
డాన్సర్ ఇంటికి సీల్ వెస్తున్న పోలీసు అధికారులు
ఇంటిలో రూ.4.5 కోట్లు దాచి ఉంచిన కరగ డాన్సర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు ఇంటికి సీల్ వేసి బంధువుల వద్ద విచారణ జరుపుతున్నా రు. కాట్పాడి సమీపంలోని తారాపడవేడులోని కరగ డాన్సర్ మోహనాంబాల్ ఇంటిలో ఈనెల 25వ తేదీన పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. 4.5 కోట్ల నగదు, 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్న విష యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మోహనాంబల్ సెల్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉండడంతో ఆమె అక్క కుమారుడు శరవణన్, మోహనాంబల్ అద్దెకు ఉన్న భవన యజమాని, మరో కరగ డాన్సర్ జమున కోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు.
వీరు పరారీలో ఉండడంతో శరవణన్ భార్య దేవీబాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నా రు. పోలీసుల విచారణలో మోహనాంబాల్, శరవణన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వారి ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ ఎర్రచందనం వ్యాపారుల వద్ద నగదు, బంగారాన్ని తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.