bangalore airport
-
కాలి బ్యాండేజీలో బంగారం
దొడ్డబళ్లాపురం: కాలికి గాయమైనట్లు బ్యాండేజీ చుట్టుకుని లోపల బంగారం దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.43లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మే 21న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్టు తెలియడంతో అతన్ని తనిఖీలు చేశారు. అతడి కాలికి చుట్టిన బ్యాండేజీపై అనుమానం వచ్చి విప్పి చూడగా రెండు బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. మరో చైను కూడా అతడి నుండి స్వాధీనం చేసుకున్నారు. స్టీలు కడియం రూపంలో. చేతి కడియానికి స్టీలు పూత పూసి బంగారును తరలిస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో పట్టుకున్నారు. మే 20న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికునిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీ చేయగా, చేతికి ఉన్న పెద్ద స్టీలు కనిపించింది. దానిని పరిశీలించగా, బంగారు కడియమని, పైకి కనబడకుండా ఉండడానికి స్టీలు పూత పూసినట్లు వెల్లడైంది. రూ.31 లక్షల విలువ చేసే అర్ధ కేజీ బంగారాన్ని స్వాదీనం చేసుకొన్నారు. -
పెంపుడు పిల్లి పరారు.. ఎయిర్‌పోర్టులో కేసు!
దొడ్డబళ్లాపురం: ఓ ప్రయాణికురాలి పెంపుడు పిల్లి పారిపోయిన సంఘటన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కెల్లి జాన్సన్ అనే మహిళ గత బుధవారం తెల్లవారుజామున ఇక్కడి నుంచి దోహాకు వెళ్తూ తన పెంపుడు కుక్కను, పిల్లిని ప్రత్యేక పంజరాల్లో ఉంచి తెచ్చారు. వాటిని తనతో పాటు పంపాలని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి అప్పగించారు. చెకింగ్ పూర్తయిన తరువాత పంజరం నుంచి పిల్లి కనబడకుండా పోయింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పిల్లిని తెచ్చివ్వాల్సిందేనని మహిళ అక్కడి భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
‘గో ఫస్ట్’ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నాగ్‌పూర్: బెంగళూరు నుంచి పట్నాకు శనివారం ఉదయం బయలుదేరిన విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గో ఫస్ట్ విమానయాన సంస్థకు చెందిన ఆ విమానంలోని మొత్తం 139 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ‘గో ఫస్ట్ విమానం ఇంజిన్ ఒకదానిలో లోపం తలెత్తినట్లు గమనించిన పైలట్ వెంటనే నాగ్‌పూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించాడు. పరిస్థితి వివరించి, అధికారుల సాయం కోరాడు’ అని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అబిడ్ రుహి తెలిపారు. ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను మధ్యాహ్నం మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చారు. -
రాహుల్ హత్యకేసు కొలిక్కి
సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు కోరాడ విజయకుమార్‌తోపాటు మిగిలిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కోగంటి సత్యంను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఎలా హత్య చేశారనే దానిపై అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కోరాడ విజయకుమార్ వద్ద పనిచేసే వారే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యలో 10 మందికిపైగా పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసులో గాయత్రి అనే మహిళ పాత్ర పరోక్షంగా ఉన్నట్లు తెలిసింది. రాహుల్‌కు, ఆమెకు కూడా ఆర్థిక లావాదేవీల విషయమై విభేదాలున్నట్లు సమాచారం. ప్రధానంగా కంపెనీ లావాదేవీలకు సంబంధించి రాహుల్, కోరాడ విజయకుమార్ల పంచాయితీలో కోగంటి సత్యం ఉన్నట్లు తెలిసింది. హత్య జరిగిన వెంటనే వేగంగా స్పందించిన పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను బహిరంగపరిచి కేసును తేల్చే దిశగా అడుగులు వేస్తున్నారు. -
కడుపులో రూ.11 కోట్ల విలువైన కొకైన్
బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆఫ్రికన్ దేశస్తుడి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడినిక స్కాన్ చేయగా.. పొట్టలో కొకైన్ ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి కొకైన్‌ను బయటికి తీశారు. కాగా కొకైన్ విలువ దాదాపు రూ. 11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం.. పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
పెళ్లి పత్రికల్లో మత్తు పదార్థాలు పెట్టి..
సాక్షి, బెంగళూరు : బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో భారీమొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. పెళ్లిపత్రికల్లో రహస్యంగా తరలిస్తున్న రూ.5.05కోట్ల విలువైన ఎఫెడ్రిన్ అనే మత్తు మందును సీజ్ చేశారు. శనివారం 5.49 కేజీల డ్రగ్స్‌ను పెళ్లిపత్రికల్లో గుట్టుగా అమర్చి తరలిస్తుండగా కార్గో విభాగంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.మదురైకి చెందిన వ్యక్తి డ్రగ్స్ దాచిన 43 శుభలేఖలను ఆస్ట్రేలియాకు తరలిస్తున్నాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్ ప్యాకెట్లు బయటపడ్డాయి. 18న రూ.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత ఇదే కార్గో విభాగంలో ఈ నెల 18న బట్టలు కుట్టే యంత్రంలో రూ.5 కోట్ల ఖరీదైన ఎఫెడ్రిన్‌ను రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడం కలవరపరుస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరచుగా డ్రగ్స్ రవాణా కేసులు బయటపడడం చూస్తుంటే మత్తు రవాణాకు దుండగులు బెంగళూరు ఎయిర్‌పోర్టును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో ఇక్కడి నుంచి స్మగ్లింగ్‌కు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ముఖమే బోర్డింగ్ పాస్!
త్వరలోనే బెంగళూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌గా మారనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా 2019 ప్రథమార్ధంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ ‘ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ’ని ప్రారంభించనున్నారు. ముందుగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్‌జెట్ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వాడుకోనున్నారు. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ పేపర్‌లెస్ ఎయిర్ ట్రావెల్లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలవనుంది. ఈ సాంకేతికత అమలు ఒప్పందంపై పోర్చుగల్‌లోని లిస్బన్లో బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్)–విజన్‌బాక్స్ సంస్థలు సంతకాలు చేశాయి. ‘ఎయిర్‌పోర్ట్‌లో క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది సాయపడుతుంది’ అని బీఐఏఎల్ ఎండీ, సీఈఓ హరి మరార్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్ మొదలుకుని బోర్డింగ్ వరకు పేపర్‌రహిత విధానం అమలే లక్ష్యంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్ సంస్థ వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ముఖాలను బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌పాస్, పాస్‌పోర్టు, వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం ఉండదు. -
తొలి ఆధార్ ఆధారిత ఎయిర్‌పోర్టు ఇదే!
-
తొలి ఆధార్ ఆధారిత ఎయిర్‌పోర్టు ఇదే!
ఆధార్ ఉంటేనే విమానయానం చేసేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్లాన్లను సిద్ధం చేస్తోంది. బెంగళూరు కెమ్పెగ్వాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధార్ ఆధారిత తొలి ఎయిర్‌పోర్టుగా ప్రాచుర్యంలోకి తీసుకు రాబోతుంది. ఆధార్ ఆధారిత ప్రవేశాన్ని, బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ ఈ ఎయిర్‌పోర్టుకు ఏర్పాటుచేస్తోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ కొత్త ఆధార్ ప్రక్రియ కోసం 325 రోజుల డెడ్‌లైన్‌ను కూడా విధించింది. 2018 మార్చి నుంచి ఈ ప్రాజెక్టు అమల్లోకి రాబోతుంది. అంతర్జాతీయ విమానాల కోసం బోర్డింగ్‌కు వచ్చిన ప్రయాణికులు ఈ కొత్త ప్రక్రియను 2018 అక్టోబర్ నుంచి ఉపయోగించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతుందని తెలుస్తోంది. భద్రతను మెరుగుపరుచుకునేందుకు, క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి, ఎయిర్‌పోర్టులో ఆలస్యాలను తగ్గించడానికి ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడనుంది. అదనంగా ఎయిర్‌పోర్టు జర్నీలో పలు ప్రదేశాల్లో ఐడీలు, బోర్డింగ్ పాస్‌లు చూపించాల్సినవసరం లేకుండా ఈ ఆధార్ ప్రక్రియ వస్తోంది. -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు జీవీకే టాటా
♦ మిగిలిన 10 శాతం వాటాలు కూడా విక్రయం ♦ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు విక్రయం; విలువ రూ.1,290 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి పూర్తిగా వైదొలిగింది. ఇందులో మిగిలి ఉన్న 10 శాతం వాటాను కెనడాకి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త ప్రేమ్‌వత్స సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్‌కు రూ.1,290 కోట్లకు విక్రయించింది. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో వత్స వాటాలు 48 శాతానికి పెరిగాయి. ఇంకా సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్‌కి 26 శాతం, ఎయిర్పోర్ట్ అథారిటీ.. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెరి 13 శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం రుణభారాన్ని తగ్గించుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు విమానాశ్రయం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నామని జీవీకే గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే, విమానాశ్రయాల వ్యాపార విభాగం తమకు కీలకంగానే కొనసాగుతుందని ఆయన తెలియజేవారు. ముంబై విమానాశ్రయంతో పాటు ఇటీవలే బిడ్డింగ్‌లో దక్కించుకున్న నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారాయన. ముంబై ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు. దాదాపు రూ. 22,000 కోట్ల మేరకు పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో జీవీకే గ్రూప్ పలు ఆస్తుల విక్రయానికి ప్రయత్నాలు చేస్తోంది. రద్దీ విమానాశ్రయాల్లో మూడోది బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నిర్మించింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మూడోది. గతేడాది మార్చిలో ఈ ఎయిర్పోర్ట్ విలువ రూ.6,500 కోట్లుగా లెక్కగట్టారు. 10% వాటా, యాజమాన్య నియంత్రణనను తన దగ్గరే అట్టి పెట్టుకుని, రూ.2,202 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 33% వాటాను విక్రయించేట్లుగా జీవీకే విక్రయించింది. దీంతో పాటు ఫ్లూగాఫెన్ జ్యూరిక్ ఏజీ నుంచి మరో 5 శాతం వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ప్రేమ్ వత్స బెంగళూరు విమానాశ్రయంలో తన వాటాలను 38 శాతానికి పెంచుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు మిగిలి ఉన్న 10 శాతం వాటాలను, యాజమాన్య నియంత్రణను కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియాకి విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు జీవీకే జూన్‌లో ప్రకటించింది. -
బూట్లలో బంగారం బిస్కెట్లు
► రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం ► బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఒకరి అరెస్ట్ బెంగళూరు : ఎవరికీ అనుమానం రాకూడదని వేసుకున్న బూట్లలో బంగారాన్ని దాచాడు. కానీ అలా వేసుకున్న బూట్లతో సరిగ్గా నడవలేక దొరికిపోయాడు. మంగళవారం వీఎం ఫహాద్ (37) అనే ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి బెంగుళూరుకు వచ్చాడు. కెంపెగౌడ విమానాశ్రయంలో దర్జాగా దిగిన ఆ యువకుడు విమానాశ్రయంలో అటుఇటుగా నడుస్తున్నప్పుడు కస్టమ్స్ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. అతడి నడక తీరులో తేడా కనిపించడంతో అనుమానంతో ఆ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. తేడాతో నడుస్తున్నందున ముందుగా అతడు వేసుకున్న బూట్లను విప్పించగా... ఆశ్చర్యం... దాచిన బంగారం బయటపడింది. అయితే ఆ ప్రయాణికుడు ఏకంగా 58 లక్షల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను బూట్లతో దాచి తరలిస్తున్నాడు. తులాల్లో కాదు ఏకంగా రెండు కిలోల బంగారు బిస్కెట్లను బూట్లతో ఉంచినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో అధికారులు ఫహాద్ నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఫహాద్ గోవాకు చెందిన వ్యక్తి అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితుడు తరలిస్తున్న బిస్కెట్ల ధర మార్కెట్ లో సుమారు 58.60 లక్షల రూపాయల విలువ ఉంటుందని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. -
టాయిలెట్లో 6 కేజీల బంగారం
సాక్షి, బెంగళూరు: బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో అధికారులు 12.65 కేజీల బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 2.60 కోట్ల విలువైన 6.65 కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోని బాత్రూంలో బంగారం, నగలు దాచినట్లు కస్టమ్స్ అధికారులు సమాచారం అందింది. దీంతో అధికారుల తనిఖీలు చేయగా పిల్లల డైపర్లున్న పెట్టె దొరికింది. దీన్ని తెరిచి చూడగా బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి. పెట్టెను తీసుకొచ్చిన వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే తమిళనాడుకు చెందిన మహ్మద్ మొహిద్దిన్గా గుర్తించారు. అలాగే ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలోని టాయిలెట్లో 6 కేజీల బరువున్న 12 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. -
కోర్టుకెక్కిన 200 మంది జవాన్లు
ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమకు సరైన తిండి పెట్టడం లేదని, అలవెన్సులు ఇవ్వట్లేదని, పని చేసే పరిస్థితులు కూడా ఘోరంగా ఉన్నాయని అంటూ తమకు న్యాయం చేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విమానాశ్రయాలతో పాటు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది చూసుకుంటారు. కేంద్ర భద్రతా దళాలలో భాగమైన సీఐఎస్ఎఫ్తో పాటు వివిధ దళాలు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్నాయి. గత మూడేళ్లలో 344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 15 మంది ఇలా అసువులు బాశారు. పనిచేసే పరిస్థితులు దుర్భరంగా ఉండటం, తీవ్రమవుతున్న ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల వేధింపులు.. ఇలా రకరకాల కారణాలతో వీళ్లు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. -
బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: బెంగళూరు విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాన్ని మంగళవారం ఉదయం శంషాబాద్ విమానా శ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లండన్ నుంచి బయలుదేరిన ఈ విమానం మంగళవారం ఉదయం 6 గంటలకు బెంగళూరులో ల్యాండ్ కావల్సి ఉంది. అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టులో పొగ మంచు కారణంగా విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారుల అను మతితో శంషాబాద్‌లో ల్యాండ్ చేశారు. 2 గంటల తర్వాత విమానం తిరిగి టేకాఫ్ తీసుకుని బెంగళూరు బయలుదేరినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ అనామకులు
అవమానం ఇళయరాజాకి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది! అవమానమా? ఎవరు అవమానించి ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే లోకంలో అవమానించేవారు అంటూ ఎవరూ ఉండరు. అవమాన పడేవాళ్లు మాత్రమే ఉంటారు. పట్టించుకుని ఫీల్ అయితే అవమానం. ఫీల్‌ని వదిలేస్తే.. జస్ట్ అదొక అనుభవం. ప్రముఖులకు, ప్రసిద్ధులకు జరిగే అవమానాలు సాధారణంగా పెద్దపెద్దవి అయి ఉండవు. కానీ పెద్దవాళ్లు కాబట్టి చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతుంటారు. సగటు మనుషులుగా ఇది మన అబ్జర్వేషన్ మాత్రమే అయి ఉండొచ్చు కూడా. ఏదైనా నొప్పి నొప్పే. నొప్పించిన వాళ్లు డ్యూటీలో భాగంగా నొప్పించినా సరే.. గొప్పవాళ్లు బాధపడే అవకాశం ఉంది. ఇళయరాజా కూడా అలాగే బాధపడ్డారు. అవమానం ఫీల్ అయ్యారు. ఆ సంగతి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. గతవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం మంగుళూరు వెళ్లారు. దర్శనం అయ్యాక చెన్నైకి తిరుగు ప్రయాణం కట్టారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆయన్ని భద్రత అధికారులు ఆపి తనిఖీ చేశారు! ఇళయరాజా దగ్గర ఉన్న దైవ ప్రసాదాన్ని వాళ్లు మరింకేదో అని అనుమానించి, ప్రసాదంతో పాటు ఇళయరాజా దగ్గర ఉన్న మిగతా సరంజామానంతా తనిఖీ చేశారు. ఆయన వివరణ ఇవ్వబోయినా వినిపించుకోలేదు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కూడా చెక్ చేశారు. ఈ సంగతి తెలిసి ఇళయరాజా అభిమానులు కలత చెందారు. ఎండీఎంకే నేత వైగో ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక సంగీత దర్శకుడిని.. ఎవరో అపరిచితుణ్ణి చేసినట్టుగా తనిఖీ చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సెలబ్రిటీలు ఇలా ఇంటా బయటా విమానాశ్రయాలలో మరీ అవమానం కాకపోయినా, అభాసుపాలైన సంఘటనలు మరికొన్ని ఉన్నాయి. 2013లో రణ్‌బీర్ కపూర్ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుక్ అయ్యాడు. అతడు లెక్కలో చూపించని వస్తువులు అధికారుల తనిఖీలో బయపడడంతో కపూర్ అక్కడికక్కడ కస్టమ్స్ వాళ్లకు లక్ష రూపాయలు కక్కవలసి వచ్చింది. పెనాల్టీగా మరో 70 వేలు. అయితే అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో వస్తువుల్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత కపూర్ మనుషులు డబ్బు కట్టి వాటిని విడిపించుకున్నారు. అనుష్కా శర్మ 2011లో ఏదో అవార్డు ఫంక్షన్‌కి ఫారిన్ వెళ్లి వస్తూ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ వాళ్లకు పట్టుబడ్డారు. అమె దగ్గర్నుంచి 45 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను, అతి ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే ఏడాది బిపాష బసును ముంబై ఏర్పోర్ట్ అధికారులు తనిఖీ కోసం ఆపారు. ఆమె దగ్గర ఉన్న హ్యాండ్‌బ్యాగ్ భారీగా కనిపించడంతో వారికి అనుమానం వచ్చి చూశారు. చిన్న పాటి వస్తువులకు 12 వేలు సుంకం కట్టించుకుని, గంటపాటు నానా రకాల ప్రశ్నలు వేసి ఆమెను వదిలిపెట్టారు. 2012లో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ని చికాగో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ వాళ్లు, ఇమిగ్రేషన్ వాళ్లు ఇద్దరూ కలిసి ఆయన్ని ఒళ్లంతా తడిమి చూశారు. రకరకాల ప్రశ్నలతో విసిగించారు. ఒక కథనం ప్రకారం ఆయన బట్టలు కూడా తీయించి చెక్ చేశారు! ఈ చర్యలను ఆమిర్ ఎంతో అవమానకరమైనవిగా భావించారు. జాన్ అబ్రహాం 2009లో యు.ఎస్. వెళ్లినప్పుడు న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ సిబ్బంది ఆపి చాలాసేపు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. అతడి పాస్‌పోర్ట్‌లో ఓసారెప్పుడో ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లివచ్చినట్లు ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. తను సినిమా నటుడినని చెప్పి, వారిని ఒప్పించి ఎలాగో బయటపడ్డాడు అబ్రహాం. ఇదే ఎయిర్‌పోర్ట్‌లో అదే ఏడాది షారుక్‌ఖాన్‌ని అధికారులు ఆపేశారు. అప్పుడాయన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం ముందస్తు ప్రమోషన్ టూర్లో వున్నారు. పేరు చివర ఖాన్ అని ఉండడంతో అనుమానించిన అధికారులు షారుఖ్‌ని దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. అక్కడి భారతీయ రాయబారులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని షారుక్‌ని విడిపించాల్సి వచ్చింది. వీళ్లందర్నీ అలా ఉంచండి. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌నే ఏర్పోర్ట్ అధికారులు అడ్డుకుని, ప్రశ్నలతో సతమతం చేశారు. 2011లో ఆయన్ని యు.ఎస్.లోని. జాన్ ఎఫ్.కెన్నెడీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది జాకెట్, షూజ్ విప్పించి మరీ తనిఖీ చేశారు. ఆ తర్వాత ఈ విషయమై అమెరికా, ఇండియాకు క్షమాపణ చెప్పింది. 2009లో కూడా కలామ్‌కి ఇలాంటి అవమానమే జరిగింది. న్యూఢిల్లీలో ఆయన ఎక్కిన కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ (యు.ఎస్.) విమాన సిబ్బంది ఆయన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వదిలిపెట్టారు. అయితే కలామ్ ఈ రెండు సందర్భాలలోనూ అవమానంగా ఫీల్ అవలేదు. నవ్వుతూ తనిఖీ అధికారులకు సహకరించారు. ఆయన తరఫున భారత ప్రభుత్వం మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. పైన ‘పట్టుబడ్డ’ బాలీవుడ్ ప్రముఖులలో ఎక్కువమంది నిబంధనలు అతిక్రమించారు. కాబట్టి వాళ్లు దానిని అవమానంగా ఫీల్ కానవసరం లేదు. ఇక ఇప్పుడు ఇళయరాజాకు జరిగింది అవమానమా కాదా అన్నది కూడా ఆయన దానిని ఎలా తీసుకున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. -
ఇళయరాజాకు అవమానం
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు బెంగళూర్ విమానాశ్రయంలో అవమానం జరిగింది. తనిఖీ పేరుతో అక్కడి సెక్యూరిటీ అధికారులు అత్యుత్సాహం చూపించి ఇళయరాజాను అవమాన పరిచారు.వివరాల్లోకెళ్లితే ఇళయరాజా కొన్ని రోజుల క్రితం తన కొడుకు కార్తీక్‌రాజా,కుటుంబసభ్యులతో కలిసి మంగుళూర్‌లో గల దేవాలయానికి దేవుని దర్శనార్థం వెళ్లారు. అనంతరం ఆదివారం రాత్రికి చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యారు. బెంగళూర్ వియానాశ్రయంలో ఆయన్ని అక్కడి సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేశారు. అప్పుడు ఇళయరాజా వద్ద దేవుని ప్రసాదం ఉండడంతో దాన్ని ఏదోగా భావించి ఆయన వస్తువులను పూర్తిగా శోధన చేయడం ప్రారంభించారు. ఇళయరాజా వివరణ ఇవ్వబోయినా వినిపించుకోకుండా వారి కుటుంబసభ్యులు సహ ఒక పక్కన నిలబెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన ఇళయరాజా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక టీవీ చానల్ విలేకరి పరిస్థితిని గ్రహించి ఇళయరాజా గురించి అధికారులకు వివరించడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సహా విమానాశ్రయంలోకి అనుమతించారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో చూసిన ఉన్నతాధికారి ఒకరు వెంటనే అక్కడికి వచ్చి ఇళయరాజాకు క్షమాపణ చెప్పి ఆయన్ని చెన్నై విమానం ఎక్కించారు. ఇళయరాజాకు వైగో మద్దతు ఇళయరాజాకు జరిగిన అవమానానికి ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఏ దేశ సంగీతదర్శకుడు చేయనటువంటి సింపోనిని చేసిన గొప్ప సంగీత దర్శకుడు ఆయన అని అన్నారు.ఆయనకు జరిగిన అవమానం గురించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కండోమ్స్‌లో కొకైన్ నింపి మింగేశాడు !!
బెంగళూరు: అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొకైన్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. సినిమాల్లో చేసే స్మగ్లింగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నిజ జీవితంలో కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా కొకైన్ నింపిన కండోమ్స్‌ను మింగి స్మగ్లింగ్ చేయటానికి యత్నించిన వ్యక్తిని మంగళవారం బెంగళూరు విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఇరోన్శ్యామురన్ పర్యాటక ముసుగులో కండోమ్స్‌లో కొకైన్ నింపుకుని వాటిని మింగేశాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో అతడు దిగిన వెంటనే అరెస్ట్ చేసి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విరోచన మందులు ఇచ్చి కొకైన్ క్యాప్సుల్‌ను బయటకు తీశారు. కొకైన్ విలువ రూ. 3.71 లక్షలు ఉంటుంటుందని తెలుస్తుంది. -
ఎయిర్పోర్ట్ నుంచి బయటకొచ్చి దొరికిపోయారు
బెంగుళూరు : బంగారు బిస్కెట్లు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో గుజరాత్‌కు చెందిన ఆసీఫ్ భాటియా, జి.గణేశ్ ఉన్నారు. వీరు బంగారు బిస్కట్లను ఎయిర్‌పోర్టులో చెకింగ్ అధికారుల కళ్లగప్పి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్టు బయట వీరిద్దరూ పరస్పరం తిట్టుకుంటూ ఘర్షణ పడుతుండడంతో పోలీసులు అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బెంగళూరులో బంగారానికి ధర ఎక్కువగా ఉందని తెలుసుకున్న ఆసీఫ్ భాటియా రూ. 54 లక్షలు విలువ చేసే బంగారు బిస్కట్లను జి.గణేష్‌కు ఇచ్చి వీటిని సురక్షితంగా బెంగళూరుకు చేరిస్తే రూ. 15 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే బంగారాన్ని గణేష్ ఎయిర్‌పోర్టు దాటించాడు. తనకు ఇస్తానన్న రూ. 15 వేలు ఇస్తే బంగారు బిస్కట్లు ఇస్తానని గణేష్ తేల్చి చెప్పడంతో, ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని, బంగారు బిస్కట్లు ఇస్తే డబ్బు తర్వాత ఇస్తానని నమ్మబలికాడు. ఇందుకు గణేష్ అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడి పోలీసులకు చిక్కారు. ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి రెండు బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. -
భారీగా తగ్గిన జీవీకే నష్టాలు
రూ. 281 కోట్ల నుంచి రూ. 124 కోట్లకు తగ్గిన నష్టాలు ఆదాయం రూ. 713 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇన్ఫ్రా ఇబ్బందులు నెమ్మదిగా తొలుగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా భారీ నష్టాలను ప్రకటించిన కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తొలి త్రైమాసికంలో జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా నష్టాలు 56 శాతం తగ్గడమే దీనికి నిదర్శనం. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీవీకే ఇన్ఫ్రా నికర నష్టాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ. 281 కోట్ల నుంచి రూ. 124 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఆదాయం 40% పెరిగి రూ. 713 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు పెరిగింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు లాభాల్లోకి రావడం ముంబై ఎయిర్‌పోర్టు నష్టాలు భారీగా తగ్గడం సానుకూల అంశాలయ్యాయి. -
బెంగళూరులో 54 కేజీల బంగారం స్వాధీనం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అక్రమంగా 54 కేజీల బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు శనివా రం అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన రవివర్మ, బాలసుబ్రమణ్యం, ఈశ్వరమూర్తి కోయంబత్తూరుకు అక్రమంగా రూ.16.5 కోట్ల విలువైన 54 కేజీల బంగారాన్ని తరలించడానికి పూనుకున్నారు. కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి కోల్‌కతాలో జెట్ ఎయిర్ వేస్ విమానమెక్కి కోయంబత్తూరుకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు కస్టమ్స్ అధికారులు.. విమానం మార్గమధ్యంలో బెంగళూరులో ఆగడంతో తనిఖీ చేశారు. స్మగ్లర్లకు సంబంధించిన లగేజీ బ్యాగుల్లో దాచిన 54 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు.