న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ భారత్ తన జోరు చూపిస్తోంది. వివిధ దేశాల్లో 150కి పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతూ ఉంటే భారత్ కూడా తన సత్తా చాటుతోంది. మన దేశంలో టీకా అభివృద్ధి రేసులో 7 ఫార్మా కంపెనీలు దూసుకుపోతున్నాయి.
ఆ ఏడూ ఇవే..
భారత్ బయోటెక్, సెరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ కాడిలా, పనాసియా బయోటెక్, బయోలాజికల్ ఈ , ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మైన్వాక్స్ స్వదేశీ ఫార్మా సంస్థలు కోవిడ్ టీకా తయారీలో తలమునకలై ఉన్నాయి.
ఏ సంస్థ పరిశోధనలు ఎంతవరకు ?
► హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు మొదటి, రెండో దశ ప్రయోగాలకు అనుమతులు లభించాయి. గత వారమే మనుషులపై ప్రయోగాలు మొదలు పెట్టింది.
► దేశంలోనే వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సంస్థ సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ 3 దశ క్లినికల్ ప్రయోగాల్లో ఉంది. ఈ ఏడాది చివరికి టీకాను అభివృద్ధి చేస్తామని ఆ సంస్థ అంటోంది. అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ కోడాజెనిక్స్‌తో పాటు మరిన్ని దేశాలు చేస్తున్న పరిశోధనల్లో ‘సెరమ్’ పాల్గొంటోంది.
► జైడస్ కేడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్–డి టీకా మరో 7 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసే దిశగా ముందుకుసాగుతోంది.
► పనాసియా బయోటెక్ కంపెనీ అమెరికాకు చెంది రెఫానా ఇంక్ కంపెనీతో కలిసి ఐర్లాండ్‌లో జాయింట్ వెంచర్‌ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో ముం దుంది. రెఫానా భాగస్వామ్యంతో ఈ కంపెనీ 50 కోట్ల టీకా డోసుల్ని సిద్ధం చేసే పనిలో ఉంది. వచ్చే ఏడాదికి టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.
► నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ)కి అనుబంధంగా నడిచే ఇండియన్ ఇమ్యునోలాజికల్ సంస్థ వ్యాక్సిన్ తయారీకి ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.
► బయోలాజికల్ ఈ, మైన్వాక్స్ సంస్థలు కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి కానీ ఆ సంస్థల పరిశోధనలు ఎంతవరకు వచ్చాయో అధికారిక సమాచారం లేదు.
టీకా రేసులో భారత్ జోరు
Published Mon, Jul 20 2020 3:03 AM | Last Updated on Mon, Jul 20 2020 4:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment