త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు | New Bentley Continental GT V8 PHEV Teased | Sakshi
Sakshi News home page

త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు

Published Fri, May 17 2024 9:42 PM | Last Updated on Fri, May 17 2024 9:42 PM

New Bentley Continental GT V8 PHEV Teased

బెంట్లీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 'కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ' అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాకముందే.. ఫోటోలు విడుదలయ్యాయి. ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ మంచి స్టైలింగ్ అప్‌డేట్‌లను పొందుతుందని స్పష్టమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.

కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ టియర్‌డ్రాప్ డిజైన్ హెడ్‌లైట్‌లను పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల మొత్తం డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుందని స్పష్టమవుతోంది.

బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్ రెండూ కలిసి 782 హార్స్ పవర్, 1001 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈవీ మొదట గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తరువాత భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement