Nagpur Airport
-
GMR: నాగ్‌పూర్ విమానాశ్రయం ఆధునీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్ట్స్ డెవలపర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక విమానయాన హబ్‌గా మార్చనున్నట్టు జీఎంఆర్ తెలిపింది. ‘వ్యూహాత్మకంగా మధ్య భారత్‌లో ఉన్న నాగ్‌పూర్ ప్రయాణికులకు, సరుకు రవాణాకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. దశలవారీగా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి అభివృద్ధి చేస్తాం. కార్గో హ్యాండ్లింగ్ సామ ర్థ్యం 20,000 టన్నులకు చేరనుంది. తద్వారా నాగ్‌పూర్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతుంది. తొలి దశ లో ప్యాసింజర్ టెరి్మనల్ సామర్థ్యం 40 లక్షల మంది ప్రయాణికుల స్థాయి లో తీర్చిదిద్దుతాం. మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్పోర్ట్ ఎట్ నాగ్‌పూర్‌తో (మిహా న్) జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పో ర్ట్‌కు కన్సెషన్ ఒప్పందం కుదిరింది’ అని జీఎంఆర్ తెలిపింది. -
‘గో ఫస్ట్’ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నాగ్‌పూర్: బెంగళూరు నుంచి పట్నాకు శనివారం ఉదయం బయలుదేరిన విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గో ఫస్ట్ విమానయాన సంస్థకు చెందిన ఆ విమానంలోని మొత్తం 139 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ‘గో ఫస్ట్ విమానం ఇంజిన్ ఒకదానిలో లోపం తలెత్తినట్లు గమనించిన పైలట్ వెంటనే నాగ్‌పూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించాడు. పరిస్థితి వివరించి, అధికారుల సాయం కోరాడు’ అని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అబిడ్ రుహి తెలిపారు. ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను మధ్యాహ్నం మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చారు. -
జీఎంఆర్ చేజారిన నాగ్‌పూర్ విమానాశ్రయ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మరో ఎదురుదెబ్బ. కంపెనీ గతేడాది దక్కించుకున్న నాగ్‌పూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టును మిహాన్ ఇండియా రద్దు చేసింది. జీఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేశామని మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ ఎండీ అనిల్ పాటిల్ తెలిపారు. తిరిగి టెండర్ల ప్రక్రియను త్వరలో మొదలుపెడతామని చెప్పారు. కాగా, కరోనా ఎఫెక్ట్‌తో జీఎంఆర్ కమలాంగ ఎనర్జీ డీల్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. జీఎంఆర్ కమలాంగ ఎనర్జీని రూ.5,321 కోట్లకు దక్కించుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేర్ పర్చేజ్ ఒప్పందం జీఎంఆర్‌తో చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఎయిర్ పోర్టులోకి చొరబడిన పందులు
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన పహారా ఉండే నాగపూర్ విమానాశ్రయంలో భద్రత ఉల్లంఘన జరిగింది. పటిష్టమైన రక్షణ కవచాన్ని ఛేదించుకుని పందుల గుంపు రన్ వేపై హల్ చల్ చేసింది. అదికూడా రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయిన సమయంలో. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. అసలేం జరిగిందంటే... రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాగపూర్ కు వచ్చారు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న జుంబో బోయింగ్ 737 విమానం నాగపూర్ విమానంలో కిందకు దిగి టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళుతుండగా రన్ వేపై హఠాత్తుగా 8 పందులు ప్రత్యక్షమయ్యాయి. విమానాశ్రయ సిబ్బంది ఉరుకులు పెట్టి వరాహాలను రన్ వే నుంచి వెళ్లగొట్టారు. ఎయిర్ పోర్టులోకి పందుల చొరబాటును సీరియస్ గా పరిగణించి డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. భద్రత, రక్షణ ఉల్లంఘనపై డీజీసీఏ పశ్చిమ విభాగం అధికారి విచారణ చేపట్టారు. -
మూడు మహా ప్రాజెక్టులకు ఓకే
న్యూఢిల్లీ: రెండు నూతన విమానాశ్రయాల నిర్మాణంతోపాటు మరొక దాని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులను సత్వరమే చేపట్టాలని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన బుధవారం దేశరాజధానిలో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య రాజధానితోపాటు ఇతర ప్రధాన నగరాలను అభివృద్ధి బాటలో ముందుంచేందుకు కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించారు. పుణే, నవీముంబైలలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంతోపాటు నాగపూర్ విమానాశ్రయాన్ని విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేవన్నారు. కాగా ముంబై నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 60 కిలోమీటర్ల పొడవున రూ. 20 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి విదితమే. కాగా, చర్చిగేట్-విరార్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు కోసం నగరవాసులు మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు. ఇందుకు కారణం ముంబైలో ట్రాఫిక్ స్థితిగతులపై మరొకసారి అధ్యయనం చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. 60 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 20 వేల కోట్లు ఖర్చవ్వచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాగా ప్రతిపాదిత ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చ వాన్ ఈ సందర్భంగా పీఎం మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు.