
ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్ట్స్ డెవలపర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక విమానయాన హబ్‌గా మార్చనున్నట్టు జీఎంఆర్ తెలిపింది.
‘వ్యూహాత్మకంగా మధ్య భారత్‌లో ఉన్న నాగ్‌పూర్ ప్రయాణికులకు, సరుకు రవాణాకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. దశలవారీగా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి అభివృద్ధి చేస్తాం. కార్గో హ్యాండ్లింగ్ సామ ర్థ్యం 20,000 టన్నులకు చేరనుంది. తద్వారా నాగ్‌పూర్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతుంది. తొలి దశ లో ప్యాసింజర్ టెరి్మనల్ సామర్థ్యం 40 లక్షల మంది ప్రయాణికుల స్థాయి లో తీర్చిదిద్దుతాం. మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్‌పోర్ట్ ఎట్ నాగ్‌పూర్‌తో (మిహా న్) జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పో ర్ట్‌కు కన్సెషన్ ఒప్పందం కుదిరింది’ అని జీఎంఆర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment