Bentley
-
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
బెంట్లీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 'కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ' అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాకముందే.. ఫోటోలు విడుదలయ్యాయి. ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ మంచి స్టైలింగ్ అప్డేట్లను పొందుతుందని స్పష్టమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ టియర్‌డ్రాప్ డిజైన్ హెడ్లైట్లను పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల మొత్తం డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుందని స్పష్టమవుతోంది.బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్ రెండూ కలిసి 782 హార్స్ పవర్, 1001 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈవీ మొదట గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తరువాత భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.A new era is coming.Discover more: https://t.co/anuS4iG6oX-CO2 Emissions and fuel consumption data for EU27 is pending; subject to EU Type Approval pic.twitter.com/eJZih65PYf— Bentley Motors (@BentleyMotors) May 16, 2024 -
బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..?
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు వివిధ మార్గాలు, పరీక్షలు అనుసరిస్తాయి. కొన్ని కంపెనీలు ప్రత్యేకతను చాటుకునేందుకు వారి ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ.. వంటివి పరిచయం చేస్తాయి. అందులో భాగంగా బెంట్లీ కార్లపై పెయింట్ వేసినా అది కారుకు అతుక్కోకుండా తయారుచేస్తున్నారు. దాన్ని వినియోగదారులకు అందించేముందు కంపెనీ పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే అందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోలో.. బెంట్లీ కారుకు పెయింట్ వేశారు. అది కారుపై అతికేలా మంటతో వేడి చేశారు. తర్వాత ఆ పెయింట్‌ను చిన్నక్లాత్తో శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తే కారుకు ఏమాత్రం అంటకుండా వెంటనే మొత్తం శుభ్రం అయింది. ఈ వ్యవహారాన్ని ఆ సంస్థ జీఎం టీజీ సమౌరి చూసి ఆశ్చర్యపోతున్నట్లు వీడియోలో ఉంది. Bentley staff spray paint and flame one of their cars to show how their paint protection product works pic.twitter.com/BYRIITFpEM — Historic Vids (@historyinmemes) March 13, 2024 -
ఉద్యోగులకు లగ్జరీ కార్ల సంస్థ షాక్!
లండన్: మహమ్మారి కరోనా సంక్షోభ సెగ బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మోటార్స్ ఉద్యోగులను తాకింది. కోవిడ్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలైన క్రమంలో ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంట్లీ సైతం ఉద్యోగాల కోతకు ఉపక్రమించింది. యూకేలోని యూనిట్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ మేరకు బెంట్లీ మోటార్స్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో భవిష్యత్తులో మరోసారి నియామకాలు చేపట్టే అవకాశం లేకపోలేదని సంకేతాలు జారీ చేసింది.(నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌టీవీ) కాగా క్రూవ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బెంట్లీ మోటార్స్ ఫోక్స్‌వాగన్ ఏజీ అనుబంధ సంస్థ అన్న సంగతి తెలిసిందే. విలాసవంతమైన కార్ల తయారీ సంస్థగా పేరొందిన బెంట్లీ.. బ్రెగ్జిట్ కారణంగా ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. 2018లో దాదాపు 288 మిలియన్ యూరోల నష్టాన్ని చవిచూసిన కార్ల దిగ్గజం.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా తమ కార్ల అమ్మకాలు పెరగడంతో 64 మిలియన్ యూరోల ఆపరేటింగ్ ప్రాఫిట్‌తో కాస్త కుదుటపడినట్లు కనిపించింది. తాజాగా కోవిడ్ మరోసారి కార్ల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పోటీ సంస్థలు అస్టాన్ మార్టినో లాగండా గ్లోబల్ హోల్డింగ్స్, రెనాల్ట్ ఉద్యోగాల్లో కోత విధిస్తున్న తరుణంలో తాను సైతం ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. కాగా బెంట్లీ ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, యూకేల్లో కోవిడ్ ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.(ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్..) -
అతి ఖరీదైన కారు ఇదే..!
సాక్షి, న్యూఢిల్లీ: ఐకానిక్ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మరో ఖరీదైన కారును లాంచ్ చేసింది. బెంటేగా సిరీస్‌లో ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ రేంజ్లో దీన్ని విడుదల చేసింది. ‘వి8’ పేరుతో అత్యంత శక్తివంతమైన వెర్షన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. వెయ్యి కిలోమీటర్ల రేంజ్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో వీ8, త్వరలోనే రానున్న వీ8 హైబ్రీడ్ కార్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అతి ఖరీదైన ఎస్యూవీ అని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.3.78 కోట్లు(ఎక్స్ షోరూం, ముంబై). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ భాగస్వామ్యంతో బెంట్లే ఈకారును అందుబాటులోకి తెచ్చింది. బెంటేగా రేంజ్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే వి8 ఎక్స్టీరియర్కు అదనపు ఫీచర్లను జోడించినట్లు ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. ఈ లగ్జరీ ఎస్యూవి కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు గరిష్ఠంగా 290 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. లీటరుకు సుమారు 9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఫైవ్ సీటీర్ ఎస్‌యూవీలో 4 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ సిస్టం 542 బిహెచ్పిపవర్, 60జీబీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 10 స్పీకర్లు ప్రధానఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే త్వరలో విడుదల కానున్న ఖరీదైన కార్లు రేంజ్ రోవర్ ఎస్యూవీ ఆటోబయోగ్రఫీ ఫేస్‌లిఫ్ట్, రోల్స్‌రాయిస్ కులినాస్కి పెద్దపోటీ ఇవ్వనుందని అంచనా. కాగా భారత మార్కెట్లో సంస్థ ఇప్పటికే బెంట్లీ బెంటేగా కాంటినెంటల్ జిటి, ఫ్లయింగ్ స్పర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఇండియాలో ఫెరారీ, మాసెరాటీ అతివిలాసవంతమైనకార్ల విక్రయాలు క్రయంగా పుంజుకుంటున్నాయి. 2014లో 14, 900 యూనిట్లు అమ్ముడు బోయాయట. బెంటేగా, మాసెరాటీ లెవాంటే ఎంట్రీ తరువాత ఈ అమ్మకాలు మరింత పుంజుకుని 2016లో 26,750యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ్య 2020 నాటికి 40వేలకు చేరవచ్చని అంచనా. -
100 యూనిట్ల లక్ష్యంగా బెంట్లీ అడుగులు
న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ 2017 కల్లా భారత్ లో 100 యూనిట్ల పైగా కార్ల అమ్మకాలను నమోదుచేయాలని నిర్ణయించింది. గత నాలుగేళ్లలో ఈ కార్ల కంపెనీ అమ్మకాలు 15 శాతం వృద్ధిలో నడుస్తున్నాయని కంపెనీ పేర్కొంది. బెంట్లీ కంపెనీకి భారత్‌లో డీలర్‌గా వ్యవహరిస్తున్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. ఈ ఏడాది కూడా ఈ కంపెనీ అమ్మకాలు ఇలానే నమోదవుతాయనే ఆశాభావం వ్యక్తంచేసింది. భారత్ లో ఈ అమ్మకాలను ప్రతి ఏడాది15 శాతం పెంచుకుంటూ పోతామని, గత అమ్మకాలకు రెండింతలు నమోదుచేస్తామని ఎక్స్ క్లూజివ్ మోటార్స్ తెలిపింది. 2017 వచ్చే సరికి మూడంకెల సంఖ్యకు కంపెనీ అమ్మకాలు చేరుకుంటాయని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బంగ్లా చెప్పారు. తాజాగా మార్కెట్లోకి విడుదలచేసిన తొలి అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్ యూవీ బెంటెగా ధర రూ.3.85 కోట్లగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉందని, ఈ కారు బుకింగ్స్ కచ్చితంగా మూడు అంకెలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో బెంట్లీ కంపెనీ బెంటెగా మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా 2,600-2,700 యూనిట్ల వరకూ ఉత్పత్తిచేస్తుంది. వచ్చే ఏడాదికల్లా వీటి ఉత్పత్తి 3,000 యూనిట్లకు చేరుకోవాలని కంపెనీ ఆశిస్తుంది. గతేడాది ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 10,001 యూనిట్ల లగ్జరీ కార్లను ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది వీటి ఉత్పత్తి 15 శాతం పెరుగనుందని కంపెనీ తెలిపింది. గ్లోబల్ గా ఈ కార్లకు మంచి డిమాండ్ ఉందని పేర్కొంది. కంపెనీ తన లగ్జరీ సెడాన్స్ కాంటినెంటల్ జీటీ, ఫ్లైయింగ్ స్పర్ కార్లు రూ.3.55 కోట్ల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. -
బెంట్లీ తొలి ఎస్యూవీ ‘బెంటేగ’
ధర రూ.3.85 కోట్లు న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ తాజాగా తన తొలి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ‘బెంటేగ’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.85 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. బెంట్లీ కంపెనీకి భారత్‌లోని డీలర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఇప్పటికే బెంటేగ బుకింగ్స్‌ను తీసుకున్నాం. తొలి డెలివరీ 2 వారాల్లో జరుగుతుందని’ ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బంగ్లా తెలిపారు. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన 5-6 నెలల కాలంలో కారును డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. ఎస్యూవీ ప్రత్యేకతలు: ‘బెంటేగ’లో ట్విన్ టర్బో చార్జ్డ్ 6 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్, వాయిస్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషన్ వ్యవస్థ వంటి తదితర ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో ఇదే అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్యూవీ అని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ గంటకు 301 కిలోమీటర్లు. హైదరాబాద్‌లో కొత్త షోరూమ్ హైదరాబాద్‌లో కొత్తగా బెంట్లీ షోరూమ్‌ను నిర్మిస్తున్నామని బంగ్లా తెలిపారు. దీన్ని రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ షోరూమ్‌లో సర్వీస్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. -
లగ్జరీ కార్... టాప్‌గేర్!
న్యూఢిల్లీ: మందగమనంతో వాహనాల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కోట్ల ఖరీదు చేసే సూపర్ లగ్జరీ కార్ల జోరు మాత్రం తగ్గలేదు. పెపైచ్చు లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మరిన్ని కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడానికి ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఆర్థిక సర్వీసుల సంస్థ సీఎల్ఎస్ఏ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 2015 నాటికి రెట్టింపై 4,03,000కి పెరుగుతుందని అంచనా. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా కన్నా కూడా అత్యధిక సంఖ్యలో అత్యంత సంపన్నులు భారత్‌లోనే ఉండనున్నారు. ఇలాంటి గణాంకాలతో అత్యంత ఖరీదైన కార్ల కంపెనీలు భారత్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటిదాకా ఏటా రెండో, మూడో సూపర్ లగ్జరీ కార్ల కొత్త మోడల్స్ భారత్‌లో ఆవిష్కరించేవి. కానీ, ఈ ఏడాది మాత్రం ఏకంగా ఆరు మోడల్స్‌ని ఆవిష్కరిస్తున్నాయి. ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్‌కారు బ్రాండ్ లంబోర్గిని, బ్రిటిష్‌కి చెందిన బెంట్లీ.. ఆస్టన్ మార్టిన్, నెదర్లాండ్స్ కంపెనీ స్పైకర్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్, గలార్డో ఎల్పీ550-2 లిమిటెడ్ ఎడిషన్లను, రోల్స్ రాయిస్ రెయిత్లను ప్రవేశపెట్టాయి. వీటి ధర రూ. 3.5 కోట్ల పైమాటే. రూ.37 కోట్ల దాకా రేట్లు.. సాధారణంగా భారత్‌లో లగ్జరీ సెగ్మెంట్ కార్లు మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షే, జాగ్వార్ అండ్ ల్యాండ్‌రోవర్ వంటి బ్రాండ్లతో మొదలవుతుంటాయి. ఈ కార్ల ధరలు (ప్రీమియం మోడల్స్ మినహా) సుమారు రూ. 1 కోటి లోపే ఉంటున్నాయి. అయితే, కొన్నాళ్లుగా వీటిని మించిన సూపర్ లగ్జరీ బ్రాండ్లకు గిరాకీ పెరుగుతోంది. 20 అడుగుల పొడవు మొదలు రెండు డోర్ల సూపర్ ఫాస్ట్ కార్ల దాకా వీటిలో ఉంటున్నాయి. బుగాటి, కీనిగ్సెగ్, ఫెరారీ, పగాణీ, మాసెరాటి వంటి బ్రాండ్లు ఈ సెగ్మెంట్లో ఉంటున్నాయి. మిగతా బ్రాండ్లు వేలల్లో అమ్మితే ఇవి రెండంకెల స్థాయిలో అమ్ముడవుతున్నా కంపెనీలకు ఆదాయం భారీగానే ఉంటోంది. దిగుమతి సుంకాలు పెరగడం, రూపాయి పతనం తదితర కారణాలతో సూపర్ లగ్జరీ కార్ల రేట్లు భారీగా పెరుగుతున్నప్పటికీ .. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్, ఇతర రాజకీయ నాయకులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. వీరు కొనే కార్ల ధరలు సుమారు రూ. 1 కోటి నుంచి రూ. 7 కోట్ల దాకా ఉంటున్నాయి. అదే, ఆస్టన్ మార్టిన్ వన్77, బుగాటి వేరాన్ వంటి మోడల్స్ ధరలు ఏకంగా రూ. 20 కోట్లు నుంచి రూ. 37 కోట్ల దాకా ఉన్నాయి. దేశీయంగా ఇవి అత్యంత ఖరీదైనవి. అమ్మకాల్లో 25% దాకా వృద్ధి..: సూపర్ లగ్జరీ కార్లు దేశీయంగా ఏటా 20-25% వృద్ధితో 300-400 మేర అమ్ముడవుతున్నాయని అంచనా. సగటున ఒక్కో కారు ఖరీదు రూ. 3.5 కోట్లు లెక్కగడితే..ఈ మార్కెట్ విలువ రూ. 1,500 కోట్లు. లంబోర్గిని గతేడాది 17 కార్లు విక్రయించింది. ఇప్పుడున్న జోరును బట్టి చూస్తే తాము నిర్దేశించుకున్నట్లుగా 2015 నాటికన్నా ముందుగానే 50 సూపర్ కార్ల అమ్మకాల లక్ష్యాన్ని సాధించేయగలమనేది కంపెనీ వర్గాల ధీమా. ఇక ఆస్టన్ మార్టిన్ గతేడాది 20 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్యను దాటేసింది. ఇదే ఊపులో కొత్తగా తీర్చిదిద్దిన డీబీఎస్ మోడల్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆస్టన్ మార్టిన్ కార్ల రేట్లు సగటున రూ. 3 కోట్ల పైనే. వచ్చే నెల బెంట్లీ ఫ్లయింగ్ స్పర్.. బెంట్లీ మోటార్స్ త్వరలో ఫ్లయింగ్ స్పర్ కారును వచ్చే నెల ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 17.3 అడుగుల పొడవుండే ఈ సెడాన్ కారు, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. విలాసవంతమైన లెదర్ సీట్లు, మినీ రిఫ్రిజిరేటరు మొదలైన హంగులు ఇందులో ఉంటాయి. ఇక సూపర్ స్పోర్ట్స్ కార్లను తయారుచేసే స్పైకర్ కంపెనీ.. ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ తమ కారు సీ8 ఐలెరాన్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో ఇప్పటికే కొంతమంది డీలర్లను కూడా ఎంపిక చేసుకుంది. దీని ధర రూ. 1 కోటిపైనే ఉండనుంది.