Bharat Biotech
-
లంపీ స్కిన్ డిసీజ్ నివారణకు వ్యాక్సిన్
కొవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలోని బయోవెట్ ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ) కోసం వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. పాడి పశువుల చర్మంపై వచ్చే లంపీ స్కీన్ వ్యాధికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధి నివారణకు ‘బయోలంపీవాక్సిన్’కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆమోదం లభించినట్లు సంస్థ పేర్కొంది.బయోలంపీవాక్సిన్బయోలంపీవాక్సిన్ అనేది పాడి పశువులను ఎల్ఎస్డీ నుంచి రక్షించడానికి తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్. మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న జంతువులకు ఏటా ఒకసారి దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. బయోవెట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) పరస్పర సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)ల్లో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: Aero India 2025 బీఈఎల్ కొత్త ఉత్పత్తులుఈ వ్యాక్సిన్ తయారు ప్రాజెక్ట్‌కు ఎన్ఆర్సీఈ శాస్ట్రవేత్తలు నవీన్ కుమార్, బీఎన్ త్రిపాఠి నేతృత్వం వహించారు. ఎల్ఎస్డీ వల్ల దేశంలో పాడి ఉత్పాదకత గణనీయంగా ప్రభావం చెందుతోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు రెండు లక్షలకుపైగా పాడి పశువులు ఈ వ్యాధి బారినపడి మరణించాయని కంపెనీ తెలిపింది. ఈ వ్యాధివల్ల 2022 సంవత్సరంలో రూ.18,337.76 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి 26% క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
సాపిజెన్ బయోలాజిక్స్లో సింగపూర్ అధ్యక్షుడు
సింగపూర్ అధ్యక్షుడు 'థర్మన్ షణ్ముగరత్నం' భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగానే భువనేశ్వర్‌లోని అంధరువాలోని ఒడిశా బయోటెక్ పార్క్‌లో భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్దదిదైన వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ సాపిజెన్ బయోలాజిక్స్‌ను సందర్శించారు. ఆయనతో పాటు మంత్రివర్గ నాయకులు, వ్యాపార వేత్తలు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది.భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా.. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర ఎల్లా, సాపిజెన్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాచెస్ ఎల్లా, డైరెక్టర్ డాక్టర్ జలచారి ఎల్లా, సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అందరూ థర్మన్ షణ్ముగరత్నంను స్వాగతించారు.సింగపూర్ అధ్యక్షులు వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సందర్శించడం మాకు చాలా గౌరవంగా ఉంది. వ్యాక్సిన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదపడటానికి ఈ విశాలమైన మల్టీ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంలో జరుగుతున్న వినూత్న పనిని ప్రదర్శించడానికి మేము గర్విస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో పాటు వారి బృందాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రూ. 1500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ 10 వేర్వేరు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సదుపాయం ద్వారా 2,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు & 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. -
భారత్ బయోటెక్ అధినేత డా.కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక గుర్తింపు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ (Bharat Biotech) సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా (Dr Krishna Ella) ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2025 సంవత్సరానికి గాను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) ప్రతిష్టాత్మకమైన ఇండియా ఫెలోషిప్ ప్రకటించింది.కొత్త విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త వ్యాక్సిన్ టెక్నాలజీల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న సాంకేతికతల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఐఎన్ఎస్ఏ ఆయనకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేసింది. దీంతో ఈ గౌరవం అందుకున్న విశిష్ట శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రముఖుల జాబితాలో డాక్టర్ ఎల్లా కూడా చేరారు.ఇందులో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డీడీఆర్&డీ కార్యదర్శి సమీర్ వి కామత్, డీఆర్డీఓ చైర్మన్ డా. కేఎన్ శివరాజన్ వంటివారు ఉన్నారు.ఈ సంవత్సరం మొత్తం 61 ఫెలోషిప్‌లు అందించగా మొట్టమొదటిసారిగా పరిశ్రమ నాయకులకు ఫెలోషిప్‌లు అందించారు. ఎంపికైన సభ్యులు ఐఎన్ఎస్ఏ సాధారణ సమావేశాలకు హాజరై ఓటు వేయవచ్చు. ఫెలోషిప్‌లు లేదా ఐఎన్ఎస్ఏ అవార్డుల కోసం ఇతర వ్యక్తులను ప్రతిపాదించవచ్చు.“వ్యాక్సిన్లు, బయోటెక్నాలజీ రంగంలో నా సహకారాన్ని గుర్తించినందుకు ఐఎన్ఎస్ఏకు కృతజ్ఞతలు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, కొత్త వ్యాక్సిన్లను కనుగొనడంలో భారత్ ఆధిపత్య శక్తిగా ఎదగడానికి నా మద్దతును మరింత కొనసాగిస్తాను” అని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. -
మెట్లబావుల పునరుద్ధరణకు భారత్ బయోటెక్ సాయం!
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన మెట్లబావులను పునరద్ధరించేందుకు ప్రముఖ వ్యాక్సీన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. నీటి వనరుల సంరక్షణతోపాటు జీవనోపాధులను పెంచేందుకు, ఎకో టూరిజానికి ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ‘ద సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండవర్’ క్లుప్తంగా సాహె అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలకు తమవంతు సాయం అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్‌ల సమక్షంలో భారత్ బయోటెక్, సాహేల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా తాము మెట్లబావుల పునరుద్ధరణకు సాయం అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలిపారు. మెట్లబావుల పునరుద్ధరణతోపాటు వీటి ప్రాశస్త్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తామని అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లోని మెట్లబావులు అటు పల్లెల్లో ఇటు నగరాల్లోనూ కీలకమైన నీటి వనరులగా సేవలందించాయని చెప్పారు. అమ్మపల్లిలోని మెట్లబావి 13వ శతాబ్దానికి చెందినదైతే.. సాలార్ జంగ్ సంగ్రహాలయంలోనిది కుతుబ్ షాహీల కాలం నాటిదని గుర్తు చేశారు. ఢిల్లీలోని అగ్రసేన్ కి బౌలీ, అహ్మదాబాద్‌లోని రాణీ కి వావ్‌లు యునెస్కో గుర్తింపు పొందాయని, చిన్న బావుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఆధునిక కాలంలో వీటి అవసరం లేక పోవడంతో కొన్ని చోట్ల చెత్తకుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో భూగర్భ జల వనరుల వాడకం అత్యధికంగా ఉందని యునెస్కో సైతం హెచ్చరించిన నేపథ్యంలో.. మెట్లబావుల వంటి నీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి.. అలోపెక్స్‌తో భారత్ బయోటెక్ జట్టు
భారత్‌పాటు ఇతర అల్పాదాయ దేశాలలో విస్తృత-స్పెక్ట్రమ్ యాంటీ-మైక్రోబయల్ వ్యాక్సిన్ అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం అలోపెక్స్ ఇంక్‌తో భారత్ బయోటెక్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు భారత్‌తోపాటు ఇతర లైసెన్స్ భూభాగాల్లో వ్యాక్సిన్ AV0328 అభివృద్ధి, వాణిజ్యీకరణ చేపడతాయని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఒప్పందం ప్రకారం.. వన్‌టైమ్ ముందస్తు చెల్లింపు, మైలురాయి చెల్లింపులకు అలోపెక్స్కు అర్హత ఉంటుంది. అలాగే లైసెన్స్ పొందిన భూభాగాల్లో AV0328 వ్యాక్సిన్ భవిష్యత్తు అమ్మకాలపై రాయల్టీలను పొందుతుంది."వ్యాక్సినేషన్ ద్వారా యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను తగ్గించే పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ సహకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి సురక్షితమైన, చవకైన, అధిక-నాణ్యత గల వ్యాక్సిన్లను అందించాలనే మా మిషన్‌కు అనుగుణంగా ఉంటుంది" అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.ఫేజ్-I ఫస్ట్-ఇన్-హ్యూమన్ ట్రయల్ పూర్తయిందని, AV0328 వ్యాక్సిన్ ఎటువంటి తీవ్రమైన ప్రతికూల సంఘటనలనైనా బాగా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. -
వరద బాధితులకు రూ.2 కోట్ల విరాళం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలతో అతలాకుతలమైన బాధితులను ఆదుకునేందకు ఇరు రాష్ట్రాల సీఎం వరద సహాయ నిధులకు చెరో రూ.1 కోటి చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లంది. భారీ వర్షపాతం విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద బాధితుల సహాయార్థం పలు సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. -
ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల చేసిన భారత్ బయోటెక్
ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 'ఓరల్ కలరా వ్యాక్సిన్' (OCV) ప్రారంభించింది. 'హిల్చోల్' (HILLCHOL) పేరుతో కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. దీనిని సింగపూర్‌కు చెందిన హిల్మాన్ లేబొరేటరీస్ లైసెన్స్‌తో అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.కలరా అనేది నివారించదగినది. అయినప్పటికీ 2021 నుంచి ఈ వ్యాధి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. 2023 ప్రారంభం నుంచి 2024 మార్చి వరకు 31 దేశాల్లో 8,24,479 కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు 5,900 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించడానికి భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ తీసుకొచ్చింది.భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను 200 మిలియన్ డోస్‌ల వరకు ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్, భువనేశ్వర్లలో పెద్ద ఎత్తున తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా కలరా నివారించడానికి 'హిల్చోల్' ఓ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకు భారత్ బయోటెక్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. 2030 నాటికి కలరా సంబంధిత మరణాల సంఖ్య 90 శాతం తగ్గించాలనేది ప్రధాన లక్ష్యం అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.కలరా ఎలా వ్యాపిస్తుంది?పరిశుభ్రత లేని ప్రాంతాల్లో కలరా ఎక్కువగా వ్యాపిస్తుంది. కలరా వ్యాప్తికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహార పదార్థాలు. ఈ సమస్య ప్రకృతి వైపరీత్యాల వల్ల, పరిశుభ్రమైన నీరు లభించని ప్రాంతాల్లో నివసించే ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. కలరా సోకినా తరువాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. -
కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఐసీఎంఆర్
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్‌లో ఐసీఎంఆర్‌ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్‌ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్‌ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశాయి. -
డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రజారోగ్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ పతకాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా అందుకున్నారు. మే 22, 2024న యూఎస్‌లోని మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో జరిగిన బ్లూమ్‌బెర్గ్ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్ ఎల్లెన్ జే.మెకెంజీ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు.కృష్ణఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి కొవిడ్ తీవ్రతను తగ్గించారని తెలిపారు. ఈ పతకం అందుకున్న సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్‌లో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌కు ఈ పతకాన్ని అంకితం ఇస్తున్నాను. ఈ పతకం మా శాస్త్రవేత్తల బృందానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మోనోక్లోనల్ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్‌బయోటెక్ ఎన్నో పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ను కనుగొంది’ అన్నారు.ఇదీ చదవండి: 6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖడాక్టర్ ఎల్లా నేతృత్వంలో భారత్ బయోటెక్ 220 పేటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్ కలిగి ఉందని కంపెనీ చెప్పింది. 125 దేశాల్లో 9 బిలియన్ వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేసినట్లు తెలిపింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డా.కృష్ణ ఎల్లా ఎంపిక
కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.ఈ పదవిలో ఇప్పటి వరకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ఉన్నారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్ బయోటెక్ సీఎఫ్ఓ టి.శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ హర్షవర్థన్ కొనసాగుతారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థఅందరికీ అవసరమయ్యే టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలన్నారు. ఆఫ్రికా వంటి దేశాలకు టీకా అవసరాలు అధిమన్నారు. టీకా తయారీలో వస్తున్న అంకుర సంస్థలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలన్నారు. -
భారత్ బయోటెక్.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం - అందుకేనా?
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఒక ఆవాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దీని వల్ల ఉపయోగం ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాలు, విద్యా పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా.. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం బయో థెరప్యూటిక్స్ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను సరైన సమయంలో రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతాయి. ప్రాణాంతక వ్యాధుల భారీ నుంచి కాపాడానికి వ్యాక్సిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనా మహమ్మారి సమయంలో చాలా దేశాలకు వ్యాక్సిన్స్ అందించిన ఘనత భారత్ సొంతం. ఈ సమయంలోనే మన దేశం సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం సందర్భంగా.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ 'కృష్ణ ఎల్లా' మాట్లాడుతూ.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో ఏర్పడిన ఈ బంధం పరిశోధనలను సులభతరం చేస్తుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, సైన్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు. కొత్త వ్యాక్సిన్లు, బయోథెరఫిటిక్స్ అభివృద్ధిలో మా నైపుణ్యాన్ని హైలైట్ చేయడానికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి, ప్రపంచ ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే లక్ష్యమని.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ 'జామీ ట్రిక్కాస్' అన్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ప్రపంచ డిమాండ్‌లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను అందించగలిగాయి. ఏకంగా 2.4 బిలియన్ డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేసిన రికార్డ్ భారత్ సొంతమైంది. దీంతో దేశ ఖ్యాతిని గుర్తించిన చాలా సంస్థలు, ఇండియన్ కంపెనీలతో చేతులు కలపడానికి ఆసక్తి చూపాయి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించుకోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి రూపకల్పన కోసం భారతదేశం ఆర్&డీ పెట్టుబడులను కొనసాగిస్తోంది. -
మానవ వనరుల అభివృద్ధిలో భారత్ నం.1
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలకు ఇస్తున్న వ్యాక్సిన్లలో 65 శాతం ఇండియాలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లే ఉన్నాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. శుక్రవారం జరిగిన హైదరాబాద్ ఐఐటీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. మానవ వనరుల అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇండియాలో డిజిటల్ ఎకానమీ 34 శాతం ఉంటే అభివృద్ధి చెందిన అమెరికా, ప్రాన్స్ వంటి దేశాల్లో 8 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఫార్మా తదితర రంగాలను ప్రపంచ రాజకీయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయని కృష్ణ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ఎగుమతి చేసి, బదులుగా ఆయా దేశాల నుంచి విలువైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నాయని వివరించారు. వ్యవసాయరంగం అభివృద్ధితో పాటు నూతన ఆవిష్కరణలు దేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తాయన్నారు. ఇంగ్లిష్ పెద్దగా తెలియని చైనా నూతన ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు. వైరస్ల పట్ల అలసత్వం వద్దు వైరస్ల కారణంగా పుట్టుకొస్తున్న వ్యాధుల పట్ల అలసత్వం వద్దని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాధుల మూలాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఎక్కడికక్కడ సరైన వైద్యం చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మడగాస్కర్‌లో పుట్టిన చికున్‌గున్యా ఇండియాకు విస్తరించిందనీ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన జికా వైరస్ బ్రెజిల్ వంటి దేశాలకు విస్తరించిందని తెలిపారు. ఐఐటీహెచ్‌లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ పాలకవర్గం చైర్మన్ బీవీజీ మోహన్‌రెడ్డి, డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్న భయాల వేళ మరో టీకా అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో నాసల్ వ్యాక్సిన్ ధరను మంగళవారం ప్రకటించింది భారత్ బయోటెక్. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800(పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది ఈ నాసల్ వ్యాక్సిన్. ‘ఇంకోవాక్’(iNCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచే స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్‌గా పొందవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్‌గా ఇంకోవాక్ నిలిచినట్లు పేర్కొంది భారత్ బయోటెక్. ఇదీ చదవండి: Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే? -
సూది లేకుండా కరోనా టీకా
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ (బీబీవీ154) కరోనా వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ముక్కుద్వారా తీసుకొనే ఈ టీకాను 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాగ్జాన్ టీకా రెండు డోసుల తీసుకున్నవారు బూస్టర్ డోసుగా ఇంట్రానాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో దీన్ని చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కో–విన్ పోర్టల్ ద్వారా టీకా పొందవచ్చని వెల్లడించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముక్కుద్వారా తీసుకొనే టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు ఇన్కోవాక్ అనే బ్రాండ్ పేరుతో పిలిచే బీబీవీ154 వ్యాక్సిన్‌కు ఈ ఏడాది నవంబర్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలియజేశారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని స్పష్టం చేశారు. టీకాల పరిశోధన, అభివృద్ధి విషయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలకు ఇంట్రానాజల్ వ్యాక్సిన్ మరో ఉదాహరణ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీకాను ఇవ్వడం చాలా సులభమని తెలిపాయి. ఇన్కోవాక్ను భారత్ బయోటెక్ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్స్‌కు భారత ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని కోవిడ్ సురక్షా కార్యక్రమం కింద ఆర్థిక సహకారం అందించింది. బీబీవీ154 టీకా విషయంలో మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, సత్ఫలితాలు లభించాయని భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్‌ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్‌గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్‌కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్‌గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
Covid-19: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారీ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. ఐఎన్‌కోవ్యాక్ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం ట్వీట్ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ తయారీ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ కావడం విశేషం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 4,000 మంది వలంటీర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాధి నిరోధకతను వ్యాక్సిన్ సమర్థవంతంగా ప్రేరేపించిందని వెల్లడించారు. ప్రపంచ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీలో నూతన ఒరవడి మొదలవనుందని ఆయన అన్నారు. -
గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే అత్యవసర పరిస్థితిల్లో పెద్దవారికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమితిచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఇది పెద్ద ప్రోత్సాహమని డాక్టర్ మాండవ్య అన్నారు. 18 ఏళ్లు దాటిని వారికి నాజల్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించిందని తెలిపారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు ఇది పెద్ద ప్రోత్సాహం అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు కాగా భారత్‌లో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్ కోవిడ్ టీకాగా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ నిలిచింది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో -
6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అత్యవసర వినియోగానికి కొన్ని పరిమితులు విధించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకు డీసీజీఐ12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్ టీకాలు వేసేందేకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 21న ఆమోదం లభించింది. అంతేకాదు టీనేజ్ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి మూడు నుంచి ప్రారంభించింది. తదనంతరం మార్చి 16న 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించింది. అయితే గతంలో డీసీజీఐ నిపుణుల కమిటీ 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మరిన్ని వివరాలను సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి: 2 వేలకు పైగా కొత్త కేసులు...మళ్లీ మాస్క్ ధరించాల్సిందే) -
సీపీఐ నారాయణకు ‘ఎల్లా’ దంపతుల పరామర్శ
నగరి: సతీ వియోగంతో బాధపడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను భారత్ బయోటెక్ అధినేత డాక్టర్.కృష్ణ ఎల్లా, ఆయన సతీమణి డాక్టర్ సుచిత్ర ఎల్లా ఆదివారం పరామర్శించారు. వీరు చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అయనంబాకం గ్రామంలో నారాయణ స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ.. నారాయణ సతీమణి వసుమతిదేవి మనమధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఇలాంటి విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి నాయుడు కూడా నారాయణను పరామర్శించారు. -
మెక్సికో మార్కెట్లోకి కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా కోవాగ్జిన్‌ను మెక్సికో మార్కెట్లో కూడా సరఫరా చేసే దిశగా బయోటెక్నాలజీ సంస్థలు భారత్ బయోటెక్, ఆక్యుజెన్ తమ ఒప్పందంలో మార్పులు చేశాయి. దీనితో మొత్తం ఉత్తర అమెరికాలో కోవాగ్జిన్ విక్రయానికి సంబంధించి ఆక్యుజెన్‌కు హక్కు లభిస్తుంది. అమెరికా మార్కెట్ తరహాలోనే లాభాల్లో వాటాల పంపకం రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని ఆక్యుజెన్ తెలిపింది. అమెరికా, కెనడా మార్కెట్లలో కోవాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సరఫరా, విక్రయాల కోసం ఆక్యుజెన్, భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం ఉంది. ప్రస్తుతం 2–18 ఏళ్ల బాలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌ను ఉపయోగించే అంశాన్ని మెక్సికో నియంత్రణ సంస్థ పరిశీలిస్తోందని ఆక్యుజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్లో కోవాగ్జిన్‌ను వాణిజ్యావసరాలకు ఉత్పత్తి చేసేందుకు ఆక్యుజెన్‌కు పూర్తి తోడ్పాటు అందిస్తామని భారత్ బయో చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్‌ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
పద్మభూషణ్ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. (చదవండి: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) -
ఫోర్త్వేవ్కి భయపడాల్సిన అవసరం లేదు: కృష్ణ ఎల్ల
న్యూఢిల్లీ: భారత్‌లో మూడు వేవ్‌లుగా విజృంభించిన కరోనా వైరస్.. ఐదు లక్షల మందికి పైగా బలి తీసుకుంది. అంతకు మించి లాక్డౌన్, ఇతర పరిస్థితుల్లో లెక్కలేనన్ని కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేసేసింది. ప్రస్తుతం కరోనా పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో కొత్తగా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తపడుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా. అయితే ఫోర్త్ వేవ్‌కి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల. ఢిల్లీలో పోలియోపై ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జాకబ్ జాన్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సిందేమీ లేదన్న ఆయన.. కరోనా విజృంభించినా బెదిరిపోవాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు భవిష్యత్తులో లాక్డౌన్ల అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడిన కృష్ణ ఎల్ల.. కరోనా విజృంభించిన తట్టుకునే సామర్థ్యం ఉందని చెప్తున్నారు. అంతేకాదు వ్యాక్సినేషన్లో భాగంగా.. మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం ఉండొచ్చని చెప్తున్నారాయన. ఫోర్త్ వేవ్ ప్రభావం అంతగా ఏమీ ఉండనిచెప్పిన ఆయన.. ఇప్పటికే దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మూడో డోసు(బూస్టర్ డోసు) వ్యాక్సిన్ వేసుకోవడమే కాకుండా మాస్కులు కొనసాగించడం, శానిటైజర్ వాడడం కొనసాగించాలని ప్రజలకు సూచించారు ఆయన. -
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్!) -
టీనేజర్లకు టీకా తర్వాత పారాసిటమాల్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీనేజీ వయసు వారికి ఇస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ బుధవారం ఒక స్పష్టతనిచ్చింది. ‘కోవాగ్జిన్ టీకా తీసుకున్న టీనేజర్లకు కొన్ని టీకా కేంద్రాలు.. పారాసిటమాల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు మూడు, పెయిన్ కిల్లర్లు తీసుకోవాలని సూచిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. నిజానికి పిల్లలు కోవాగ్జిన్ తీసుకున్నాక వారికి పారాసిటమాల్, పెయిన్ కిల్లర్లు ఇవ్వాల్సిన పని లేదు. అవి అనవసరం’ అని సంస్థ పేర్కొంది. టీనేజర్లు మందులు తీసుకోవాలనుకుంటే వైద్యుణ్ణి సంప్రదించి, వారి సలహా మేరకే తీసుకోవాలని సంస్థ సూచించింది. -
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది: లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్‌లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్‌లో కోవాగ్జిన్ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్‌పై లాన్సెట్ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. కాగా లాన్సెట్ జర్నల్ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది. -
కోవాగ్జిన్‌కు యూకే గుర్తింపు
లండన్: భారత్ తయారీ కోవాగ్జిన్‌ను అనుమతి పొందిన కోవిడ్ టీకాల జాబితాలో చేర్చినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ఈ నెల 22వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనుందని పేర్కొంది. భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుని యూకే వెళ్లిన ప్రయాణికులు ఇకపై ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని భారత్‌లో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. యూకేలో ప్రవేశించే 18 ఏళ్లలోపు వారి విషయంలోనూ ప్రయాణ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. వీరికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తిస్తూ, ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. యూకేకు వచ్చాక వీరికి కోవిడ్ పరీక్ష చేస్తారు. పాజిటివ్‌గా తేలితే మాత్రం, పీసీఆర్ పరీక్ష ఉచితంగా చేస్తారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తిస్తూభారత్ 96 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. -
భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ దంపతులకు విశిష్ట పురస్కారం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి పురస్కారాలు అందిస్తున్నట్టు డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్ చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎం.ఎల్లకు విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్ ఆస్పత్రి ఎనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్ట్ ఎస్వీ రామారావుకు విశేష పురస్కారాలు అందిస్తున్నట్టు వివరించారు. ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గతేడాది ఫౌండేషన్ తరఫున పురస్కారాలను ప్రకటించినా.. కరోనా కారణంగా వాటిని అందజేయలేదన్నారు. ఈ ఏడాది నిర్వహించే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో వాటినీ అందిస్తామని చెప్పారు. నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతలకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం, టీవీ యాంకర్ సుమకనకాల, హీలింగ్ హాస్థ హెర్బల్స్‌ప్రైవేట్ æలిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.మస్తాన్‌యాదవ్, షిర్డీలోని ద్వారకామయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బి.శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలను గతేడాది ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పురస్కారాలను అందించే తేదీ, వేదిక తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని నాగభూషణం చెప్పారు. -
కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా
మెల్బోర్న్: భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారీ కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ మహమ్మారితో సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా దాదాపు 20 నెలల తర్వాత మొదటిసారిగా దేశంలోకి ప్రయాణికులను అనుమతించింది. కోవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన బీబీఐబీపీ–కోర్వీ టీకాను దేశంలోకి వచ్చే యాత్రికుల టీకా స్టేటస్‌ను నిర్థారించేందుకు పరిగణనలోకి తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. కోవాగ్జిన్ తీసుకున్న 12 ఏళ్లకు పైబడిన వారిని, బీబీఐబీపీ–కోర్వీ తీసుకున్న 18–60 ఏళ్ల గ్రూపు వారిని కోవిడ్ టీకా తీసుకున్నట్లు గుర్తించనున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం తెలిపింది. -
ప్రపంచం చూపు మనవైపు: మోదీ
న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు. ప్రధానితో భేటీ అనంతరం ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు. -
కోవాగ్జిన్‌పై అదనపుసమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ
ఐక్యరాజ్యసవిుతి/జెనీవా: కోవిడ్–19 నియంత్రణ కోసం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ పేరిట టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకుంది. అయితే, అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో తొందరపడలేమని, కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం ఆశిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సోమవారం స్పష్టం చేసింది. కోవాగ్జిన్ టీకా భద్రత, ప్రభావశీలతను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉందని ట్విట్టర్లో తెలిపింది. -
పిల్లలకి వ్యాక్సిన్ ఇది సమయమేనా ?
రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వెయ్యొచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేయడంతో తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు ఇచి్చన వ్యాక్సినే పిల్లలకీ ఇస్తారా ? సైడ్ ఎఫెక్ట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్‌పై చర్చ తెరపైకి వచ్చింది. పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేస్తారా? పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ ఉండదు. అయితే డోసుని తగ్గించి ఇస్తారు. పెద్దలకు ఇచ్చే వ్యాక్సిన్ డోసులో సగం మాత్రమే పిల్లలకి ఇస్తారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకి ఒక్క మిల్లీ లీటర్ డోసు రెండు విడతలుగా 28 రోజుల వ్యవధిలో ఇస్తున్నారు. పిల్లలకి అందులో సగం అంటే 0.5 ఎంల్ డోసుని రెండు విడతలుగా ఇస్తారు. ఒక్కో డోసు 0.25 ఎంఎల్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? చిన్నపిల్లలకి ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి మాత్రమే ఉంటాయి. ఏయే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి? మన దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చారు. డీఎన్ఏ ఆధారిత ఈ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పిల్లలకు అనుమతులు మంజూరైన తొలి వ్యాక్సిన్ ఇదే. అమెరికాకు చెందిన నొవావాక్స్ (భారత్‌లో దీనిని కొవావాక్స్ అని పిలుస్తున్నారు) వ్యాక్సిన్‌ను 2–17 ఏళ్ల వయసు వారికి ఇవ్వడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. పుణెకి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ రెండు, మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక హైదరాబాద్‌కు చెందిన బయోలాజిక్ ఈ లిమిటెడ్ కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ 5 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం ప్రయోగాలు నిర్వహించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఇది సరైన సమయమేనా? కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం, దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో వారికి వ్యాక్సిన్ వెయ్యడానికి ఇది సరైన సమయమేనా అన్న సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే వైద్య నిపుణులు మాత్రం పిల్లలకి కూడా వ్యాక్సిన్ వెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశ జనాభాలో పిల్లలు 25–30% వరకు ఉంటారు. వీరికి వ్యాక్సిన్ వెయ్యకపోతే, వ్యక్తిగతంగా వారికి నష్టం జరగకపోయినా వారు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించారు. దసరా తర్వాత కొన్ని రాష్ట్రాలు స్కూళ్లని తెరవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు స్కూలుకు వెళ్లే పిల్లలకి వ్యాక్సిన్ వెయ్యకపోతే రెండో వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ మూడో వేవ్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇతర దేశాల్లో పిల్లలకి వ్యాక్సిన్ ఎలా? అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇస్తున్నారు. ఇక రెండేళ్ల పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్న మొట్టమొదటి దేశం క్యూబా. సెపె్టంబర్ 13 నుంచి ఆ దేశం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టింది. చైనా, యూఏఈ, వెనెజులా దేశాలు రెండేళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలు ప్రారంభించాయి. నిపుణుల అభిప్రాయాలు మొదటి వేవ్‌లో మొత్తం కేసుల్లో 4% పిల్లలకే సోకింది. రెండో వేవ్ వచ్చేసరికి 10–15% పిల్లల్లో కేసులు పెరిగాయి. పాఠశాలలు కూడా పునఃప్రారంభం కావస్తూ ఉండడంతో పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇదే సమయం. చిన్నారులకి వ్యాక్సిన్ దేశంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది – డాక్టర్ సుజీర్ రంజన్, అసోసియేట్ డైరెక్టర్, టాటా ట్రస్ట్స్ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించలేదు. చాలా దేశాలు కోవాగ్జిన్‌ను గుర్తించడం లేదు. దీనికి కారణం పూర్తి స్థాయి డేటా లేకపోవడమే. అందుకే మరింత డేటా వచ్చేవరకు వేచి చూసి పిల్లలకు వేస్తే మంచిది. – డాక్టర్ శ్రీకాంత్, పీడియాట్రిషన్, బెంగళూరు – నేషనల్ డెస్క్, సాక్షి -
చిన్నారులకు కోవాగ్జిన్.. అనుమతించిన నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్ 2,3వ దశ ట్రయల్స్‌ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్ బయోటెక్. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. (చదవండి: కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) ఈ నేపథ్యంలో ‘‘పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్ ఇచ్చేందుకుభారత్ బయోటెక్ కంపెనీకి అనుమతులిచ్చాం” అని సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం -
భారత్ బయోటెక్ కు మళ్ళీ షాక్
-
18 ఏళ్లలోపు వారికి కరోనా టీకా..
హైదరాబాద్: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ 18 ఏళ్లలోపు వారికి ఇచ్చే కోవాగ్జిన్ టీకా ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తి చేసింది. 18 ఏళ్లు పైబడిన వారి కోసం ఇదే సంస్థ ఇప్పటికే కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. పిల్లల కోసం అభివృద్ధి చేస్తున్న టీకాకు సంబంధించిన ఫేజ్ 2/3 ట్రయల్స్ వివరాలను వచ్చేవారం డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)కి సమర్పించనున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారి కోసం కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తి అక్టోబర్‌లో 55 మిలియన్ డోసులకు చేరుతుందని అన్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే 35 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోందని, ఫేజ్ –2 ట్రయల్స్ వచ్చే నెలలో ముగియనుందని వివరించారు. వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించేందుకు ముఖద్వారం ముక్కేనని చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకాతో ముక్కులో ఇమ్యూన్ రెస్సాన్స్ పెరుగుతుందని వెల్లడించారు. తద్వారా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకా ట్రయల్స్‌ను 650 మంది వలంటీర్లపై నిర్వహించామని చెప్పారు. కేంద్రం అనుమతిస్తే కోవాగ్జిన్ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటికిప్పుడు విదేశీ మార్కెట్లలో పాగా వేయాలన్న ఆరాటం తమకు లేదన్నారు. -
కోవాగ్జిన్ ముడి పదార్థాలను అందజేసిన ఐఐఎల్..!
హైదరాబాద్: కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి, కోవాగ్జిన్ ఉత్పత్తికి అవసరమయ్యే పదార్థాలను తయారుచేసే ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్ కోవాగ్జిన్ డ్రగ్ పదార్థాలను భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లాకు ఐఐఎల్ ఎమ్డీ డాక్టర్ కే. ఆనంద్‌కుమార్ శుక్రవారం రోజున అందజేశారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్)తో చేతులు కలిపాయి. 2021 ఏప్రిల్‌లో వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్బంగా ఐఐఎల్ ఎమ్డీ డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ..రికార్డు సమయంలో కోవాగ్జిన్ ముడిపదార్థాలను తయారుచేయడం ఇతర స్టేక్ హోల్డర్స్ సహాయంతో లక్ష్యాన్ని ఛేదించామని పేర్కొన్నారు. నిర్వీరామంగా కంపెనీలోని ఉద్యోగులు పనిచేయడంతోనే ముడిపదార్థాల ఉత్పత్తి సాధ్యమైందని వెల్లడించారు. నీతి-ఆయోగ్, బీఐఆర్ఏసీ, డీబీటీ, మిషన్ కోవిడ్ సురక్ష బృందం, కేంద్ర రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు అందించే నిరంతర మద్దతుతో ఐఐఎల్ తమ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. ఐఐఎల్ అతి తక్కువ సమయంలో బీబీఐఎల్ కంపెనీతో నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. -
భారత్‌లో కోవిడ్ టీకా: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు!
ఒక అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కు!! ఇదీ దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం పరిస్థితి. 2021లోపు అర్హులైన ప్రజలందరికీ టీకాలేస్తామని... కేంద్రం ప్రకటనైతే చేసింది కానీ... అందుకు తగ్గట్టుగా టీకా ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో సమస్యలు ఎదురు కాకుండా చూడటంలో మాత్రం విఫలమైంది. మరి దేశం ఏడాది చివరిలోగా తన లక్ష్యాన్ని అందుకోగలదా? ఎన్ని టీకాలు వేశాం? ఎన్ని వేయాలి? ఏ ఏ కంపెనీలు ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.... వూహాన్లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కోవిడ్‌ను నిలువరించేందుకు ఉద్దేశించిన టీకా కార్యక్రమం దేశంలో నత్తనడకన సాగుతోందంటే తప్పేమీ కాదు. ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో కార్యక్రమం మొదలైనా.. ఆ తరువాత ముడిసరుకుల కొరత, పంపిణీ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో తరచూ మార్పుల వంటి అనేక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో టీకాలు ఇవ్వలేకపోయామన్నది నిష్టూర సత్యం. తాజాగా ఆగస్టు 11వ తేదీ నాటికి దేశం మొత్తమ్మీద 51.90 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయింది. అయితే ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 12 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక డోసు తీసుకున్న వారు 40 కోట్లు ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే దేశ జనాభాలో వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందిన వారు కొంచెం అటు ఇటుగా పది శాతం మంది మాత్రమే! సరఫరా సమస్యలకు అవగాహన రాహిత్యం, అపోహలు తోడు కావడంతో చాలామంది టీకాలు వేయించుకునేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నారు. అవసరాలేమిటి? ఉత్పత్తి ఎంత? 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో టీకాకు అర్హులైన వారు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటివరకూ వీరిలో 11 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడ్డాయి. అంటే.. ఇప్పటివరకూ ఒక డోసు వేసుకున్న 40 కోట్ల మందితోపాటు ఒక టీకా కూడా తీసుకోని 44 కోట్ల మందికి కలిపి దాదాపు 130 కోట్ల టీకాలు అవసరమవుతాయి. డిసెంబర్ నాటికల్లా మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే కొంచెం అటు ఇటుగా నెలకు 29 కోట్ల టీకాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్పత్తి 12 నుంచి 13 కోట్లకు మించి లేదు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఉత్పత్తిలో నాణ్యత పరమైన సమస్యలు ఎదురయ్యాయని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదని టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చెందిన ఎన్కే ఆరోరా ఇటీవలే తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో 40 కోట్ల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం మే నెలలోనే ప్రకటించింది. అయితే జనవరి –జూలై మధ్యకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించిన ఎనిమిది కోట్ల టీకాల్లోనూ భారత్ బయోటెక్ ఇందులో సగం కూడా అందించలేదని సమాచారం. కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం నెలకు 11 నుంచి 12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కొత్త టీకాలు కొన్నింటికి అనుమతులిచ్చినా వాటి ఉత్పత్తి లేదా సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టీకా కార్యక్రమం పూర్తవడం కష్టసాధ్యం! అందుబాటులో ఐదు టీకాలు.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్‌లో తయారైన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ ‘హెచ్‌జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్‌లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్‌ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు. –నేషనల్ డెస్క్, సాక్షి -
డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవాగ్జిన్ సామర్థ్యం 62.5 శాతం
హైదరాబాద్: భారత్ బయోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్(ఐసీఎంఆర్) బయో ఆర్క్సివ్లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తులకు కోవాగ్జిన్ రెండు డోసుల టీకాలను అందిచడం ద్వారా శరీరంలో ఐజీఎం యాంటీబాడీస్ పెరిగి బాధితులు కోలుకున్నట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. మూడో దశ 3 క్లినికల్ ట్రయల్‌లో డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపించినట్లు తెలిపారు. కాగా కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. ఇక బి.1.617.2 డెల్టా వేరియంట్‌పై సామర్థ్యం 65.2 శాతంగా తేలింది. ఇక దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 46 కోట్ల మైలురాయి దాటింది. 54,94,423 శిబిరాల ద్వారా మొత్తం 46,15,18,479 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,07,81,263 మంది కోలుకున్నారు. -
బ్రెజిల్లో కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు రద్దు
హైదరాబాద్: భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలను బ్రెజిల్లో రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం శనివారం ప్రకటించింది. బ్రెజిల్ మార్కెట్లోకి కోవాగ్జిన్‌ను తీసుకొచ్చేందుకు అక్కడి ప్రెసికా మెడికమెంటోస్, ఎన్విక్సా పార్మాస్యూటికల్స్ ఎల్.ఎల్.సీతో చేసుకున్న అవగాహన ఒప్పందం(ఎంవోయూ)ను రద్దుచేసుకున్నట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెల్సిందే. బ్రెజిల్‌కు ఈ ఏడాది రెండో, మూడో త్రైమాసికాల్లో 2 కోట్ల డోస్‌ల కోవాగ్జిన్ టీకాలను సరఫరా చేసే ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందనే వార్తల నేపథ్యంలో ఈ ఎంవోయూ రద్దయింది. టీకా సరఫరాలో ముడుపులు, అవకతవకల ఆరోప ణలపై బ్రెజిల్ సెనెట్ దర్యాప్తునకు ఆదేశించడం తెల్సిందే. ఒప్పందం రద్దుపై బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ (ఏఎన్వీఐఎస్ఏ)కు భారత్ బయోటెక్ ఓ లేఖ రాయడంతో క్లినికల్ పరీక్షలు రద్దుచేశారు. బ్రెజిల్లో భారత్ బయోటెక్‌కు ప్రెసికా మెడికమెంటోస్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది. అనుమతి పత్రాల సమర్పణ, స్థానికంగా తోడ్పాటు, లైసెన్స్, పంపిణీ, ఇన్సూరెన్స్, మూడో దశ క్లినికల్ పరీక్ష తదితర బాధ్యతలను ప్రెసికా మెడికమెంటోస్ చూసుకునేది. ఇంత వరకూ బ్రెజిల్లో కోవాగ్జిన్ పరీక్షలు చేపట్టనేలేదు. -
Covaxin: రాజకీయ దుమారం.. బ్రెజిల్ డీల్ క్యాన్సిల్!
అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా.. భారత్ బయోటెక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో కుదుర్చుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ త్వరగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మసంస్థ ప్రెసిస మెడికామెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ అనుమతించారు. ఈ క్రమంలో... ఒక్కోడోసు 15 డాలర్ల చొప్పున 300 మిలియన్ డాలర్లు విలువ చేసే 20 మిలియన్ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో సర్కార్ ఒప్పందం చేసుకుంది.. అయితే ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బొల్సొనారోపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవాగ్జిన్‌ను తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్‌కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముడుపులు అందుకున్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీకా అనుమతుల్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఆ వెంటనే.. బ్రెజిల్ సైతం తమ దేశంలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ మూడోదశ నిర్వహించడాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఒప్పందం రద్దైనప్పటికీ .. కోవాగ్జిన్‌ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్ బయోటెక్ కలిసి పని చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
కోవిషీల్డ్ రూ.205.. కోవాగ్జిన్ రూ.215..
న్యూఢిల్లీ: 66 కోట్ల డోసుల కోవిషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందని అధికారులు వెల్లడించారు. వీటిలో 37.5 కోట్ల కోవిషీల్డ్ డోసులను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి, 28.5 కోట్ల కోవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కొనుగోలు చేసింది. ఇవి ఆగస్టు నుంచి డిసెంబర్‌లోగా కేంద్రానికి చేరేలా ఉత్పత్తి ఏర్పాట్లను ఆయా కంపెనీలు చేపట్టనున్నాయి. కేంద్రం కొనుగోలు చేసిన రేట్ల ప్రకారం ఒక్కో డోసు కోవిషీల్డ్ టీకా ధర రూ. 205, కోవాగ్జిన్ రూ. 215గా ఉండనుంది. పన్నులు కలుపుకుంటే కోవిషీల్డ్ ధర రూ. 215.25, కొవాగ్జిన్ ధర రూ. 225.75గా ఉండనుంది. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన నూతన వ్యాక్సిన్ విధానం కారణంగా టీకాల రేట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. -
కోవాగ్జిన్‌పై ఆరు వారాల్లో నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)లో ఏదైనా కొత్త టీకాను చేర్చాలంటే అది నిర్దేశిత పనితీరు స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం మూడు నుంచి నాలుగు ట్రయల్స్‌కు చెందిన వివరాలను డబ్ల్యూహెచ్ఓకు అందించాలని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓలోని నిపుణుల సలహా బృందం ఆయా సమాచారాన్ని విశ్లేషించి అనుమతుల జారీపై తమ సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. కోవాగ్జిన్‌కు చెందిన సమాచారం ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు చేరిందని అని తెలిపారు. నెలన్నరలోగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైజర్/బయోఎన్‌టెక్, ఆస్ట్రాజెనెకా–ఎస్కే బయో/ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సెన్, మోడెర్నా, సినోఫార్మ్ టీకాలను డబ్ల్యూహెచ్‌వో తమ ఈయూఎల్ జాబితాలో ఇప్పటికే చేర్చింది. మరో 105 వ్యాక్సిన్లు కూడా వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని వెల్లడించారు. అందులో 27 వ్యాక్సిన్లు మూడు/నాలుగు ట్రయల్స్‌ను దాటాయని పేర్కొన్నారు. మరో 184 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇటీవల డెల్టా వేరియంట్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. -
డెల్టాపై కోవాగ్జిన్ ప్రభావం 65%
హైదరాబాద్: కోవిడ్ 19 వైరస్ వేరియంట్లపై భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ చూపే ప్రభావం మదింపు గణాంకాలను కంపెనీ వెల్లడించింది. ఫేజ్ 3 ప్రయోగాల విశ్లేషణ అనంతరం కోవాగ్జిన్ టీకా సింప్టమాటిక్ కోవిడ్– 19కు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఈ టీకా తీసుకున్న 12 శాతం మందిలో సాధారణ సైడ్ ఎఫెక్టులు, 0.5 శాతం మందిలో సీరియస్ సైడ్ ఎఫెక్టులు సేఫ్టీ అనాలసిస్ తెలియజేసిందని కంపెనీ వెల్లడించింది. లక్షణాల్లేని కోవిడ్‌కు వ్యతిరేకంగా టీకా 63.6 శాతం రక్షణనిస్తుందని తెలిపింది. సెకండ్ డోస్ ఇచ్చిన రెండువారాల పాటు దాదాపు 25 నగరాల్లో ఫేజ్ 3 ట్రయల్స్‌ను నిర్వహించారు. టీకా ట్రయల్స్‌తో నూతన ఆవిష్కరణలో ఇండియా సత్తా వెల్లడయిందని కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. ఐసీఎంఆర్ సహకారంతో కంపెనీ ఈ టీకా తయారు చేసింది. టీకా ట్రయల్స్ ఫలితాలపై ఐసీఎంఆర్ సంతృప్తిని వ్యక్తం చేసింది. అన్ని రకాల వేరియంట్లపై కోవాగ్జిన్ ప్రభావం చూపుతుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ చెప్పారు. ప్రపంచ టీకా ఉత్పత్తి రంగంలో భారత స్థానాన్ని కోవాగ్జిన్ మరింత బలోపేతం చేసిందన్నారు. వ్యాక్సిన్ డోసులు @ 34.46 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 43,99,298 వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 44,111 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 6 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 50వేలలోపు నిర్ధారణయ్యాయి. కోవిడ్ బారినపడి ఒక్క రోజులోనే మరో 738 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,01,050కు పెరిగాయి. అదే సమయంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా రోగుల సంఖ్య 4,95,533కు చేరింది. 97 రోజుల తరువాత ఈ సంఖ్య 5 లక్షల లోపుకు పడిపోయింది. గత 24 గంటల్లోనే కరోనా చికిత్సలో ఉన్న వారి సంఖ్య 14,104కు తగ్గింది. మరోవైపు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 51 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు 2,96,05,779 మంది కాగా, గత 24 గంటల్లో 57,477 మంది కోలుకున్నారు. అంతకు ముందురోజు కంటే 13,366 మంది అదనంగా కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి శాతం 97.06కు పెరిగింది. -
Covaxin:మూడో దశ ట్రయల్స్ ఫలితాల రిపోర్ట్ విడుదల
నూఢిల్లీ: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాల రిపోర్టును భారత్ బయోటెక్ కంపెనీ శనివారం రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఈ వ్యాక్సిన్ ఓవరాల్‌గా 78 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే... ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న డెల్టా వేరియంట్ విషయంలో ఇది 65.2 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ కంపెనీ... మెడ్‌జివ్‌లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎఫికసీ ట్రయల్‌లో కోవాగ్జిన్ సేఫ్ వ్యాక్సిన్ రుజువైంది అని కంపెనీ తెలిపింది. నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే... జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. "వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరూ చనిపోలేదు. కోవిడ్ వ్యాధిని నిర్మూలించడంలో... ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసింది. ముఖ్యంగా పెద్దవాళ్లలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇది బాగా పనిచేసింది" అని కంపెనీ తెలిపింది. మొత్తం 146 రోజులపాటూ... వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా... అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లు అయ్యింది అని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. దేశంలోని మొత్తం 25 ఆస్పత్రుల్లో మూడో ట్రయల్స్ జరిగాయి. ఇందులో వ్యాక్సిన్ సామర్ధ్యం, సురక్షితమా కాదా... వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతోంది అనే అంశాల్ని పరిశీలించారు. తీవ్రమైన కేసుల్లో ఇది 93.4 శాతం సమర్థతతో పనిచేస్తోందని కంపెనీ తెలిపింది. COVAXIN® Proven SAFE in India's Largest Efficacy Trial. Final Phase-3 Pre-Print Data Published on https://t.co/JJh9n3aB6V pic.twitter.com/AhnEg56vFN — BharatBiotech (@BharatBiotech) July 2, 2021 -
‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్
హైదరాబాద్: దేశీయ కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్‌తో 2 కోట్ల టీకా డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని బుధవారం బ్రెజిల్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఒప్పందంలో అవినీతి సహా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఇప్పటివరకు అడ్వాన్స్ పేమెంట్ ఏదీ తీసుకోలేదని భారత్ బయోటెక్ తెలిపింది. ఒప్పందం కుదుర్చుకునే విషయంలో.. తాము విజయవంతంగా టీకా డోసులను సరఫరా చేసిన పలు ఇతర దేశాలతో అనుసరించిన విధానాన్నే బ్రెజిల్‌తోనూ అనుసరించామని పేర్కొంది. దేశ కంప్ట్రోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ బయోటెక్‌తో కోవాగ్జిన్ టీకా కొనుగోలు ఒప్పందాన్ని జూన్ 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ వైద్య శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని వైద్య శాఖకు చెందిన ఇంటిగ్రిటీ డైరెక్టరేట్ కూడా సమీక్షించిందని, ఒప్పందానికి సంబంధించిన పరిపాలనపరమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఈ నిర్ణయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. బ్రెజిల్ నుంచి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులను తాము స్వీకరించలేదని, అలాగే, బ్రెజిల్‌కు ఇప్పటివరకు టీకాలను కూడా సరఫరా చేయలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ప్రెసికా మెడికామెంటోస్’సంస్థ ‘భారత్ బయోటెక్’కు బ్రెజిల్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్లో నియంత్రణ అనుమతులు, బీమా, లైసెన్స్, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ తదితర విషయాల్లో ఈ సంస్థ భారత్ బయోటెక్‌కు సహకరిస్తోంది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బ్రెజిల్ అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగానే ఒప్పందంపై తాత్కాలిక నిషేధం విధించామని కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ వాగ్నర్ రోస్రియొ తెలిపారు. ‘ఒప్పందానికి సంబంధించిన ఆడిట్‌పై వారం క్రితం ప్రాథమిక విచారణ ప్రారంభించాం. సాధ్యమైనంత త్వరగా విచారణ ముగిస్తాం’అన్నారు. ఒప్పందానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని, అయితే, విచారణ కొనసాగించాలన్న నిర్ణయం నేపథ్యంలో నిబంధనల మేరకు తాత్కాలిక నిషేధం విధించామని బ్రెజిల్ వైద్య మంత్రి మార్సెల్ క్వీరొగా వెల్లడించారు. బ్రెజిల్‌కు 15 డాలర్లకు ఒక డోసు చొప్పున అమ్మేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్ల మధ్య పలు ఇతర దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ‘డెల్టా’పై కొవాగ్జిన్ పనితీరు భేష్: ఎన్ఐహెచ్ డెల్టా వేరియంట్‌పై కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా ఆల్ఫా వేరియంట్‌పైనా ఈ టీకా చక్కగా పనిచేస్తోందని పేర్కొంది. ఎన్ఐహెచ్, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మధ్య పలు శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామ్యం ఉంది. కోవాగ్జిన్ రూపకల్పనలోనూ ఎన్ఐహెచ్ సహకరించింది. -
Covaxin: భారత్ బయోటెక్‌కు మరోసారి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ డీల్‌ను బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2 కోట్ల కోవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కురుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.2,234 కోట్లు, కాగా, వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు ముట్టాయని సెనేటర్స్ ఆరోపణ. దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీతో పాటు.. బ్రెజిల్ ప్రెసిడెంట్‌కి ముట్టినట్టు సెనేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని అంటున్నారు. చదవండి: కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు -
కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు!
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు. మరింత క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని భారత్ భారత్ బయోటెక్‌కు డీసీజీఐ తెలిపినట్లు సమాచారం. దీంతో ఫుల్‌లైసెన్స్ పర్మిషన్ ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కోవాగ్జిన్‌ను గర్బిణీలకు వాడొద్దని డీసీజీఐ తెలిపింది. ఇక ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ వినియోగిస్తున్నారు. కాగా, తాజాగా 77.8శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కొవాగ్జిన్ డేటా ఇచ్చింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్ బయోటెక్ స్పందించలేదు. ఇప్పటికే అమెరికాలో కోవాగ్జిన్ సరఫరాకు యూఎప్‌ఎఫ్‌డీఏ అంగీకరించని సంగతి తెలిసిందే. చదవండి: వైరల్: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ -
కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపింది. ఈ డేటాను సమీక్షించిన కోవిడ్–19 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) దానికి ఆమోదం తెలిపినట్టు మంగళవారం డీసీజీఐ వర్గాలు వెల్లడించాయి. కొవాగ్జిన్ సామర్థ్యాన్ని ఆమోదించిన ఎస్ఈసీ తన సిఫారసులను డీసీజీఐకి పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి జాబితా (ఈయూఎల్)లో కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను చేర్చడానికి ఎప్పట్నుంచో భారత్ బయోటెక్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ టీకా సామర్థ్యాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఈ నెలæ 23న డబ్ల్యూహెచ్ఓ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదే సమయంలో మూడో దశ ప్రయోగాల డేటాకు నిపుణుల కమిటీ అనుమతి లభించడం భారత్ బయోటెక్‌కు ఊరట కలిగించే అంశం. చదవండి: సహకారంతోనే సంస్కరణలు -
కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు
సావో పాలో: భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ సరఫరా కోసం కుదిరిన ఒప్పందం బ్రెజిల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంట్లో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సీపీఐ) ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని ఆరోపణ. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ (అన్విసా)ల అనుమతి పొందని కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎందుకు ఒప్పందం చేసుకుందని, ఏ ప్రయోజనాలు ఆశించిందని ఆరోగ్యరంగ నిపుణులు, సెనేటర్లు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్లను నమ్మరు.. కోవాగ్జిన్‌పై అమితాసక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాగే బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో కోవిడ్–19ను తేలికగా తీసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మాస్కును ధరించకపోవడం... సామాజిక దూరా న్ని పాటించపోవడంతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణలో సరిగా వ్యవహరించకపోవడం వల్లే బ్రెజిల్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆగ్రహావేశాలు దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్నాయి. మూడు నాలుగు రోజుల కిందటే బ్రెజిల్లో కోవిడ్ మరణాలు ఐదు లక్షల మార్కును దాటేశాయి. వ్యాక్సిన్లను పెద్దగా విశ్వసించని బొల్సొనారో కోవాగ్జిన్‌తో ఒప్పందానికి మాత్రం అమితాసక్తి చూపించారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ‘వెంటనే జనవరి 8వ తేదీన భారత ప్రధాని మోదీతో బొల్సొనారో ఫోన్లో మాట్లాడారు. తమకు కోవాగ్జిన్ కావాలని అభ్యర్థించారు. కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రెపిసా మెడికామెంటోస్ ప్రతినిధులు జనవరి 6, 8వ తేదీల్లో ఢిల్లీలోనే ఉన్నట్లు తేలింది. బొల్సొనారోకు ప్రవర్తన కోవాగ్జిన్ కొనుగోలు ఒప్పందంలో తెరవెనుక ఏదో జరిగిం దనే అనుమానాలకు తావిస్తోంది’ అని సెనేట్ కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సెనేటర్ రాండోల్ఫ్ రోడ్రిగ్స్ శనివారం వ్యాఖ్యానించారు. ఒత్తిడి తెచ్చారు కోవాగ్జిన్ దిగుమతికి పూచీ ఇవ్వాల్సిందిగా తనపై అసాధారణ ఒత్తిడి వచ్చిందని బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. మాజీ ఆరోగ్యమంత్రి ఎడ్వర్డో పాజుయెలోకు సన్నిహితుడైన లెఫ్టినెంట్ కల్నల్ అలెక్స్ లియాల్ మారిన్హో ఈ మేరకు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశారని సదరు ఉన్నతాధికారి వెల్లడించారు. కోవాగ్జిన్ కొనుగోలులో ప్రెసిసా మెడికామెంటోస్ పాత్రపై సెనేట్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. కుంభకోణాల నిగ్గుతేలుస్తాం. ఏరకంగా చూసినా ఇది అసాధారణ సేకరణ ఒప్పందమే’ అని ప్యానెల్ ప్రతినిధి, సెనేటర్ రెనాన్ కాల్హీరోస్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రెసిసా మెడికామెంటోస్ మేనేజింగ్ పార్ట్నర్ ఫ్రాన్సిస్కో మాక్సిమియానోను బుధవా రం పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది. మాక్సిమియానో టెలికమ్యూనికేషన్ డేటా మొత్తం సమీకరించి ప్యానెల్‌కు అందుబాటులో ఉంచారు. సెనెటర్ల నుంచి ఆయన లోతైన ప్రశ్నలను ఎదుర్కొనబోతున్నారు. మాక్సిమియానో విచారణ మొత్తం టీవీల్లో ప్రత్యక్షప్రసారం కానుంది. గతకొద్ది రోజులుగా కోవాగ్జిన్ ఒప్పందంపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు సంబంధించిన అంశాలు బ్రెజిల్ టీవీ ఛానళ్లలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. ఏం జరిగింది? భారత్ బయోటెక్ ఉత్పత్తి అయిన కోవాగ్జిన్ 2 కోట్ల డోసులను (టెక్నాలజీని బదిలీ చేసే అంశం కూడా ఉంది) సరఫరా చేయడానికి 300 మిలియన్ డాలర్లు (రూ.2.230 కోట్లు) చెల్లించేలా బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్‌కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్ మధ్యవర్తిగా వ్యవహరించింది. దీనికిగాను ప్రెసిసా మెడికామెంటోస్‌కు ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముట్టాయనే పత్రాలు పార్లమెంటరీ ప్యానెల్ దగ్గర ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో సన్నిహిత గ్రూపులకు ఇందులో వాటా దక్కిందనే అనుమానాలున్నాయి. వీటిపైనే పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తు జరుపుతోంది. 2 కోట్ల వ్యాక్సిన్ కొనుగోలుకు 2,230 కోట్లతో ఒప్పందం చేసుకోగా... ఇందులో మూడోవంతు అంటే 734 కోట్ల రూపాయలు మధ్యవర్తి సంస్థకు దక్కడం పలు సందేహాలకు తావిస్తోంది. అయితే బ్రెజిల్ ఆరోగ్యశాఖ మాత్రం తామింకా ఎలాంటి చెల్లింపులు చేయలేదని చెబుతోంది. 2020 నవంబరులో బ్రెజిల్‌తో భారత్ బయోటెక్‌కు ఒప్పందం కుదిరింది. భారత సాంకేతిక ప్రగతిని ఇదొక నిదర్శనంగా పేర్కొన్నారు. కానీ ఎనిమిది నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా బ్రెజిల్లో ఒక్కరికీ కోవాగ్జిన్ ఇవ్వలేదు. ఎందుకంటే మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను సమర్పించలేదని, సరైన ఉ్పత్పత్తి ప్రమాణాలు లేవని అన్విసా మార్చి 31న కోవాగ్జిన్ వాడకానికి అనుమతి నిరాకరించింది. చివరకు ఈనెల 4వ తేదీన పలు కఠిన షరతులతో 40 లక్షల డోసుల కోవాగ్జిన్ దిగుమతికి అనుమతించింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి రాకముందే... పచ్చజెండా ఊపడం వెనుక బొల్సొనారో ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు. -
Covaxin అనుమతులకై జూన్ 23న డబ్ల్యూహెచ్ఓతో భేటీ
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు కోసం భారత్ బయోటెక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అవసరమైన పత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. అనుమతుల విషయమై డబ్ల్యూహెచ్ఓతో ఈ నెల 23న సమావేశం కానున్నట్లు తెలిపింది. అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం అవసరమైన 90శాతం డాక్యుమెంట్లను గతంలోనే సమర్పించినట్లు కంపెనీ తెలిపింది. మిగతా పత్రాలను ఈ నెలలో అందజేయాల్సి ఉంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కోసం విదేశాంగ శాఖ భారత్ బయోటెక్‌తో సమన్వయం చేస్తోంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇక భారత్‌లో అత్యవసర వినియోగం పొందిన మూడు కోవిడ్ టీకాల్లో కోవాగ్జిన్ ఒకటి. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలో జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి టీకా వేసింది. ఇక మార్చిలో ప్రారంభించిన రెండో దశ టీకా క్యాక్రమంలో భాగాంగా 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వగా.. ఏప్రిల్ 1న మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. చదవండి: Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్ -
Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్
సాక్షి, న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలపై దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయెటెక్ ఉసూరు మనిపించింది. ప్రైవేట్లోఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక విఢుదల చేసింది. తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే తక్కువ ధరకే కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని చెప్పింది. కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం రూ.150లకే అందిస్తున్నామని కోవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటక్ వెల్లడించింది. ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని పేర్కొంది. అలాగే తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువవే ప్రైవేట్ ఆస్పత్రులకు, మిగిలిన వాటిని రాష్ట్రానికి, కేంద్రానికి సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది. నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో ఈ ధరలను అమలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. -
Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్‌కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. సంస్థ అభివృద్ది చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్, యూఎస్ భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్‌తో ప్రతిపాదనలను బైడెన్ సర్కార్ నిరాకరించింది. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ కోవాగ్జిన్‌ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. అయితే ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా ఆమోదం కోసం దాఖలు చేస్తామని కంపెనీ గురువారం తెలిపింది. అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్‌డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ఎ) కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. కోవాగ్జిన్‌కు సంబంధించిన మాస్టర్ ఫైల్‌ను అందజేయాలని ఎఫ్‌డీఏ సూచించినట్లు కూడా ఆక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి తెలిపారు. తమ టీకా కోవాగ్జిన్‌ను యూఎస్‌కు అందించేందు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే కోవాక్సిన్ కోసం మార్కెటింగ్ అప్లికేషన్ కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్ డేటా అవసరమని కంపెనీ భావిస్తోంది. కాగా అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరపున అక్కడి ప్రముఖ ఫార్మా కంపెన ఆక్యుజెన్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది. అయితే మరింత అదనపు సమాచారాన్ని కోరుతూ యూఎస్ఎఫ్డీఏ దీన్ని తిరస్కరించింది. ఆలస్యంగా దరఖాస్తులు చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇండియాలో మూడో దశ క్లినికల్ ప్రయోగాల జూలైలో ఈ డేటాను కంపెనీ అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. మూడో దశ పరీక్షల డేటాను పరిశీలించిన మీదటే డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం అనేక దేశాలు భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను గుర్తించలేదు. అంతేకాదు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో “అన్‌వాక్సినేటెడ్” గానే పరిగణిస్తారు. భారత్ బయోటెక్స్పందన: అమెరికాలో తమ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తిరస్కరణపై భారత్ బయోటెక్ స్పందించింది. అమెరికా ఎఫ్‌డీఏకు పూర్తిస్థాయి క్లినికల్ డేటా ఆక్యూజెన్ అందించిందని వివరించింది. అయితే మరింత సమాచారం అందించాలని ఎఫ్‌డీఏ కోరిందని తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్ పూర్తిస్థాయిలో ఆమోదం పొందేందుకు బయోలాజిక్ లైసెన్స్ అప్లికేషన్ అనుమతి కూడా అవసరమని భారత్ బయోటెక్ తాజా ప్రకటనలో వెల్లడించింది. చదవండి : కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు! oxygen concentrator: పుణే సంస్థ కొత్త డిజైన్ -
‘భారత్ బయోటెక్’కు సీఐఎస్ఎఫ్ భద్రత
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 టీకా ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన భారత్ బయోటెక్ హైదరాబాద్ ప్లాంట్, కార్యాలయాలకు సీఐఎస్ఎఫ్(కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ రిజిస్టర్డ్ ఆఫీసుతోపాటు ప్లాంట్‌కు 64 మంది సీఐఎస్ఎఫ్ సాయుధ సభ్యుల బృందం భద్రత కల్పించనుందని అధికారులు తెలిపారు. -
వ్యాక్సిన్ల కోసం కంపెనీలకు భారీ ఆర్డర్ ఇచ్చిన కేంద్రం..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రోజు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు భారీ ఆర్డరును ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పుణెకు చెందిన సీరం సంస్థకు 25 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. దాంతో పాటుగా భారత్ బయోటెక్ కంపెనీకి 19 కోట్ల కోవాగ్జిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఈ వ్యాక్సిన్ కంపెనీలకు అడ్వాన్స్ కింద 30 శాతం మొత్తాన్ని కేంద్రం చెల్లించింది. కాగా బయోలాజికల్-ఈ కంపెనీకి చెందిన కార్బివాక్స్ డోసులను 30 కోట్ల మేర ఆర్డర్ చేసింది. బయోలాజికల్-ఈ టీకాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి. చదవండి: వ్యాక్సిన్‌పై సందిగ్ధత తొలగించారని ప్రశంసలు -
వ్యాక్సిన్-వ్యాక్సినేషన్.. లెక్కల్లో తేడా!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదా? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు, వాస్తవిక పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా? సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లు కలిపి నెలకు ఎనిమిది కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాయి. కానీ, మే చివరి నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అందే డోసుల లెక్క 5 కోట్లకే తేలుతోంది. మరి మిగతా మూడు కోట్ల డోసుల సంగతేంటి? ఓవైపు ప్రభుత్వం, మరోవైపు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు రోజూ సగటున 27 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించాయి. అదీ రష్యన్ స్పుత్నిక్ను పరిగణనలోకి తీసుకోకుండానే. అయితే మే మొదటి మూడు వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రోజు సగటున 16.2 లక్షల డోసులు మాత్రమే డెలివరీ చేశాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సుమారు 3.4 కోట్ల డోసులు మాత్రమే ఉపయోగించారు. లెక్కల్లో.. నెలకు ఆరు నుంచి ఏడు కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేయగలమని సీరమ్ ఇండియా పదే పదే ప్రకటించుకుంటోంది. ఇక భారత్ బయోటెక్ ఏప్రిల్‌లో 2 కోట్ల కోవాగ్జిన్ డోసుల్ని ఉత్పత్తి చేశామని, మే చివరికల్లా మూడు కోట్ల డోసుల్ని అందిస్తామని చెప్పింది. అంటే ఎలా చూసుకున్నా ఎనిమిదిన్నర కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి కావాలి. కోవిన్ పోర్టల్ ప్రకారం చూసుకుంటే మే 22 రోజులకుగానూ రోజుకి 16.2 లక్షల చొప్పున వ్యాక్సిన్లను డెలివరీ చేశాయి. మే 16 నుంచి 22 మధ్య ఆ డెలివరీ ఏకంగా 13 లక్షల డోసులకు పడిపోయింది. అంటే రోజుకి 9.7 లక్షల డోసులు లెక్క తేడా వస్తోంది. అలాగే కంపెనీలు చెప్తున్న నెల వ్యాక్సిన్ డోసుల అవుట్‌పుట్‌కు, వ్యాక్సినేషన్‌కు తేడా వస్తోంది. ఇప్పుడున్న డెలివరీ ఇలాగే కొనసాగినా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఐదు కోట్ల డోసులతో ముగియొచ్చు. మరి మిగతా మూడుకోట్ల డోసుల మాటేంటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గప్పాలేనా? ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టుకు కేంద్రం వ్యాక్సినేషన్ మీద ఒక అఫిడవిట్ సమర్పించింది. నెలకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆరున్నర కోట్ల కోవిషీల్డ్ డోసులను, భారత్ బయోటెక్ రెండు కోట్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయగలవని అందులో పేర్కొంది. జులై నాటికి కోవాగ్జిన్ సామర్థ్యం ఐదున్నర కోట్లకు పెరుగుతుందని, అలాగే స్ఫుత్నిక్ కోటిన్నర డోసులకు(ఇప్పుడు నెలకు ముప్ఫై లక్షలు ఉంది) పెరుగుతుందని రిపోర్ట్ సమర్పించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి అది జరగకపోవచ్చనే మేధావులు అంచనా వేస్తున్నారు. ఎనిమిదిన్నర కోట్లు ఉత్పత్తి చేసేప్పుడు.. కేవలం ఐదు కోట్లను డెలివరీ చేయడం, ప్రైవేట్ కోటా లాంటి విషయాల్లో క్లారిటీ వస్తేనే డోసుల లెక్క తేలేది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి టైంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
covaxin: డబ్ల్యూహెచ్‌వో లిస్ట్‌లో లేదు!
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’కు కొత్త సమస్య వచ్చిపడింది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌లో ఇంకా కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో చోటు ఇవ్వలేదు. దీంతో కోవాగ్జిన్ డోస్ తీసుకున్నవాళ్లు ఎమర్జెన్సీ అవసరాల కోసం అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లడం కుదరదు. దీంతో డబ్ల్యూహెచ్‌వో నుంచి ఎండోర్స్మెంట్ కోసం కేంద్రం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీకాలు వేసుకున్న విదేశీ ప్రయాణికుల కోసం అనేక దేశాలు తమ సరిహద్దులను తిరిగి తెరవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన ఆ లిస్ట్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు చోటు దక్కలేదు. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం.. కోవాగ్జిన్ డోస్‌లు తీసుకుని విదేశాలకు వెళ్దామనుకుంటున్నవాళ్లకు షాక్ ఇచ్చేదే!. డబ్ల్యూహెచ్‌వో తో పాటు ఇంకా చాలా దేశాలు కోవాగ్జిన్‌ను ఆమోదించలేదు. దీంతో ఇది ఇప్పటికి స్వదేశీ వ్యాగ్జిన్గానే ఉండిపోయింది. బ్రెజిల్ రెగ్యులేటరీ ఇదివరకే కోవాగ్జిన్‌కు నో చెప్పేసింది. కోవాగ్జిన్ డోసులు తీసుకున్నప్రయాణికులను అనుమతించేందుకు ఇప్పటికి కొన్ని దేశాలు మాత్రమే అంగీకరించాయి. మరోవైపు ఇండియాలో, యూకేలో ఉన్న కరోనా స్ట్రెయిన్స్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని భారత్ బయోటెక్ ప్రకటించుకుంది. సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. డబ్ల్యూహెచ్‌వో నుంచి అనుమతి తప్పనిసరి రావాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తకూడదని కేంద్రం భావిస్తోంది. సాధారణంగా వ్యాక్సిన్లను అప్రూవ్ చేసేముందు మరింత క్లినికల్ డేటా, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్‌ను డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తుంది. విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా సోమవారం భారత్ బయోటెక్ ప్రతినిధులతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా 130 కి పైగా దేశాలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను అంగీకరిస్తున్నాయి. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కొనుగోలుకు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)ను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ కోవిïÙల్డ్ ఒక డోస్ రూ.300, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.315, కోవాగ్జిన్ ఒక డోస్ రూ.400, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.415 వంతున చెల్లించనున్నట్లు వివరించారు. -
Corona Vaccine: కోవాగ్జిన్ ఫార్ములా బదిలీకి ఓకే
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్ బయోటెక్ అంగీకరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడి రాష్ట్రాల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో కోవిడ్ 19 టీకాల లభ్యతను గణనీయంగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకు వీలుగా ‘న్యూ లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్ట్రాటెజీ’ని రూపొందించినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సాంకేతిక బదిలీకి సంబంధించి ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫార్మా సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ‘ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్), భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీఒఎల్), అలాగే, ముంబైకి చెందిన హాఫ్కిన్స్ బయోఫార్మా.. ‘కోవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో టీకా సాంకేతికత బదిలీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందాల వెనుక భారత ప్రభుత్వ కృషి ఉందని తెలిపింది. మరోవైపు, ఈ మూడు సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోందని వెల్లడించింది. ఐఐఎల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి, బీఐబీసీఓఎల్, హాఫ్కిన్స్ ఈ సంవత్సరం నవంబర్ నుంచి కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది. ఈ మూడు సంస్థలే కాకుండా, మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీ జరిగి, పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి సాధ్యమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది. ఈ దిశగా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీకి, లైసెన్సుల జారీకి సంబంధించి జాప్యం జరుగుతోందన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంబంధిత వార్తా కథనాలు, ట్వీట్లు అవాస్తవాలని స్పష్టం చేసింది. టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఇతర ఫార్మా కంపెనీలకు కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి వీలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. నేరుగా దిగుమతికీ వెసులుబాటు విదేశాల్లో రూపొందిన, విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ 19 టీకాలను భారత్‌లో వినియోగించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రారంభించామని తెలిపింది. అమెరికా, యూరోప్, జపాన్ తదితర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన.. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిన వ్యాక్సిన్లను భారత్‌లో వెంటనే వినియోగించేందుకు వీలుగా నూతన పాలసీని రూపొందించామని తెలిపింది. తక్షణమే వినియోగించుకునే వీలున్న విదేశీ టీకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారానే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా సమకూర్చుకునే వీలు కూడా కల్పించామని పేర్కొంది. విదేశీ ఉత్పత్తిదారులకు భారత్‌లో ప్రవేశించేందుకు ఆసక్తి కలిగేలా ధరల విధానంలోనూ ఈ కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించింది. మరోవైపు, మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ టీకా ఉత్పత్తిదారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వెల్లడించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని దరఖాస్తు చేసుకోవాలని వారిని కోరుతోందని తెలిపింది. మరోవైపు, కోవిడ్ టీకాలకు మేథో హక్కుల మినహాయింపు కోసం భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపింది. 3ఫార్మా కంపెనీలకూ ఆహ్వానం కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయాలనుకునే ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. తద్వారా టీకాల ఉత్పత్తి పెరిగి, దేశీయంగా వాటి లభ్యత మెరుగుపడుతుందన్నారు. భారత బయోటెక్‌తో అవి ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఇతర ఫార్మా కంపెనీలతో సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. ‘ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ప్రతినిధులతో చర్చించాం. వారు సంతోషంగా స్వాగతించారు’ అని పాల్ తెలిపారు. ‘‘అయితే, ఈ వ్యాక్సిన్‌ను లైవ్ వైరస్‌ను ఇనాక్టివ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ‘బీఎస్ఎల్3’ ల్యాబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మా కంపెనీల్లో ఇవి లేవు’’ అని వివరించారు. -
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం
న్యూఢిల్లీ: 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై కోవాక్సిన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ గురువారం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 2 నుంచి 18ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ ఈ ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేసుకుంది. అనుమతుల విషయంలో కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. జాగ్రత్తగా అన్నీ ప్రోటోకాల్స్ పరిశీలించిన తర్వాత 2-18 ఏళ్ల వయసు చిన్నారులపై టీకా క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్ సమయంలో టీకా 28 రోజుల వ్యవధిలో కండరాల ద్వారా రెండు డోసులు ఇవ్వనున్నట్లు అని ప్రభుత్వం తెలిపింది. ఈ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా, ఎయిమ్స్, నాగ్‌పూర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరగనున్నాయి. ఇక మూడో దశ ప్రయోగాలు జరపడానికి ముందే రెండో దశ క్లినికల్ పరీక్షల భద్రతా డేటా, డీఎస్ఎంబీ సిఫార్సులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని భారత్ బయోటెక్‌కు కమిటీ షరతు విధించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18ఏళ్ల పైబడిన వారందరికీ ఇస్తోన్న విషయం మనకు తెలిసిందే. దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారులకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ లేదు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్‌కు అనుమతులు లభించాయి. చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి -
‘బాబు.. భారత్ బయోటెక్‌ని ఒప్పించి నీ ప్రేమను నిరూపించుకో’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ప్రధానికి రాసిన లేఖపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ కోవాగ్జిన్ పేటెంట్ ఫార్ములాని అందరికి ఇవ్వాలన్నారు. దాని వల్ల వాక్సిన్ త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావచ్చు.. ఈ ముప్పు నుంచి కాపాడవచ్చిన సీఎం జగన్, మోదీకి లేఖ రాశారు. కానీ చంద్రబాబు మాత్రం భారత్ బయోటెక్ ఏ విధంగా పెటేంట్ వదులుకుంటుందని ప్రశ్నిస్తూ.. ఆ కంపెనీకి బ్రోకర్లా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీ మీ బంధువుది అయినంత మాత్రాన ఇవ్వకూడదా’’ అని జోగి రమేష్ ప్రశ్నించారు. ‘‘పెన్సిలిన్ లాంటి సుబ్బామిసైన్ అనే ఔషదాన్ని తయారు చేసిన ఎల్లాప్రగడ సుబ్బారావు వ్యాపారం చేయలేదు. కేంద్రం ప్రభుత్వ ఆధీనంలోనే మెడిసిన్, ఆక్సీజన్, వాక్సిన్ అంతా ఉంది. ప్రజలు చనిపోతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు. బీజేపీ వాళ్లకు వాక్సిన్ కేంద్రం పరిధిలో ఉందని తెలియదా. సీఎం జగన్ మనసుపెట్టి విశాల హృదయంతో అందరికీ వాక్సిన్ ఇవ్వాలని తాపత్రయం పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం నా బంధువులకు సంబంధించిన భారత్ బయోటెక్కే పేటెంట్ ఉండాలని ఆలోచిస్తున్నాడు. ప్రజలు ఈ తేడాని గుర్తించాలి. ఎంతమంది మరణిస్తున్నా వాళ్లకు పేటెంటే’’ ముఖ్యం అంటూ జోగి రమేష్ విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు నువ్వేమన్నా శాస్త్రవేత్తవా.. ఎన్440కే వైరస్ అక్కడ పుట్టింది.. ఇక్కడ పుట్టింది అని చెప్పడానికి. కోవిడ్ ఉంది కదా అని మేము.. నువ్వు, నీ కోడుకు లోకేష్‌లా ఇళ్లలో పడుకోవట్లేదు. మా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కోవిడ్ రోగుల వద్దకు వెళుతున్నారు. మేము కేవలం జూమ్ మీటింగులకు, ట్విట్టర్‌కే పరిమితం కాలేదు’’ అని ఎద్దేవా చేశారు. చదవండి : కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా -
కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీకి కోవాక్జిన్ టీకా సరఫరా చేయడానికి ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ నిరాకరించిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో.. టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని సరఫరాను నిలిపివేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకాలను దుర్వినియోగం చేస్తోందని, మరలా 6.6 కోట్ల వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం క్రూరమైన నేరమంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు చేశారు. వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో 17 పాఠశాలల్లోని 100 కోవాక్జిన్ సెంటర్లను మూసివేయాల్సి వస్తుందని ట్విట్టలో పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకాలు వేయడానికి 1.34 డోసులు కావాలని ఢిల్లీ ప్రభుత్వం కోవాక్జిన్-భారత్ బయోటెక్, కొవిషీల్డ్- సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కోరినట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13.5 లక్షల కేసులు నమోదు కాగా..12.4 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 20,010 మంది మరణించారు. (చదవండి: బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా!) -
కొవాక్జిన్ టీకా: భారత్ బయోటెక్ కీలక నిర్ణయం..!
ఢిల్లీ: ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాక్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే కోవాక్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని భారత్ బయోటెక్ కంపెనీ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల ట్విటర్లో తెలిపారు. అంతేకాకుండా టీకాలను సరఫరా కోసం సంప్రదించిన ఇతర రాష్ట్రాలకు కూడా టీకాల లభ్యతను బట్టి సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొవాక్జిన్ టీకాను సరఫరా చేస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ-కశ్మీర్. జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తొలుత కొవాక్జిన్ టీకాలను రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధరను రూ. 600గా నిర్ణయించింది.తరువాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధర రూ. 400గా నిర్ణయించారు. కొవాక్జిన్ టీకాలను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కొ డోసును రూ.1200 అందించనున్నారు. టీకాలను ఎగుమతి చేసుకునే దేశాలకు సుమారు 15-20 డాలర్లకు అందించనుంది. Glad to announce 🇮🇳Bharat Biotech confirms direct supplies of COVAXIN to the following state govt’s since 1/5/21, based on the allocations received by GoI. Requests have been received from other states, & will be processed for distribution based on availability of stocks 24x7🙏🏼 pic.twitter.com/OHrgXnw5Mj — suchitra ella (@SuchitraElla) May 8, 2021 చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు! -
షాకింగ్: రోడ్డు పక్కన రూ.8 కోట్ల విలువైన టీకాలు
భోపాల్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం టీకా కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నేడు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. టీకాల కొరత వల్ల చాలా రాష్ట్రాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్‌లో దాదాపు రెండున్నర లక్షల టీకా డోసులు ఉన్న లారీని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన నర్సింగపూర్ కరేలి బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. 2.40 లక్షల కోవాగ్జిన్ టీకా డోసులు ఉన్న లారీని కరేలి బస్ స్టాండ్ దగ్గర రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. డ్రైవర్, క్లీనర్ ఎక్కడ ఉన్నారో అర్థం కాలేదు. చాలా సేపటి నుంచి ఆ ట్రక్కు అక్కడే ఆగి ఉంది. ఇది గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. ట్రక్కులో భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన 2,40,000 కోవాగ్జిన్ టీకాలున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ వదిలేసి వెళ్లిన టీకాల ఖరీదు సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తూ.. అతడి మొబైల్ నంబర్ని ట్రాక్ చేశాం. అది హైవేకు సమీపంలో తుప్పల్లో పడి ఉంది. టైర్లు కూడా పంచర్ కాలేదు. ట్రక్ కండీషన్ చాలా బాగుంది. ప్రస్తుతానికి టీకాలు సేఫ్. డ్రైవర్, క్లీనర్ గురించి దర్యాప్తు చేస్తున్నాం. వారీ ఆచూకీ కోసం గాలిస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు -
భారీగా తగ్గిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తమ కోవిడ్ టీకా ‘కోవాగ్జిన్’ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసును రూ.600గా ఇదివరకు నిర్ణయించిన భారత్ బయోటెక్ దాన్ని రూ.400కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్రానికి రూ.150 డోసు చొప్పున అందజేస్తున్న ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులకు అధిక ధరను నిర్ణయించడంపై విమర్శలు రావడం తెల్సిందే. ‘రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్‌ను రూ.400లకు డోసు చొప్పున అమ్మాలని నిర్ణయించాం’ అని భారత్ బయోటెక్ తెలిపింది. సీరమ్ తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రూ.100 తగ్గించి రాష్ట్రాలకు రూ.300లకు డోసు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. ధర తగ్గించిన తర్వాతా.. కోవిషీల్డ్‌తో పోల్చితే కోవాగ్జిన్ ధర ఇంకా రూ.100 ఎక్కువే ఉండటం గమనార్హం. 18–44 ఏళ్ల వయసు వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించిన కేంద్రం దీనికి అవసరమైన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయాలది. సీరమ్, భారత్ బయోటెక్‌లు ప్రైవేటు ఆసుపత్రులకు అందించే టీకా ధరలను (ప్రతిడోసుకు) వరుసగా రూ.600, రూ1,200లుగా నిర్ణయించాయి. -
కోవాగ్జిన్‌తో డబుల్ మ్యూటెంట్‌కి అడ్డుకట్ట
వాషింగ్టన్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ దేశంలోని డబుల్ మ్యూటెంట్‌ను సమర్థంగా అడ్డుకుంటోందని అమెరికాలోని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజరీ ఆఫీసర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. దేశంలో రెండుసార్లు జన్యు మార్పిడికి లోనైన కరోనా వైరస్ బి.1.617 కారణంగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సెకండ్ వేవ్‌ను కోవాగ్జిన్ టీకా అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంటుందని తాము చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు మంగళవారం ఆయన వెల్లడించారు. భారత్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారి డేటాను సేకరించి తాము పరిశీలిస్తే వారిలో బి.1.617 రకం వైరస్‌ను తట్టుకొనే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినట్టుగా డాక్టర్ ఫౌచీ తెలిపారు. భారత్‌లో సెకండ్ వేవ్‌కు అడ్డుకట్ట పడాలంటే అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను జనవరి 3 నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చారు. ఈ వ్యాక్సిన్ 78శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్టుగా పరిశోధనల్లో వెల్లడైంది. కోవాగ్జిన్‌తో పాటుగా, సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ కూడా భారత్ కొత్త రకం కరోనా సమర్థంగా ఎదుర్కొంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐజీఐబీ) అధ్యయనం వెల్లడైనట్టు ఆ సంస్థ డైరెక్టర్ అనురాగ్ వెల్లడించారు. కోవిషీల్డ్‌తో ఇంట్లో 50% కేసులు కట్ లండన్ : అమెరికాకు చెందిన ఫైజర్, బ్రిటన్ ఆ స్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే కుటుంబ సభ్యుల్లో వైరస్ వ్యాప్తిని 50 శాతం తగ్గించవచ్చునని బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్న వారి నుంచి వైరస్ 38 నుంచి 49 శాతం వరకు ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందడం లేదని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)లో అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకోని వారితో కలిసి తిరిగిన 10 లక్ష మంది వివరాలు తెలుసుకొని, ఆ గణాంకాలతో 24 వేల ఇళ్లలో వ్యాక్సిన్ తీసుకున్న వారితో కలిసి మెలిసిన ఉన్న 57 వేల మంది వివరాలను పరిశీలించి చూస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే టీకా తీసుకోని వారి నుంచి ముప్పు అధికంగా ఉంది. టీకా డోసు తీసుకున్న వారు ఒక్కో ఇంట్లో 50 శాతం కేసుల వరకు అడ్డు కట్ట వెయ్యగలిగారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే ఇంటిల్లి పాదికి పాజిటివ్ రావడం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ నిర్వహించిన పరిశోధనలు ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. 17 దేశాలకు విస్తరించిన భారత్ డబుల్ మ్యూటెంట్ జెనీవా: భారత్‌లో రెండు సార్లు జన్యుమార్పిడికి లోనైనా కరోనా వైరస్ 17 దేశాలకు వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్‌ను బి.1.617 భారత్ రకం అని పిలుస్తున్నారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్‌తోనే భారత్‌లో కేసులు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 27 నాటికి భారత్ వైరస్ రకం కేసులు 17 దేశాల్లో బయటపడ్డాయని డబ్ల్యూహెచ్ఒ తన వారంతాపు నివేదికలో వెల్లడించింది. ఈ రకం వైరస్ కేసులో ఎక్కువగా భారత్, బ్రిటన్, అమెరికా, సింగపూర్ నుంచి వస్తున్నాయి. వైరస్‌లకు సంబంధించిన జన్యు మార్పులపై డేటాను సేకరించి భద్రపరిచే జిశాడ్ సంస్థ ఈ వివరాలు అందించినట్టుగా డబ్ల్యూహెచ్ఒ వెల్లడించింది. -
గుడ్‌న్యూస్.. కోవాగ్జిన్తోనే సెకండ్ వేవ్ కట్టడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా కోవాగ్జిన్ సమర్థవంతంగా చెక్ పెడుతున్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మీడియాతో మాట్లాడిన ఆయన సెకండ్ వేవ్ కట్టడికి కోవాగ్జిన్ బాగా పనిచేస్తుందని.. ఈ విషయాన్ని భారత్‌లో నమోదవుతున్న రోజూవారి డాటా ఆధారంగా తాము గుర్తించినట్లు ఆంథోనీ ఫౌసీ తెలిపారు. ‘‘ఇండియాలో రోజూ కరోనా సోకుతున్న వారి డాటాను పరిశీలిస్తున్నాం. అయితే కోవాగ్జిన్ కారణంగా ఇటీవల కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు గుర్తించాం. సెకండ్ వేవ్‌కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్లు తప్పని సరిగా వేయించుకోవాలి’’ అని ఆంథోనీ ఫౌసీ చెప్పినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది. బీ.1.617 వేరియంట్లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన్లు మహారాష్ట్ర, ఢిల్లీలలో నమోదైన కరోనా కేసుల్లో కనిపించే బీ.1.617 వేరియంట్లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన్లు ఉన్నట్లు తేలింది. కాబట్టే దేశంలో సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంది. అయితే కోవాగ్జిన్‌ను వినియోగించడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగి, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారు చేస్తుంది. ఆ ప్రతిరోధకాలు శరీర కణాజాలంలో ఎక్కడో ఓ చోట దాక్కున్న వైరస్‌ని గుర్తించి, దాన్ని నాశనం చేస్తుంది అని నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బీ.1.617 వేరియంట్‌ని 17 దేశాలలో గుర్తించినట్లు అమెరికా హెల్త్ ఏజెన్సీ తెలిపింది. కాగా భారత్, యూకే, యూఎస్, సింగపూర్లలో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తన అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది. భారత్ బయోటెక్ - ఐసీఎంఆర్ భాగస్వామ్యంలో తయారీ భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో కోవ్యాక్సిన్ తయారైంది. ఈ వ్యాక్సిన్‌ను క్లినికల్ ట్రయల్‌లో ఉన్నప్పుడు అత్యవసర వినియోగం కోసం కేంద్రం జనవరి 3 న ఆమోదించిన విషయం తెలిసిందే. -
Covid Vaccine: కరోనా టీకా.. ‘కాస్త టైం పడుతుంది’!
సాక్షి, హైదరాబాద్: కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. యాంటీ వైరల్ మందులు, ఆక్సిజన్‌కు కొరత తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నది వ్యాక్సిన్లే. మరి వ్యాక్సిన్లు అందరికీ అందుతాయా? ఎంత సమయం పడుతుంది? అప్పటిదాకా పరిస్థితి ఏమిటి?.. అందరిలో సందేహాలివే. వీటికి సమాధానం ఒక్కటే.. ‘కాస్త టైం పడుతుంది’! దీనికి పరిష్కారం.. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి అందరికీ అందుబాటులోకొచ్చే వరకు ఓపిక పట్టడం. అలాగని చూస్తూ కూర్చోలేం. బతుకుబండి నడవాలి. ఎవరికి వారు జాగ్రత్తలూ తీసుకుని, నిత్యం చేసుకునే పనులు కొనసాగించాలి. ఐదారు నెలలు దాటితే..: దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు, ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం, మున్ముందు పెరిగే కెపాసిటీ, కొత్తగా వచ్చే వ్యాక్సిన్లు, సరఫరా– పంపిణీల తీరును గమనిస్తే.. మరికొద్ది నెలల పాటు ఇప్పుడున్నట్టుగానే వ్యాక్సినేషన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి టీకా తీసుకునే అనుమతి ఉండగా.. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ లెక్కన మొత్తం 94 కోట్ల మంది టీకాలకు అర్హులు. ఇందులో 45 ఏళ్లుపైబడినవారు సుమారు 26 కోట్ల మంది. వీరిలో ఇప్పటివరకు సుమారు 11.97 కోట్ల మందికి టీకాలు వేయగా.. ఒక డోసు తీసుకున్నవారు సుమారు 10 కోట్లు, రెండు డోసులూ పూర్తయినవారు దాదాపు 2 కోట్ల మంది. అంటే 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కావడానికి సుమారు 38 కోట్ల డోసుల టీకాలు కావాలి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండింటి ఉత్పత్తి సామర్థ్యం కలిపి నెలకు సుమారు ఏడు కోట్ల డోసులే. జూన్, జూలై నెలల నుంచి ఈ సంఖ్య 15–16 కోట్ల డోసులకు పెరుగుతుందని అంచనా. వీటికితోడు స్పుత్నిక్–వి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అంటే మొత్తంగా ఐదారు నెలల తర్వాత వ్యాక్సినేషన్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఈఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 26 నాటికి.. అంటే సుమారు 102 రోజుల్లో వైద్యులు, సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడినవారికి కలిపి 14.50 కోట్ల మందికి మాత్రమే టీకాలు అందాయి. ఇందులోనూ 12 కోట్ల మందికి ఒకే డోసు వేశారు, రెండు డోసులు పూర్తయిన వారి సంఖ్య సుమారు రెండున్నర కోట్లు మాత్రమే. సగటున లెక్కిస్తే.. దేశవ్యాప్తంగా రోజుకు 22 లక్షల మంది టీకాలు వేయగలిగారు. ఇది ఇలాగే కొనసాగితే.. దేశంలో టీకాలకు అర్హులైన 94 కోట్ల మందికి రెండు డోసులు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. జనాభాలో కనీసం 70– 80 శాతం మందికి టీకాలు వేస్తే.. వైరస్ దాదాపు నియంత్రణలోకి వచ్చినట్టేనని, హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్ల వరకు కరోనా ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేసులు భారీగా పెరుగుతూ.. సెకండ్ వేవ్ కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత బాధిత దేశంగా మారిపోయింది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులు నిండిపోయి.. బెడ్లకు, ఆక్సిజన్‌కు, అత్యవసర మందులకు కొరత ఏర్పడింది. ఆక్సిజన్, తగిన చికిత్స అందక రోగులు చనిపోతున్నారు. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 24 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే ఒకటో తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలిచ్చే కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. కానీ టీకాల సరఫరా, పంపిణీలో లోపాలతో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. వ్యాక్సినేషన్ మొదట్లో రోజుకు మూడు, నాలుగు లక్షల డోసులతో ప్రారంభమైనా.. 45 ఏళ్లుపైబడ్డ వారికి ఇవ్వడం మొదలయ్యాక ఊపందుకుంది. కానీ ఏప్రిల్ పదో తేదీ తర్వాత మళ్లీ వేగం తగ్గింది. ఇది చూస్తుంటే జూలై 31 నాటి దేశంలో యాభై కోట్ల మందికి టీకాలివ్వాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలకు 17 కోట్ల టీకాలు వేస్తేనే..! ఈ ఏడాది చివరికల్లా అర్హులైన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అది నెరవేరాలంటే నెలకు 17 కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 94 కోట్ల మంది అర్హులకు రెండు డోసులు పూర్తిచేసేందుకు దాదాపు 188 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం. ఇప్పుడున్నట్టుగా రోజుకు 22 లక్షల డోసుల చొప్పున వేస్తే.. 94 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున ఇచ్చేందుకు అటు ఇటుగా వెయ్యి రోజులు పడుతుంది. అదే ఉత్పత్తి పెంచితే ముందుగా పూర్తవుతుంది. కానీ డిమాండ్‌కు తగినంతగా టీకాల ఉత్పత్తి జరగడం లేదు. దీనితో సమస్యలు ఏర్పడుతున్నాయి. టీకాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ నెలకు దాదాపు ఆరు కోట్ల టీకాలు ఉత్పత్తి చేయగలదు. కేంద్రం ఇటీవల మంజూరు చేసిన రూ.3 వేల కోట్లతో మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకుని, మే నెలాఖరుకల్లా ఉత్పత్తిని పది కోట్ల డోసుల వరకు పెంచుతామని సీరమ్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు భారత్ బయోటెక్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు అరవై లక్షల నుంచి నుంచి కోటీ డోసుల వరకు ఉంది. మే నెలాఖరుకు మూడు కోట్ల డోసులకు, ఆగస్టుకల్లా ఆరు కోట్ల డోసులకు చేరుతుందని అంచనా. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం నెలకు ఏడు కోట్ల డోసుల వరకు అందుబాటులో ఉంటోంది. ఈ లెక్కన ఏడాది చివరికల్లా జనాభాలో 80 శాతం మందికి టీకాలు వేయాలంటే.. ఉత్పత్తి మూడింతలు కావాల్సి ఉంది. జనాభా మొత్తానికి టీకాలివ్వాలంటే నెలకు 22 కోట్ల మందికి వేయాలి. అయితే ఆయా రాష్ట్రాల్లో 18 ఏళ్లపైబడ్డ వారు ఎంత మంది ఉన్నారన్న దాన్నిబట్టి.. 80 శాతం మందికి టీకాలివ్వడం ఆధారపడి ఉంటుంది. దేశంలో 18 ఏళ్లుపైబడిన వారిలో 58 శాతం మంది తొమ్మిది రాష్ట్రాల్లోనే ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఇప్పటి వేగం ప్రకారం చూస్తే.. ఆయా రాష్ట్రాల్లో కొన్నింటిలో 2023 జూన్‌కు గానీ 80 శాతం అర్హులకు టీకాలు ఇచ్చే పరిస్థితి లేదు. విదేశీ వ్యాక్సిన్లు వస్తే ఊరట కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగం కోసం రష్యా తయారీ స్పుత్నిక్ –వి వ్యాక్సిన్‌కు అనుమతులు జారీ చేసింది. సుమారు మూడు కోట్ల డోసుల మేర త్వరలో దిగుమతి కానుంది. దేశంలో ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇంకా కొద్దినెలలు సమయం పట్టనుంది. మరిన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా భారత్‌లో అనుమతి కోసం వేచి ఉన్నాయి. వాటిల్లో దేనికైనా అనుమతి వస్తే మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే వ్యాక్సినేషన్ అనుకున్న మేరకు కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌ను ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించాలని కొంతమంది నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ.. టీకా కార్యక్రమం విషయంలో తెలుగు రాష్ట్రాలు వేగంగానే ఉన్నాయి. అయితే సరైన సమయానికి కేంద్రం నుంచి టీకాలు అందకపోవడంతో వ్యాక్సినేషన్లో కాస్త జాప్యం జరుగుతోంది. ►తెలంగాణలోని నాలుగు కోట్ల జనాభాలో ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 42.89 లక్షలు.. వీరిలో తొలి డోసు వేసుకున్న వారు 37.58 లక్షల మందికాగా.. రెండు డోసులూ తీసుకున్నవారు కేవలం 5.30 లక్షల మంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. అయితే అంత మందికి ఇచ్చేందుకు టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది తేలడం లేదు. ►ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ ఏప్రిల్ 24వ తేదీ నాటికి మొత్తం 56.17 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. ఇందులో ఒక డోసు తీసుకున్న వారు 45 లక్షల మంది వరకు ఉండగా.. రెండు డోసులూ పూర్తిచేసుకున్న వారు 11 లక్షల మంది ఉన్నారు. ఏపీలో 18– 45 మధ్య వయస్కులు రెండు కోట్ల నాలుగు లక్షల మంది కోసం.. రాష్ట్ర ప్రభుత్వం భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ల నుంచి 4.08 కోట్ల డోసుల టీకాలను ఆర్డర్ చేసింది. అప్పటిదాకా ఏం చేయాలి? వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు కొద్ది నెలలు సమయం పడుతుంది. అప్పటివరకు నిబంధనల ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోవాలి. కచ్చితంగా మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి అలవాటుగా చేసుకోవాలి. ఇదే సమయంలో నిత్య జీవితాన్ని యథావిధిగా కొనసాగించాలి. కరోనాకు భయపడి ఇంట్లోనే ఉండిపోవడం, పనులకు వెళ్లకపోవడం వల్ల జీవనోపాధికి దెబ్బపడుతుంది. అందువల్ల పూర్తి జాగ్రత్తలతో ఉద్యోగం, సొంత పనులు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉంటే.. కరోనా సోకే అవకాశాలు అతి స్వల్పంగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. నిర్దేశిత సమయం ప్రకారం తీసుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన జాగ్రత్తలను మరవొద్దు. మరికొంతకాలం పాటు మాస్కులు, భౌతికదూరం వంటివి పాటిస్తే.. అప్పటివరకు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయితే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్టే. -
కోవాగ్జిన్... రాష్ట్రాలకు రూ.600
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ తమ కోవిడ్–19 వ్యాక్సిన్.. ‘కోవాగ్జిన్’ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600 డోసు చొప్పున సరఫరా చేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,200లకు డోసు చొప్పున అందజేస్తామని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట అనుమతించిన విషయం తెలిసిందే. ఉత్పత్తిదారులు 50 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి... మిగతా 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవడానికి వీలుకల్పించింది. అయితే మే 1లోగా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తమ ధరలను బహిరంగంగా ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం దేశంలో రెండు సంస్థల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అస్ట్రాజెనెకా– ఆక్స్‌ఫర్డ్‌లు అభివృద్ధి చేసిన టీకాను పుణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. కోవిషీల్డ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు అందజేస్తామని సీరమ్ ఇదివరకే ప్రకటించింది. కేంద్రానికి రూ.150కే డోసును సరఫరా చేస్తూ... రాష్ట్రాలకు, ప్రైవేటుకు అధికధరలను నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛనిచ్చి జనంపై భారం మోపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు కోవాగ్జిన్ అంతకంటే చాలా ఎక్కువగా ధరలు నిర్ణయించడం గమనార్హం. సీరమ్‌తో పోలిస్తే రాష్ట్రాలకు ప్రతిడోసుకు రూ.200 అధికంగా వసూలు చేయనుంది. ప్రైవేటుకైతే ఏకంగా రెండింతలు ధరను నిర్ణయించింది. ముందస్తు ఒప్పందంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకట్లాగే తాము ఉత్పత్తి చేసేవాటిలో 50 శాతం టీకాలను రూ.150కి డోసు చొప్పున సరఫరా కొనసాగిస్తామని కృష్ణా ఎల్లా చెప్పారు. అయితే బహిరంగ మార్కెట్లో ఈ నష్టాన్ని పూడ్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తు ఆవిష్కరణలకు పెట్టుబడుల సమీకరణకు ఇది తప్పదని, కోవిడ్–19కు ముక్కుద్వారా వేసే టీకా, చికున్‌గున్యా, జికా వైరస్‌లకు టీకాలను అభివృద్ధి చేయడానికి నిధుల ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. -
కొత్తరకం వైరస్‌పై కొవాగ్జిన్ ధీటుగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఫార్ మెడికర్ రీసెర్చి(ఐసీఎంఆర్) బుధవారం ప్రకటించింది. కరోనా కొత్తరకం వైరస్‌ను కూడా కొవాగ్జిన్ అడ్డుకుంటుందని పేర్కొంది. విజయవంతంగా యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను బంధించి కల్చర్ చేసినట్లు పేర్కొంది. దీంతోపాటు ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లను కూడా కొవాగ్జిన్ నిలువరిస్తోందని వెల్లడించింది. కోవిడ్ టీకా తీసుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్ బయోటెక్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. అయితే టీకా తీసుకున్నా మాస్క్ ధరించడం తప్పనిసరి అని డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. టీకా తీసుకున్న వారికి కూడా కోవిడ్ వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో భారత్ బయోటెక్ ఛైర్మెన్ స్పందించారు. వ్యాక్సిన్ కేవలం ఊపిరితిత్తుల కింది భాగాన్ని రక్షిస్తుందని, పై భాగాన్ని కాదని తెలిపారు. అందుకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే కరోనా వచ్చినా కూడా ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని వెల్లడించారు. ఉత్పత్తిని పెంచుతున్నాం కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచనున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలు, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఏటా 70 కోట్ల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరులోని తమ ప్లాంట్లను దశలవారీగా విస్తరిస్తున్నట్లు మంగళవారం వివరించింది. చదవండి: కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం -
వ్యాక్సిన్ల కొరత: రూ.4500 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి నమోదవుతున్న కేసులు సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో జనాలు వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. అయితే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే టీకా డోసులు అయిపోయాయి. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లను పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇందులో 3 వేల కోట్ల రూపాయలను సీరమ్‌కు, 1,500 కోట్ల రూపాయలను భారత్ బయోటెక్‌కు ఇవ్వనున్నట్లు సమాచారం. నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేయడానికి తమకు 3 వేల కోట్ల రూపాయలు అవసరమని సీరమ్ సీఈవో అదార్ పూనావాలా కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు.. వినూత్న విధానాలను కనుగొనడానికి వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం పని చేస్తోందని పూనావాలా చెప్పారు. జూన్ నెలలోగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని సీరమ్ భావిస్తోంది. చదవండి: కరోనా వ్యాక్సిన్.. వేధించే సందేహాలు.. సమాధానాలు -
హాఫ్కిన్ బయో ఫార్మాకు కోవాగ్జిన్ తయారీకి కేంద్రం అనుమతి
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరతను తగ్గించడం కోసం భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారీని ముంబైకి చెందిన హాఫ్కిన్ బయో ఫార్మాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బయోమెడికల్ సంస్థ హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి కేంద్రం నుంచి అనుమతి కోరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. కోవాక్సిన్‌ను ఏడాది వరకు ఉత్పత్తి చేయడానికి హాఫ్కైన్కు అనుమతి మంజూరు చేసినట్లు బయోటెక్నాలజీ విభాగం మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలో భాగం కాని మరో ఫార్మా కంపెనీకి సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడం ఇదే మొదటిసారి. కోవిడ్ సురక్ష మిషన్ కింద భారత్ బయోటెక్‌కు రూ.65 కోట్లు కేంద్రంకేటాయించింది. అలాగే, ముంబైకు చెందిన హాఫ్కిన్ బయోఫార్మాకు కూడా రూ.65 కోట్లు కేటాయించింది. ఈ చర్య వల్ల వచ్చే నెల నుంచి కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం 6 రెట్లు పెరగనుంది. చదవండి: ‘ఆక్సిజన్ సిలెండర్ లభ్యతపై భయాందోళనలు వద్దు’ -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కోవిషీల్డ్ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండియాలోనూ కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఇలాంటి కేసులు ఇప్పటిదాకా దాదాపు 700 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం నమోదైన ఈ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించాయి. ఈ వారం ఆఖరికల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది. -
కోవాక్జిన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు : బ్రెజిల్
రియో డి జనీరో: బ్రెజిల్ పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. అందుకు గాను గత నెలలో బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్జిన్ ను 20 మిలియన్ డోసులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం రోజున కోవాక్జిన్ దాని తయారీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ బ్రెజిల్ భాగస్వామి ప్రెసిసా మెడికామెంటోస్ తో కలిసి ఒక ప్రకటనను విడుదల చేశారు. కోవాక్జిన్‌పై బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ చేసిన ప్రకటనలను సాక్షాధారాలతో నివృత్తి చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని అన్నారు. అంతేకాకుంగా కోవాక్జిన్ భారత్‌తో సహా ఐదు దేశాల్లో ఆమోదించారనే విషయాన్ని గుర్తుచేశారు. భారత్ బయోటెక్ మార్చి 8 న బ్రెజిల్లో టీకా అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు చేసింది. కాగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 918.08 మిలియన్ డాలర్లు కొత్త రుణాలను పంపిణీ చేయాలనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం సంతకం చేశారు. కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలను బోల్సోనారో ఖండించారు. కొత్త రుణాలతో బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని బ్రెజిల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రియో డి జనీరో రాష్ట్రంలో మంగళవారం రోజున తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా బ్రెజిల్ పౌరులు టీకా కోసం ఆస్పత్రుల వద్ద బారులు తీరారు. చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్ -
వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీలో మనదేశం ముందున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల 50లక్షల వాక్సిన్లను ఉత్పత్తి చేసిన భారత్.. 76దేశాలకు 6కోట్ల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేసినట్లు వివరించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకు 25లక్షల మందికి పైగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 3కోట్ల 71లక్షల మందివ్యాక్సిన్ తొలి డోసు, 74లక్షల మంది ఈపాటికే రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగానే సీరమ్ కంపెనీ ..నెలకు 7 కోట్ల కోవిషీల్డ్ డోసులను తయారు చేస్తోండగా, భారత్ బయోటెక్.. నెలకు దాదాపు 40 లక్షల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేస్తోన్నట్లు పేర్కొంది. ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు విషయంలో కేంద్రం గడువు పెంచింది. ప్రస్తుతం కోవిషీల్డ్ తొలివిడతకు, రెండోవిడతకు 4 వారాల అంతరం ఉంది. దీన్ని 8 వారాల వరకు పెంచాలని కేంద్రం సూచించింది. రెండు డోసుల మధ్య 8 వారాల అంతరం విధించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ నిబంధనలు కేవలం కోవిషీల్డ్‌కే వర్తిస్తుందని, కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. చదవండి : విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 46 వేల కేసులు ఢిల్లీలో మరోసారి లాక్డౌన్! -
కరోనా వ్యాక్సిన్.. వేధించే సందేహాలు.. సమాధానాలు
కోవిడ్ నిరోధం కోసం వ్యాక్సిన్ రాకముందు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రజలు వేచిచూశారు. తీరా అందుబాటులోకి వచ్చాక వారిలో వ్యాక్సిన్‌పై అనేక రకాల సందేహాలూ, సంశయాలూ ముప్పిరిగొంటున్నాయి. సాధారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో ఇవి మరీ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికితోడు రక్తం గడ్డకట్టే ధోరణిని పెంపొందిస్తుందా అనే సందేహం తో కొన్నిదేశాల్లో దీని వాడకాన్ని తాత్కాలికంగా ఆపడంతో ఆ సందేహాలు మరింతగా పెరిగాయి. ఇటీవల చాలామందిలో వాక్సిన్ పై సందేహాలూ ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి బ్లడ్ థిన్నర్స్ వాడే వారు వ్యాక్సిన్ తీసుకోవద్దంటూ భారత్ బయోటిక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్లు మన ఫ్యాక్ట్‌షీట్‌లో చెప్పిన అంశాలతో గుండెజబ్బులున్నవారిలో ఈ సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. అలాంటి సంశయాలున్నవారికి వ్యాక్సిన్‌పై అపోహలు తొలిగేలా మరింత విపులమైన సమాధానాలను తెలుసుకోండి...నిశ్చింతగా వ్యాక్సిన్ తీసుకోండి. ►రక్తాన్ని పలుచబార్చే మందులు (బ్లడ్ థిన్నర్స్) వాడేవాళ్లు కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఈ విషయంలో సందిగ్ధత రావడానికి భారత్ బయోటెక్ వాళ్లూ, సీరమ్ ఇన్సి్టట్యూట్ సంస్థ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ కారణమైంది. బ్లడ్ థిన్నర్స్ వాడేవారు ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదని అందులో ఉంది. అయితే వాస్తవానికి బ్లడ్ థిన్నర్స్ తీసుకునేవాళ్లలో ఈ వ్యాక్సిన్ వలన ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమీ ఉండదు గానీ ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర రక్తం గడ్డకట్టే అవకాశం మాత్రం కొంతమేరకు ఉండవచ్చు. అంతకుమించి ఎలాంటి దుష్ఫలితాలూ ఈ మందుల వల్ల వచ్చే అవకాశం ఉండదు. బ్లడ్ థిన్నర్స్ రెండు రకాలుంటాయి. ఒక రకాన్ని ‘యాంటీ ప్లేట్లెట్స్’ అంటారు రెండో రకాన్ని ‘యాంటీ కోయాగ్యులెంట్స్’ అంటారు. యాంటీ ప్లేట్లెట్స్ అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, టికాగ్రిలార్, ప్రాసూగ్రిల్ లాంటివి. ఇవి వాడేవాళ్లు నిర్ద్వంద్వం గా కోవిడ్ వ్యాక్సిన్‌ని తీసుకోవచ్చు. ఈ బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ గా హార్ట్ఎటాక్ వచ్చినవాళ్లు వాడుతూ ఉంటారు. వీటిని వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆపినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వీటిని ఆపకుండానే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందర గుండె జబ్బుల నిపుణుల దగ్గర అనుమతి తీసుకునే అవసరం లేదు. మరొక రకం బ్లడ్ థిన్నర్స్ని ‘యాంటీకోయాగ్యులెంట్స్’ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. వార్‌ఫేరిన్, అసిట్రోమ్ ఇలాంటి మందుల్ని పాత రకం యాంటీకోయాగ్యులెంట్స్ అంటారు. వాల్వ్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు, కొన్ని రకాల కండిషన్ల కారణంగా రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్న వాళ్లు ఈ మందుల్ని వాడుతుంటారు. అలాంటి వారు ఆ మందులు సరైన మోతాదులో సరైన విధంగా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం పీటీ విత్ ఐఎన్ఆర్ అనే పరీక్ష క్రమబద్ధంగా చేయించుకుంటూ ఉంటారు. ఈ పరీక్షని వ్యాక్సిన్ ముందుకూడా చేయించుకోవచ్చు. ఒకవేళ ఈ ఐఎన్ఆర్ పరీక్ష మూడు కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎలాంటి సందేహం లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఐఎన్ఆర్ వాల్యూ మూడు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు గుండె జబ్బు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇకపోతే కొత్తతరం యాంటీ కొయాగ్యులెంట్స్ అనేవి ఇంకొన్ని బ్లడ్ థిన్నర్స్. రివారోక్సబాన్, ఎపిక్సబాన్, డాబిగాట్రాన్ అనే మందులు ఈ కోవకు చెందినవి. ఈ మందులు వేసుకునే వాళ్ళు కూడా కోవిడ్–19 వ్యాక్సిన్‌ని సేఫ్‌గా వేసుకోవచ్చు. బ్లడ్ థిన్నర్స్ వేసుకునే వాళ్లు కోవిడ్ –19 వ్యాక్సిన్ తీసుకునే ముందు వాళ్ల మందుల వివరాలను వ్యాక్సినేషన్ అధికారికి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఇంజక్షన్ తీసుకున్న ప్రదేశాన్ని ఒక ఐదు నిమిషాల పాటు గట్టిగా నొక్కి పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్ళు వాక్సిన్ కోసం వీటిని ఆపడం అనేది కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. అందువల్ల ఏదైనా కారణాల వల్ల ఒకవేళ ఈ మందుల్ని ఆపదలుచుకుంటే మాత్రం వాటికి సంబంధించిన డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందా? ఈ కారణంతో యూరోప్‌లో అనేక దేశాలు వ్యాక్సిన్ ని తాత్కాలికంగా నిలిపివేశారు అనే వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా? ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాక్సిన్ వాడిన తర్వాత కొంతమందిలో రక్తం గడ్డ కట్టిందనే అనుమానంతో కొన్ని యూరోపియన్ దేశాలు ఈ వ్యాక్సిన్‌ని తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే ఆ కంపెనీ అధికారులు, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు... ఈ ముగ్గురూ చెప్పే విషయం ఏమిటంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందికి రక్తం గడ్డకట్టినప్పటికీ వ్యాక్సిన్ వల్లనే రక్తం గడ్డకట్టినట్లుగా ఎలాంటి ఆధారాలూ లేవు అని. లక్షమంది ప్రజల్ని తీసుకున్నట్లయితే వాళ్లలో వ్యాక్సిన్ వాడనప్పటికీ కొంతమందిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వాక్సిన్ తరువాత అదే లక్షమందిలో ఎక్కువమందికి రక్తం గడ్డకడితే గనక అప్పుడు వ్యాక్సిన్ వల్లనే రక్తం గడ్డకట్టే అవకాశం పెరిగిందని అనుకోవచ్చు. కానీ రక్తం గడ్డకట్టే స్వభావం వ్యాక్సిన్ తీసుకోడానికి ముందూ... వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతా ఏ మాత్రం ఎక్కువగా లేదని ఆస్ట్రోజెనికా కంపెనీ చెబుతోంది. మన దేశంలో కూడా వాక్సిన్ తర్వాత వచ్చే దుష్ఫలితాల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి రక్తం గడ్డకట్టే స్వభావం ఇండియా లో ఉన్న ఏ వ్యాక్సిన్‌తోనూ కనపడలేదని తెలుస్తోంది. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత బీపీగానీ, షుగర్ గాని వచ్చే అవకాశం ఉంటుందా? కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందిలో బీపీ ఎక్కువకావడం లేదా మరికొంతమందిలో బీపీ తక్కువ కావడం డాక్టర్ల దృష్టికి వచ్చింది. అయితే ఈ వాక్సిన్ తీసుకోవడం పట్ల ఉన్న అనుమానాలూ, టెన్షన్ల వల్లనే బీపీ పెరగడం గానీ, తగ్గడంగానీ జరుగుతోందని నిపుణుల అభిప్రాయం. బీపీలో ఈ రకమైన మార్పు తాత్కాలికమైనదేననీ, దీర్ఘకాలంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల బీపీగానీ, షుగర్‌గానీ వచ్చే అవకాశం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందా? ఇది పూర్తిగా నిరాధారమైన సందేహం మాత్రమే. వంధ్యత్వం రావడానికి కోవిడ్ –19కీ లేదా కోవిడ్–19 వ్యాక్సిన్‌కీ ఎలాంటి సంబంధమూ లేదు. ►కోవిడ్–19∙వ్యాక్సిన్ తర్వాత కొంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ప్రెగ్నెంట్ కావడం జరిగింది. వాళ్లు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చెయ్యవచ్చా లేక అబార్షన్ చేయించుకోవాలా? గర్భిణీ స్త్రీలూ, పాలిచ్చే తల్లులకు కోవిడ్–19 వ్యాక్సిన్‌ని ప్రస్తుతానికి ఇవ్వకూడదని ఇండియన్ డీసీజీఐ నిర్ణయించింది. ఇప్పటివరకు గర్భవతులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరగలేదు కాబట్టీ, వారిపై ఎలాంటి ట్రయల్స్ నిర్వహించలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని ఈ వ్యాక్సిన్ వల్ల గర్భిణుల్లో ఏమైనా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు గా కూడా ఇప్పటివరకైతే ఎలాంటి దాఖలాలూ లేవు. కాబట్టి గర్భిణులు ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గర్భధారణ జరిగితే గనక అలాంటివారు ఎలాంటి భయాలూ, సందేహాలూ, లేకుండా తమ గర్భధారణ (ప్రెగ్నెన్సీ)ని కొనసాగించవచ్చు. ►వాక్సిన్ వేసుకున్న తర్వాత చేతి దగ్గర నొప్పి లేకపోతే యాంటీబాడీస్ డెవలప్ కావా? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత భుజం దగ్గర నొప్పి రావడం సహజం. నొప్పి ఉన్నప్పుడు మనకి ఆ ఇంజక్షన్ ద్వారా విడుదలైన యాంటిజెన్ పనిచేస్తోందని కూడా తెలుస్తుంది. వ్యాక్సిన్ పట్ల మన శరీరం ప్రతిక్రియ జరపడం (రియాక్షన్ చూపడం) వల్ల కొంత నొప్పి గాని కొన్నిసార్లు జ్వరం గాని రావచ్చు. అయితే బాగా భుజం నొప్పి వచ్చిన వాళ్లకో... లేదా బాగా జ్వరం వచ్చిన వాళ్లకు మాత్రమే యాంటీబాడీస్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయనడానికి ఆధారాలు లేవు. అసలు ఏ నొప్పి లేకపోయినప్పటికీ వాక్సిన్ తర్వాత యాంటీ బాడీస్ పెద్దమొత్తంలో వృద్ధి కావచ్చు. కాబట్టి వాక్సిన్ వేసుకున్న తర్వాత నొప్పి గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎలా చెబుతున్నామో, నొప్పి లేకపోయినా వ్యాక్సిన్ ప్రభావం గురించి భయపడాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పాల్సి వస్తోంది. అంటే... చేతి నొప్పికీ... వ్యాక్సిన్ కారణంగా వృద్ధి అయ్యే యాంటీబాడీస్ సంఖ్యకూ ఎలాంటి సంబంధమూ లేదని అర్థం చేసుకోవాలి. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
హైదరాబాద్‌లో సగం మందికిపైగా కోవిడ్ నిరోధకత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగం మందిలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత్ బయోటెక్‌లు సంయుక్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా రక్త పరీక్షలు నిర్వ హించి, విశ్లేషించగా దాదాపు 54% మందిలో కరోనా వైరస్‌ను అడ్డు కునే యాంటీబాడీలు ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 వార్డుల్లో దాదాపు 9 వేల మంది నుంచి రక్తం సేకరించి తాము ఈ పరిశోధన నిర్వహించామని, ఒకట్రెండు వార్డులు మిన హాయించి మిగిలిన చోట్ల యాంటీబాడీల మోతాదు దాదాపు ఒకేలా ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా గురువారం తెలిపారు. అత్యధికంగా కొన్ని వార్డుల్లో 70% జనాభాలో యాంటీబాడీలు కనిపించగా.. కొన్ని వార్డుల్లో 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు కనిపించినట్లు తెలిపారు. ఇవీ వివరాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలను అంచనా వేసేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. జనవరి మూడో వారం నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు 9 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. 10 ఏళ్ల వయసు మొదలుకొని 70 ఏళ్లపైబడిన వారి వరకు నమూనాలు తీసుకున్నారు. జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు, సిబ్బంది నమూనాల సేకరణ చేపట్టగా సీసీఎంబీ అత్యాధునిక శాస్త్ర వ్యవస్థల సాయంతో ఆ నమూనాల్లో యాంటీబాడీల ఉనికి గుర్తించింది. దాదాపు 53 శాతం మంది పురుషుల్లో యాంటీబాడీలు కనిపించగా, మహిళల్లో ఈ సంఖ్య 56 శాతంగా ఉంది. 70 ఏళ్లపైబడ్డ వారిలో 49 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉన్నాయి. కరోనా కారణంగా వృద్ధులు ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కోవిడ్ బారిన పడ్డ వ్యక్తుల కుటుంబాల్లో 78 శాతం మంది కరోనాకు నిరోధకత పెంచుకోవడం గమనార్హం. రోగులతో సంబంధాలు ఉన్న వారిలో 68 శాతం మంది యాంటీబాడీలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా గదుల సంఖ్య ఎక్కువగా ఉండి.. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న కుటుంబాల్లో వ్యాధి బారిన పడ్డవారు తక్కువగా ఉన్నారని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త ఎ.లక్ష్మయ్య తెలిపారు. 75 శాతం మందికి తెలియదు.. తమకు కోవిడ్ వచ్చి శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు సర్వేలో పాల్గొన్న 75 శాతం మందికి తెలియలేదని లక్ష్మయ్య తెలిపారు. వైరస్ సోకినా లక్షణాలు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు. లక్షణాలు ఉన్న వారితో పాటు, లేనివారిలోనూ 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు ఈ పరిశోధన తెలిపిందని వివరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 18 శాతం మందికి గతంలో కోవిడ్ సోకినట్లు తెలుసని, వీరిలో 90 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు. ఇదే మంచి తరుణం.. జనాభాలో 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన వైరస్ ప్రమాదం తప్పినట్లేనని అనుకోవద్దని, ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని వైరస్‌ను అంతమొందించేందుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. జనాభాలో సగం మందిలో యాంటీబాడీలు ఉండటం మంచి విషయమే అయినా.. అలసత్వం పనికిరాదని, టీకాలు వేసుకోవడం ద్వారా కనీసం 80 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందేలా చూసుకోవాలని తద్వారా మాత్రమే వైరస్‌ను అంతమొందించొచ్చని స్పష్టం చేశారు. మరికొన్ని నెలల పాటు ముఖానికి మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్‌కు చెందిన శాస్త్రవేత్త కృష్ణ మోహన్ పాల్గొన్నారు. -
ప్రధాని మోదీకి తొలి డోస్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(70) ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో సోమవారం ఉదయం 6.30 గంటలకు కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లకుపైగా వయసున్న వ్యాధిగ్రస్తులకు టీకా ఇచ్చేందుకు ఉద్దేశించిన కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేదా ప్రధాని మోదీకి ఇచ్చారని, ఆమెకు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ సహకరించారని అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ‘‘కోవిడ్–19 వ్యాక్సిన్ ఫస్టు డోసు ఈ రోజే తీసుకున్నా. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మన డాక్టర్లు, సైంటిస్టులు సాగిస్తున్న కృషి ప్రశంసనీయం. అర్హులైన వారంతా టీకాను తీసుకోవాలి. అంతా కలిసి భారత్‌ను కరోనారహిత దేశంగా మార్చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. టీకా తీసుకుంటున్న ఫొటోను మోదీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇందులో నర్సు నివేదాతోపాటు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ కూడా కనిపిస్తున్నారు. వ్యాక్సినేషన్ సందర్భంగా మోదీ అస్సామీ సంప్రదాయ కండువా ‘గమోచా’ ధరించారు. టీకా ఇస్తున్నప్పుడు ముఖంపై చిరునవ్వు చెదర నివ్వలేదు. అసలు టీకా ఇచ్చినట్లే అనిపించలేదు ఢిల్లీలో రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రధాని మోదీ ఉదయా న్నే వెళ్లి కరోనా టీకా తీసుకున్నారని అధికారులు చెప్పారు. మోదీకి టీకా ఇచ్చిన నర్సు నివేదా తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే అయిపోయిందా! కనీసం టీకా ఇచ్చినట్లు కూడా నాకు అనిపించలేదు’’ అని మోదీ తనతో అన్నారని తెలిపారు. మూడేళ్లుగా ఎయిమ్స్‌లో పని చేస్తున్నానని, ప్రస్తుతం ఇక్కడి వ్యాక్సిన్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. కరోనా టీకా కోసం ప్రధాని మోదీ వస్తున్నట్లు సోమవారం ఉదయమే తాను ఎయిమ్స్‌కు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. ఆయనను కలవడం, స్వయంగా టీకా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రెండో డోసు కోసం ఆయన 28వ రోజున మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పారు. మోదీ తమతో(నర్సులు) మాట్లాడారని, తాము ఎక్కడి నుంచి వచ్చామన్నది అడిగి తెలుసుకున్నారని వివరించారు. టీకా ఇస్తున్న సమయంలో మోదీ చాలా సౌకర్యవంతంగా కనిపించారని మరో నర్సు రోజమ్మ అనిల్ చెప్పారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అని, మోదీజీ చేతులు జోడించి వణక్కం అంటూ నమస్కారం చేశారని తెలిపారు. టీకా ఇచ్చిన తర్వాత ఆయన అరగంట పాటు పరిశీలనలో ఉన్నారని, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వెల్లడించారు. టీకా తీసుకున్నందుకు మోదీ సంతోషించారని అన్నారు. వెళ్లిపోయే ముందు తమ దగ్గరికి వచ్చి, చేతులు జోడించి థాంక్యూ, వణక్కం అని చెప్పారని రోజమ్మ వివరించారు. ప్రధాని రాక గురించి ఆదివారం రాత్రి పొద్దుపోయాక తమకు సమాచారం అందిందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చెప్పారు. ఉల్లాసంగా.. సరదాగా ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్ సందర్భంగా నరేంద్ర మోదీ చాలా ఉల్లాసంగా కనిపించారు. అక్కడి గంభీరమైన వాతావరణాన్ని తేలికపర్చడానికి నర్సులతో సరదాగా సంభాషించారు. నాకు టీకా వేయడానికి మందంగా ఉన్న ప్రత్యేకమైన సూది, పశువులకు ఇచ్చేలాంటిది ఏదైనా వాడుతున్నారా.. ఎందుకంటే రాజకీయ నాయకులకు తోలుమందం అంటుంటారు కదా! అని అన్నారు. దీంతో అక్కడున్న వైద్య సిబ్బంది హాయిగా నవ్వేశారు. టీకా కోసం జనం బారులు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా మొదలయ్యింది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల వయసుండి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా టీకా తీసుకొని రెండో దశ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. టీకా కోసం అర్హులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల వద్ద బారులు తీరిన దృశ్యాలు దేశమంతటా కనిపించాయి. కొందరు చక్రాల కుర్చీలపై తరలిరావడం విశేషం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో 97 ఏళ్ల రామస్వామి పార్థసారథి సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 90 ఏళ్ల వయసున్న వృద్ధులు టీకా పొందారు. టీకా పంపిణీలో అక్కడక్కడ కొన్ని లోపాలు బయటపడ్డాయి. మరోవైపు కో–విన్ 2.0 పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోలేకపోయామని, అపాయింట్మెంట్ పొందలేకపోయామని కొందరు చెప్పారు. రెండో దశలో మొదటి రోజే దేశంలో పలువురు ప్రముఖులు టీకా తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, గోపాలకృష్ణన్ టీకా వేయించుకున్నారు. ఇలా ఉండగా, కోవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రధానికి హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ సీఎంyీ కృష్ణ ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు. -
భారత టీకాపై చైనా హ్యాకర్ల దృష్టి
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బీజింగ్: కోవిడ్–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది. ‘ఏపీటీ 10’, ‘స్టోన్ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని పేర్కొంది. ‘భారత్ బయోటెక్’, ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్‌లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలున్న సైఫర్మా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కోవిడ్–19 టీకాల్లో దాదాపు 60% భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ –19 వ్యాక్సిన్ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్‌కు పాల్పడుతోందని సైఫర్మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రితేశ్ తెలిపారు. వారి ప్రధాన లక్ష్యం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలు పంచుకుంటున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానేనన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ పబ్లిక్ సర్వర్లు బలహీనమైన వెబ్ సర్వర్లపై ఆధారపడి ఉన్నాయని వారు గుర్తించారని రితేశ్ తెలిపారు. సైఫర్మా వెల్లడించిన ఈ విషయాలపై సీరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, భారత్ బయోటెక్ కానీ స్పందించలేదు. చైనా విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. పవర్ గ్రిడ్ వ్యవస్థపై దాడి కూడా చైనా పనే భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్‌లో కీలకమైన పవర్ గ్రిడ్ వ్యవస్థను మాల్వేర్తో చైనా హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన మరో సంస్థ తాజాగా వెల్లడించింది. దాంతో, గత సంవత్సరం ముంబైలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో భారీ ఆటంకానికి హ్యాకింగే కారణమనే అనుమానాలు తాజాగా తలెత్తాయి. చైనా ప్రభుత్వంతో సంబంధమున్న ‘రెడ్ఎకో’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను పలుమార్లు లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైబర్ నిఘా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ తాజాగా వెల్లడించింది. 2020 జూన్ నుంచి పలుమార్లు 10 ముఖ్యమైన భారతీయ విద్యుత్ సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారంది. రెండు నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ‘ప్లగ్ ఎక్స్ మాల్వేర్ సీ2’ ద్వారా రక్షణ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. కాగా, భారత ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’ పనితీరుపై ఎలాంటి మాల్వేర్ దాడి ప్రభావం చూపలేదని, సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని విద్యుత్ శాఖ ప్రకటించింది. మాల్వేర్ కారణంగా ఎలాంటి డేటాను కోల్పోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, ‘రికార్డెడ్ ఫ్యూచర్’ ఆరోపణలను చైనా ఖండించింది. భారత పవర్ గ్రిడ్‌ను ఆటంకపరిచే హ్యాకింగ్ చర్యల్లో తమ పాత్ర ఉందన్న ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తోసిపుచ్చారు. అక్టోబర్ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. -
చైనా వక్రబుద్ది: టార్గెట్ కోవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: గతేడాది ముంబైలో సంభవించిన భారీ పవర్ కట్ వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉందనే వార్తను చదివాం. తాజాగా డ్రాగన్ దేశం మరో నీచానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిన్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. అంతేకాక ఇప్పటికే పలు దేశాలకు కేంద్రం మన వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. ఇక చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అంత సమర్థవంతమైంది కాదని ఆ దేశానికి చెందిన పలువురు పరిశోధకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా హ్యాకర్లు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ల ఐటీ సిస్టమ్‌ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారట. ఈ విషయాన్ని సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్‌మాన్ సాచ్స్ మద్దతుగల సైఫిర్మా అనే కంపెనీ వెల్లడించింది. చైనీస్ హ్యాకింగ్ కంపెనీ యాప్ట్10 అలియాస్ స్టోన్ పాండ అనే కంపెనీ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కంపెనీల ఐటి మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్వేర్లను హ్యాక్ చేసేందుకు యత్నించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ రేసులో భారత ఫార్మ కంపెనీలను ఢీకొట్టడం.. వాటి మేధో సంపత్తిని నిర్మూలించడం ఈ హ్యాకర్ల ముఖ్య ఉద్దేశం అని సైఫిర్మా వెల్లడించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనికాతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనుంది సీరం. ఈ నేపథ్యంలో చైనా యాప్ట్10 సీరంని టార్గెట్ చేసి.. వ్యాక్సిన్‌కు సంబంధించిన డాటాను కొల్లగొట్టేందుకు యత్నించినట్లు సైఫిర్మా తెలిపింది. యాప్ట్10 అనేది చైనీస్ మినిస్ట్రి ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో కలిసి పని చేస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 2018లో వెల్లడించింది. "సీరం ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే, వారు బలహీనమైన వెబ్ సర్వర్లను నడుపుతున్నారు. వారి పబ్లిక్ సర్వర్లు చాలా బలహీనంగా ఉన్నాయి.. ఇవి హాని కలిగించే వెబ్ సర్వర్లు. యాకర్లు ఈ బలహీనమైన వెబ్ అప్లికేషన్, కంటెంట్-మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా భయంకరమైనది’’ అని సైఫిర్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందన కోరగా.. ఎలాంటి సమాధానం లభించలేదు. అలానే సీరం, భారత్‌బయోటెక్‌లు కూడా దీనిపై స్పందిచలేదు అన్నారు. భారతదేశం, కెనడా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా,అమెరికాలోని కోవిడ్ వ్యాక్సిన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని రష్యా, ఉత్తర కొరియా నుంచి సైబర్ దాడులు జరిగినట్లు మైక్రోసాఫ్ట్ నవంబర్‌లో తెలిపింది. ఉత్తర కొరియా హ్యాకర్లు బ్రిటిష్ ఔషధ తయారీదారు అస్ట్రాజెనీకా వ్యవస్థల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ నివేదించింది. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ ముంబై పవర్‌కట్: డ్రాగన్ పనే!