Bentley car
-
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
బెంట్లీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 'కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ' అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాకముందే.. ఫోటోలు విడుదలయ్యాయి. ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ మంచి స్టైలింగ్ అప్డేట్లను పొందుతుందని స్పష్టమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ టియర్‌డ్రాప్ డిజైన్ హెడ్లైట్లను పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల మొత్తం డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుందని స్పష్టమవుతోంది.బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్ రెండూ కలిసి 782 హార్స్ పవర్, 1001 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈవీ మొదట గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తరువాత భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.A new era is coming.Discover more: https://t.co/anuS4iG6oX-CO2 Emissions and fuel consumption data for EU27 is pending; subject to EU Type Approval pic.twitter.com/eJZih65PYf— Bentley Motors (@BentleyMotors) May 16, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ గతేడాది యానిమల్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. అంతే కాకుండా మరో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే తాజాగా రణ్‌బీర్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ యానిమల్ హీరో దాదాపు రూ.8 కోట్ల విలువైన కొత్త బెంట్లీ కాంటినెంటల్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారులో ముంబైలోని తన నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. కాగా.. గతేడాది సైతం బెల్గ్రేవియా గ్రీన్ ఎక్స్‌టీరియర్స్‌తో కూడిన అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేశాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను రణ్‌బీర్ కపూర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ రాహా కపూర్ అనే కూతురు జన్మించారు. ఇటీవలే తమ కూతురి కోసం దాదాపు రూ.250 కోట్లతో ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే అత్యంత పిన్న వయసులోనే కోట్ల ఆస్తులున్న స్టార్ కిడ్‌గా రికార్డ్ సృష్టించనుంది. కాగా.. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్.. నితీష్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
బెంట్లీ కొత్త కారు.. ధర రూ.6 కోట్లు
న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బెంట్లే (బెంట్లీ) తాజాగా భారత్‌లో సరికొత్త బెంటేగా ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ ఎస్యూవీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6 కోట్లు. 4.0 లీటర్ 550 పీఎస్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుపరిచారు. రెండవ తరం బెంటేగా ఆధారంగా రూపుదిద్దుకుంది. వీల్‌బేస్, రేర్ క్యాబిన్ స్థలం 180 మిల్లీమీటర్లు అదనంగా విస్తరించింది. కారు డెలివరీకి 7–8 నెలల సమయం పడుతుంది. 2023లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు బెంట్లే భారత డీలర్‌గా వ్యవహరిస్తున్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ తెలిపింది. 2022లో దేశంలో కంపెనీ 40 యూనిట్లు విక్రయించిందని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బగ్లా వెల్లడించారు. ‘అల్ట్రా లగ్జరీ కార్ల విభాగం దేశంలో పెరుగుతోంది. అధిక దిగుమతి సుంకాలే ఈ విభాగానికి ఉన్న ఏకైక సమస్య. దిగుమతి సుంకాలను క్రమంగా ప్రభుత్వం మరింత హేతుబద్ధం చేస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. -
లండన్‌లో మాయమైన కారు... పాకిస్తాన్లో ప్రత్యక్షం
లండన్: అది దాదాపు రూ.2.4 కోట్ల విలువైన ఖరీదైన బెంట్లీ కారు. దాన్ని బ్రిటన్‌లో మాయం చేసిన దొంగలు పాకిస్తాన్లో అమ్మేశారు. అయితే అధునాతన సాంకేతికత సాయంతో దాని జాడను బ్రిటన్ అధికారులు కనుగొన్నారు. మూడు లక్షల డాలర్ల విలాసవంత బెంట్లీ కారు కొన్ని వారాల క్రితం లండన్‌లో చోరీకి గురైంది. ఎట్టకేలకు దాని జాడను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాకిస్తాన్లో కనుగొంది. బ్రిటన్ అధికారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కరాచీ కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంపన్నులుండే డీహెచ్ఏ ప్రాంతంలో కారు దాచిన విషయం తెల్సుకున్నారు. ఓ ఖరీదైన భవంతి ప్రాంగణంలో చేసిన సోదాల్లో కారు దొరికింది. అయితే, పాకిస్తాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో యజమాని అది పాక్ వాహనమని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే, బ్రిటన్ అధికారులు ఇచ్చిన ఛాసిస్ నంబర్ వివరాలు ఈ కారుతో సరిపోలాయి. సరైన వాహన పత్రాలు ఇవ్వడంలో యజమాని విఫలమవడంతో కారును అధికారులు సీజ్ చేశారు. అతడిని, విక్రయించిన బ్రోకర్‌ను అరెస్ట్‌చేశారు. తూర్పు యూరప్‌లోని ఒక దౌత్యవేత్త పత్రాలను అడ్డుపెట్టుకుని కారును అక్రమంగా పాకిస్తాన్‌కు తరలించారని తేలింది. బెంట్లీ కారులోని ట్రేసింగ్ ట్రాకర్‌ను దొంగలు స్విఛ్ ఆఫ్ చేయడం మరిచిపోయారని, అందుకే అధునిక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా జాడ ఎక్కడుంతో ఇట్టే కనిపెట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖరీదైన వాహనాన్ని అక్రమంగా పాక్‌కు తీసుకురావడంతో ఆ దేశం 30 కోట్ల పాక్ రూపాయల పన్నును కోల్పోయింది. ఈ స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
బెంట్లీ కారుకు... రూ.10 కోట్లయినా వెనుకాడరు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంట్లీ.. సూపర్ లగ్జరీ కార్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్. సామాన్యుడి ఊహలక్కూడా అందని ధర వీటి ప్రత్యేకత. కొనుగోలు చేసే కస్టమర్ తనకు నచ్చినట్టుగా రంగులు, ఇంటీరియర్, యాక్సెసరీస్, ఎక్స్టీరియర్ను ఎంచుకోవచ్చు. కారు లోపలి భాగాలన్నీ చాలామటుకు చేతితో తీర్చిదిద్దినవే. కారు తయారీకి ఎంత కాదన్నా ఆరు నెలల సమయం పడుతోందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా కస్టమైజేషన్ కారణంగా భారత్‌లో కారు ధర రూ.10 కోట్ల వరకూ వెళ్తోంది. దేశంలో ఇప్పటి వరకు 500 కార్లు అమ్ముడయ్యాయి. 100కు పైగా రంగులను కస్టమర్లు ఎంచుకున్నారు. తొలి స్థానం తెలుపు రంగు కైవసం చేసుకుంది. బెంట్లీకి చెందిన నాలుగు మోడళ్లు దేశీయ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఏటా 10,000 పైగా బెంట్లీ కార్లు రోడ్లపై దూసుకెళ్తున్నాయి. భాగ్యనగరిలో 40 కార్లు.. హైదరాబాద్ రోడ్లపై 40 దాకా బెంట్లీ కార్లు హుందా ఒలకబోస్తున్నాయి. నిజాం కాలం నుంచే భాగ్యనగరి వాసులు లగ్జరీ కార్ల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ప్రీమియం లగ్జరీ కార్ల విక్రయంలో ఉన్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బగ్‌ల శుక్రవారం తెలిపారు. భారత్‌లో మూడో షోరూంను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే షోరూమ్‌ను తెరిచామన్నారు. కస్టమైజేషన్‌కు అయ్యే ఖర్చు గురించి ఇక్కడివారు వెనక్కి తగ్గరని చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్లకు దిగుమతి సుంకం 202 శాతం ఉండటం, మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వంటి అడ్డంకులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలో రూ.3 కోట్లపైగా ధర కలిగిన వివిధ కంపెనీల కార్లు ఏటా 150 దాకా అమ్ముడవుతున్నాయని వెల్లడించారు. -
పాక్ క్రికెటర్‌ను చెడుగుడు ఆడేశారు!
కొత్తకారు కొనుక్కుని దాని ముందు ఠీవిగా నిలబడి ఫొటో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే స్నేహితులు, సన్నిహితుల నుంచి అభినందనలు సందేశాలు వస్తుంటాయి. మరికొందరైతే జాగ్రత్త కారు నడపమని సలహాయిస్తారు. పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు మాత్రం నెటిజన్లు వ్యతిరేకంగా స్పందించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. దీంతో తమ ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్(పీసీబీ) బోర్డు భారీ నజరానాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమర్ అక్మల్ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేసిన ఫొటోపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. సిల్వర్ కలర్ బెంట్లే కారు ముందు నిలబడి దిగిన ఫొటోను అక్మల్ పోస్ట్ చేశాడు. ‘ఎంజాయింగ్ లండన్ ఆఫ్టర్ హార్డ్‌వర్క్’ అని ఫొటోకు క్యాప్షన్ కూడా పెట్టాడు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు హార్డ్ వర్క్ చేయడమా అంటూ ఒకరు ఎద్దేవా చేశారు. ‘ఖరీదైన బ్లెంటీ కారు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. వేరొకరి కారు ముందు ఫొటో తీసుకునివుంటావ’ని మరొకరు వ్యాఖ్యానించారు. పాక్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు ఎందుకు కోల్పోయావో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. పాక్ జట్టులో స్థానం కోల్పోయిన అక్మల్ ఖరీదైన కారు ఎలా కొన్నాడని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర పనులు మానేసి క్రికెట్‌పై దృష్టి పెట్టాలని మరొకరు సలహాయిచ్చారు. అభిమానుల నుంచి నెగెటివ్ కామెంట్లు పోటెత్తడటంతో అక్మల్ స్పందించాడు. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని వేడుకున్నాడు. ఫ్యాన్స్ అంటే తనకెంతో ప్రేమ ఉందని, వారి ఆదరాభిమానాలను మర్చిపోనని అన్నాడు.