Saridon
-
‘శారిడాన్’కు ఊరట
న్యూఢిల్లీ: శారిడాన్‌తో పాటు మరో మూడు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) మందుల అమ్మకాలకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ఫార్మా కంపెనీలు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ 2016 మార్చి 10న 349 ఎఫ్‌డీసీల తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలచేసింది. దీన్ని సవాలుచేస్తూ ఫార్మా కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో కేం ద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం వాడుతున్న 349 ఎఫ్‌డీసీల్లో 328 మందులు రోగాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్లు కమిటీ తేల్చిం ది. ఫలితంగా ఈ 328 మందులను కేంద్రం నిషేధించింది. దీంతో కంపెనీలు సుప్రీం తలు పు తట్టాయి. శారిడాన్, పిరిటాన్, డార్ట్, ఎక్స్పెక్టోరాంట్పై నిషేధాన్ని సుప్రీం ఎత్తివేసింది. -
శారిడాన్‌కు సుప్రీంకోర్టు ఊరట
న్యూఢిల్లీ : డ్రగ్స్ నిషేధ జాబితా నుంచి శారిడాన్‌కు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం గత వారం నిషేధించిన 328 డ్రగ్స్ జాబితా నుంచి శారిడాన్, డార్ట్, పిరిటాన్ ఎక్స్‌పెక్టోరాంట్ మూడు బ్రాండ్లను మినహాయిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. శారిడాన్, డార్ట్, పిరిటాన్ ఎక్స్‌పెక్టోరాంట్‌లను మార్కెట్లో విక్రయించుకునేలా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యానికి హాని కరంగా ఉన్నాయంటూ దాదాపు 328 డ్రగ్స్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో, గ్లాక్సోస్మిత్‌క్లైన్, పిరామల్ వంటి డ్రగ్స్ మేకర్స్‌కు భారీ ఊరట లభించింది. ఈ ప్రొడక్ట్‌లు, ఆయా కంపెనీలకు పాపులర్ బ్రాండ్లు. 328 మెడిషిన్లపై నిషేధం విధిస్తూ.. కేంద్రం జారీచేసిన నోటీసులపై ఈ కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జాబితా నుంచి తమ కాంబినేషన్స్‌ను మినహాయించాలని కంపెనీలు కోరాయి. 1988 నుంచి ఈ కాంబినేషన్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామని కంపెనీలు చెప్పాయి. అంతకముందు కూడా సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిషేధం నుంచి ఇలాంటి 15 కాంబినేషన్లను మినహాయించినట్టు తెలిపాయి. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గ్లాక్సోస్మిత్‌క్లైన్ ధృవీకరించింది. పిరామల్ గ్రూప్ ఇంకా స్పందించాల్సి ఉంది. -
కేంద్రం ఆదేశాలు : శారిడాన్‌పై నిషేధం
న్యూడిల్లీ : ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) డ్రగ్స్ విషయంలో ఫార్మా కంపెనీలకు, ప్రభుత్వాలకు సాగుతున్న వివాదం మరింత ముదిరింది. 328 రకాల ఎఫ్డీసీ డ్రగ్స్‌ను వెంటనే తయారు చేయడం, విక్రయించడం ఆపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. సారిడాన్‌తో పాటు చర్మ వ్యాధులకు వాడే పాన్ డెర్మ్, ఆల్కెం ల్యాబోరేటరీస్‌కు చెందిన టాక్సిమ్ ఏజెడ్, మెక్లోడ్స్ ఫార్మా పండెమ్ ప్లస్ క్రీమ్‌లను కూడా ప్రభుత్వం నిషేధించింది. వీటితో పాటు మొత్తం 328 ఎఫ్డీసీ మందులను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. వీటి తయారీని, అమ్మకాలను, పంపిణీని తక్షణం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. వివిధ కంపెనీలు దాదాపు 6000 బ్రాండ్లతో ఈ ఔషధాలను అమ్ముతున్నారు. ప్రభుత్వ చర్యతో ఈ బ్రాండ్ల అమ్మకాలన్నీ ఆగిపోనున్నాయి. రూ.2000 కోట్ల నుంచి రూ.2500 కోట్ల వరకు వీటి మార్కెట్ సైజు ఉంటుంది. 2016లో మార్చి 10న కేంద్ర ప్రభుత్వం 349 ఎఫ్‌డీసీలను నిషేధించింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 చట్టంలోని సెక్షన్ 26A ప్రకారం వాటిపై నిషేధం విధించింది. ఐతే కేంద్రం నిర్ణయాన్ని ఫార్మా కంపెనీలు పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో గత ఏడాది డిసెంబరులో ఈ ఔషధాల విషయాన్ని పరిశీలించాల్సిందిగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్)ను సుప్రీంకోర్టు కోరింది. ఆ మేరకు పరిశీలన జరిపిన కమిటీ ..వాటిలో 328 ఎఫ్డీసీ ఔషధాలు హానికరమని నివేదిక ఇచ్చింది. వాటిపై నిషేధించడం విధించడం సరేనని తేల్చింది. ఇవి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌డీసీల తయారీని, విక్రయాలను, పంపిణీని నిరోధించడం అవసరం అని డీట్యాబ్ ఓ ప్రకటన విడుదల చేసింది.