బ్రెసిలియా : భారత్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బ్రెసిలియాలోని ఆసుపత్రికి వచ్చిన బొల్సొనారో మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపించారు. కాగా బొల్సొనారో ఆసుపత్రికి రావడంపై వివిధ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత అధికారులు స్పందించారు. గత కొద్దికాలంగా బ్రెజిల్ అధ్యక్షుడు ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యనే జరిగిన హెర్నియా చికిత్స సమయంలో తన శరీరం భాగంలో ఉంచిన మెష్ భాగం రీప్లేస్‌కు సంబంధించిన విషయం తెలుసుకునేందుకు వైద్యులను కలిసి వెళ్లినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో బొల్సొనారోను పరీక్షించిన వైద్యులు మెష్ భాగం రీప్లేస్ అంశంపై వైద్యులు ధృవీకరించనున్నట్లు తెలిపారు. కాగా 2018లో బొల్సొనారో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక వ్యక్తి బ్రెజిల్ అధ్యక్షుడిపై కత్తితో ఉదర భాగంలో దాడికి పాల్పడ్డాడు. దీంతో బొల్సొనారో శరీర భాగానికి నాలుగు సర్జరీలు జరిగాయని, ఈ మధ్యనే హెర్నియా చికిత్స కూడా చేయించుకున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment