Gold Seized
-
ముంబైలో అలర్ట్.. 53 మంది రౌడీషీటర్ల నగర బహిష్కరణ
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్సీఎఫ్ నగర్, తిలక్‌నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్నార్, మాన్‌ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్‌కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.రూ. 14.5 కోట్ల బంగారం సీజ్ నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాగపూర్‌లో శనివారం పోల్ అధికారులు రూ.14.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్థ ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని రవాణా చేస్తుండగా ఫ్లయింగ్ నిఘా బృందానికి పట్టుబడిందని ఓ అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేందుకు సీక్వెల్ లాజిస్టిక్స్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. స్వాదీనం చేసుకున్న బంగారాన్ని అంబజారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోంద’ని ఆ అధికారి పేర్కొన్నారు. -
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్ చేసిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024 షెడ్యూల్లో భాగంగా రేపు చివరి దశలో పోలింగ్ జరుగనుంది. నిన్నటితో ప్రచారానిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్ అయ్యింది.వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల నగదును సీజ్ చేశారు. మే 30వ తేదీ వరకు ఆదాయపన్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల వేళ 390 కోట్ల నగదును సీజ్ చేశారు.ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, తనిఖీలను పెంచేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డబ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు పైగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వరకు నగదును సీజ్ చేశారు. ఇక, తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. -
Crime: రూ. 900 కోట్ల బంగారం స్వాధీనం
చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత. -
మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, నల్గొండ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఈ క్రమంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల్లో హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువైన 13 కిలోల బంగారం పట్టుకున్నారు పోలీసులు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోల్డ్ డిస్టిబూటర్లకు సరాఫరా చేసే ఓ ఏజెన్సీకి చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: ED: కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రెస్‌నోట్ విడుదల - -
పోలింగ్‌కు మరో రెండు రోజులే.. కోట్లలో పట్టుబడుతున్న నోట్ల కట్టలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు నేటితో(నవండర్ 28) ముగియనుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరనుంది. ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతోంది. ఐటీ, ఈసీ అధికారులు, రాష్ట్ర పోలీసులు చేపట్టిన తనిఖీలల్లో రోజూ కోట్లలో సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు. పార్టీ నేతలు, వారి అనుచరులు డబ్బులు పంచుతూ.. దొరికిపోతున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 724 కోట్ల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 292 కోట్ల నగదు రూపంలో పట్టుబడగా.. రూ.122 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 40 కోట్ల డ్రగ్స్, రూ. 186 కోట్ల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక చివరి రెండు రోజుల్లో నేతలు డబ్బు పంపిణీ మరింత చేయనున్నారు. చదవండి: ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్ మాటామంతి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ తరుపున డబ్బులు పంచుతూ ఓ పోలీస్ అధికారి పట్టుబడ్డారు. పట్టుబడ్డ పోలీస్ అధికారి కారులో రూ, 6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కారులోఉన్న నోట్ల కట్టలను ఆర్వో స్వాధీనం చేసుకున్నారు. ఇక మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ మల్లారెడ్డి కళాశాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు దొరికిపోయారు. మల్లారెడ్డి కాళాశాల సిబ్బంది, విద్యార్థ/లు ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంపిణి చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని సంబంధిత అధికారులకు అప్పగించారు. పట్టుబడిన సొమ్మును మంత్రి మల్లారెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులలో అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో మొత్తం రూ.14 కోట్ల విలువగల బంగారాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో 8.49 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ 4.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో కూడా భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ. 9.11 కోట్ల విలువ చేసే 16.86 కేజీల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సింగపూర్, మలేషియా, దుబాయ్, అబుదాబీ ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
మాడిగి అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం సీజ్
-
RGIA Hyderabad: బంగారం తెచ్చి.. చెత్తబుట్టలో వేసి
సాక్షి, శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని బంగారాన్ని బయటికి తరలించేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే బంగారాన్ని బయటికి తీసుకురాకుండా, ఎయిర్‌పోర్టు ఉద్యోగులతో బయటికి తరలిస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడి ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వెళ్లాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా అనుమానించిన అధికారులు అతడిని విచారించడంతో తాను తీసుకొచ్చిన బంగారాన్ని చెత్తడబ్బాలో వేసినట్లు చెప్పాడు. దానిని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. 933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఇదే తరహాలో కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు 1,300 గ్రాముల బంగారాన్ని చెత్తడబ్బాలో దాచిపెట్టడంతో కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి.. విద్యాశాఖ ఆదేశం -
ఏపీలో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్.. 6కోట్ల బంగారం స్వాధీనం
సాక్షి, విజయవాడ: ఏపీలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న రూ.6.4కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వివరాల ప్రకారం.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలించిన బంగారం భారీగా పట్టుబడింది. ఓ కారులో రూ.6.4 కోట్ల విలువైన 11.1 కిలోల బంగారం, రూ.1.5 లక్షల విదేశీ నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, శ్రీలంక, దుబాయ్ దేశాల నుంచి బంగారాన్ని తీసుకువచ్చి, చెన్నై మీదుగా విజయవాడకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్‌ఫ్లాజా వద్ద విజయవాడ వైపు వస్తున్న ఓ కారులో తరలిస్తున్న 4.3 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు అభరణాలు, రూ.1.5 లక్షల విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని విశాఖలోని కోర్టులో హాజరు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. రెండేళ్లలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.40 కోట్ల విలువైన 70 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి.. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.21 లక్షల బంగారం పట్టివేత
హైదరాబద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు. ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. Based on pax profiling & efficient surveillance, @hydcus officers at RGIA intercepted one pax arriving from Sharjah by Indigo 6E 1422 on 21.8.23 and seized #gold weighing 397 gm valued at Rs 20.59 lakhs. @cbic_india @DDNewslive pic.twitter.com/jkM9Q5BT97 — CGST & Customs Hyderabad Zone (@cgstcushyd) August 21, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ -
కాలి బ్యాండేజీలో బంగారం
దొడ్డబళ్లాపురం: కాలికి గాయమైనట్లు బ్యాండేజీ చుట్టుకుని లోపల బంగారం దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.43లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మే 21న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్టు తెలియడంతో అతన్ని తనిఖీలు చేశారు. అతడి కాలికి చుట్టిన బ్యాండేజీపై అనుమానం వచ్చి విప్పి చూడగా రెండు బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. మరో చైను కూడా అతడి నుండి స్వాధీనం చేసుకున్నారు. స్టీలు కడియం రూపంలో. చేతి కడియానికి స్టీలు పూత పూసి బంగారును తరలిస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో పట్టుకున్నారు. మే 20న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికునిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీ చేయగా, చేతికి ఉన్న పెద్ద స్టీలు కనిపించింది. దానిని పరిశీలించగా, బంగారు కడియమని, పైకి కనబడకుండా ఉండడానికి స్టీలు పూత పూసినట్లు వెల్లడైంది. రూ.31 లక్షల విలువ చేసే అర్ధ కేజీ బంగారాన్ని స్వాదీనం చేసుకొన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల నుంచి 3,175 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని క్యాప్సూల్స్‌లో నింపి మహిళలు తమ కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేయగా.. అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో బంగారం బయట పడింది. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ నలుగురు మహిళలను కస్టమ్స్ అధికారులు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మంగళవారమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66 లక్షల విలువ చేసే 1,100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. తెల్లవారుజామున వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇద్దరు దుబాయ్ ప్రయాణికులను అరెస్ట్ చేసిన అధికారులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ వార్.. అదే దారిలో బీజేపీ కౌంటర్ -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
-
భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో శనివారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి బంగారు బిస్కెట్లు ఉన్న లగేజీని కస్టమ్స్ కంటపడకుండా తరలించేందకు యత్నించాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో లగేజీలో 2.1 కేజీ బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.కోటి ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రసాద్‌గౌడ్ క్యారియర్‌గా బంగారాన్ని తరలించేందుకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే కువైట్ నుంచి కేయూ–373 విమానంలో వచ్చిన అహ్మద్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కదలికలను అనుమానించి అతడి లగేజిని తనిఖీ చేయగా 268 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ.12 లక్షలు ఉంటుదని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61కిలోల గోల్డ్ సీజ్.. కస్టమ్స్ చరిత్రలోనే రికార్డ్
ముంబై: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో బంగారం పట్టుకున్నారు. రెండు వేరు వేరు సంఘటనల్లో మొత్తం 61 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం చరిత్రలో ఒక్కరోజులో సీజ్ చేసిన విలువలో ఇదే అత్యధికమని తెలిపారు. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొదటి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో 1 కేజీ బంగారం బిస్కెట్లను దాచి తీసుకొచ్చారు. మొత్తం రూ.28.17 కోట్లు విలువైన యూఏఈ తయారీ గోల్డ్ బార్స్ 53 లభ్యమయ్యాయి. నలుగురిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ఆపరేషన్‌లో 8 కిలోలు సుమారు రూ.3.28 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారం బయటపడింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బంగారాన్ని మైనం రూపంలో చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దానిని జీన్స్‌లో పెట్టి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇదీ చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే? -
రేకులుగా మార్చి.. లోదుస్తుల్లో దాచి..
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మూడున్నర కేజీల బంగారం పట్టుబడింది. రూ.1.90కోట్ల విలువైన బంగారాన్ని ఆది వారం తెల్లవారుజామున ఎస్ఎస్టీ(స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీం) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హర్షద్, షరీఫ్, జావేద్, సుల్తానా దుబాయ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మూడున్నర కిలోల బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి సన్నని రేకులుగా ప్యాక్ చేసి అండర్వేర్లలో ఉంచుకొని విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎర్టిగా కారులో హైదరాబాద్‌కు వస్తుండగా, పంతంగి టోల్గేట్ చెక్‌పో స్టు వద్ద పోలీసులకు తనిఖీలో పట్టుబడ్డారు. వారి నుంచి బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు నిమిత్తం డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. కాగా, పోలీసులు వీరిని బంగారం స్మగ్లింగ్ ముఠా గా అనుమానిస్తున్నారు. వీరు దుబాయ్ ఎలా వెళ్లా రు, బంగారం ఎవరిచ్చారు, ఎయిర్ పోర్టులను దా టుకుంటూ ఇక్కడి వరకు ఎలా వచ్చారు, లేదంటే గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎవరైనా బంగారం ఇచ్చారా అనేది ఆరా తీస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: బంగారం అక్రమ రవాణా పరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం ఐదుగురు వేర్వేరు ప్రయాణికుల నుంచి అధికారులు 4.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుబాయ్ నుంచి ఈకే–524 విమా నంలో వచ్చిన మహిళ తన తలకు ఉన్న హేర్ బ్యాండ్‌లో 234 గ్రాముల బంగారం తీసుకొచ్చింది. కువై ట్ నుంచి జె9–403 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీలో 855 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చారు. బిస్కెట్లు, గుండీల రూపంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈకే –526 విమానంలో మరో ముగ్గురు మహిళా ప్రయాణికు లను అనుమానించిన అధికా రులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముగ్గురి లోదుస్తుల నుంచి 3283 గ్రాముల బంగారం పేస్టు ను బయటికి తీశారు. దీని విలువ రూ. 1.72 కోట్లు ఉంటుందని అధికా రులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత
శంషాబాద్ (హైదరాబాద్): దుబాయ్ నుంచి ముగ్గురు వేర్వేరు ప్రయాణికులు అక్రమంగా తీసుకొచ్చిన రూ.నాలుగుకోట్ల పైచిలుకు విలువైన బంగారాన్ని శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. దుబాయ్ ఈకే –528 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అందులో సిల్వర్ కోటింగ్ చేసి ఉన్న ఎయిర్‌కంప్రెసర్ కనిపించింది. దాన్ని పరిశీలించగా 4,895 గ్రాముల బరువున్న ఇరవైనాలుగు క్యారట్ల బంగారం బ్లాకు బయటపడింది. బంగారం విలువ రూ.2.57 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇద్దరి నుంచి..: దుబాయ్ నుంచి ఈకే–524 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో 2,800 గ్రాముల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.1.47 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం, వజ్రాలు పట్టివేత
కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో భారీగా బంగారు నగలు, వజ్రాలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌నాయక్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయగా.. రాజస్తాన్‌లోని జున్జును పట్టణానికి చెందిన కపిల్ అనే యువకుడి బ్యాగులో 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.39.28 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు. బిల్లులు, జీఎస్టీ ట్యాగ్లు లేకపోవడంతో.. కపిల్‌ను విచారణ నిమిత్తం కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. -
బంగారం అక్రమ రవాణా
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి మణిపూర్ రాజధాని ఇంపాల్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడిని తనిఖీ చేశారు. మలద్వారంలో బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 975 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ. 50.7 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సులో అర కిలో బంగారం పట్టివేత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో అర కిలో బంగారు నగలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై సెబ్ సీఐ మంజుల, ఎస్ఐ గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాయదుర్గం వెళ్తున్న ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన రాజేష్ బ్యాగ్‌లో 544 గ్రాముల బంగారు వడ్డాణాలు, నెక్లెస్‌లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బళ్లారిలోని రాజ్‌మహల్ ఫ్యాన్సీ జ్యూవెలర్స్ షాపునకు చెందిన గుమస్తానని తెలిపిన రాజేష్ అందుకు ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లో నగలు చేయించి బళ్లారి తీసుకువెళ్తున్నట్లు తెలిపాడు. వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ కానీ చూపకపోవడంతో ఆభరణాలను స్వాధీనం చేసుకుని రవాణాదారునితో పాటు ఆభరణాలను తదుపరి చర్యల నిమిత్తం కర్నూలు అర్బన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్టు హుక్స్‌లో బంగారం
శంషాబాద్: బెల్టు హుక్స్‌లో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి లగేజీలో ఉన్న ఓ బెల్టును తనిఖీ చేయగా దాని హుక్స్‌కు ఉన్న పైపూతను తీయడంతో వాటిని బంగారంగా గుర్తించారు. 300 గ్రాముల బరువు ఉన్న బంగారు హుక్స్ రూ.18.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి 6ఈ025 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేయగా అందులో 2.7 కేజీల బంగారు గొలుసులు, కవర్లలో చుట్టి తీసుకొచ్చిన బంగారం పేస్టు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.36 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
-
జ్యూస్ యంత్రంలో బంగారం
శంషాబాద్: జ్యూస్ యంత్రంలో అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–952 విమానంలో శనివారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతని కదలికలకపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చేతితో జ్యూస్ తయారు చేసే ఓ యంత్రాన్ని కనుగొని, దాన్ని కట్ చేయగా 671 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ 34.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్: విమానంలో సీటుకింద కేజీకిపైగా బంగారం
శంషాబాద్: విమానాశ్రయంలో పకడ్బందీ తనిఖీలు నిర్వహించి బంగారం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో విదేశాలనుంచి బంగారాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 025 విమానంలో సీటు కింద దాచిన 1,207 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), కస్టమ్స్ అధికారులతో కలసి పట్టుకున్నారు. ఈ విమానంలో అక్రమ బంగారం రవాణా జరుగుతున్నట్లు డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో వచి్చన ప్రయాణికులను తనిఖీలు చేయగా ఎవరివద్దా బంగారం పట్టుబడలేదు. అయితే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీటుకింద మూడువరుసలుగా ఉన్న ఈ అక్రమబంగారం బయటపడింది. దీని విలువ రూ.59.03లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని సీటు కింద దాచిన ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తున్నారు. -
దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ -
ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత
శంషాబాద్: ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు సోమవారం రియాద్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు లోదుస్తుల్లో ప్రయాణికుడు దాచిన 100 గ్రాముల బంగారు కడ్డీ బయటపడింది. దీని విలువ సుమారు 4.90 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలులో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కర్నూలు ఎస్ఈబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.3కోట్ల విలువైన 7 కేజీల బంగారం, రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా వీటిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కారులో నగదు, బంగారాన్ని హైదరాబాద్ నుండి బెంగళూరుకి తరలిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. -
జీరో దందాలకు అడ్డాగా ‘గద్వాల’.. కిలోల్లో బంగారం..
సాక్షి, గద్వాల: జీరో దందాకు కేరాఫ్ అడ్రస్‌గా నడిగడ్డ పేరు తెరపైకి వచ్చింది. ఏ వ్యాపారం చేయాలన్నా అక్రమార్కులు ముందుగా నడిగడ్డను ఎంచుకుంటున్నారు. పన్నులు ఎగ్గొట్టి దర్జాగా ధనం సంపాదించాలనే కుతూహలంతో జీరో దందా చేసే ముఠా గద్వాలలో పాగా వేశారు. తాజాగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అల్ మీనా జ్యువెలర్ వర్క్ దుకాణానికి చెందిన కోట్ల హీరాబేగ్ ఎలాంటి అనుమతి లేకుండా 1.786 కిలోల (సుమారు రూ.66 లక్షల విలువజేసే) బంగారు ఆభరణాలను జిల్లాకేంద్రంలోని పలు దుకాణాల యజమానులకు విక్రయించేందుకు వచ్చాడు. పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్‌్కఫోర్స్ సీఐ జగదీష్‌గౌడ్, ఎస్ఐ నరేష్, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి హీరాబేగ్‌ను రాజవీధిలో అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య, కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బంగారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అయితే గద్వాలలోనే దాదాపు 20 కిలోలకు పైగా బంగారాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం 1.786 కిలోల బంగారాన్ని మాత్రమే వాణిజ్య పన్నులశాఖకు అప్పగించారు. ఈ విషయంపై జిల్లా వాణిజ్య పన్నులశాఖ అధికారి గోవర్ధన్‌ను మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి, పన్నులు చెల్లించకుండా బంగారం విక్రయించేందుకు హీరాబేగ్ గద్వాలకు వచ్చినట్లు పోలీసులు గుర్తించి సమాచారం అందించారన్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున ఫెనాలీ్టగా రూ.4 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. సెంట్రల్, కస్టమ్స్‌శాఖకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడమే.. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో గద్వాల జీరో దందాలకు అడ్డాగా మారింది. ఆర్నెల్ల క్రితం కర్ణాటక పోలీసులు గద్వాలకు చెందిన ఓ వ్యాపారిని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. ఇక్కడి వ్యాపారులే ఇతర రాష్ట్రాల వారితో ముఠాగా ఏర్పడి జీరో దందాను ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తప్పవు.. బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వచ్చిన వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి విచారణ చేపట్టి జీరో వ్యాపారంగా గుర్తించారు. ఆభరణాలను జప్తు చేశాం.. ఏవైనా అనుమతి పత్రాలుంటే సంబంధితశాఖ అధికారులకు చూపించి తీసుకెళ్లాలని సూచించాం. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లాలో అక్రమంగా బంగారం, ఇతరత్రా వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. – రంజన్‌రతన్ కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా -
రూ.6.86 కోట్ల బంగారం స్వాధీనం
కర్నూలు: ఎస్ఈబీ తనిఖీల్లో పన్ను రశీదుల్లేని రూ.6.86 కోట్ల బంగారం పట్టుబడింది. కర్నూలు శివారు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సిబ్బంది గురువారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో 14.8 కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. శుక్రవారం కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా తాళ్లప్రొద్దుటూరుకు చెందిన రాతి మిద్దెరాజు.. తాడిపత్రి పట్టణం అంబటి పుల్లారెడ్డి జ్యువెలర్స్‌లో గుమాస్తా. ఆయన హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ గోల్డ్ షాప్‌లో 163 బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. వాటిలో 15 బిస్కెట్లను హైదరాబాద్‌లోని వేర్వేరు చోట్ల అప్పగించాడు. మిగిలిన 148 బిస్కెట్లను బ్యాగ్‌లో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో తాడిపత్రికి వెళుతున్నాడు. పన్ను చెల్లింపు బిల్లులు చూపకపోవడంతో చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సిబ్బంది వాటిని స్వాదీనం చేసుకున్నారు. -
5.7 కేజీల బంగారం స్వాధీనం
దాచేపల్లి (గురజాల): తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 5 కేజీల 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం 11 గంటల సమయంలో జరిపిన వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణ్, విజయ్‌నాథ్ అనే వ్యక్తులు ఈ బంగారాన్ని గుంటూరుకు తరలిస్తున్నారని విచారణలో వెల్లడైంది. ఈ బంగారం విలువ సుమారు రూ.2.47 కోట్లు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. బంగారానికి సంబంధించి పత్రాలు సక్రమంగా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురజాల సీఐ ఉమేష్, ఎస్ఐ బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. -
నాగరాజు రెండో లాకర్లో భారీగా బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ ఖాతాలో భారీగా బంగారం బయటపడింది. నాగరాజు బినామీ అయిన అల్వాల్‌కు చెందిన నందగోపాల్ అనే వ్యక్తి ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో నందగోపాల్ పేరిట అల్వాల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒక లాకర్, పీజే మహేందర్ కుమార్ పేరిట మేడ్చల్‌లోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో మరో లాకర్‌ను కూడా నాగరాజు, అతని భార్య స్వప్న వాడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను గురువారం అధికారులు తెరవగా నందగోపాల్ పేరిట ఉన్న లాకర్లో రూ.60 లక్షల విలువైన ఒక కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజుకు సంబంధించి ఇది రెండో లాకర్ కాగా, మూడో లాకర్లో రూ.4.5 లక్షల విలువచేసే 7.29 కిలోల బరువున్న 35 వెండిబిస్కట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి లాకర్ అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకులో నాగరాజు సమీప బంధువు నరేందర్ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్ 2న ఈ లాకర్‌ను తెరిచిన ఏసీబీ రూ.57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నాగరాజు లాకర్లలో భారీగా బంగారం
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆయన ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ... ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకుముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. -
ఇంట్లో తవ్వకాలు; బంగారు నిధి పట్టివేత
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బుక్కరాయసముద్రంలో పోలీసులు బంగారు నిధిని పట్టుకున్నారు. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలింగ ఇంట్లో పోలీసులు మంగళవారం తవ్వకాలు జరిపి 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాల్లో 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించాయి. అయితే వీటిని గుప్త నిధులుగా పోలీసులు భావిస్తున్నారు. మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ వద్ద నాగలింగ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగి మనోజ్, డ్రైవర్ నాగలింగను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
బెజవాడలో భారీగా పట్టుబడ్డ బంగారం
సాక్షి, విజయవాడ : నగరంలో సాగుతున్న అక్రమ బంగారు వ్యాపారం గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం విజయవాడకు వస్తోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో రూ. 3.18 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. పట్టుబడ్డ వారిని ముంబైకి చెందిన జయేష్ జైన్, విజయవాడ ఇస్లాంపేటకు చెందిన పోగుల శ్రీనివాస్‌గా గుర్తించారు. నిందితులు సొంత లాభం కోసం బిల్లులు లేకుండా ముంబై నుంచి బంగారాన్ని తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే వారు ఇప్పటి వరకు ఎంత బంగారం ఈ రకంగా తీసుకొచ్చారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముంబైలో మూలాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
విమానం టాయ్లెట్లో కిలోలకొద్ది బంగారం
చెన్నై : విమానం టాయిలెట్లో దాచి ఉంచిన రూ. రూ.2.24 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విమానం వెనక భాగంలోని టాయిలెట్లో నలుపు రంగులో నాలుగు ప్యాకెట్లు కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 5.6 కిలోల బరువు ఉన్న 48 బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బంగారం విలువ దాదాపు రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన ఆ విమానం.. అనంతరం సర్వీస్ నంబర్ మార్చుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. -
కేరళలో 123 కేజీల బంగారం సీజ్
కొచ్చి: కేరళలోని త్రిసూర్ జిల్లాలో రూ.50 కోట్ల విలువ చేసే దాదాపు 123 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రంలో స్మగ్లింగ్ సిండికేట్‌పై జరిగిన ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలో 23 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ (ప్రివెంటివ్) సుమిత్ కుమార్ తెలిపారు. స్మగ్లర్లు తమిళనాడులోని వివిధ నగరాల నుంచి బంగారాన్ని సేకరించి, రోడ్డు మార్గం ద్వారా త్రిసూర్‌కు అక్రమంగా రవాణా చేశారని పేర్కొన్నారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న మొత్తం 17 మందిని పట్టుకున్నామని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని తెలిపారు. బంగారంతోపాటు రూ.2 కోట్ల నగదు, రూ.6.40 లక్షల విలువ చేసే అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
-
శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, డీఆర్ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సౌది ఎయిర్‌లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన 14 మందిని అదుపలోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డవారిని పాతబస్తీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అయితే తమను జెడ్డాలోని గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు బెదిరించడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని నిందితులు పోలీసుల ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమంతా ఉమ్రా యాత్రకు వెళ్లగా.. అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు వేధింపులకు గురిచేశారు. మాకు బంగారం ఇచ్చి.. దానిని హైదరాబాద్‌లో ఇవ్వాల్సిందిగా ఆదేశింశారు. లేకపోతే అక్రమంగా ఉమ్రా యాత్రకు వచ్చారని స్థానిక పోలీసులకు పట్టిస్తామని వాళ్లు బెదిరింపులకు దిగారు. అందుకు భయపడి బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చామ’ని నిందితులు పోలీసులకు వివరించారు. మరోవైపు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు దాదాపు 8 కోట్ల రూపాయలు విలువ చేసే 23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలింపుకు పాల్పడుతున్న సింగపూర్, మలేసియా నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బంగారం అక్రమ తరలింపు వెనక ఇంకా ఎవరైన ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డదారుల్లో బంగారం అక్రమ రవాణా
సాక్షి, శంషాబాద్ : దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్, డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు బంగా రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవ్యక్తి వద్ద 405 గ్రాముల బంగారం పేస్ట్ బయటపడింది. శుక్రవారం అర్థరాత్రి ఇండిగో 6ఈ 025 విమానంలో వచ్చిన మహ్మద్ అన్షాద్ కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. అతడిని అధికారులు విచారించగా బంగారాన్ని మలద్వారంలో దాచుకుని తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి బంగారాన్ని బయటికి తీయించారు. దీని విలువ రూ.13,08,215 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అన్షాద్ తరచూ ఇదే విధంగా బంగారం తీసుకొస్తున్నట్లు విచారణలో బయటపడింది. మరోవైపు ముందస్తు సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన మరోవ్యక్తిని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఎటువంటి బంగారం బయటపడలేదు. దీంతో అతడి ని టెర్మినల్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి మలద్వారంలో దాచి తీసుకొచ్చిన నాలుగు బంగారు క్యాప్సుల్స్‌ను బయటికి తీశారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 11కిలోల బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. ఆ మహిళ నుంచి 11.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 3.6 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న 7 క్లాత్ ప్యాకెట్స్‌తో పాటు, సాక్స్లలో ఆమె బంగారం తీసుకోచ్చినట్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా గత మూడు నెలలుగా ఆ మహిళ నివాసం ఉంటున్న ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌లో సైతం తనిఖీలు చేపట్టిన అధికారులు స్మగుల్డ్ గూడ్స్‌తో పాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆరు కిలోల బంగారం పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడంది. ఎయిర్‌పోర్టులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆరు కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం పట్టుబడిన విషయమై ఎయిర్పోర్ట్ అధికారులు శ్రీలంక, దుబాయ్‌కు చెందిన 14 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. దాదాపు రూ.3 కోట్ల విలువైన బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న థామస్ అనే ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన సీఐఎస్ఎఫ్ అధికారులు ధామస్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. థామస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నారు. -
తమిళనాడులో సీజ్ చేసిన బంగారం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: తమి ళనాడు పోలీసులు బుధ వారం సీజ్ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవా లను ప్రజల ముందుం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాల యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బంగారం పట్టివేత వ్యవహారంలో ప్రజలు పూర్తి వివరాలను కోరుకుంటున్నారని చెప్పారు. సీజ్ చేసిన దాదాపు 1,400 కిలోల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సంబంధించిందనే వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు. దీనిపై టీటీడీ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. (చదవండి : ఆ బంగారంపై అన్నీ అనుమానాలే) అనధికారికంగా తరలిస్తున్నారా? ‘‘భారీస్థాయిలో బంగారం పట్టుబడితే, అది టీటీడీది అని ఎస్పీ ధ్రువీకరిస్తే, ఇక్కడ ఈవో, చైర్మన్, అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు? ఇందులో ఏం మతలబు ఉందో అర్థం కావడం లేదు. టీటీడీ బంగారాన్ని రక్షణ లేకుండా, ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? భక్తులు సమర్పించే బంగారం, నిధులకు లెక్కాపత్రం లేకపోవడం ఏమిటి? అనే సందేహాలు భక్తు ల్లో తలెత్తుతున్నాయి. అందుకే విచారణ జరపాలి’’ అని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. -
ఆ బంగారంపై అన్నీ అనుమానాలే
సాక్షి, తిరుపతి: తమిళనాడులో పట్టుబడ్డ బంగారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై నుంచి తిరుపతి వైపు తరలిస్తున్న 1,381 కేజీల బంగారాన్ని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. బంగారాన్ని ప్యాక్ చేసిన బాక్స్‌లపై బ్రిటిష్ ఎయిర్వేస్ లేబుల్స్ ఉన్నా యి. దీనిని స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా తేలిందని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికా రులు వెల్లడించారు. పూందమల్లి రిటర్నింగ్ అధికారి రత్న సైతం దీనిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు తేలిందని స్పష్టం చేశారు. అయితే, చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారాన్ని శ్రీవారి క్షేత్రానికి తరలిస్తుండగా తమిళనాడులో పట్టుకు న్నారని చెబుతున్న టీటీడీ అధికారులు, ప్యాకెట్లపై బ్రిటిష్ ఎయిర్వేస్ లేబుల్స్ ఎందుకు ఉన్నాయనే దానికి సమాధానం ఇవ్వటం లేదు. స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తమిళనాడు అధికారులు చెబుతుండగా.. దీనిపైనా టీటీడీ పెదవి విప్పటం లేదు. శ్రీవారి నగలను కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే మింట్‌కు తరలించి కరిగిస్తారు. కడ్డీలుగా మార్చి ఆ తరువాత బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయితే పట్టుబడ్డ బంగారంపై మింట్ ముద్రలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీళ్లకు బదులు వేరే ముద్రలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. (చదవండి : 1,381 కేజీల బంగారం సీజ్) శ్రీవారి నిధులు, బంగారాన్ని బ్యాంకు ల్లో డిపాజిట్ చేసే ముందు ధర్మకర్తల మండలి, స్పెసిఫైడ్ అథారిటీ, ఫైనాన్స్ కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారి బంగారాన్ని టీటీడీ అధికారులు ఎవరి అనుమతితో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారనే దానిపైనా ఎలాంటి సమాధానం లేదు. డిపాజిట్ గడువు తీరటంతో టీటీడీకి తీసుకు వస్తుండగా పట్టుకున్నారని చెబుతున్న అధికారులు.. కనీస భద్రత కూడా లేకుండా ఎలా తీసుకువస్తున్నా రనే దానిపైనా స్పష్టత ఇవ్వటం లేదు. ఇలాంటి ఎన్నో చిక్కుముడుల నడుమ స్వామివారి బంగారం విదేశాలకు వెళ్లిందా? అక్కడ కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారా? అనే అనుమానాలూ ఉన్నాయి. అంత నిర్లక్ష్యమేంటి రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం రూ.50 లక్షల నగదు, బంగారాన్ని ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు లేదా మరో చోటుకు తరలించాలంటే ఇద్దరు బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది, మరో ఇద్దరితో పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తారు. అయితే, రూ.400 కోట్ల విలువ చేసే 1,381 కేజీల బంగారాన్ని తీసుకొచ్చే సమయంలో అటు బ్యాంకర్లు గానీ.. టీటీడీ అధికారులు గానీ ఈ నిబంధనలను పాటించి న దాఖలాలు కనిపించటం లేదు. ఒక మినీ లారీలో బంగారాన్ని ఉంచి డ్రైవర్, మరో ముగ్గురు సాధారణ వ్యక్తులు తీసుకొస్తున్నారు. ఆ వాహనం ముందు, వెనుక ఎస్కార్ట్ ఏర్పాటు చేయలేదు. సాధారణంగా చిన్న ఆభరణాన్ని డిపాజిట్ చేస్తేనే తిరిగి తీసుకునే ప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. డిపాజిట్ చేసినట్టు ధ్రువీకరించే రసీదును విధిగా తీసుకుంటా రు. అటువంటిది రూ.400 కోట్ల విలువ చేసే బంగారాన్ని తీసుకునే సమయంలో ఇటువంటి జాగ్రత్తలేవీ పాటించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. అటు బ్యాంక్ అధికారులు సైతం బంగారా నికి ఎటువంటి పత్రాలు ఇవ్వకపోవడం వెనుక అంతర్యమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రూ.50 వేలకు మించి నగదు, బంగారం ఉండకూడదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో రూ.400 కోట్ల విలువ చేసే శ్రీవారి బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చిందనే దానికి సమాధానం లేదు. పైగా ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానాలు చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్ చేసిన గడువు ముగిసి 20 రోజులు కావస్తోందని, ఈ దృష్ట్యా తిరిగి టీటీడీకి అప్పగించాలని బ్యాంక్ అధికారులకు లేఖ రాసినట్టు టీటీడీ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. పట్టుబడిన బంగారాన్ని బ్యాంక్ అధికారులే సంబంధిత పత్రాలతో వెళ్లి విడిపించుకు తెస్తారని టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో శ్రీవారి సొమ్ము రూ.వెయ్యి కోట్లు ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జాతీయ బ్యాంక్‌లు ఉండగా.. ప్రైవేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం ద్వారా టీటీడీ సంప్రదాయానికి తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులో ఎలా తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఆనవాయితీ. టీటీడీలో కొందరు అధికా రులు కమీషన్లకు కక్కుర్తిపడి నగదు, బంగారాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. పొరపా టున జరగరానిది జరిగి ప్రైవేట్ బ్యాంకులు జెండా ఎత్తేస్తే పరిస్థితి ఏమిటని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1,381 కేజీల బంగారాన్ని తిరుపతిలో ఉండే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం ఉన్నా.. కమీషన్లకు కక్కుర్తిపడి చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆ బంగారం వ్యవహారంపై విచారణ జరగాలి : వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు పోలీసులు బుధవారం సీజ్ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముంగిట ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మొత్తం వ్యవహారం గురించి ప్రజలు వివరాలను కోరుకొంటున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని చెన్నైలోని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు ప్లయింగ్ స్క్వాడ్ బృందం ముమ్మర తనిఖీలు చేస్తుండగా బుధవారం మూడు వాహనాలల్లో 1381 కేజీల బంగారం తరలిస్తుండంగా పట్టుబడిందన్నారు. మూడు వాహనాలల్లో కడ్డీల రూపంలో తరలిస్తున్నటువంటి దాదాపు 1400 కేజీల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు సంబంధించిందని, తరలిస్తున్న సిబ్బంది చెప్పారు. తిరువల్లూరు ఎస్పీ కూడా ప్రకటించినట్లు పేపర్లో వచ్చిందని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. ఇది జరిగి రెండో రోజులవుతున్నా కనీసం టీటీడీ చైర్మన్ కానీ, ఈవో కానీ, ఇతర అధికారులు కానీ ఆ బంగారం గురించి నోరు మెదపక పోవటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది టీటీడీకి సంబంధించిన చిన్నా చితక విషయం కాదని తెలిపారు. 1381 కేజీలు .. అంటే దగ్గర దగ్గరగా 1400 కేజీలు బంగారం పట్టుపడితే ఎవరిది అనేది బయట పడకపోవటం.. టీటీడీ అధికారులు నోరు విప్పక పోవటం దేన్ని సూచిస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏమి మతలబుందో ... ‘ఇంత పెద్ద స్థాయిలో బంగారం చెన్నై ఎన్నికల సందర్భంగా వాహనాలలో పట్టుబడితే... అది టీటీడీది అని ఎస్పీ ధ్రువీకరిస్తే, ఇక్కడ ఈవో, చైర్మన్ అధికారులు ఎందుకు మాట్లాడం లేదో అర్థం కావటంలేదు. ఇందులో ఏమి మతలబు ఉందో అర్థం కావటం లేదు. ఇవాళ సీఎం అనేక విషయాలపై రివ్యూ చేస్తున్నారన్నారు. టీటీడీ బంగారం రోడ్డుపై పట్టుబడితే ఒక్కరు కూడా సెక్యూరిటీ లేరన్నారు. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు లేవన్నారు. నడిరోడ్డుపై టీటీడీ బంగారం తరలిస్తున్నారంటే ఏంటిదసలు?. ఈ ప్రభుత్వం ఎటుపోతోంది. పవిత్రమైన టీటీడీ బంగారంపై ఇంత వివాదం జరగాల్సిన అవసరం ఉందా?. భక్తులు.. భక్తి భావంతో సమర్పించే బంగారానికి, నిధులకు సంబంధించి ఈ రోజు లెక్కా పత్రం లేకుండా పట్టుబడితే.. దానికి సంబంధించిన వివరాలు లేకపోవటం ఏమిటి? దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు లేకపోవటం ఏమిటీ? అసలు సెక్యూరిటీ దాన్ని తరలించటం ఏమిటీ? అనధికారికంగా తరలిస్తున్నారా? అని భక్తులకు సందేహాలు కలుగుతున్నాయి. అధికారులు తేలుకుట్టిన దొంగల్లాగా.. ఎందుకు గుట్టుగా ఉన్నారో అంటూ ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. టీటీడీ ఇప్పటివరకూ స్పందించక పోవటం బాధ్యతా రాహిత్యం. టీటీడీ బంగారానికి లెక్కా జమ లేకపోవటం ఆశ్చర్యకరం. ఇక దేవుడికే దిక్కులేక పోతే ఎవ్వరికి దిక్కు ఉంటుంది. ఈ వ్యవహరం గురించి వాస్తవాలు మొత్తం వెలుగులోకి రావాలి. ఏమి జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉంది. బంగారు వివరాలు ప్రజల ముందు ఉంచాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాలు వెలుగులోకి రావాలి’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు. -
ఎన్నికల వేళ చెన్నైలో 1381 కేజీల బంగారం స్వాధీనం
-
1,381 కేజీల బంగారం సీజ్
సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ తరలిస్తున్న క్వింటాళ్లకొద్దీ బంగారాన్ని తమిళనాడు అధికారులు బుధవారం పట్టుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మూడు వాహనాల్లో రవాణా చేస్తున్న 1,381 కేజీల బంగారు కడ్డీలను చూసి షాకైన అధికారులు.. ఆనక తేరుకుని వాటిని సీజ్ చేశారు. తమిళనాడులో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు తమిళనాట ఫ్లయింగ్ స్క్వాడ్స్ ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఇందులో తిరువళ్లూరు పుదుసత్రం వద్ద చెన్నై నుంచి తిరుపతి వైపు వెళుతున్న మూడు వాహనాలను ఆపిన అధికారులకు వాటిలో అనుమానాస్పదంగా ఉన్న ప్యాకెట్లు కనిపించాయి. వాటిని పూందమల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ గిఫ్ట్ ప్యాక్ రూపంలో ఉన్న ప్యాకెట్లను తెరిచి చూశారు. ఆ ప్యాకెట్లలో బంగారు దిమ్మెలను గుర్తించి అవాక్కయ్యారు. పెద్దమొత్తంలో బంగారం పట్టుబడటంతో రిటర్నింగ్ అధికారి రత్న ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పూందమల్లి తాలూకా కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో బంగారాన్ని ఏ రాజకీయ పార్టీకైనా ఇచ్చేందుకు తరలిస్తున్నారా, ఓటర్ల పంచేందుకు తీసుకెళుతున్నారా లేక స్మగ్లింగ్‌లో భాగంగా రవాణా చేస్తున్నారా అనే అనుమానంతో నలుగురినీ విచారణ జరుపుతున్నారు. పట్టుబడ్డ బంగారం స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూందమల్లి రిటర్నింగ్ అధికారి రత్న మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో 1,381 కిలోల బంగారం పట్టుబడిందని, దీనిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అది శ్రీవారి బంగారమే ఇదిలావుండగా, వాహనాల డ్రైవర్లు మాట్లాడుతూ.. ఈ బంగారు కడ్డీలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పగించేందుకు తీసుకెళుతున్నట్టు వివరించారు. కొనుగోలు డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నట్టు తెలిపారు. దేవస్థానం అధికారుల వద్ద సరైన డాక్యుమెంట్లు ఉంటే బంగారాన్ని వారికి అప్పగిస్తామని, లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. టీటీడీ అధికారుల ఏమంటున్నారంటే.. తమిళనాడు పోలీసులు సీజ్ చేసిన బంగారం శ్రీవారికి చెందినదేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టీటీడీకి సంబంధించిన శ్రీవారి బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్టు తెలిపారు. 20 రోజుల క్రితం గడువు తీరడంతో వాటిని రిలీజ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీకి తరలిస్తున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే బంగారాన్ని టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్నట్టుగా బుధవారం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. బ్యాంక్ అధికారులు మాత్రం బంగారం తరలింపుపై ఎన్నికల సంఘానికి లేఖ పంపినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయంటున్నారు. ఆధారాలను గురువారం తిరవళ్లూరు కలెక్టర్‌కు అందజేసి బంగారాన్ని టీటీడీకి చేరేలా చర్యలు తీసుకుంటామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు వివరించినట్టు సమాచారం. ఇటీవల తిరుమల ఆలయంలో భారీఎత్తున ఆభరణాలు మాయమైనట్టు ఆరోపణలు వస్తున్న తరుణంలో చెన్నైలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడటం అనేక అనుమానాలు తావిస్తోంది. -
1381 కేజీల బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ భారీగా బంగారం పట్టుబడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నికల సమయంలో బంగారంతో పాటు భారీగా అక్రమ నగదు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో 1381 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై సమీపంలోని తిరువల్తూరు జిల్లా వేపంబట్టు టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఫ్తెయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వ్యాన్లలో బంగారం, కొంతమేర నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాలతో సహా సీజ్ చేశారు. కాగా రేపు దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరుగునున్న నేపథ్యంలో భారీగా బంగారం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్నారా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. తెలి విడుత పోలింగ్ ముందు కూడా తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా అధికారులకు పట్టుబడిన బంగారాన్ని టీటీడీకి చెందినదిగా గుర్తించారు. తనిఖీల్లో పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టీటీడీ ఇచ్చిన లేఖతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ తమిళనాడుకు బయలుదేరారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
-
175 బంగారు బిస్కెట్లు స్వాధీనం
-
57 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో రూ. 57 కోట్లు విలువచేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ బంగారం పట్టుబడింది. ఏపీకి చెందిన సిద్ధార్థ్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు తేల్చినట్లు తెలుస్తోంది. సిమెంట్ లారీలో నెల్లూరు నుంచి ముంబైకి తరలిస్తున్న యత్నంలో బంగారం పట్టుబడింది. లారీని సీజ్ చేసిన అధికారులు బంగారం ఎవరిదన్న కోణంలో మరింత లోతుగా విచారిస్తున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం ఓటర్లకు పంచడానికి తరలిస్తున్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రా ప్రాంతాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. -
డ్రిల్లింగ్ మెషీన్, కుక్కర్లలో బంగారు కడ్డీలు..
సాక్షి, హైదారాబాద్ : బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగేజీ తనిఖీల క్రమంలో నిందితులు పట్టుబడ్డాడు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్ అధికారులు వాటిని వెలికి తీశారు. మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావు కిలో చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాముల బరువు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా.. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ కోటింగ్ వేసిన గోల్డ్ ప్లేట్లను కుక్కర్లో దాచి ఉంచగా బ్యాగేజ్ తనిఖీల్లో బయటపడ్డాయి. -
120 కిలోల బంగారం పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో భారీగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోదీ నగర్ జిల్లాలో శుక్రవారం తనిఖీలు చేస్తున్న పోలీసులకు రూ 38 కోట్ల విలువైన 120 కిలోల బంగారం ఓ వాహనంలో పట్టుబడింది. ఢిల్లీ నుంచి యూపీలోని హరిద్వార్‌కు చెందిన ఓ ఫ్యాక్టరీకి బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో ముడి బంగారాన్ని బిస్కెట్లుగా మార్చి పలు ప్రాంతాలకు తరలిస్తారని పోలీసులు చెప్పారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో క్యాషియర్, డ్రైవర్ సహా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు చెన్నై విమానాశ్రయంలో రూ 6.24 కోట్ల విలువైన 17.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో విమానాశ్రయంలో సోదాలు నిర్వహించగా అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చిన బంగారం పట్టుబడిందని అధికారులు పేర్కొన్నారు. గృహాపకరణాలు, గాడ్జెట్లలో ప్రయాణీకులు బంగారాన్ని దాచారని వారు చెప్పారు. బంగారంతో పాటు రూ 1.1 కోట్ల విలువైన ఐఫోన్లు, స్మార్ట్ వాచీలు,యూఎస్బీ చిప్స్, స్టోరేజ్ పరికరాలు, కెమెరా లెన్స్‌లు, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. -
తొమ్మిది కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై: చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. ప్రయాణికులను తనిఖీ చేసే క్రమంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్సిల్ విభాగంలో తనిఖీలు చేస్తున్న డీఆర్ఐ అధికారులు స్మార్ట్ వాచ్‌లు, కెమెరా లెన్స్, యూఎస్బీ చిప్స్‌లలో భారీ ఎత్తున బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. బంగారం విలువ తొమ్మిది కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భారీగా బంగారం పట్టివేత..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో సోమవారం భారీగా బంగారం పట్టుబడింది. చెన్నై, కోయంబత్తూరు ఎయిర్‌పోర్టుల్లో 2.4 కేజీల బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరులో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 1.5 కేజీల బంగారాన్ని ప్రయాణికుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేరళలోని పాలక్కాడకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
చెన్నై విమానాశ్రయంలో భారీ బంగారం పట్టివేత
-
గోల్డ్ బార్స్‌తో అక్కడ దొరికిపోయాడు..
ఢాకా : భారత్‌కు చెందిన అర్షద్ అయాజ్ అహ్మద్ రూ 4.7 కోట్ల విలువైన బంగారు కడ్డీలతో ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో థాయ్‌లాండ్ నుంచి అర్షద్ అహ్మద్ ఢాకా చేరుకున్నాడని స్ధానిక మీడియా వెల్లడించింది. ఎయిర్పోర్ట్ గ్రీన్‌ఛానెల్‌లో సిబ్బంది తనిఖీ చేయగా భారీగా బంగారం పట్టుబడిందని ఢాకా కస్టమ్స్ హౌస్ డిప్యూటీ కమిషనర్ ఒథెల్లో ఛౌధురి తెలిపారు. అహ్మద్ నుంచి రూ 4.7 కోట్ల విలువైన 22 గోల్డ్ బార్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న అయాజ్‌ను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించామని బంగ్లా కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కాగా, ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలు ఇటీవల భారీగా చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొన్నారు. -
పసిడికి హెన్నా టచ్!
సాక్షి, హైదరాబాద్ : కడ్డీలు.. బిస్కట్లు.. వివిధ వస్తువుల రూపంలో ఇప్పటి వరకూ పసిడి స్మగ్లింగ్‌కు పాల్పడిన ముఠాలు.. తాజాగా హెన్నా(మెహెందీ పొడి)తో బంగారాన్ని కలిపి, పేస్ట్‌లా మార్చి అక్రమ రవాణా చేసేస్తున్నాయి. ఈ గోల్డ్ పేస్ట్ స్మగ్లింగ్ కోసం శ్రీలంక రాజధాని కొలంబో నుంచి వచ్చిన ‘ఇంటర్నేషనల్–డొమెస్టిక్’ఫ్లైట్‌ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పేస్ట్ రూపంలో తీసుకువచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దీన్ని తీసుకువచ్చిన చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొలంబో నుంచి నగరానికి.. కొలంబోకు చెందిన సూత్రధారులు 1,150 గ్రాముల బంగారాన్ని మెత్తని పొడిగా చేశారు. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బంగారం పొడిని గోధుమ రంగులో ఉండే హెన్నాలో కలిపేశారు. 1,120 గ్రాముల బంగారం పొడిలో 730 గ్రాముల హెన్నాను కలిపారు. పౌడర్ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చెక్లెట్ తయారీకి వినియోగించే లిక్విడ్స్ వాడారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన స్మగ్లర్లు.. దాన్ని బ్రౌన్ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేశారు. ఇలా తయారు చేసిన 1,850 గ్రాముల బరువున్న 2 ప్యాకెట్లను ‘ఇంటర్నేషనల్–డొమెస్టిక్’పంథాలో శంషాబాద్‌కు పంపారు. చేతికి పసిడి అంటకుండా.. విమానంలో సీట్లు బుక్ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరించిన ఈ వ్యవస్థీకృత ముఠా ‘చేతికి పసిడి’అంటకుండా పని పూర్తి చేయడానికి పథకం వేసింది. అంతర్జాతీయ సర్వీసుల్ని నడిపే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యలో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. స్పైస్ జెట్‌కు చెందిన ఎస్జీ–1314 విమానం కొలంబో–హైదరాబాద్ మధ్య నడుస్తుంది. ఇది కొలంబోలో అంతర్జాతీయ సర్వీసుగా మొదలై మధురై వచ్చిన తర్వాత దేశవాళీ సర్వీసుగా మారుతుంది. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ ఎయిర్‌లైన్స్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యాన్ని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పసిడి ప్యాకెట్లను సీటు కిందే వదిలి.. కొలంబో నుంచి రెండు ‘గోల్డ్ పేస్ట్’ప్యాకెట్లను తీసుకుని ఓ స్మగ్లర్ మధురై వరకు వచ్చాడు. పసిడి ప్యాకెట్లు ఉన్న హ్యాండ్ బ్యాగేజ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమానం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. స్మగ్లింగ్ ముఠాలో పాత్రధారిగా ఉన్న చెన్నైకు చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చే డొమెస్టిక్ ప్యాసింజర్‌గా అదే విమానం ఎక్కాడు. ఇతగాడు కొలంబో నుంచి వచ్చిన వ్యక్తి కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. విమానం హైదరాబాద్ చేరేసరికి ఈ చెన్నై వాసి దేశవాళీ ప్రయాణికుడే కావడం తో కస్టమ్స్ తనిఖీలూ లేకుండా హ్యాండ్ బ్యాగేజ్‌తో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవచ్చు. ప్రత్యేక బృందం కాపు కాసి.. ఈ విమానం శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం చేరే వరకు అంతా స్మగ్లర్లు అనుకున్న ప్రకారమే జరిగింది. అయితే ఈ వ్యవహారంపై డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్‌కు ఉప్పందడంతో ఓ ప్రత్యేక బృందం విమానాశ్రయంలో కాపుకాసింది. ఫ్లైట్ దిగి హ్యాండ్ బ్యాగేజ్‌తో ఎరైవింగ్ హాల్ వైపు వెళ్తున్న చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసింది. రెండు ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని విచారించిన నేపథ్యంలో సూత్రధారులెవరో తనకు తెలియదని, కమీషన్ తీసుకుని పని చేసే తాను మధురై నుంచి హైదరాబాద్ చేరుస్తానని, ముఠాకు చెందిన రిసీవర్లే తన వద్దకు వచ్చి ప్యాకెట్లు తీసుకువెళ్తారని తెలిపాడు. ఇతడి వద్ద లభించిన రెండు ప్యాకెట్లలోని 1,850 గ్రాముల పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసి కిరోసిన్ పోసి నిప్పుపెట్టగా అది పొడిగా మారింది. ఈ పొడిని కొలిమిలో కరిగించగా.. 1,120.78 గ్రాముల బంగారు బిస్కెట్ తయారైంది. దీని విలువ మార్కెట్లో రూ.34,57,606 ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ తరహా ‘గోల్డ్ పేస్ట్’కేసు హైదరాబాద్‌లో చిక్కడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. ఈ కేసును అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేప్పుడు ‘చూజ్ యువర్ సీట్’పేరుతో ప్రయాణికుడు తమకు అనువైన సీటును ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీన్నే స్మగ్లింగ్ గ్యాంగ్స్ తమకు అనువుగా మార్చుకుంటున్నాయని తేలింది. కొలంబో నుంచి మదురై, మదురై నుంచి హైదరాబాద్ రావడానికి ముఠా సభ్యుల కోసం నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టికెట్లు బుక్ చేస్తున్నారు సూత్రధారులు. ఈ అన్ని సర్వీసుల్లోనూ ఒకే సీటును వారు ఎంచుకుని ఎటువంటి ఇబ్బందీ లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. మరికొందరు స్మగ్లర్స్ ఇదే తరహా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న అధికారులు నిఘా ముమ్మరం చేయాలని నిర్ణయించారు. -
కర్ణాటకలో ఐటీ దాడులు.. 10 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ/బెంగళూరు: బెంగళూరు, దావ ణగెరే, మైసూర్లలోని కాంట్రాక్టర్ల ఇళల్లో జరిపిన సోదాల్లోరూ.4.01కోట్ల నగదు, 6.5 కిలోల నగలు లభ్యమైనట్లు ఐటీ శాఖ తెలిపింది. ఓ బ్యాంకులోని బినామీ లాకర్లో దాచి ఉంచిన రూ.6.76 కోట్ల నగదును గుర్తించింది. దీంతో గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో సుమారు రూ.20.14 కోట్ల నగదు పట్టుబడినట్లయింది.మరోవైపు, శుక్రవారం దేవనహళ్లి తాలూకా బాలేపుర చెక్‌పోస్టులో నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో 58 కేజీల బంగారం పట్టుబడింది. ఫారూక్ జైన్ అనే వ్యక్తి దేవనహళ్లి నుంచి హొసకోట వైపు బొలెరోలో వెళ్తుండగా, పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఈ బంగారం బయటపడింది. -
ఒంటరి మహిళలే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించిన మహిళలకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి సిరివెళ్లి రమణమ్మ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. మల్కాజ్గిరి పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు దగ్గర నుంచి 32 తులాల బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళ ఏపీ, తెలంగాణలలో 25కు పైగా కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మహిళను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. -
నటి నుంచి రూ. 15 లక్షల బంగారం స్వాధీనం
సాక్షి, చెన్నై: నటి శ్రుతి నుంచి పోలీసులు రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోవై, పాపనాయగన్‌పాలైయంకు చెందిన నటి శ్రుతి పెళ్లి పేరుతో పలువురు యువకులను మోసం చేసి లక్షల్లో డబ్బు, నగలను దోసుకున్న సంఘటన పెద్ద కలకాలాన్నే రేపింది. శ్రుతి వలలో పడి మోసపోయిన వారిలో వేలూరుకు చెందిన సంతోష్‌కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు.ఆయన చేసిన ఫిర్యాదు మేరకు వేలూరు పోలీసులు కేసు నమోదు చేసి శుత్రి సహా ఆమె తల్లి, సోదరుడు, బందువు అంటూ నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగా శ్రుతి మోసం చేసి కొట్టేసిన డబ్బును, నగలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం మంగళవారం కోవై నుంచి చెన్నై వచ్చి, నటి శ్రుతికి ఖాతా ఉన్న బ్యాంకు లాకరులో రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బుధవారం కోవైకి తీసుకొచ్చారు. ఆ నగలను కోర్టులో సమర్పించనున్నారు. ఇంకా శ్రుతికి బ్యాంకు ఖాతాలేమైనా ఉన్నాయేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా బంగారం పట్టివేత
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు 4 కేజీల 658 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో తనిఖీలు చేయగా రూ. కోటి 43 లక్షల విలువైన బంగారం బయటపడింది. గ్యాస్ స్టౌలో బంగారం నింపి తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. విజయవాడ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టురు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విజయవాడ డీఆర్ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. -
షూలలో రెండు కిలోల బంగారం బిస్కెట్లు
తమిళనాడు: చెన్నై విమానాశ్రమానికి అక్రమంగా తెచ్చిన రెండు కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. షార్జా నుంచి ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మార్గంలో చెన్నైకి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని కోలికోడ్‌కు చెందిన ఇస్రాత్ (33) పట్టుబడ్డాడు. ఆయన ధరించిన షూలను తనిఖీ చేయగా రెండు కిలోల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆయన వాటిని షూలోని ప్రత్యేక అరలో అమర్చుకుని అక్రమంగా తరలించేందుకు యత్నించాడు. వీటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
30 కిలోల బంగారాన్ని మింగేశారు
సాక్షి, చెన్నై: ‘మీ ఇల్లు బంగారం గానూ’ అంటూ ఆశ్చర్యపోవడం అనాదిగా వస్తోంది. అయితే మధురై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 20 మంది ప్రయాణికులకు స్కానింగ్ తీసి ‘ మీ కడుపు బంగారం గానూ’ అంటూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి ఆదివారం రాత్రి మధురై విమానాశ్రయానికి వచ్చే విమానంలో భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా సాగుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులకు సమాచారం వచ్చింది. ఆ విమానం నుంచి దిగిన 60 మంది ప్రయాణికులను తనిఖీ చేసి స్కానింగ్‌లు సైతం తీయగా వీరిలోని 20 మంది కడుపులో బంగారాన్ని దాచిపెట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. చిన్నపాటి పాలిథిన్ కవర్లో 30 కిలోల బరువులున్న బంగారు బిస్కెట్లను పెట్టి మింగేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ 20 మంది ప్రయాణికులను సోమవారం ఉదయం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎనిమా ఇచ్చి బంగారు బిస్కెట్లను బైటకు తీయించారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. మధురై విమానాశ్రయంలో 30 కిలోల బంగారు పట్టుబడటం ఇదే ప్రధమనని ఆయన అన్నారు. -
స్మగ్లింగ్ జోరు
♦ విదేశాల నుంచి బంగారం ♦ మాదక ద్రవ్యాలు కూడా ♦ రాజమార్గంగా సముద్ర తీరం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళ రాజధాని నగరం చెన్నై కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఇటీవల ఇక్కడ వెలుగుచూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సంఘ విద్రోహశక్తుల కదలికలు ఓవైపు వెలుగులోకి వస్తుంటే, మరోవైపు బంగారం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జోరందుకుంది. ఆదివారం కూడా పది కేజీల బంగారం పట్టుబడటం గమనార్హం. సాక్షి, చెన్నై: సంఘ విద్రోహ శక్తులు సముద్ర తీరాన్ని రాజమార్గంగా ఎంపిక చేసుకుని దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. అలాగే, అదే తీరం గుండా బంగారం, మాదక ద్రవ్యాలను తరలిస్తుండటం ఇటీవల కాలంగా పెరుగుతోంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఆశతో ఉన్న వారిని ఎంపిక చేసుకుని, తమ ఏజెంట్ల ద్వారా స్మగ్లింగ్‌ను జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలు, హార్బర్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతి, బంగారం స్మగ్లింగ్ భరతం పట్టే దిశగా తనిఖీల పర్వం సాగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక విమానాశ్రయంలో బంగారం పట్టుబడడం పరిపాటిగా మారింది. 2012–13తో పోల్చితే గత ఏడాది ఐదింతల మేరకు బంగారం పట్టుబడ్డట్టు గణాంకాలు చెబుతున్నాయి. మలేషియా, సింగపూర్‌లతో పాటుగా అరబ్ దేశాల నుంచి విమానాల ద్వారా బంగారం జోరుగా ఇక్కడికి తరలి వస్తోందని చెప్పవచ్చు. అదే సమయంలో పట్టుబడుతున్న బంగారం ట్రెజరీలకు పరిమితం చేస్తున్నారని, తదుపరి విచారణ అనేది లేని దృష్ట్యా, మళ్లీ మళ్లీ స్మగ్లర్లు తమ ఏజెంట్ల ద్వారా పనితనాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక, చెన్నైలోనే కాకుండా తూత్తుకుడి, రామేశ్వరం, నాగపట్నం హార్బర్లను కేంద్రంగా చేసుకుని బంగారంతో పాటు మాదక ద్రవ్యాల తరలింపు జోరందుకుంటోందనే ఆరోపణలున్నాయి. శ్రీలంక నుంచి హార్బర్ల మీదుగా తమిళనాడులోకి, ఇక్కడి ఏజెంట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు బంగారం, వివిధ రకాల మత్తు పదార్థాలు యథేచ్ఛగా తరలుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజుల వ్యవధిలో సముద్ర తీరం గుండా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున బంగారం ప్రవేశించినట్టు సంకేతాలు వెలువడుతుండటంతో కస్టమ్స్ వర్గాలు నిఘాను పెంచి ఉన్నాయి. ఈ నిఘా మేరకు ఆదివారం పది కేజీల బంగారం పట్టుబడటం గమనార్హం. పది కేజీల బంగారం – నలుగురి అరెస్టు : రామనాథపురం–శివగంగై–తూత్తుకుడి సరిహద్దుల్లోని కొన్ని గ్రామాలను కేంద్రంగా చేసుకుని శ్రీలంక నుంచి బంగారం స్మగ్లింగ్ అవుతుండటాన్ని అధికారులు గుర్తించారు. సాయల్ గుడి వైపుగా వస్తున్న వాహనాల్ని తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందం సిద్ధం అయింది. శనివారం రాత్రి నుంచి సాగిన తనిఖీల్లో ఆదివారం వేకువజామున అటు వైపు వచ్చిన నాలుగు మోటార్ సైకిళ్లను తనిఖీ చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా, అనుమానం రావడంతో ఆ వ్యక్తుల వద్ద ఉన్న చిన్న పాటి పార్శిళ్లను విప్పి చూడగా, అందులో ఒక్కో కేజీ బరువు కల్గిన బంగారం బిస్కెట్లు పది బయటపడ్డాయి. మొత్తం పది కేజీలుగా తేల్చారు. వాటి విలువ రూ. మూడు కోట్లు ఉంటుందని నిర్ధారించారు. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీలంక నుంచి వచ్చిన ఈబంగారాన్ని చెన్నైకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తేలింది. చెన్నైలోని ఓ బడా బాబుద్వారా ఈ బంగారం హవాల నగదుగా మారి మళ్లీ శ్రీలంకకు చేరుతుందంటూ ఆ వ్యక్తులు ఇచ్చిన సమాచారం కస్టమ్స్ వర్గాలకు షాక్ ఇచ్చాయి. ఇక్కడ బంగారం మీద మోజు మరీ ఎక్కువ ఉండటంతో దొడ్ది దారిని తరలించి, దానిని హవాల నగదు రూపంలో మళ్లీ శ్రీలంకకు పంపిస్తున్న ఆ బడా బాబు భరతం పట్టేందుకు చెన్నైలో విచారణ జరుపుతున్నారు. దీన్నిబట్టి చూస్తే, చెన్నై కేంద్రంగా చాప కింద నీరులా స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. -
పొట్టలో కండోమ్‌లు..వాటిల్లో వజ్రాలు
చెన్నై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త ఐడియాలు ఫాలో అవుతున్నారు. ఎన్నిరకాలుగా భద్రత కట్టుదిట్టం చేసినా నిఘా అధికారుల కళ్లుగప్పి ఏదో మార్గంలో బంగారం, విలువైన వజ్రాలను దొంగ రవాణ చేయడానికి ప్రయతిస్తునే ఉన్నారు స్మగ్లర్లు. తాజాగా ఓ స్మగ్లర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే... కొలంబో నుంచి చెన్నైకు నిన్న (శుక్రవారం) సాయింత్రం వచ్చిన విమాన ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. చెన్నైకి చెందిన అతని పేరు మహ్మద్ ఇర్ఫాన్ టూరిస్టు వీసాలో శ్రీలంకకు వెళ్లాడు. తిరిగి చెన్నై విమానాశ్రయం చేరుకున్న అతడి ప్రవర్తన అసహజంగా ఉండటంతో..కస్టమ్స్ అధికారులు... ప్రత్యేక గదికి తీసుకువెళ్లి వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించగా అతడి కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతనికి వైద్యులు ఎనిమా ఇచ్చారు. కొద్దిసేపటికి అతని కడుపులో నుంచి మూడు కండోమ్‌లు వెలుపలికి వచ్చాయి. ఇందులో 18 వజ్రపు రాళ్లు ఉండడం చూసి వైద్యులు కంగుతిన్నారు. వీటి విలువ రూ.60 లక్షలుగా తెలిసింది. అతనిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అలాగే శ్రీలంక నుంచి చెన్నైకు శుక్రవారం రాత్రి వచ్చిన విమానంలో ముగైదీన్ (33) అనే వ్యక్తి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇతని మలద్వారంలో 300 గ్రాముల బరువు కలిగిన మూడు బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ తొమ్మిది లక్షల రూపాయిలు. అలాగే, చెన్నై నుంచి సింగపూర్‌కు వెళ్లిన విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన అబ్దుల్ (40) హ్యాండ్ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో అమెరికా డాలర్లు, సింగపూర్ కరెన్సీ ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ రూ.15 లక్షలుగా తెలిసింది. -
మిక్సీలో బంగారం, మహిళ అరెస్ట్
హైదరాబాద్: బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు దొరికిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గురువారం సాయంత్రం అబుదబి నుంచి వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న లగేజిని తనిఖీ చేసిన రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు మిక్సర్ గ్రైండర్‌ను పరీక్షగా చూడగా అందులోని మోటార్లో ఉన్న దాదాపు 1.29 కేజీల బంగారం బయటపడింది. ఈ మేరకు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో అక్రమంగా తీసుకు వస్తున్న బంగారం బయపటడింది. జెడ్డా నుంచి శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను సోదా చేయగా వారి వద్ద రూ.22 లక్షల విలువ జేసే 747 గ్రాముల బంగారం బిస్కెట్లు దొరికాయి. ఇందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవటంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
టాయిలెట్లో 6 కేజీల బంగారం
సాక్షి, బెంగళూరు: బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో అధికారులు 12.65 కేజీల బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 2.60 కోట్ల విలువైన 6.65 కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోని బాత్రూంలో బంగారం, నగలు దాచినట్లు కస్టమ్స్ అధికారులు సమాచారం అందింది. దీంతో అధికారుల తనిఖీలు చేయగా పిల్లల డైపర్లున్న పెట్టె దొరికింది. దీన్ని తెరిచి చూడగా బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి. పెట్టెను తీసుకొచ్చిన వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే తమిళనాడుకు చెందిన మహ్మద్ మొహిద్దిన్గా గుర్తించారు. అలాగే ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలోని టాయిలెట్లో 6 కేజీల బరువున్న 12 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. -
2 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్: నమ్మకంగా పని చేస్తున్న ఓ వ్యక్తి తన యజమానిని మోసం చేశాడు. బంగారం వ్యాపారి వద్ద పని చేస్తున్న చేతన్ మాలి అనే వ్యక్తి తన యజమాని ఇచ్చిన 2 కిలోల బంగారాన్ని చేర్చాల్సిన చోటుకు చేర్చకుండా దొంగతనం చేశాడు. దీంతో బాధితుడు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు కిలోల బంగారం రికవరీ చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య వివరాలు తెలిపారు. -
ట్రాఫిక్ పోలీసు ఇంట్లో.. కళ్లు చెదిరే సొమ్ము!
హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వెళ్తున్నా ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆపుతారు. మిగిలిన పేపర్లన్నింటినీ కూడా చెక్ చేస్తారు. మన కర్మకొద్దీ సరిగ్గా ఆరోజే పేపర్లు ఉండవు. నిజాయితీ గల పోలీసులైతే వెంటనే అన్ని అపరాధాలకు కలిపి చలానా రాసి కట్టమంటారు. తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే అప్పటికప్పుడే హ్యాండ్ హెల్డ్ మిషన్లతో ప్రింటవుట్ తీసి చేతికిస్తారు. కానీ, అక్కడే అవినీతిపరుడైన పోలీసు ఉంటే చేతిలో ఐదు వందలో, వెయ్యి రూపాయలో పెట్టేవరకు అక్కడినుంచి కదలనివ్వడు. లేకపోతే రెండు మూడువేలు ఫైన్ పడుతుందని బెదిరిస్తాడు. సరిగ్గా అలాంటి అవినీతిపరుడైన ట్రాఫిక్ కానిస్టేబుల్.. కర్ణాటకలో ఏసీబీకి అడ్డంగా దొరికేశాడు. అతడి ఇంటి మీద దాడులు చేసిన ఏసీబీ అధికారులకు కళ్లు తిరిగే సంపద కనిపించింది. ఏకంగా రూ. 11.23 లక్షల నగదు, 265 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, రెండు కౌంటింగ్ మిషన్లు కూడా లభించాయి. విశ్వసనీయ సమాచారం అందడంతో కల్బుర్గి ప్రాంతంలో ఉన్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటి మీద ఏసీబీ దాడులు జరిపినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. -
160 కిలోల బంగారం పట్టివేత
చండీగఢ్: ఎన్నికల ముంగిట పంజాబ్‌లో పోలీసులు రూ.21 కోట్ల విలువైన 160 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొహాలీ జిల్లాలోని సొహానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బకార్పూర్ చౌక్‌లో ఓ చెక్‌పోస్టు వద్ద చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మంగళవారం రాత్రి ఓ వాహనంలో ఈ ముడి బంగారం లభించింది. ఈ బంగారాన్ని శుద్ధిచేయడానికి ఢిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనంలో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం గురించి వారు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని, సంబంధిత పత్రాలు కూడా వారి వద్ద లేవని పోలీసులు తెలిపారు. తదుపరి ధృవీకరణ నిమిత్తం ఈ విషయాన్ని పోలీసులు ఎక్సైజ్, పన్ను శాఖ అధికారులకు తెలియజేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 730 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులను అధికారులు సోదాలు చేశారు. వారి వద్ద నుంచి బంగారం లభించగా, వాటికి సంబంధించిన రసీదులు చూపకపోవడంతో సీజ్ చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇద్దరు నిందితులు హైదరాబాద్‌కు చెందినవారు. -
58 కిలోల బంగారం పట్టివేత
కోల్‌కతా: అక్రమంగా రవాణా చేసిన రూ. 18 కోట్ల విలువైన 58 కిలోల బంగారాన్ని రెవెన్యూ అధికారులు శనివారం కోల్‌కతాలో పట్టుకున్నారు. ఈ రాకెట్‌తో సంబంధమున్నట్లు భావిస్తున్న మహిళ సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సిటీ కోర్టు వారికి ఆగస్టు 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రహస్య సమాచారంతో అధికారుల ప్రత్యేక బృందం ఉత్తర కోల్‌కతాలోని రవీంద్ర సరానీ సమీపంలో ఉన్న స్థావరంపై దాడులు జరిపి 350 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకుంది. మయన్మార్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి, ముంబైలో తలదాచుకుంటున్న బృందంతో వీరికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. -
కెన్యా దంపతుల నుంచి కేజీన్నర బంగారం సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దొంగలు అరెస్ట్: భారీగా సొత్తు స్వాధీనం
కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7.5 లక్షలు విలువ చేసే నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
దొంగ అరెస్ట్ : కేజీ వెండి స్వాధీనం
హైదరాబాద్ : నగరంలోని ఎల్బీ నగర్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కేజీ వెండి, 21 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2.5 కిలోల బంగారం పట్టివేత
కేకే.నగర్: చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రెండున్నర కిలోల బంగారం తీసుకొస్తున్న ఆంధ్రా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి కువైట్ నుంచి కువైట్ ఎయిర్‌లైన్స్ విమానం చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా, ఒక మహిళపై అధికారులకు అనుమానం రావడంతో ఆమె హ్యాండ్బాగ్ని పరిశీలించగా నలుపు పాలథిన్ కవరులో 100 గ్రాముల బరువు గల ఐదు బంగారు బిస్కెట్లు కనిపించాయి. దీంతో ఆమెను ప్రత్యేక గదికి తీసుకెళ్లి సోదా చేయగా లోదుస్తుల్లో రెండు కిలోల బరువు గల ఇరవై బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. ఆంధ్రా రాజంపేటకు చెందిన లక్ష్మీదేవి (38). రెండేళ్ల క్రితం ఇంటి పనులు చేయడానికి కువైట్ వెళ్లిందని, తిరిగి సొంతూరుకు వస్తున్న విషయం తెలిసి అంతర్జాతీయ బంగారం అక్రమ స్మగ్లర్లు ఆమెకు రూ.20వేలు ఇస్తామని చెప్పి బంగారు బిస్కెట్లు ఇచ్చి పంపినట్లు తెలిసింది. బ్యాగులో ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే వాటికి తగిన మూల్యం చెల్లిస్తామని, లోదుస్తుల్లో ఉన్న బంగారాన్ని మాత్రం వారు చెప్పిన హోటల్‌కు తీసుకువస్తే అక్కడ ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పినట్లు లక్ష్మీదేవి తెలిపింది. అధికారులు ఆమెను విచారణ చేస్తున్నారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్
- 65 తులాల బంగారం స్వాధీనం సారంగాపూర్: ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ పోలీసులు ఓ చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం చించోలి (డీ) గ్రామం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా కనిపించిన ఆడెపు సాగర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో చోరీలు గుట్టు వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇతడు డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించుకు పోయినట్టు తెలిసింది. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసి అతడు ఇచ్చిన సమాచారంతో 65 తులాల బంగారు ఆభరణాలు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్‌లో 3.8 కిలోల బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా విమానశ్రయంలో ఓ వ్యక్తి నుంచి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ సర్వీస్ ఏజెంట్ నుంచి సుమారు 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దొంగ అరెస్ట్: 18 తులాల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్‌లో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శీనయ్య అనే దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 18 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. శీనయ్య బిటెక్ చదివి దొంగతనాలు చేస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 450 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. శనివారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అందులోని ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదరు ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు. -
అలిపిరి వద్ద భారీగా బంగారం పట్టివేత
తిరుపతి: తిరుపతి అలిపిరి టోల్గేట్ వద్ద సోమవారం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బంగారంతో ఉన్న ఓ బ్యాగు వెలుగు చూసింది. భక్తుల బ్యాగులను స్కానింగ్ చేస్తున్న క్రమంలో బంగారం ఉన్నట్టు బయటపడడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెరచి చూడగా భారీ మొత్తంలో బంగారం బయటపడింది. దాన్ని తీసుకొచ్చిన వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బంగారం విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది. -
మళ్లీ అక్కడే... రూ.రెండు కోట్ల బంగారం దొరికింది
చెన్నై : తమిళనాడులోని టుటికోరన్ నౌకాశ్రయంలో మంగళవారం డీఆర్ఐ అధికారులు ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేశారు. నౌకాశ్రయంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్లో బంగారం ఉన్నట్లు ఆగంతకుడి ద్వారా సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు... ఆ దిశగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు పార్సిల్ ఎవరు పంపారు. పార్సిల్ పై గల చిరునామా గురించి డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గత గురువారం ఇదే నౌకాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్ నుంచి 12 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
దొంగలు అరెస్ట్ : 18 తులాల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 తులాల బంగారం, అరకిలో వెండితోపాటు రూ. 2.07 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 350 గ్రాముల బంగారం బయటపడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ మహిళ, బంగారాన్ని తన శరీర భాగాల్లో దాచుకొని తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితురాలు హైదరాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్ స్నాచర్లు అరెస్ట్ : బంగారం స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో ఇటీవల చైన్ స్నాచింగ్‌లు కేసుల భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు. -
శంషాబాద్‌లో రెండున్నర కేజీల బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండున్నర కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దుబాయి నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఏయిర్ ఇండియా విమానంలో డీఆర్ఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో విలువైన బంగారం దొరికినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎవరో గుర్తు తెలియని స్మగ్లర్లు బంగారాన్ని వదిలివెళ్లి ఉంటారని వారు భావిస్తున్నారు. -
దొంగ అరెస్ట్: గోల్డ్ రింగ్స్ స్వాధీనం
హైదరాబాద్ : లంగర్ హౌజ్ ప్రాంతంలోని సంగం టెంపుల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రెండు గోల్డ్ రింగ్స్తోపాటు రూ. 2.61 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
7 కిలోల బంగారం పట్టివేత
చెన్నై: అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో రోజు వారి తనిఖీలలో భాగంగా కొచ్చి నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా వారి బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారం విలువ సుమారు రూ 2.25 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
మూడు కేజీల బంగారం సీజ్
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి మూడు కేజీల బంగారాన్ని బుధవారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరులోని షరాబ్ బజారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి మూడు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ముంబైకి చెందిన నితీష్‌గా గుర్తించారు. అతడు స్థానిక బంగారు నగల వ్యాపారులతో జీరో బిజినెస్ చేస్తాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో 350 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లగేజీలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారాన్ని సీజ్ చేసి... ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కిలోన్నర బంగారం స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ లగేజీలో అధిక మొత్తంలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో సదరు లగేజీ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకీ తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. -
షూలో మూడు కిలోల బంగారం..
శంషాబాద్(హైదరాబాద్): బూట్లలో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం అర్ధరాత్రి దుబాయి నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు అతడిని పూర్తిగా తనిఖీ చేశారు. అతడు వేసుకున్న షూ లోపలి భాగంలో మూడు కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కిలోన్నర బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రయాణికుల లగేజీలలో కిలోన్నర బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. -
ఎయిర్ పోర్ట్‌లో రూ. కోటి బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం దోహా నుంచి చెన్నై వచ్చిన సిరాజ్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
టేబుల్ ఫ్యాన్‌లో 'బంగారం'
హైదరాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడికి చెందిన టేబుల్ ఫ్యాన్ చాలా బరువు ఉండటంతో కస్టమ్స్ అధికారులు సందేహించి ... క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులోభాగంగా ఫ్యాన్ కింద భాగంలో భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో 2.7 కిలోల బంగారం బిస్కెట్లు పట్టివేత
హైదరాబాద్ :: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం బ్యాంకాక్, కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి లగేజీలో భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. దాంతో సదరు ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లు 2.7 కేజీలు ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
కారులో తరలిస్తున్న 5.30 కేజీల బంగారం పట్టివేత
మిర్యాలగూడ : కారులో అక్రమంగా తరలిస్తున్న 5.30 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పోలీసులు పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అక్రమంగా(బిల్లులు లేకుండా) తరలిస్తున్న 5.30 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకొని, కారు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. కాగా, నిందితుడు విజయవాడకు చెందిన బంగారం హోల్‌సేల్ వ్యాపారి సూరిబాబుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర నుండి శనివారం అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓవైపు కస్టమ్స్ అధికారులు బంగారం పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నా మరోవైపు విదేశాల నుంచి బంగారం తరలి వస్తూనే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. -
విశాఖ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో 4 కేజీల బంగారు ఆభరణాలతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు శనివారం రాత్రి వచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా గుట్టురట్టయింది. సదురు వ్యక్తిని శంషాబద్ విమానాశ్రయంలో నిఘావర్గాలు ముందుగానే అనుమానించినా అప్పటికే విమానం కదిలిపోవడంతో అక్కడి అధికారులు విశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో విశాఖ విమానాశ్రయంలో అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా బాత్రూంలో రూ. 1.2 కోట్లు విలువచేసే 4 కేజీల బంగారం బయటపడింది. అనంతరం అధికారులు నిందితుడిని హైదరాబాద్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డెరైక్టరేట్ (డీఆర్ఐ)కు అప్పగించినట్లు సమాచారం. -
దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల అరెస్ట్
హైదరాబాద్: దుబాయి నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 3.3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున దుబాయి ఎయిర్ లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సదరు మహిళల లగేజీలో 3.3 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్లో రూ. కోటి ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
లోదుస్తుల్లో 2 కేజీల బంగారం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయూబ్ అనే ప్రయాణికుడు లోదుస్తుల్లో బిస్కెట్లు తీసుకువస్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టుపడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఆయూబ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైల్వేస్టేషన్లో 4.3 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్: కొనుగోలుకు సంబంధించిన బిల్లులు లేకుండా రైలులో పెద్దమొత్తంలో బంగారం తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రోజు మాదిరిగానే ప్రయాణికుల లగేజీలను రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా వరంగల్‌కు చెందిన గడ్డం రాజు (35) అనే ప్రయాణికుడి సంచిలో 4.3 కిలోల బంగారు కడ్డీలు, ఆభరణాలు బయట పడ్డాయి. వీటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. -
మహిళనుంచి నాలుగున్నర కేజీల బంగారం స్వాధీనం
చెన్నై: సింగపూర్ నుంచి విమానంలో చెన్నై వచ్చిన ఓ మహిళను ఎయిర్‌పోర్టు అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన ఆమె వద్ద వస్తువులను తనిఖీ చేశారు. ఆమె వద్ద నుంచి నాలుగున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
చైన్ స్నాచర్ల నుంచి 6 కిలోల బంగారం స్వాధీనం
రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస పెట్టి చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద 6.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబా, మీర్జా అజ్మద్ అలీబేగ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై ఇప్పటికి 220 కేసులున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వీరిద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబాపై ఇప్పటికి 106 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగులో ఉన్నాయని పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. -
నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు బుధవారం నగరానికి చెందిన 14 మంది ప్రయాణికుల నుంచి 4.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 1.2 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి పేర్లను వెల్లడించలేదు. -
ఇద్దరు అరెస్ట్ : 3 కేజీల బంగారం స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 18 లక్షల నగదుతోపాటు మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బంగారాన్ని అసలు బంగారం అంటూ సదరు వ్యక్తులు బంగారు దుకాణ దారుడిని మోసగించబోయారు. ఆ విషయాన్ని కనిపెట్టిన దుకాణదారుడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారం పట్టివేత
కర్నూలు: కర్నూలు నగరంలో అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవా కారును సీజ్ చేశారు. ముంగళవారం కర్నూలులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఇన్నోవా కారులో భారీగా బంగారం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. బంగారం గురించి వాహనదారులను ప్రశ్నించగా... వారు పొంతనలేని సమాధానాలు తెలిపారు. దీంతో పోలీసులు బంగారాన్ని సీజ్ చేసి ... వారిని స్టేషన్‌కు తరలించారు. బంగారంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. బెంగళూరు నుంచి వారంత కర్నూలు వస్తున్నారని పోలీసులు తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక దంపతుల నుంచి కిలోన్నర బంగారం, 8 ఐఫోన్లతోపాటు 10 ల్యాప్‌టాప్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం... సింగపూర్ నుంచి ఆ దేశ ఎయిర్‌లైన్స్ విమానంలో నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజీలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సదరు దంపతుల లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆ లేగేజీలోని ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో వాటీని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ దంపతులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
2.3 కేజీల బంగారం పట్టివేత
-
శంషాబాద్‌లో 2.3 కేజీల బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 2.3 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా ఈ బంగారం పట్టుబడింది. ఓవైపు అధికారులు బంగారాన్ని పట్టుకుంటున్నా, మరోవైపు ప్రయాణికులు మాత్రం అక్రమంగా పసిడిని తరలించటం విశేషం. -
బెల్ట్‌లో 1.3 కోట్ల బంగారం
తిరువొత్తియూరు: చెన్నై విమానాశ్రయంలో 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ విమానంలో నగరానికి చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రయాణికుల్లో ఒకరైన రాయపేటకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తన నడుముకు కట్టుకున్న బెల్టులో 14 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
ప్రయాణికుడి నుంచి కిలో బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారం కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి నగరానికి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తనిఖీలలో గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడు బుధవారం నగరానికి చేరుకున్నాడు. అతడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో భారీగా బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ప్రయాణికుడి నుంచి బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 650 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా ఈ బంగారం పట్టుబడింది. నిన్న ఓ ప్రయాణికుడి నుంచి కూడా పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు అధికారులు పట్టుకుంటున్నా, మరోవైపు ప్రయాణికులు మాత్రం అక్రమంగా బంగారాన్ని తరలించటం విశేషం. -
5.9 లక్షల విలువైన బంగారం పట్టివేత
తిరువొత్తియూరు: సింగపూర్ నుంచి తిరుచ్చికి విమానంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు. సింగపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరుచ్చికి వచ్చింది. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ ల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద 250 గ్రాము ల బరువు కలిగిన ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ. 5.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో బంగారం తరలించిన వ్యక్తులు మదురై జిల్లా మేలూరు కొట్టాం పట్టికి చెందిన సెంథిల్, రత్నం అని తెలిసింది. -
ఎయిర్‌పోర్ట్‌లో 1.25 కిలోల బంగారం పట్టివేత
చెన్నై : దోహా నుంచి నగరానికి వచ్చిన ఇస్మాయిల్ అనే ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం ఉదయం దోహా నుంచి చెన్నై నగరానికి విమానం చేరుకుంది. ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ లగేజీలో భారీగా బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం 1.25 కిలోలని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
ఎయిర్ పోర్ట్‌లో 5 కిలోల బంగారం స్వాధీనం
టీనగర్: దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కర్ణాటక యువకుడిని అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు సెంట్రల్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సమాచారం అందింది. అధికారులు సోమవారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని దుబాయ్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలపై ప్రత్యేక నిఘా పన్నారు. ఇలావుండగా సోమవారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో దుబాయ్ నుంచి ఒక విమానం చెన్నై చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన విపుల్ అబ్దుల్ (30) దుబాయ్‌కు టూరిస్టు వీసాలో వెళ్లివచ్చినట్లు తెలిసింది. అతని వద్దనున్న సూట్‌కేస్‌లో తనిఖీ చేయగా అందులోనున్న రహస్య గదిలో 10 బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఐదు కిలోల బరువు కలిగిన ఈ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1.5 కోట్ల రూపాయిలు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విపుల్ అబ్దుల్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద ప్రత్యేక విచారణ జరుపగా అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. -
మరోసారి పట్టుబడిన బంగారం
-
మరోసారి పట్టుబడిన బంగారం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి 500 గ్రామల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. తనిఖీల్లో భాగంగా సింగపూర్ నుంచి వచ్చిన అశోక్ లాల్ అనే వ్యక్తి నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రయం అక్రమంగా బంగారం రవాణా చేసే అడ్డాగా మారిపోయింది. స్మగ్లర్లు బంగారాన్ని విదేశాల నుంచి తీసుకు వచ్చేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఓవైపు కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో పట్టుబడుతున్నా...మరోవైపు అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. -
వృద్ధురాలి నుంచి రెండున్నర కిలోల బంగారం స్వాధీనం
చెన్నై: మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని తరలిస్తున్న అరవై ఏళ్ల మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి సోమవారం తెల్లవారుజామున చెన్నైకు ఓ విమానం చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఓ మహిళ హాండ్‌బ్యాగ్‌ను, సూట్‌కేసును తనిఖీలు చేయగా ఏమీ లభించలేదు. అయితే ఆమె ధరించిన దుస్తుల పట్ల అధికారులకు అనుమానం వేసింది. ఆమెను ప్రత్యేక గదికి తీసుకువెళ్లి మహిళా అధికారులు తనిఖీలు జరపగా లోదుస్తుల్లో బంగారాన్ని దాచినట్లు తెలిసింది. ఆమె వద్ద జరిపిన విచారణలో దిరేష్ సెల్వరాణి (60) అని, విరుదునగర్‌కు చెందినదని తెలిసింది. ఆమె వద్ద రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ అంతర్జాతీయ స్థాయిలో రూ.85 లక్షలు. దిరేష్ సెల్వరాణిని అధికారులు అరెస్టు చేశారు. ఈమెకు స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విదేశాల నుంచి 60 ఏళ్ల మహిళ బంగారాన్ని అక్రమంగా తరలించడం విమానాశ్రయంలో సంచలనం కలిగించింది. -
ఎయిర్‌పోర్ట్‌లో 120 సవర్ల బంగారం స్వాధీనం
బ్యాంకాక్ నుంచి అనుమతి లేకుండా తీసుకువచ్చిన 120 సవర్ల బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక మహిళ వద్ద విచారణ జరుపుతున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు చెన్నై చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. మియన్మార్‌కు చెందిన రెజినా మరియం (44) అనే మహిళ టూరిస్టు వద్ద తనిఖీ చేయగా ఆమె వద్ద 120 సవర్ల కొత్త బంగారు నగలున్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ. 30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను విచారిస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం
-
ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దుబాయి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రయాణికుడి నుంచి అరకేజీ బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దుబాయి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో అరకేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
చెన్నై ఎయిర్‌పోర్టులో 7.5 కేజీల బంగారం సీజ్
చెన్నై : విమానాశ్రయాలు అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి.ఈసారి సీన్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై విమానాశ్రయానికి మారింది. చెన్నై విమానాశ్రయంలో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ముగ్గురు వ్యక్తుల నుంచి 7.5 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వీరు కోల్‌కతాకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్టులోని ఓ టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో బంగారాన్నిఅధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. తరచూ కిలోల కొద్దీ బంగారాన్ని పట్టుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. కొత్త కొత్త పద్ధతుల్లో వారు బంగారాన్ని తరలిస్తున్నారు. -
నాలుగు కేజీల బంగారం స్వాధీనం
-
నాలుగు కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పంట పండుతోంది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రోజుకో ముఠా పట్టుబడుతోంది. తాజాగా మరో నాలుగు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా దుబాయి, మలేషియా, బ్యాంకాక్, థాయ్‌లాండ్, సింగపూర్, లండన్, అమెరికా దేశాల నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా దేశానికి తరలిస్తున్నాయి. వీటిలో కొన్ని ముఠాలు అధికారుల తనిఖీల్లో దొరికిపోతున్నాయి. కస్టమ్స్ సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి బంగారాన్ని రవాణా చేస్తే దేశ మార్కెట్లో కిలోకు రూ.5 లక్షల వరకు వీరికి గిట్టుబాటవుతుందని ఓ అంచనా. అలాగే బంగారాన్ని తెచ్చి ఇక్కడి వ్యాపారులకు అందజేస్తే రూ.50 నుంచి 60 వేల వరకు కమీషన్ దొరుకుతుందని సమాచారం. దీంతో స్మగ్లర్లు అధికారుల కంటపడకుండా బంగారాన్ని తీసుకొచ్చేందుకు కొత్త పంథాలను అనుసరిస్తున్నారు. ఇటీవలే కొందరు పాప్‌కార్న్ యంత్రం, లోదుస్తుల్లో, బ్యాగు హ్యాండిల్, బ్యాగుల డిజైనింగ్ తీగలు, సెల్‌ఫోన్ కవర్లలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిపోతున్నారు. -
ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మంగళవారం 1.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్న క్రమంలో... సదరు ప్రయాణికుల లగేజీలో ఆ బంగారాన్ని కనుగొన్నారు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
రూ. 4.5 కోట్లు... డాన్సర్ కోసం గాలింపు
ఇంటిలో రూ.4.5 కోట్లు దాచి ఉంచిన కరగ డాన్సర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు ఇంటికి సీల్ వేసి బంధువుల వద్ద విచారణ జరుపుతున్నా రు. కాట్పాడి సమీపంలోని తారాపడవేడులోని కరగ డాన్సర్ మోహనాంబాల్ ఇంటిలో ఈనెల 25వ తేదీన పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. 4.5 కోట్ల నగదు, 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్న విష యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మోహనాంబల్ సెల్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉండడంతో ఆమె అక్క కుమారుడు శరవణన్, మోహనాంబల్ అద్దెకు ఉన్న భవన యజమాని, మరో కరగ డాన్సర్ జమున కోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. వీరు పరారీలో ఉండడంతో శరవణన్ భార్య దేవీబాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నా రు. పోలీసుల విచారణలో మోహనాంబాల్, శరవణన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వారి ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ ఎర్రచందనం వ్యాపారుల వద్ద నగదు, బంగారాన్ని తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆ డ్యాన్సర్ ఇల్లు.. కోట్ల రూపాయలకు నెలవు!!
-
డాన్సర్ ఇంట్లో ...గోనె సంచుల్లో నోట్ల కట్టలు
చెన్నై : ఓ డాన్సర్ ఇంట్లో పెద్ద ఎత్తున దొరికిన నగదు స్థానికంగా సంచలనం సృష్టించింది. రూ.4 కోట్ల నగదుతోపాటు, 70 సవర్ల బంగారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని గోవిందరాజ మొదలియార్ వీధికి చెందిన జమున ఇంట్లో మోహనాం బాల్ అనే డాన్సర్ అద్దెకు ఉంటోంది. ఈమె ఇంట్లో నగదు కట్టలు కట్టలుగా ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దాంతో కాట్పాడి పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మోహనాంబాల్ అద్దెకు ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు. అయితే అప్పటికే మోహనాంబాల్ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయింది. దాంతో పోలీసులు ఇంటి యజమాని జమున సహకారం కోరారు. ఆమె అంగీకారంతో పోలీసులు మోహనాంబాల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గోనె సంచుల్లో ఉన్న నోట్ల కట్టలను గుర్తించారు. సోదాల్లో బంగారు నగలతోపాటు నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విలేకర్లతో మాట్లాడుతూ డాన్సర్ నివాసంలో రూ.4 కోట్ల, 4 లక్షల, 73,500 రూపాయలుతోపాటు 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా డాన్సర్ ఇంట్లో ఇంత నగదు, బంగారం ఎలా వచ్చింది.. ఎవరైనా ఇక్కడ దాచి ఉంచారా? దొంగలతో డాన్సర్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు మోహనాం బాల్ సెల్ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ రావటంతో పోలీసులు నగదుపై లోతుగా ఆరా తీస్తున్నారు. కాగా మోహనాం బాల్ తగిన ఆధారాలు చూపిస్తే నగదు, బంగారాన్ని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. సాధారణ డాన్సర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉండడం స్థానికంగా పలువురిని ఆశ్చర్యపరిచింది. -
అరకిలో బంగారం, రెండు కిలోల వెండి స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో బంగారం ఇంకా దొరుకుతూనే ఉంది. బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు తరలిస్తున్న బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని తానామిట్ట చెక్‌పోస్టు వద్ద పోలీసులు బుధవారం తెల్లవారుజామున తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కారులో తరలిస్తున్న అరకిలో బంగారం, రెండు కిలోల వెండిని వారు గుర్తించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ప్రాంతానికి ఈ బంగారం, వెండిని ఎలాంటి బిల్లులు లేకుండా తెస్ఉతున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్‌పోర్టులో రెండున్నర కిలోల బంగారం స్వాధీనం
-
బురఖాలో బంగారపు బిస్కెట్లు
దుబాయి నుంచి మూడు కిలోల బంగారాన్ని అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన ఫాతిమా సాహిన్ అనే మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ఆ బంగారాన్నీ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం ఉదయం దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికురాలు ఫాతిమాను కస్టమ్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీలు చేస్తున్న క్రమంలో ఆమె బురఖాలోని వివిధ ప్రదేశాలలో బంగారపు బిస్కెట్లు పెట్టి కుట్టివేసినట్లు గుర్తించారు. ఆ బంగారు బిస్కేట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం బిస్కెట్లు మూడు కిలోల బంగారం వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫాతిమా సాహిన్ పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. ఫాతిమా స్వస్థలం హైదరాబాద్ అని చెప్పినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం
-
ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
-
విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత
స్పీకర్లు, టాల్కం పౌడర్ డబ్బాల్లో తీసుకొచ్చిన నిందితులు శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ నజీర్, హైదరాబాద్ వాసి గులాంజిలానీ శుక్రవారం ఉదయం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈకే 526 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నజీర్ కారుకు ఉపయోగించే నాలుగు స్పీకర్లు, జిలానీ మూడు టాల్కమ్ పౌడర్ డబ్బాలు తీసుకొచ్చాడు. వీరి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు అదుపులోకి తీసుకొని పరిశీలించారు. స్పీకర్లతో పాటు పౌడర్ డబ్బాలో ఉన్న సుమారు రూ. 43లక్షలు విలువ చేసే 1.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
శంషాబాద్‌లో మరో ఐదున్నర కిలోల బంగారం!
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం దొరికింది. హైదరాబాద్ కొత్తపేట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు సింగపూర్ నుంచి వస్తూ ఐదున్నర కిలోల బంగారం బిస్కట్లు తెస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చే విమానంలో రాత్రి 12.30 గంటల ప్రాంతంలో వీళ్లు దిగారు. విజిటింగ్ వీసాపై మూడు రోజుల క్రితమే సింగపూర్ వెళ్లిన ఈ ముగ్గురూ కేవలం బంగారం తేవడానికే వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిపై కేసు నమోదుచేసి జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. విదేశాల నుంచి తెల్లవారుజామున వస్తున్న ప్రయాణికులు ఏదోరకంగా బంగారాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయం కావడంతో ఎలాగోలా తప్పించుకుని వెళ్లిపోవచ్చన్నది వీరి భావనగా కనిపిస్తోంది. మంగళవారమే ఆరు కిలోల బంగారం పట్టుకున్న అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో దాదాపు ప్రతిరోజూ ఎంతోకొంత బంగారం దొరుకుతూనే ఉంది. -
అడ్డాకుల వద్ద బంగారం, వెండి పట్టివేత
మహబూబ్‌నగర్: ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద వాహనాల తనిఖీల్లో బంగారం, వెండి బయటపడింది. ఈ సందర్భంగా 834 గ్రాముల బంగారం, 8,378 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భారీగా నగదు,మద్యం,బంగారం స్వాధీనం
-
పాతబస్తీలో కట్టలుగా డబ్బు.. కిలోల కొద్దీ బంగారం
పాతబస్తీలో కట్టలు కట్టలుగా డబ్బులు, కిలోల కొద్దీ బంగారం బయటపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత కొన్ని రోజులుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానమైన ప్రాంతాలన్నింటిలోనూ భారీగా బలగాలను మోహరించి ప్రతి ఒక్క వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లోనే మహా అయితే ఒక్కో సోదాలో 13 లక్షలు, 15 లక్షలు బయటపడుతుంటే, పాతబస్తీలో దొరుకుతున్న సొమ్ము చూస్తే మాత్రం పోలీసులే కళ్లు తేలేస్తున్నారు. నిన్న కాక మొన్న.. ఒక వాహనంలో రెండు కోట్ల రూపాయల నగదును పోలీసులు పాతబస్తీలోని టప్పాచబుత్రా పోలీసుస్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం నిర్వహించిన తనిఖీలలో రెండు కిలోల బంగారం కూడా స్వాధీనం అయ్యింది. అలాగే పాతబస్తీలోనే గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు నుంచి 36 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా భారీ మొత్తంలో నగదు, బంగారం పాతబస్తీలో బయటపడుతూ చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. -
కేరళవాసి నుంచి 1.9 కిలోల బంగారం స్వాధీనం
ఖతార్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి వద్ద నుంచి 1.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఖతార్ నుంచి నగరానికి చేరుకున్న ఆ ప్రయాణికుడి లగేజిని తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులోభాగంగా తన పేరు మహ్మద్ అలిఫా అని, తన స్వస్థలం కేరళ అని కస్టమ్స్ అధికారులకు ప్రయాణికుడు వెల్లడించాడు. -
10 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం
నెల్లూరు: ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేకుండా తీసుకెళుతున్న డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్ర్లవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరికింది. నెల్లూరు జిల్లా కోవూరు ఇనమడుగు చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో 10 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ఒంగోలు తీసుకెళ్తుండగా వీటిని పట్టుకున్నారు. * నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్ వద్ద పోలీసులు తనిఖీలు జరిపి రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. * ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి క్రాస్‌రోడ్స్ వద్ద తనీఖీలు, కారు నుంచి రూ. 33 లక్షలు స్వాధీనం * పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద తనిఖీలు, కారు నుంచి రూ.4.12 లక్షలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్ * గుంటూరు జిల్లా సత్తెనపల్లి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు, కారు నుంచి రూ.21 లక్షలు స్వాధీనం -
ఎయిర్‌పోర్ట్‌లో దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం
-
దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం కిలోలకు కిలోలు పట్టుబడుతోంది. తాజాగా బ్యాంకాంక్ నుంచి హైదరాబాద్ వచ్చిన దంపతుల నుంచి 3.9 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 20 కిలోల బంగారం పట్టుబడింది. అరబ్ దేశాల్లో బంగారం ధర , టాక్స్‌లు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి బంగారాన్ని తీసుకువస్తున్నారు. కొంతమంది స్మగ్లర్లు బూట్లలో, అండర్వేర్లలో పెట్టుకుని తీసుకు వచ్చినా.. స్కానర్స్ వద్దకు వచ్చే సరికి అడ్డంగా దొరికి పోతున్నారు.