cheinna
-
నటి మీరామిథున్ కన్నీరు మున్నీరు
చెన్నై : అందాల పోటీలు రద్దు కావడంతో కార్యక్రమ నిర్వాహకురాలు నటి మిరామిథున్ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...‘ 8 తోటాగళ్’ చిత్ర నాయకి మీరామిథున్ 2016 ఏడాది మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని గెలుచుకోవడంతో....తనే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. దీంతో తనకు మిస్ సౌత్ ఇండియా పట్టాన్ని అందించిన నిర్వాహకులు ఆమెను పోటీలు నిర్వహించరాదని హెచ్చరించారు. అంతే కాకుండా తాము ఆమెకి అందించిన మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని తిరిగి తీసేసుకుని, ఆ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన నటి సనంశెట్టికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పట్టాని నటి మీరామిథున్ ఉపయోగించుకోరాదని హెచ్చరించారు. దీంతో వారిపై ఇటీవల నటి మీరా మిథున్ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాను నిర్వహించనున్న అందాల పోటీల కార్యక్రమానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పోలీసులు రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చినట్లు మీడియాతో పేర్కొన్న నటి మీరామిథున్ సోమవారం తాను నిర్ణయించినట్లుగా స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటళ్లో అందాల పోటీల ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. అలాంటిది అందాల పోటీలు జరగలేదు. ఈ విషయమై నటి మీరామిథున్ స్థానిక మైలాపూర్‌లో మీడియాతో తన గోడును వెల్లబోసుకున్నారు. తాను రెండు రోజులుగా రేయింబవళ్లు కష్టపడి అందాల పోటీలకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నానని.. పోటీల్లో పాల్గొనడానికి 11 మంది మోడల్స్ సిద్ధం అయ్యారని చెప్పారు. సోమవారం ఉదయం ఆర్గనైజర్లకు ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దీంతో తానే స్వయంగా వెళ్లి వారిని కలవగా అందాల పోటీలను నిర్వహించరాదని చెప్పారన్నారు. అంతేగాకుండా ఇద్దరు పోలీసులతో హోటల్‌కు వచ్చి తనను బెదిరించారని కంటతడి పెట్టారు. త్వరలో మళ్లీ అందాల పోటీలు నిర్వహించి తీరుతానని అన్నారు. -
రూ. 4.5 కోట్లు... డాన్సర్ కోసం గాలింపు
ఇంటిలో రూ.4.5 కోట్లు దాచి ఉంచిన కరగ డాన్సర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు ఇంటికి సీల్ వేసి బంధువుల వద్ద విచారణ జరుపుతున్నా రు. కాట్పాడి సమీపంలోని తారాపడవేడులోని కరగ డాన్సర్ మోహనాంబాల్ ఇంటిలో ఈనెల 25వ తేదీన పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. 4.5 కోట్ల నగదు, 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్న విష యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మోహనాంబల్ సెల్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉండడంతో ఆమె అక్క కుమారుడు శరవణన్, మోహనాంబల్ అద్దెకు ఉన్న భవన యజమాని, మరో కరగ డాన్సర్ జమున కోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. వీరు పరారీలో ఉండడంతో శరవణన్ భార్య దేవీబాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నా రు. పోలీసుల విచారణలో మోహనాంబాల్, శరవణన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వారి ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ ఎర్రచందనం వ్యాపారుల వద్ద నగదు, బంగారాన్ని తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆ డ్యాన్సర్ ఇల్లు.. కోట్ల రూపాయలకు నెలవు!!
-
డాన్సర్ ఇంట్లో ...గోనె సంచుల్లో నోట్ల కట్టలు
చెన్నై : ఓ డాన్సర్ ఇంట్లో పెద్ద ఎత్తున దొరికిన నగదు స్థానికంగా సంచలనం సృష్టించింది. రూ.4 కోట్ల నగదుతోపాటు, 70 సవర్ల బంగారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని గోవిందరాజ మొదలియార్ వీధికి చెందిన జమున ఇంట్లో మోహనాం బాల్ అనే డాన్సర్ అద్దెకు ఉంటోంది. ఈమె ఇంట్లో నగదు కట్టలు కట్టలుగా ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దాంతో కాట్పాడి పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మోహనాంబాల్ అద్దెకు ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు. అయితే అప్పటికే మోహనాంబాల్ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయింది. దాంతో పోలీసులు ఇంటి యజమాని జమున సహకారం కోరారు. ఆమె అంగీకారంతో పోలీసులు మోహనాంబాల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గోనె సంచుల్లో ఉన్న నోట్ల కట్టలను గుర్తించారు. సోదాల్లో బంగారు నగలతోపాటు నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విలేకర్లతో మాట్లాడుతూ డాన్సర్ నివాసంలో రూ.4 కోట్ల, 4 లక్షల, 73,500 రూపాయలుతోపాటు 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా డాన్సర్ ఇంట్లో ఇంత నగదు, బంగారం ఎలా వచ్చింది.. ఎవరైనా ఇక్కడ దాచి ఉంచారా? దొంగలతో డాన్సర్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు మోహనాం బాల్ సెల్ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ రావటంతో పోలీసులు నగదుపై లోతుగా ఆరా తీస్తున్నారు. కాగా మోహనాం బాల్ తగిన ఆధారాలు చూపిస్తే నగదు, బంగారాన్ని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. సాధారణ డాన్సర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉండడం స్థానికంగా పలువురిని ఆశ్చర్యపరిచింది.