Audit officials
-
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు రూ. 31 కోట్ల ట్యాక్స్ నోటీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాకు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమీషనర్ కార్యాలయం రూ. 31.46 కోట్ల మేరకు నోటీసులు జారీ చేసింది. 2014–15 నుంచి 2017–18 మధ్య కాలంలో సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించి చెల్లించడం, వర్తించని సెన్వాట్ క్రెడిట్‌ను తీసుకోవడం ఆరోపణల కింద వడ్డీ, పెనాలీ్టతో సహా కట్టాలంటూ నోటీసులు వచి్చనట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఆర్డరుతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఇది ఎయిర్పోర్ట్యేతర వ్యాపారాన్ని విడగొట్టడానికి ముందు సంవత్సరాలకు సంబంధించిన అంశమని తెలిపింది. ఒకవేళ అపీలేట్ అథారిటీ తుది ఉత్తర్వులు ఏవైనా ఇస్తే డిమాండ్ నోటీసులో గరిష్టంగా 43.40 శాతం మొత్తం మేర తమ కంపెనీపై ప్రభావం ఉండవచ్చని వివరించింది. -
కదలిక లేని నివేదిక!
సూపరింటెండెంట్‌పై ‘ఆడిట్’ విచారణ ఏడు నెలలైనా చర్యలు శూన్యం ఖమ్మం సంక్షేమ విభాగం : అడ్డదారుల్లో పదోన్నతి పొందిన వ్యక్తిపై విచారణ చేసి ఏడు నెలలు గడిచినా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఖమ్మం డీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ సీహెచ్.శ్రీనివాస్‌పై ఆడిట్ ఆధికారులు జనవరి 5న విచారణ చేపట్టారు. గతంలో ఆయన కరీంనగర్లో పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగోన్నతి పొందినట్లు డి.కనకయ్య అనే ఇతడి సహోద్యోగి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆడిట్ అధికారి రాజు, సీనియర్ ఆడిటర్ శ్యాంప్రసాద్.. శ్రీనివాస్ వద్ద నుంచి లిఖితపూర్వక వాగ్మూలం తీసుకోవడంతోపాటు ఆయన సర్వీసు రిజిస్టర్‌ను పరిశీలించారు. కనకయ్య చేసిన ఫిర్యాదు ప్రకారం శ్రీనివాస్, కనకయ్య ఒకేసారి ఉద్యోగంలో చేరినప్పటికీ శ్రీనివాస్ తన సర్వీసు పుస్తకంలో కొన్ని పేజీలను తొలగించి.. కొన్ని వివరాలు అదనంగా చేర్చి ప్రభుత్వాన్ని మోసం చేసి.. రెండు అదనపు ఇంక్రిమెంట్లు, ఒక ప్రమోషన్ పొందినట్లు పేర్కొన్నారు. పైగా సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు కూడా జవాబు ఇవ్వకపోవడం పట్ల కనకయ్య రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్లో గతంలో విచారణ జరగగా.. అనంతరం శ్రీనివాస్ బదిలీపై ఖమ్మం రావడంతో ఖమ్మంలో 2015, జనవరి 5న విచారణ చేపట్టారు. విచారణ వివరాలను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు విచారణ అధికారులు ఆ సమయంలో తెలిపారు. కాగా, ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి కదలిక కనిపించలేదు. దీంతో కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. -
లెక్క తప్పిన ఆడిట్
కంచే చేను మేయడమంటే ఇదేనేమో! ఉద్యోగులు ‘లెక్క’ తప్పకుండా చూడాల్సిన ‘ఆడిట్ అధికారులు’ కాసులివ్వలేదని తప్పుడు నివేదికలిచ్చారు. గతంలో చేసిన ఆడిటింగ్నే మళ్లీ చేయాలంటూ... ఓ ఉద్యోగిపై నింద మోపి అతడి సస్పెండ్‌కు కారణమయ్యారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో పురివిప్పిన తాజా అక్రమ బాగోతం ఇది. - ఉన్న బిల్లు పుస్తకాలు లేవని తప్పుడు నివేదిక - దాన్నిబట్టే ఉద్యోగిని బలిచేసిన అధికారులు - లంచం ఇవ్వనందుకే: ఉద్యోగి సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ పాండు. 2010-11కు సంబంధించిన రెండు బిల్ బుక్కులర శీదులతో పాటు డబ్బులను కార్యాలయంలో అతను జమచేశాడు. కానీ ఎలాంటి సొమ్ము పాండు జమ చేయలేదని ఇటీవల ఆడిట్ నిర్వహించిన అధికారులు మున్సిపల్ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా... గత నెల 18 జరిగిన మున్సిపల్ పబ్లిక్ అకౌంట్ కమిటీ సమావేశంలో పాండును సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మేరకు పాండును విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మనస్థానికి గురైన పాండు... బుధవారం కార్యాలయంలోని అన్ని రికార్డులను పరిశీలించారు. పాండుకు సంబంధించిన బుక్ నంబర్ 277, 337 రెండింటికీ కార్యాలయంలో ఐఆర్ రికార్డు లభించింది. వాటిని పరిశీలిస్తే 2010లో అప్పటి అకౌంటెంట్ ఆంజనేయులుకు, 2011లో లత అనే అకౌంటెంట్‌కు బిల్లు బుక్కులకు సంబంధించిన సొమ్ము చెల్లించినట్లుగా ఉంది. కానీ ఆడిటింగ్ అధికారులు మాత్రం ఈ నెంబర్లున్న బిల్ పుస్తకాలు సమర్పించలేదంటూ పాండుపై అభియోగం మోపారు. అతని ఉద్యోగానికే ఎసరు పెట్టారు. రికార్డుల్లో ఉన్నా... తాను ఆడిటింగ్ అధికారులు అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై తప్పడు నివేదికలు ఇచ్చినట్లు మున్సిపల్ బిల్లు కలెక్టర్ పాండు ఆరోపిం చారు. తన రెండు బిల్ బుక్స్కూ సంబంధించిన డబ్బులను అప్పుడే అకౌంట్స్ అధికారులకు చెల్లించి ఐఆర్ రికార్డులో రాయించుకోవడం జరిగిందన్నారు. ఆడిటింగ్ అధికారులు కొంత సొమ్మ ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకు తాను నిరాకరించినందుకు తనపై ఇలా తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. సదరు అధికారులు కార్యాలయంలోనే బిల్ బుక్స్ దాచిపెట్టారన్నారు. అవును... నిజమే... ‘బిల్ కలెక్టర్ పాండుకు సంబంధించిన రెండు బిల్ బుక్స్ పోయినట్లుగా ఆడిటింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అయితే సదరు బుక్స్, సొమ్ము కార్యాలయంలో జమచేసినట్లుగా ఐఆర్ రికార్డు లభించిం ది. ఈ క్రమంలో పాండుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసే లా అనుమతివ్వాలని ఉన్నతాధికారులకు పంపాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.