
జెయిర్ బొల్సోనారో
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగే 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో ప్రత్యేక అతిథిగా రానున్నారు. దీనికోసం నేడు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక బొల్సోనారో భారత్‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవనున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. కాగా భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధక్షుడు ప్రత్యేక అతిథిగా విచ్చేయడం ఇది మూడోసారి. 2004లో తొలిసారిగా బ్రెజిల్ అధ్యక్షుడు రిపబ్లిక్ డేకు హాజరైన విషయం తెలిసిందే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment