హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాకు సెంట్రల్ జీఎస్‌టీ ఆడిట్ కమీషనర్ కార్యాలయం రూ. 31.46 కోట్ల మేరకు నోటీసులు జారీ చేసింది. 2014–15 నుంచి 2017–18 మధ్య కాలంలో సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించి చెల్లించడం, వర్తించని సెన్‌వాట్ క్రెడిట్‌ను తీసుకోవడం ఆరోపణల కింద వడ్డీ, పెనాలీ్టతో సహా కట్టాలంటూ నోటీసులు వచి్చనట్లు సంస్థ తెలిపింది.
అయితే, ఈ ఆర్డరుతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఇది ఎయిర్‌పోర్ట్‌యేతర వ్యాపారాన్ని విడగొట్టడానికి ముందు సంవత్సరాలకు సంబంధించిన అంశమని తెలిపింది. ఒకవేళ అపీలేట్ అథారిటీ తుది ఉత్తర్వులు ఏవైనా ఇస్తే డిమాండ్ నోటీసులో గరిష్టంగా 43.40 శాతం మొత్తం మేర తమ కంపెనీపై ప్రభావం ఉండవచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment