
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ డీల్‌ను బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2 కోట్ల కోవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కురుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.2,234 కోట్లు, కాగా, వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు ముట్టాయని సెనేటర్స్ ఆరోపణ.
దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీతో పాటు.. బ్రెజిల్ ప్రెసిడెంట్‌కి ముట్టినట్టు సెనేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని అంటున్నారు.
చదవండి: కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్‌లో ప్రకంపనలు
Comments
Please login to add a commentAdd a comment