భారీగా తగ్గిన జీవీకే నష్టాలు
రూ. 281 కోట్ల నుంచి రూ. 124 కోట్లకు తగ్గిన నష్టాలు
ఆదాయం రూ. 713 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇన్‌ఫ్రా ఇబ్బందులు నెమ్మదిగా తొలుగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా భారీ నష్టాలను ప్రకటించిన కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తొలి త్రైమాసికంలో జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రా నష్టాలు 56 శాతం తగ్గడమే దీనికి నిదర్శనం. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీవీకే ఇన్‌ఫ్రా నికర నష్టాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ. 281 కోట్ల నుంచి రూ. 124 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఆదాయం 40% పెరిగి రూ. 713 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు పెరిగింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు లాభాల్లోకి రావడం ముంబై ఎయిర్‌పోర్టు నష్టాలు భారీగా తగ్గడం సానుకూల అంశాలయ్యాయి.