pharma companies
-
పోరాటం ఫలించింది!
దుద్యాల్: వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని ప్రలు గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటం ఫలించిందని, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఫార్మా కంపెనీల రాకను అడ్డుకోగలిగామని పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్లకుంట తండా, లగచర్ల, హకీంపేట్ గ్రామాల ప్రజలు సంబరపడుతున్నారు. వ్యవసాయ భూములే తమ కు దిక్కని, ఇతర కంపెనీల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.లగచర్లలో భూసేకరణపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై స్థానికులు దాడి చేశారనే వార్తలు సంచలనం సృష్టించాయి. లగచర్ల ఘటన తర్వాత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గురించి దేశ వ్యాప్త చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన సీఎం.. దుద్యాల్ మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పా టును రద్దు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఐదు గ్రామాల్లో 1,358.37 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. ఫార్మా విలేజ్ కోసం భూములు సేకరించేందుకు మండల పరిధిలోని పోలేపల్లిలో గత అక్టోబర్ 18న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించగా అధికారులు నమోదు చేసుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండానే సమావేశం పూర్తయింది. అనంతరం అక్టోబర్ 25న లగచర్లలో చేపట్టిన సమావేశానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ వాహనాన్ని రోటిబండతండా వద్ద ఆపారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులను దుర్భాషలాడటంతో ఆగ్రహానికి గురైన తండా వాసులు ఆయనపై దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో అప్పటి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం అర్ధంతరంగా నిలిచిపోయింది.ఆ తర్వాత నవంబర్ 11న లగచర్ల రైతుల ప్రజాభిప్రాయ సేకరణ కొరకు దుద్యాల్, లగచర్ల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర ప్రసాద్, తహసీల్దార్ కిషన్ తదితరులు సమావేశ స్థలానికి చేరుకున్నారు. కానీ రైతులెవరూ అక్కడికి రాకపోవడంతో అధికారులు లగచర్లకు వెళ్లారు. గ్రామస్తులకు విషయం వివరించేందుకు ప్రయతి్నస్తుండగానే అధికారులపై దాడి తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
రూ. 5,260 కోట్ల పెట్టుబడులు.. 12,490 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాలుష్యరహిత గ్రీన్ ఫార్మా యూనిట్లను నెలకొల్పేందుకు, ప్రస్తుతమున్న కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటెరో ల్యాబ్స్ కంపెనీలు రూ. 5,260 కోట్ల పెట్టుబడులకు సంబంధించి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి.ఈ పెట్టుబడుల ద్వారా కొత్తగా 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రతిపాదిత ఫార్మాసిటీలో ఈ కంపెనీల యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలో తొలుత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వివి రవికుమార్, గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, హెటెరో గ్రూప్ ఎండీ బి.వంశీకృష్ణ సమావేశమయ్యారు.ఈ భేటీలో టీఎస్ఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంవోయూలపై కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించడంతోపాటు ఫార్మాసిటీలో సదుపాయాలు కలి్పంచాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. యూనిట్లు ఇలా.. ఈ ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లే»ొరేటరీ తయారీ యూనిట్‌తోపాటు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పనున్నాయి. అలాగే గ్లాండ్ ఫార్మా సంస్థ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టెన్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను స్థాపించనుంది. ఇక డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేయనుండగా హెటెరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. -
దొరా.. మా భూములు లాక్కోవద్దు
కొడంగల్, దుద్యాల్: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది. ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.ఫార్మా వద్దు.. పరిహారం వద్దుఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు. -
ఔషధ పరిశోధన రంగం వృద్ధికి సూచనలు
దేశీయంగా ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి భవిష్యత్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డెలాయిట్, అసోచామ్ సంయుక్త నివేదిక తెలిపింది. ఈ దిశగా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, మేధో సంపత్తి (ఐపీ) హక్కులను కాపాడడం, ఆవిష్కరణలను ప్రోత్సాహించడం కీలకమని పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి ఇప్పటికీ విధానపరమైన సవాళ్లు నెలకొంటున్నట్లు తెలిపింది. నియంత్రణ కార్యాచరణను ఆధునికీకరించడం, అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో భారత ఫార్మా రంగం సమన్వయం చేసుకుంటుందని నివేదిక తెలిపింది. అయితే ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని సూచించింది.నివేదికలోని వివరాల ప్రకారం..ఔషధ నియంత్రణల పరంగా అత్యాధునిక పరీక్షా కేంద్రాల కొరత ఉంది. తయారీ యూనిట్లలో క్వాలిటీ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు బలమైన కార్యాచరణ లేదు. దాంతో ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) వెనకబడుతోంది. ఏకరూప నియంత్రణ నిబంధనలు అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయానికి అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న వివిధ నియంత్రణ సంస్థల మధ్య సమన్వయలోపం ఉంది. పాలనా పరమైన సమస్యల వల్ల ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్ అనుమతులకు అదనపు సమయం అవసరమవుతుంది. ఫలితంగా అత్యున్నత నాణ్యతతో కూడిన క్లినికల్ పరిశోధనలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా నిలవలేకపోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి చూస్తే నిబంధనల అమలుకు భారత్‌లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సూక్ష్మ, చిన్న ఫార్మాస్యూటికల్ సంస్థలకు భారంగా మారుతుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?అంతర్జాతీయంగా ఫార్మాస్యూటికల్ ఆర్అండ్డీలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలిపేందుకు స్పష్టమైన నియంత్రణలు, సరళీకృత ప్రక్రియలు అవసరమని ఈ నివేదిక సూచించింది. అందుకోసం ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడింది. అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని తెలిపింది. ప్రభుత్వం, విద్యా సంస్థలు కలసి ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ప్రత్యేక కోర్సులు రూపొందించాలని సూచించింది. -
వైద్య సదస్సులను కమ్మేస్తున్న ‘ఫార్మా’
తెనాలి: వైద్య రంగంలో నూతనంగా వచ్చిన ఆవిష్కరణలు, కొత్త ఔషధాలు, రోగనిర్ధారణలో నవీన విధానాలపై అవగాహన కోసం నిర్వహిస్తున్న సదస్సులు గతి తప్పుతున్నాయి. ఫార్మా కంపెనీల “స్పాన్సర్షిప్’లతో వైద్య సదస్సులు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. విలాసవంతమైన ఆఫర్లతో వైద్యులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు.. చివరకు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విలాసవంతంగా.. వైద్యులపై వలవైద్యుల సదస్సుల నిర్వహణలో ఫార్మ కంపెనీలు భాగం కాకూడదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధన ఉంది. అలాగే వైద్యులు, వారి అసోసియేష¯న్లతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. సదస్సులకు వైద్యులు హాజరయ్యేందుకు అవసరమైన విమాన టికెట్ల నుంచీ ఆయా ప్రాంతాల్లో తిరిగేందుకు లగ్జరీ కార్లు, బస చేసేందుకు విలాసవంతమైన హోటళ్లు తదితర సకల సదుపాయాలన్నీ ఫార్మా కంపెనీలే స్పాన్సర్ చేస్తున్నాయి. వైద్య సదస్సు జరిగే ప్రాంగణమంతటినీ తమ బ్రాండ్లు కనపడేలా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేస్తున్నాయి. తమ స్టాల్‌కు విచ్చేసినందుకు ఖరీదైన బహుమతులు, వివిధ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లతో వైద్యులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరులో కొద్ది నెలల కిందట జరిగిన వైద్యుల సదస్సులో ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు వైద్యురాలిపై అనుచితంగా ప్రవర్తించటంతో అతడికి దేహశుద్ధి చేశారు. చెన్నైలో కొద్దిరోజుల కిందట జరిగిన మరో సదస్సు అశ్లీల నృత్యాలకు వేదికైంది. విజ్ఞానం పెంచాల్సిన వైద్య సదస్సులను ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా చేస్తున్నాయి.‘క్రెడిట్ అవర్స్’పైనా ఫార్మా కంపెనీలదే పెత్తనంవైద్యవిజ్ఞాన సదస్సులకు హాజరయ్యే వైద్యులకు మెడికల్ కౌన్సిల్.. క్రెడిట్ అవర్స్‌ను కేటాయిస్తుంది. ప్రతి వైద్యుడు వివిధ సదస్సుల్లో పాల్గొని సంవత్సరానికి ఆరు క్రెడిట్ అవర్స్ చొప్పున ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్ సంపాదించాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్లో తమ వైద్య సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునేందుకు ఈ క్రెడిట్ అవర్స్ దోహదపడతాయి. ఈ సదస్సులకు ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు హాజరై సదస్సు జరిగే తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికెట్‌పైనా మెడికల్ కౌన్సిల్ సభ్యుల సంతకాలు ఉంటాయి. ఇన్ని నియమ నిబంధనలున్నా పలు ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. వైద్యుల పేర్ల నమోదు నుంచి సదస్సు తర్వాత ఇచ్చే క్రెడిట్ అవర్స్ సర్టిఫికెట్ల జారీ వరకు.. అన్నింటిలోనూ ఫార్మా కంపెనీలదే పెత్తనం. సదస్సుకు హాజరుకాని వైద్యుల పేర్లను కూడా ఫార్మా కంపెనీల ప్రతినిధులే నమోదు చేసి.. సర్టిఫికెట్లను తీసుకెళ్లి మరీ వైద్యులకు అందజేస్తుంటారు. తమ ఉత్పత్తులను రోగులకు సూచించేలా వైద్యులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తగ్గిన మందుల నాణ్యతఫార్మా కంపెనీలు, కొందరు వైద్యుల వల్ల రోగులపై మందుల అధికభారం పడుతోంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని మందులు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ తాజాగా చేసిన పరీక్షల్లో పారాసిటమాల్ సహా 53 రకాల మందుల్లో నాణ్యత లేదని తేలింది. గత ఆగస్టులో 156 కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ నిషేధం విధించింది. -
విస్తరిస్తోన్న భారత ఫార్మా మార్కెట్
భారతదేశం ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాల పరిశ్రమ విస్తరిస్తున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రంగంలో భారీగా దిగుమతి చేసుకుంటున్న యూఎస్, యూకే, ఇటలీలో భారత్ మార్కెట్ వాటా పెరుగుతోందని పేర్కొంది. యూఎస్‌కు ఔషధాలను అందించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని చెప్పింది. త్వరలో రెండో స్థానానికి చేరుతామని అంచనా వేసింది.పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం..‘యూఎస్, యూకే, ఇటలీ దేశాలు దిగుమతి చేసుకునే ఇండియా ఫార్మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యూఎస్‌కు ఔషధాలు ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్, స్విట్జర్లాండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాలతో పోలిస్తే భారత్ 2023లో తన యూఎస్ మార్కెట్ వాటాను విస్తరించింది. త్వరలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. 2022లో 7.33 బిలియన్ డాలర్లుగా(రూ.61 వేలకోట్లు) ఉన్న యూఎస్‌లోని భారత్ ఔషధ దిగుమతులు 2023లో 9.08 బిలియన్ డాలర్ల(రూ.76 వేలకోట్లు)కు పెరిగాయి. దాంతో ఇది 13.1%కు చేరింది. యూఎస్‌కు ఎగుమతిదారుగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్ వాటాలు వరుసగా 13.85%, 13.7%కు పడిపోయాయి.ఇదీ చదవండి: ‘అనిశ్చితులున్నా కరెంట్ ఇస్తాం’ఇటలీలోని యాంటీబయాటిక్స్ విభాగంలో భారత్ తన వాటాను పెంచుకుంది. అక్కడి మార్కెట్లో భారత్ పదో స్థానంలో ఉంది. అయితే 2022లో 0.96% ఉన్న ఇండియా వాటా 2023లో 2.12%కు పెరిగింది. విలువ పరంగా యాంటీబయాటిక్స్ ఎగుమతులు 2023లో 23.34 మిలియన్ డాలర్ల(రూ.195 కోట్లు)కు చేరాయి. జర్మనీకి ఎగుమతి చేసే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరికరాల మార్కెట్ పెరిగింది. 2022లో దాని వాటా 0.45 శాతంగా ఉండేది. అది 2023లో 1.7%కు చేరింది. విలువ పరంగా ఈ ఎగుమతులు 2023లో 13.02 మిలియన్ డాలర్ల(రూ.109 కోట్లు)కు చేరుకున్నాయి. ఇదిలాఉండగా, భారత్ ఇలా ఫార్మా రంగంలో వృద్ధి చెందడానికి కేంద్ర అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు రానివ్వం
మాదాపూర్: రాష్ట్రం నుంచి ప్రతి ఏటా రూ.50 వేల కోట్ల విలువైన మందులను ఎగుమతి చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలి పారు. తమది పారి శ్రామిక అనుకూల ప్రభుత్వమని, పారి శ్రామికవేత్తలకు మంత్రివర్గం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని, ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్యా రానివ్వబోమని అన్నా రు. ఓఆర్అర్, ఆర్ఆర్ఆర్ల మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి పరిశ్ర మను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మాదా పూర్లోని హైటెక్స్‌లో మూడురోజుల పాటు కొనసాగే 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌ను శుక్రవారం మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నెముక లాంటిదని భట్టి పేర్కొన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్ మెడిసిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణ గుర్తింపు సాధించిందన్నారు.కరోనా కాలంలో ఫార్మాసిస్టులు అసమానమైన చురుకుదనం ప్రదర్శించి అవిశ్రాంతంగా శ్రమించారని అభినందించారు. రాష్ట్ర్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్టు భట్టి తెలిపారు. మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి గ్రామీణ ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఫార్మా దిగ్గజాలకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కంపెనీలు తమ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో టిమ్స్, వరంగల్‌లో గవర్నమెంట్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హస్పిటల్ రూ.8 వేల కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ చైర్మన్ బి.పార్థసారథిరెడ్డి, భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ మొంటుకుమార్ పటేల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ రఘువంశీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 8,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.అమీన్పూర్లో ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్ – పల్సస్ గ్రూప్ ప్రకటనసాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ట్రాన్స్ఫార్మేటివ్ ఏఐ డ్రివెన్ ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పల్సన్ గ్రూప్ తెలిపింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ఫార్మా హబ్ ఏర్పాటుతో దాదాపు 10 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొంది. అమీన్‌పూర్‌లోని ఐటీ/ఐటీఈఎస్ జోన్లో అద్భుతమైన మౌలిక వసతులు, రవాణా సౌకరర్యాలు ఉండడం హబ్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సహా 1,400కు పైగా సైన్స్, టెక్నాలజీ, మెడికల్ జర్నల్స్‌ను ప్రచురించే గొప్ప వారసత్వంతో పల్సస్ గ్రూప్ సమాజానికి గణనీయమైన సహకారం అందిస్తోందని పేర్కొంది. హెల్త్‌కేర్ ఐటీ హబ్ ప్రయోజనాలు ఇలా... ⇒ రోగులకు మెరుగైన వైద్య సేవలు⇒ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా మారుతుంది⇒10 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన⇒అనుబంధ పరిశ్రమలు, సేవల ద్వారా 40 వేల పరోక్ష ఉద్యోగాలు⇒ స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలు. -
'నేను ఆత్మహత్య చేసుకోను'.. ఫార్మా కంపెనీపై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో ఇరుక్కున్న సమయంలో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్స్ తయారుచేసి అందించడం మొదలుపెట్టాయి. ఇలా వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీల జాబితాలో ఒకటి ఫార్మా దిగ్గజం 'ఫైజర్'.కరోనా రక్కసి నుంచి రతప్పించుకోవడానికి ఉపయోగించిన వ్యాక్సిన్స్.. ఆ తరువాత అనేక దుష్ప్రభావాలను చూపించింది. దీంతో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఫైజర్ ఫార్మా కంపెనీలో పనిచేసే మహిళ 'మెలిస్సా మెక్‌టీ'.. ఆ కంపెనీ గురించి సంచనల విషయాలు బయటపెట్టింది.అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రపంచంలోని దాదాపు 150 కంటే ఎక్కువ దేశాలకు తన వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడితే.. అందులో మానవ పిండం కణజాలం-ఉత్పన్నమైన సెల్ లైన్లను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ కంపెనీ ఈమెయిల్‌లను మెలిస్సా మెక్‌టీ లీక్ చేశారు.మెలిస్సా మెక్‌టీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తాను ఫైజర్ విజిల్‌బ్లోయర్‌ని అని పేర్కొంది. కంపెనీలో సుమారు పదేళ్లు పని చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో లీక్ చేస్తూ.. తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తనకు భర్త, కొడుకు ఉన్నట్లు పేర్కొంది. తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ.. తన ప్రాణానికి హాని కలిగితే అది, కంపెనీ పనే అంటూ వెల్లడించింది.గతంలో 737 మ్యాక్స్ బోయింగ్ విమానంలో లోపాలను గురించి వెల్లడించిన వ్యక్తి, కొన్ని రోజుల తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి నా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగితే అది కంపెనీ పన్నిన కుట్ర అని మెలిస్సా మెక్‌టీ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.I AM A PFIZER WHISTLEBLOWERTHE ONLY ONE ACTUALLY EMPLOYED AS A LONG TERM PFIZER EMPLOYEEI AM TIRED.I am tired of feeling like an imposter.I am tired of feeling like I have no hope. I am tired of fighting, debating, posting, researching.. But I am NOT suicidal. I have a… pic.twitter.com/NcSy9R2Hho— Melissa McAtee (@MelissaMcAtee92) May 8, 2024 -
IT Raids: మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని ఫార్మా కంపెనీలకు చెందిన ఛైర్మన్, సీఈవో, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలోని మై హోం బూజాలో ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పరిశోధనలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దిగ్గజాలుగా ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద పీట వేయాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం కీలక యంత్రపరికరాలను తయారు చేయాలని అటు మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు సూచించారు. ఫార్మా–మెడ్ టెక్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పనలపై జాతీయ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు తమ లాభాల్లో 20–25 శాతాన్ని పరిశోధన, ఆవిష్కరణలపై వెచ్చిస్తుంటాయి. కానీ దేశీ కంపెనీలు సుమారు 10 శాతమే వెచ్చిస్తున్నాయి. మనం పరిశోధన ఆధారిత వినూత్న ఉత్పత్తులను తయారు చేయనంతవరకూ అంతర్జాతీయంగా ఈ విభాగానికి సారథ్యం వహించలేము‘ అని ఆయన చెప్పారు. 2047 నాటికి ఫార్మా పరిశ్రమ స్వావలంబన సాధించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. నాణ్యత కూడా ముఖ్యమే.. భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యతపై కూడా ఫార్మా పరిశ్రమ దృష్టి పెట్టాలని మాండవీయ చెప్పారు. మరోవైపు, ఫార్మా మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని (పీఆర్ఐపీ) కూడా కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీము బడ్జెట్ రూ. 5,000 కోట్లని మాండవీయ చెప్పారు. పరిమాణంపరంగా 50 బిలియన్ డాలర్లతో భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో 120–130 బిలియన్ డాలర్లకు ఎదగగలదని అంచనాలు ఉన్నాయి. -
వృద్దివైపు పరుగులు పెడుతున్న ఫార్మా - పెరుగుతున్న ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. నియంత్రిత మార్కెట్లకు పెరుగుతున్న ఎగుమతులు, దేశీయంగా స్థిరమైన వృద్ధి నమోదవుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని కోసం 186 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం చేసింది. రూ. 3.7 లక్షల కోట్ల పరిశ్రమ వార్షిక ఆదాయంలో వీటి వాటా దాదాపు సగం ఉంటుంది. నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) అనుమతించిన మేరకు ధరలను పెంచడం కూడా పరిశ్రమ ఆదాయ వృద్ధికి దోహదపడగలదని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ డానీ తెలిపారు. అమ్మకాల పరిమాణం 3–4% మేర పెరిగేందుకు ప్రస్తుతమున్నవి, కొత్తగా ప్రవేశపెట్టే ఔషధాలు తోడ్పడగలవని వివరించారు. ముడివస్తువులు, లాజిస్టిక్స్ వ్యయాలు, అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిడి తగ్గుదలతో ఈ ఆర్థిక సంవత్సరం నిర్వహణ లాభదాయకత 50–100 బేసిస్ పాయింట్లు పెరిగి 21 శాతానికి చేరవచ్చని తెలిపారు. అమెరికాలో ధరలపరమైన ఒత్తిడి, ముడి వ్యయాల పెరుగుదల కారణంగా వరుసగా రెండేళ్ల పాటు మార్జిన్లు తగ్గినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. ‘ఆసియాకు ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం ఒక మోస్తరుగా ఉండగా, ఈసా రి మెరుగుపడవచ్చు. ఆఫ్రికా దేశాల దగ్గర విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటం, కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం వంటి అంశాల కారణంగా అక్కడికి ఎగుమతుల్లో మందగమనం కొనసాగే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. -
ఫార్మా ఆదాయాల్లో 7–9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ ఫార్మా కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ మార్కెట్ 8–10 శాతం మేర, అమెరికా మార్కెట్ 6–8 శాతం మేర విస్తరించడం ఆదాయ వృద్ధికి అనుకూలిస్తుందని పేర్కొంది. ఇక ఐరోపా మార్కెట్ల నుంచి ఆదాయం 3–5 శాతం వరకు, వర్ధమాన మార్కెట్ల నుంచి 8–10 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. 25 దేశీ ఔషధ కంపెనీల గణాంకాలను ఇక్రా విశ్లేషించింది. దేశ ఫార్మా మార్కెట్లో ఈ కంపెనీల వాటా 60 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దేశీ ఫార్మా కంపెనీల ఆదాయాలు 10 శాతం మేర పెరగడం గమనార్హం. కాంప్లెక్స్ జనరిక్స్, స్పెషాలిటీ ఫార్ములేషన్లను యూఎస్ మార్కెట్లలో విడుదల చేయడంపై కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించడం పరిశ్రమ మార్జిన్లకు అనుకూలిస్తుందని వివరించింది. దేశ ఫార్మా కంపెనీల పరపతి ప్రొఫైల్ (రుణ స్థితిగతులు) ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘జాతీయ ముఖ్య ఔషధాల జాబితాలోని వాటి ధరలను టోకు ద్రవ్యోల్బణం ఆధారితంగా 12.1 శాతం పెంచడం, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ముఖ్య ఔషధ జాబితాలో లేని వాటి ధరలను వార్షికంగా కంపెనీలు పెంచడం అనేవి దేశీ మార్కెట్లో 8–10 శాతం ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి’’అని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మైత్రి మాచర్ల తెలిపారు. యూఎస్ఎఫ్డీఏ తనిఖీల రిస్క్. యూఎస్ మార్కెట్లో వృద్ధి అనేది ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 6–8 శాతం మధ్య ఉంటుందని ఇక్రా తెలిపింది. యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు ఇటీవల మళ్లీ పెరిగాయని, కనుక నియంత్రఫరమైన రిస్క్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇటీవల కొన్ని ఫార్మా కంపెనీలపై సైబర్ దాడులను ప్రస్తావిస్తూ, ఇవి కార్యకలాపాలకు తాత్కాలిక అవరోధం కలిగించొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కంపెనీల మూలధన వ్యయాలు రూ.20,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. -
ఔషధ రంగ ప్రక్షాళనే మందు!
ఒంట్లో నలతగా ఉండటం మొదలుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చినా వైద్యుణ్ణి సంప్రదించటం, తగిన మందు వాడి ఉపశమనం పొందటం సర్వసాధారణం. కానీ ‘కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందాన’ ఔషధాలుంటే జనం ప్రాణాలు గాల్లో దీపంగా మిగిలిపోయినట్టే. ఔషధ సంస్థలన్నిటినీ అనలేంగానీ కొన్ని సంస్థలు అందరి కళ్లూ కప్పి నాసిరకం ఔషధాల ఎగుమతులతో లాభాలు గడించేందుకు తహతహలాడుతున్న తీరువల్ల మన దేశం పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి. ఈ విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం సంతోషించదగ్గ విషయం. ఇకపై ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మంచి విధానాలు (జీఎంపీ) పాటిస్తున్నట్టు ధ్రువపడితేనే ఆ ఉత్పత్తులను విడుదల చేయటానికి అంగీకరించాలనీ, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. ఫార్మా ఉత్పత్తుల్లో మన దేశం విశ్వగురు అయిందని రెండు నెలలక్రితం కేంద్ర ఇంధన శాఖ సహాయమంత్రి భగవత్ కూబా ఘనంగా ప్రకటించారు. కానీ ఇక్కడినుంచి ఎగుమతవుతున్న ఔషధాల వాడకంవల్ల పదులకొద్దీమంది మృత్యువాత పడిన ఉదంతాలు ఆ ఘనతను కాస్తా హరిస్తు న్నాయి. నిరుడు ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో దగ్గుమందు సేవించి 70 మంది పసిపిల్లలు మరణించగా, ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లలు చనిపోయారు. భారత్ నుంచి వచ్చిన కొన్ని ఔషధాల ప్రమాణాలు సక్రమంగా లేవని అమెరికా కూడా ప్రకటించింది. ఔషధాల్లో మోతాదుకు మించి రసాయనాలున్నాయని కొన్నిసార్లు, నిర్దేశిత ప్రమాణాల్లో లేవని కొన్నిసార్లు ఫిర్యాదు లొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పంపిన ఔషధాలు పంపినట్టు వెనక్కొస్తున్నాయి. నిజానికి గాంబియాకు ఎగుమతయిన దగ్గు మందు మన దేశంలో విక్రయానికి పనికిరాదని నిషేధించారు! అయినా అది నిరాటంకంగా గాంబియాకు చేరుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమే ఈ దుఃస్థితికి కారణం. దీన్ని ఎంత త్వరగా సరిదిద్దితే అంత మంచిది. ఔషధాల్లో వినియోగించే ముడి పదార్థాలు ప్రామాణికమైనవి అవునో కాదో, అవి నిర్దేశించిన పాళ్లలో ఉన్నాయో లేదో తనిఖీ చేయటం, రోగంనుంచి ఉపశమనమిస్తుందని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆ ఉత్పత్తి ఉందో లేదో నిర్ధారించటం నియంత్రణ వ్యవస్థల పని. అలాంటి సంస్థలు మన దేశంలో 38 వరకూ ఉన్నాయి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)తో పాటు రాష్ట్రాల్లో పలుచోట్ల ఔషధ పరీక్ష కేంద్రాలు(సీడీఎల్) ఉన్నాయి. కానీ ఏదీ సక్రమంగా అమలు కావటం లేదని పలుమార్లు రుజువైంది. గాంబియాలోనూ, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోనూ పసివాళ్ల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందులను హరియాణాలోని మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ తరచు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. తమ ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని తన వెబ్సైట్లో ఆ సంస్థ ఘనంగా ప్రకటించుకున్నా అదంతా ఉత్తదేనని తేలింది. అయినా ఏ నియంత్రణ విభాగం ఆ ఔషధ సంస్థపై చర్య తీసుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి తెస్తామంటున్న జీఎంపీ అయినా సక్రమంగా అమలు చేయగలిగితే మంచిదే. ఉత్పాదక ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ ఉత్పత్తులు కాస్తా కొద్ది రోజుల్లోనే దెబ్బతింటాయి. ఔషధాలు రోగం తగ్గించకపోయినా ఎంతోకొంత సరిపెట్టుకోవచ్చుగానీ ప్రాణాలే తీస్తే?! అసలే పౌష్టికాహార లోపం, వాతావరణ కాలుష్యం, విషాహారం తదితరాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు ఔషధాలు సైతం ఈ జాబితాలో చేరితే ఇక చెప్పేదేముంది? వాస్తవానికి ఎగుమతి చేసే ఔషధాలకు జీఎంపీ విధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ దాన్ని అమలు చేయటంలోనే అడుగడుగునా నిర్లక్ష్యం కనబడుతోంది. ఔషధాలు ఎగుమతి చేయ దల్చుకున్న ప్రతి దేశమూ తమ ఔషధ సంస్థలు నిర్దిష్టమైన ప్రమాణాలు అమలు చేస్తున్నట్టు నిర్ధారించుకోవాలని గాంబియా విషాద ఉదంతం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు నెలల క్రితం తెలిపింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ముడి పదార్థాల నాణ్యత మొదలు కొని కర్మాగారంలోని పరిసరాలు, యంత్రాలు, సిబ్బంది పాటించే పరిశుభ్రత వరకూ సమస్తం సరిగా ఉన్నాయో లేదో చూడటం ఈ మార్గదర్శకాల సారాంశం. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలోనూ పాటించే విధానాలను నమోదు చేసేందుకు అవసరమైన నమూనాను ఎవరికి వారు రూపొందించుకోవాలనీ, పకడ్బందీ తనిఖీలతో ఇవన్నీ సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు చూడాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. కేంద్రం ప్రకటించబోయే జీఎంపీ ఇకపై మన దేశంలో విక్రయించే ఔషధాలకు కూడా వర్తిస్తుందంటున్నారు. మంచిదే. అయితే ఎగుమతయ్యే ఔషధాల విషయంలో చూపిన అలసత్వమే ఇక్కడా కనబడితే అనుకున్న లక్ష్యం నెరవేరదు. కర్మా గారం దాటి బయటికొచ్చే ప్రతి ఔషధమూ అత్యంత ప్రామాణికమైనదన్న విశ్వాసం రోగుల్లో కలగాలి. ఔషధాల తనిఖీ విధానంలో మార్పులు తెస్తే తప్ప దీన్ని సాధించటం కష్టం. మన దేశంలో ఔషధ తయారీ సంస్థలు దాదాపు 30,000 వరకూ ఉన్నాయి. వీటిని సక్రమంగా తనిఖీ చేయాలంటే ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోరు. కనుక కొత్త నియామకాలపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే చాలా ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రయోగ ఫలితాల వివరాలను బహిరంగపరచటం లేదు. ఏమాత్రం పారదర్శకత పాటించని ఇలాంటి ధోరణులే కొంప ముంచుతున్నాయి. ఔషధ రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే ఈ పరిస్థితి మారుతుంది. -
హైదరాబాద్ లో ఈడీ అధికారుల దాడులు
-
HYD: ఫార్మా కంపెనీలపై ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివరాల ప్రకారం.. ఫినిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్, మైన్స్, ఆటో మొబైల్స్, ఫార్మా కంపెనీలను ఫినిక్స్ సంస్థ ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్చెరులో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈడీ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మందులు వాడేవారికి ధరల దెబ్బ!
వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఉపశమనం కోసం మందులు వాడుతున్నవారికి ధరల దెబ్బ తగలనుంది. పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటిబయాటిక్స్ వరకూ పలు రకాల మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్లూపీఐ)లో మార్పునకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి పలు రకాల మందుల ధరలను 12 శాతం మేర పెంచుకోడానికి ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం.. ఈమె స్విమ్మింగ్ చాంపియన్ కూడా... ధరలు పెరుగుతున్న మందులలో చాలా వరకు యాంటీ ఇన్ఫెక్టివ్‌లు, పెయిన్కిల్లర్లు, కార్డియాక్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో చేర్చిన దాదాపు 800 ఔషధాల రిటైల్ ధరపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ జాబితాలో కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల దగ్గర నుంచి ఓఆర్ఎస్, డిస్ఇన్ఫెక్టెంట్ మందుల వరకు దాదాపు అన్ని అవసరమైన మందులు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే మందులు ఇవే... హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తు మందులు, ఆక్సిజన్ మందులు. పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్ పాయిజనింగ్‌లో యాంటీడోట్స్: యాక్టివేటెడ్ చార్కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్ యాంటికాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్ పార్కిన్సన్స్, డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజైల్పెనిసిలిన్, సెఫాడ్రోక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోమ్ కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు యాంటీ టీబీ ఔషధం: అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ మొదలైనవి. యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ తదితరాలు యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్ వంటివి. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే అబాకావిర్, లామివుడిన్, జిడోవుడిన్, ఎఫవిరెంజ్, నెవిరాపైన్, రాల్టెగ్రావిర్, డోలుటెగ్రావిర్, రిటోనావిర్ తదితర మందులు. మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ వంటి రక్తహీనత మందులు ప్లాస్మా, ప్లాస్మా ప్రత్యామ్నాయాలు కార్డియోవాస్కులర్ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి. చర్మసంబంధమైన మందులు యాంటిసెప్టిక్స్, క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి. బుడెసోనైడ్, సిప్రోఫ్లోక్సాసిన్, క్లోట్రిమజోల్ మొదలైన ఈఎన్టీ ఔషధాలు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మందులైన ఓఆర్ఎస్, లాక్టులోజ్, బిసాకోడిల్ వంటివి. హార్మోన్లు, ఇతర ఎండోక్రైన్ మందులు, గర్భనిరోధకాలు వ్యాక్సిన్లు: హెపటైటిస్ బి, డీపీటీ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్ మొదలైనవి. ఆప్తాల్మోలాజికల్ మందులు, ఆక్సిటోసిక్స్, యాంటీఆక్సిటోసిక్స్ మానసిక రుగ్మతల చికిత్సకు ఉపయోగించే మందులు శ్వాసకోశ సంబంధ రుగ్మతలకు వినియోగించే మందులు, విటమిన్లు, మినరల్స్. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? -
ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్!
నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. నాణ్యత లేమి డ్రగ్స్‌ను తయారు చేసిన 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను రద్దుతో పాటు తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు అందించింది. భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు నకిలీ మందులు విదేశాలకు విక్రయిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఫార్మా కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 76 ఫార్మా కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల్లో భారత్‌లో తయారు చేసిన డ్రగ్స్ వినియోగించడం కారణంగా పలువురు మరణించడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత ఫిబ్రవరి నెలలో గుజరాత్‌కు చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ (Zydus Lifesciences) సంస్థ కీళ్ల నొప్పుల్ని నయం చేసే జనరిక్ మెడిసిన్ తయారు చేసి యూఎస్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఆ ఔషదాలున్న 55 వేల బాటిళ్లను రీకాల్‌కు పిలుపునిచ్చింది. గత ఏడాది నోయిడాకి చెందిన మరియన్ బయోటెక్ ఫార్మా సంస్థ నకిలీ దగ్గు మందును తయారు చేసింది. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆరోపణలతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు మరియన్ బయోటెక్ ఫార్మాలో శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. ఆ టెస్ట్‌లలో 22 రకాల మరియన్ బయోటెక్ తయారు చేసిన డ్రగ్స్ నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. ఇలా ఫార్మా కంపెనీలపై వరుస ఫిర్యాదులు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఫార్మా కంపెనీల్లో సోదాలు జరిపి చర్యలు తీసుకుంటుంది. -
ఎస్జీడీ ఫార్మా, కార్నింగ్‌తో తెలంగాణ ఒప్పందం
ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఎస్జీడీ ఫార్మాతోపాటు మరో దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్తో భవిష్యత్తు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచస్థాయి సాంకేతికత, తయారీ నైపుణ్యం తెలంగాణకు అందుతుందని పేర్కొంది. అలాగే కారి్నంగ్ అందించే అత్యున్నత నాణ్యతతో కూడిన ఫార్మాస్యూటికల్ ట్యూబ్ టెక్నాలజీ, ఎస్జీడీ ఫార్మా గ్లాస్ వైల్ తయారీ నైపుణ్యాల కలబోతకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని వివరించింది. తద్వారా ఎస్జీడీ ఫార్మాస్యూటికల్ సామర్థ్యం ప్రైమరీ ప్యాకేజింగ్ భారత్‌తోపాటు అంతర్జాతీయ వినియోగదారులకు తెలంగాణ నుంచి సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రైమరీ ప్యాకేజింగ్ రంగంలో కార్నింగ్, తెలంగాణ ప్రభుత్వంతో తాము కుదుర్చుకొనే భాగస్వామ్యం ద్వారా ప్రైమరీ ప్యాకేజింగ్ సప్లై చైన్‌లో తెలంగాణ పురోగమిస్తుందని ఎస్జీడీ ఫార్మా ఎండీ అక్షయ్ సింగ్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి, 150 మందికి శాశ్వత ఉద్యోగాలు, మరో 300 మందికి కాంట్రాక్టు ప్రాతిపదికన 2024 ఆరంభం నాటికి లభిస్తాయి. ఎస్జీడీతో తమ భాగస్వామ్యం ద్వారా కీలకమైన ఔషధాల సరఫరా వేగవంతం అవుతుందని కారి్నంగ్ ఇండియా ఎండీ సు«దీర్ పిళ్లై అన్నారు. ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలో ఉన్న కారి్నంగ్... ఎస్జీడీ ఫార్మా భాగస్వామ్యంలో తెలంగాణలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన యూనిట్ ఏర్పడుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ గ్లాస్ తయారీ ద్వారా లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగం విలువ 250 అమెరికన్ డాలర్లకు చేరాలని... తమ భవిష్యత్తు లక్ష్యానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
రెండు ఫార్మా ఐపీవోలకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ: ఇన్నోవా క్యాప్టాబ్, బ్లూజెట్ హెల్త్‌కేర్ కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సెబీ నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ రెండు సంస్థలు ఐపీవో రూపంలో ప్రజల నుంచి నిధులు సమీకరించుకునేందుకు మార్గం సుగమం అయింది. ఈ రెండు సంస్థలు గతేడాది జూన్–సెప్టెంబర్ మధ్య ఐపీవో అనుమతి కోరుతూ సెబీ వద్ద పత్రాలు దాఖలు చేశాయి. తాజాగా ఈ రెండింటి ఐపీవోలకు సెబీ అన అబ్జర్వేషన్ (అనుమతి) తెలియజేసింది. ఇన్నోవా క్యాప్టాబ్ తాజా ఈక్విటీ జారీ రూపంలో రూ.400 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. కంపెనీలో ఇప్పటికే వాటాలు కలిగిన ప్రమోటర్లు, ఇతర వాటాదారులు 96 లక్షల ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా విక్రయించనున్నారు. అంటే ఈ మొత్తం ఆయా వాటాదారులకే వెళుతుంది. తాజా షేర్ల జారీ రూపంలో వచ్చే నిధుల నుంచి రూ.180 కోట్లను కంపెనీ రుణాలు తీర్చివేసేందుకు వినియోగించనుంది. రూ.90 కోట్లను మూలధన అవసరాలకు ఉపయోగిస్తుంది. ఇన్నోవా క్యాప్టాబ్ ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి, తయారీ, పంపిణీ, మార్కెటింగ్, ఎగుమతి సేవలను అందిస్తోంది. ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్‌ను తయారు చేసే బ్లూజెట్ హెల్త్ కేర్ ఐపీవోలో భాగంగా రూ.2,16,83,178 షేర్లను (ఓఎఫ్ఎస్) విక్రయించనుంది. ప్రమోటర్లు అక్షయ్ బన్సారిలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా తమ వాటాల నుంచి ఈ మేరకు విక్రయిస్తారు. -
తగినన్ని ఔషధ నిల్వలు సిద్ధం చేయండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలోనూ అందరూ అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్ స్థాయి వరకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోవిడ్–19 మేనేజ్మెంట్ డ్రగ్స్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై మంత్రి గురువారం ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు అందించిన సేవలను మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మా కంపెనీల కృషి వల్లే మన దేశానికి అవసరమైన ఔషధాలను, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు 150 దేశాలకు సైతం ఎగుమతి చేయగలిగామని కొనియాడారు. ధరలు పెంచకుండా, నాణ్యత తగ్గించకుండా ఈ ఘనత సాధించామని హర్షం వ్యక్తం చేశారు. -
మందులా... మృత్యు గుళికలా!
ఒకే రోజు రెండు విషాద వార్తలు! రెండూ పసిపిల్లలకు సంబంధించినవే. థాయ్‌లాండ్‌లోని శిశు సంరక్షణాలయంపై ఉన్మాది బుల్లెట్లు కురిపించి 37 మంది ప్రాణాలు తీశాడు. మన దేశానికి చెందిన మేడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన మందుల కారణంగా ఆఫ్రికా ఖండ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు గత నెలలో ప్రాణాలు కోల్పోయారు. మారణాయుధంతో పసికూనలపై విరుచుకుపడిన రాక్షసుడికీ... కేవలం లాభార్జన కాంక్షతో కలుషిత ఉత్పత్తులకు ఔషధమన్న ముద్రేసి అంటగట్టిన సంస్థ యజమానులకూ తేడా ఏమీ లేదు. కొన్ని ఔషధ సంస్థల టక్కుటమార విద్యలపైనా, వాటి ఉత్పత్తులపైనా ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న దినేష్ ఎస్. ఠాకూర్ వంటి నిపుణులు తరచు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడిన చోట అలాంటివారిది అరణ్యరోదనే అవుతోంది. ఇప్పుడు గాంబియా పసిపిల్లల ఉసురు తీసిన మందులకు భారత్‌లో విక్రయించడానికి అనుమతుల్లేవని అంటున్నారు. మన దేశంలో విక్రయానికి పనికిరాని ఉత్పత్తులు గాంబియాకు ఎలా పోయాయి? అంతర్జాతీయంగా మన పరువు తీసిన ఈ ఉదంతం తర్వాతనైనా పాలకులు మేల్కొనవలసి ఉంది. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంత దేశాల్లో మన ఫార్మా రంగ సంస్థలదే పైచేయి. ఆఖరికి రష్యా, పోలాండ్, బెలారస్ వంటి దేశాల్లోనూ మన ఔషధాలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు ఫార్మా ఉత్పత్తులు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. అయినా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని పాలకులు గుర్తించలేదు! పౌష్టికాహారలోపం, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు, విషాహారం తదితరాలు ప్రజలను రోగాలబారిన పడేస్తాయి. రోగగ్రస్తులకు అందుబాటులో ఉంటున్న ఔషధాలు జబ్బు తగ్గించటం మాట అటుంచి ప్రాణాలు తీయడమంటే అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? కానీ చట్టంలో ఉండే లొసుగుల కారణంగా ఈ నేరం నిత్యం జరుగుతూనే ఉంది. ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా గాంబియాలో సరైన ఔషధ నియంత్రణ వ్యవస్థ లేదనీ, జవాబుదారీతనం అసలే లేదనీ కొందరంటున్నారు. కానీ మనదగ్గరమటుకు ఏం ఉన్నట్టు? హరియాణాలోని కుండ్లీలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని గాంబియా విషాదం వెల్లడి కాకముందు మేడెన్ ఔషధ సంస్థ వెబ్సైట్ ఘనంగా చెప్పుకొంది. ప్రస్తుతం దాన్ని తొలగించి హరియాణాలోనే ఉన్న మరో ఫ్యాక్టరీకి, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కిందని ఆ సంస్థ గొప్పలు పోతోంది. అంతేకాదు... తమకు ఐఎస్ఓ గుర్తింపు కూడా వచ్చిందంటున్నది. మేడెన్ సంస్థ ఫ్యాక్టరీలనుగానీ, దాని ఉత్పత్తులనుగానీ తనిఖీలు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అటు ఐఎస్ఓ గుర్తింపు పొందిన ఔషధ సంస్థల జాబితాలో మేడెన్ లేనేలేదు. ప్రాణప్రదమైన ఔషధ సంస్థలు ఇలా ఇష్టానుసారం ప్రకటించుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతుంటే అన్ని వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఈ సంస్థపై గత దశాబ్దకాలంలో బిహార్, గుజరాత్, కేరళ, జమ్మూ, కశ్మీర్లు ఫిర్యాదులు చేశాయి. కానీ అవన్నీ నాసిరకమైన మందులకు సంబంధించిన ఫిర్యాదులు. ఇప్పుడు గాంబియా పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందుల్లో అత్యంత ప్రమాదకరమైన డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు మోతాదుమించి ఉన్నాయని తేల్చారు. ఇవి కిడ్నీలనూ, ఇతర అంగాలనూ తీవ్రంగా దెబ్బతీయటంతో పిల్లలు మరణించారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గ్లిసరిన్ను సాంద్రత బాగా తగ్గించి దగ్గు మందుల్లో వినియోగిస్తారు. గ్లిసరిన్‌తో పోలిస్తే ఈ రెండు రసాయనాలూ చవగ్గా లభిస్తాయని చాలామంది వాటివైపు మొగ్గుతున్నారు. అయితే పెయింట్లు, ఇంకులూ తయారీలో వినియోగించే ఈ రసాయనాలు ఏమాత్రం మోతాదు మించినా ప్రాణాంతకమవుతాయి. ఇప్పుడు గాంబియాలో జరిగింది అదే. మనకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) ఉంది. దేశంలో అనేకచోట్ల కేంద్ర ఔషధ పరీక్ష కేంద్రాలు (సీడీఎల్) ఉన్నాయి. రాష్ట్రాల స్థాయిలో ఔషధ తనిఖీ అధికారులున్నారు. దేశం వెలుపలికిపోయే ఔషధాల ప్రమాణాల నిర్ధారణకు సంబంధించి ఎన్నో నిబంధనలున్నాయి. కానీ మేడెన్ సంస్థ ఈ వ్యవస్థల కళ్లు కప్పగలిగింది. 2020లో జమ్మూ, కశ్మీర్లో ఈ దగ్గుమందు 14 మంది ప్రాణాలు తీసినప్పుడు ప్రజారోగ్య రంగ కార్యకర్త దినేష్ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సవివరమైన ఫిర్యాదు పంపితే దర్యాప్తు చేయటం మాట అటుంచి, కనీసం అది అందుకున్నట్టు చెప్పే దిక్కు కూడా లేకపోయిందంటే ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఔషధ ప్రమాణాల నిర్ధారణకూ, నియంత్రణకూ 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టమే ఆధారం. 2004లో రాన్‌బాక్సీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తి, ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నియంత్రణ సంస్థలు గగ్గోలు పెట్టినప్పుడు ఆనాటి పాలకులు ఇదంతా కుట్రగా తేల్చిపారేశారు తప్ప ఫార్మా రంగ సంస్కరణలకు పూనుకోలేదు. వర్తమాన అవసరాలకు తగ్గట్టు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. వర్ధమాన దేశాలకు చవగ్గా ఔషధాలందిస్తుందన్న ఖ్యాతిని నిలుపుకోవాలన్నా, ప్రపంచ ఫార్మా రంగంలో పెరుగుతున్న మన వాటా రక్షించుకోవా లన్నా ఔషధ నియంత్రణ వ్యవస్థ ప్రక్షాళనకు తక్షణం పూనుకోవాలి. లేదంటే మన ప్రతిష్ఠ అడుగంటడం ఖాయం. -
అడ్డదారిలో మందులోళ్లు.. డాక్టర్లకు ఖరీదైన కార్లు.. బహుమతులు
కర్నూలు(హాస్పిటల్): కొన్ని ఫార్మాకంపెనీలు వైద్యులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ మందులు రాస్తే ఖరీదైన బహుమతులు ఇస్తామని ఆశ చూపుతున్నాయి. భారీగా నగదు అందజేస్తామని ఊరిస్తున్నాయి. మందుల ధరల్లో వ్యత్యాసాలను బట్టి 20 నుంచి 30 శాతం వరకు చెక్కుల రూపేణా ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎలాంటి అర్హతలు లేకపోయినా కొందరికి డిప్లొమా సర్టిఫికెట్లు తెచ్చి ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? తమ మందులు అమ్ముకోవడానికి కొన్ని ఫార్మా కంపెనీలు ఎంతకైనా తెగిస్తున్నాయి. బాగా మందులు రాసే వైద్యునికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉంటే చాలు డిప్లొమా కోర్సుల సర్టిఫికెట్లను తెప్పించే బాధ్యతను అవే తీసుకుంటున్నాయి. సదరు డాక్టర్ కేవలం పేరు, వివరాలు చెబితే చాలు..మొత్తం పనంతా సదరు కంపెనీనే చూసుకుంటుంది. ఆన్లైన్లో విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయడం, కొన్ని వారాల్లోనే సర్టిఫికెట్లు తెప్పించడం జరిగిపోతోంది. వాటినే అందంగా ఫ్రేమ్ వేయించి మరీ వైద్యం చేస్తున్నారు కొందరు డాక్టర్లు. కర్నూలు నగరంలో ఇలాంటి వైద్యులు 40 మందికి పైగా ఉన్నారు. ఎన్ఆర్ పేట, శ్రీనివాసనగర్, గాయత్రి ఎస్టేట్స్, అశోక్‌నగర్, వెంకటరమణకాలనీ, జనరల్ హాస్పిటల్ ఎదురుగా పలువురు ఇలాంటి డిగ్రీలతో వైద్యం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరులోని ఓ బీఏఎంఎస్(ఆయుర్వేదిక్ కోర్సు చేసిన వారు) వైద్యుడు ఏకంగా డయాబెటాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్టుగా బోర్డు పెట్టేసుకుని వైద్యం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయనెప్పుడూ బిజీ ప్రాక్టీషనరే. అలాగే ఆదోనిలోనూ ఎంబీబీఎస్ అర్హతతో ఓ వైద్యుడు కార్డియాలజిస్టు అవతారమెత్తాడు. నిమ్స్, ఉస్మానియాతో పాటు అన్నామలై యూనివర్సిటీల్లో డిప్లొమా కోర్సును రెండేళ్ల పాటు చేసిన వైద్యులు తమ బోర్డుల్లో డిప్లొమా ఇన్ కార్డియాలజీ, డిప్లొమా ఇన్ డయాబెటాలజిగా రాసుకుంటున్నారు. కానీ అర్హతలేని యూనివర్సిటీల్లో సర్టిఫికెట్లు తెచ్చుకున్న వైద్యులు మాత్రం ఏకంగా డయాబెటాలజిస్ట్, కార్డియాలజిస్టు అని రాసుకోవడంతో 12 ఏళ్ల పాటు కష్టపడి వైద్యవిద్యను చదివిన డాక్టర్లు తీవ్రమనస్తాపానికి గురవుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేసే వారు అధికంగా ప్రాపగండ డిస్టిబ్యూషన్ కంపెనీ(పీడీసీ) మందులు రాస్తున్నారు. ఇవి బ్రాండెడ్ మందుల కంటే ఎంఆర్పీ అధికంగా ఉంటాయి. కానీ వైద్యులు ఇవే కొనాలని రోగులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని మందులు ఎంత మేరకు పనిచేస్తాయో వైద్యులకు కూడా తెలియదు. ఇటీవల షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా డి డయాబెటిక్స్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. బహుమతులుగా ఖరీదైన కార్లు కర్నూలులో 200 మందికి పైగా ‘పీడీ’ వ్యాపారం చేసే వారు ఉన్నారు. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. పాతబస్టాండ్, ఎన్ఆర్ పేట, జనరల్ హాస్పిటల్ ఎదురుగా, నంద్యాల రోడ్డు ప్రాంతాల్లో ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. వీరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వైద్యుల వద్దకు పంపిస్తూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమ మందులు రోగులకు రాస్తే ఎలాంటి ఖరీదైన కారు కావాలన్నా కొనిస్తున్నారు. ఇటీవల పలువురు వైద్యులు స్కోడా, వోక్స్వాగన్, ఆడికార్లతో పాటు నర్సింగ్‌హోమ్‌లు ఉన్న వైద్యులు అంబులెన్స్‌లు కూడా బహుమతులుగా తీసుకున్నారు. ఇలాంటి వైద్యుల్లో ప్రైవేటుగా క్లినిక్‌లు, హాస్పిటల్స్ నిర్వహించే పలువురు ప్రభుత్వ వైద్యులు కూడా ఉండటం గమనార్హం. కొందరు డాక్టర్లకు క్యాష్ కార్డులు! ప్రముఖ పట్టణాలు, నగరాల్లో వైద్యసదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు కంపెనీలు వైద్యులను ఆహా్వనిస్తాయి. ఓ అరగంట, పావు గంటపాలు లెక్చర్ ఇస్తారు. కానీ అంతకు మించి వారికి భారీగా గౌరవ వేతనంగా కంపెనీలు ముట్టజెబుతున్నాయి. అంటే ఇది అడ్డదారిలో వైద్యులకు బహుమతులు ఇవ్వడం అన్నమాట. మరికొన్ని కంపెనీలు వైద్యులకు పెట్రోకార్డులు, గోల్డ్‌కార్డులు/కూపన్లు, క్యాష్కార్డులు బహుమతులుగా ఇస్తున్నాయి. ఇవేవీ వద్దని క్యాషే కావాలనుకుంటే వైద్యుని బంధువులు, స్నేహితుల పేరుపై లేదా మెడికల్ రెప్ పేరుపైనే కంపెనీలు చెక్కులను పంపిస్తాయి. వాటిని డ్రా చేసుకుని నగదును మాత్రం వైద్యులకు ముట్టజెప్పాలి. మరికొందరు వైద్యులు కుటుంబానికి అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలను ఫార్మాకంపెనీలతో సమకూర్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తగ్గేది లేదంటున్న ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారే కాదు ఆర్ఎంపీలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు డిగ్రీలు పెట్టేసుకుని వైద్యం చేస్తున్నారు. వన్‌టౌన్, కల్లూరు ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీలు తమ బోర్డులో ఫిజీషియన్ అండ్ సర్జన్‌గా పెట్టుకుని వైద్యం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారు ఆదోని డివిజన్లోని కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు, పత్తికొండ, తుగ్గలి, కోడుమూరు, మంత్రాలయం ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు. బోర్డులో డిగ్రీల పేరు చూసి నిజంగా వారు అంత చదివారేమోనని అక్కడి ప్రజలు నమ్మి మోసపోతున్నారు. -
ఫార్మా ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు కీలకం
కూకట్పల్లి: దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్య భద్రతకు ముఖ్యమైన ఫార్మా రంగం ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయని, ఔషధాల ఎగుమతుల్లో మూడింట ఒక వంతు రెండు రాష్ట్రాలే చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. శనివారం బాలానగర్‌లోని నైపర్‌లో జరిగిన బల్క్‌డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఇండియా) ఆధ్వర్యంలో ‘ఫార్మా రంగ ఉత్పత్తిలో వచ్చిన తాజా మార్పులు–పోస్ట్ కోవిడ్ సవాళ్లు, అవకాశాలు’అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేశ్ మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ 2021–22లో యూఎస్డీ 24.61 బిలియన్లను అధిగమించి ఎగుమతులు చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 శాతం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో బలమైన ఫార్మాస్యూటికల్ రంగం, శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఉందన్నారు. జీడిమెట్ల, పాశ మైలారం, బొల్లారం వంటిపారిశ్రామిక ఎస్టేట్లలో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయటం గర్వకారణమని జయేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీడీఎంఈఐ అధ్యక్షుడు అగర్వాల్, భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ జాయింట్ సెక్రటరీ యువరాజ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ రామకిషన్, నైపర్ డైరెక్టర్ శశి బాలాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మండిపోతున్న బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఉందిగా! -
తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్ ఫార్మా మరో రూ.500 కోట్లు..
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బుధవారం ఫెర్రీ ఫార్మా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం శుభవార్తను మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో యూనిట్‌ను నెలకొల్పేందుకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఫెర్రీ ఫార్మా అంగీకారం తెలిపిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్విట్జర్లాండ్‌కి చెందిన ఫ్రెర్రింగ్ ఫార్మా గతంలోనే తెలంగాణలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే రూ. 500 కోట్లు కేటాయించింది. వీటితో హైదరాబాద్‌లో ఫార్ములేటింగ్ సెంటర్‌ను నెలకొల్పింది. దీన్ని మంత్రి కేటీఆర్ రెండు నెలల కిందట ప్రారంభించారు. ఇంతలో దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు జరగడం ఫెర్రీ ప్రతినిధులతో మరోసారి కేటీఆర్ సమావేశం కావడం జరిగింది. ఫలితంగా రెండో యూనిట్ స్థాపనకు రూ.500 కోట్ల కేటాయించేందుకు ఫ్రెర్రీ ఫార్మా ముందుకు వచ్చింది. More good news coming in for #Telangana from Davos! Delighted to announce that Switzerland headquartered @ferring Pharma will be expanding in Hyderabad with an investment of ₹ 500 Crores for setting up of another formulation unit#TelanganaAtDavos #InvestTelangana #WEF22 pic.twitter.com/3nkVzP5PEB — KTR (@KTRTRS) May 25, 2022 చదవండి: తెలంగాణకు రాబోతున్న స్విస్ రైల్ కోచ్ తయారీ కంపెనీ! రూ. 1000 కోట్లతో.. -
జీనోమ్ వ్యాలీలో ఫెర్రింగ్ ఫార్మా
స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముక ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ హైదరాబాద్‌లో తన కార్యకలపాలు ప్రారంభించింది. జీనోమ్ వ్యాలీలో నిర్మాణం జరుపుకున్న వరల్డ్ క్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 2022 ఏప్రిల్ 25న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫెర్రింగ్ సంస్థ తొలుత ఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని మహారాష్ట్రలో ప్రారంభించాలని అనుకుందని.. కానీ ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలిపారు. ఫెర్రింగ్ సంస్థ యాభై ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉంది. 60కి పైగా దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. రీప్రొడక్టివ్ హెల్త్, మెటర్నల్ హెల్త్, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల్లో పని చేస్తోంది. తొలి విడతగా హైదరాబాద్‌లో 30 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. చదవండి: అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్ -
ఫార్మా కంపెనీల ఆదాయంలో 6-8 శాతం వృద్ధి: ఇక్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థల ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. నివేదిక ప్రకారం, 2021–22లో ఈ కంపెనీలు 8–10 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు ఓ మోస్తరుగా ఉంటాయి. దేశీయంగా 7–9 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 12–14 శాతం, యూరప్ వ్యాపారం 7–9 శాతం వృద్ధి నమోదు కానుందని ఇక్రా పేర్కొంది. ధరల ఒత్తిడి కారణంగా అమెరికా మార్కెట్ వృద్ధి నిలకడగా ఉంటుంది. కంపెనీలు క్లిష్ట జనరిక్స్, ఫస్ట్ టు ఫైల్ అవకాశాలు, ప్రత్యేక ఉత్పత్తులపై దృష్టి సారిస్తుండటంతో పరిశోధన, అభివృద్ధి వ్యయాలు ఆదాయాల్లో 6.5–7.5 శాతం ప్రస్తుత స్థాయిలలో స్థిరీకరించబడతాయి. ఇటువంటి ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగంలో స్థిర పెట్టుబడులు రానున్నాయి. ఇది మధ్య కాలంలో వృద్ధికి, లాభాల మెరుగుదలకు తోడ్పడతాయి.21 కంపెనీల పనితీరును ఆధారంగా చేసుకుని ఇక్రా ఈ విషయాలను వెల్లడించింది. -
పెట్టుబడులు పెట్టండి.. విరాళాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయెన్స్ శనివారం నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కంటే ముందే 2001లో ఏర్పడిన ఛత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇంకా ఒడిదొడుకుల్లోనే ఉండగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటులో అభివృద్ధితో పాటు భారత ఆర్థిక పురోగతిలో కీలకంగా మారిందని చెప్పారు. విద్యుత్ కొరతను అధిగమించడంతో పాటు వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందేవరకు జరిగిన పరిణామాలను వివరించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటితో పాటు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి రంగంలో సాధించిన మార్పును గణాంకాలతో చెప్పారు. ఐటీని పట్టణాలకు విస్తరిద్దాం: ప్రముఖ భారతీయ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని కేటీఆర్ సన్మానించి ఆయన సేవలను ప్రశంసించారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు పెట్టుబడులతో ముం దుకు రావాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. మన ఊరు–మన బడికి విరాళాలు ప్రకటించిన ప్రవాస భారతీయులను శాలువాలతో సత్కరించారు. ఫైజర్, జాన్సన్, జీఎస్కే ప్రతినిధులతో భేటీ ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్కే) ప్రతినిధులతో కేటీఆర్ శనివారం భేటీ అయ్యారు. లైఫ్ సైన్సెస్‌కు సంబంధించి తెలంగాణలో ఉన్న అవకాశాలు, మానవ వనరులు, ఫార్మా పరిశోధనలకు అనుకూలతలపై కంపెనీలకు కేటీఆర్ వేర్వేరుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే 20వ బయో ఏషియా సదస్సుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులతో పాటు విస్తరణ ప్రణాళికను ఆయా కంపెనీలు కేటీఆర్‌తో పంచుకున్నాయి. సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌కు స్ప్రింక్లర్ సోషల్ మీడియా రంగంలో పేరొందిన అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ స్ప్రింక్లర్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీనివల్ల వెయ్యి మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కంటెంట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రీసెర్చ్‌లో స్పి్రంక్లర్కు ప్రత్యేక స్థానం ఉంది. న్యూయార్క్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్ విద్యార్థిగా, ఉద్యోగిగా తాను న్యూయార్క్‌లో గడిపిన రోజులను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో అడుగు పెట్టిన నాటి నుంచి తీరిక లేకుండా గడుపుతున్న కేటీఆర్.. శనివారం ఫైజర్ సీఈవోతో భేటీ తర్వాత న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తర్వాతి సమావేశానికి బయలుదేరారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్‌తో కూడిన చికెన్ రైస్‌ను కొని తిన్నారు. సమావేశానికి ఆలస్యం అవుతుండటంతో న్యూయార్క్‌లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కివెళ్లారు. -
దివీస్ లాబోరేటరీస్.. తెలంగాణలో నంబర్ వన్.. మరీ జాతీయ స్థాయిలో ?
కొత్త రాష్ట్రమైనా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో దేశానికే హబ్‌గా మారింది. తెలంగాణలో నెలక్పొలిన పరిశ్రమలు, తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ లాభార్జనలోనూ ముందుంటున్నాయి. తాజాగా బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా ఐదో ఎడిషన్ టాప్ 500 ఇండియన్ కంపెనీల జాబితాలో ఏకంగా 29 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. దివీస్ నంబర్ వన్ దేశంలోనే అత్యంత విలువైన ఐదు వందల కంపెనీల జాబితాను బర్గండీ ప్రైవేట్ హురున్ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ జాబితా ప్రకారం రూ.1.36 లక్షల కోట్ల విలువతో దివీస్ లాబోరేటరీస్ తెలంగాణలోనే అత్యంత విలువైన కంపెనీగా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆలిండియా స్థాయిలో ఈ కంపెనీ 33వ స్థానంలో ఉంది. టాప్ 5 కంపెనీలు దివీస్ ల్యాబరేటరీస్ తర్వాత స్థానంలో హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ చోటు దక్కించుకుంది. రూ. 1.31 లక్షల కోట్ల విలువతో తెలంగాణలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలబడింది. ఆలిండియా స్థాయిలో ఈ కంపెనీ 35వ స్థానంలో ఉంది. దివీస్, హిందూస్థాన్ జింక్ తర్వాత డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్‌లు నిలిచాయి. టాప్ 5 కంపెనీల్లో నాలుగు ఫార్మా రంగానికి సంబంధించినవే కావడం విశేషం. రాష్ట్ర జీడీపీలో 18 శాతం వాటా బర్గండి ప్రైవేట్ హురున్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న తెలంగాణకు చెందిన 29 కంపెనీల విలువ 6.9 లక్షల కోట్లు ఉండగా ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీల విలువనే రూ. 3.45 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. ఈ 29 కంపెనీలు సుమారు రెండు లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ రాష్ట్ర జీఎస్డీపీలో 18 శాతం వాటాను దక్కించుకున్నాయి. బర్గండి లిస్టులో మరిన్ని ఆసక్తికర అంశాలు - టాప్ 500 కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన బ్రైట్‌కామ్ గ్రూపు 2,791 శాతం వృద్ధిరేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కంపెనీగా ప్రథమ స్థానంలో నిలిచింది. - రూ. 2010 కోట్ల కార్పోరేట్ ట్యాక్స్‌తో హెల్త్‌కేర్ (న్యుమరో యూనో) సెక్టార్లో అధిక పన్ను చెల్లించిన కంపెనీగా గుర్తింపు పొందింది. - నెట్ ప్రాఫిట్ విషయంలో టాప్ 20 కంపెనీల్లో తెలంగాణ కంపెనీలు రెండు చోటు దక్కించుకున్నాయి. హిందుస్థాన్ జింక్ రూ.7980 కోట్లతో 13వ స్థానం, అరబిందో ఫార్మా రూ.5389 కోట్లతో 19వ స్థానం దక్కించుకున్నాయి. - రూ. 28,900 కోట్ల విలువతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టాప్ 10 బూట్స్ట్రాప్డ్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. కంపెనీ విలువ దివీస్ లాబ్యరేటరీస్ రూ.1.36 లక్షల కోట్లు హిందూస్థాన్ జింక్ రూ.1.31 లక్షల కోట్లు డాక్టర్ రెడ్డీస్ రూ. 77 వేల కోట్లు అరబిందో ఫార్మా రూ. 41 వేల కోట్లు లారస్ ల్యాబ్స్ రూ.30 వేల కోట్లు చదవండి: కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన కంపెనీలు..! -
మందులోడా... ఓరి మాయలోడా!
మనుషుల అవసరాలే వ్యాపారులకు లాభాలు తెచ్చే గనులు. మనుషులకు ఏం కావాలో ఓ కంట కనిపెట్టి వ్యాపారులు వాటిని తయారు చేసే పనిలో పడతారు. యుగాల తరబడి జరుగుతున్నది ఇదే. అసలైన వ్యాపారి ఎడారిలో ఇసుకను ఒంటెలకు అమ్మి బతికేయగలడు. తన దగ్గర ఉన్నదాన్నే ప్రజలకు అవసరం అయ్యేలా చేసే వ్యాపారులు మాయలోళ్లే! డబ్బు అవసరం ఉన్నవారికి వడ్డీకి అప్పులు ఇవ్వడం కొందరి వ్యాపారం. డబ్బుకు ఎంతగా కటకటలాడుతున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా వడ్డీ రేటు పెంచేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద దేశాలు కూడా అదే చేస్తాయి. చిన్న దేశాల అవసరాలను ఆసరా చేసుకొని, ఆ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి వాటికి ఆర్థిక సాయం ముసుగులో అప్పుల ఊబిలోకి దింపేస్తాయి.ఒకప్పటి పెద్దన్న అమెరికాను కూడా భయపెడుతున్న చైనావాడు చేస్తున్నది అదే! ఎవరికన్నా ఏ రోగమో వస్తే దాన్ని నయం చేసే మందు తయారు చేయడం లాభసాటి వ్యాపారం. మరి మనుషులకు రోగాలే రాకపోతే ఆ వ్యాపారుల పరిస్థితి ఏంటి? అందుకోసం ఆ వ్యాపారులు ఏం చేస్తారు? అందరికీ తరచుగా రోగాలు వస్తూ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటారు. ప్రపంచాన్ని శాసిస్తున్నది ఔషధ వ్యాపారమే! ఫార్మా కంపెనీలు మూడు మాత్రలు... ఆరు గోలీలన్నట్లు దూసుకుపోతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వర్షాకాలం ఆరంభంలో జ్వరం రావడమే పెద్ద రోగం. దానికి మిరియాల కషాయంతోనో, శొంఠి కషాయంతోనో వంటింటి వైద్యం చేసేసుకునేవారు. రెండేళ్ళుగా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఈ రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల మేరకు ఔషధ వ్యాపారం, ఆసుపత్రుల వ్యాపారం జరిగాయి. ఎప్పుడూ వినని, ఎన్నడూ కనని కరోనా రోగం ఓ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ వైరస్ దానంతట అదిగా పుట్టిందా, లేక మనుషులే తయారు చేశారా అన్న చర్చ ప్రపంచాన్ని పట్టి కుదిపేసింది. కారణం – ఈ వైరస్‌ను చైనాలోని వూహాన్ ల్యాబ్ నుండి ప్రపంచంపైకి వదిలిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, దీనికి కారణం చైనా కాదు... చైనాలోని అమెరికాకు చెందిన మాంసం ఎగుమతి కర్మాగారాలేనని మరో వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలలో ఎవరు చెప్పింది నిజమైనా... ఈ రోగాన్ని ప్రపంచానికి అంటించింది మాత్రం మనుషులేనన్నది అర్థమవుతోంది. అది నిజంగానే నిజం అయితే... అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. ఒకప్పుడు కలరా వణికించింది. మలేరియా భయపెట్టింది. వాటికి వ్యాక్సిన్లు తయారుచేశారు. అటువంటి ఓ కొత్త వ్యాపారం కోసమే కరోనాను కనిపెట్టారా? అది నిజం కాదని అంటే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ అదే నిజం అయితే మాత్రం చాలా చాలా భయంగానూ ఉంటుంది. భయం... ఇక్కడ రోగం వల్ల కాదు... దాన్ని మనపైకి వదిలిన దుర్మార్గుల వల్ల! కొన్నేళ్లుగా చికున్ గున్యా, డెంగ్యూ జ్వరాలు మన దేశంలో స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు అసలీ రెండు జ్వరాల ఊసే లేదు. అప్పుడు లేని జ్వరాలు ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి అని కొందరి ప్రశ్న. కొంపదీసి ఈ జ్వరాలను వ్యాప్తి చేసే దోమలను కూడా ఎవరో ఉత్పత్తి చేసి మానవాళిపైకి వదిలారా? జ్వరాలతో జనం వణుకుతూ ఉంటే... వాటికి మందులు అమ్మి, లాభాలు గడిస్తున్నారా? అని మరికొందరికి మాచెడ్డ అనుమానం. నిజానిజాల సంగతి తరువాత కానీ... ముందుగా అసలీ అనుమానాలు ఎందుకు వస్తున్నాయని అడిగామనుకోండి... ఔషధ వ్యాపారులతో పాటు బడా ఆసుపత్రుల భారీ ధనాశ చూస్తోంటే ఈ లోకంలో ఏదైనా సాధ్యమేనని అనిపించడం లేదా అని మనల్ని ఎదురు ప్రశ్నిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఇంతగా పెరగని కాలంలో... గర్భవతులకు నూటికి నూరు శాతం సాధారణ డెలివరీలే అని ఆ తరం పెద్దవాళ్ళు చెబుతుంటారు. వైద్యవిద్య అంటే ఏమిటో కూడా తెలియని మంత్రసానులు పురుళ్లు పోసి, పండంటి బిడ్డలను కానుకగా ఇచ్చేవారు. తేడా ఎక్కడ ఉందో తెలీదు కానీ... ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతూ వచ్చాయి. ఏడు నెలల గర్భవతి కడుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వస్తే చాలు... సిజేరియన్ చేయకపోతే తల్లికీ బిడ్డకీ ప్రమాదమేనని చెప్పి ఆపరేషన్లు చేసేస్తున్నారు అని కొందరి తీవ్ర ఆరోపణ. నిజానికి, అటు రోగాల్లోనూ, మందుల్లోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అవి అన్నీ కచ్చితంగా చెడ్డవి కావు. అలా గంపగుత్తగా ఓ ముద్ర వేసేయడం సరైనది కాదు. నయం కాని రోగాలకు కొత్త మందులు ఆవిష్కరించడం శాస్త్రీయ పరిశోధనలో కచ్చితంగా పెద్ద ముందడుగే. కాకపోతే ఆ మందుల అవసరం లేని వాళ్లతో కూడా వాటిని కొనిపించడానికి ప్రయత్నిస్తేనే... తప్పు. అలా చేసే వారే అసలు విలన్లు. ఏ వ్యాపారాన్నైనా క్షమించవచ్చు కానీ... విద్య, వైద్యం లాంటి విషయాల్లో మాత్రం కాదు. ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కనిపెట్టి, కళ్ళెం వేయాల్సింది పాలకులే. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న నానుడి పుట్టిన దేశం మనది. ఇక్కడే వైద్యం అంటే... డబ్బు కోసం జరిగే వ్యాపారం అనిపిస్తే మాత్రం మంచిది కాదు. అందుకే, ఈ రోగాన్ని నయం చేయడమెలాగో అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదో ఒక మందు కనిపెట్టాలి! -
భాగ్యనగరంలో అత్యంత ఆస్తిపరులు వీళ్లే
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ సంస్థలు ప్రకటించిన దేశంలోని టాప్ 100 ధనవంతుల జాబితాలో ముగ్గురు హైదరాబాదీలు చోటు దక్కించుకున్నారు. అంతేకాదు గతేడాదితో పోల్చితే హైదరాబాద్‌లో ధనవంతుల సంఖ్య పెరుగుతున్నట్టు కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఫార్మా కంపెనీ వారే.. బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియా హబ్‌గా పేరు తెచ్చుకుంది హైదరాబాద్. ఈ పేరుకు తగ్గట్టే ఐఐఎఫ్ వెల్త్, హురున్ ఇండియా రిచ్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ధనవంతుల్లో ముగ్గురు ఫార్మా రంగానికి చెందినవారే కావడం గమనార్హం. దివీస్ మురళీ, హెరిటో గ్రూప్ పార్థసారథిరెడ్డి, ఆరబిందో ఫార్మా పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డిలు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ టాప్ 100లో ఉన్నారు. దివీస్ మురళీ ఆస్తులు ఐఐఎఫ్ఎల్, హురున్ ఇండియా 2021 ఏడాదికి గాను ప్రకటించిన వంద మంది ఐశ్వర్యవంతుల జాబితాలో దివీస్ ల్యాబ్స్ యజమాని దివి మురళి 14వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 79,000 కోట్లుగా హురున్ జాబితా తెలిపింది. గతేడాదికి సంబంధించిన జాబితాలో ఆయన రూ. 49,200 కోట్ల రూపాయలతో 17వ స్థానంలో నిలవగా, ఈసారి మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం.. ఏడాది కాలంలో ఆయన ఆస్తులు 61 శాతం పెరిగాయి. దీంతో మూడు స్థానాలు పైకి చేరుకున్నారు. హెటిరో, అరబిందో గతేడాది హురున్ ప్రకటించిన టాప్ 100 జాబితాలో రూ, 13,900 కోట్ల రూపాయల ఆస్తులతో హెటిరో సంస్థ ప్రమోటర్ పార్థసారథిరెడ్డి 88వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన ఆస్తుల విలువ రూ. 26,100 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో టాప్ 100 లిస్టులో ఆయన 23 స్థానాలు మెరుగుపరుచుకుని 58వ స్థానంలో నిలిచారు. ఇక అరబిందో గ్రూపు ప్రమోటర్ పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి రూ. 19,000 కోట్ల ఆస్తులతో 86వ స్థానంలో నిలిచారు. వెయ్యి కోట్లకు పైన ఫార్మా, ఐటీ తదితర పరిశ్రమలతో విరాజిల్లుతున్న హైదరాబాద్ నగరంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. మానవ వనరులు, మౌలిక సదుపాయలు మెరుగ్గా ఉండటంతో ఇక్కడ వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వారు హైదరాబాద్‌లో 1007 మంది ఉన్నట్టు హురున్ వెల్లడించింది. దేశంలో అత్యధిక మంది ఐశ్వర్యవంతులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. వీళ్లు కూడా లారస్ ల్యాబ్స్ ఫౌండర్ సీ సత్యనారాయణ ఆస్తులు రూ. 8400 కోట్లు, సువెన్ ఫార్మాస్యూటికల్ ప్రమోటర్ జాస్తి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ ఆస్తులు రూ. 9,700 కోట్లు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి జీఏఆర్ గ్రూప్ ప్రమోటర్ జీ అమరేందర్‌రెడ్డి ఆస్తుల విలువ రూ. 12,000 కోట్లు ఉన్నట్టు హురున్ ప్రకటించింది. చదవండి : అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు! -
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఈ. సైమన్ వాంగ్ అన్నారు. వాంగ్ తన ప్రతినిధుల బృందంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సోమవారం అరణ్యభవన్‌లో కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో వాంగ్ హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు వాంగ్ చెప్పారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి వెల్లడించారు. డేటాసెంటర్లకు అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ వ్యాక్సిన్ హబ్‌గా మారిందన్నారు. సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా తెలంగాణ అనువైందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరా.. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాల గురించి సింగపూర్ ప్రతినిధులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని హరీశ్ తెలిపారు. సముద్రమట్టం నుంచి వంద నుంచి 630 మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉందని, గోదావరి నీటిని 630 ఎత్తు వరకు ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఏడున్నరేళ్ల కాలంలో వ్యవసాయం రంగంలోనూ సమూల మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. ఫలితంగా రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ రంగంలోనూ స్వావలంభన సాధించామన్నారు. వచ్చే పర్యటనలో తెలంగాణలోని పల్లెలను సందర్శించి ప్రజల జీవన విధానం పరిశీలించాలన్నారు. సిద్దిపేట జిల్లాను సందర్శించాలని కోరారు. ఈ భేటీలో సింగపూర్ హైకమిషన్ సెక్రటరీలు సెన్ లిమ్, అమండా క్వెక్, సింగపూర్ కన్సోల్ జనరల్ (చైన్నై) పాంగ్ కాక్ టైన్, వైస్ కన్సోల్ జనరల్ అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ను శాలువాతో సత్కరించారు. చదవండి: సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా! -
కాలకూటవిషాన్ని జనం పైకి చిమ్ముతున్నారు!
హైదరాబాద్: జీడిమెట్ల, కుత్భుల్లాపూర్ పరిసరాల్లో వంద వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇతర రసాయనిక, రీసైక్లింగ్ పరిశ్రమలున్నాయి. వాటిల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకర ఘన, ద్రవ రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాం టి ఏర్పాట్లే లేవు. గాఢత అధికంగా ఉన్న వ్యర్థాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. ఆ ఊసే పట్ట డంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని యాజమాన్యాలు ఎప్పుడో గాలి కొదిలేశాయి. గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రమ్ముల్లో నింపి శివారు ప్రాంతా ల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్ చేస్తున్నా రు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబో స్తున్నారు. వ్యర్థాల డంపింగ్‌తో కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, తదితర పారిశ్రామికవాడ లు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. భూగర్భజలాలు విషతుల్యం ఇలా.. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిపిన అధ్యయనంలో జీడిమెట్ల ప్రాంతంలో భూగర్భజలాలు విషతుల్యమైనట్లు తేలింది. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలను ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భార లోహాలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. జీడిమెట్ల, సుభాష్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలోనూ ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రజలు కోరుతోందిది.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న, పారిశ్రామిక వ్యర్థజలాలను ఆరుబయట, బోరుబావుల్లోకి వదిలిపెడుతున్న పరిశ్రమలను మూసివేయాలి. పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖ లకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందా లను రంగంలోకి దించాలి. ఆయా బృందాలు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉల్లంఘనుల ఆట కట్టించాలి. నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి వాటిని పీసీబీ, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్ల కార్యాలయంలోని టీవీలకు అనుసంధానించాలి. పీసీబీ వివరణ ఇదీ.. జీడిమెట్ల ప్రాంతంలో పరిశ్రమల ఆగడాలపై ‘సాక్షి’పీసీబీ అధికారులను వివరణ కోరగా.. మా వద్దకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారం నడుచుకోని పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలపడం గమనార్హం. మేము పదేళ్లుగా సుభాష్‌నగర్‌లో ఉంటున్నం. మా నివాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా రీసైక్లింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నరు. రసాయనాలు నిండిన డ్రమ్ములు, కవర్లను ఇక్కడకు తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తుండటంతో ఇళ్లల్లోకి విపరీతమైన దుర్వాసన వస్తోంది. కడిగిన నీటిని నాలాలు, రోడ్లపై పారబోస్తున్నరు. దీంతో తరచూ అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నం. మా ఇళ్లలో బోరుబావుల్లోనూ విష రసాయనాలు నిండిన నీళ్లే వస్తున్నయ్. ఈ నీటిని తాగితే చర్మరోగాలు వస్తున్నయ్. లక్ష్మి మనోవేదన ఇది.. ఈ ఆవేదన వీరిద్దరిది మాత్రమే కాదు.. జీడిమెట్ల, కుత్భుల్లాపూర్ పరిసరాల్లో నివసిస్తున్న 60 కాలనీలు, బస్తీల్లోని వేలాది మందిది. ఆ ప్రాంతంలో సుమారు వంద వరకు ఉన్న బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష రసాయన వ్యర్థాలతో గాలి, నీరు, నేల కాలుష్య కాసారంలా మారాయి. జనంపైకి విషం చిమ్ముతున్న పరిశ్రమల ఆగడాలు శ్రుతిమించుతుండటంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను కట్టడిచేయడంలో పీసీబీ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ ‘మా మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు నివసిస్తున్నయ్. మా అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని ఉన్న కోపల్లి ఫార్మా పరిశ్రమ నుంచి ఐదేళ్లుగా రాత్రిపూట విపరీతమైన దుర్వాసన వస్తోంది. గతంలో పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా జూలై 2019లో పరిశ్రమను మూసేశారు. తిరిగి 15 రోజుల్లోనే పరిశ్రమ మళ్లీ తెరుచుకుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా దుర్వాసన వస్తుండటంతో శ్వాస కోశవ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నం’ –లింగారావు ఆవేదన ఇది.. -
హెల్త్‌కేర్ కౌంటర్లు ధూమ్‌ధామ్
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కేసులు దేశీయంగా తగ్గుముఖం పట్టడంతోపాటు.. సాధారణ జీవనానికి ప్రజలు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఫార్మా రంగ కౌంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం కోవిడ్-19కు ముందు స్థాయిలో తిరిగి ఆసుపత్రులు వివిధ ఆరోగ్య సేవలకు తెరతీయడం ప్రభావం చూపుతున్నట్లు హెల్త్‌కేర్ రంగ నిపుణులు పేర్కొన్నారు. హెల్త్‌కేర్ యూనిట్లలో నాన్‌కోవిడ్ విభాగాలకు తిరిగి రోగుల తాకిడి పెరుగుతున్నట్లు కేర్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, దేశ విదేశాల నుంచి దేశీ ఫార్మా కంపెనీలకు ఆర్డర్లు లభిస్తుండటం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా యాంటీవైరల్స్, యాంటీమలేరియా, యాంటీబయోటిక్స్ తదితర విభాగాలలో ఔషధాల విక్రయాలు పెరుగుతున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఎన్ఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ 2 శాతంపైగా బలపడింది. 12,637 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. గత ఐదు రోజులుగా హెల్త్‌కేర్ ఇండెక్స్ ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం.. హైజంప్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫార్మా రంగ కౌంటర్లు పలు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఆర్తి డ్రగ్స్ 7 శాతం జంప్‌చేసి రూ. 803ను తాకగా.. ఎఫ్డీసీ లిమిటెడ్ 5.5 శాతం ఎగసి రూ. 365కు చేరింది. ఈ బాటలో డిష్‌మ్యాన్ కార్బొజెన్ 8.4 శాతం దూసుకెళ్లి రూ. 158 వద్ద, క్యాప్లిన్ ల్యాబ్ 5.5 శాతం లాభంతో రూ. 520 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో సింజీన్ ఇంటర్నేషనల్ 7.5 శాతం దూసుకెళ్లి రూ. 615 వద్ద కదులుతోంది. తొలుత రూ. 614ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక ఇంట్రాడేలో రూ. 172 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సీక్వెంట్ సైంటిఫిక్ 5 శాతం బలపడి రూ. 168 వద్ద ట్రేడవుతోంది. ర్యాలీ బాట ప్రస్తుతం నాట్కో ఫార్మా 5 శాతం ఎగసి రూ. 962 వద్ద కదులుతోంది. తొలుత రూ. 996 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఇదేవిధంగా గ్లెన్‌మార్క్ ఫార్మా 5.5 శాతం లాభంతో రూ. 531 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 542 వరకూ ఎగసింది. ఇతర దిగ్గజాలలో 3 శాతం లాభంతో సన్ ఫార్మా రూ. 586 వద్ద, డాక్టర్ రెడ్డీస్ 5,55 వద్ద, లుపిన్ రూ. 957 వద్ద కదులుతున్నాయి. బయోకాన్, అరబిందో, ఆల్కెమ్ ల్యాబ్, సిప్లా, టొరంట్ ఫార్మా సైతం 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. -
తెలంగాణ బ్రాండ్.. సర్కారీ మెడికల్ షాపులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ షాపుల ఇష్టారాజ్య ధరలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ జనరిక్ ఔషధ దుకాణాలు ఏర్పాటుకానున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో, బయట వీటిని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ మెడికల్ షాపుల్లో తక్కువ ధరకే ‘తెలంగాణ బ్రాండ్’ జనరిక్ మందులు లభిస్తాయి. దీనిపై ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్ షాపుల్లో అమ్మే మందులపై ప్రత్యేకంగా ‘తెలంగాణ ప్రభుత్వ సరఫరా’అని లేబుల్ అంటిస్తారు. ప్రైవేట్ మందుల దుకాణాల హవా రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ, బయట కొన్ని మందుల దుకాణాలదే పెత్తనం. వారు చెప్పిందే ధర. తక్కువకు దొరికే మందులనూ అధిక ధరకు రోగులకు అంటగడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇక, కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకే దుకాణాలను కేటాయిస్తున్నారు. వాటిల్లో కొన్ని ఏజెన్సీలు నాసిరకం మందులను సరఫరా చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చే మందులను మాత్రమే తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) సమకూరుస్తోంది. ఈ సంస్థ ప్రభుత్వాస్పత్రులకు రూ.200 కోట్లకుపైగా విలువైన 600 రకాల ఔషధాలు, ఇతరత్రా సర్జికల్ పరికరాలను సరఫరా చేస్తోంది. వీటిలో 300 రకాల మందులు అత్యవసరమైనవి. గ్లోబల్ టెండర్ల ద్వారా ఖరారవుతున్న ఈ ఔషధాల ధర ఎక్కువ కావడంతో ప్రజలు నష్టపోతున్నారు. (చదవండి: మార్చి వరకు ఉచిత బియ్యం!) సహకరించని కంపెనీలు రాష్ట్రంలో 800 ఫార్మా, బయోటిక్, మెడికల్ టెక్నాలజీ కంపెనీలున్నాయి. అందులో ఎక్కువ కంపెనీలు అంతర్జాతీయ ప్రసిద్ధి గలవే. ఇక్కడి నుంచే ఆయా కంపెనీల ద్వారా 168 దేశాలకు ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్‌గా పేరొందినా.. అనేక కంపెనీలు ఔషధాలను ప్రభుత్వానికి అమ్మడం లేదన్న, రాష్ట్రంలోని పేదలకు తమ డ్రగ్స్ అందుబాటులోకి తేవడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరాకు రాష్ట్రంలోని పదిలోపు ఫార్మా కంపెనీలే సహకరిస్తున్నాయని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ కంపెనీలతో పాటు జనరిక్ మందులు తయారుచేసే ప్రముఖ బ్రాండెడ్ ఫార్మా కంపెనీలతో భేటీ కావాలని సర్కారు యోచిస్తోంది. ఆయా కంపెనీల నుంచి భాగస్వామ్యం కోరాలని, ఔషధాలను మన రాష్ట్ర రేట్లకు తగ్గట్లుగా విక్రయించేలా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఎందుకు ముందుకు రావట్లేదంటే.. అంతర్జాతీయంగా ఎగుమతి చేసే మన ఫార్మా కంపెనీలు ప్రభుత్వాస్పత్రులకు ఔషధాలు విక్రయించకపోవడానికి.. కఠినమైన షరతులే కారణమని చెబుతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెడితే అంతర్జాతీయంగా వ్యాపారం దెబ్బతింటుందన్న భయం అనేక ఫార్మా కంపెనీల్లో ఉంది. ఒకసారి టెండర్లకు ఒప్పుకుంటే బకాయిలు పేరుకుపోతున్నా మందులు సరఫరా చేయాలి. బకాయిలు చెల్లించలేదని సరఫరా నిలిపివేసినా జరిమానాలు విధించే పరిస్థితి ఉంది. దీంతో తమకు రావాల్సిన డబ్బులు రాకపోగా, ఎదురు జరిమానాలు విధిస్తే ఎలా అనే అభిప్రాయంతో ఇవి ఉన్నాయి. ఇందుకే ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరాకు ఫార్మా కంపెనీలు ముందుకు రావట్లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఫార్మా కంపెనీల సలహాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే కొన్ని మార్పులుచేర్పులు చేయాలని యోచిస్తోంది. ఆలోచన ఉంది: ఈటల ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు పెట్టాలనే ఆలోచన ఉంది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇతర వర్గాల నుంచి సైతం దీనిపై ప్రతిపాదనలు అందుతున్నాయి. అయితే కసరత్తు మొదలుకాలేదు. –ఈటల రాజేందర్, వైద్య. ఆరోగ్యశాఖ మంత్రి జనరిక్.. బ్రాండెడ్.. ఏంటీ తేడా? ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు పరిశోధనలు, పరీక్షలు చేసి దాన్ని మార్కెట్లోకి తెస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీపై ఆ కంపెనీకి నిర్ణీతకాలం పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. అలా తయారుచేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు. పేటెంట్ ఉన్నంతవరకు ఇతరులు తయారు చేయకూడదు. మొదట తయారుచేసిన కంపెనీ పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపెనీ అయినా తయారుచేసి, మార్కెట్లోకి విడుదల చేయొచ్చు. అలా తయారు చేసిన మందులను జనరిక్ మందులంటారు. జనరిక్ డ్రగ్స్ తయారీకి ఎటువంటి పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు. మార్కెటింగ్ ఖర్చులూ ఉండవు. దీంతో బ్రాండెడ్ ఔషధాల ధరలతో పోలిస్తే జనరిక్ డ్రగ్స్ 30 నుంచి 80 శాతం తక్కువకే లభిస్తాయి. అదే జరిగితే మా పొట్టకొట్టినట్టే.. రాష్ట్ర ప్రభుత్వమే మందుల దుకాణాలను ఏర్పాటుచేస్తే.. చిన్న ప్రైవేటు మందుల దుకాణాదారుల పొట్టగొట్టినట్టే. ప్రభుత్వం జనరిక్ మందుల షాపులను నడపాలనుకున్నా చాలామంది డాక్టర్లు సహకరించే పరిస్థితి ఉండదు. చాలామంది డాక్టర్లు బ్రాండెడ్ మందులనే రాస్తున్నారు. –వేణుగోపాల్ శర్మ, రాష్ట్ర ప్రైవేట్ మెడికల్ షాపుల సంఘం ప్రతినిధి -
ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొం దిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడు తున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపం చంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి కల్ ఫార్ములేషన్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రాష్ట్రంలో మరో రూ. 400 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభిస్తుంది. వేయి కోట్ల ఫినిష్డ్ డోస్‌లను కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తామని గ్రాన్యూల్స్ ఇండియా ప్రకటించింది. తమ తాజా యూనిట్‌ను జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ కృష్ణప్రసాద్ వెల్ల డించారు. మరోవైపు లారస్ ల్యాబ్స్ కూడా జీనోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో దశల వారీగా ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లారస్ ల్యాబ్ జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్ పార్కులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని నెల కొల్పింది. ఇక్కడ యాంటీ రిట్రోవైరల్, అంకా లజీ, కార్డియోవా స్క్యులార్, యాంటీ డయా బెటిక్స్, యాంటీ ఆస్తమా, గ్యాస్ట్రో ఎంటరాల జీకి సంబంధించిన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడి యెంట్లను తయారు చేస్తుంది. ఉపాధి పెరుగుతుంది: కేటీఆర్ గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్ పెట్టు బడులతో తయారీ రంగంలో స్థానిక యువ తకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫార్మా సహా వివిధ రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రకటించారు. గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్, లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ మంగళవారం కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ నూతన పెట్టుబడుల గురించి వివరించారు. -
7 నెలల గరిష్టం- సెన్సెక్స్@ 40,180
దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల పట్టు బిగించిన బుల్ ఆపరేటర్లు మరోసారి తమ హవా చూపారు. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఒక్కసారిగా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఫలితంగా మార్కెట్లు 7 నెలల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు జంప్‌చేసి 40,183 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు జమ చేసుకుని 11,835 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు హైజంప్ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,469 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,062 వద్ద కనిష్టం నమోదైంది. నిఫ్టీ 11,906-11,791 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. ప్రపంచ మార్కెట్ల జోరు, ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫార్మా అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ 3.25 శాతం, ఫార్మా 2.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. బ్యాంకింగ్ 1 శాతం రియల్టీ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మీడియా 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, సిప్లా, టీసీఎస్, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటో, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్ 7.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే గెయిల్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఐషర్, ఎల్అండ్టీ, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, ఆర్ఐఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్ 3-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐటీ జోరు డెరివేటివ్ కౌంటర్లలో మైండ్‌ట్రీ, కేడిలా, ఐడియా, బయోకాన్, అపోలో హాస్పిటల్స్, కోఫోర్జ్, మదర్సన్, ఇన్ఫ్రాటెల్, బీవోబీ, భెల్, ఏసీసీ, ఎస్ఆర్ఎఫ్, గ్లెన్‌మార్క్ 7.3-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. వేదాంతా, అదానీ ఎంటర్, టాటా కన్జూమర్, బాష్, ముత్తూట్, ఆర్బీఎల్ బ్యాంక్, మెక్‌డోవెల్, టాటా పవర్, టీవీఎస్ మోటార్, పేజ్, చోళమండలం, ఐబీ హౌసింగ్ 4.2-1.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.3 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.25 శాతం డీలా పడింది. ట్రేడైన షేర్లలో 1,246 షేర్లు లాభపడగా.. 1,436 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే. -
కరోనా: 10 రకాల వ్యాక్సిన్ల అప్డేట్
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కోవిడ్-19 కట్టడికి గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను నిలువరించేందుకు వ్యాక్సిన్ల తయారీకి నడుం బిగించాయి. ఈ బాటలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలలో ఎంతో ముందంజ వేశాయి. అంతర్జాతీయ స్థాయిలో తొట్టతొలిగా రష్యా తయారీ వ్యాక్సిన్ అధికారికంగా రిజిస్టర్‌కాగా.. యూఎస్, బ్రిటన్ దేశాల ఫార్మా దిగ్గజాలతోపాటు.. దేశీయంగానూ కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ పరీక్షలకు చేరాయి. దేశీయంగా భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా తదితరాలు రేసులో ఉన్నాయి. దీంతో కొత్త ఏడాది అంటే 2021 ప్రారంభంలో కోవిడ్-19 చికిత్సకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోవిడ్-19 బారినపడుతున్న వారి సంఖ్య లక్షల్లో నమోదవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్ల పురోగతి వివరాలు ఎలా ఉన్నాయంటే... మోడర్నా ఇంక్ జెనెటిక్ మెటీరియల్(ఎంఆర్ఎన్ఏ) ఆధారంగా యూఎస్ కంపెనీ మోడర్నా ఇంక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా మానక కణాల్లో యాంటీజెన్‌ను ప్రేరేపిస్తుంది. తద్వారా ఇమ్యూనిటీ(రోగ నిరోధక శక్తి)ని పెంచేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాక్సిన్‌పై జులై 17 నుంచి 30,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను మోడార్నా ప్రారంభించింది. ఫైజర్- బయోఎన్‌టెక్ జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో చేతులు కలపడం ద్వారా ఫైజర్ ఇంక్.. ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జులై 27 నుంచీ రెండు, మూడో దశల క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. యూఎస్‌తోపాటు బ్రెజిల్, జర్మనీ తదితర దేశాలలో వీటిని చేపట్టింది. ఒక్క యూఎస్‌లోనే 43,000 మందిపై ప్రయోగాలు చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఆస్ట్రాజెనెకా- ఆక్స్ఫర్డ్ చింపాంజీ ఎడినోవైరస్ ఆధారంగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్- స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రూపొందించింది. మే నెలలో రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో 17,000 మందిపై పరీక్షించింది. మూడో దశలో భాగంగా యూఎస్‌లో 30,000 మందిపై పరీక్షిస్తోంది. దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ 1,700 మందిపై ప్రయోగాలు చేపట్టింది. యూఎస్‌లో తాత్కాలికంగా పరీక్షలను నిలిపివేసినప్పటికీ ఇతర దేశాలలో కొనసాస్తున్నట్లు తెలుస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ ఎడెనోవైరస్ వెక్టర్(ఏడీ26) ఆధారంగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఇంతక్రితం ఎబోలా, జికా, ఆర్ఎస్వీ తదితరాలకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఇది సింగిల్ డోసేజీలో రూపొందింది. ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. వివిధ దేశాలలో 60,000 మందిపై పరీక్షించే ప్రణాళికల్లో ఉంది. నోవావాక్స్ దశాబ్దాలుగా రీకాంబినెంట్ నానోపార్టికల్ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. 1.5 బిలియన్ డాలర్లను ఇందుకు వెచ్చించినప్పటికీ ప్రయత్నాలు పెద్దగా సఫలంకాలేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్-19కు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మంచి ఫలితాలనివ్వగలదని కంపెనీ భావిస్తోంది. ప్రొటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్‌గా పిలిచే ఈ ఔషధంపై కంపెనీ ఆశావహంగా ఉంది. యూకే ప్రభుత్వ సహకారంతో ఈ నెల 24 నుంచీ యూకేలో 10,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఏడాదికి 2 బిలియన్ డోసేజీల తయారీకి దేశ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్పుత్నిక్-వి తొలి రెండు దశల పరీక్షలు అత్యంత విజయవంతమైనట్లు ప్రకటించిన రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి తొలిసారి అధికారిక రిజిస్ట్రేషన్ పొందింది. అయితే మరో 40,000 మందిపై రష్యాలో మూడో దశ క్లినికల్ పరీక్షలను ఈ నెల నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయంగా తయారీతోపాటు, మూడో దశ క్లినికల్ పరీక్షలకు వీలుగా డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్ బయోటెక్ దేశీయంగా ఐసీఎంఆర్‌తో భాగస్వామ్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అందించిన స్ట్రెయిన్ ఆధారంగా ఇనేక్టివేటెడ్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను కోతులపై ప్రయోగించగా మంచి ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. జులై నుంచీ తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టింది. అక్టోబర్‌లో మూడో దశ పరీక్షలను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. దేశ, విదేశాలలో 25,000- 30,000 మందిపై ప్రయోగించే ప్రణాళికలున్నట్లు తెలుస్తోంది. జైడస్ క్యాడిలా ప్లాస్మిడ్ డీఎన్ఏగా పిలిచే వ్యాక్సిన్‌ను జెనెటిక్ మెటీరియల్ ఆధారంగా రూపొందించినట్లు జైడస్ క్యాడిలా పేర్కొంది. వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను జులైలో చేపట్టింది. మరో 15,000-20,000 మందిపై మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. సనోఫీ- జీఎస్కే జీఎస్‌కేతో భాగస్వామ్యంలో దేశీయంగా తయారీ, పంపిణీ సామర్థ్యాలు కలిగిన సనోఫీ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రొటీన్ సబ్యూనిట్ ఆధారిత ఈ వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ఈ నెల 3న ప్రారంభించింది. ఫలితాల ఆధారంగా ఈ ఏడాది చివరికల్లా మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. క్యాన్సినో బయోలాజిక్స్ హ్యూమన్ ఎడినోవైరస్(ఏడీ5) ఆధారంగా చైనా కంపెనీ క్యాన్సినో బయోలాజిక్స్ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇందుకు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మిలటరీ మెడికల్ సైన్స్ అకాడమీ సహకారాన్ని తీసుకుంది. ప్రత్యేక అవసరాలరీత్యా చైనీస్ మిలటరీ ఈ వ్యాక్సిన్‌ను జూన్ 25న అనుమతించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌లో 40,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఇందుకు రష్యా, పాకిస్తాన్, సౌదీ అరేబియా నుంచి అనుమతి పొందింది. -
లాభాలతో షురూ- ఫార్మా హైజంప్
ముందు రోజు వాటిల్లిన నష్టాల నుంచి బయటపడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 157 పాయింట్లు బలపడి 39,137ను తాకగా.. 44 పాయింట్ల లాభంతో 11,554 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,200- 39,065 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,584- 11,551 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా రెండో రోజు గురువారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఫార్మా జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా 3.2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 5-3 శాతం మధ్య జంప్‌చేయగా.. హిందాల్కో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హీరో మోటో, టీసీఎస్, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హెచ్‌యూఎల్, మారుతీ, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ మాత్రమే అదికూడా 1-0.2 శాతం మధ్య నీరసించాయి. డెరివేటివ్స్‌లోనూ.. డెరివేటివ్ కౌంటర్లలో లుపిన్ 6 శాతం జంప్‌చేయగా.. గ్లెన్‌మార్క్, దివీస్, అరబిందో, వోల్టాస్, మదర్సన్, టొరంట్ ఫార్మా, కేడిలా హెల్త్, టీవీఎస్ మోటార్, అశోక్ లేలాండ్, అపోలో హాస్పిటల్స్ 4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క జిందాల్ స్టీల్, కోఫోర్జ్, ఇండిగో, అపోలో టైర్, ఐడియా, ఐబీ హౌసింగ్, టొరంట్ పవర్, ముత్తూట్, బెర్జర్ పెయింట్స్, పిడిలైట్, ఎస్బీఐ లైఫ్, గోద్రెజ్ సీపీ, బంధన్ బ్యాంక్, కాల్గేట్, పీఎన్బీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1132 లాభపడగా.. 580 నష్టాలతో కదులుతున్నాయి. -
మూడోరోజూ ముందుకే..!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇంజినీరింగ్,ఆర్థిక, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 74.90కు చేరడం, ఫార్మా కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం.... సానుకూల ప్రభావం చూపించాయి. వరుసగా మూడో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు సగం మేర తగ్గిపోయాయి. ఇంట్రాడేలో 390 పాయింట్ల వరకూ ఎగిసిన సెన్సెక్స్ చివరకు 142 పాయింట్ల లాభంతో 38,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 11,270 పాయింట్ల వద్దకు చేరింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► లార్సెన్ అండ్ టుబ్రో షేర్ 5 శాతం లాభంతో రూ.960 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ఈ జూన్ క్వార్టర్లో నికర లాభం 81 శాతం ఎగియడంతో దివీస్ ల్యాబ్స్ షేర్ 12 శాతం లాభంతో రూ. 3,117 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.3,228ను తాకింది. ఈ షేర్‌తో పాటు పలు ఫార్మా షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అరబిందో ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, ఇప్కా ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, టొరెంట్ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. ఎస్ఆర్ఎఫ్, వీఎస్టీ టిల్లర్స్, వాబ్కో ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగ షేర్లు రయ్..! వందకు పైగా రక్షణ రంగ పరికరాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రక్షణ రంగ షేర్లు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.465ను తాకిన భారత్ డైనమిక్స్ షేర్ చివరకు శాతం లాభంతో రూ.437 వద్ద ముగిసింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్జ్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. -
ఫార్మా ధూమ్‌ధామ్- మార్కెట్లు అప్
విదేశీ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు పెరిగి 38,182 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం56 పాయింట్లు బలపడి 11,270 వద్ద ముగిసింది. యూఎస్, ఆసియా మార్కెట్లు అటూఇటుగా ముగిసినప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. ప్రధానంగా ఫార్మా కౌంటర్లు, డిఫెన్స్ రంగ షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ తొలుత గరిష్టంగా 38,431 వరకూ ఎగసింది. చివర్లో కాస్త మందగించి 38,073 వరకూ వెనకడుగు వేసింది. ఈ బాటలో నిఫ్టీ 11,337-11,238 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. సిప్లా జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా అత్యధికంగా 5.5 శాతం జంప్‌చేసింది. రియల్టీ దాదాపు 3 శాతం ఎగసింది. ఐటీ, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా 9.5 శాతం దూసుకెళ్లగా.. ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీ సిమెంట్, ఐసీఐసీఐ, ఐటీసీ, ఎస్బీఐ, టాటా స్టీల్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐషర్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, బీపీసీఎల్, ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, నెస్లే, గ్రాసిమ్, టీసీఎస్ 2.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. దివీస్ దూకుడు డెరివేటివ్స్‌లో దివీస్ ల్యాబ్ 12 శాతం దూసుకెళ్లగా.. బీఈఎల్, లుపిన్, నౌకరీ, ఐబీ హౌసింగ్, అరబిందో, అమరరాజా, మదర్సన్, పీఎఫ్సీ, డీఎల్ఎఫ్, గ్లెన్‌మార్క్ 9.5- 4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క కంకార్ 15 శాతం కుప్పకూలింది. ఇతర కౌంటర్లలో ఆర్బీఎల్, ముత్తూట్, సీమెన్స్, బాటా, బంధన్ బ్యాంక్, మణప్పురం, మ్యాక్స్ ఫైనాన్స్, పేజ్, ఎంఆర్ఎఫ్ 5.5-1.25 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,763 లాభపడగా.. 995 మాత్రమే నష్టాలతో నిలిచాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 397 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 468 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
వీక్ మార్కెట్లో ఫార్మా షేర్ల ర్యాలీ
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 95 పాయింట్లు క్షీణించి 37,835కు చేరగా.. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,138 వద్ద ట్రేడవుతోంది. అయితే ఫార్మా రంగానికి డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్ఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ 2 శాతం ఎగసింది. మార్కెట్లు వెనకడుగులో ఉన్నప్పటికీ పలు కౌంటర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల తయారీ, చైనా స్థానే ఫార్మా ప్రొడక్టులకు విదేశాల నుంచి పెరుగుతున్న డిమాండ్ తదితర అంశాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అరబిందో ఫార్మా దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 839కు చేరగా.. బయోకాన్ 3 శాతం ఎగసి రూ. 439ను తాకింది. తొలుత రూ. 441 వరకూ పెరిగింది. ఈ బాటలో క్యాడిలా హెల్త్‌కేర్ 2.2 శాతం పుంజుకుని రూ. 373 వద్ద, డాక్టర్ రెడ్డీస్ 2 శాతం బలపడి రూ. 4115 వద్ద ట్రేడవుతున్నాయి. తొలుత డాక్టర్ రెడ్డీస్ 4120 వరకూ పురోగమించింది. ఇతర కౌంటర్లలో లుపిన్ 2 శాతం లాభంతో రూ. 869 వద్ద, సిప్లా 2 శాతం పెరిగి రూ. 674 వద్ద కదులుతున్నాయి. ఇంట్రాడేలో సిప్లా రూ. 678 వరకూ ఎగసింది. ఇక సన్ ఫార్మా సైతం 1.7 శాతం వృద్ధితో రూ. 486 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 488కు పెరిగింది. టొరంట్ ఫార్మా 1 శాతం పుంజుకుని రూ. 2387 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2403 వద్ద గరిష్టాన్ని తాకింది. -
టీకా రేసులో భారత్ జోరు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ భారత్ తన జోరు చూపిస్తోంది. వివిధ దేశాల్లో 150కి పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతూ ఉంటే భారత్ కూడా తన సత్తా చాటుతోంది. మన దేశంలో టీకా అభివృద్ధి రేసులో 7 ఫార్మా కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఆ ఏడూ ఇవే.. భారత్ బయోటెక్, సెరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ కాడిలా, పనాసియా బయోటెక్, బయోలాజికల్ ఈ , ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మైన్వాక్స్ స్వదేశీ ఫార్మా సంస్థలు కోవిడ్ టీకా తయారీలో తలమునకలై ఉన్నాయి. ఏ సంస్థ పరిశోధనలు ఎంతవరకు ? ► హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు మొదటి, రెండో దశ ప్రయోగాలకు అనుమతులు లభించాయి. గత వారమే మనుషులపై ప్రయోగాలు మొదలు పెట్టింది. ► దేశంలోనే వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సంస్థ సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 3 దశ క్లినికల్ ప్రయోగాల్లో ఉంది. ఈ ఏడాది చివరికి టీకాను అభివృద్ధి చేస్తామని ఆ సంస్థ అంటోంది. అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ కోడాజెనిక్స్‌తో పాటు మరిన్ని దేశాలు చేస్తున్న పరిశోధనల్లో ‘సెరమ్’ పాల్గొంటోంది. ► జైడస్ కేడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్–డి టీకా మరో 7 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసే దిశగా ముందుకుసాగుతోంది. ► పనాసియా బయోటెక్ కంపెనీ అమెరికాకు చెంది రెఫానా ఇంక్ కంపెనీతో కలిసి ఐర్లాండ్‌లో జాయింట్ వెంచర్‌ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో ముం దుంది. రెఫానా భాగస్వామ్యంతో ఈ కంపెనీ 50 కోట్ల టీకా డోసుల్ని సిద్ధం చేసే పనిలో ఉంది. వచ్చే ఏడాదికి టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. ► నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)కి అనుబంధంగా నడిచే ఇండియన్ ఇమ్యునోలాజికల్ సంస్థ వ్యాక్సిన్ తయారీకి ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► బయోలాజికల్ ఈ, మైన్వాక్స్ సంస్థలు కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి కానీ ఆ సంస్థల పరిశోధనలు ఎంతవరకు వచ్చాయో అధికారిక సమాచారం లేదు. -
రెండు ఫార్మా దిగ్గజాలు విలీనం!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిరోధానికి వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో ముందు వరుసలో వున్న రెండు ఫార్మా దిగ్గజ కంపెనీలు విలీనం కాబోతున్నాయనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఔషధ తయారీలో దిగ్గజ కంపెనీలు, ప్రత్యర్థుల అయిన అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్, బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా విలీన చర్చల్లో ఉన్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా, గిలియడ్ కంపెనీని సంప్రదించిందని విశ్వనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు చేసింది. అయితే ఈ అంచనాపై గిలియడ్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తిరస్కరించారు. ఇది ఇలా ఉంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని, ఆక్స్ఫర్డ్ ప్రయోగ పరీక్షల ఫలితాలు వచ్చేసరికే 200 కోట్ల డోసులను పంపిణీకి సిద్ధంగా ఉంచాలనేది తమ లక్ష్యమని ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియట్ ప్రకటించారు. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోివిడ్-19 ప్రయోగాత్మక వ్యాక్సిన్ (ఏజెడ్‌డీ1222)ను సెప్టెంబరుకల్లా 200కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామన్నారు. (కరోనా: రెమ్డిసివిర్ వాడేందుకు భారత్ అంగీకారం) కాగా గిలియడ్, ఆస్ట్రాజెనెకా ఇంకా అనేక ఇతర ఔషధ తయారీదారులు వ్యాక్యిన్ రూపకల్పనలో తలమునకలై వున్నాయి. ఎలీ లిల్లీ అండ్ కో, ఫైజర్, మెర్క్ అండ్ కో తదితర కంపెనీలు కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి పోటీ పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రస్తుతం 100కి పైగా ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. మరోవైపు గిలియడ్ యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌ను దేశంలో మార్కెటింగ్ చేసుకునేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
వహ్వా.. ఫార్మా షేర్ల పరుగు
స్టాక్ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. అయితే ఫార్మా రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. దీంతో ఎన్ఎస్ఈలో ఫార్మా రంగ ఇండెక్స్ 2.2 శాతం ఎగసింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు షేర్లు 2-15 శాతం మధ్య దూసుకెళ్లాయి. కోవిడ్-19 దెబ్బకు పలు రంగాలు కుదేలైనప్పటికీ ఇటీవల ఫార్మా, ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పెరుగుతున్న విషయం విదితమే. ప్రధానంగా అమెరికాసహా పలు దేశాలు కోవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న ఔషధాల సరఫరాకు దేశీ కంపెనీలపై ఆధారపడుతున్నాయి. ఇందుకు వీలుగా దేశీ కంపెనీలకు యూఎస్ఎఫ్డీఏ త్వరితగతిన అనుమతులు సైతం మంజూరు చేస్తోంది. దీనికితోడు వ్యాక్సిన్ తయారీలో సైతం దేశీ కంపెనీలు భాగస్వాములుగా మారుతున్నాయి. ఇలాంటి పలు సానుకూల అంశాలు ఇటీవల ఫార్మా రంగానికి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. గ్లెన్‌మార్క్ జోరు ఎన్ఎస్ఈ ఫార్మా ఇండెక్స్‌లో భాగమైన గ్లెన్‌మార్క్, బయోకాన్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, కేడిలా హెల్త్‌కేర్, సిప్లా 4-2.2.3 శాతం మధ్య ఎగశాయి. తొలుత ఒక దశలో సిప్లా 4 శాతం జంప్‌చేయడం ద్వారా రూ. 651కు చేరింది. ఇదే విధంగా అరబిందో ఫార్మా 4 శాతం ఎగసి రూ. 742ను తాకింది. ఇవి 52 వారాల గరిష్టాలుకాగా.. మిడ్ క్యాప్స్‌లో సొలారా యాక్టివ్ ఫార్మా 7 శాతం పెరిగి రూ. 506 వద్ద, ఇండొకొ రెమిడీస్ 4 శాతం పుంజుకుని రూ. 214 వద్ద, ఐవోఎల్ కెమ్ అండ్ ఫార్మా 3.5 శాతం లాభంతో రూ. 383 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక టొరంట్ ఫార్మా 2.5 శాతం బలపడి రూ. 2415కు చేరగా.. జేబీ కెమ్ 3 శాతం ఎగసి రూ. 665ను తాకింది. ఇతర కౌంటర్లలో ఎస్ఎంఎస్ ఫార్మా 11 శాతం దూసుకెళ్లి రూ. 41 వద్ద కదులుతున్నాయి. -
ఫార్మా ఇండెక్స్ జోరుగా ర్యాలీ
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌అవుతున్న నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఫార్మా షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఉదయం 11:20 గంటల ప్రాంతంలో నిఫ్టీ ఫార్మా 1.3 శాతం లాభపడి రూ.9,202.75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ రూ.9,098.70 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.9,251.70 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన లుపిన్ 2.4 శాతం లాభపడి రూ.861 వద్ద, సిప్లా 2.4 శాతం లాభపడి రూ.609.50 వద్ద, పీఈఎల్ 2.27 శాతం లాభపడి రూ.900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అరబిందో ఫార్మా 1.8 శాతం లాభపడి రూ.674.60 వద్ద, డాక్టర్ రెడ్డీస్ 1.5 శాతం లాభపడి రూ.3,754.95 వద్ద, బయోకాన్ 1శాతం లాభంతో రూ.340 వద్ద, కడీలా హెల్త్‌కేర్ 0.86 శాతం లాభపడి రూ.328.70 వద్ద, గ్లెన్‌మార్క్ 0.6శాతం లాభంతో రూ.334.35వద్ద, సన్‌ఫార్మా 0.53శాతం లాభంతో రూ.444 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఈ ఇండెక్స్‌లో భాగమైన దివీస్ ల్యాబ్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రూ.2,321.75 వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఆ కంపెనీలవైపు రాష్ట్రం చూపు!
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించేందుకు పలు బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న కంపెనీలను ఆకర్షించేందుకు మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక మౌలిక వసతుల పరంగా ముందంజలో ఉన్న తెలంగాణకు ఈ కంపెనీలను రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల ని ప్రభుత్వం నిర్ణయించింది. చైనాపై ఆధారపడుతున్న భారత్... చైనా నుంచి 75% మేర వైద్య ఉపకరణాలు, 40% ఫార్మా రంగానికి సంబంధించిన ముడి పదార్థాలు, టెక్స్‌టైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటోం ది. ఔషధాల ఉత్పత్తిపరంగా ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉన్నా, వాటి తయారీలో అవసరమయ్యే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ), ఇంటర్మీడియేట్ల కోసం చైనాపై ఆధారపడుతోంది. కరోనా సంక్షోభం మూలంగా ఏపీఐ ధరల పెరుగుదల, రవాణా లో జాప్యంతో ఔషధ డిమాండ్‌కు అనుగుణం గా ఫార్మా రంగం ఉత్పత్తి చేయలేకపోతోంది. దేశీయంగానే ముడిపదార్థాల తయారీ... ఔషధాల ఉత్పత్తిలో అవసరమయ్యే ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఔషధ తయారీ రంగానికి చిరునామాగా ఉన్న తెలంగాణ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశీయ ఔషధ తయారీ పరిశ్రమకు అవసరమైన ఏపీఐ, ఇంటర్మీడియేట్ల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల తయారీకి హైదరాబాద్‌కు చెందిన సమీకృత ఔషధ తయారీ కంపెనీ లక్సాయ్ లైఫ్‌సైన్సెస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) నడుమ కుదిరిన తాజా ఒప్పందం రాష్ట్రం అనుసరించే భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది. మౌలిక వసతులపై దృష్టి... హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైజెస్ పార్కు, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తదితర పారిశ్రామిక మౌలిక వసతులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయి. చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న కంపెనీలను భారత్‌కు రప్పించేందుకు జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తొలి విడతలో హైదరాబాద్–వరంగల్‌తో పాటు మరో రెండు ఇండస్ట్రియల్ క్లస్టర్లలో మౌలిక వసతులపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. -
పీఎల్ఐ పథకాలకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి రూ.3,420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.400 కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్స్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. పీఐఎల్ పథకం ద్వారా వచ్చే అయిదేళ్లలో రూ.68,437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చునని కేంద్రం అంచనా వేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటి ఏర్పాటుకు రూ.3,399.35 కోట్లు అవుతాయని అంచనా. ఈ భేటీ వివరాలను మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ కంపెనీలకు రూ.40,995 కోట్లు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రూ.40,995 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ను ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిసింది. మేకిన్ ఇండియా హబ్‌ను రూపుదిద్దడం కోసం ఎలక్ట్రానిక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి వచ్చే అయిదేళ్లలో రూ.41వేల కోట్లు కేటాయించనున్నారు. దీంతో ఆయా రంగాలకు ఆర్థికంగా ఊతం వచ్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి రూ. 1,061 కోట్లు కేటాయించింది. అత్యవసర మందులు, పరికరాలు అందుబాటులో కరోనా నేపథ్యంలో అత్యవసరమైన మందులు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.14వేల కోట్లను మంజూరు చేసిందని మోదీ తెలిపారు. ఫార్మా సంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. అవసరానికి సరిపడిన ఆర్ఎన్ఏ డయాగ్నోస్టిక్ (కోవిడ్‌ను గుర్తించే) కిట్లను ఉత్పత్తి చేయాలని కోరారు. మందులు, పరికరాలను అవసరాల మేరకు తయారు చేయడంతోపాటు నూతన పరిష్కారాలను కనుగొనాలని కోరారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గాను రూ.14వేల కోట్ల విలువైన పథకాలను ఆమోదించామని మోదీ అన్నారు. -
రెడ్డీస్ నుంచి ఐదేళ్లలో 70 ఔషధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వచ్చే ఐదేళ్లలో చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో 70కి పైగా ఔషధాలను విడుదల చేయాలని లకి‡్ష్యంచింది. ఇప్పటికే ఆయా ఉత్పత్తుల్లో కొన్ని మందుల తయారీని స్థానిక పార్టనర్స్‌కు ఔట్ సోర్సింగ్ కూడా చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లలో 8–10 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వాటన్నిటికీ సంబంధించి కుష్నన్ రొట్టం రెడ్డి ఫార్మాసూటికల్స్‌తో (కేఆర్ఆర్పీ) భాగస్వామ్యం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలియజేశారు. షిజోఫ్రినియా, బైపోలార్ వంటి మానసిక పరిస్థితుల చికిత్సలో ఉపయోగించే ఓలాన్జాపైన్ ఔషధాన్ని 2020 నుంచి చైనాలో ప్రారంభిస్తామని చెప్పారాయన. -
ఫార్మాపై యూఎస్ఎఫ్డీఏ ప్రభావం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తరచూ తనిఖీలు చేయడం, లోపాలను లేవనెత్తడంతో ఔషధ ఎగుమతుల వృద్ధి తగ్గుతోందని సీఐఐ ఫార్మాస్యూటికల్స్ నేషనల్ కమిటీ చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జి.వి.ప్రసాద్ అన్నారు. సీఐఐ–ఐఎంటీహెచ్ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన హెల్త్, ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వార్నింగ్ లెటర్ల కారణంగా చాలా కంపెనీల అనుమతులు నిలిచిపోయాయి. దీంతో కొత్త ఉత్పత్తుల విడుదల ఆగిపోయింది. వీటి నుంచి బయటపడాలంటే యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకు తగ్గట్టుగా ఇక్కడి కంపెనీలు నాణ్యత, వ్యవస్థ, క్రమశిక్షణ, సమాచార సమగ్రత పాటించాల్సిందే. ఇంకా పాత ప్లాంట్లను కొనసాగిస్తున్న కంపెనీలూ ఉన్నాయి. యాంత్రికీకరణ జరగాలి’ అని వివరించారు. కొత్త అవకాశాలు ఉన్నా.. యూఎస్–చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత ఔషధ కంపెనీలకు పెద్ద ఎత్తున అవకాశాలను తెచ్చిపెడుతోందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్, కెమికల్ ఇంటర్మీడియరీస్ సరఫరాలో అంతర్జాతీయంగా చైనా అగ్రస్థానంలో ఉందన్నారు. వీటిని భారత్‌తోపాటు ప్రపంచదేశాలు చైనా నుంచే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ముడి సరుకును చైనా సరఫరా చేస్తోందన్నారు. ట్రేడ్ వార్ నేపథ్యంలో పశి్చమ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ఇప్పుడు చైనా నూతన ఆవిష్కరణలవైపు దృష్టిసారిస్తోంది. చవక ముడిపదార్థాల సరఫరాదారు అన్న ముద్ర నుంచి బయటపడాలని చూస్తోంది. ఈ అంశమే భారత్‌కు నూతన వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. చైనా ఒక్కటే భారత్‌కు అతి పెద్ద మార్కెట్. భారత కంపెనీలు ముడిపదార్థాల తయారీ పెంచాలి. ఇందుకు తగ్గట్టుగా పెట్టుబడి చేయాలి’ అని వెల్లడించారు. డిజిటల్ మార్కెటింగ్.. ఫార్మా కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విషయంలో ఇంకా వెనుకంజలో ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. పాత పద్ధతిలోనే మెడికల్ రిప్రజెంటేటివ్స్‌తో ఔషధాలను మార్కెట్ చేస్తున్నాయని అన్నారు. డిజిటల్ మార్కెటింగ్ పెరిగితే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉద్యోగాలు తగ్గినా... కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయ న్నారు. కాగా, ఐఎంటీ రూపొందించిన హెల్త్, ఫార్మా రిపోర్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిలోఫర్‌లో పసి కూనలపై ప్రయోగాలు?
సాక్షి, హైదరాబాద్ : పసిపిల్లలకు వైద్యం చేయాల్సిన నిలోఫర్ ఆస్పత్రిలో వారిపైనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలకు నిలోఫర్ ఆస్పత్రిలోని కొందరు డాక్టర్లు సహకరిస్తున్నారు. కొన్ని రకాల నిషేధిత డ్రగ్స్ కూడా ట్రయల్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ప్రయోగాలకు పాల్పడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారన్న విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి గురువారం సాయంత్రం విచారణకు ఆదేశించారు. నిలోఫర్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ బాగోతం.. పీడియాట్రిక్స్ విభాగంలోని ఓ ప్రొఫెసర్ ఫార్మా కంపెనీలతో కలసి అనధికారికంగా ట్రయల్స్ చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ, రొటా, హెచ్‌పీవీ, ఎంఆర్ వ్యాక్సిన్లను సదరు ప్రొఫెసర్ పిల్లలకు ఇస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల రక్త నమూనాలు సేకరిస్తున్నట్టు కొందరు డాక్టర్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నా సూపరింటెండెంట్ గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సదరు ప్రొఫెసర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాను అన్ని అనుమతులు తీసుకునే ట్రయల్స్ చేస్తున్నట్లు సదరు ప్రొఫెసర్ చెబుతున్నారు. గొడవతో విషయం బయటకు.. ఇటీవల ఇద్దరు డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం బయటపడింది. ఫార్మా కంపెనీల ప్రతినిధుల సమక్షంలోనే చాలా రోజుల నుంచి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఈవ వ్యవహారం నడుస్తున్నా సంబంధిత అధికారులు కళ్లు మూసుకుని పట్టించుకోకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కింది నుంచి పైస్థాయి వరకు అనేకమంది భాగస్వామ్యం ఉన్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటివరకు దాదాపు 50 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్టు సమాచారం. అందులో కొందరి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలిసింది. ఈ విషయాలు బయటికి రాకుండా కొందరు డాక్టర్లు, అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్ అంటే.. పరిశోధనశాలల్లో అభివృద్ధిపరిచిన ఏదైనా మందులు, వ్యాక్సిన్లు మనుషులపై లేదా రోగులపై సరిగా పనిచేస్తాయా లేదా అనే విషయాలను ధ్రువీకరించుకునేందుకు చేసే పరీక్షలనే క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఒకవేళ మందు వికటిస్తే సైడ్ ఎఫెక్ట్లు, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో డ్రగ్స్, కాస్మెటిక్స్ చట్టం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం తదితర చట్టాల నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అనుమతి లభించడం చాలా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కఠినమైన నిబంధనలతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టే చాలా కంపెనీలు గుట్టుగా ఈ ట్రయల్స్‌ను జరుపుతాయి. -
ఫార్మా కంపెనీలకు అమెరికా FDA సమస్య లేదు
-
ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేదు
సాక్షి, రణస్థలం: రసాయనిక పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కరువవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ప్రతి ఏడాది మృత్యువాత పడుతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం భద్రత కల్పిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నాయే తప్ప ఆచరణలో చూపడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో పైడిభీమవరం పారిశ్రామికవాడలో ఉన్న వివిధ పరిశ్రమల్లో 10మంది చనిపోయారు. రసాయనిక పరిశ్రమలో కానరాని భద్రత.. రసాయనిక పరిశ్రమలో నైపుణ్యం కల్గిన ఉద్యోగస్తులు ఉండాలి. ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలనే దురాలోచనతో సబ్ కాంట్రాక్టర్లకు పరిశ్రమ నిర్వహణ అప్పగిస్తున్నారు. సబ్ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేనివారికి తక్కువ వేతనాలు ముట్టచెప్పి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది. గత 20 ఏళ్లుగా పైడిభీమవరంలో దాదాపు 20 వరకు చిన్న పెద్ద రసాయనిక పరిశ్రమలు ఉన్నా నేటికీ సరైన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయలేదు సరికదా, భద్రతపై ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వలేదు. భద్రత పరికరాలు సమకూర్చడం లేదు. పారిశ్రామికవాడలో కానరాని ఈఎస్ఐ ఆసుపత్రి.. కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరిగినా, ఆరోగ్యం బాగోలేకపోయిన ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకువెళతారు. కానీ పైడిభీమవరంలో ఈఎస్ఐ ప్రాధమిక చికిత్స కేంద్రం తప్ప, కనీసం 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి సదుపాయం కూడా గత ప్రభుత్వాలు కల్పించలేకపోయాయని కార్మిక సంఘాలు తరుచూ గగ్గోలు పెడుతున్నాయి. ఏ చిన్న ప్రమాదం జరిగిన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయగనగరం, 70 కిలోమీటర్ల దూరం ఉన్న విశాఖపట్నం తరలించాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన∙వ్యక్తం చేస్తున్నారు. తరలించేలోగానే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కార్మికులు ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగిస్తున్నారు.. భద్రత గురించి కార్మికులు పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దీంతో కార్మికులు భయపడి ఎవరికీ చెప్పకోక ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. – కె.గురునాయుడు, అరబిందో సీఐటీయూ వర్కర్స్ యూనియన్ నాయకుడు భద్రత చర్యలు తీసుకోవడం లేదు.. ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడం లేదు. భద్రత పరికరాలు సక్రమంగా ఇవ్వటం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి లోపాలు ఉంటే సరిచేయమని చెప్పాలి. – పి.తేజేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు కార్మికుల భద్రతపై పరిశ్రమ యాజమాన్యాలు దృష్టి సారించాలి.. ప్రతి ఏడాది పరిశ్రమలోని భద్రత వైఫల్యాలపై నివేదిక అందిస్తాం. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు భద్రతపై గుర్తు చేస్తుంటాం. తక్షణమే పరిశ్రమ యాజమాన్యాలు సరిచేసుకోవాలి. – జి.వి.వి.ఎస్.నారాయణ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ -
హైదరాబాద్‌లో ఫారిన్ పోస్టాఫీస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన విశ్వాస్ తయారీ రంగంలో వ్యాపారం ప్రారంభించాడు. మందులు, బలవర్ధకమైన పదార్థాల తయారీకి సంబంధించి చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు. పోస్టాఫీస్‌ల ద్వారా పార్శిళ్లను ఎగుమతి చేస్తున్నాడు. అలాగే కొన్ని ముడి సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. పార్శిళ్ల రూపంలో జరిగే దిగుమతి ఎగుమతుల్లో పెద్ద చికాకు ఎదురైంది. హైదరాబాద్‌లో తపాలా శాఖకు సంబంధించి ఫారిన్ పోస్టాఫీస్ లేకపోవటంతో కస్టమ్స్ ఎగ్జామినేషన్ కోసం పార్శిళ్లను ముంబై పంపుతున్నాడు. కొన్ని పార్శిళ్ల క్లియరెన్సుకు పక్షం రోజుల నుంచి నెలకు పైబడి సమయం పడుతోంది. అలాగే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలో ముందు తెలియక అప్పటికప్పుడు ముంబై పరుగెత్తాల్సి వస్తోంది. ఇది కేవలం విశ్వాస్ ఒక్కడి సమస్యే కాదు. చివరకు ఇతర దేశాల్లో ఉండే బంధువులకు పంపే పార్శిళ్లలో కూడా ఇదే సమస్య ఏర్పడుతోంది. దేశంలోనే ఓ ప్రధాన నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్‌కు ఇంతకాలం ఇదో సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నగరంలో ఫారిన్ పోస్టాఫీస్ ఏర్పాటు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది పూర్తిస్థాయిలో పని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఆ నాలుగు చోట్లే.. దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటికి కొన్ని చొప్పున దేశాలను కేటాయించారు. ఆయా దేశాలకు ఎగుమతి కావాల్సిన, దిగుమతి కావాల్సిన పార్శిళ్లు ఆయా నగరాల్లోని ఫారిన్ పోస్టాఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అమెరికా, యూ రప్, గల్ఫ్ దేశాలకు ఎక్కువ పార్శిళ్లు ఎగుమతి అవుతాయి. ఇవి ముంబైకి వెళ్లాల్సి ఉంటుంది. ముంబైలో లక్షల సంఖ్యలో పార్శిళ్లు పేరుకుపోతుండటంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఈలోపు కొన్ని సరుకులు పాడైపోతున్నాయి. ఇది పెద్ద సమస్యగా పరిణమించింది. ఎట్టకేలకు రాజధానిలో.. ఈ సమస్యను గుర్తించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) దేశవ్యాప్తంగా అదనంగా ఫారిన్ పోస్టాఫీసులను ఏర్పాటు చేయాలంటూ 2016లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌ను కూడా చేర్చింది. కానీ దాని ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు తపాలా శాఖ సెంట్రల్ ఎక్సైజ్ విభాగంతో కలసి ఇప్పుడు ఫారిన్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని హుమాయూన్‌నగర్ తపాలా కార్యాలయంలో ఇందుకు కొంత స్థలాన్ని కేటాయించారు. ఇక్కడే సెంట్రల్ ఎక్సైజ్ విభాగం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటు చేసింది. ఇక నుంచి విదేశాలకు ఎగుమతయ్యే, విదేశాల నుంచి దిగుమతయ్యే పార్శిళ్లను ఇక్కడే తనిఖీ చేస్తారు. అవసరమైన వాటికి కస్టమ్ డ్యూటీ కట్టించుకుని డెలివరీకి వీలుగా తపాలా సిబ్బందికి అందిస్తారు. ఎగుమతులకు ప్రోత్సాహం.. నగరం ఇప్పుడు ఎన్నో ఉత్పత్తులకు హబ్‌గా మారుతోంది. శివారు ప్రాంతాల్లో తయారీ రంగం విస్తరిస్తోంది. ఫార్మాతోపాటు చాలా వస్తువులు ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. వీటిల్లో తక్కువ పెట్టుబడితో చిన్నస్థాయి తయారీ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పెద్దపెద్ద యూనిట్లు షిప్పింగ్ ద్వారా ఎగుమతి చేస్తుండగా.. చిన్నచిన్న తయారీ యూనిట్లు మాత్రం తపాలా ద్వారా పార్శిళ్ల రూపంలో పంపుతోంది. ఇంతకాలం ఫారిన్ పోస్టాఫీసు లేకపోవటంతో ఎగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వారంతా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇక్కడే ఫారిన్ పోస్టాఫీసు ఏర్పాటు అవటంతో జాప్యం బాగా తగ్గి ఎగుమతులు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో పార్శిళ్లు ఎగుమతవుతున్నాయి. ఆ సంఖ్య బాగా పెరిగి ఎగుమతులకు ప్రోత్సాహం లభించినట్లవుతుంది. విదేశాలకు నిత్యం వేలల్లో పార్సిళ్లు.. నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విదేశాలకు పార్శిళ్లు ఎగుమతవుతుంటాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. దేశాల మధ్య సరఫరా అయ్యే ఈ పార్శిళ్లన్నింటిని కచ్చితంగా కస్టమ్స్ ఎక్సైజ్ విభా గం తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో నిషేధిత వస్తువులు, సరుకులు ఎగుమతి, దిగుమతి కాకుం డా నిరోధించటంలో భాగంగా ఈ తనిఖీ తప్పనిసరి. పార్శిళ్లను బుక్ చేసే వారు వాటిల్లో ఉన్న వస్తువుల వివరాలు పేర్కొంటూ డిక్లరేషన్ ఇస్తారు. డిక్లరేషన్‌లో పేర్కొన్న వస్తువులే అందులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా యంత్రాలతో స్కాన్ చేయాల్సిందే. నిబంధనల ప్రకారమే దిగుమతి, ఎగుమతి ప్రక్రియ సాగుతోందని స్పష్టమైన తర్వాతే వాటిని తరలించేందుకు కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగం అధికారులు పచ్చజెండా ఊపుతారు. అవసరమైతే కస్టమ్ డ్యూటీ కట్టించుకుంటారు. కానీ హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఫారిన్ పోస్టాఫీస్ లేకపోవటంతో స్థానికంగా ఈ ప్రక్రియకు వీల్లేకుండా పోయింది. -
‘శారిడాన్’కు ఊరట
న్యూఢిల్లీ: శారిడాన్‌తో పాటు మరో మూడు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) మందుల అమ్మకాలకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ఫార్మా కంపెనీలు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ 2016 మార్చి 10న 349 ఎఫ్‌డీసీల తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలచేసింది. దీన్ని సవాలుచేస్తూ ఫార్మా కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో కేం ద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం వాడుతున్న 349 ఎఫ్‌డీసీల్లో 328 మందులు రోగాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్లు కమిటీ తేల్చిం ది. ఫలితంగా ఈ 328 మందులను కేంద్రం నిషేధించింది. దీంతో కంపెనీలు సుప్రీం తలు పు తట్టాయి. శారిడాన్, పిరిటాన్, డార్ట్, ఎక్స్పెక్టోరాంట్పై నిషేధాన్ని సుప్రీం ఎత్తివేసింది. -
ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు బెటర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల తరుణం, ముడిచమురు ధరల పెరుగుదల తదితర అంశాల నేపథ్యంలో ఈ ఏడాది స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్(పీపీఎఫ్ఏఎస్) చైర్మన్ నీల్ పారిఖ్ తెలిపారు. మిyŠ , స్మాల్ క్యాప్ స్టాక్స్ గణనీయంగా పతనమైనప్పటికీ.. ఇప్పటికీ ఈ విభాగాల్లో కొన్ని మెరుగైన స్టాక్స్ కూడా ఉన్నాయని చెప్పారు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పీపీఎఫ్ఏఎస్ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) రూ. 1,150 కోట్లుగా ఉండగా, లిక్విడ్ ఫండ్స్‌లో రూ. 85 కోట్లు ఉన్నాయి. త్వరలో ఈఎల్ఎస్ఎస్.. ప్రస్తుతం ప్రధాన ఫండ్‌తో పాటు లిక్విడ్ ఫండ్‌ను కూడా ప్రారంభించామని, త్వరలో ప్రారంభించబోయే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కి ఇది తోడ్పడగలదని పారిఖ్ చెప్పారు. ఫండ్స్ వర్గీకరణపై సెబీ నిబంధనల నేపథ్యంలో తమ ఫండ్ పేరును మల్టీ క్యాప్ ఫండ్ కింద మార్చినట్లు, దీనితో ప్రత్యేకంగా ఒక్కో విభాగానికి ఒక్కో ఫండ్ అవసరం లేకుండా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘అంతర్జాతీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు మా ఫండ్‌లో ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో విదేశీ స్టాక్స్ వల్ల అవి పెరిగినప్పుడు, ఇటు కరెన్సీ విలువ తగ్గినట్లయితే.. ప్రయోజనం రెండిందాల లభించినట్లవుతుంది. ప్రత్యేకంగా పరిమితులు లేకుండా నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవడమన్నది మా వ్యూహం. దేశీయంగా మారుతీ వేల్యుయేషన్స్ కొంత ఎక్కువగా ఉండగా .. మాతృసంస్థ సుజుకీ తక్కువగానే ఉంది. ఎలాగూ మారుతీ రాబడుల ప్రయోజనాలు సుజుకీకి కూడా లభిస్తాయి కాబట్టి.. ఆ సంస్థ షేర్లను మా పోర్ట్‌ఫోలియోలో చేర్చాం. ఇలాంటి వైవిధ్యమైన కూర్పుతో అందిస్తున్నాం’’ అని పారిఖ్ వివరించారు. కార్యకలాపాల విస్తరణ.. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో సుమారు వెయ్యి మంది దాకా క్లయింట్స్ ఉన్నారని, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బెంగళూరు, న్యూఢిల్లీలో కార్యాలయాలు ప్రారంభించనున్నామని పారిఖ్ చెప్పారు. ప్రస్తుతం మొత్తం 25,000 మంది ఇన్వెస్టర్లు ఉండగా, ఈ సంఖ్యను లక్ష దాకా పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. అయితే, రాశి కన్నా వాసికి ప్రాధాన్యమిస్తూ.. ఇన్వెస్టర్ల సంఖ్యను ఎకాయెకిన పెంచుకోవడం కన్నా మెరుగైన సేవల ద్వారా క్రమానుగతంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నామని పారిఖ్ పేర్కొన్నారు. -
రాష్ట్రంలో ఫార్మా కంపెనీల హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం హవా కొనసాగుతోంది. ఔషధ పరిశోధనలు, తయారీ రంగాల్లో ఆసియా ఖండంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం... గత నాలుగేళ్లలో అనేక కొత్త కంపెనీలను అకర్షించింది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలూ విస్తరణ ప్రణాళికలు అమలు చేయడంతో ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫెర్రింగ్ ఫార్మా, కెమో ఫార్మా, జీఎస్కే, సినర్జీ, స్లే బ్యాక్ ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.స్థానికంగా ఉన్న నొవార్టిస్, బయోలాజికల్ ఈ, లారుస్ ల్యాబ్స్, పల్స్ ఫార్మా కంపెనీలు విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. టీఎస్ ఐపాస్ ప్రకటించిన 2015 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 700 కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు వంద వరకు పరిశోధనలు, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగ కంపెనీలున్నాయి. ఇందులో 80 శాతం ఇప్పటికే తమ ఉత్పత్తులు ప్రారంభించాయి. రూ. కోట్లలో పెట్టుబడులు.. కొత్త ఫార్మా సంస్థల ఏర్పాటు, విస్తరణ ద్వారా 20 వేల ఉన్నతస్థాయి పరిశోధన ఉద్యోగాలతోపాటు 50 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ రంగంలో గత నాలుగేళ్లలో రాష్ట్రం రూ. 10,222 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగింది. ఇందులో రూ. 3 వేల కోట్లు అర్ అండ్ డీ రంగంలో వచ్చాయి. ఫార్మా ఎగుమతుల్లోనూ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. కేవలం లైఫ్ సైన్సెస్ రంగం ఒక్కటే మొత్తం 36 శాతంతో సింహభాగాన్ని ఆక్రమించింది. జాతీయ సగటు 1.18 శాతమే ఉండగా తెలంగాణ మాత్రం గత నాలుగేళ్లలో ఎగుమతులను 2.41 శాతానికి పెంచుకుంది. అంటే దేశ సగటుకు రెట్టింపు పెరుగుదలతో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఫార్మా సంబంధ శిక్షణ కార్యక్రమాల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే యూఎస్ ఫార్మకోపియా (US Pharmacopeia) తో కలసి ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వర్సిటీ గ్రాడ్యుయేట్లకు ఫార్మా రంగంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ఫలితమిది: కేటీఆర్ ఔషధ రంగంలో సాధించిన అభివృద్ధిపట్ల మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రతిఫలంగా అభివర్ణించారు. రాష్ట్రానికి సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంతోపాటు వాటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న ఫార్మా రంగ పెరుగుదలతోపాటు ఇక్కడి పరిశ్రమ విలువను రెట్టింపు చేసి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే దీర్ఘకాల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. -
ఔషధం..గరళం
ఏదైనా అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మందులు తీసుకున్నారా..? వాళ్లిచ్చిన మందులు వాడినా ఏమాత్రం అనారోగ్యం తగ్గలేదా..అయితే మీకిచ్చినవి నాసిరకం మందులేమో ఓ సారి పరిశీలించుకోండి. నాణ్యతా పరీక్షలు పూర్తికాకుండానే బడా ఫార్మాసూటికల్ కంపెనీలు పంపే నాసిరకం మందులను నేరుగా వైద్యశాలలకు పంపిణీ చేసి రోగులకు ఇచ్చేస్తున్నారు. ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ పంపిన ల్యాబ్ తనిఖీల్లో ఈ నాసిరకం మందుల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వ వైద్యశాలల్లో నాసిరకం మందులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నాసిరకం మందులు తయారు చేస్తున్న మందుల కంపెనీలు రాష్ట్ర స్థాయిలో మందుల సరఫరాకు కమీషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందుతున్నాయి. గతంలో కంపెనీలు మందులను సరఫరా చేసిన అనంతరం రాష్ట్ర స్థాయిలోనే నాణ్యతాపరీక్షలకు పంపించే వారు. ఆ పరీక్షలలో నాణ్యమైన మందులు అని తేలితేనే జిల్లాలకు పంపించేవారు. అయితే నాలుగేళ్లుగా జిల్లాలకు పంపించి, అక్కడ నుంచి మందుల నాణ్యతకు ల్యాబొరేటరీలకు పంపుతున్నారు. ఈ సమయాన్నే క్వారన్‌టైమ్ అంటారు. అయితే మందులకు సంబంధించిన నాణ్యతా నివేదికలు రాకుండానే మందులు క్షేత్ర స్థాయిలో అయిపోతుండటంతో విడుదల చేస్తున్నారు. దీంతో మందులు వాడిన తర్వాత నాణ్యతా పరీక్షలలో మందుల కంపెనీలు నిలబడటంలేదు. అయితే అప్పటికే మందులను దాదాపు పూర్తి స్థాయిలో రోగులు వినియోగిస్తున్నారు. ఒంగోలు డ్రగ్ఇన్స్పెక్టర్ కొన్ని రకాల మందులను ఈ మధ్య కాలంలో నాణ్యతా పరీక్షల కోసం ల్యాబొరేటరీలకు పంపించారు. ఈ పరీక్షలలో చాలా వరకూ కంపెనీలు నెగ్గలేదు. పైగా కొన్ని కంపెనీలు సెంట్రల్ ల్యాబొరేటరీలకు తమ మందులను పంపినా అక్కడ కూడా నెగ్గలేదు. దీంతో ఇటువంటి నాణ్యతా లోపం ఉన్న మందులను సరఫరా చేసిన కంపెనీలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అమాక్సీ క్లావనేట్:ఇది యాంటి బయోటెక్ ఈ మందును అనేక రోగాలకు, జ్వరాలకు వైద్యులు విరివిగా వాడుతుంటారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కువగా వాడే రెండు, మూడు రకాల యాంటి బయోటెక్ లలో దీనిది రెండో స్థానం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తదితర కారణాలతో వచ్చే జ్వరాలకు వాడుతుంటారు. ఇంతటి ముఖ్య అవసరమైన ఈ యాంటిబయోటెక్ను ఈ మధ్య కాలంలో స్టాండార్ట్ ఫార్మస్యూటికల్స్ అనే కోల్‌కతాకు చెందిన కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ బ్యాచ్ నెంబర్ సిఎల్ఎండీ 743 కింద 1,90,000ల ట్యాబ్లెట్లను సరఫరా చేసింది. అయితే కంపెనీ తయారు చేసిన ఈ మందుల నాణ్యతపై అధికారులకు అనుమానం రావడంతో ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ మందులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీలకు పంపించారు. అక్కడ నాణ్యత లేనట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై కంపెనీకి నోటీసులు ఇవ్వడంతో కంపెనీ సెంట్రల్ ల్యాబొరేటరీకి నాణ్యత పరీక్షల కోసం పంపగా అక్కడ కూడా మందులు నాణ్యత లేవన్నట్లు నివేదిక వచ్చింది. దీంతో అధికారులు సదరు కంపెనీపై ఒంగోలు కోర్టులో కేసు నమోదు చేశారు. అయితే కంపెనీ సరఫరా చేసిన లక్షా తొంభైవేల మాత్రలను అధికారులు నివేదికలు రాకుండానే పీహెచ్‌సీలకు, ప్రాంతీయ వైద్యశాలలకు పంపించారు. అక్కడి వైద్యులు రోగులకు కూడా వాడారు. మిగిలిన 1800 మాత్రలను మాత్రమే వెనక్కి తెప్పించారు. ఇటువంటి నాసిరకం మందులు వాడటంతో చాలా మందికి రోగం నయం కావడంలేదు. పైగా ఎక్కువ శక్తివంతమైన యాంటిబయోటెక్లను వాడాల్సి వస్తుంది. హైయోసిన్ బ్యుటైల్ బ్రొమైడ్–బుస్కొపాన్:హైయోసిన్ బ్యుటైల్ బ్రొమైడ్ దీన్నే బుస్కోపాన్ అని కూడా అంటారు. ఈ మందును రోగులకు అనేక తీవ్రమైన నొప్పులకు వాడతారు. ఇది ఖరీదు కూడా తక్కువగానే ఉంటుంది. అరియన్ హెల్త్ కేర్ అనే కంపెనీ ఈ మందులను ఎస్7005 సరఫరా చేసింది. అయితే ఈ కంపెనీ తయారు చేసిన మందులు కుడా నాణ్యతా పరీక్షలలో విఫలమయ్యాయి. అయితే మందులను వైద్యశాలలకు సరఫరా చేయలేదు. వీటిని వెనక్కి పంపించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్:ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ మందును రక్తహీనతకు వాడతారు. ముఖ్యంగా మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుంటారు. దీంతో ఈ మందును ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. రక్త హీనతతోనే ఎక్కువ మంది గర్భిణులు కాన్పు సమయంలో మరణిస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన ఔషధంలో నాణ్యత లేదు. గత నెలలో ఈ మందులను ర్యాడికో రెమిడీస్ అనే కంపెనీ సరఫరా చేసింది. అయితే అప్పటికే క్షేత్ర స్థాయిలో చాలా మందులను వినియోగించారు. మిగిలిన 550 బాటిళ్ల సిరప్‌ను మాత్రమే వెనక్కి తెప్పించారు. స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్లో మందులు నాణ్యత లేనివిగా అధికారులు గుర్తించి, కేసులు నమోదు చేశారు. అసిటైల్ శాల్సిలిక్ యాసిడ్–ఆస్పిరిన్:ఈ మందును అర్ధరైటిస్ ద్వారా వచ్చే జ్వరాలకు, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించేందుకు, అదేవిధంగా ఇతర జ్వరాలకు వాడుతుంటారు. అయితే ఈ మందును ల్యాక్కెమ్కో అనే కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ 64 వేల మందులను సరఫరా చేసింది. ఈ కంపెనీ సరఫరా చేసిన మందులు నాణ్యత లేనట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు ఈ మందులను వెనక్కి తెప్పిస్తున్నారు.ఇలా అనేక రకాల మందులు క్షుణ్ణంగా పరిశీలిస్తే నాణ్యత లోపం బయటపడే అవకాశం ఉంది. కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు ఇటువంటి మందులను సరఫరా చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
కాలుష్య ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు నిర్దేశిత కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిం చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పరిశ్రమ ల మంత్రి కె. తారకరామారావు హెచ్చరించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తుందని ఆయన చెప్పారు. శనివారం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఆయన బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ను తయారు చేసేందుకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని, అందులో భాగంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సిటీ ఏర్పాటులో కాలుష్య సమస్య లేకుండా అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను పాటిస్తున్నామన్నారు. ‘ఔటర్’ వెలుపలికి కాలుష్య పరిశ్రమలు హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్ రోడ్డు అవతలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కంపెనీలు పాలుపంచుకోవాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు పటాన్ చెరు, బొల్లారం ప్రాంతాల్లో చెరువులు, జలవనరుల అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. -
కోలుకుంటున్న ఫార్మా
ముంబై: ఫార్మా కంపెనీలు రానున్న మూడేళ్లలో ప్రస్తుత ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ అభిప్రాయపడింది. నియంత్రణ సంస్థల కఠినమైన నిబంధనలు, అంతకంతకూ తీవ్రమవుతున్న పోటీ కారణంగా గత కొంతకాలంగా ఫార్మా కంపెనీలు ఎగుమతుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ తన తాజా నివేదికలో వివరించింది. దేశీయంగా డిమాండ్ జోరుగా ఉండటం, పశ్చిమ దేశాల్లో సంక్లిష్ట ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటం ఫార్మా కంపెనీలకు కలసిరానుందని పేర్కొంది. ఫలితంగా రానున్న మూడేళ్లలో ఫార్మా కంపెనీల ఆదాయాలు ఏడాదికి 9 శాతం చొప్పున పెరుగుతాయని ఆ నివేదిక అంచనా వేసింది. ముఖ్యాంశాలు... ►ఫార్మా కంపెనీలకు ఎగుమతులే కీలకం. ఎందుకంటే మొత్తం ఫార్మా రంగం ఆదాయంలో 45% వాటా ఎగుమతులదే. దేశీ అమ్మకాలు పుంజుకున్నా, ఎగుమతులు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1 శాతమే పెరుగుతాయి. ఆ తర్వాత మరింతగా పుంజుకుంటాయి. ►తీవ్రమైన పోటీ వల్ల ధరలు తగ్గడం, కొత్త ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేయడంలో జాప్యం, అమెరికా ఎఫ్‌డీఏ కఠినమైన తనిఖీల కారణంగా ఆంక్షల విధింపు తదితర అంశాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 5% క్షీణిస్తాయి. ►అయితే తర్వాతి కాలంలో ఎగమతుల ఆదాయం పుంజుకుంటుంది. సంక్లిష్టమైన ఔషధ ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ సత్వర ఆమోదాలు జారీ చేయనుండటం దీనికొక కారణం. ►నియంత్రణలు అధికంగా ఉన్న అమెరికా వం టి మార్కెట్లలో సంక్లిష్ట ఔషధాలకు ఏటా 2,000 కోట్ల డాలర్ల అవకాశాలుండటంతో ఫా ర్మా కంపెనీలు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కోసం అధికంగానే నిధులు కేటాయిస్తున్నాయి. -
ఫార్మా షేర్లకు అమెరికా విచారణ దెబ్బ
ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఎన్నికలు దేశీయ స్టాక్ మార్కెట్లను ఊగిసలాటలోకి నెట్టేస్తే.. అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు వార్తలతో ఫార్మా సెక్టార్ లో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫార్మా ఇండెక్స్ దాదాపు 4.69 శాతం పతనమైంది. దీంతో దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా సన్ పార్మా టాప్ లూజర్ గా ఉండగా, గ్లెన్‌మార్క్, అరబిందో 5 శాతం చొప్పున డాక్టర్ రెడ్డీస్ 4.5 శాతం పతమైనంది ఈ బాటలో లుపిన్, క్యాడిలా, సనోఫీ, దివీస్ లేబ్, సిప్లా, గ్లాక్సో, పిరామల్ 4-2 శాతం నష్టాల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు జట్టుకట్టడం ద్వారా పలు ఔషధాలకు అధిక ధరలను వసూలు చేస్తున్నాయన్న అంశంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు నిర్వహిస్తోందని, ఈ ఏడాది చివరికల్లా పలు కంపెనీలపై చర్యలకు అవకాశమున్నదన్న వార్తలు వెలువడ్డాయి. దీంతో మైలాన్, తేవా ఫార్మా తదితర కంపెనీల షేర్లు అమెరికా మార్కెట్లో గురువారమే పతనమయ్యాయి. జెనెరిక్ ఔషధ కంపెనీలు వసూలు చేస్తున్న అధిక ధరల వ్యవహారంపై ఫెడరల్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్ విచారణ చేపట్టాలని అమెరికా చట్ట ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందులో మొదటిది మార్టిన్ షెక్రిల్ కు చెందిన యాంటి ప్లాస్టిక్ మందు ధరనుభారీగా పెంచిందన్న ఆరోపణలు, రెండవది మైలాన్ ఫార్మాస్యూటికల్ కు చెందిన ఎలర్జీ ఇంజెక్షన్ ఎపిపెన్ ధరను భారీగా పెంచారన్న ఆరోపణ ఈ రెండు కేసులపై ఒకేసారి క్రిమినల్ విచారణ జరగనుందన్న షాక్ దేశీయ ఫార్మా కంపెనీలకు భారీగా తాకింది. ఈ వార్తలపై డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధులు స్పందించారు. ఏడాదిన్నర క్రితమే దీనికిసంబంధించిన నోటీసులు తమకు అందాయని చెప్పారు. అలాగే తమ స్పందనను తెలియజేశామన్న వారు ప్రస్తుత కొత్త పరిణామాల సమాచారం తమకు చేరలేదని స్పష్టం చేశారు. విచారణలో ఉన్న ఈ అంశంపై ఇంతకుమించి వ్యాఖ్యానించడానికి మాత్రం నిరాకరించారు. కాగా కంపెనీలతో ఒప్పందాలు, ప్రత్యక్ష మార్కెటింగ్ ద్వారా దేశీ కంపెనీలు కూడా అమెరికా మార్కెట్లో పలు జనరిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇదేమి ఔషధ మాయ..?
(మంథా రమణమూర్తి) పక్కన వేరే వాళ్లుంటే సొంత ఇంట్లో కూడా కళ్లు మూసుకుని నిద్రపోలేం. కానీ డాక్టరు పరీక్ష చేసినా, చికిత్స చేసినా ఆయన ముందు నిశ్చింతగా కళ్లు మూసుకుంటాం! బయటికెళ్తే మంచి నీళ్లు తాగటానికి వెనకాడేవారు సైతం.. డాక్టరు రాసిన మందును క్షణాల మీద వేసుకుంటారు. ఎందుకంటే.. వైద్యం ఒక అవసరం. వైద్యుడొక నమ్మకం! ఈ నమ్మకాన్నిపుడు పూర్తిగా ధన దాహం కమ్మేసింది. చికిత్స చేసే వైద్యుడి నుంచి, పరీక్షలు చేసే సెంటర్లు, మందులమ్మే షాపులు అన్నిటినీ ‘నాకేంటి?’ అనే వ్యాపారసూత్రమే నడిపిస్తోంది. అందుకే.. తక్కువ ధరకు దొరికే జనరిక్ మందులన్నీ బడా బ్రాండ్ల ముందు వెలవెలబోతున్నాయి. వీటిని కొంటే రోగికి నాలుగు డబ్బులు మిగిలే అవకాశం ఉన్నా... కొనిపించే వ్యవస్థ మాత్రం కరువవుతోంది. ఈ అవ్యవస్థలో ఎవరి పాత్ర ఎంతో తెలియజేసే ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు నేటి నుంచి.. - జనరిక్ మందులతో రోగుల ఖర్చు మూడొంతులకు పైగా ఆదా - ప్రత్యేక షాపుల ద్వారా విక్రయానికి ప్రభుత్వం యత్నాలు - కానీ వీటివల్ల తమ కమీషన్లు పోతాయని ఆసుపత్రులు, వైద్యుల భయం - నాసిరకానివని చెబుతూ విక్రయాలకు అడ్డుపుల్ల - మన దేశంలో తయారవుతున్నవన్నీ జనరిక్ మందులే - కొన్నింటికి మాత్రం రిప్రజెంటేటివ్‌లు, డాక్టర్ల ద్వారా ప్రచారం - ఆ ఖర్చులన్నీ మందుపైనే.. దాంతో ఆకాశాన్నంటుతున్న ధర - అదే మందు ప్రచారం లేకుండా షాపుల్లో విక్రయిస్తే తక్కువ ధర - కానీ కమీషన్లు, గిఫ్ట్‌లు ఇచ్చిన కంపెనీలకే వైద్యులు, యాజమాన్యాల వత్తాసు - మందుల బ్రాండ్ పేరు బదులు ఔషధం పేరే రాయాలని గతంలోనే ఎంసీఐ ఆదేశాలు.. అయినా పట్టించుకోని వైద్యులు ► ప్రకాశ్‌కు బీపీ, షుగర్ రెండూ ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా మందులు వాడుతున్నాడు. జీవితాంతం వాడాలి కూడా. మొదట్లో మందులకు నెలకు రూ.2 వేల దాకా అయ్యేది. భారం కావటంతో ఓసారి ఫార్మా డిస్ట్రిబ్యూషన్లో ఉన్న స్నేహితుడికి చెప్పాడు. ఆయన జనరిక్ దారి చూపించాడు. అచ్చంగా ప్రకాశ్ కొంటున్న మందుల్లో వాడే ఔషధాలనే వాడుతూ... ఇతర కంపెనీలు తయారు చేస్తున్న మందుల్ని సూచించాడు. వాటిని తక్కువ ధరలకే విక్రయించే మెడికల్ షాపులూ దొరకటంతో ప్రకాశ్‌కు ఇప్పుడు నెలకు రూ.2 వేల బదులు రూ.600 మాత్రమే ఖర్చవుతోంది. అలా ప్రకాశ్ మందుల ఖర్చులు దాదాపు 70 శాతం ఆదా అయ్యాయి. ► దినకర్ది కూడా ఇలాంటి పరిస్థితే. కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) తీవ్రం కావటంతో దీర్ఘకాలం మందులు వాడాల్సి వచ్చింది. డాక్టర్లు రాసిన మందులకు నెలకు రూ.4 వేల పైనే ఖర్చు కావటంతో... బ్రాండ్పేరున్న జనరిక్స్‌కు బదులుగా పెద్దగా బ్రాండ్ పేరు లేని జనరిక్ మందులను ఆశ్రయించాడు. దీంతో నెలకు రూ.వెయ్యి మాత్రమే ఖర్చువుతోంది. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు దినకర్. ఈ రెండు కేసుల్లోనూ తేలిందేమిటంటే.. మందులు మార్చినా వ్యాధి తగ్గటంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. బ్రాండెడ్ జనరిక్స్ ఎలా పని చేస్తాయో... బ్రాండ్ లేని జనరిక్స్ కూడా అలానే పనిచేశాయి. మందుల్లో ధన దాహమెందుకు? కార్పొరేట్ల రాకతో వైద్య ఖర్చులు అమాంతం పెరిగాయి. డాక్టరు, ఆస్పత్రుల ఫీజులు చెల్లించేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి. మరి మందుల సంగతో..? చిత్రమేంటంటే వీటికి బీమా కవరేజీ కూడా వర్తించదు. మన దేశంలో డాక్టర్లు రాసిన మందులు కొనలేక రోగాన్ని దేవుడికే వదిలేసిన ప్రాణాలు తక్కువేమీ కాదు. ఓవైపు ఆస్పత్రుల బిల్లు, కన్సల్టేషన్ ఫీజులంటూ రోగుల్ని బాదేస్తూ మరోవైపు మందుల్లోనూ అంత దాహమెందుకు? తక్కువ ధరకే దొరికే జనరిక్ మందులు సిఫారసు చేయొచ్చుగా? ఇదే ప్రశ్న ఆస్పత్రులనడిగితే...? డాక్టర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు కనుక వారు ఏ మందులు రాస్తారన్నది తమ చేతుల్లో ఉండదని చెబుతున్నాయి. మరి డాక్టర్లేమో... రోగుల ఆరోగ్యం తమ చేతుల్లో పెడతారు కనుక నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని, ఏ కంపెనీవి పడితే ఆ కంపెనీ మందులు సిఫారసు చేయలేమని చెబుతున్నారు. నిజంగా మీవి నాణ్యత లేని మందులా? అని ఫార్మా కంపెనీలనడిగితే.. మందుల తయారీకి ప్రతి కంపెనీ నిబంధనల్ని పాటిస్తుందని, అలా పాటించకపోతే లెసైన్సులు రద్దవుతాయని, అందుకని నాణ్యత తక్కువుండే ప్రసక్తే లేదని చెబుతున్నాయి. కాకుంటే తాము డాక్టర్లకు బహుమతులు, రిప్రజెంటేటివ్‌ల ఖర్చులు పెట్టం కనుక తక్కువ ధరకు ఇవ్వగలుగుతామని చెబుతున్నాయి. నాణ్యత లేకుంటే తామెందుకు అనుమతులిస్తామనేది ప్రభుత్వం తరఫున కూడా ఎదురు ప్రశ్నే!! వైద్యులను నేరుగా మందుల పేర్లు రాయకుండా సాధ్యమైనంత వరకూ జనరిక్ పేర్లనే రాయమంటున్నామని, ఈ మేరకు రెండు దఫాలు ఆదేశాలు కూడా ఇచ్చామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) కూడా స్పష్టంగా చెబుతోంది. ఎవరి ‘లెక్క’ వారిది.. ఈ మొత్తం వ్యవహారంలో ఏ ఒక్కరిదీ తప్పున్నట్టు అనిపించదు. చట్టం మాదిరి అంతా తమ పని తాము చేసుకుపోతున్నారనిపిస్తుం ది. కానీ లోతుగా చూస్తే అసలు గుట్టు బయటపడుతుంది. మందుల నాణ్యతను నియంత్రించే ప్రభుత్వం.. అన్నీ జనరిక్‌లే అయినపుడు ఒకే జనరిక్ మందుకు ఇన్ని రకాల ధరలెందుకున్నాయని ఎన్నడూ ప్రశ్నించదు. అలా ప్రశ్నిస్తే ఇలా ధరల్లో తేడా ఉండదుగా! ఒక మందుకు ఒకే ధర అనేది బహుశా ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుందేమో! ధరలపై ఎలాగూ నియంత్రణ లేదు. బడా ఫార్మా సంస్థలకేమో లాభాలు కావాలి. మందులకు బహిరంగంగా ప్రచారం చేయకూడదు కనుక ఆ పనిని డాక్టర్ల ద్వారా చేయిస్తుంటాయి. ప్రచారానికి వెచ్చించాల్సిన సొమ్మును డాక్టర్ల విదేశీ పర్యటనలకు, ఖరీదైన బహుమతులకు వెచ్చిస్తుంటాయి. ఆ కంపెనీ బాగుంటేనే తమ బాగు కనుక డాక్టర్లు, ఆస్పత్రులు సైతం యథాశక్తి ఆ బ్రాండ్‌నే రాస్తారు. చౌకగా దొరికే ఇతర జనరిక్ల జోలికి వెళ్లరు. మెడికల్ షాపులేమో డాక్టర్లు రాసిన మందులు లేకపోతే కొన్ని సందర్భాల్లో జనరిక్‌లు ఇస్తూ ఉంటాయి. డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ జనరిక్స్‌పై ముద్రించిన రేటుకే ఇస్తాయి. అది చాలా ఎక్కువుంటుంది. బ్రాండ్ లేని జనరిక్లకు కంపెనీలు అంత రేటు పెట్టకూడదు. కానీ డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ఉండదు.. మందుల షాపులవాళ్లు తామే చొరవతో వాటిని అమ్మాలి కనుక వాటికి 70-80% లాభాలివ్వటానికి అంత రేటు పెడతారు. అంతిమంగా నష్టపోతున్నది మాత్రం రోగే. ఒకవైపు వ్యాధి, మరోవైపు వీళ్లందరి దాహానికి బలవుతున్నది వినియోగదారుడే. జనరిక్ మందులు అంటే? ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలోని కంపెనీలు తయారు చేసి విక్రయిస్తున్నవన్నీ జనరిక్ మందులే. సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా వంటి దేశీ దిగ్గజాలు తయారు చేస్తున్న మందులన్నీ జనరిక్‌లే. ఎందుకంటే ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇప్పటిదాకా సొంత మందు ఒక్కటి కూడా ఆవిష్కరించలేదు. ఇవి తయారు చేస్తున్న మందులన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఓ విదేశీ కంపెనీ కనుగొన్నదే. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో అందులోని ఔషధాల్ని వేరు చేసి.. అదే మోతాదులో ఈ కంపెనీలు సొంత మందులు తయారు చేస్తాయి. వాటినే జనరిక్ మందులుగా పిలుస్తారు. జనరిక్స్ కానివేంటి? ఫార్మా కంపెనీలు వివిధ వ్యాధులకు మందులు తయారు చేయడానికి సొంతంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాల్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొన్నేళ్లపాటు అధిక వ్యయ ప్రయాసలకోర్చి.. ట్రయల్స్ వంటివి నిర్వహించి చివరికి మందును కనుగొని, దానికి అనుమతులు సంపాదిస్తాయి. ఆ కంపెనీ సదరు మందు కోసం అప్పటికే బోలెడంత డబ్బు వెచ్చించి ఉంటుంది కనుక ఆ మందుపై దానికి పేటెంట్ హక్కులుంటాయి. సాధారణంగా ఈ హక్కులు 20 ఏళ్లపాటు ఉంటాయి. 20 ఏళ్లు ముగిసే వరకూ ఆ కంపెనీ ఒక్కటే దాన్ని తయారు చేస్తుంది. దాని ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్లలోగా ఏదైనా ఇతర కంపెనీ ఆ మందును తయారు చేయాలంటే.. కనుగొన్న కంపెనీకి రాయల్టీ ఇవ్వాలి. కానీ 20 ఏళ్లు ముగిశాక పేటెంట్ హక్కులు పోతాయి. అప్పుడు ఏ కంపెనీ అయినా దాన్ని తయారు చెయ్యొచ్చు. అదే జనరిక్. ఇండియాలో కంపెనీలన్నీ తయారు చేస్తున్నవి ఇవే. 20 ఏళ్ల తర్వాత దాన్ని కనుగొన్న కంపెనీ కూడా.. పోటీ ఉంటుంది కాబట్టి ధర తగ్గించేస్తుంది. అప్పటికే అది ఆ మందుపై పెట్టిన ఆవిష్కరణ ఖర్చుల్ని రాబట్టుకుంటుంది. జనరిక్స్‌ను తెలుసుకోవటమెలా? ఒక మందుకు తక్కువ ధరలో ఇంకా ఏయే జనరిక్స్ దొరుకుతున్నాయో తెలుసుకోవటం ఎలా? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఇప్పుడు చాలా మందుల షాపుల్లో... కంప్యూటర్లో ఒక మందు ఎంటర్ చెయ్యగానే దానికి ప్రత్యామ్నాయ మందులేంటన్నది చెప్పే సాఫ్ట్వేర్ ఉంది. 1ఎంజీ డాట్ కామ్, జనరిక్వాలా డాట్ కామ్... ఇంకా పలు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్లో వాడటానికి 1ఎంజీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒక మందు పేరును ఎంటర్ చెయ్యగానే... అది ఎందుకు పనిచేస్తుంది? సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా? ఆ మందులో ఏఏ ఔషధాలుంటాయి? ధర ఎంత? దానికి ప్రత్యామ్నాయ మందులేంటి? వాటి ధరలెంత? ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి. ప్రతి మందునూ ఏ కంపెనీ తయారు చేసిందో కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి మందులు కొనుక్కోవచ్చు. -
జెనరిక్ ఔషధ మార్కెట్ వృద్ధిపై దృష్టిపెట్టండి
ఫార్మా కంపెనీలకు అసోచామ్ సూచన కోల్‌కతా: కొత్త ఔషధాల ఆవిష్కరణలతోపాటు, జెనరిక్ ఔషధ మార్కెట్ వృద్ధిపై భారత ఫార్మా కంపెనీలు దృష్టి కేంద్రీకరించాలని అసోచామ్ సూచించింది. అసోచామ్ అధ్యయనం ప్రకారం,కొత్త ఔషధాల ఆవిష్కరణలపైన ఫార్మా కంపెనీల వృద్ధి ఆధారపడి ఉంటుంది. కంపెనీ వృద్ధిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) ప్రధాన భూమిక పోషిస్తుందని, దీనిపైనే ఫార్మా కంపెనీలు చాలా అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. - కొత్త మాలిక్యూలర్ను అభివృద్ధిపర్చేందుకు వెచ్చించాల్సిన మొత్తం గత ఐదేళ్లలో రెట్టింపై 1.5 బిలియన్ డాలర్లకు చేరింది. - అయినా గత రెండేళ్ల నుంచి అధిక టర్నోవర్‌ను తెచ్చిపెట్టే ఏ ఒక్క కొత్త ఔషధం యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతిని పొంద లేదు. - ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో జెనరిక్ ఔషధ మార్కెట్లో వృద్ధి క్షీణత కనిపించనుంది. - 2013-14లో భారత ఔషధ పరిశ్రమ విలువ ఎగుమతులతో కలిపి 34 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2017-18 నాటికి ఈ విలువ 48 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఫార్మా కంపెనీలకు పూర్తి రాయితీలు
జాతీయ ఫార్మా సదస్సులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని... అందులో పెట్టుబడులు పెట్టే ఫార్మా కంపెనీలకు అవసరమైన పూర్తి రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘హైటెక్స్’లో ప్రారంభమైన 66వ జాతీయ ఫార్మాస్యూటికల్ సదస్సు (ఐపీసీ)లో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్మాసిటీలోనే ఉద్యోగులకు వసతి సౌకర్యం కల్పిస్తామని, అందులో ఫార్మా యూనివర్సిటీని నెలకొల్పుతామని చెప్పారు. పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారికి 30 రోజుల్లోగా ఏకగవాక్ష విధానంలో అనుమతులు ఇస్తామన్నారు. ప్రపంచ ఫార్మా రంగాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు కృషి చేస్తామన్నారు. సదస్సుకు 6 వేల మంది ప్రతినిధులు, 30 ఫార్మా దిగ్గజ కంపెనీల సీఈవోలు హాజరవడం హర్షణీయమన్నారు. దేశంలో, రాష్ట్రంలో తయారయ్యే ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అమలు చేస్తున్న విధానాలపై విస్తృతంగా చర్చించేందుకు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ ఫార్మారంగంలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో దేశ ఫార్మారంగం రూ. 100 కోట్ల టర్నోవర్ సాధిస్తే ప్రస్తుతం అది రూ. 10 వేల కోట్లు దాటిందన్నారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని 4,600 పరిశ్రమల ద్వారా 3.45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
కష్టాల్లో దేశీయా ఫార్మారంగం...
-
భూ నిధి @ లక్ష ఎకరాలు!
భూ లభ్యతపై నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం ఖాళీ భూములు 39 వేల ఎకరాలు! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెట్టుబడులకు ఎర్రతివాచీ పరుస్తున్న తెలంగాణ సర్కారు.. రంగారెడ్డి జిల్లాలో ఖాళీ భూముల వేట కొనసాగిస్తోంది. పలు రాయితీలు, ఏక గవాక్ష విధానంలో పరిశ్రమలకు అనుమతులను సరళతరం చేస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. దానికనుగుణంగా లక్ష ఎకరాల భూ నిధిని సిద్ధం చేస్తోంది. రాజధానికి సమీపంలో ఔటర్‌రింగ్ రోడ్డు, విమానాశ్రయం, రైల్వే లైన్లు ఉండటంతో పెట్టుబడులకిది అనువైన ప్రాంతంగా పరి గణిస్తోంది. ప్రోత్సాహకాలిస్తే పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్న ప్రభుత్వం దండిగా భూ మిని సమీకరిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ ప్రాంతంలో విహంగ వీక్షణం చేశారు. ఫార్మా కంపెనీల దిగ్గజాలతో కలసి ప్రతిపాదిత ఫార్మాసిటీ స్థలాలను పరిశీలించారు. నగరానికి దగ్గరగా పెద్దమొత్తంలో ఒకేచోట భూమి ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా అధినేతలు సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 13వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ తదితర క్లస్టర్ల ఏర్పాటులోనూ భూమే కీలకంగా మారుతున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తల అవసరాలకనుగుణంగా సర్కారు భూముల జాబితాను సిద్ధం చేయాలని సీఎం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేటగిరీలవారీగా.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేసిన రెవెన్యూ యంత్రాంగం.. ఈ మేరకు ల్యాండ్ బ్యాంక్‌ను కేటగిరీల వారీగా విభజించింది. పరిశ్రమలకు తక్షణ కేటాయింపులు చేసేందుకుగాను 19,383 ఎకరాలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐసీసీ)కు బదలాయించింది. గతంలో టీఐసీసీ, హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ, తదితర శాఖల నుంచి ఇతరులకు బదలాయించిన భూమిలో అవసరాలకు సరిపోను మిగులు భూమి ఉన్నట్లు ఇటీవల సర్వేలో గుర్తించింది. ఇలా ఆయా సంస్థల అట్టిపెట్టుకున్న 10,852 ఎకరాలను స్వాధీనం చేసుకుంటోం ది. ఈ మేరకు ఆయా సంస్థలకు తాఖీదులు జారీ చేసింది. ఈ స్థలాలను కొత్త కంపెనీలకు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. రాళ్లతోకూడిన భూమి 39,433.37 ఎకరాలు! ఇప్పటివరకు పరిశ్రమలకు అనువైన స్థలాల జాబి తాను సిద్ధం చేసిన ప్రభుత్వం.. తాజాగా రాళ్లు, రప్పలతో కూడిన సర్కారీ భూములను కూడా సర్వే చేస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే నంబర్ల వారీగా సమాచారాన్ని సేకరించిన అధికారులు జిల్లాలో 39,433.37 ఎకరాల మేర ఈ తరహా భూములున్న ట్లు తేల్చింది. అవసరమైతే ఈ భూములను కూడా చదును చేసి పారిశ్రామికవేత్తలకు కేటాయిం చాలనే ఉద్ధేశంతోనే ప్రభుత్వం కొండలు, గుట్టలతో మిళితమైన భూముల సమాచారాన్ని అడిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆక్రమిత స్థలాల లెక్కలను కొలిక్కి తెచ్చిన ప్రభుత్వం.. జిల్లా వ్యాప్తంగా 34వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు నిగ్గు తేల్చింది. దీంట్లో 11,922 వ్యవసాయ, 6,202 వ్యవసాయేతర అవసరాలకు ఈ భూములు వినియోగిస్తున్నట్లు అధికారుల సర్వే లో తేలింది. అలాగే 10 వేల ఎకరాల అసైన్డ్ భూమి చేతులు మారినట్టు లెక్కతేల్చిన అధికారగణం.. 3 వేల ఎకరాల యూఎల్సీ స్థలాలు కూడా ఆక్రమణలకు గురైనట్టు ప్రభుత్వానికి నివేదించింది. -
ఫార్మా ప్లాంట్లకు రాయితీలిస్తాం
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా తమ దేశంలో ఫార్మా ప్లాంట్లు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తే తగిన రాయితీలిస్తామని జంజీబార్ దేశాధ్యక్షుడు డాక్టర్ అలీ మహ్మద్ షీన్ చెప్పారు. ఆఫ్రికా ఖండంలో టాంజానియా పక్కన సముద్రం నడుమ చిన్న దీవిలా ఉండే జంజీబార్‌లో... 11 ఆసుపత్రులు, 134 మెడికల్ సెంటర్లు ఉన్నాయని, ఆ స్థాయిలో ఫార్మా ప్లాంట్లు మాత్రం లేవని చెప్పారాయన. అందుకే భారత ఫార్మా నిపుణులను ఆహ్వానిస్తున్నామని బుధవారమిక్కడ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన చెప్పారు. జంజీబార్ దేశ ప్రతినిధులు, భారత ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో డాక్టర్ అలీ మాట్లాడుతూ తాము వినియోగించే మందుల్లో 90 శాతం భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తమ దేశంలో ప్లాంట్లను నెలకొల్పితే 5 నుంచి 10 సంవత్సరాల ట్యాక్స్ హాలీడే ఇస్తామన్నారు. భారత ఫార్మాసిస్టుల అనుభవం తమ దేశానికి ఉపయోగపడేలా చూసేందుకే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఫార్మాక్సిల్ ఇండియా డెరైక్టర్ జనరల్ డాక్టర్ పివి అప్పాజీ మాట్లాడుతూ ఫార్మా రంగంలో భారత్ ప్రపంచంలో 11వ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో జంజీబార్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డి.కె.జదావతో పాటు 40 భారత ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ఫార్మాక్సిల్ ఇండియా మాజీ చెర్మైన్ వెంకట్ జాస్తి తదితరులు పాల్గొన్నారు. -
క్లినికల్ ట్రయల్స్‌తో ప్రాణాలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆశ్రయించింది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు వై.సోమరాజు సోమవారం కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అమెరికాకు చెందిన రెండు ఫార్మా కంపెనీలు ఇటీవల భద్రాచలం ప్రాంతంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై తమ మందులు ప్రయోగించగా.. ముగ్గురు బాలికలు చనిపోయారని తెలిపారు. ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోకుండానే మందులను ప్రజలపై ప్రయోగిస్తూ జీవించే హక్కును కాలరాస్తున్నారన్నారు. బాలికల మరణానికి కారణమైన ఫార్మా కంపెనీలపై సెక్షన్ 300 కింద క్రిమినల్ చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని భారత ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్ జనరల్‌తోపాటు ఖమ్మం ఎస్పీలను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది.