న్యూఢిల్లీ: శారిడాన్‌తో పాటు మరో మూడు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ) మందుల అమ్మకాలకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ఫార్మా కంపెనీలు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ 2016 మార్చి 10న 349 ఎఫ్‌డీసీల తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలచేసింది. దీన్ని సవాలుచేస్తూ ఫార్మా కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో కేం ద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం వాడుతున్న 349 ఎఫ్‌డీసీల్లో 328 మందులు రోగాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్లు కమిటీ తేల్చిం ది. ఫలితంగా ఈ 328 మందులను కేంద్రం నిషేధించింది. దీంతో కంపెనీలు సుప్రీం తలు పు తట్టాయి. శారిడాన్, పిరిటాన్, డార్ట్, ఎక్స్‌పెక్టోరాంట్‌పై నిషేధాన్ని సుప్రీం ఎత్తివేసింది.
Comments
Please login to add a commentAdd a comment