార్‌సైకిల్, స్కూటర్, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ వరుసగా మూడు స్థానాలను చేజిక్కించుకున్నాయి. వాణిజ్య వాహన విభాగంలో వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ తొలి స్థానంలో ఉంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి. -
రయ్‌మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 18,77,072 యూనిట్లు నమోదయ్యాయి. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల. సెమికండక్టర్ల లభ్యత మెరుగవడం, పండుగల సీజన్ కోసం డీలర్లు సిద్ధమవడం కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధ్యపడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు 21 శాతం దూసుకెళ్లి 2,81,210 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 16 శాతం ఎగసి 15,57,429 యూనిట్లకు చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్స్ 23 శాతం పెరిగి 10,16,794 యూనిట్లు, స్కూటర్స్ 10 శాతం అధికమై 5,04,146 యూనిట్లకు ఎగశాయి. త్రిచక్ర వాహనాలు 63 శాతం దూసుకెళ్లి 38,369 యూనిట్లకు పెరిగాయి. రుతుపవనాలు మెరుగ్గా ఉండడం, రాబోయే పండుగల సీజన్‌తో వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. పరిశ్రమకు సీఎన్జీ ధర సవాల్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. -
లిథియం అయాన్ నుంచి బయటకు రావాలి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ వాడకం విషయంలో భారత్ ఆరంభంలోనే బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. ఈ కమోడిటీపై మన దేశానికి ఎటువంటి నియంత్రణ లేదంటూ ఈ సూచన చేశారు. భవిష్యత్తులో గ్రీన్ రవాణా కోసం హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ కీలకమని, దీనికి ఎంతో భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలోని కంపెనీలు ఏక కాలంలో కొత్త టెక్నాలజీలపైనా పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో ‘ఈవీ ఇండియా 2022’ సదస్సు జరిగింది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. లిథియం అయాన్ బ్యాటరీలపై ఆధారపడడాన్ని తగ్గించడం ఎలా అన్న దానిపై దేశీయంగా ఎంతో పరిశోధన కొనసాగుతున్నట్టు చెప్పారు. సోడియం అయాన్, జింక్ అయాన్ టెక్నాలజీలపై పరిశోధనలు నడుస్తున్నాయని వివరించారు. లిథియం అయాన్‌ను మన దేశం ఉత్పత్తి చేయడం లేదంటూ.. దీనిపై మనకు ఎటువంటి నియంత్రణ లేని విషయాన్ని సింగ్ గుర్తు చేశారు. దీన్ని పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న ఈవీలన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీతో తయారైనవే కావడం గమనార్హం. ‘‘గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనం జపాన్ స్థాయిలోనే ఉన్నాం. సోలార్ ఇంధనం ధర మన దగ్గర చాలా తక్కువ. కనుక గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనకు ఎంతో అనుకూలత ఉంది’’అని సింగ్ పేర్కొన్నారు. -
వాణిజ్య వాహన విక్రయాలు : 4.35 లక్షలు
ముంబై: దేశీయంగా వాణిజ్య వాహనాల (సీవీ) పరిశ్రమ రికవరీ బాట పట్టిందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ (వీఈసీవీ) ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. బస్సుల సెగ్మెంట్ కోలుకోవడం, రిప్లేస్మెంట్కు డిమాండ్ పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 4.35 లక్షల స్థాయి దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2018–19లో రికార్డు స్థాయిలో 5.77 లక్షల పైచిలుకు అమ్ముడైన సీవీలు వివిధ కారణల రీత్యా 2020–21లో 2.34 లక్షలకు పడిపోయాయి. 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 3.34 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య వాహనాల అమ్మకాలు 47 శాతం పెరిగి 3.43 లక్షలకు చేరాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, గత నాలుగు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణమాలను బట్టి చూస్తే సీవీల అమ్మకాలు తిరిగి 2019–20 నాటి స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అగర్వాల్ వివరించారు. వచ్చే మూడేళ్లు పరిశ్రమకు మెరుగ్గా ఉండనున్నట్లు పేర్కొన్నారు. స్వీడన్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. చదవండి👉 ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారులకు శుభవార్త! -
ఆర్డర్లున్నాయి.. కానీ చిప్స్ కొరత
న్యూఢిల్లీ: సెమికండక్టర్ల కొరత వాహన పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వెల్లువలా ఆర్డర్లు ఉన్నప్పటికీ వాహనాలను తయారు చేయలేని పరిస్థితి ఉంది. ప్యాసింజర్ వెహికిల్స్ ఒక్కటే 6.5 లక్షల యూనిట్లకు ఆర్డర్లు ఉన్నాయి. చిప్ సరఫరా మెరుగుపడితేనే ఇవి రోడ్డెక్కేది. దీంతో తాము బుక్ చేసుకున్న కారు కోసం నెలల తరబడి కస్టమర్లు వేచిచూడక తప్పడం లేదు. ఒక్క మారుతి సుజుకీ 3.4 లక్షల యూనిట్లకుపైగా పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. హ్యుండై, మహీంద్రా కలిపి దాదాపు 3 లక్షల యూనిట్లు ఉంటుంది. ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మొత్తం పెండింగ్ ఆర్డర్లు సుమారు 6.5 లక్షల యూనిట్లు ఉంటుందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మోడల్, వేరియంట్‌నుబట్టి వెయిటింగ్ పీరియడ్ 4–12 వారాలు ఉందని టాటా మోటార్స్ ప్రతినిధి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇది 6 నెలల వరకు ఉందన్నారు. చిప్ సరఫరా సరిగా లేక ఏడాదిగా డెలివరీలు తీవ్ర ఆలస్యం అవుతున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రతినిధి వివరించారు. వేచి ఉండే కాలం మోడల్‌నుబట్టి 2–9 నెలలు ఉందన్నారు. చదవండి: Elss Scheme: అదీ సంగతి.. ఈ స్కీమ్‌లో ఏ విభాగమైనా, పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు! -
మెర్సిడెజ్ బెంజ్: విధుల నుంచి రోబోట్ల తొలగింపు, ఉద్యోగుల నియామకం!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల తయారీలో రోబోట్ల కంటే మనుషులే మేలని నమ్ముతుంది. అందుకే ప్రస్తుతం కార్ల మ్యానిఫ్యాక్చరింగ్లో ఉన్న రోబోట్లను తొలగించింది. వాటి స్థానంలో మనుషుల్ని నియమించనుంది. జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్, ఎలక్ట్రిక్ అవతార్ మెర్సిడెస్ ఈక్యూఎస్, మేబాక్, ఏఎంజీ వెహికల్స్ తయారు చేసిన ఫ్యాక్టరీ 56లో, అలాగే ఓల్డ్ ఫ్యాక్టరీ 46లో గతంలో ఉన్న 25-30శాతం రోబోట్లలో 10 కంటే తక్కువకు తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగా, లగ్జరీ కార్ల తయారీదారు ఇప్పుడు కంబస్టివ్-ఇంజిన్, అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను అదే స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎందుకంటే రోబోట్లు కార్ల తయారీని ఒక్కో పని మాత్రమే చేస్తాయి. అదే మనుషులైతే ఒకే సారి పలు మోడళ్లను తయారు చేసే సామర్ధ్యం ఉందని నమ్ముతుంది. ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్ సైట్ మేనేజర్ మైఖేల్ బాయర్ మాట్లాడుతూ..రోబోట్లను మనుషులు భర్తీ చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ సామర్ధ్యం పెంచుతుందని బౌయర్ వివరించాడు. వినియోగదారుల డిమాండ్ పెరిగే కొద్ది కార్ల తయారీలో ఉపయోగించే టెక్నాలజీల్లో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణమని అన్నారు. -
టార్గెట్ 10 కోట్ల అమ్మకాలు..ఈవీ రంగంలోకి మరో దిగ్గజ సంస్థ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో అంతర్జాతీయంగా నాయకత్వ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుంది. పరిమాణం పరంగా సంప్రదాయ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో ఇప్పటికే అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో ఉంది. పండుగల సీజన్ నాటికి భారత ఈవీ విపణిలో కంపెనీ రంగ ప్రవేశం చేయనుంది. విదా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సంస్థ ప్రవేశపెట్టనుంది. ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ పెట్టుబడులు చేసింది. కాగా, 2021–22లో సంస్థ రూ.29,802 కోట్ల టర్నోవర్ సాధించింది. 1984 నుంచి 2011 మధ్య 10 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి భారీ మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. 2030 నాటికి మరో 10 కోట్లు.. ‘ఈ ఏడాది హీరో మోటోకార్ప్ పర్యావరణ అనుకూల వాహన విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా తన నాయకత్వాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ రంగానిదిగా మారుస్తుంది. తదుపరి దశాబ్దానికై సిద్ధంగా ఉన్నాం’.2030 నాటికి మరో 10 కోట్లు వాహనాల్ని అమ్మేదిగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో సంస్థ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ స్పష్టం చేశారు. -
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో జోరుగా కొలువులు!
చెన్నై: ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇది గత రెండేళ్లలో సగటున 108 శాతం మేర పెరిగింది. సీఐఈఎల్ హ్యూమన్ రిసోర్సెస్ సర్వీసెస్ అధ్యయన నివేదికలో ఈ అంశం వెల్లడైంది. ఈవీ రంగంలో అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల కల్పన ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో ఆపరేషన్, సేల్స్, క్వాలిటీ అష్యురెన్స్, బిజినెస్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాలు ఉన్నాయి. సీఐఈఎల్ నిర్వహించిన ‘ఈవీ రంగంలో తాజా నియామకాల ధోరణులు – 2022‘ అధ్యయనంలో 52 కంపెనీలకు చెందిన 15,200 మంది ఉద్యోగు లు పాల్గొన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంపై భారత్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ప్రయత్నంలో నిలదొక్కుకుంటే 2030 నాటికి దేశీయంగా ఈవీ విభాగం పరిమాణం 206 బిలియన్ డాలర్లకు చేరుతుంది‘ అని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. వృద్ధి ఇదే స్థాయిలో ఉంటే ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు కూడా భారీగానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు .. ♦ఎలక్ట్రిక్ వాహనాల విభాగం నియామకాల్లో 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ (12 శాతం), పుణె (9 శాతం), కోయంబత్తూర్ (6 శాతం), చెన్నై (3 శాతం) ఉన్నాయి. ♦ గడిచిన ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు 2,236 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ♦కంపెనీల్లోని అన్ని విభాగాల్లోనూ మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది. కైనెటిక్ గ్రీన్, మహీంద్రా ఎలక్ట్రిక్, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్, ఓబీఈఎన్ ఎలక్ట్రిక్, యాంపియర్ వెహికల్స్ సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్ స్థానాల్లో కూడా మహిళలు ఉన్నారు. తమిళనాడులోని రాణిపేట్‌లో ఉన్న ఓలా ఈ–స్కూటర్ ఫ్యాక్టరీని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. -
సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న..నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్‌ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్‌వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్‌లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్‌లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్‌లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది. కార్లపై డిస్కౌంట్ ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది. -
పండుగల సీజన్లో ఎస్‌యూవీల సందడే సందడి!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ బహుళ ప్రయోజాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీలు) పెద్ద ఎత్తున ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలవనుంది. సుమారు డజను ఎస్యూవీ మోడళ్లను కంపెనీలు విడుదల చేయనున్నాయి. వీటి ధరలు రూ.5.5 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉండనున్నాయి. మిగతా సంవత్సరాలకు ఈ ఏడాది భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే కంపెనీలు సాధారణంగా ఏడాదిలో వివిధ సందర్భాల్లో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తుంటాయి. కానీ, ఈ విడత రానున్న పండుగల సీజన్‌ను ఆవిష్కరణలకు లక్ష్యంగా పెట్టుకోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2020–21లో ఎనిమిది కొత్త కార్లు విడుదల కాగా.. వీటి ఆవిష్కరణలు ఏడాది వ్యాప్తంగా కొనసాగాయి. 2021–22లో ఏడు కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లోనూ కొత్త కార్ల ఆవిష్కరణలు ఐదు లేదా ఆరు స్థాయిలో ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మాత్రం పదికి పైగా కొత్త ఎస్‌యూవీలు వినియోగదారులను పలకరించనున్నాయి. దేవీ నవరాత్రులతో పండుగల సందడి తారా స్థాయికి చేరి, దీపావళితో ముగుస్తుంటుంది. ఆటో కంపెనీలకు ఈ పీరియడ్ చాలా కీలకమైనది. ఏడాదిలో నమోదయ్యే విక్రయాల్లో 20% ఈ 3 నెలల కాలంలోనే నమోదవుతుంటాయి. కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడం అసాధారమేమీ కాదు. కానీ, ఈ ఏడాది పండుగల సీజన్ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ఎస్‌యూవీలు (ఒకే తరహా బాడీతో కూడినవి) ఆవిష్కరణ చేస్తుండడమే ప్రత్యేకం. ముందుగా మారుతీ.. మొదటిగా మారుతీ సుజుకీ నుంచి కొత్త జెనరేషన్ బ్రెజ్జా ఆవిష్కరణ ఉండనుంది.గత సోమవారం మారుతి సుజుకీ ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడంతోపాటు, బుకింగ్‌లు తీసుకోవడాన్ని ప్రారంభించింది. జూన్ 30న విడుదల కానుంది. మిడ్‌సైజు ఎస్యూవీ అయిన టయోటా హైరైడర్ జూలై 1న మార్కెట్లోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు పోటీనివ్వనుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ (బ్రెజాకు రీబ్రాండింగ్)ను కూడా ఆవిష్కరించనుంది. -
సంచలనం..అదిరిపోయే డిజైన్లతో ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉందో మీరే చూడండి!
ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఆటోమొబైల్ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఓలా సంస్థ త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 10లక్షల ఎలక్ట్రిక్ హచ్ బ్యాక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవ్వగా..ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఓలా అధినేత భవిష్ అగర్వాల్ రైడ్ షేరింగ్ రంగం నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంపై కన్నేశారు. ఇప్పటికే టూవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసిన భవిష్..భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా త్రీ వేరియంట్ కార్ల ఫస్ట్ టీజర్లను ఇటీవల నిర్వహించిన కస్టమర్ డే ఈవెంట్లో రివిల్ చేశారు. ఆ టీజర్ ఫోటోలు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా..ఆగస్ట్ 15న ఓలా ఆ కార్లకు సంబంధించి పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి ఉండగా.. ఆ కార్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం..ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓలా కార్లు ఎస్యూవీ, హచ్‌బ్యాక్, సెడాన్ ఇలా మూడు వేరియంట్ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కూపీ మోడల్, లో సంగ్ల్ స్టాన్స్,మజిలర్ బాడీ, స్టీప్ రూఫ్‌లైన్ స్పెసిఫికేషన్లు ఉండగా..ఒక కారు మాత్రం అప్ రేర్ ఎండ్, యూ షేప్డ్ ఆకారంలో టెయిల్ ల్యాప్ డిజైన్లు ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ హచ్ బ్యాక్‌లో స్టబీ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విడుదలైన ఈ టీజర్లో ఓలా ఎలక్ట్రిక్ కారు స్పోర్టీ డిజైన్, షార్ప్ ఎడ్జ్‌లు,రెండు షేడ్లతో మూడు కార్లు దర్శనమిస్తున్నాయి. ఈ డిజైన్లతో పాటు..సెడాన్ వేరియంట్లలో ఓలా అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీపై వర్క్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
ఆనంద్ మహీంద్రా s/o హరీష్..ఆయన విలువలే ఆస్తి!
ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ సమకాలిన అంశాలపై రెస్పాండ్ అవుతుంటారు. సందర్భానుసారం స్పందించే ఆనంద్ మహీంద్రా.. కొన్నిసార్లు తన వ్యక్తిగత విషయాల్ని నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇటీవల తన భార్య కోసం ఎస్యూవీ 700బుక్ చేసిన కారు కోసం ఎదురు చూస్తున్నానని సరదాగా సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా..ఈసారి స్పూర్తిగొలిపేలా తన తండ్రి గురించి ట్వీట్ చేశారు. My father Harish was the 1st Indian Graduate of the @FletcherSchool in Boston 75 years ago. In the 75th year of Indian Independence, I was honoured to be the 1st Indian to address the School’s Class Day & receive the Dean’s Medal. I felt I received it as a proxy for my father 🙏🏽 pic.twitter.com/2iAObvGwig — anand mahindra (@anandmahindra) May 24, 2022 ఆనంద్ మహీంద్రా తండ్రి హరీష్ 75ఏళ్ల క్రితం అమెరికాలో బోస్టన్‌కు చెందిన ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా'లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఫ్లెచర్ స్కూల్ యాజమాన్యం నిర్వహించిన క్లాస్ డే వేడకులకు ఆయన కుమారుడు ఆనంద్ మహీంద్రాను స్కూల్ గెస్ట్‌గా ఆహ్వానించింది. ఆ స్కూల్ డీన్ తండ్రికి బదులు ఆనంద్ మహీంద్రాను మెడల్‌తో సత్కరించింది. ఈ సత్కారంపై తన తండ్రి చదివిన స్కూల్ మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. చదవండి👉నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా -
ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్..కొనేవారు కరువయ్యారు..! కానీ..!
ముంబై: ఆటోమొబైల్ పరిశ్రమపై కోవిడ్–19 ప్రభావాలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ పరిణామాలతో సామాన్యుల ఆదాయాల సెంటిమెంటు గణనీయంగా దెబ్బతింది. దీంతో ఎంట్రీ స్థాయి కార్లు కొనుక్కోవాలనుకునే వారు లేదా అప్‌గ్రేడ్ అవ్వాలనుకునేవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సంపన్న వర్గాల ఆదాయాలకేమీ ఢోకా లేకపోవడంతో ప్రీమియం కార్ల (రూ. 10 లక్షలు పైబడినవి) అమ్మకాలు మాత్రం గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు నివేదిక పేర్కొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో అధిక రేటు ఉండే (రూ. 70,000 పైగా) టూ–వీలర్ల వాటా 40 శాతం స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. దేశీయంగా సాధారణంగా తొలిసారి కొనుగోలు చేసేవారు, లేదా సెకండ్ హ్యాండ్ వాహనాల నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్న వారు ఎంట్రీ స్థాయి కార్లపై దృష్టి పెడుతుంటారు. సరఫరాపరమైన సమస్యలు వాహనాల తయారీ సంస్థలన్నింటిపైనా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఎంట్రీ లెవెల్ కన్నా ఎక్కువ రేటు ఉండే మోడల్స్‌పై కొనుగోలుదారుల ఆసక్తి కొనసాగుతోందని క్రిసిల్ నివేదిక వివరించింది. ప్రీమియం.. అయిదు రెట్లు అధికం.. గత ఆర్థిక సంవత్సరం చౌక ధరల కార్లతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్ వాహనాలు అయిదు రెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎంట్రీ కార్ల విభాగం 7 శాతం పెరగ్గా ప్రీమియం విభాగం విక్రయాలు 38 శాతం వృద్ధి నమోదు చేశాయి. దీంతో ప్రీమియం కార్ల మార్కెట్ వాటా 500 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 30 శాతానికి చేరింది. సంపన్నుల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావాలు లేకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ వివరించింది. అలాగే అధిక రేటు ఉండే టూ–వీలర్లవైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటం, మరిన్ని మోడల్స్ అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వీటి వాటా 40 శాతం స్థాయిలో కొన్నాళ్లు కొనసాగవచ్చని పేర్కొంది. రేటు ఎక్కువ .. చాయిస్ తక్కువ.. కఠిన భద్రతా ప్రమాణాలు (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సర్లు మొదలైనవి) అమలు చేయాల్సి రావడం వల్ల గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో చౌక కార్ల రేట్లు 15–20 శాతం మేర పెరిగాయి. ఎంట్రీ లెవెల్ కార్ల ధరలు గణనీయంగా పెరగడం, మోడల్స్ లభ్యత తక్కువగా ఉండటం (కొన్ని సంస్థలు ఈ విభాగం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి) వంటి అంశాలు ఒక మోస్తరు ఆదాయాలుండే కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం .. పెద్ద, మధ్య స్థాయి కంపెనీల్లో ఉద్యోగులపై వెచ్చించే వ్యయాలు, చిన్న స్థాయి సంస్థల్లో కన్నా ఎక్కువగా పెరిగాయి. తదనుగుణంగానే అధికాదాయం ఆర్జించే పెద్ద సంస్థల ఉద్యోగులు ఎక్కువ వెచ్చించి ప్రీమియం కార్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా చిన్న స్థాయి సంస్థల్లోనే ఉంటుంది. ఇలాంటి సంస్థల్లో ఉద్యోగులపై వ్యయాలు పెద్దగా పెరగని నేపథ్యంలో ఆదాయాల సెంటిమెంటు ఆశావహంగా లేకపోవడం వల్ల వారు కొనుగోలు నిర్ణయాలు వాయిదా వేసుకుంటున్నట్లు క్రిసిల్ తెలిపింది. ఆదాయాల సెంటిమెంట్‌ను మదింపు చేసేందుకు ఈ విధానాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు వివరించింది. ప్రీమియంలో సెకండ్ హ్యాండ్ అయినా ఓకే.. రేట్లు పెరిగిపోయిన కొత్త ఎంట్రీ లెవెల్ కారుకు బదులు అదే ధరకు వస్తున్న ఖరీదైన సెకండ్ హ్యాండ్ కారునయినా కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని క్రిసిల్ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మారుతీ ఆల్టో, స్విఫ్ట్, డిజైర్ వంటివి, హ్యుందాయ్ ఐ10, ఐ20 మొదలైన ప్రాథమిక స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 56 శాతం పైగా నమోదైంది. కానీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇది క్రమంగా తగ్గుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా కార్ల విభాగంలో 54 పైచిలుకు మోడల్స్ ఉండగా ప్రస్తుతం 39 స్థాయికి పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి తక్కువ ధర కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్స్ ఆవిష్కరణ కూడా పెద్దగా లేదు. ఖరీదైన కార్ల విభాగంలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ ఎర్టిగా, హోండా సిటీ మొదలైన వాటి వాటా 2019లో దాదాపు 68 శాతం ఉండేది. వాటి విక్రయాలు తర్వాత కాస్త తగ్గినా కొత్త అప్‌గ్రేడ్స్ ఆ ఖాళీని భర్తీ చేస్తున్నాయి. కియా సెల్టోస్, మారుతి ఎక్స్ఎల్6, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్ అల్కజర్ మొదలైన మోడల్స్ అమ్మకాలు గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఇక గడిచిన 5–6 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 70,000 పైగా ధర ఉన్న టూ–వీలర్ల విక్రయాలు నిలకడగా అధిక స్థాయిలో నమోదవుతున్నట్లు క్రిసిల్ తెలిపింది. కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతుండటంతో దానికి అనుగుణంగా తయారీ సంస్థలు కూడా అధిక రేట్ల వాహనాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో తక్కువ రేట్ల విభాగంలో 29 మోడల్స్ ఉండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయని తెలిపింది. దానికి విరుద్ధంగా అధిక ధర సెగ్మెంట్లో మోడల్స్ సంఖ్య 71 నుంచి 93కి పెరిగినట్లు వివరించింది. చదవండి👉 పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు భారీ షాక్! -
ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే షేపులు ఇలా మారిపోయాయేంటీ?
ఆటోమొబైల్ మార్కెట్లో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుస ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలు కొనుగోలు దారుల్ని ఆందోళన గురిచేస్తుండగా.. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ వెహికల్ ముందు టైర్ పూర్తిగా ఊడిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల పూణేలోని లోహెగావ్ ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైంది. ఆ తర్వాత మరో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ ఒకినావా ఈ- బైక్‌కు మంటలు అంటుకున్నాయి. Another one...Its spreading like a wild #Fire . After #Ola & #okinawa #electric scooter from #PureEV catches fire in Chennai. Thats the 4th incident in 4 days.. The heat is on.#ElectricVehicles #OLAFIRE #lithiumhttps://t.co/pFJFb7uKD7 pic.twitter.com/jJqWA48CNf — Sumant Banerji (@sumantbanerji) March 29, 2022 ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇప్పుడు మరోసారి ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేకులు ఫెయిలై షేపులు మారిపోయాయి. దీంతో డ్యామేజైన బైక్ ముందు టైరు ఫోటోలో చూపించినట్లుగా ముందుకు వచ్చేసింది. ఆ బైక్ నడుపుతున్న బాధితుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కేంద్రం ఏం చేస్తుంది ఇప్పటికే వరుస ప్రమాదాలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలంటేనే కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే వాహనదారుల్లో ఉన్న భయాల్ని పోగొట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్స్ అమ్మకాల్ని ప్రోత్సహిస్తూ ప్రమాదం జరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది. చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే?! -
ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ బీభత్సం..మరీ ఈ రేంజ్‌లోనా!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. 2020–21లో ఈవీల అమ్మకాలు 1,34,821 యూనిట్లుగా ఉండగా 2021–22లో 4,29,217 యూనిట్లకు ఎగిశాయి. 2019–20లో అమ్మకాలు 1,68,300 యూనిట్లు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. 41,046 యూనిట్ల నుంచి 2,31,338 యూనిట్లకు ఎగిశాయి. 65,303 వాహనాలతో 28.23 శాతం మార్కెట్ వాటాతో హీరో ఎలక్ట్రిక్ అగ్రస్థానంలో నిల్చింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 4,984 యూనిట్ల నుంచి 17,802 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటర్స్ 15,198 వాహనాల విక్రయాలు, 85.37 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఎఫ్ఏడీఏ లెక్కల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల అమ్మకాలు 88,391 నుంచి రెట్టింపై 1,77,874 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విక్రయాలు 400 యూనిట్ల నుంచి 2,203 యూనిట్లకు పెరిగాయి. 1,605 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఉండగా.. 1,397 ఆఫీసుల నుంచి ఎఫ్ఏడీఏ ఈ డేటా సేకరించింది. చదవండి: 11ఏళ్ల కష్టానికి ఫలితం, దేశీ స్టార్టప్‌కు యూరప్ నుంచి భారీ డీల్! -
బాదుడే.. బాదుడు..మరింత పెరగనున్న కార్ల ధరలు!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల ధరలు ఎగుస్తున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను ఈ నెలలో పెంచనున్నట్లు దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. అయితే, ఎంత మేర పెంచేదీ మాత్రం వెల్లడించలేదు. ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో గత ఏడాది కాలంగా వాహనాల తయారీ వ్యయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఎంఎస్ఐ వివరించింది. దీనితో కొంత భారాన్ని రేట్ల పెంపు రూపంలో కొనుగోలుదారులకు బదలాయించక తప్పడం లేదని పేర్కొంది. ఉక్కు, అల్యుమినియం వంటి కమోడిటీలతో పాటు సరకు రవాణా చార్జీలు మొదలైనవన్నీ పెరిగిపోవడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఏప్రిల్ నుండి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకీ గతేడాది జనవరి నుండి ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో 8.8 శాతం మేర తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. ఆల్టో మొదలుకుని ఎస్–క్రాస్ వరకూ వివిధ మోడల్స్‌ను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.25 లక్షల నుండి రూ. 12.77 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంది. -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! 50 లక్షల కార్లు మాయం..! అక్కడ భారీ సంఖ్యలో..
కరోనా రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ సెక్టార్ పూర్తిగా దెబ్బతింది. ఎన్నడూ లేనంతగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇక గ్లోబల్ చిప్ కొరత అన్ని రంగాలపై ప్రభావం చూపింది. రెండేళ్ల తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో... తాజాగా రష్యా-ఉక్రెయిన్ వార్ ఆటోమొబైల్ సెక్టార్ పాలింట శాపంగా మారనుంది. ఈ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షలకు పైగా వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. రెండేళ్లలో..తగ్గిపోనున్న ఉత్పత్తి..! ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్చను ప్రారంభించినప్పటీ నుంచి అనేక దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే క్రూడాయిల్, వంట నూనె ధరలు అమాంతం ఎగిశాయి. ఈ యుద్ధం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంపై భారీ ప్రభావాన్ని చూపనుంది. రష్యా -ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా రాబోయే రెండేళ్లలో 50 లక్షల కంటే తక్కువ కార్ల ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 2022 గాను కార్ల ఉత్పత్తి 81.6 మిలియన్ యూనిట్లకు, 2023లో 88.5 మిలియన్ యూనిట్లకు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. యూరప్‌లో ఎక్కువ ప్రభావం..! కార్ల ఉత్పత్తి విషయంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే యూరప్‌పై భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాదిగాను యూరప్‌లో సుమారు 1.7 మిలియన్ల కార్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని S&P గ్లోబల్ మొబిలిటీ అంచనా వేసింది. ఇందులో కేవలం 10 లక్షలకు పైగా రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో జరిపే అమ్మకాలు. ఇక సెమీకండక్టర్ సరఫరా సమస్యలు, ఉక్రెయిన్ మూలాధారమైన వైరింగ్ హార్నెస్‌ల కారణంగా కార్ల ఉత్పత్తి మరింత జఠిలంగా మారనుంది. ఉత్తర అమెరికాలో తేలికపాటి వాహనాల ఉత్పత్తి 2022లో 480,000 యూనిట్లు, 2023లో 549,000 యూనిట్లు తగ్గుతుందని అంచనా వేయబడింది. ఎలక్ట్రిక్ కార్లకు అడ్డంకిగా..! రష్యా-ఉక్రెయిన్ యుద్దంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్‌తో సహా, పలు ఖనిజాలు ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. కాగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక వాహన తయారీలో వాడే పల్లాడియంకు భారీ కొరత ఏర్పడనుంది. రష్యా సుమారు 40 శాతం మేర పల్లాడియం ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. చదవండి: అమెరికన్ కంపెనీకి మరో గట్టి కౌంటర్ ఇచ్చిన రష్యా..! అదే జరిగితే భారీ నష్టమే..! -
KIA: తగ్గేదేలే ! జెడీ పవర్ స్టడీలో అరుదైన ఫీట్!
ఇండియన్ మార్కెట్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది కియా. కియా నుంచి వచ్చే కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. అయితే అమ్మకాల్లోనే కాదు మన్నికలోనూ తగ్గేదేలే అంటోంది. తాజాగా జేడీ పవర్ స్టడీలో అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి రెగ్యులర్‌గా అనేక సర్వేలు జరుగుతుంటాయి. వీటిలో చాలా సర్వేలు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉంటాయి. వీటికి కొంత భిన్నంగా మూడేళ్లకు పైగా వాహనాలు వాడిన యజమానుల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించడం జేడీ పవర్ సర్వే ప్రత్యేకత. రిపేర్లు, కాంపోనెంట్స్ రిప్లేస్మెంట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, వెహికల్ అప్పీల్ తదితర అంశాలపై యజమానుల నుంచి వివరాలు సేకరిస్తుంది. తాజాగా చేపట్టిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా మెయిన్‌స్ట్రీమ్, లగ్జరీ విభాగంలో 31 కంపెనీల కార్లకు పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టారు. ఈ సర్వేలో కియాకు చెందిన అప్పర్ మిడ్‌రేంజ్ ఎస్యూవీ సొరెంటో నంబర్ వన్‌గా నిలిచింది. ఈ కారుని జార్జియాలోని కియా ప్లాంటులో తయారు చేస్తున్నారు. జేడీ పవర్ సర్వేలో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న కియా సొరెంటే ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేదు. త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న ఈ కారు ధర రూ. 25 లక్షల దగ్గర ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. చదవండి: Kia India-AP: కియా అనంత ప్లాంట్ కొత్త రికార్డ్ -
కార్లలో వరల్డ్ నంబర్ 1...జస్ట్ వన్ ఇయర్లో కోటి అమ్మకాలు..!
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ తీశాయి. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. కాగా 2021లో జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మాత్రం రికార్డు స్థాయిలో అమ్మకాలను జరిపింది. కోటికి పైగా..! జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కో శుక్రవారం తన వాహన విక్రయాలు 2021లో గణనీయంగా 10.1 శాతం పెరిగాయని ఒక ప్రకటనలో పేర్కొంది. వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి టయోటా రికార్డులు క్రియేట్ చేసింది. సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ AG కంటే మరింత ముందుందని టయోటా తెలిపింది. అనుబంధ సంస్థలైన డైహట్సు మోటార్స్ , హినో మోటార్స్‌తో సహా 2021లో 10.5 మిలియన్(కోటీకిపైగా) వాహనాల అమ్మకాలు జరిపినట్లు టయోటా వెల్లడించింది. ఫోక్స్ వ్యాగన్ అంతంతే..! 2020తో పోల్చితే గత ఏడాదిలో ఫోక్స్ వ్యాగన్ అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. 2020 కంటే 5 శాతం తక్కువ అమ్మకాలను 2021లో నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ కేవలం 8.9 మిలియన్ల కార్ల అమ్మకాలను జరిపింది. గత 10 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. అమెరికన్ కంపెనీలకు భారీ షాక్..! 90 సంవత్సరాల తరువాత అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 2021గాను యుఎస్ ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యధికంగా కార్లను విక్రయించిన కిరీటాన్ని టయోటా మోటార్స్ సొంతం చేసుకుంది. స్థానిక ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ షాకిస్తూ టయోటా మోటార్స్ గత ఏడాది అమెరికాలో అత్యధిక కార్లను సేల్ చేసింది. 2021లో సుమారు 2.332 మిలియన్ వాహనాలను టయోటా విక్రయించింది. ఇక జనరల్ మోటార్స్ గత ఏడాదిలో 2.218 మిలియన్ యూనిట్ల అమ్మకాలను జరిపింది. చదవండి: Toyota: 90 ఏళ్ల తరువాత సంచలనం సృష్టించిన టయోటా మోటార్స్..! చదవండి: నానో కారు కంటే చిన్న కారును లాంచ్ చేసిన టయోటా..! ధర ఎంతంటే..? -
2021లో భారతీయులు తెగ వెతికిన కారు బ్రాండ్ ఇదే..! ప్రపంచంలో టాప్ బ్రాండ్ అదే..!
2021 ముగిసింది. గత ఏడాది ఆటోమొబైల్ కంపెనీలకు కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా వ్యాపారాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చిప్స్ కొరత ఆయా ఆటోమొబైల్ కంపెనీలను కుదేలయ్యేలా చేసింది. చిప్స్ కొరతతో ఉత్పత్తి తగ్గిపోయి అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది. భారత్‌లో కూడా ఆయా కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఇదిలా ఉంటే వాహనదారులు 2021లో ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో తెగ వెతికిన ఆటోమొబైల్ బ్రాండ్స్ వివరాలను గూగుల్ ప్రకటించింది. భారత్‌లో అదే టాప్..! 2021గాను భారత్‌లో తెగ వెతికిన కార్ బ్రాండ్‌గా దక్షిణకొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ నిలిచింది. హ్యుందాయ్ భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా నిలిచింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం...దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన బ్రాండ్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. వరల్డ్ టాప్ టయోటా..! ప్రపంచవ్యాప్తంగా అత్యంత శోధించిన బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 154 దేశాలలో 47 సెర్చ్ వాల్యూమ్‌లో టయోటా అగ్రస్థానంలో ఉంది. 2021లో 31 శాతం మేర వాహనదారులు వెతకగా...2020లో 34.8 శాతం మంది వెతికారు. 2020తో పోల్చితే సెర్చింగ్ రేట్ తగ్గిన 2021గాను టయోటా టాప్ సెర్చ్డ్ బ్రాండ్‌గా నిలిచింది. ఇక అమెరికాలో 90 ఏళ్ల తరువాత అత్యధిక అమ్ముడైన బ్రాండ్‌గా టయోటాకు దక్కింది. బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బ్రాండ్స్-2021లో గ్లోబల్ గూగుల్ సెర్చ్‌లలో ఆధిపత్యం కొనసాగిస్తూ వరుసగా రెండో ఏడాది తమ మొదటి మూడు స్థానాలను నిలుపుకున్నాయి. 2021లో, హాంకాంగ్, ఇజ్రాయెల్, మకావు, సింగపూర్, చైనాలలో అత్యధికంగా శోధించబడిన కార్ బ్రాండ్ టెస్లా నిలిచింది. చదవండి: ఎలక్ట్రిక్ కారు అవతారంలో పాత టాటా కారు.. రేంజ్ @500 కిమీ! -
అటు అమ్మకాల్లో దుమ్ము లేపుతుంటే..ఇటు ఈసురో మంటున్నాయి
అసలే ఇప్పుడు కరోనా కాలం..ఏ రంగం చూసినా ఈసురో మంటోంది. కానీ ఆటోమొబైల్ రంగం మాత్రం జోరును కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. 2020లో ఈవీ వెహికిల్స్ (టూ వీలర్స్) అమ్మకాలు 1,00,736 యూనిట్లు ఉండగా.. 2021లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) విక్రయాలు దేశీయంగా 2,33,971 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో దేశీయ ప్యాసింజర్ వాహన రిటైల్ విక్రయాలు గతేడాది డిసెంబర్లో నెమ్మదించాయి. ఆటో పరిశ్రమపై సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగడం ఇందుకు కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది(2021) డిసెంబర్లో 2,44,639 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోయినట్లు ఫాడా తెలిపింది. అంతకుముందు (2020) ఇదే డిసెంబర్లో అమ్ముడైన 2,74,605 యూనిట్లతో పోలిస్తే ఇవి 11 శాతమని తక్కువ. మొత్తంగా వాహనాల రిటైల్ విక్రయాలు గత నెల 16.05 శాతం తగ్గి 15,58,756 యూనిట్లుగా నమోదయ్యాయి.దేశంలో 1,590 వాహన రిజిస్ట్రేషన్ కేంద్రాలుండగా, 1,379 కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను ఫాడా విడుదల చేసింది. ‘‘ఆటో కంపెనీలు ఏడాది నిల్వలను తగ్గించుకునేందుకు డిసెంబర్లో వాహనాలపై భారీ రాయితీలను ప్రకటిస్తుంటాయి. కావున ప్రతి ఏటా డిసెంబర్లో విక్రయాలు భారీగా ఉంటాయి. అయితే ఈసారి అమ్మకాలు నిరాశపరిచాయి’’ అని ఫాడా చైర్మన్ వింకేశ్ గులాటి తెలిపారు. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతోఆటో కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తిని సాధించడంలో విఫలయ్యాయని పేర్కొన్నారు. అయితే, గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందని పేర్కొన్నారు. దీంతో డీలర్లకు సరఫరా పెరిగిందన్నారు. ద్విచక్ర వాహన విక్రయాలు అంతంతే... సమీక్షించిన నెలలో ద్వి చక్ర వాహన విక్రయాలు 20 మేర క్షీణించాయి. డిసెంబరు 2020లో 14,33,334 యూనిట్లు విక్రయించగా.. ఈసారి అవి 11,48,732 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాహనాల ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు, తాజాగా ఒమిక్రాన్ భయాలు వంటి కారణాలు విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. వాణిజ్య వాహన అమ్మకాలు జూమ్ వాణిజ్య వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. గతేడాది(2021) డిసెంబర్లో 58,847 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది డిసెంబర్లో అమ్ముడైన 51,749 యూనిట్లతో పోలిస్తే ఇవి 14శాతం అధికం. కేంద్రం మౌలిక వసతి కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, సరుకు రవాణా ఛార్జీలు పెరగడం, కొత్త ఏడాదిలో కంపెనీలు వాహన ధరల్ని పెంచడం, లో బేస్ తదితర కారణాలతో ఈ విభాగంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. -
సోనీ సంచలన ప్రకటన.. ఇక ఈవీ కార్లు కూడా!
జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. అదీ ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొంది. ఇంతకాలం ఎంటర్టైన్మెంట్ రంగంతో అలరించిన సోనీ కంపెనీ.. ఇప్పుడు ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అమెరికా లాస్‌వెగాస్‌లో బుధవారం నుంచి(జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు) సీఈఎస్ టెక్నాలజీ ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సోనీ గ్రూప్ చైర్మన్-ప్రెసిడెంట్ కెనిచిరో యోషిదా స్వయంగా ఈవీ ఎంట్రీ ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఓ కొత్త కంపెనీతో ముందుకు రానున్నట్లు.. ఆ కంపెనీ పేరును ‘సోనీ మొబిలిటీ ఇన్కార్పోరేషన్’గా ప్రకటించారు. అంతేకాదు Vision-S 02 పేరుతో ఎస్‌యూవీల ప్రొటోటైప్‌ను సైతం ప్రదర్శించారు. ఈ కంపెనీని ఆలస్యం చేయకుండా ఈ ఏడాదిలోనే లాంఛ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈవీ వెహికిల్స్ ప్రకటన తర్వాత సోనీ షేర్ల ధరలు 4 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే సోనీ ఇదివరకే తర్వాతి తరం వాహనాల తయారీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఆడియో, వినోదాత్మక వ్యవస్థలను అందిస్తోంది కూడా. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఈవీ మార్కెట్ ప్రకటనలు చేయగా.. Sony ఏకంగా నమునా మోడల్స్‌ను ప్రదర్శించడంతో పాటు ఆలస్యం చేయకుండా Sony Ev కంపెనీ పనులు మొదలుపెడుతుండడం విశేషం. చదవండి: కొత్త రకం టెస్ట్‌డ్రైవ్.. మన దేశంలోనే! -
ఆటో అమ్మకాలపై చిప్ ఎఫెక్ట్
ముంబై: దేశీయ ఆటో తయారీ కంపెనీల డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. గతేడాది చివరి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే డిసెంబర్లో ద్విచక్ర వాహన కంపెనీలైన హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. ఆర్థిక రికవరీతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ విభాగానికి చెందిన వోల్వో ఐషర్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ► మారుతీ గతేడాది డిసెంబర్లో దేశీయంగా 1,23,016 వాహనాలను అమ్మింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో (2020) లో విక్రయించిన 1,40,754 యూనిట్లతో పోలిస్తే 13 % తక్కువ గా ఉంది. 2021లో 12.14 లక్షల యూనిట్లను విక్రయించింది. ► ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ 50% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ సంస్థ 23,545 కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను అమ్మింది. దేశీయ ఆటో పరిశ్రమపై డిసెంబర్నూ సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగింది. ప్రతికూలతల కంటే సానుకూలతలు ఎక్కువగా ఉండటంతో కొత్త ఏడాది అమ్మకాలపై ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నాము. అయితే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, సెమికండెక్టర్ల కొరత సమస్యలు పరిశ్రమకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. శశాంక్ శ్రీవాస్తవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
2021లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవంటే..?
మరికొద్ది రోజల్లో 2021కు ఎండ్ కార్డు పడనుంది. కొత్త ఏడాది 2022 రాబోతుంది. ఈ ఏడాదిలో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల వ్యాపారం కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా మారింది. సప్లై చైయిన్ రంగంలో అవాంతరాలు, చిప్స్ కొరత వంటివి ఆయా కంపెనీలకు ఉత్పత్తికి అడ్డుగా మారాయి. ముడి సరకుల ధరలు పెరగడంతో కంపెనీలు మార్జిన్లను దృష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీలు వాహనాల ధరలను పెంచాయి. ఇదిలా ఉండగా 2021గాను భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల కంపెనీల్లో మారుతి సుజుకీ మొదటిస్ధానంలో నిలిచింది. ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు అత్యధికంగా విక్రయించిన కార్ల లిస్ట్‌ను ప్రముఖ ఆటోమొబైల్ వెబ్సైట్ కార్దేఖో వెల్లడించింది. 2021లో ఆయా కంపెనీల్లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..! 1. మారుతి సుజుకీ- వ్యాగనర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ నేమ్. దేశీయంగా అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసే కంపెనీ ఇది. ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మారుతి సుజుకికి చెందిన వ్యాగనార్.. అగ్రస్థానంలో నిలిచింది. సుమారు 1.64 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. 2. హ్యుందాయ్- క్రెటా మారుతి సుజుకీ తరువాత భారత్‌లో హ్యుందాయ్ కార్లకు భారీ ఆదరణ ఉంది. హ్యుందాయ్‌లో క్రెటా కార్లు అత్యధికంగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు 1,17,828 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. వచ్చే ఏడాది క్రెటాకు చెందిన అప్డేట్డ్ వెర్షన్‌ను హ్యుందాయ్ తీసుకురానున్నట్లు సమాచారం. 3. టాటా-నెక్సాన్ టాటా మోటార్స్‌లో నెక్సాన్ కార్లు భారీగా అమ్ముడైనాయి. పెట్రోల్, డిజీల్, ఎలక్ట్రిక్ వేరియంట్స్ నెక్సాన్‌లో అందుబాటులో ఉన్నాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 95,678 4. కియా-సెల్టోస్ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లో భారీ ఆదరణను పొందింది. కియా మోటార్స్‌లో సెల్టోస్ ఎస్యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడైనాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 94,175 5. మహీంద్రా-బొలెరో మహీంద్రా కంపెనీ న్యూ జనరేషన్ ఎస్‌యూవీలో ఈ ఏడాది ముందుకొచ్చింది. కాగా మహీంద్రాలో టాప్ సెల్లింగ్ కారుగా బొలెరో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 60,009 6. టయోటా-ఇన్నోవా క్రిస్టా ప్రముఖ జపనీస్ మోటార్స్ టయోటాకు భారత్‌లో ఎస్యూవీ వాహనాలకు మంచి పేరు ఉంది. ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా మోడల్ కార్లను భారతీయులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. 2021లో భారత్‌లో టయోటా టాప్ సెల్లింగ్ కారుగా ఇన్నోవా క్రిస్టా నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 51,261 7. హోండా-అమేజ్ 2021గాను భారత్‌లో హోండా అమ్మకాల్లో అమేజ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 36,398 8. రెనాల్ట్-క్విడ్ 2021గాను భారత్‌లో రెనాల్ట్ అమ్మకాల్లో క్విడ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 30,600 9. స్కోడా- కుషాక్ 2021గాను భారత్‌లో స్కోడా అమ్మకాల్లో కుషాక్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 11,173 చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు! -
కొత్త ఏడాది..కొత్త బాదుడు.. 2022లో సామాన్యుడికి చుక్కలే..!
2021లో అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధన ధరల పెంపుతో ఆహార పదార్థాల, ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంపు సామాన్యుల నెత్తి మీద పడ్డాయి. ఈ ఏడాది అధిక ద్రవ్యోల్భణం సామాన్యులకు ఊపిరి ఆడకుండా చేసింది. 2021లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్భణం ప్రతినెల పెరుగుతూనే వచ్చింది. గత నెలలో డబ్ల్యూపీఐ ఏకంగా 14.23 శాతంగా నమోదయ్యింది. గడచిన దశాబ్దకాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్భణం ఇదే తొలిసారి. ఇక కొత్త ఏడాది రాబోతుంది. వచ్చే ఏడాదిలో కూడా ఆయా ధరలు మరోసారి ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. ► ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ దిగ్గజం కంపెనీలు 2022 వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అధిక ఇన్పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు అలాగే సరఫరా అంతరాయాలు మార్జిన్లను దెబ్బతీస్తున్నందున, భారత్‌లోని దిగ్గజ తయారీ కంపెనీలు, కన్స్యూమర్ కంపెనీలు రాబోయే ఏడాదిలో మరోసారి ధరల పెంపును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ► ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ( ఎఫ్ఎంసిజి ) కంపెనీలు వచ్చే మూడు నెలల్లో ఆయా వస్తువుల ధరలను సుమారు 4-10 శాతం మేర పెంచే అవకాశం ఉంది. గత రెండు త్రైమాసికాల్లో హిందూస్ధాన్ యూనీలివర్, డాబర్, బ్రిటానియా, మారికో ఇతర ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు సుమారు 5-12 శాతం మేర ధరలను పెంచాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గకపోతే, నాల్గవ త్రైమాసికంలో మరో రౌండ్ ధరల పెరుగుదల అనివార్యమని డాబర్ సీఈవో మోహిత్ మల్హోత్రా అన్నారు. ► భారత్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ నెలలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు , ఎయిర్ కండీషనర్లపై ఇప్పటికే 3-5 శాతం మేర ధరలను పెంచాయి. అయితే వచ్చే ఏడాది నుంచి మరో సారి ధరలను పెంచే అవకాశం ఉంది. సుమారు 6-10 శాతం మేర హోమ్ అప్లియెన్స్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2020 నుంచి వైట్ గూడ్స్ ధరల పెరుగుదల ఇది నాల్గోసారి. అధిక ఇన్‌పుడ్ కాస్ట్, చిప్స్ కొరత, సప్లై చైయిన్ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు పెరగనున్నాయి. ► గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుంచి 12శాతం వరకు జీఎస్స్టీను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ► దేశంలోని వాహన తయారీదారులు 2022 నుంచి వాహనాల ధరల పెంపును తెలపగా, అవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల భావిస్తున్నారు. మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, వోక్స్వ్యాగన్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం), హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడంతో ఏడాది పొడవునా అనేక సార్లు ధరలను పెంచాయి. ఈ నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ కొత్త సంవత్సరంలో వాహనాల ధరలను మళ్లీ పెంచనున్నట్లు తెలిపింది . ఇది గత సంవత్సరంలో కంపెనీ ధరలను పెంచడం నాల్గవది, 18 నెలల్లో ఆరవది. ► ఉత్పాదకతను మెరుగుపరచడానికి కంపెనీలు అంతర్గత చర్యలు తీసుకునప్పటికీ, స్టీల్, రాగి, ప్లాస్టిక్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలలో అపూర్వమైన పెరుగుదల ఉంది. దీంతో వాహనాల పెంపు అనివార్యమైంది. 2022లో సామాన్యులకు మరోసారి గట్టి షాకే తగ్గలనుంది. ఎఫ్ఎమ్సీజీ, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనకొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..! -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్‌ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్‌లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్‌లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్‌లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్‌లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్‌లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్‌లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్‌లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్‌ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
అదిగో మహీంద్రా..! ప్రీ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది..!
ఎస్యూవీ మార్కెట్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన ఎక్స్‌యూవీ700 ప్రీబుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించిన 14రోజుల్లో 65,000 వెహికల్స్ బుకింగ్స్ జరిగినట్లు దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థ తెలిపింది. రోజుకు 25వేల వెహికల్స్ బుకింగ్ అక్టోబర్ 7నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్స్‌లో 14 రోజుల స్వల్ప వ్యవధిలో 65,000 వెహికల్స్ అమ్మకాలు జరిగాయి. బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజు అక్టోబర్ 7, అక్టోబర్ 8 ఈ రెండు రోజుల్లో ఒక్కో రోజు సుమారు 25వేల వెహికల్స్ పై బుకింగ్ జరిగినట్లు మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన 50వేల వెహికల్స్ బుకింగ్ కేవలం 3 గంటల్లోనే జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇక వెహికల్స్ డెలివరీ విషయానికి వస్తే గతవారం ఎక్సయూవీ 700 డీజిల్ వేరియంట్ వెహికల్స్ డెలివరీ ప్రారంభం కాగా,పెట్రోల్ ఎక్స్‌యూవీ700 వేరియంట్స్ డెలివరీ వెహికల్స్ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌యూవీ సరికొత్త రికార్డులు ఇటీవల చెన్నైలో ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్‌ఎస్‌పీటీ) లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 సరికొత్త రికార్డ్లని క్రియేట్ నమోదు చేసింది. ప్రూవింగ్ ట్రాక్‌లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది. చదవండి: Mahindra XUV 700: మేఘాలలో తేలిపొమ్మన్నది -
కార్ల అమ్మకాలు గప్'చిప్'
సాక్షి, అమరావతి: పండగ వేళ కొత్త కారు కొందామనుకుంటున్నారా.. ఆ కారును మీరు నడపాలంటే కనీసం 6 నుంచి 20 నెలల పాటు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు కొత్త కారు బుక్ చేస్తే కనీసం ఆరు నెలలు దాటితే కానీ డెలివరీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో చైనాలో తలెత్తిన సెమీ కండక్టర్ చిప్‌ల కొరత ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేస్తోంది. దీంతో దసరా–దీపావళి సీజన్ అమ్మకాలపై భారీగా అంచనాలు పెట్టుకున్న రాష్ట్ర ఆటోమొబైల్ డీలర్ల ఆశలు అడియాసలయ్యాయి. ఆటోమొబైల్ అమ్మకాల్లో దసరా–దీపావళి సీజన్ అత్యంత కీలకమైనది. ఏడాది మొత్తం మీద జరిగే అమ్మకాల్లో 40 శాతం ఈ సీజన్లో జరుగుతాయి. 50 శాతం అమ్మకాలూ కష్టమే.. గతేడాది జరిగిన కార్ల విక్రయాల్లో కనీసం 50 శాతం కూడా చేరుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి పండుగ సీజన్లో కుశలవ హ్యూందాయ్ నాలుగు జిల్లాల్లో 570 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది 400 మార్కును అందుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ బి.వెంకటరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. చిప్‌ల కొరత కారణంగా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేయడంతో సరఫరా నిలిపోయిందని, దీంతో ఈ సీజన్‌కు 200 కార్లను మించి సరఫరా చేయలేమని హ్యూందాయ్ సంస్థ చెబుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హ్యూందాయ్‌లో మంచి డిమాండ్ ఉన్న క్రెటా వంటి మోడల్స్‌కు వెయిటింగ్ పీరియడ్ 9–10 నెలలకు పెరిగిపోయిందన్నారు. అలాగే క్రెటా డీజిల్ వెర్షన్‌తో పాటు కొన్ని మోడల్స్‌పై బుకింగ్‌ను నిలిపివేసినట్టు తెలిపారు. గతేడాది వరుణ్ మారుతి దసరా సీజన్లో 578 కార్లను విక్రయించగా ఈ ఏడాది ఇప్పటివరకు 50 కార్లను కూడా విక్రయించలేకపోయామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. మారుతి డిజైర్, బ్రెజా, స్విఫ్ట్ వంటి మోడల్స్ సరఫరా ఆగిపోవడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 50 శాతం క్షీణిస్తాయని అంచనా వేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది జనవరి వరకు సెమీ కండక్టర్ చిప్‌ల కొరత సమస్య ఉంటుందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.15.54 లక్షల కోట్ల నష్టం సెమీ కండక్టర్స్ కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూ.15.54 లక్షల కోట్లు (210 బిలియన్ డాలర్లు) నష్టపోతుందని అంతర్జాతీయ సంస్థ అలెక్స్ పార్టనర్ అంచనా వేసింది. చిప్‌ల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల యూనిట్ల ఉత్పత్తి నష్టపోనున్నట్టు తెలిపింది. మన దేశంలో కూడా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని 40 నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవడంతో ఆ మేరకు అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దసరా–దీపావళి సీజన్లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల యూనిట్ల కార్లను అమ్ముతుండగా.. అది ఈ ఏడాది 3.5 లక్షల మార్కును దాటకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశ ఆటోమొబైల్ రంగం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోందని, కార్లకు భారీగా డిమాండ్ ఉంటే ఉత్పత్తి లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఉన్న ద్విచక్ర వాహనాలకు వినియోగదారుల నుంచి డిమాండ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోందంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐఎస్) వర్తింపజేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు. అధిక విలువతో కూడిన అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సామర్థ్యం, గ్రీన్ ఆటోమోటివ్ వాహనాల తయారీకి ఈ చర్య ఊతమిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో వివరించారు. 2021–22 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మేరకు మొత్తం 13 రంగాలకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా కేంద్రం ఆటోమోటివ్, డ్రోన్ రంగాలకు ఈ స్కీమ్‌ను వర్తింపజేసింది. అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. సంబంధిత దేశీయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేలా కొత్త పెట్టుబడులను పెట్టేందుకు ఈ ప్రోత్సాహక స్వరూపం దోహదపడుతుంది. ఐదేళ్ల కాలంలో ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ పరిశ్రమలో సుమారు రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం అంచనా వేసింది. సుమారుగా రూ. 2.3 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు పెరగడం వల్ల 7.5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయ ఆటోమోటివ్ వాణిజ్యంలో ఇండియా వాటా పెరుగుతుంది. రెండు విధాలుగా అమలు.. ఈ పీఎల్ఐ స్కీమ్ ప్రస్తుతం ఉనికిలో ఉన్న తయారీ సంస్థలకు, కొత్త పెట్టుబడిదారులకు కూడా వర్తిస్తుంది. ఇందులో రెండు కాంపొనెంట్లు ఉన్నాయి. చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమైన స్కీమ్. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్‌కు వర్తిస్తుంది. ఇక కాంపొనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమై ఉన్న మరో పథకం. ఇది అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ కాంపొనెంట్స్, సీకేడీ, సెమీ సీకేడీ కిట్స్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విడిభాగాలకు వర్తిస్తుంది. రూ. 18 వేల కోట్లతో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్‌కు ఇప్పటికే పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేసింది. అలాగే రూ. 10 వేల కోట్లతో ఫేమ్ స్కీమ్ అమలు చేస్తోంది. డ్రోన్స్‌కు రెక్కలు పీఎల్ఐ పథకంలో భాగంగా డ్రోన్స్, డ్రోన్స్‌కు అవసరమయ్యే విడిభాగాల పరిశ్రమకు దన్నునిచ్చేందుకు సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు మూడేళ్ల కాలానికిగాను రూ. 120 కోట్లు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ పేర్కొంది. డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల తయారీలో వేల్యూ ఎడిషన్‌కు గరిష్టంగా 20 శాతంవరకూ ప్రోత్సాహకాలు లభించగలవని తెలియజేసింది. 2021 డ్రోన్ నిబంధనల ప్రకారం డ్రోన్ల నిర్వాహకులు నింపవలసిన దరఖాస్తులను 25 నుంచి 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా విప్లవాత్మక ఆధునిక తర టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సాహించనుంది. మూడేళ్ల కాలంలో డ్రోన్ల పరిశ్రమలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులకు దారి ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. రూ. 1,500 కోట్ల అర్హతగల అమ్మకాలు పెరగవచ్చని, ఇదే విధంగా 10,000 మందికి అదనంగా ఉపాధి లభించగలదని భావిస్తోంది. పథకంకింద డ్రోన్ల విడిభాగాలలో ఎయిర్‌ఫ్రేమ్, ప్రొపుల్షన్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, బ్యాటరీలు, ఫ్లైట్ కంట్రోల్ మాడ్యూల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కెమెరాలు, సెన్సార్లు తదితరాలను చేర్చింది. కాగా.. డ్రోన్ల సంబంధిత ఐటీ ప్రొడక్టుల అభివృద్ధి సంస్థలకు సైతం పీఎల్ఐ పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో పీఎల్ఐ పథకానికి అనుమతించిన 13 రంగాలలో భాగంగానే డ్రోన్ల పరిశ్రమను చేర్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. -
ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ?
టెస్లా కారు తర్వలోనే ఇండియాలో పరుగులు పెట్టడం ఖాయమనే వార్తలు ఆటోమొబైల్ సెక్టార్ నుంచి వినిపిస్తున్నాయి. ఓ వైపు దిగుమతి సుంకం తగ్గింపుపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరో వైపు కారు తయారీకి అవసరమైన ఏర్పాట్లను టెస్లా చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంత వరకు టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏర్పాట్లలో టెస్లా భారత్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఓ వైపు పన్నుల తగ్గింపు విషయంలో భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఇండియాలో కార్ల తయారీకి అవసరమైన ఏర్పాట్లలో టెస్లా కంపెనీ చేస్తుందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. కార్ల తయారీకి అవసరమైన విడిభాగాలు తమకు సరఫరా చేయాలంటూ ఇండియాకు చెందిన పలు కంపెనీలతో టెస్లా సంప్రదింపులు చేస్తోందని ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మూడు కంపెనీలతో ఒప్పందం ఇండియాకు చెందిన మూడు కంపెనీలతో ఇప్పటికే టెస్లా ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం ఇన్స్స్ట్రుమెంటల్ ప్యానెల్, విండ్‌షీల్డ్స్, పలు రకాలైన బ్రేకులు, గేర్స్, పవర్సీట్స్ను సరఫరా చేయాల్సిందిగా ఆయా కంపెనీలను టెస్లా కోరిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సోనా కమ్‌స్టర్ లిమిటెడ్, సంధార్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీలు ఎప్పటి నుంచో టెస్లాకు కారు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయని, ఇది కొత్తగా చేసుకున్న ఒప్పందం కాదంటూ మరో వర్గం అంటోంది. మొదట దిగుమతికే అవకాశం టెస్లా, ఇండియా గవర్నమెంటుల మధ్య ఒప్పందం కుదిరినా ఇప్పటికిప్పుడు ఇండియాలో కార్ల తయారీ సాధ్యం కాదని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. మొదట విదేశీల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకుని టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాతే తయారీ యూనిట్ విషయంలో అడుగులు పడతాయని అంటున్నారు. ప్రతిష్టంభన తొలగేనా ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో సంచలనాలు సృష్టించింది టెస్లా. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ప్రోత్సాహం అందిస్తోంది ఇండియా. ఇటీవల మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటే కేంద్రం కోరింది. అయితే ఇండియాలో టెస్లా కార్లు ప్రవేశపెట్టే విషయంలో ఇటు టెస్లాకి అటు భారత ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. దిగుమతి పన్నులు తగ్గించాలంటూ టెస్లా అధినేత ఎలన్‌మస్క్ కోరుతుండగా ఇండియాలో తయారీ యూనిట్ పెడితే పన్నుల విషయంలో సానుకూలంగా స్పందిస్తామంటూ ప్రభుత్వ అధికారులను టెస్లాకు ఫీలర్ వదిలారు. దీంతో ఇండియాకి టెస్లా కార్లు రప్పించే విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. చదవండి : సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్! -
ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి
న్యూఢిల్లీ: స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రూపంలో పరిశ్రమ ముందు చక్కని అవకాశం ఉందని, దీనికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్ఏడీఏ) నిర్వహించిన 3వ ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వావలంబన లక్ష్యాల విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి భారీగా పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు ఎగుమతవ్వాలన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వృద్ధి చెందడంలో డీలర్లు, విడిభాగాల తయారీ సంస్థలు, వాహనాల తయారీ సంస్థల పాత్ర కీలకంగా ఉంటుందని పాండే పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రిటైల్ రంగం 45 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వానికి రూ. 95,000 కోట్లు కడుతోందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనికి పరిశ్రమ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పెట్టుబడులు అవసరమైన ఈ రంగంలోని సంస్థలు నిధులు సమీకరించుకునేందుకు దీనితో మరిన్ని అవకాశాలు లభించగలవని ఆయన పేర్కొన్నారు. అటు, విదేశీ ఆటోమొబైల్ సంస్థలు అర్ధాంతరంగా నిష్క్రమించడం వల్ల డీలర్లు నష్టపోకుండా తగు రక్షణాత్మక చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని గులాటీ విజ్ఞప్తి చేశారు. తుక్కు సర్టిఫికేషన్ కేంద్రాలుగా డీలర్ వర్క్‌షాప్‌లు.. వాహనాల తుక్కు (స్క్రాపేజీ) విధానానికి సంబంధించి డీలర్ల వర్క్‌షాపులే తనిఖీ, సర్టిఫికేషన్ కేంద్రాలుగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అనుమతించాలని ప్రభుత్వానికి ’సియామ్’ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా తనిఖీ కేంద్రాలను ప్రారంభించాలంటే చాలా సమయం పట్టేయవచ్చని, ఇవి అంత లాభసాటిగా కూడా ఉండకపోవచ్చని పేర్కొంది. ఎఫ్ఏడీఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు డీలర్ల దగ్గర ఎలాగూ ఉంటాయి కాబట్టి ప్రతిపాదిత విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఈ డీలర్‌షిప్‌లు చాలా మటుకు కస్టమర్లకు దగ్గర్లోనే ఉండటమనేది మరో సానుకూలాంశం‘ అని ఆయన వివరించారు. అటు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు నిర్దేశించిన 15–20 ఏళ్ల వ్యవధి చాలా సుదీర్ఘమైనదని, అంతకన్నా ముందుగానే టెస్ట్ నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. చదవండి: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
అమ్మకాల జోరు, ఏ వాహనాల్ని ఎక్కువగా కొన్నారంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలైలో వాహన అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం విక్రయాలు అధికమై 15,56,777 యూనిట్లు నమోదయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. ప్రయాణికుల వాహనాలు 63 శాతం పెరిగి 2,61,744 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 28 శాతం అధికమై 11,32,611, వాణిజ్య వాహనాలు రెండున్నరెట్లు ఎగసి 52,130 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 82,388 యూనిట్లుగా ఉంది. సెమికండక్టర్ల కొరత ప్రయాణికుల వాహన విభాగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. -
వాహనాల డిమాండ్ పెరిగింది, ఆటో మొబైల్ రంగం పుంజుకుంది
న్యూఢిల్లీ: దేశీయ ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా మారింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిసిక్ట్ సవాళ్ల నేపథ్యంలోను దేశీయ ఆటో పరిశ్రమ క్రమంగా కోలుకుంటుందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) తెలిపింది. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవటం, వాహనాల డిమాండ్ పెరగడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్ థర్డ్ వేవ్‌పై ఆధారపడి పరిశ్రమ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది. గత ఫైనాన్షియల్ ఇయర్లో పరిశ్రమ టర్నోవర్‌లో 3 శాతం క్షీణతతో రూ.3.40 లక్షల కోట్లకు చేరిందని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల వృద్ధి, లాజిస్టిక్స్ ఇబ్బందులు, కంటైనర్ల అధిక ధరలు వంటివి పరిశ్రమ రికవరీకి అడ్డంకులుగా మారాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులు పరిశ్రమ వృద్ధితో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఆటో పరిశ్రమ బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలను కోల్పోయిందని.. ఇది ఇండస్ట్రీ వృద్ధిని చూసినప్పుడు 2018–19లో మొత్తం క్యాపెక్స్‌గా ఉండేదని ఆయన తెలిపారు. పరిశ్రమ వ్యయాల తగ్గింపు, స్థానికీకరణ చర్యలపై దృష్టిపెడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో 60–70 శాతం సామర్థ్య వినియోగం ఉన్పప్పటికీ ఉద్యోగుల పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. తక్కువ దిగుమతి సుంకాలు కోరుకుతున్న టెస్లా.. స్థానిక తయారీపై దృష్టి సారిస్తే ఏసీఎంఏ మద్దతు ఇస్తుందని చెప్పారు. హర్యానాలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఉండటంతో పరిశ్రమపై ప్రభావం చూపించిందని.. ఇలాంటి నిర్ణయాలు పోటీతత్వాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు
వెబ్‌డెస్క్ : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)లు కొనేందుకు వీలుగా పలు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ ముసాయిదా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈవీకి ప్రోత్సహకాలు కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోలు దిగుమతులు తగ్గించడం లక్ష్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు జై కొడుతోంది కేంద్రం. దీనికి తగ్గట్టే ఆటోమోబైల్ కంపెనీలు ఈవీ వెహికల్స్‌ని మార్కెట్లోకి తెస్తున్నాయి. అయితే కేంద్రం ఆశించినంత వేగంగా అమ్మకాల జోరు కొనసాగడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఇవి సరిపోవు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగాలంటే మరిన్ని రాయితీలు, ప్రోత్సహకాలు కావాలని ఇటు వినియోగదారులు, అటు ఆటోమోబైల్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్వల్ప రాయితీలతో పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నాయి. మన దేశంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 300 నుంచి రూ. 1,500 వరకు ఉన్నాయి. -
మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు
ముంబై: రెండో దశ కోవిడ్ ప్రభావం దేశీయ వాహన విక్రయాలపై తీవ్ర ప్రతికూలతను చూపింది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్డౌన్లతో ఉత్పత్తి, పంపిణీలకు అంతరాయం కలిగింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి ఆటో కంపెనీలు కొన్నిరోజుల పాటు తమ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటాతో సహా అన్ని కంపెనీల అమ్మకాలు క్షీణత నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మే నెలలో 35,293 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఈ ఏప్రిల్ నెలలో అమ్మిన 1.42 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 75 శాతం క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లను ఆక్సిజన్ తయారీకి వినియోగించడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్స్ మే నెలలో 25,001 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో అమ్మిన 49,002 యూనిట్లతో పోలిస్తే 49 శాతం తక్కువ. ఇదే మే నెలలో టాటా మోటార్స్ వాహన అమ్మకాలు 40 క్షీణించాయి. ఏప్రిల్‌లో 25,091 యూనిట్లను విక్రయించిన ఈ కంపెనీ మే నెలలో 15,181 వాహనాలను మాత్రమే విక్రయించింది. కియా మోటార్స్ ఏప్రిల్‌లో 16,111 యూనిట్లు విక్రయించింది. మేనెలలో 11,050 యూనిట్లకు పరిమితమైన అమ్మకాల్లో 31 శాతం క్షీణతను నమోదు చేసింది. చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
ప్రపంచ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన టీవీఎస్ స్కూటర్
టీవీఎస్ మోటార్స్ ఎన్టీఓఆర్క్యూ(NTORQ) 125 స్కూటర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. ఎన్టీఓఆర్క్యూ దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఆసియాన్, లాటిన్ అమెరికాలోని 19 దేశాలలో తమకు కొనుగోలుదారులు ఉన్నట్లు పేర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. మా స్మార్ట్ స్కూటర్ టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ 125 అంతర్జాతీయ మార్కెట్లలో 1 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ కస్టమర్లను భాగ ఆకర్షిస్తుంది. దీనికి ప్రధాన కారణం స్కూటర్ అద్భుతమైన ప్రదర్శన, అందులో ఉన్న సాంకేతికత, ఉన్నతమైన పనితీరు వంటి అంశాలు అందరికి చేరుకోవడానికి దోహదపడ్డాయి అని చెప్పారు. ఆవిష్కరణలో బెంచ్‌మార్క్‌లను అందుకోవడం, కస్టమర్ల ఆకాంక్షను నెరవర్చడం ద్వారా టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ బ్రాండ్‌ను పెంచుకోవాలనే మా నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ అని కూడా అన్నారు. దీనిలో మంచి పనితీరు కోసం టీవీఎస్ రేసింగ్ పెడిగ్రీ సపోర్ట్, రేస్-ట్యూన్డ్ ఇంధన ఇంజెక్షన్ (RT-Fi) కలిగి ఉంది. టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఈ కారణం వల్ల స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్‌కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చెయ్యవచ్చు. అలాగే, నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇంటర్నల్ ల్యాప్-టైమర్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, రెడ్ కలర్ హాజార్డ్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్, లెడ్ లైటింగ్, స్ట్రీట్ - స్పోర్ట్ వంటి మల్టీ-రైడ్ స్టాటిస్టిక్స్ మోడ్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. బీఎస్-VI స్కూటర్ డిస్క్, డ్రమ్ రేస్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాట్టే రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. రేస్ ఎడిషన్ రెడ్-బ్లాక్, ఎల్లో-బ్లాక్‌లలో లభిస్తుంది. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం