notices issue
-
ఢిల్లీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు రూ. 31 కోట్ల ట్యాక్స్ నోటీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాకు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమీషనర్ కార్యాలయం రూ. 31.46 కోట్ల మేరకు నోటీసులు జారీ చేసింది. 2014–15 నుంచి 2017–18 మధ్య కాలంలో సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించి చెల్లించడం, వర్తించని సెన్వాట్ క్రెడిట్‌ను తీసుకోవడం ఆరోపణల కింద వడ్డీ, పెనాలీ్టతో సహా కట్టాలంటూ నోటీసులు వచి్చనట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఆర్డరుతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఇది ఎయిర్పోర్ట్యేతర వ్యాపారాన్ని విడగొట్టడానికి ముందు సంవత్సరాలకు సంబంధించిన అంశమని తెలిపింది. ఒకవేళ అపీలేట్ అథారిటీ తుది ఉత్తర్వులు ఏవైనా ఇస్తే డిమాండ్ నోటీసులో గరిష్టంగా 43.40 శాతం మొత్తం మేర తమ కంపెనీపై ప్రభావం ఉండవచ్చని వివరించింది. -
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
ఆ కంటెంట్ తొలగించకుంటే చర్యలే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం కన్నెర్రజేసింది. దాన్ని తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రాంలకు ఈ మేరకు శుక్రవారం నోటీసులిచి్చంది. ‘భారత ఇంటర్నెట్ పరిధిలో వాటిని తక్షణం శాశ్వతంగా తొలగించండి. లేదా డిజెబుల్ చేయండి‘ అని ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్ కింద వారికి కలిగించిన రక్షణను తొలగిస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. నిబంధనల మేరకు పౌరులకు నమ్మకమూ, సురక్షితమైన ఇంటర్నెట్ను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
కమీషన్లకు కక్కుర్తీ..కలెక్టర్ నోటీసులు!
జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సరైన కారణంతో సంజాయిషి ఇవ్వని సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.37.03 లక్షల లెక్కలపై నిర్లక్ష్యం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ జె.ప్రభాకర్‌రావు, ఉపసర్పంచ్ కురిక్యాల మహేశ్, పంచాయతీ కార్యదర్శి పాషా గ్రామపంచాయతీ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే కారణాలతో కలెక్టర్ ఆరునెలల పాటు సస్పెన్షన్ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. గ్రామపంచాయతీకి చెందిన నిధులు రూ.37,03,865 సంబంధించిన రికార్డులు చూపించకపోగా కలెక్టర్ జారీచేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం సైతం ఇవ్వలేదు. దీంతో పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ముగ్గురిపై సస్పెన్షన్ విధించారు. ప్రతీ నెల రూ.9.17 కోట్లు జిల్లాలోని 380 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.9.17 కోట్లు మంజూరు చేస్తోంది. గ్రామాల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండగా, ఆయా నిధులను పల్లెప్రగతి పనులతో పాటు వైకుంఠదామాలు, పల్లెప్రకృతి వనాలు, శాని టేషన్, పంచాయతీ నిర్వహణ కోసం పాలకవర్గాలు వినియోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో సుమారు రూ.110 కోట్లు గ్రామపంచాయతీల నిధుల రూపంలో జీపీలకు చేరాయి. కొన్ని గ్రామాల్లో నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. చాలా వరకు గ్రామాల్లో శ్మశానవాటిక పనులు పూర్తి కాలేదు. డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపడంతోపాటు నిధుల్లో పారదర్శకత లేని 8 మంది సర్పంచులకు కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధర్మపురి మండలం జైన, రాజారం, రాయికల్ మండలం ధర్మాజీపేట, వెల్గటూర్ మండలం గుల్లకోట, చెగ్యాం, వెల్గటూర్, కథలాపూర్ మండలం బొమ్మెన, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచులకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దుర్వినియోగం ఇలా.. ధర్మపురి మండలంలోని జైనాలో హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన ట్రీగార్డులలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019–2020లో 1,600 ట్రీగార్డులను కొనుగోలు చేశారు. ఒక్కో ట్రీగార్డుకు రూ.54 చొప్పున రూ.86,400 చెల్లించాల్సి ఉండగా.. రూ.1.92లక్షల విలువైన ట్రీగార్డులు కొన్నట్లు రికార్డులు చూపించినట్లు నిర్ధారణయ్యింది. సాధారణ నిధుల కింద రూ.1.95లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.7,95,845, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.27,13,020 మొత్తం రూ.37,03,865 నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ నుంచి షోకాజ్ నోటీలు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లోగా స్పందించకపోవడంతో సస్పెన్షన్ చేస్తున్నట్లు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ధర్మపురి మండలంలోని రాయపట్నంలో రూ.4 లక్షలు, బుగ్గారం పంచాయతీలో రూ.2.40 లక్షలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో షోకాజ్ నోటీస్‌లు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సంజాయిసీ ఇవ్వాలని కోరారు. -
స్వలింగ వివాహాలపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై తమ స్పందనను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహం చేసుకునేందుకు అనుమతించాలని ఒక జంట, అమెరికాలో జరిగిన తమ పెళ్లిని విదేశీ వివాహ చట్టం కింద భారత్‌లో నమోదు చేయాలని ఇంకో జంట వేర్వేరుగా వేసిన పిటిషన్లపై జస్టిస్ ఆర్.ఎస్. ఎండ్లా, జస్టిస్ ఆషా మీనన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకుంటామని ప్రతిపాదించిన మహిళలు ఇద్దరు ఆ చట్టంలో స్వలింగ వివాహాలకు తగిన నిబంధనలు లేకపోవడాన్ని సవాలు చేశారు. మరోవైపు అమెరికాలో వివాహం చేసుకుని రాగా విదేశీ వివాహ చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేయకపోవడాన్ని ఇద్దరు పురుషులు సవాలు చేశారు. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా పడింది. అయితే వివాహం చట్టాలు స్వలింగ వివాహాలకు అనుమతి ఇవ్వవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు రెండింటిలోనూ వివాహానికి నిర్వచనం లేకున్నా సంప్రదాయక చట్టాల ప్రకారం దాన్ని అర్థం చేసుకుంటారని వివరించింది. దీన్ని పిటిషన్‌దారులు సవాలు చేయాలని భావిసే,్త ఇప్పుడే చేయాలని స్పష్టం చేసింది. అయితే.. పిటిషన్‌దారులు సంప్రదాయ, మత చట్టాల కింద గుర్తింపు కావాలని కోరడం లేదని, కులాంతర, మతాంతర వివాహాలను గుర్తించే పౌర చట్టాల (ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు) కింద మాత్రమే గుర్తింపు కోరుతున్నారని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది మేనక గురుస్వామి వాదించారు. ఇదే తొలిసారి.. ఐదు వేల ఏళ్ల సనాతన ధర్మ సంప్రదాయంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన రాజ్‌కుమార్ యాదవ్ బెంచ్‌కు నివేదించారు. ఇందుకు బెంచ్ బదులిస్తూ... చట్టాల్లోని భాష ఏ ఒక్కరివైపో (పురుషులు, మహిళలు) సూచించడం లేదని, దేశ పౌరులందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని అర్థం చేసుకోవాలని చెప్పింది. పిటిషన్లు రెండూ ప్రకృతికి విరుద్ధమైనవి కావని అనగా కేంద్రం తరఫు మరో న్యాయవాది కీర్తిమాన్ సింగ్ అంగీకరించారు. తాము ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నామని, కష్టసుఖాలన్నింటినీ పంచుకుంటున్నామని.. కానీ ఇద్దరూ మహిళలమే (ఒకరి వయసు 47, ఇంకొరిది 36) అయినందున పెళ్లి మాత్రం చేసుకోలేకపోతున్నామని పిటిషన్‌దారులైన ఇద్దరు మహిళలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి కాని కారణంగా మిగిలిన జంటల్లాగా సొంతిల్లు, బ్యాంక్ అకౌంట్ తెరవడం, కుటుంబ బీమా తదితరాలను పొందలేకపోతున్నామని వాపోయారు. ఆర్టికల్ 21 ద్వారా పౌరులకు సంప్రదించే హక్కు స్వలింగ దంపతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికాలో జరిగిన తమ వివాహాన్ని భారత కాన్సులేట్ విదేశీ వివాహ చట్టం కింద నమోదు చేయలేదని, ఇతర జంటల మాదిరిగానే తమ వివాహాన్ని కూడా భారత కాన్సులేట్ గుర్తించి ఉండాల్సిందని పురుష పిటిషన్‌దారులు ఇద్దరూ పేర్కొన్నారు. 2017లో జరిగిన తమ వివాహాన్ని గుర్తించకపోవడం కారణంగా కోవిడ్–19 కాలంలో దంపతులుగా కలిసి ప్రయాణించేందుకు, తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. భారత కాన్సులేట్ నిర్ణయం ఆర్టికల్ 14, 15, 19, 21లను అతిక్రమించిందని ఆరోపించారు. -
లలిత్‌మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీ, ఆయన భార్య మినాల్ మోడీలకు స్విట్జర్లాండ్ నోటీసులు జారీ చేసింది. నల్లధనంపై పోరులో భాగంగా ఈ దంపతుల డిపాజిట్ వివరాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌ను కోరడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2010లో దేశం నుంచి లండన్‌కు పారిపోయిన లలిత్‌మోడీ ఇప్పటికే మనీల్యాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వం కోరిన సమాచారం విషయంలో తమ స్పందన తెలియజేసేందుకు లలిత్‌మోడీ దంపతులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం పది రోజుల గడువు ఇచ్చింది. -
నల్ల కుబేరులకు ‘స్విస్’ నోటీసులు
న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకు ఖాతాల్లో నల్లధనం దాచుకున్న వారికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతున్నాయి. తాజాగా 11 మంది భారతీయులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ తాఖీదులు జారీ చేసింది. వారి ఖాతాల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనున్నామని, దీనిపై అభ్యంతరాలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించింది. అప్పీల్ చేసుకోవడానికి ఇదే ఆఖరు అవకాశమని స్పష్టం చేసింది. వీరిలో కృష్ణ భగవాన్ రామ్‌చంద్, కల్పేష్ హర్షద్ కినారివాలా మొదలైన వారి పేర్లు ఉన్నాయి. మిగతా వారి పేర్లను కేవలం పొడి అక్షరాలతో మాత్రమే స్విస్ ప్రభుత్వం తన గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించింది. దశాబ్దాలుగా నల్ల కుబేరులకు స్విస్ బ్యాంకులు ఊతంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, నల్లధనంపై పోరులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఈ చర్యలు చేపట్టింది. మార్చి నుంచి స్విస్ బ్యాంకుల భారతీయ క్లయింట్స్‌కు 25 నోటీసులు దాకా జారీ అయినట్లు సమాచారం. -
కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘాని(ఈసీ)కి నేర చరిత్ర వెల్లడించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా విధిగా తమ నేర చరిత్రను ఈసీకి వెల్లడించాలి. ఈ వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బహిరంగపరచాలి’ అంటూ గత ఏడాది తీర్పు చెప్పింది. ఫారం–26లో సవరణ చేస్తూ, పార్టీలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఈసీ జారీ చేసింది. కానీ ఎన్నికల నిబంధనావళిని, ఎన్నికల చిహ్నాల వరుస క్రమాన్ని మార్చకుండా జారీ చేసిన ఈ మార్గదర్శకాలకు ఎటువంటి చట్టబద్ధత ఉండనందున కోర్టు ధిక్కారంకింద చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. అభ్యర్థులు నేర చరిత్రను బహిరంగ పర్చాల్సిన ప్రముఖ పత్రికలు, న్యూస్ చానెళ్ల పేర్లను ఈసీ స్పష్టం చేయలేదు. దీంతో అభ్యర్థులు ప్రజాదరణ లేని పత్రికల్లో, వీక్షకులుండని సమయాల్లో చానెళ్లలోనూ తమ నేర చరిత్రను వెల్లడించారనీ, ఇలాంటి వారిపై ఈసీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ శరన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. 2018 సెప్టెంబర్ 25వ తేదీన వెలువరించిన తమ తీర్పును అమలు చేయకపోవడంపై వివరణ కోరుతూ ఈసీలోని ముగ్గురు కమిషనర్లతోపాటు న్యాయశాఖ, కేబినెట్ కార్యదర్శులకు ధర్మాసనం నోటీసులిచ్చింది. ఈవీఎం ఫలితాలతో సరిపోల్చే వీవీప్యాట్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్‌పై ఈసీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ స్థానంలోని ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం ఫలితాలతో వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూడాలన్న ప్రస్తుత విధానమే అత్యంత అనుకూలమైందని ఈసీ పేర్కొంది. కనీసం 50 శాతం ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూసేలా ఈసీని ఆదేశించాలంటూ 21 ప్రతిపక్ష పార్టీలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. దీనిపై ఈసీ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. దీంతో ఈసీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఈవీఎంల ఫలితాలలో సరిపోల్చే వీవీ ప్యాట్ల సంఖ్యను పెంచినప్పటికీ ప్రస్తుత విధానంపై 99.9936 శాతంగా ఉన్న విశ్వాసంపై ఏమాత్రం ప్రభావం చూపబోదు’ అని తెలిపింది. ప్రస్తుత విధానంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడం లేదనటానికి ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకోదగ్గ ఒక్క కారణం కూడా చూపలేకపోయినట్లు పేర్కొంది. -
మాయావతి హిజ్రా కన్నా అధ్వానం
చందౌలి(యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తెలిపారు. సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. -
‘శారిడాన్’కు ఊరట
న్యూఢిల్లీ: శారిడాన్‌తో పాటు మరో మూడు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) మందుల అమ్మకాలకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ఫార్మా కంపెనీలు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ 2016 మార్చి 10న 349 ఎఫ్‌డీసీల తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలచేసింది. దీన్ని సవాలుచేస్తూ ఫార్మా కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో కేం ద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం వాడుతున్న 349 ఎఫ్‌డీసీల్లో 328 మందులు రోగాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్లు కమిటీ తేల్చిం ది. ఫలితంగా ఈ 328 మందులను కేంద్రం నిషేధించింది. దీంతో కంపెనీలు సుప్రీం తలు పు తట్టాయి. శారిడాన్, పిరిటాన్, డార్ట్, ఎక్స్పెక్టోరాంట్పై నిషేధాన్ని సుప్రీం ఎత్తివేసింది. -
ఆర్టీఐ కమిషనర్లను నియమించరా?
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం పరిధిలోని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్రాల సమాచార కమిషన్ల(ఎస్ఐసీ)లో ఖాళీల్ని భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై ఈ జాప్యం ప్రభావం చూపుతుందని, ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయలేదో జవాబు చెప్పాలని కేంద్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. సమాచార హక్కు కమిషనర్లను భర్తీ చేయకపోవడంతో వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ముగ్గురు పిటిషనర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. వెంటనే చర్యలు చేపట్టాలి: సుప్రీం ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఖాళీల్ని భర్తీ చేయకపోతే ఈ రాజ్యాంగ సంస్థల నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ విభాగాల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర చట్టబద్ధ సంస్థల్లోను ఇది అలవాటుగా మారిపోయింది. వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదు. మీరు ఏదొకటి చేయాలి’ అని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు సుప్రీం స్పష్టం చేసింది. సీఐసీలో 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదుల పెండింగ్ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, మాజీ నేవీ అధికారి లోకేశ్ బాత్రా, అమ్రితా జోహ్రిల తరఫున న్యాయవాది కామిని జైస్వాల్ వాదిస్తూ.. ప్రస్తుతం సీఐసీలో 4 ఖాళీలున్నాయని, 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నా బ్యాక్‌ల్యాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, కేరళ, కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఆర్టీఐ చట్టాన్ని కాలరాస్తున్నారు. కేంద్ర సమాచార కమిషన్ వద్ద వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016లో వచ్చిన అప్పీళ్లూ పెండింగ్‌లో ఉన్నాయి’ అని జైస్వాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్‌లో ఒక్క కమిషనర్‌ను కూడా భర్తీ చేయలేదని, ఆ రాష్ట్ర ఎస్ఐసీ ప్రస్తుతం ఎలాంటి విధులూ నిర్వర్తించడం లేదని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర కమిషన్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయని, అక్కడ 40 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కర్ణాటకలో ఆరు పోస్టుల ఖాళీగా ఉండగా.. 33 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.కేరళలో ఒకే ఒక్క కమిషనర్ విధుల్లో ఉన్నారని, అక్కడ 14 వేల అప్పీళ్లను పరిష్కరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్ణాటక, ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. -
అన్నవరం దేవునికీ ‘పన్ను’పోటు
రూ.20 లక్షలు చెల్లించాలని పంచాయతీల నోటీసులు చట్టం ప్రకారం మినహాయింపు కోరగా తిరస్కరించిన డీపీఓ కోర్టును ఆశ్రయిస్తామంటున్న దేవస్థానం ఈఓ అన్నవరం : ఆపన్నులకు రక్షగా నిలిచే రత్నగిరీశునికీ పన్నుపోటు తప్పలేదు. అన్నవరం దేవస్థానంలోని రత్నగిరి, సత్యగిరిపై గల వివిద భవనాలకు సంబంధించి 2015–16 సంవత్సరానికి రూ.20 లక్షల పన్ను చెల్లించాలని అన్నవరం, బెండపూడి పంచాయితీలు దేవస్థానానికి నోటీసులు పంపించాయి. శంఖవరంలోని కల్యాణ మండపానికి రూ.36 వేల ఆస్తిపన్ను చెల్లించాలని ఆ పంచాయితీ కూడా నోటీస్ ఇచ్చింది. దేవస్థానానికి ఏపీజీపీ 1964 చట్టం ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారికి దేవస్థానం లేఖ రాసినా సాధ్యం కాదని సమాధానం ఇచ్చారు. దీనిపై కోర్టులో కేసు వేసి మినహాయింపు పొందాలని దేవస్థానం నిర్ణయించింది. సుమారు ఏడాదిగా దేవస్థానం, పంచాయితీల మధ్య పన్నుల వివాదం నడుస్తోంది. పదిరెట్లు పెరిగిన పన్ను రత్నగిరిపై వివిద భవనాలు, సత్రాలకు సవరించిన పన్నుల ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి రూ.14.28 లక్షల ఇంటిపన్ను చెల్లించాలని అన్నవరం పంచాయితీ దేవస్థానానికి గత ఏడాది ఆగస్టులో నోటీస్ పంపింది. అప్పటివరకూ కేవలం రూ.1.40 లక్షలు మాత్రమే ఉన్న పన్ను ఒక్కసారిగా పదిరెట్లు పెరగడంతో దేవస్థానం అధికారులు ఉలిక్కిపడ్డారు. బెండపూడి పరిధిలోకి వచ్చే సత్యగిరిపై నిర్మించిన హరిహరసదన్ సత్రానికి రూ.3.04 లక్షలు, విష్ణుసదన్ సత్రానికి రూ.1.55 లక్షలు పన్ను చెల్లించాలని ఆ పంచాయతీ, శంఖవరంలోని కల్యాణమండపానికి రూ.36,634 పన్ను చెల్లించాలని ఆ పంచాయతీ కూడా నోటీసులు పంపాయి. దేవస్థానం సత్రాలు, అతిథిగృహాలు అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నందున నిబంధనల ప్రకారం ఇంటిపన్ను చెల్లించాల్సిందేనని పంచాయతీ అధికారులు అంటున్నారు. పాత భవనాలకు పన్ను సవరించడంతో బాటు కొత్త వాటికి పన్ను వేశామని చెపుతున్నారు. కొండదిగువన లాడ్జిలలో గదులను అద్దెకిస్తున్నట్టే దేవస్థానం సత్రాలను కూడా అద్దెకిస్తున్నారంటున్నారు. ఏపీజీపీ1964 చట్టం ప్రావిజన్ రూల్–5ఈ ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి జేఎస్ఎస్ శర్మకి గత డిసెంబర్లో లేఖ రాశారు. అన్నవరం పంచాయతీకి ఏటా గ్రాంట్స్ రూపంలో, గ్రామంలో పారిశుధ్య పనుల కోసం రూ.ఏడు లక్షలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. పన్నులు కట్టి తీరాల్సిందే.. పంచాయతీ చట్టం ప్రకారం పౌల్ట్రీషెడ్లు, ఎన్జీఓ హోమ్‌లు, మాజీ సైనికోద్యోగులకు మాత్రమే ఇంటిపన్ను మినహాయింపు ఉంది తప్ప దేవస్థానాలకు లేదని డీపీఓ గత ఫిబ్రవరిలో పంపిన లేఖలో పేర్కొన్నారు. అందువలన పన్నులు కట్టాల్సిందేనన్నారు. దేవస్థానంలో భవనాలకు విధించిన పన్నులను చెల్లించాల్సిందేనని అన్నవరం గ్రామపంచాయతీ కార్యదర్శి బి.రామశ్రీనివాస్ అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దేవస్థానం చెల్లించే పన్నులను తిరిగి గ్రామాభివృద్ధికే ఉపయోగిస్తామని చెప్పారు. కాగా దేవస్థానాలకు ఇంటి, ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీఓను అనుసరించి కోర్టుకు వెళతామని ఈఓ నాగేశ్వరరావు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. సింహాచలం దేవస్థానానికి విశాఖ కార్పొరేషన్, ద్వారకా తిరుమల దేవస్థానానికి అక్కడి పంచాయతీ ఇలాగే పన్ను కట్టమని నోటీస్ ఇస్తే ఆ దేవస్థానాలు కూడా కోర్టును ఆశ్రయించాయన్నారు. రత్నగిరి, సత్యగిరిలపైనున్న దేవస్థానం భవనాలు, సత్రాలు, ఇతర నిర్మాణాలు