హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు మరో ఎదురుదెబ్బ. కంపెనీ గతేడాది దక్కించుకున్న నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టును మిహాన్ ఇండియా రద్దు చేసింది. జీఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేశామని మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ ఎండీ అనిల్ పాటిల్ తెలిపారు. తిరిగి టెండర్ల ప్రక్రియను త్వరలో మొదలుపెడతామని చెప్పారు. కాగా, కరోనా ఎఫెక్ట్‌తో జీఎంఆర్ కమలాంగ ఎనర్జీ డీల్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. జీఎంఆర్ కమలాంగ ఎనర్జీని రూ.5,321 కోట్లకు దక్కించుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేర్ పర్చేజ్ ఒప్పందం జీఎంఆర్‌తో చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment