బెంట్లీ కారు(ఫొటో కర్టెసీ: బెంట్లీ ట్విటర్)
లండన్: మహమ్మారి కరోనా సంక్షోభ సెగ బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మోటార్స్ ఉద్యోగులను తాకింది. కోవిడ్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలైన క్రమంలో ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంట్లీ సైతం ఉద్యోగాల కోతకు ఉపక్రమించింది. యూకేలోని యూనిట్‌లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ మేరకు బెంట్లీ మోటార్స్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో భవిష్యత్తులో మరోసారి నియామకాలు చేపట్టే అవకాశం లేకపోలేదని సంకేతాలు జారీ చేసింది.(నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌టీవీ)
కాగా క్రూవ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బెంట్లీ మోటార్స్ ఫోక్స్‌వాగన్ ఏజీ అనుబంధ సంస్థ అన్న సంగతి తెలిసిందే. విలాసవంతమైన కార్ల తయారీ సంస్థగా పేరొందిన బెంట్లీ.. బ్రెగ్జిట్ కారణంగా ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. 2018లో దాదాపు 288 మిలియన్ యూరోల నష్టాన్ని చవిచూసిన కార్ల దిగ్గజం.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా తమ కార్ల అమ్మకాలు పెరగడంతో 64 మిలియన్ యూరోల ఆపరేటింగ్ ప్రాఫిట్‌తో కాస్త కుదుటపడినట్లు కనిపించింది. తాజాగా కోవిడ్ మరోసారి కార్ల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పోటీ సంస్థలు అస్టాన్ మార్టినో లాగండా గ్లోబల్ హోల్డింగ్స్, రెనాల్ట్ ఉద్యోగాల్లో కోత విధిస్తున్న తరుణంలో తాను సైతం ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. కాగా బెంట్లీ ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, యూకేల్లో కోవిడ్ ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.(ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్..)
Comments
Please login to add a commentAdd a comment