లండన్: భారత్ తయారీ కోవాగ్జిన్‌ను అనుమతి పొందిన కోవిడ్ టీకాల జాబితాలో చేర్చినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ఈ నెల 22వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనుందని పేర్కొంది. భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుని యూకే వెళ్లిన ప్రయాణికులు ఇకపై ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని భారత్‌లో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు.
యూకేలో ప్రవేశించే 18 ఏళ్లలోపు వారి విషయంలోనూ ప్రయాణ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. వీరికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తిస్తూ, ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. యూకేకు వచ్చాక వీరికి కోవిడ్ పరీక్ష చేస్తారు. పాజిటివ్‌గా తేలితే మాత్రం, పీసీఆర్ పరీక్ష ఉచితంగా చేస్తారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తిస్తూభారత్ 96 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment