Jair Bolsonaro
-
Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు! బ్రెజిల్ బేజారు బోల్సొనారో అనుయాయుల అరాచకం కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లోనూ అదే జరిగింది. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది. పార్లమెంటుపై దాడులు ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్‌తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు! నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు. ► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్‌తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు. ► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్‌ను తాజాగా తొలగించారు. ► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏం జరగనుంది... పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే. పెరు.. పేదల తిరుగుబాటు అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్‌లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది. పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏమిటి సమస్య? ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్‌ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు. అల్లకల్లోలం ► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి. ► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది. ► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి. ► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటమి తట్టుకోలేక విధ్వంస రాజకీయాలు
-
బోల్సోనారోపై విచారణకు బ్రెజిల్ సుప్రీంకోర్టు ఓకే
రియోడీజనీరో: జనవరి 8వ తేదీన బ్రెజిల్ రాజధానిలో జరిగిన విధ్వంసానికి కారకులను గుర్తించేందుకు మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తదితరులపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత బోల్సోనారో ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘దేశ సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కారణంగానే లులా డిసిల్వా అధ్యక్షుడయ్యారే తప్ప, ప్రజల ఓట్లతో కాదు’ అంటూ అందులో వ్యాఖ్యానించారు. దీనిని బట్టి బోల్సోనారో కొట్లాటలను ప్రేరేపించినట్లుగా ఉందని దేశ ప్రాసిక్యూటర్ జనరల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన వినతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ విచారణకు అనుమతి మంజూరు చేశారు. కాగా, ఆ వీడియోను అనంతరం బోల్సోనారో తొలగించారు. -
ప్రజాస్వామ్య పరిహాస క్రీడ
కింద పడ్డా పైచేయి నాదే అనడమంటే ఇదే. బ్రెజిల్లో ఎన్నికల తుది ఫలితాలొచ్చి రెండున్నర నెలలైనా వాటిలో మతలబు ఉందంటున్న తాజా మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సనారో మాటలు, ఆయన మద్దతుదారుల చేష్టలు అచ్చంగా అలాగే ఉన్నాయి. ఆ దేశ రాజధాని బ్రసీలియాలోనే సైనిక శిబిరాల సమీపంలో మకాం వేసిన బోల్సనారో భక్తులు సైనిక జోక్యంతోనైనా కొత్త దేశాధ్యక్షుడైన వామపక్ష లూలాను పదవి నుంచి తప్పించాలని పట్టుబట్టడం విడ్డూరం. పది వారాలైనా ఫలితం లేక వందల మంది జనవరి 8వ తేదీ ఆదివారం విధ్వంసానికి దిగిన దృశ్యాలు నివ్వెరపరుస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియపై బురద జల్లి, ప్రజాస్వామ్యానికి పాతర వేసే ప్రయత్నాలు ఆందోళనకరం. సరిగ్గా రెండేళ్ళ క్రితం అధ్యక్ష ఎన్నికల అనంతరం అమెరికాలో జరిగిన పరిణామాలను బ్రెజిల్‌లోని తాజా దాడులు గుర్తుచేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైనప్పుడు 2021 జనవరి 6న ఆయన మద్దతుదారులు ఇలాగే వ్యవహరించారు. వాషింగ్టన్‌లోని ఆ దేశ పార్లమెంట్ భవనంపై వారు దాడికి దిగితే, తాజాగా బ్రెజిల్లో బోల్సనారో సమర్థకులు అధ్యక్ష భవనం, పార్ల మెంట్ భవనం, సుప్రీమ్ కోర్ట్లలో చొరబడి, విధ్వంసం సృష్టించారు. ఓటమి పాలయ్యాక జనంలోకి రాకుండా కాలక్షేపం చేస్తున్న బోల్సనారో జనవరి 1న లూలా పదవీ ప్రమాణానికి రెండు రోజుల ముందే అమెరికాకు చెక్కేశారు. కొత్త దేశాధ్యక్షుడికి దండాన్ని అందించే సంప్రదాయాన్నైనా పాటించక ముఖం చాటేయడం ఆయన మనోభావాలకీ, వాస్తవ నిరాకరణ దృక్పథానికీ అద్దం. గత అక్టోబర్ 30న ముగిసిన బ్రెజిల్ ఎన్నికల్లో అతివాద ఛాందస నాయకుడు, అప్పటి దేశాధ్య క్షుడు బోల్సనారో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దేశానికి మరోసారి ఘనకీర్తి కట్టబెడతానని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన ఆయన ఓ పట్టాన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మాటకొస్తే ఎన్నికల్లో ఓటమికి చాలాకాలం ముందు నుంచే ఆయన ఓ పల్లవి అందుకున్నారు. తానంటూ తిరిగి ఎన్నిక కాకపోతే, అది ఎన్నికల్లో మోసం వల్లేనని పాట పాడసాగారు. ప్రజాతీర్పు ప్రతికూలంగా వచ్చాకా ఆ మాటే ప్రచారంలో పెడుతున్నారు. ఆయన సమర్థకుల్లో నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు – ధని కులు, పేదలు – యువకులు, వృద్ధులు... ఇలా అందరినీ కలిపిన సూత్రం – కమ్యూని జమ్‌పై విద్వేషం. అంతా కలసి పార్లమెంటరీ చిహ్నాలపై దాడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఈ ఘర్షణల్లో తన ప్రమేయం లేదని బోల్సనారో చేతులు దులుపుకొంటున్నారు. కానీ, ప్రాసంగిక సాక్ష్యాధారాలు విరుద్ధంగా ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులను ‘దొంగలు’గా పేర్కొంటూ, తాను ఓడిపోతే హింస తప్పదని ఎన్నికలప్పుడే ఆయన సెలవిచ్చారు. ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి నేటికీ సాగుతున్న ఆయన సమర్థకుల నిరసనలు, విధ్వంసాలు అందుకు ఆచరణరూపమే. వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా అనేక రోజుల క్రితమే ఈ దాడులకు వ్యూహం, నిర్వహణ జరిగిందట. బ్రెజిల్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి పదులకొద్దీ బస్సుల్లో వచ్చి, విధ్వంసం రేపిన వ్యక్తుల వెనుక బోల్సనారో పాలనలో యథేచ్ఛగా సాగిన పర్యావరణ విధ్వంసక వర్గాల డబ్బు ఉందనీ వినిపిస్తోంది. ప్రజా స్వామ్య పాలనను అడ్డుకోవాలనే ఈ తెర వెనుక వ్యక్తుల వ్యవహారం మరింత ఆందోళనకరం. రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసి, 2.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కల్పించిన చరిత్ర లూలాది. కమ్యూనిజాన్ని బూచిగా చూపి, అవినీతి ముద్ర వేసి ఓటర్ల దృష్టి మరల్చి, పబ్బం గడుపుకోవాలన్న బోల్సనారో పాచిక తాజా ఎన్నికల్లో పారలేదు. అదీ స్వయంకృతమే. దేశంలో 7 లక్షల పైగా మరణాలతో కరోనా కట్టడిలో వైఫల్యం, అమెజాన్ అడవుల నరికివేత, కునారిల్లిన ఆర్థిక వ్యవస్థ వగైరా ఆయనకు శాపాలయ్యాయి. అయితే, వర్గాలుగా చీలిన సమాజంలో లక్షలాది ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై అపనమ్మకం, లూలా అన్నా, వామపక్షమన్నా లేనిపోని భయం కలిగించడంలో బోల్సనారో కొంత విజయవంతమైనట్టే ఉన్నారు. ఇప్పుడదే దేశానికి పెనుశాపం. తాజా విధ్వంసాలను ఆ కోణంలోనూ చూడాలి. బాధ్యులను గుర్తించి, దురంతాలను ఉక్కుపాదంతో అణచాలి. 1980లలో నిరంకుశత్వం నుంచి బ్రెజిల్ బయటపడినా, బోల్సనారోకు సైనిక నియంతృత్వం పైనే మక్కువ. ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం లేని ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర మితవాదులతో, సంపన్న వర్గాలతో అంటకాగారు. ఆ ప్రయోజనాలకు లూలా అడ్డు అన్నదే ఆయన కడుపు మంట. ఈ సవాలును కొత్త అధ్యక్షుడు ఎంత సమర్థంగా ఎదుర్కొంటారో చూడాలి. ఫాసిస్టు ధోరణులకు అడ్డుకట్ట వేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం, గౌరవం కలిగించడం తక్షణ లక్ష్యం. ట్రంప్ ప్రవర్తన నుంచి ప్రేరణ పొందిన బోల్సనారో ఇకనైనా మూర్ఖత్వం వీడాలి. ఓటమిని హుందాగా అంగీకరించాలి. రాజ్యాంగానికి కట్టుబడేలా తన మద్దతుదారులకు నచ్చజెప్పాలి. ఆగని ఈ ఎన్నికల సంక్షోభం నుంచి ఎంత తొందరగా బయటపడితే 21.5 కోట్ల బ్రెజిలియన్లకూ అంత మంచిది. ‘బ్రిక్స్’ గ్రూపులో çసభ్యదేశంగా, ద్వైపాక్షికంగా బ్రెజిల్‌తో భారత్‌కు సత్సంబంధాలు న్నాయి. బోల్స్‌నారోను గతంలో మిత్రుడిగా భావించిన ప్రధాని మోదీ సైతం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన తాజా ఘటనల్ని ఖండించారు. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్యాలూ ముందుకొచ్చి, మితవాద విద్రోహులకు ఊతమివ్వబోమని తెలిసేలా చేయాలి. ప్రజాస్వామ్య సుస్థిరతకు భంగం కలిగే ఏ పరిణామం వాంఛనీయం కాదు. ఎందుకంటే, బ్రెజిల్ హింసాత్మక గతాన్ని విస్మరించలేం. నియంతృత్వాలకూ, నిరంకుశత్వానికీ పేరుబడ్డ దక్షిణ అమెరికాలో కేవలం కొన్ని పదుల వసంతాల ఈ యువ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ప్రజలు, పార్టీలదే! -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్‌హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్‌కు చెంది ఓ గ్లోబో న్యూస్‌పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
బ్రెజిల్ అల్లర్లు.. గవర్నర్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు..
బ్రెజీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ఆదివారం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 3,000 మంది పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ప్యాలెస్‌పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు. రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
రణరంగంగా బ్రెజిల్.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన
రియో డీ జనీరియో: బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, కాంగ్రెస్, సుప్రీంకోర్టు భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసంచేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చొనే ప్రధాన బల్లాను ధ్వంసంచేశారు. కోర్టు ఆవరణలోని పురాతన విగ్రహాన్ని కూలదోశారు. ‘‘బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలి. డ సిల్వాను దింపేయాలి’’ అని డిమాండ్చేస్తున్నారు. భవనాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లనూ ధ్వంసంచేశారు. వారాంతం కావడంతో భవనాల్లో సిబ్బంది అంతగా లేరు.ఊహించని ఘటనతో ఉలిక్కిపడిన సైన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది. భవనాల ప్రాంగణాల్లోని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌లను ప్రయోగించింది. 300 మందిని అరెస్ట్‌చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని బోల్సోనారో ఒప్పుకోక మద్దతుదారులను ఉసిగొల్పడం ఇంతటి ఆందోళనకు కారణమైంది. రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంట్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన గుర్తుకుతెచ్చింది. ఫాసిస్టు శక్తుల విలయం: డసిల్వా ఆందోళనలపై డ సిల్వా ఆగ్రహించారు. ‘‘ఫాసిస్ట్ శక్తులు చెలరేగిపోయాయి. దీనిపై సత్వరం స్పందించని పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అన్నారు. ఇలాంటి ఘటన జరిగే ప్రమాదముందని కొన్నినెలలుగా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తుండటం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 30న డ సిల్వా గెలుపు తర్వాత మొదలైన నిరసనలు ఆనాటి నుంచి ఆగలేదు. రోడ్ల దిగ్బంధం, వాహనాల దగ్ధం, సైన్యం జోక్యంచేసుకోవాలంటూ సైనిక కార్యాలయాల వద్ద ఆందోళనకారుల బైఠాయింపులతో నిరసనలు దేశమంతటా కొనసాగుతుండటం తెల్సిందే. ప్రపంచ దేశాధినేతల ఆందోళన బ్రెజిల్లో అధికార కేంద్రాలైన ప్రధాన భవనాలపై దాడిని పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. ‘ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ప్రతి చర్యనూ ఖండిస్తాం. పాలనలో అధ్యక్షుడు డ సిల్వాకు సాయంగా ఉంటాం’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. ‘ ఎన్నికల ద్వారా డ సిల్వా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజాభిష్టాన్ని గౌరవించాలి’ అంటూ దాడులను ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆందోళనకారులనుద్దేశిస్తూ.. ‘ఎన్నికలు అనే ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాల్సిందే. ఈ విషయంలో డ సిల్వా సర్కార్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని మోదీ అన్నారు. ⚠️#BREAKING | 📍#BRAZIL THE NATIONAL CONGRESS BUILDING IS BEING TOTALLY OCCUPIED BY PROTESTERS pic.twitter.com/tDKIMcIkiR — Direto da América (@DiretoDaAmerica) January 8, 2023 Some police officers of Rio de Janeiro refuse to disperse Bolsonaro supporters and clearly express their support for the protestors, according to the Clash Report. #Brazil pic.twitter.com/lLkduuBvPD — Stephiereine28🇺🇲🍊 (@stephiereine) January 9, 2023 -
బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు. ఆదివారం(అక్టోబర్ 30) జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోను ఓడించి బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇరువురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్వల్ప తేడాతో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది. తాజా ఎన్నికతో లులా డ సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ప్రెసిడెంట్‌గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వా.. అధికారం కోల్పోయి తర్వాత అవినీతి ముద్రతో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు లులా డ సిల్వా. ‘దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తాను. ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతాం. అలాగే అమెజాన్ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలి. ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలి. ప్రపంచ వ్యాణిజ్యం మరింత పారదర్శకంగా చేస్తాం.’ అని పేర్కొన్నారు లులా. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన క్రమంలో 2018లో పోటీ చేసేందుకు అనర్హులుగా మారారు లులా. 2021లో ఆయనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వాకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అంతర్జాతీయ అంశాలపై సహకారం అందిస్తామన్నారు. Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi — PMO India (@PMOIndia) October 31, 2022 ఇదీ చదవండి: Morbi Tragedy: కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై పుతిన్ సంతాపం -
చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ
ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు.. అమెజాన్ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్లను చంపి ముక్కలుగా నరకడమే కాదు.. విడి భాగాలు దొరక్కుండా పూడ్చిపెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. అమెజాన్ అడవుల్లో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ వ్యవహారాలను బయటపెడతారనే భయంతోనే ఈ జంట హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో తాజాగా ఘోరం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్, అక్రమ చేపల వేట, డ్రగ్స్ రవాణా నేరాలకు నెలవైన ప్రాంతంలో ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన వెంట ఉన్న ఆదిమ తెగకు చెందిన బ్రూనో పెరెయిరా(అమెజాన్ ఆదిమ తెగల హక్కుల పరిరక్షకుడు) హత్యకు గురయ్యారు. వీళ్లిద్దరినీ అక్కడ ఇల్లీగల్ వ్యవహారాలు(చేపల వేట, డ్రగ్స్ మాఫియా) నడిపించే ఒలీవెరియా బ్రదర్స్ హతమార్చినట్లు తేలింది. తొలుత ఈ కేసులో.. అమరిల్డో ఒలీవెరియాను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ద్వారా అమెజోనాస్లోని ఇటాక్యూవాయి నదీ తీరం వెంట పాతిపెట్టిన మృతదేహాల శకలాలను అతికష్టం మీద వెలికి తీశారు బ్రెజిల్ పోలీసులు. ఇందుకోసం నాలుగు రోజులపాటు గాలింపు చర్యలు సాగాయి. ఇక ఈ జంట హత్యల్లో ఒలీవెరియా సోదరుడు ఒసెనే ఒలీవెరియాను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో జరుగుతున్న అక్రమ దందాలను బయటపెట్టే ఉద్దేశంతో.. ఫిలిప్స్,పెరెయిరా విచారణ కోసం వెళ్లారు. అయితే జూన్ 5వ తేదీ నుంచి వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫిలిప్స్ భార్య అలెస్సాండ్రా సంపాయో న్యాయం కోసం పోరాటానికి దిగారు. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు పెరిగింది. మిస్టరీని త్వరగా చేధించాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే.. ఆ ప్రాంతంలో ఇల్లీగల్ వ్యవహారాలకు కారణమయ్యే అమరిల్దోను అరెస్ట్ చేశారు. ఆపై అతన్ని, అతని సోదరుడైన ఒసెనేను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఇద్దరూ కూడా మత్స్యకారులనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిలిప్స్(57) గార్డియన్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ పత్రికలకు పని చేశారు. ఇక పెరెయిరా(41) ఆదిమ తెగల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమవేత్త, న్యాయవాది. బ్రెజిల్ ఆదిమ తెగల వ్యవహారాల సంస్థలో పని చేస్తున్న ఆయన.. సెలవులు తీసుకుని మరీ ఫిలిప్స్ వెంట అమెజాన్ అడువుల్లోకి వెళ్లారు. బోల్సోనారో బలుపు వ్యాఖ్యలు ఇదిలా ఉంటే.. ఈ జంట హత్యల మీద బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘ఆయన(ఫిలిప్స్‌ను ఉద్దేశించి)కు వేరే పని లేదేమో. ఏం దొరకనట్లు.. పర్యావరణ సంబంధిత కథనాలు, ఇల్లీగల్ మాఫియాల మీద స్టోరీలు రాశారు. యూరప్వాడు కదా! బహుశా అందుకే అక్కడి వాళ్లకు నచ్చక.. ఆయన్ని చంపి ఉంటారంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్రభుత్వం పని అడవుల్ని పరిరక్షించడం.. అక్కడి క్రిమినల్స్‌ను నియంత్రించడం కాదు అంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘ఒకవేళ వాళ్లిద్దరినీ చంపి ఉంటే.. కచ్చితంగా నీళ్లలో పడేసి ఉంటారు. ఆ నీళ్లలో పిరానా(రాక్షస చేపలు)లు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు’’ అంటూ తిక్క తిక్క ప్రసంగంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు బోల్సోనారో. అమెజాన్ మీద పుస్తకం రాస్తున్న తరుణంలోనే ఫిలిప్స్ ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. ఇక పరెయిరాకు గతంలోనూ ఇల్లీగల్ మాఫియాల నుంచి బెదిరింపులు వచ్చాయి. అమెజాన్ అడవుల్లో ఇల్లీగల్ దందాలు, కార్యకలాపాలు జరుగుతున్నా.. ఆయా దేశాల ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రెజిల్ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వస్తోంది. -
నరేంద్ర మోదీ.. తగ్గేదేలే!
One Crore Subscription Completed For Modi Youtube: సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా అరుదైన రికార్డు ఆయన సొంతం అయ్యింది. ప్రపంచంలోని టాప్ లీడర్స్‌కు సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్న మోదీ. ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లతో దూసుకుపోతోంది నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్. తాజాగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకుల యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో మోదీనే టాప్. ఆయన దరిదాపుల్లో ఏ ప్రపంచ నేత కూడా లేకపోవడం విశేషం. రెండో ప్లేస్‌లో 36 లక్షల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. 30.7 లక్షల సబ్స్క్రైబర్లతో మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ మూడో స్థానంలో ఉండగా.. 28.8 లక్షల సబ్స్క్రైబర్లతో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మూడో స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం 7.03 లక్షలు మాత్రమే. ఇటు.. దేశంలో మోదీ తర్వాత అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నేతలను గమనిస్తే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కి 4.39 లక్షలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు సీఎం స్టాలిన్‌కి 2.12 లక్షలు, ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2007 అక్టోబరు 26న నరేంద్ర మోదీ పేరిట యూట్యూబ్ ఛానెల్ పప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మోదీకి సంబంధించిన చాలా అంశాల వీడియోలతో పాటు, బాలీవుడ్ ప్రముఖలతో పాల్గొన్న పలు వీడియోలు, కరోనా విజృంభణ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. మిగతా వాటిల్లోనూ.. యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ ప్రధాని మోదీకి ఫాలోవర్లు ఎక్కువే. మోదీ ట్విట్టర్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 7.53 కోట్లు కాగా, ఆయన ఫేస్‌బుక్‌ను 4.68 కోట్ల మంది అనుసరిస్తున్నారు. -
ఆస్పత్రి పాలైన బోల్సోనారో.. కోలుకోవద్దంటూ నెటిజనుల ఆగ్రహం!
సావో పాలో: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు. 66 ఏళ్ల జైర్ బోల్సోనారో 2018 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా టైంలో బోల్సోనారో నిర్ణయాల వల్ల బ్రెజిల్ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. మాస్క్ అక్కర్లేదంటూ, వ్యాక్సినేషన్ వద్దంటూ నిర్ణయాలు తీసుకుని విమర్శలపాలయ్యాడు. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లలా మారిపోవచ్చు తద్వారా బ్రెజిల్లో లక్షల్లో కరోనా మరణాలు సంభవించగా.. బోల్సోనారో తీరును వ్యతిరేకిస్తూ జనాలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం ప్రపంచం మొత్తం వీక్షించింది. ఈ తరుణంలో బోల్సోనారో కోలుకోవద్దంటూ పలువురు సోషల్ మీడియాలో కోరుకుంటుండడం గమనార్హం. - Comecei a passar mal após o almoço de domingo. - Cheguei ao hospital às 03h00 de hoje. - Me colocaram sonda nasogástrica. - Mais exames serão feitos para possível cirurgia de obstrução interna na região abdominal. pic.twitter.com/NPgv6HwoHj — Jair M. Bolsonaro (@jairbolsonaro) January 3, 2022 సంబంధిత వార్త: బోల్సోనారో ఓ ‘రక్తపిశాచి’ అంటూనే.. నిరసనకారుల ఘోర తప్పిదం -
Covaxin: రాజకీయ దుమారం.. బ్రెజిల్ డీల్ క్యాన్సిల్!
అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా.. భారత్ బయోటెక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో కుదుర్చుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ త్వరగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మసంస్థ ప్రెసిస మెడికామెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ అనుమతించారు. ఈ క్రమంలో... ఒక్కోడోసు 15 డాలర్ల చొప్పున 300 మిలియన్ డాలర్లు విలువ చేసే 20 మిలియన్ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో సర్కార్ ఒప్పందం చేసుకుంది.. అయితే ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బొల్సొనారోపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవాగ్జిన్‌ను తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్‌కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముడుపులు అందుకున్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీకా అనుమతుల్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఆ వెంటనే.. బ్రెజిల్ సైతం తమ దేశంలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ మూడోదశ నిర్వహించడాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఒప్పందం రద్దైనప్పటికీ .. కోవాగ్జిన్‌ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్ బయోటెక్ కలిసి పని చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
10 రోజులుగా ఎక్కిళ్లు.. ఆస్పత్రి పాలైన అధ్యక్షుడు
బ్రసీలియా: జైర్ బోల్సోనారోను 10 రోజులుగా వెక్కిళ్లు వేధించసాగాయి. ఆయన పేగులో సమస్య తలెత్తిందని.. ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స అవసరమని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బోల్సోనారోను పరీక్షల కోసం సావో పాలోలోని విలా నోవా స్టార్ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కార్యాలయం బుధవారం పేర్కొంది. ఈ ఘటనపై బోల్సోనారో కుమారుడు ఫ్లావియో మాట్లాడుతూ.. తన తండ్రి బోల్సోనారోను బ్రసిలియాలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా బోల్సోనారో సావో పాలో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే.. ఆస్పత్రిలో బెడ్‌పై పడుకుని పడుకుని, సెన్సార్లు, కేబుళ్లు అమర్చి చికిత్స అందిస్తున్న ఫోటోను పేస్‌బుక్‌లో "ప్రతి ఒక్కరి మద్దతు, ప్రార్థనలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ పోస్ట్ చేశారు. కాగా జైర్ బోల్సోనారో 2018లో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై కత్తితో దాడి చేశారు. ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొవాగ్జిన్ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఖండించారు. అయితే ఇటీవలి జరిగిన ఎన్నికల్లో అతనిపై జనాదరణ తగ్గిపోతోంది. దీంతో ఇది వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు బ్రెజిల్లో 5,35,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
Vaccine Corruption Scandal: బొల్సొనారోకు భారీ షాక్
కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసుల కోసం భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆపై ముడుపుల విమర్శలతో రద్దు చేసుకున్న పంచాయితీ బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనల మధ్య బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు భారీ షాకిచ్చింది అక్కడి అత్యున్నత న్యాయస్థానం. ఈ భారీ కుంభకోణంలో బొల్సొనారోతో సహా కీలక పదవుల్లో ఉన్నవాళ్లను సైతం విచారించాలని దర్యాప్తు బృందాలను ఆదేశించింది బ్రెజిల్ సుప్రీం కోర్టు. సావ్ పాలో: కొవాగ్జిన్ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. శుక్రవారం రాత్రి హడావిడిగా ఆదేశాలను జారీ చేసిన జస్టిస్ రోసా వెబర్.. 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు బ్రెజిల్ కాగ్(సీజీయూ)ను ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది న్యాయస్థానం. తగ్గని ఆగ్రహజ్వాలలు కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది యాంటీ-బొల్సొనారో ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో ఐదు లక్షల మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడంటూ బొల్సొనారోపై హత్యాయత్నం కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ ముడుపుల ఆరోపణలు రావడంతో వాళ్లలో మరింత ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో మూడురోజులుగా రోడెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం సైతం పార్లమెంట్ ఆవరణలో వీళ్లు నిరసనలు చేపట్టారు. ఇక బొల్సొనారోను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పాత-కొత్త ఆరోపణలు(కొవాగ్జిన్ డీల్ అంశం సహా), వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వారంలోనే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. చదవండి: బొల్సొనారో రక్తపిశాచి.. జనాగ్రహంతో పెరిగిన కరోనా! అఘమేఘాల మీద రద్దు కాగా, ఈ ఫిబ్రవరిలో కొవాగ్జిన్ డోసుల కోసం బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒక్కో డోస్‌కు 15 డాలర్ల చొప్పున.. సుమారు 2 కోట్ల డోసుల సరఫరాకు ఆ ఒప్పందం జరిగింది. ఈ డీల్ విలువ వేల కోట్లు కాగా, దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీ ప్రిసిసా మెడికంతోస్తో పాటు.. బొల్సొనారోకు సైతం ముట్టినట్టు ప్రతిపక్ష సెనేటర్లు ఆరోపించారు. అయితే ఈ డీల్‌లో ఆరోపణలతో తమకు సంబంధం లేదని భారత్ బయోటెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ముందస్తు చెల్లింపులు తమకు జరగలేదని, ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. అయితే అత్యవసర అనుమతులు మాత్రం ఈమధ్యే జరిగాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈలోపే బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. చదవండి: వ్యాక్సిన్‌తో మొసళ్లుగా మారుతున్న మనుషులా? -
Covaxin: భారత్ బయోటెక్‌కు మరోసారి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ డీల్‌ను బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2 కోట్ల కోవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కురుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.2,234 కోట్లు, కాగా, వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు ముట్టాయని సెనేటర్స్ ఆరోపణ. దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీతో పాటు.. బ్రెజిల్ ప్రెసిడెంట్‌కి ముట్టినట్టు సెనేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని అంటున్నారు. చదవండి: కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు -
వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు!
బ్రెసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోను సందర్శించి పలు ప్రజా ప్రాజెక్టులను ప్రారంభించడానికి వెళ్లారు. ఆ సమయంలో అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఓ విమానంలోకి ఎక్కి వారికి హలో చెప్పారు. అయితే ఆ క్షణం ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. కాగా వెనుక నుంచి ప్రయాణీకుల్లో కొందరు మధ్య వేలును చూపుతూ.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గెట్ అవుట్, బోల్సోనారో!", "జెనోసిడల్ ఉన్మాది!" అంటూ పలువురు ఘాటుగా విమర్షించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. బయటకు వెళ్లండి అనేవారు గాడిదలపై ప్రయాస్తున్నట్టున్నారు అంటూ చమత్కరించారు. ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిపై పోరులో బోల్సోనారో తరచుగా ఫేస్ మాస్క్‌లు, లాక్డౌన్, వ్యాక్సిన్లను విమర్శించారు. కాగా బ్రెజిల్లో కరోనా మహమ్మారి బారిన పడి 4,80,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అమెరికా తరువాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే చోటుచేసుకున్నాయి. Jair Bolsonaro tried to take a plane. This is how it went. pic.twitter.com/xOer7Kdo2M— Brasil Wire (@BrasilWire) June 11, 2021 చదవండి: వైరల్: పారాచూట్‌తో ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి.. పసుపు కార్డుతో రిఫరీ -
Brazil: జనాగ్రహంతోనూ కరోనా విలయం!
కరోనా జస్ట్ ఎ ఫ్లూ అనే స్టేట్మెంట్ ఇచ్చిన తిట్లు తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో శైలిపై తీవ్ర దుమారం రేగుతోంది. తమ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు కారకుడంటూ ఆయనపై వేల క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో బోల్సోనారోకు వ్యతిరేకంగా ఓవైపు ప్రజలు నిరసనలు చేపడుతుంటే.. ఆ నిరసనల వల్ల కేసుల తారాస్థాయి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్రసీలియా: కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సొంత దేశ ప్రజలు ఆయన మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతులు, ఫలితంగానే వైరస్ వ్యాప్తికి కారకుడయ్యాడంటూ మండిపడుతున్నారు. అయితే బోల్సోనారో మీద కోపంతో చేస్తున్న నిరసనలే ఇప్పుడు అక్కడ కొంప ముంచుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. పెరుగుతున్న కేసులు బోల్సోనారోకి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన కామెంట్స్, పైగా ఇప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు మరోసారి అనుమతులు ఇవ్వడంపై వేల మంది రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడుతున్న వారిలో నిరసనకారులు కూడా ఉంటున్నారని న్యూయార్క్‌కి చెందిన ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రచురించింది. కిందటి నెలలో బ్రసీలియాలో చేపట్టిన పదివేల మంది నిరసనకారుల్లో.. 2 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వాళ్లలో 189 మంది చనిపోయినట్లు ఆ వెబ్ సైట్ కథనం పేర్కొంది. అలాగే పోయిన శనివారం కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు దిగారు. 16 నగరాల్లోని వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు బోల్సోనారోని ‘రక్త పిశాచి’గా పేర్కొంటూ సావోపాలో బెలూన్లు ప్రదర్శించారు. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న సుమారు 22 వేలమంది కరోనా బారినపడ్డారని, 380 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ కథనం ప్రస్తావించింది. మరోవైపు ఈ కథనంపై స్పందించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం నిరాకరించింది. తగ్గని మరణాలు కాగా, బుధవారం తన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి జాతిని ఉద్దేశించి బొల్సొనారో ప్రసగించాడు. ఈ విషయం ముందే తెలియడంతో ఆ టైంకి ప్రజలంతా ప్లేట్లు, చప్పట్లతో నిరసన తెలియజేశారు. అయితే వీధుల్లోకి వేలమంది గుంపులుగా రావడం, మాస్క్‌లు లేకుండా నిరసనల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోందని బ్రెజిల్ ఆరోగ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనల టైంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలా ఉంటే బ్రెజిల్లో మరణాల లెక్కలు మాత్రం తగ్గట్లేదు. బ్రెజిల్లో కరోనా విజృంభణ తర్వాత ఒకానొక తరుణంలో నాలుగు వేలకు పైగానే మరణాలు సంభవించాయి. బుధవారం కూడా లక్ష కేసులు, ఇరవై ఐదు వందలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు సంయమనం పాటించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: రూల్స్ పాటించరా? అయితే.. -
బ్రెజిల్లో మరణ మృదంగం
బ్రెజీలియా: బ్రెజిల్లో కోవిడ్ –19 విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోజుకి సగటున 2 వేల మంది ప్రాణాలను కరోనా బలి తీసుకుంటోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైంది బ్రెజిల్‌లోనే. ఇప్పటివరకు 2,59,271 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నట్టుగా వరల్డో మీటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మొదట్నుంచి నిర్లక్ష్యమే: కరోనాని కట్టడి చేయడంలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో మొదట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. మాస్కులు తప్పనిసరి చేయలేదు. లాక్డౌన్ విధించడానికి ఇష్టపడలేదు. ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. బ్రెజిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఇస్తోంది. ఇప్పటివరకు 71 లక్షల మందికి ఒక్క డోసు, 21 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చింది. కేసుల తీవ్రతకి అమెజాన్ అడవులు బాగా విస్తరించిన మానస్ నగరం నుంచి నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్ పీ1 కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న అభినందన
జెనీవా: కరోనా వైరస్‌తో అతలాకుతలమైన బ్రెజిల్‌కు భారత్ 20 లక్షల డోసుల్ని పంపడంపై బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీని వినూత్నంగా అభినందించారు. కరోనా వ్యాక్సిన్‌ను హనుమంతుడు మోసుకొచ్చిన సంజీవిని పర్వతంతో పోల్చారు. ‘నమస్కార్ ప్రధాని మోదీ, ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక మహమ్మారిని జయించడంలో ఒక అద్భుతమైన భాగస్వామిని పొందడం గౌరవంగా భావిస్తున్నాం. టీకా డోసుల్ని మాకు పంపించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు సంజీవిని పర్వతం స్థానంలో వ్యాక్సిన్ పర్వతాన్ని హనుమంతుడు మోసుకొస్తున్నట్టుగా ఒక చిత్రాన్ని ట్వీట్ చేశారు. భారత్ వ్యాక్సిన్ మైత్రి భేష్: డబ్ల్యూహెచ్ఓ ఇరుగు పొరుగు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఉద్దేశించిన వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు కురిపించింది. భారత్ మాదిరిగా ప్రపంచదేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే త్వరలోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అంశంలో నైబర్ ఫస్ట్ విధానాన్ని అవలంబిస్తున్న ప్రధాని మోదీని అభినందించారు. ‘‘కోవిడ్–19పై మీరు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలు ఒకరికొకరు అన్నీ పంచుకుంటూ ఉంటేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుంది. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం’ అని టెడ్రోస్ ట్వీట్ చేశారు. బోల్సనారో ట్వీట్ చేసిన చిత్రం -
భారత్ సాయాన్ని హనుమాన్తో పోల్చిన బ్రెజిల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపడంతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడిని కాపాడినట్టు తమ దేశాన్ని కాపాడినట్టుగా జైర్ బొల్సనారో భావించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపినందుకు కృతజ్ఞతలు చెబుతూ హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకొస్తున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ‘ధన్యవాద్ భారత్ అంటూ… హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకువస్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘నమస్కార్ ప్రైమ్ మినిష్టర్ మోదీజీ ! కోవిడ్ పై పోరులో మేం చేస్తున్న పోరుకు మీరు కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు.. ఇది మాకు గర్వకారణం కూడా’ అని తెలిపారు. అతడి ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందించారు. ‘కరోనా వైరస్ మీద మనం కలిసికట్టుగా చేస్తున్న పోరాటానికి మా సహకారం ఎప్పటికీ ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో ఉభయ దేశాలూ సహకరించుకోవలసిందే అని గుర్తుచేశారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ను సరిపడా నిల్వలు ఉంచుకుని మిత్ర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రెజిల్‌కి రెండు మిలియన్ల కోవీషీల్డ్ టీకామందు సరఫరా చేశారు. అత్యవసరంగా కోవిడ్ వ్యాక్సిన్ కావాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తికి భారత్ స్పందించి పంపించింది. అయితే కరోనా ప్రారంభ దశలో బ్రెజిల్‌కు మనదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు!
బ్రెసీలియా: కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు. బ్రెజిల్లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఆయన.. ఫైజర్ ఇచ్చిన కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ఏ సైడ్ ఎఫెక్ట్స్‌కు బాధ్యత వహించదని ఉందని, అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సూపర్ హ్యూమన్‌గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా, మొగవాళ్ల గొంతులు మారినా, ఫైజర్ పట్టించుకోదని గుర్తు చేశారు. సోమవారం బైడెన్‌కు వాక్సిన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్‌కు సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇస్తారని అధికారులు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, నమ్మ కం కలిగించేందుకు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఇప్పటికే బైడెన్ చెప్పారు. శుక్రవారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్‌కు, హౌస్ స్పీకర్ నాన్సీపెలోసికి తొలిడోసు ఇచ్చారు. తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని పెన్స్ చెప్పారు. -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే అంతేనట!
కరోనావైరస్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలతో మొదటినుంచీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చంటూ సరికొత్త వివాదానికి తెర తీసారు. అంతేకాదు ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ కోవిడ్ వ్యాక్సిన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా ఆమోదం తెలిపిన ఫైజర్ టీకాపై ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. (టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు) ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అంతానికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బోల్సనారో వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఫైజర్ టీకా తయారీ కంపెనీలపై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ టీకా తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ, మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే, అది మీ సమస్య అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హూమన్‌గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా, పురుషులు వేరేవిధంగా మాట్లాడినా ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా ఇప్పటికే తన శరీరంలో యాంటిబాడీస్ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు. (వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్) కాగా బ్రెజిల్లో ఇప్పటి వరకు 7.1 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందారు. గతంలో కరోనా వైరస్, లాక్‌డౌన్‌పై విభిన్నంగా స్పందించిన బ్రిజిల్ అధ్యక్షుడు కరోనా సాధారణ ఫ్లూమాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించి వివాదంలో నిలిచారు. ఆ తరువాత ఆయన కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
కరోనా వ్యాక్సిన్ తీసుకోను: బోల్సొనారో
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం చేశారు. కోవిడ్-19ను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచీ వ్యాక్సినేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన వ్యాక్సిన్‌ను తీసుకోనంటూ మరోసారి ప్రకటించారు. ఇది నా హక్కు అంటూ బోల్సొనారో పేర్కొన్నారు. కోవిడ్-19ను నిరోధించేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను వీటిని వినియోగించబోనని తెగేసి చెప్పారు. అంతేకాకుండా బ్రెజిల్ దేశ ప్రజలకు సైతం వ్యాక్సిన్ల అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన దేశాలలో బ్రెజిల్ మూడో స్థానంలో నిలుస్తుండటం గమనార్హం! (విలేకరులు పిరికి వాళ్లు: బోల్సొనారో) కరోనా బారిన పడినా.. కాగా బోల్సొనారో సైతం జులైలో కరోనా వైరస్‌బారిన పడ్డారు. అయితే ఇప్పటికే వ్యాక్సినేషన్ల ప్రోగ్రామ్‌లపై బోల్సొనారో పలుమార్లు అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కాగా.. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో మాస్క్‌లు అంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టం కాలేదని అభిప్రాయపడ్డారు. వైరస్‌ను మాస్క్‌లు అడ్డుకుంటున్నట్లు స్వల్ప ఆధారాలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తన పెంపుడు కుక్కకు మాత్రమే అవసరమున్నట్లు అక్టోబర్‌లో ట్విటర్ ద్వారా బోల్సొనారో జోక్ చేశారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రకటనలు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నట్లు ఈ సందర్భంగా ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. (బోల్సొనారోకు మళ్లీ కరోనా పాజిటివ్!) -
చైనాకు షాక్: ‘ఆ వ్యాక్సిన్ కొనుగోలు చేయం’
బ్రసిలియా: చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయదని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వెల్లడించారు. చైనా సినోవిక్ వ్యాక్సిన్‌ను కొనొద్దు అంటూ ఆయన మద్దతుదారులు కొంతమంది ఆయనకు సోషల్‌మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన బోల్సోనారో చైనా వ్యాక్సిన్‌ను తమ దేశం కొనదని తేల్చి చెప్పారు. ఇదిలా వుండగా ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డో పజుఎల్లో రాష్ట్ర గవర్నర్లతో జరిగిన సమావేశంలో సినోవాక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో చేర్చడానికి మంత్రిత్వ శాఖ కొనుగోలు చేస్తుందని చెప్పారు. దీనికి అదనంగా కొన్ని వ్యాక్సిన్లను ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయని చెప్పారు. సావో పాలో స్టేట్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్, బుటాంటన్ ఇన్స్టిట్యూట్, సినోవాక్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తోందని తెలిపారు. ఇక గవర్నర్ జోనో డోరియా మాట్లాడుతూ జనవరిలో ప్రజలకు కరోనా టీకాలు వేయడం ప్రారంభిస్తామని చెప్పారు. దానికి కోసం ఈ ఏడాది చివరి నాటికి హెల్త్ రెగ్యులేటర్ ఆమోదం పొందాలని భావిస్తున్నట్లు తెలిపారు. 46 మిలియన్ మోతాదుల సినోవాక్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశం అనంతరం డోరియా చెప్పారు. కరోనావాక్ అని పిలువబడే వ్యాక్సిన్‌ను 230 మిలియన్ల జనాభా కలిగిన జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చడం సినోవాక్‌కు మంచి గుర్తింపు తీసుకువస్తుందని అన్నారు. బ్రెజిల్ ప్రభుత్వం ఇప్పటికే యూకే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి రియో డీ జనేరియాలోని బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఇలా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదవండి: ‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్ వల్ల కాదు’ -
విలేకరులు పిరికి వాళ్లు: బోల్సొనారో
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి జర్నలిస్ట్‌లపై నోరు పారేసుకున్నారు. విలేకరులంతా పిరికి వాళ్లని... త్వరగా కోవిడ్ బారిన పడతారని.. కోలుకోలేరంటూ తీవ్రంగా దూషించారు. బోల్సొనారో కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘డిఫీట్ కోవిడ్-19’ కార్యక్రమానికి హాజరైన బోల్సొనారో.. తన స్వీయ అనుభవాలను వివరించారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకంతో పాటు తనలోని రోగనిరోధక శక్తి కారణంగానే తాను కోవిడ్‌ను జయించగలిగానని తెలిపారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌లను ఉద్దేశించి ‘మీలో ఎవరైనా కోవిడ్ బారిన పడవచ్చు. కానీ మీకు ధైర్యం లేదు. పిరికివాళ్లు. అందువల్ల మీరు కరోనా నుంచి కోలుకోలేరు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీరు చెడును మాత్రమే సృష్టించగలరు. మీ కలాలను కేవలం చెడును సృష్టించడానికే ఉపయోగిస్తున్నారు. మీరు త్వరగా కోలకోలేరు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బోల్సొనారో. (‘ఇది చాలా భయకంరంగా ఉంది’) కొద్ది రోజుల క్రితం ఒక విలేకరిని మూతి పగలకొడతానంటూ బెదిరించిన సంగతి తెలిసిందే. బ్రెసిలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రాల్ పర్యటన సందర్భంగా బోల్సొనారో భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఒక విలేకరి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహోదగ్నుడైన బోల్సొనారో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మూతి పగులగొడతానంటూ ఆ విలేకరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.