![Bengaluru-Patna flight makes emergency landing at Nagpur - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/28/go-first.jpg.webp?itok=R13L6Umq)
నాగ్‌పూర్: బెంగళూరు నుంచి పట్నాకు శనివారం ఉదయం బయలుదేరిన విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గో ఫస్ట్ విమానయాన సంస్థకు చెందిన ఆ విమానంలోని మొత్తం 139 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ‘గో ఫస్ట్ విమానం ఇంజిన్ ఒకదానిలో లోపం తలెత్తినట్లు గమనించిన పైలట్ వెంటనే నాగ్‌పూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించాడు. పరిస్థితి వివరించి, అధికారుల సాయం కోరాడు’ అని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అబిడ్ రుహి తెలిపారు. ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను మధ్యాహ్నం మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment