రియోడీజనీరో: జనవరి 8వ తేదీన బ్రెజిల్ రాజధానిలో జరిగిన విధ్వంసానికి కారకులను గుర్తించేందుకు మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తదితరులపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత బోల్సోనారో ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
‘దేశ సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కారణంగానే లులా డిసిల్వా అధ్యక్షుడయ్యారే తప్ప, ప్రజల ఓట్లతో కాదు’ అంటూ అందులో వ్యాఖ్యానించారు. దీనిని బట్టి బోల్సోనారో కొట్లాటలను ప్రేరేపించినట్లుగా ఉందని దేశ ప్రాసిక్యూటర్ జనరల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన వినతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ విచారణకు అనుమతి మంజూరు చేశారు. కాగా, ఆ వీడియోను అనంతరం బోల్సోనారో తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment