న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బెంట్లే (బెంట్లీ) తాజాగా భారత్‌లో సరికొత్త బెంటేగా ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ ఎస్‌యూవీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6 కోట్లు. 4.0 లీటర్ 550 పీఎస్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుపరిచారు. రెండవ తరం బెంటేగా ఆధారంగా రూపుదిద్దుకుంది.
వీల్‌బేస్, రేర్ క్యాబిన్ స్థలం 180 మిల్లీమీటర్లు అదనంగా విస్తరించింది. కారు డెలివరీకి 7–8 నెలల సమయం పడుతుంది. 2023లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు బెంట్లే భారత డీలర్‌గా వ్యవహరిస్తున్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ తెలిపింది. 2022లో దేశంలో కంపెనీ 40 యూనిట్లు విక్రయించిందని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బగ్లా వెల్లడించారు.
‘అల్ట్రా లగ్జరీ కార్ల విభాగం దేశంలో పెరుగుతోంది. అధిక దిగుమతి సుంకాలే ఈ విభాగానికి ఉన్న ఏకైక సమస్య. దిగుమతి సుంకాలను క్రమంగా ప్రభుత్వం మరింత హేతుబద్ధం చేస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment