సాక్షి, బెంగళూరు: బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో అధికారులు 12.65 కేజీల బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 2.60 కోట్ల విలువైన 6.65 కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోని బాత్‌రూంలో బంగారం, నగలు దాచినట్లు కస్టమ్స్ అధికారులు సమాచారం అందింది. దీంతో అధికారుల తనిఖీలు చేయగా పిల్లల డైపర్లున్న పెట్టె దొరికింది. దీన్ని తెరిచి చూడగా బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి. పెట్టెను తీసుకొచ్చిన వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే తమిళనాడుకు చెందిన మహ్మద్ మొహిద్దిన్‌గా గుర్తించారు.
అలాగే ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలోని టాయిలెట్‌లో 6 కేజీల బరువున్న 12 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం.
టాయిలెట్‌లో 6 కేజీల బంగారం
Published Thu, Apr 13 2017 9:40 AM | Last Updated on Thu, Aug 2 2018 4:08 PM
Advertisement