సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటేసింది. ఈ క్రమంలో హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ శుక్రవారం కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పారు. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కరోనా విరుగుడు టీకా కోవాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ఈ రోజు ప్రారంభమైనట్లు తెలిపారు. రోహతక్‌లోని పీజీఐ (పండిత్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ముగ్గురిపై టీకా ప్రయోగించగా.. వారంతా బాగానే ఉన్నారని.. ఎలాంటి ప్రతికూల ఫలితాలు, దుష్ప్రరిణామాలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా కోవాక్సిన్ మానవ పరీక్షల మొదటి దశను ప్రారంభించినట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈనెల 15న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో ఈ మేరకు కోవ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే ఎయిమ్స్- పట్నాలో ఆస్పత్రి అధికారులు ఎంపిక చేసిన పది మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభించిన విషయం విదితమే. (ఎయిమ్స్-పట్నాలో వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభం)
Human trial with Corona vaccine (COVAXIN) of Bharat Biotech started at PGI Rohtak today. Three subjects were enrolled today. All have tolerated the vaccine very well. There were no adverse efforts.
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) July 17, 2020
Comments
Please login to add a commentAdd a comment