dancer
-
అభినయ శోభన
మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది. ఆమె విశేషాలు మీ కోసం..⇒ శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్కోర్ సిస్టర్స్’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు.⇒ ‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ⇒ ‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.⇒ చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.⇒ శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.⇒ శోభనకు థాయ్, చైనీస్ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్ ఆమ్లెట్ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన -
నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!
శాస్త్రీయ నృత్యానికి అమితమైన ఆరాధకురాలు రామా వైద్యనాథన్. ఢిల్లీ వాసి అయిన ఈ నృత్యకారిణి భారతీయ శాస్త్రీయ కళా ప్రపంచంలో ట్రెండ్‌సెటర్‌గా నిలిచిన కళాకారులలో ఒకరు. రామా వైద్యనాథన్ గురువు సరోజ్ వైద్యనాథన్. ‘నా నుదుటిరాతలోనే నాట్యం రాసి ఉంది..’ అంటారు ఈ నృత్యకారిణి. యామినీ కృష్ణమూర్తి వేదికపైన నృత్యాన్ని ప్రదర్శిస్తుంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడే అమితంగా స్పందించేదానినట అని గర్వంగా చెబుతారు ఈ నృత్యకారిణి. ఈ మాటలతో నాట్యంపై ఉండే మక్కువను మన కళ్లకు కడతారు. రామా వైద్యనాథన్ తల్లికి నృత్యం అంటే ఎంతో మక్కువగా ఉండేది. బాల్యంలో వేసే రామా తొలి అడుగులే నృత్యపు అడుగులుగా మారాయి. తల్లే తన తొలి గురువుగా నృత్య అడుగులను ప్రారంభించింది. అలా ఆమె తన మొదటి మాటలను ఉచ్చరించకముందే గురువు ఎంపిక జరిగింది. తల్లి మార్గదర్శకత్వంలో రామా భరత నాట్య ప్రయాణాన్ని ్ర΄ారంభించింది. అలా డ్యాన్స్ స్టూడియో ఆమెకు రెండవ ఇల్లుగా మారింది. తన నైపుణ్యంతో తల్లి రామాను అద్భుతమైన నర్తకిగా తీర్చిదిద్దింది. ఎదిరిస్తూ నిలుస్తూ..పశ్చిమ ఢిల్లీలో నివసిస్తూ, డ్యాన్స్ క్లాసుల కోసం సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురికి చేరుకోవడం అంటే సంక్లిష్టమైన ప్రయాణాన్ని కొనసాగించడమే. ఆ రోజుల్లో వాహన సదుపియం లేకపోవడంతో రామ, ఆమె తల్లి ప్రతి రోజూ సవాల్‌ను ఎదుర్కొనేవారు. ఇంటి నుంచి నృత్య అకాడమీకి చేరుకోవడానికి రోజూ రెండు మూడు బస్సులు, రిక్షాలు మారుతూ ప్రయాణించేవారు. యువ నర్తకిగా రామా ప్రదర్శనలు సంప్రదాయం, ఆవిష్కరణల సామరస్య సమ్మేళనానికి నిదర్శనగా మారాయి. సామాజిక కుల అడ్డంకులను తొలగించిన నృత్యకారిణిగా కూడా రామా తన విశిష్టతను ప్రదర్శించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నృత్యం, కులం అడ్డంకులుగా నిలిచాయి. నర్తకితో తన కుమారుడి వివాహం కుల హద్దులు దాటిందని అత్తగారు, ఆమె బంధుగణం అడ్డంకిగా నిలిచింది. ఆమె దృష్టిలో నృత్యం దైవిక భాష. కళాకారులందరిదీ ఒకే ’కులం’గా ఐక్యపరిచింది. సామాజిక అడ్డంకులను ఎదిరించడంలోనే కాదు, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తూ భారతీయ ప్రముఖ నృత్యకారిణిగా నిలిచింది. --రామా వైద్యనాథన్(చదవండి: రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!) -
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్‌తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
ప్రియుడితో నటి నిశ్చితార్థం, పెళ్లెప్పుడంటే?
కన్నడ బుల్లితెర నటి మాన్సీ జోషి శుభవార్త చెప్పింది. త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రియుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది. ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో పారు, రాధా రమణ వంటి సీరియల్స్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) -
నృత్య ప్రపంచంలో ఆమె ఓ అద్భుత శిఖరం..! ఏకంగా రాజ్యసభ..
పద్దెనిమిదేళ్ళ వయసులో ఇంటి నుంచి పారిపోయి ప్రపంచ స్థాయిని అందుకున్న భరతనాట్య నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్ ఓ అద్భుత శిఖరం. ఆమె ఎనిమిది పదుల జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారత శాస్త్రీయ నృత్య ప్రపంచంలో సోనాల్ మాన్ సింగ్ పేరు మాత్రమే కాదు ఆమె ధిక్కరణ, ధైర్యం, అభిరుచికి నిలువెత్తు చిహ్నం. చిన్న నాటి నుంచి ఆమె నృత్యం కేవలం ప్రదర్శనగా మాత్రమే ఉండాలనుకోలేదు. నృత్యం ద్వారా జీవితానికి నిజమైన అర్థాన్ని కనుక్కోవాలనుకుంది. ఆధ్యాత్మిక ప్రయాణం, సామాజిక నిబంధనలను సవాల్ చేయడానికి నృత్యం ఒక మార్గంగా భావించింది. ‘‘నాకు 15, 20, 50, 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ప్రదర్శనలు ఇస్తున్నాను అని చెప్పేదాన్ని. కానీ డ్యాన్స్ నాకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారింది‘ అని 80 ఏళ్ల ఈ భారత శాస్త్రీయ నృత్యకారిణి, భరతనాట్యం, ఒడిస్సీ నృత్య గురువు సోనాల్ మాన్సింగ్ వివరిస్తారు. పద్మ భూషణ్ (1992), పద్మ విభూషణ్ (2003) గ్రహీత, పార్లమెంటు, రాజ్యసభ సభ్యురాలు కావడానికి నామినేట్ అయిన సోనాల్ ప్రతి నృత్య అడుగు మనకు ఓ పాఠంగా అవుతుంది.‘కృష్ణ’ ప్రదర్శన మాత్రమే కాదుడ్యాన్స్ క్లాస్ అంటే నాకు ప్రాణం. అందుకే డ్యాన్స్‌తోపాటు వృత్తిని కొనసాగించమని అడిగితే ఇంటి నుంచి పారిపోయి, బెంగళూరుకు వెళ్లి, అక్కడ నాట్య గురువుల ఇంట్లో ఆశ్రయం పొందాను. ప్రొఫెసర్ యు.ఎస్.కృష్ణారావు, చంద్రభాగ దేవిల వద్ద శిక్షణ పొందాను. ఇటీవల ఇండియా హాబిటాట్ సెంటర్లో ’కృష్ణ’ అనే నాట్య కథను ప్రదర్శించాను. దీని గురించి ఎందుకు చెబుతునాన్ననంటే ఈ ఆలోచన నా చిన్నప్పటి నుంచి ఉండేది. చదివిన సాహిత్యం.. ముఖ్యంగా మన పురాణాలు, మహాభారతం నుంచి వచ్చింది. ’కృష్ణ’ అన్నింటి మిశ్రమం.ప్రమాదం జరిగినా ఎదురీతే! చిన్ననాటిఋ నుంచి వేషం వేసుకుని దరువులకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టేదాన్ని. నాలుగేళ్ల వయసులో క్లాసికల్ మణిపురి డ్యాన్స్ కాస్ట్యూమ్ ధరించి డ్యాన్స్ చేశాను. భరతనాట్యం ప్రశాంతతను ఇచ్చేది. 1974లో జర్మనీలో కారు ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయి. ఇకపై డ్యాన్స్ చేయలేనని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ, పట్టువదలలేదు. ఫిజియోథెరపీ సెషన్ల తర్వాత ఏడాదిలోనే ప్రదర్శన ఇచ్చాను. డ్యాన్స్ నుంచి మాత్రమే శక్తిని పొందుతాను. నా జీవితంలో నేను ఎప్పుడూ డిప్రెషన్ గా భావించలేదు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.స్త్రీత్వం గురించి గర్వంఒంటరిగా ఉన్న అమ్మాయి తన ఇంటిని వదిలిపెట్టి నృత్యాన్ని నమ్ముకొని, ప్రదర్శనలూ ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటే ఎవరూ నమ్మరు. క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడూ స్త్రీత్వానికి సంబంధించినది. పురుషులు ఎప్పుడూ ఉపాధ్యాయులు, మహిళలు నృత్యకారులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పురుషులు ప్రదర్శనలు ఇవ్వడానికి వస్తున్నారు. వారేం చేసినా నృత్యంలో స్త్రీలే రాజ్యమేలారు. అందుకే నా నృత్యాల్లో ‘పంచకన్య’, ’ద్రౌపది’, ’మీరా’. స్త్రీ శక్తికి సంబంధించినవి ఉంటాయి. ’ నృత్యం నేర్చుకోవాలని తపించేవారు ఎప్పుడూ వ్యక్తిగతంగానే గురువును వెతకాలని’ అంటూ నృత్య పాఠాలను వివరిస్తుంది సోనాలి మాన్సింగ్. (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! ) -
ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!
పర్నియా కురేశీ.. పరిచయానికి చాలా విశేషణాలనే జోడించాలి. ఆమె కూచిపూడి డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్, యాక్ట్రెస్, ఆథర్ ఎట్సెట్రా! వివరాలు కావాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే! పర్నియా పుట్టింది పాకిస్తాన్లో. పెరిగింది ఢిల్లీలో. చదువుకుంది అమెరికాలో. తండ్రి.. మోయిన్ అఖ్తర్ కురేశీ భారతీయుడు. బిజినెస్‌మన్. తల్లి.. నస్రీన్ కురేశీ పాకిస్తానీ నటి. తండ్రి నుంచి వ్యాపార మెలకువలు, తల్లి నుంచి కళలు వారసత్వంగా అందుకుంది. నాలుగో ఏటనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టింది. తొలి గురువు తల్లే. తర్వాత రాజా–రాధారెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘లా’ చదివింది. లా చదివేటప్పుడే ఫ్యాషన్ రంగంలో ఇంటర్న్‌గా చేరింది. ఆ క్రమంలోనే ఫ్యాషన్ మీద ఆసక్తి పెరిగింది. అకడమిక్స్ కంటే తన క్రియేటివిటీకే ఎక్కువ మార్కులు పడసాగాయి. దాంతో ఫ్యాషన్‌నే సీరియస్‌గా తీసుకుని హార్పర్స్ బజార్, ఎల్ లాంటి ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. తర్వాత ఫ్రెంచ్ డిజైనర్ క్యాథరిన్ మలండ్రీనో దగ్గర పీఆర్ ఇంటర్న్‌గా చేరింది. ఇవన్నీ ఆమెలోని ఫ్యాషన్సెన్స్కి మెరుగులు దిద్దాయి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆమె ఎక్కడా తన డాన్స్‌ని నిర్లక్ష్యం చేయలేదు. సాధన చేస్తూనే ఉంది. ప్రదర్శనలిస్తూనే ఉంది. ఇండియా తిరిగిరాగానే.. ఫ్యాషన్ రంగంలో ఆమెకు ఇబ్బడిముబ్బడి అవకాశాలు కనిపించాయి. ఆ దిశగా అడుగులు కదిపేలోపే సోనమ్ కపూర్ హీరోయిన్గా నటించిన ‘ఆయశా’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ ఆన్లైన్లో డిజైనర్ వేర్ అందుబాటులో లేదని గ్రహించింది. అందుకే ఆ మూవీ అయిపోగానే, 2012లో Pernia's Pop-Up Shop పేరుతో ఆన్లైన్ స్టోర్‌ని లాంచ్ చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తులు లభ్యమవుతాయి. అంట్రప్రెన్యూర్‌గా మారినా డిజైనింగ్‌ను ఆపలేదు. ఈ దేశ సంస్కృతి, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నివర్గాల మహిళలకు అన్ని రకాల దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. తన స్టయిలింగ్‌ని కోరుకునే వాళ్లకోసం ‘పర్నియా కురేశీ’ లేబుల్‌ని, ఇండియన్, ఫ్యూజన్ తరహా కావాలనుకునేవారికి ‘"Amaira' ’ లేబుల్‌ని స్టార్ట్ చేసింది. కిడ్స్ వేర్, జ్యూల్రీ డిజైనింగ్లోకీ అడుగుపెట్టింది. పర్సనల్ స్టయిలిస్ట్‌గా కాకుండా బాలీవుడ్ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ వాక్ కోసం కోరిన సెలబ్రిటీలకు మాత్రం స్టయిలింగ్ చేస్తోంది.సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల ఫ్యాషన్ షోల్లో మోడల్‌గా ర్యాంప్ మీద మెరుస్తోంది. ‘జాన్ నిసార్’ అనే చిత్రంలోనూ నటించింది. ఫ్యాషన్, స్టయిలింగ్కి సంబంధించిన వివరాలు, సలహాలు, సూచనలతో ‘"Be Stylish, with Pernia Qureshi'’ పేరుతో పుస్తకాన్నీ రాసింది. ‘మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్తో క్లాసికల్ డాన్సర్నయ్యాను. నాన్న ఇన్స్పిరేషన్తో అంట్రప్రెన్యూర్నయ్యాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్నయ్యాను. ఉత్సుకతతో పుస్తకం రాశాను. చాన్స్ రావడంతో యాక్ట్రెస్నయ్యాను. లైఫ్‌లో నేను పోషించిన, పోషిస్తున్న ఈ రోల్స్ అన్నిటిలోకి నాకు క్లాసికల్ డాన్సర్ రోల్ అంటేనే ఇష్టం. డాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. డాన్స్ ప్రాక్టీస్ లేని షెడ్యూల్ ఉండదు. సక్సెస్ అంటే నా దృష్టిలో చాలెంజెస్‌ని హ్యాండిల్ చేయడమే! దీనికి ఓర్పు, నేర్పులే టూల్స్!’ అంటుంది పర్నియా కురేశీ. (చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!) -
బల్లెరినా డిప్రిన్స్ హఠాన్మరణం
వాషింగ్టన్: చిన్న వయస్సులోనే అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్న బ్యాలె నృత్య కళాకారిణి మిఖెలా మబింటీ డి ప్రిన్స్ హఠాన్మరణం చెందారు. ఈమె వయస్సు 29 ఏళ్లు. ఈ విషాద వార్తను ఆమె ప్రతినిధి డిప్రిన్స్ ఇన్‌స్టా పేజీలో ప్రకటించారు. తనను గురించి తెలిసిన, విన్న అందరికీ ఒక మర్చిపోలేని స్ఫూర్తిని మిగిలి్చన డిప్రిన్స్ ఇక లేరని ఆమె కుటుంబం తెలిపింది. కారణాలను మాత్రం వెల్లడించలేదు. 1995లో ఆఫ్రికాలోని సంక్షుభిత సియోర్రా లియోన్‌లో జన్మించిన డిప్రిన్స్ తల్లిదండ్రులు అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల పసి ప్రాయంలోనే అనాథాశ్రమంలో చేరాల్సి వచ్చింది. అక్కడి వారంతా తల్లిదండ్రులు లేని, విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతున్న తనను ‘దెయ్యం బిడ్డ’గా పిలుస్తుండేవారని చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకునేవారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జంట దత్తత తీసుకున్నాక ఆమె జీవితమే మారిపోయింది. వారు ఆమె ప్రతిభను గుర్తించి, బ్యాలెట్ క్లాసులకు పంపించారు. హార్లెంలోని డ్యాన్స్ స్కూల్లో అతిచిన్న వయస్సులోనే ప్రధాన డ్యాన్సర్‌గా ఎదిగి ఆమె చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక బోస్టన్ బ్యాలెలో 2021లో చేరారు. 17 ఏళ్లకే డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ అనే టీవీ షోలో ప్రదర్శన ఇచ్చారు. గాయని బియొన్స్ ‘లెమొనెడ్’ఆల్బంలోనూ డిప్రిన్స్ ఉన్నారు. -
సోషల్ మీడియాలో సాఫ్ట్వేర్ దంపతుల ట్రెండ్
ఒకరేమో సాప్ట్వేర్ ఉద్యోగం వదిలి మీమర్‌గా, మరొకరు సింగర్.. ఇద్దరూ నేడు సోషల్‌మీడియా వేదికగా నవ్వులు పూయిస్తూ, సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రవృత్తినే వృత్తిగా మలిచిన సాహిని శ్రీహర్ష, ప్రతిమ కొరడ దంపతులు నేడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీరికి లక్షల్లో ఫాలోవర్స్‌ని సంపాదించి ట్రెండింగ్‌లో ఉన్న మాటలు, విజువల్ ఫొటోలు, విడియోలతో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏ రంగమైనా సోషల్ మీడియాలో మీమ్స్, వీడియో క్రియేటివిటీతోనే మార్కెట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఒకరు డ్యాన్సర్, మరొకరు మీమర్ సోషల్ మీడియాలో సాఫ్ట్వేర్ దంపతుల ట్రెండ్ మీమ్స్ మార్కెట్లో ఆలోచనలే పెట్టుబడిగా ప్రవృత్తినే వృత్తిగా మలచుకున్న శ్రీహర్ష, ప్రతిమసృజనాత్మకత, కొంగొత్త ఆలోచనలే పెట్టుబడి. మీమ్స్, వీడియోస్‌తో మీమ్ మార్కెటింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరి ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.డ్యాన్స్, మీమ్స్‌లో ప్రావీణ్యం.. నాకు డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. బీటెక్ అయ్యాక డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా బెంగుళూరులో పనిచేశా. కానీ ఇంట్లో నో చెప్పడంతో 2017–18లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారాను. అయితే డ్యాన్స్ వీడియోలు చేయడం అలవాటుగా మారింది. అలా హైదరాబాద్ వచ్చి నచి్చన కంటెంట్‌తో విడియోలు స్టార్ట్ చేశాను. లాక్డౌన్ సమయంలో హైదరాబాద్‌లోనే ఉంటూ మరింత ట్రెండింగ్ కంటెంట్‌తో వీడియోలు చేశాను. లైట్ బా అనే మీమ్ పేజ్‌ను స్టార్ట్ చేశాను. మీమ్స్, వీడియోస్‌కి మంచి స్పందన వచ్చింది. కానీ మీమర్‌గా కూడా సంపాదించవచ్చని తెలియదు. కొంత మంది సలహాలతోనే.. కొంతమంది సోషల్‌మీడియా వ్యక్తులను కలిసినపుడు వారి నుండి కొన్ని సలహాలు తీసుకున్నాను. లైట్ బా పేజీకి 5లక్షల మంది, హర్ష ఈజ్ అవైలబుల్ యూట్యూబ్ ఛానెల్‌కి 3లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌కి 2.6లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో మీమ్ మార్కెటింగ్‌ను మూవీస్, ఒరిజినల్ స్ట్రీమింగ్ సరీ్వస్‌లకు కంటెంట్, ప్రమోషన్ వీడియోస్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాను. యాక్టర్‌గా చేయాలని ఉంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను.సింగర్ టూ మీమర్... నేను సింగర్‌ని.. సరిగమపలో 2020లో కంటెస్టెంట్‌గా చేశాను. కొన్ని పాటలు కూడా పాడాను. నాకు హర్షకి సోషల్‌మీడియా వేదికగా పరిచయం ఉందికానీ మాట్లాడుకోలేదు. మ్యూచువల్గా ఇద్దరికీ మ్యారేజ్ ప్రపోజల్ వచి్చంది. ఇద్దరి మనసులూ కలిశాయి. పెళ్ళి చేసుకున్నాం. నాకు యాక్టింగ్ తెలీదు. కానీ మీమ్ విడియోస్లో చేశారు. హర్ష నా నటన చూసి మెచ్చుకున్నాడు. ఇద్దరం కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాలో మీమ్ వీడియోస్ చేస్తుంటాము. నాకు ఇన్‌స్టాలో 85వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరి వృత్తులు వేరైనా మీమ్ మార్కెంటింగే ఉద్యోగంగా మలుచుకున్నాం. మా కంటెంట్‌తో నెటిజన్లు నవ్వుకుంటే మేము గెలిచినట్టే. -
ఆగిన సిరిమువ్వల సవ్వడి..యామినీ కృష్ణమూర్తి శివైక్యం
సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె/అమరావతి: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి, ఒడిస్సీ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఏడు నెలలుగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థి వదేహాన్ని ఢిల్లీ గ్రీన్‌పార్క్‌లోని డి–బ్లాక్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు గ్రీన్‌పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ ప్రదర్శనలు ఇస్తున్న కృష్ణమూర్తి ఈ ఏడాది జనవరిలో వయోభార సంబంధిత సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పట్నుంచి ఆస్పత్రి ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. 17వ ఏట తొలి ప్రదర్శన యామిని పూర్తిపేరు యామినీ కృష్ణమూర్తి పూర్ణతిలకం. చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న ముంగర కృష్ణమూర్తి, లక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితులు. నృత్యంపై ఉన్న మమకారంతో మదనపల్లెలోని ఓ డ్యాన్స్ మాస్టర్ వద్ద చిన్న వయసులోనే నాట్యం నేర్చుకొనేందుకు యామిని వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికి తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడ్డారు.తన తండ్రి ప్రోత్సాహంతో 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అనంతరం కూచిపూడి, ఒడిస్సీ కూడా అభ్యసించారు. ఎండీ రామనాథన్ వద్ద కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు. యామిని తన తొలి ప్రదర్శనను తన 17వ ఏట 1957లో చెన్నైలో ఇచ్చారు. ఖండాంతరాలను దాటిన ప్రతిభ యామిని భరతనాట్య ప్రతిభ ఖండాతరాలను దాటింది. 17 ఏళ్ల వయసులో తొలిసారి ఆస్ట్రేలియాలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా, యూరొప్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఇండోనేసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, మయన్మార్ వంటి దేశాల్లో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీలో నృత్య కౌస్తుభ కల్చరల్ సొసైటీ యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. ఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు డైరెక్టర్‌గా ఆమె కొన్నేళ్లు సేవలందించారు. ‘డకోటా’ ఫ్లైట్‌లో పాకిస్తాన్‌కు.. యామినీ కృష్ణమూర్తి నాట్యం గురించి తెలుసుకున్న పాకిస్తాన్ దేశస్తులు.. అక్కడ ప్రదర్శన నిమిత్తం ఆహ్వానించారు. దీంతో 1970లో ఆమె లాహోర్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలో భారత్ నుంచి ‘డకోటా’ ఫ్లైట్‌లో అతికష్టం మీద పాక్‌కు వెళ్లాల్సి వచ్చి ందని పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్యప్రదర్శలను చూసిన పాకిస్థానీలు మంత్రముగ్థులై పలుమార్లు ఆమెను ఆహ్వానించడం విశేషం. ప్రముఖ సేవామూర్తి మదర్ థెరెసా చేతుల మీదుగా యామిని జ్ఞాపికను అందుకోవడం విశేషం. వివాహం చేసుకోకుండా.. నాట్య రంగానికే జీవితాన్ని అంకితం చేసిన యామిని వివాహం చేసుకోలేదు. తన నృత్య జీవిత విశేషాలను, నృత్యం నేర్చుకొనే క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, నేర్పించిన గురువుల వివరాలతో ‘ఎ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. అనేక అవార్డులు ఆమె సొంతంయామినీ కృష్ణమూర్తి దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్యానికి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం నేర్చుకున్న యామిని.. పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. భరతనాట్యంలో యామిని ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. టీటీడీ ఆస్థాన నర్తకిగానూ యామిని కొనసాగారు.భాగ్యనగరంతో అనుబంధం సాక్షి, హైదరాబాద్: యామినీ కృష్ణమూర్తికి హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్, కళాసాగర్ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె దశావతారం, కృష్ణ శబ్దం తదితర ప్రదర్శనలిచ్చి ప్రేక్షక లోకాన్ని మైమరిపించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఆమె నృత్య ప్రదర్శన హైదరాబాద్ కళాప్రియులకు సుపరిచితం. తెలుగు విశ్వవిద్యాలయం ఆమెను సిద్ధేంద్రయోగి పురస్కారంతో గౌరవించింది. 2012లో హైదరాబాద్ రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చారు. -
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. వారి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని.. 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో ఖ్యాతి సంపాదించారు. ‘ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. -
తండ్రికి కారు గిఫ్టిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. నీలాంటి కూతురుండాలి!
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, డ్యాన్సర్ మనీషారాణి బిగ్‌బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. హిందీ బిగ్‌బాస్.. ఓటీటీ రెండో సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిక్లాజా 11వ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొని ఏకంగా ట్రోఫీ అందుకుంది. ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ కనిపించి కనువిందు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తండ్రికి ఊహించని బహుమతిచ్చింది.అవన్నీ నా కలలు కూడా..మహీంద్రా కారు కొనిచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో తన తండ్రికి కొత్త కారు తాళాన్ని అందిస్తూమురిసిపోయింది. మా నాన్న కొత్త కారు. ఆయన కోరిక నెరవేర్చుతూ కారు గిఫ్ట్‌గా ఒచ్చాను. ఆయన కన్న కలలన్నీ తనవి మాత్రమే కావు, నావి కూడా! అవన్నీ నెరవేరుస్తాను అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. దీని ధర దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. గర్వంగా ఉందిఈ వీడియో చూసిన అభిమానులు.. నిన్ను చూస్తే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నీలాంటి కూతురు ఉండాలి, మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి కష్టంతో పైకి ఎదిగి తండ్రి కలల్ని నెరవేరుస్తుంటే అంతకన్నా ఇన్స్పిరేషన్ ఇంకేముంటుంది? మధ్యతరగతి నుంచి వచ్చే అమ్మాయిలకు నువ్వొక రోల్ మోడల్.. అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు. View this post on Instagram A post shared by Manisha Rani (@manisharani002)చదవండి: దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్ -
ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత ‘వందేమాతరం‘ ఖ్యాతి మరోసారి విశ్వ యవనికపై తొణికిసలాండింది! వియత్నాంలోని బాలీలోని భారతీయ దౌత్య కార్యాలయం దీనికి వేదికైంది. భారత నృత్య శైలుల్లో ఒకటైన ఒడిస్సీకి బాలినీస్ శైలి కూడా తోడైంది. వందేమాతరమంటూ.. పదాలు సొగసుగా కదిలాయి. హావభావాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. పలువురి అభిమానాన్ని చూరగొంటోంది. ఎందుకు? ఏమిటి? ఎలా? చూసేయండి మరి! కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బాలిలో వందేమాతరం పాటకు ప్రత్యేక శైలిలో నృత్య ప్రదర్శన జరిగింది. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలిలో నిర్వహించారు. ఇది ఒడిస్సీ, బాలినీస్ సంప్రదాయ నృత్యాలను మిక్స్ చేసిన నృత్య ప్రదర్శన. ఇది ఎంతగా ఆకట్టుకుంటుందంటే..ప్రేక్షకులు మైమరిచి చూస్తుండి పోయేంతగా! ఆ యువతులిద్దరూ చాలా చక్కటి అభినయంతో చేశారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం వందేమాతరం పాట ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగేలే చేస్తుంది. తెలియని అనుభూతి కలిగుతుంది. అలాంటి అద్భుతమైన గీతానికి చక్కటి నృత్యంతో అబ్బురపరిచారు ఆ యువతులు. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బాలిలో ఒడిస్సీ టీచర్ డా పాంపిపాల్ కాగా, మరోకరు బాలినీస్ డ్యాన్సర్ మెలిస్సా ఫ్టోరెన్స్ షిల్లెవోర్ట్. ఇద్దరు వేర్వేరు డ్యాన్సర్లు కలిసి ఒక దేశ భక్తి పాటకు ఇచ్చి ఈ ప్రదర్శన అద్భుతః ! అన్నంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. Vandhe Maatram - Odissa & Bali dancers pic.twitter.com/hzj4bSv26o — Aviator Anil Chopra (@Chopsyturvey) April 11, 2024 (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్!
‘ఎక్స్’యూజర్ పృథ్వీ తన చిన్నారి మేనకోడలు వర్క్‌బుక్ నుంచి పోస్ట్ చేసిన స్నాప్‌చాట్ నెట్‌లోకంలో నవ్వులు పూయిస్తోంది. ఈ వర్క్‌బుక్‌లో‘మ్యాచ్ ది ఫాలోయింగ్’ శీర్షిక కింద ఎడమవైపు ప్రముఖుల పేరు, కుడివైపు ఆయా రంగాలకు సంబంధించిన బొమ్మలు ఇచ్చారు. ఏ వ్యక్తి ఏ రంగానికి చెందిన వారో జత చేయాలి. విరాట్ కోహ్లీ–క్రికెటర్, లతా మంగేష్కర్–సింగర్... ఇలా అన్నిటికీ కరెక్ట్‌గానే జత చేసింది ఆరు సంవత్సరాల చిన్నారి. అయితే లియాండర్ పేస్ దగ్గరే వచ్చింది పేచీ. ప్రభుదేవాతో పాటు లియాండర్ పేస్‌ను కూడా డ్యాన్సర్‌ని చేసింది. ఇది చూసి సరదాకారులు ఊరుకుంటారా ఏమిటి? మీమ్సే మీమ్స్! -
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్‌గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్‌గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్‌లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్‌లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్‌గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్నాథ్ ఘోష్ అమెరికాలో జరిగిన కాల్పులకు బలయ్యాడు. ఈ విషయాన్ని టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు. అమర్నాథ్ ఆమెకు స్నేహితుడు. అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విజ్ఞప్తి చేశారు. అమర్నాథ్ మృతికి సంబంధించిన సమాచారాన్ని దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మంగళవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం, మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో నా స్నేహితుడు అమర్నాథ్ ఘోష్ హత్యకు గురయ్యారు. అమర్నాథ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూశారు. అమర్నాథ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అమర్నాథ్ కోల్‌కతాకు చెందినవారు. పీహెచ్డీ చేస్తూ, నృత్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన ఈవినింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. అమెరికాలోని అతని స్నేహితులు అమర్నాథ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. భారత రాయబార కార్యాలయం అమర్నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని’ ఆమె కోరారు. My friend #Amarnathghosh was shot & killed in St louis academy neigbourhood, US on tuesday evening. Only child in the family, mother died 3 years back. Father passed away during his childhood. Well the reason , accused details everything are not revealed yet or perhaps no one… — Devoleena Bhattacharjee (@Devoleena_23) March 1, 2024 అమర్నాథ్ హత్యకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, భారత సంతతికి చెందిన పలువురు హత్యకు గురయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దేవోలీనా భట్టాచార్జీ ట్వీట్‌కు పలవురు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. Deep condolences to family & friends of deceased Amarnath Ghosh in StLouis, Missouri. We are following up forensic, investigation with police & providing support. @IndianEmbassyUS @MEAIndia — India in Chicago (@IndiainChicago) March 1, 2024 -
డ్యాన్సింగ్ స్టార్ హఠాన్మరణం : గుండె పగిలిందంటున్న అభిమానులు
#RIPRobin ప్రముఖ డ్యాన్సర్, స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్ స్టార్ రాబిన్ విండ్సర్ అకాలమరణం అభిమాన లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నాట్యంతో అందర్నీ అలరించిన రాబిన్ కేవలం 44 ఏళ్ల వయసులో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. దీంతో ఆర్ఐపీ అంటూ సంతాపసందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అతని మరణానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు. చాలా తొందరగా వెళ్లిపోయావు మిత్రమా అంటూ సన్నిహితులు అంతా శోక సంద్రంలో మునిగిపోయారు. రాబిన్ విండ్సర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 2010-2013 మధ్య షోలో పాట్సీ కెన్సిట్, అనితా డాబ్సన్, లిసా రిలే , డెబోరా మీడెన్లతో కలిసి ఇచ్చిన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాడు ఎవరీ రాబిన్ విండ్సర్ సెప్టెంబర్ 15, 1979న జన్మించిన రాబిన్ విండ్సర్ ఒక బ్రిటిష్ ప్రొఫెషనల్ లాటిన్ , బాల్రూమ్ డ్యాన్సర్. చిన్నప్పటినుంచీ డ్యాన్స్ పట్ల ఆసక్తి. అందుకే తల్లిదండ్రులు అతనిని మూడు సంవత్సరాల వయస్సులో ఇప్స్‌విచ్‌లోని స్థానిక నృత్య పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్‌లో ప్రో డ్యాన్సర్‌గా పాపులర్ అయ్యాడు. Shocked & saddened by the tragic news this morning...condolences to his family, friends, colleagues & to the Strictly family this morning. 💔 #RobinWindsor #StrictlyComeDancing pic.twitter.com/FZZ9f1GW3z — Barnsey (@officialbarnsey) February 20, 2024 -
కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..
కుకీస్ అంటే ఇష్టంగా తినేవారు ఈ ఘటన వింటే మాత్రం తినేందుకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఓ ప్రోఫెషనల్ డ్యాన్సర్ ఈ కుకీస్ తిని నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ ఘటన ఒకరకంగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. కుకీస్ ఎంతవరకు తినొచ్చు మంచిదేని అన్నంత అనుమానాలకు దారితీసింది. అస్సలు కుకీస్ తినడం వల్ల ప్రాణం పోవడం ఏమిటీ? అసలేం ఏం జరిగింది.. వివరాల్లోకెళ్తే..ఓర్లా బాక్సెండేల్ అనే 25 ఏళ్ల ప్రోఫెషనల్ డ్యాన్సర్ కుకీస్ తిన్న తర్వాత జనవరి 11న అనాఫిలాక్టిక్ షాక్‌కి సంబంధించిన తీవ్ర అలెర్జీకి గురై మరణించింది. అయితే కుకీస్ వేరుశెనగతో చేసినవి. తమ బిడ్డ చనిపోవడానికి కారణం సదరు కకీస్ తయారు చేసే కంపెనీయే అంటూ కోర్టుని ఆశ్రయించారు ఆమె బంధువులు. ఇక బాధితరుఫు న్యాయవాది ఆ కుకీస్ ప్యాకెట్‌పై వేరుశెనగకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, ఆహార పదార్థాల్లో కంపెనీ చూపిన నిర్లక్ష్యంధోరణి కారణంగానే తన క్లయింట్ మరణించిందని వాదించారు. తప్పుగా లేబుల్ చేసిన కుకీస్ వల్ల బాధితురాలు ప్రాణాలు పొగొట్టుకుందని అన్నారు. ఈ ఘటనతో యూకే నగరంలోని స్టీవ్ లియోనార్డ్ స్టోర్ల నుంచి వెనిలా ఫ్టోరెంటైన్ కుకీలను కొనేందు జనాలు జంకుతున్నారు. నిజానికి ఓర్లా 2018లో డ్యాన్స్ చేసేందుకు న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అప్పుడే ఆమె ఒక సూపర్ మార్కెట్ నుంచి ఈ కుకీస్‌లను కొని, తినడం జరిగింది. చివరికి డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆస్పత్రి పాలై చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై సూపర్ మార్కెట్ స్పందించి.. ఈ కుకీలను తయారు చేసి, తమ మార్కెట్‌కి సరఫరా చేసే లాంట్ ఐలాండ్ బేకీరీయే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పైగా ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సదరు సూపర్ మార్కెట్ సీఈవో ఓ వీడియోలో సానుభూతి వ్యక్తం చేశారు కూడా. బాధితురాలు కూడా దర్యాప్తులో నిర్లక్ష్యపూరితంగా తయారు చేసిన కుకీస్ వల్లే చనిపోయినట్లు పేర్కొంది. అయితే బాధితురాలి తరుఫు న్యాయవాది తయారీ దారులు లేదా అమ్మకందారుల నిర్లక్యానికి ఓ ప్రాణం బలవ్వడమే గాక ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చిందంటూ వాదన వినిపించారు. అయితే కుకీస్ తయారీదారు కుకీస్ యునైటెడ్ కంపెనీ మాత్రం అందుకు తాము బాధ్యులం కాదని తెగేసి చెప్పింది. అమ్మకందారులు తప్పుగా లేబుల్ చేయండంతో తలెత్తిన తప్పిందంగా పేర్కొంది. తాము మార్కెట్‌కి ఉత్పత్తిని సరఫరా చేయడానికి ముందే ఎలాంటి ఇన్‌గ్రేడియంట్స్ వాడతామన్నది కూడా ముందుగానే సదరు సూపర్ మార్కెట్‌తో మాట్లడటం జరుగుతందని అందువల్ల ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తప్పిదం కాదని వాదించింది. అందువల్ల దయచేసి వినియోగుదారులందరూ కుకీస్ కొనే ముందు దేనితో తయారు చేశారు, తయారీ తేదీ వివరాలు చూసుకుని కొనుగోలు చేయండి. ఇక్కడ ఎవరీ వ్యాపారం వారిదే మనుషల జీవితాలకు గానీ, వారి ఆరోగ్యానికి గానీ ప్రాముఖ్యం ఇవ్వవు, తప్పిదానికి బాధ్యత కూడా వహించవు అన్నది గుర్తు ఎరగాలి. ఎంత సేల్స్ చేశాం ఎంత ఆదాయం వచ్చింది అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నంత సేపు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!. మన సంరక్షణ మనమే చూసుకోవాలి తప్పదు. (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ' ఇచ్చే శక్తిగా..!
భవిష్యత్తుకు ప్రేరణ ‘మీ కూతురు ఇక నడవలేదు. వినలేదు’ అంటూ వైద్యుడి నోటి నుంచి వచ్చిన మాట విన్న తరువాత ఉజ్వల, ఆమె భర్త తమ జీవితాలను అర్ధంతరంగా చాలించాలనుకున్నారు. నిరాశే తప్ప ఆశ కనిపించని ఆ కఠిన సమయంలో హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదివిన ఉజ్వల ఆత్మస్థైర్యం తెచ్చుకొని, జీవితాన్ని వెలుగుమయం చేసుకుంది. కూతురికి ఉజ్వల భవిష్యత్ ఇచ్చింది... ఆ రోజులు ఎలాంటివి అంటే... పాప నవ్విన ప్రతిక్షణం ఆ దంపతులకు పండగే. అలాంటి ఆనందమయ రోజుల్లో ఆరు నెలల పాప ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ప్రమాదం వల్ల పాప పక్షవాతానికి గురైంది. వినికిడి శక్తి కోల్పోయింది. ‘పాప ఇక ఎప్పటికీ నడవలేదు’ అన్నట్లుగా చెప్పాడు డాక్టర్. ఆ ఇల్లు ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. ‘ఆత్మహత్య తప్ప మన జీవితానికి మరో పరిష్కారం లేదు’ అనుకున్నారు ఉజ్వల, ఆమె భర్త. ఆ సమయంలో ఒకరోజు తన సోదరి దగ్గర మనసులోని బాధను బయట పెట్టింది ఉజ్వల. సోదరి ఏం మాట్లాకుండా హెలెన్ కెల్లర్ ఆత్మకథ పుస్తకం ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ చేతిలో పెట్టి ‘ఇది ఒకసారి చదువు... ఇంతకుమించి ఏమీ చెప్పను’ అన్నది. ‘ప్రతి నిమిషం నిరాశే’ లాంటి ఆ రోజుల్లో ఒకరోజు ఉజ్వల హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదవడం మొదలుపెట్టింది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘గుడ్ ఇంగ్లీష్’పై హెలెన్ పట్టుసాధించిన విధానం నుంచి జీవితంలోని నిరాశామయ సమయాల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్లడం వరకు ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. నయాగరా జలపాతం దగ్గర ఉన్నప్పుడు ఆ జలపాతం అందాలను హెలెన్ మనోనేత్రంతోనే చూసిన విధానం అపురూపంగా అనిపించింది. ఆ పుస్తకం చదవడం పూర్తిచేసిన తరువాత తన మనసులో కమ్మిన నిరాశ మేఘాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ‘నా బిడ్డ కనీసం చూడగలుగుతుంది కదా’ అనుకుంది ఉజ్వల. తనలో సానుకూల శక్తికి అక్కడే బీజం పడింది. ‘ప్రియాంక’గా ఉన్న పాప పేరును ‘ప్రేరణ’ గా మార్చింది. మార్పు మొదలైంది. అది ఆశావహమైన మార్పు. మరోవైపు... నడవడం కష్టం అనుకున్న పాప వైద్యం, వ్యాయామాల వల్ల నడవడం ప్రారంభించింది. అయితే వినికిడి లోపం మాత్రం పోలేదు. ప్రేరణను స్పీచ్ అండ్ హియరింగ్–ఇంపేర్డ్ స్కూలులో చేర్పించింది. ప్రేరణకు శాస్త్రీయ నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించి పుణెలోని ‘సాధన నృత్యాలయ’లో చేర్పించింది ఉజ్వల. ‘నృత్యాలయలో చేర్పించిన మాటేగానీ ప్రేరణ ఎలా డ్యాన్స్ చేయగలుగుతుంది? గురూజీ చెప్పే ముద్రలను ఎలా అర్థం చేసుకోగలదు... ఇలాంటి సందేహాలెన్నో నాలో ఉండేవి. అయితే గురూజీ షమిత మహాజన్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ప్రేరణను ఎలాగైనా మంచి నృత్యకారిణిగా తయారు చేయాలనే పట్టుదల ఆమె కళ్లలో కనిపించింది’ అంటుంది ఉజ్వల. శమిత మహాజన్ దగ్గర నృత్యంలో పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ. మొదటి రెండు సంవత్సరాలు బాగానే కష్టపడాల్సి వచ్చింది ప్రేరణ. ‘మాటల ద్వారా ప్రేరణకు నాట్యానికి సంబంధించిన ముద్రలను నేర్పించడం కష్టం. చాలా ఓపిక ఉండాలి. గురూజీ ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. గురూజీ చెప్పేదాన్ని లిప్–రీడింగ్ ద్వారా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఉజ్వల. ఎంతోమంది సీనియర్ డ్యాన్సర్ల ముందు ప్రేరణ ఆరంగేట్రం ఇచ్చింది. సింగిల్ మిస్టేక్ కూడా చేయలేదు. ‘నాట్యకారిణిగా నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది’ అని పెద్దలు ప్రేరణను ఆశీర్పదించారు.‘చీకటిగా ఉన్న నా ఆత్మగదుల్లోకి ఒక కాంతికిరణం ప్రసరిస్తే ఎలా ఉంటుంది?’ అని తన ఆత్మకథ చివరిలో ప్రశ్నిస్తుంది హెలెన్ కెల్లర్. అది అచ్చంగా ఆత్మస్థైర్యంతో తెచ్చుకున్న అపూర్వ విజయంలా ఉంటుంది. అందుకు ఉదాహరణ ప్రేరణ. ఒక ద్వారం మన కోసం... బాధ, ఆవేశంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయి. ప్రశాంతమైన హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన కోసం ఎక్కడో ఒక చోట ఒక ద్వారం తెరుచుకొనే ఉంటుంది. ఆవేదన, ఆవేశాలతో ఆ ద్వారం దగ్గరకు చేరలేము. – ఉజ్వల సహానే (చదవండి: ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్ !) -
Blackpink Lisa: మోస్ట్ టాలెంటెడ్ రాపర్, సింగర్, డాన్సర్, బ్లాక్‌పింక్ లిసా (ఫోటోలు)
-
ఔరా అనిపించిన అండర్ వాటర్ డ్యాన్సర్
మన దేశ ఫస్ట్ అండర్‌వాటర్ డ్యాన్సర్ జయదీప్ గోహిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైకేల్ జాక్సన్ ఫేమస్ ‘మూన్‌వాక్’ స్టెప్పులు నీటి గర్భంలో వేసి తన పెర్ఫార్మెన్స్తో నెటిజనులు ‘ఔరా’ అనుకునేలా చేశాడు. ‘ది ఇన్వెంటర్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘వీఎఫ్ఎక్స్’ ఉపయోగించి సృష్టించిన వీడియో ఇది అని కొందరు యూజర్లు మొదట భ్రమ పడి, ఆ తరువాత నిజం తెలుసుకొని అబ్బురపడ్డారు. -
ఆమె నియంత హిట్లర్‌కు గూఢచారి.. తన నృత్యాలతో కవ్విస్తూ..
‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్. నెదర్లాండ్‌లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు. మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఇది కూడా చదవండి: బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు! -
ఐశ్వర్య సరే... అతడు ఎవరు?
‘షాహిద్ కపూర్ ఎవరు?’ అనే ప్రశ్నకు ‘బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు’ అని జవాబు చెప్పడానికి అట్టే టైమ్ పట్టదు. హీరో కావడానికి ఎంత టైమ్ పట్టిందో తెలియదుగానీ, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు షాహిద్. కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ డ్యాన్స్ ట్రూప్‌లో పని చేస్తున్న కాలంలో సుభాష్ ఘాయ్ ‘తాళ్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ నృత్యం చేసిన ‘జంగిల్ మే బోలే కోయల్ కుక్కూ’ పాటలో డ్యాన్సర్లలో ఒకరిగా అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరోజు గురించి ఆర్జే రోహిణికి ఇంటర్వ్యూ ఇస్తూ ‘వరస్ట్ అండ్ ది బెస్ట్ డే ఆఫ్ మైలైఫ్’ అని చెప్పాడు షాహిద్. అందాలతార పక్కన డ్యాన్స్ చేసే అవకాశం అదృష్టమే కదా...మరి ‘వరస్ట్ డే’ అంటాడు ఏమిటి! అనే డౌట్ రావచ్చు. విషయం ఏమిటంటే ఆరోజు షూటింగ్‌కు వస్తున్న షాహిద్ బైక్ మీది నుంచి పడ్డాడు. అదీ విషయం. ‘తాళ్’ సినిమా పాటలో ‘షాహిద్ ఎక్కడ?’ అంటూ నెటిజనులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఐశ్వర్యరాయ్ పక్కన ఉన్న అలనాటి షాహిద్ ఫొటో వైరల్ అయింది. -
ఐశ్వర్యరాయ్ సాంగ్.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే: స్టార్ హీరో
బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ కపూర్.. ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా చేశారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు షాహిద్. తాజాగా 'బ్లడీ డాడీ' చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ పాటల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు షాహిద్.. ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ మూవీలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాట కాగా, కరిష్మా కపూర్ 'లే గయీ' వంటి పాటలకు డ్యాన్సర్‌గా పని చేశాడు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) కరిష్మా కపూర్ పాటను చెడగొట్టాను: షాహిద్ కపూర్ కరిష్మా కపూర్ పాట గురించి ఇలా చెప్పాడు..'దిల్ తో పాగల్ హైలోని 'లే గయీ' పాట కోసం పనిచేయడం నిజంగా అదో భయానకం... ఆ సినిమాతో నాకు ఇష్టమైన జ్ఞాపకాలు ఏవీ లేవు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా జుట్టు చాలా ఎక్కువగా బౌన్స్ అవుతోంది. నేను షాట్‌ను పాడు చేస్తున్నానని కొరియో గ్రాఫర్ నుంచి తిట్లు కూడా తిన్నాను. నిజంగా ఆ సమయంలో భయపడిపోయాను. అప్పుడు నేను చాలా సమయం పాటు ఆందోళనగానే ఉన్నాను'. అని తెలిపాడు. ఐశ్వర్యరాయ్ కోసం వెళ్తుంటే రోడ్డు ప్రమాదం దిల్ తో పాగల్ హై తర్వాత.. తాల్ సినిమాలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాటలో కనిపించాడు షాహిద్. అతను ఐశ్వర్యతో కలిసి డ్యాన్సర్‌గా కనిపించాడు. పాట చిత్రీకరణ రోజు రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలిపాడు. అయినా, గాయాలతోనే సెట్‌కి చేరుకున్నట్లు తెలిపాడు. కానీ పాటు కోసం పని చేస్తున్నప్పుడు అందరిలా యాక్టివ్‌గా పనిచేయలేక పోయానని తెలిపాడు. ఆ సమయంలో చాలా బాధ పడినట్లు అన్నాడు. సినిమా విడుదల అయిన తర్వాత అదే పాట పెద్ద హిట్ కావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని షాహిద్ తెలిపాడు. (ఇదీ చదవండి: నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు: మధుమిత) -
అక్క పెళ్లి.. బావ పిలిచి మరీ కొట్టాడు, నా ప్రియుడికి రక్తమొచ్చేలా..: నటి
బిగ్‌బాస్ బ్యూటీ, నటి, డ్యాన్సర్ గోరి నగోరికి చేదు అనుభవం ఎదురైంది. సొంత సోదరి పెళ్లికి వెళ్లిన గోరిపై ఆమె బావ(పెద్దక్క భర్త) స్నేహితులతో కలిసి దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. మే 22న గోరి నగోరి చిన్నక్క యశ్మిన్ వివాహం కిషణ్‌గర్‌లో జరిగింది. ఈ పెళ్లికి రావాలని, వస్తే అన్ని ఏర్పాట్లు చూసుకుంటానని ఆమె పెద్దక్క భర్త జావేద్ హుస్సేన్ ఫోన్ చేశాడు. జుట్టు పట్టుకుని లాగి పడేసి.. దీంతో ఆమె కిషణ్‌గర్‌లో అక్క పెళ్లికి తన ప్రియుడు, టీమ్‌తో పాటు కలిసి వెళ్లింది. వివాహం బాగానే జరిగింది. కానీ బరాత్‌లోనే అసలు గొడవ మొదలైంది. మొదట తన ప్రియుడిపై దూషించిన కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి అతడిపై, అతడి వెంట ఉన్న బౌన్సర్‌పై దాడి చేయడం ప్రారంభించారు. వాళ్లను ఆపడానికి ప్రయత్నించిన గోరి జుట్టు పట్టుకుని లాగి పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన డ్యాన్సర్ ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నానంటోంది. ఫిర్యాదు చేయడానికి వెళ్తే సెల్ఫీ 'నేను మా అక్క పెళ్లికి వచ్చాను. అందరం సంతోషంగా ఉన్నాం. నా బాయ్‌ఫ్రెండ్ సన్నీతో పాటు మరికొందరు బరాత్‌లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో మా బావ వాళ్ల ఫ్రెండ్స్‌తో వచ్చి సన్నీతో గొడవపడ్డాడు. సన్నీని, మా బౌన్సర్ రాజేశ్‌ను రక్తం వచ్చేలా కొట్టారు. ఆ గొడవను ఆపేందుకు వెళ్లిన నన్ను జుట్టు పట్టుకుని లాగి పడేశారు. నేనిప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. ఈ ఘటనపై నా సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్లసలు పట్టించుకోలేదు. ఇది మీ ఇంటిసమస్య, మీరు మాట్లాడుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారు. పైగా చాలాసేపు నన్ను వెయిట్ చేయించి చివర్లో మాత్రం అతడు సెల్ఫీ తీసుకున్నాడు' అని ఆవేదన వ్యక్తం చేసింది గోరి నగోరి. View this post on Instagram A post shared by Official_Gori_Nagori (@real_gorinagori) చదవండి: అప్పుడేమో వరకట్న కేసు.. ఇప్పుడేమో ఆ మాజీ భర్తతోనే షికార్లు -
కాలు పోయినా కళను వీడలేదు.. నాట్యం నేర్చుకుని ప్రశంసలు పొందింది
-
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
క్లాసికల్ డాన్సర్, పద్మభూషణ్ అవార్డు గ్రహిత హఠాన్మరణం
లెజెండరి క్లాసికల్ డాన్సర్, పద్మభూషన్ అవార్డు గ్రహిత కనక్ రెలే(85) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి నటి హేమ మాలిని,సుధచంద్రన్లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కనక్ రెలే మోహీని అట్టం డాన్స్‌లో ప్రావీణ్యురాలు. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు! అంతేకాదు ఆమె నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ కూడా. శాస్త్రీయ నృత్యానికి ఆమె అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. జూన్ 11, 1937లో గుజరాత్లో జన్మించిన కనక్ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆమె మేనమామ కళలను నెరవేర్చాలని భావించి నాట్యాన్ని నేర్చుకున్నారు. చదవండి: గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చరణ్, చిరంజీవి ఏమన్నారంటే! Shocked to hear that Padmabhushan Kanak Rele ji has passed away. A dutiful family person, she was a true visionary, academician & a Mohini Attam performer par excellence. It is a day of great grief to the Rele and Nalanda Parivaar and the classical dance fraternity. Om Shanti 🙏 pic.twitter.com/HDhRFGO7j0 — Hema Malini (@dreamgirlhema) February 22, 2023 -
నల్గొండ కుర్రోడు.. కెనడాలో ‘అదుర్స్’
నల్గొండలో పుట్టి పెరిగి కెనడాలో అదరగొడుతున్నాడు మన తెలుగింటి కుర్రోడు గిరిధర్ నాయక్. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లో చదువుకున్న గిరిధర్ నాయక్.. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అయితే ఇక్కడ ఇష్టంగా నేర్చుకున్న డాన్స్‌ను వదిలేయలేక.. అక్కడ కూడా ప్రాక్టీస్ మొదలెట్టాడు. సరదాగా మొదలైన ఈ ప్రయాణం కాస్తా.. అతని జీవితాన్ని మలుపు తిప్పేలా చేసింది. కొన్నాళ్ల కింద కెనడాలో డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన నాయక్‌కు ఊహించని స్పందన వచ్చింది. డాన్స్ భిన్నంగా ఉండడం, ఉత్సాహంగా సాగడంతో చాలా మంది అమ్మాయిలకు ఇప్పుడు నాయక్ ఇన్స్టిట్యూట్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అచ్చమైన తెలుగు పాటలకు నాయక్ నేర్పించే స్పెప్పులతో ఊపేస్తున్నారు కెనడా అమ్మాయిలు. ఇప్పుడు గిరిధర్ నాయక్ ఎంతగా ఫేమస్ అయ్యాడంటే.. అమెరికా, కెనడా దేశాల్లో ఏ పెద్ద ఈవెంట్ ఉన్నా.. ఆర్గనైజర్లు నాయక్‌కు ఫోన్ చేయాల్సిందే. ముఖ్యంగా తెలుగు ఈవెంట్లలో తప్పనిసరిగా కనిపిస్తారు నాయక్. ఆయన వెంట ఇంగ్లీషు అమ్మాయిలు మన తెలుగు షోలలో సందడి చేస్తారు. -
నటుడు ఆత్మహత్య, మరణానికి ముందు రెండో భార్య చిత్రహింసలు!
తమిళ నటుడు, డ్యాన్సర్ రమేశ్ తన పుట్టినరోజు(జనవరి 27)నే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! కొద్దిరోజుల క్రితం ఆయన 10వ అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతడి చావుకు రెండో భార్య కారణమంటూ మొదటి భార్య సంచలన ఆరోపణలు చేసింది. చనిపోవడానికి ముందు రమేశ్‌ను చిత్రహింసలు పెట్టిందని ఆరోపించింది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సైతం రిలీజ్ చేసింది. ఇందులో రమేశ్‌ను అతడి రెండో భార్య దారుణంగా హింసించినట్లు కనిపిస్తోంది. చేతిలో ఓ పొడవాటి కట్టె పట్టుకుని అతడిని చితకబాదినట్లు తెలుస్తోంది. ఓపక్క తనను కొట్టవద్దని రమేశ్ టేబుల్ ఫ్యాన్‌ను అడ్డుగా పెట్టుకుని ప్రాధేయపడుతుండగా అతడి రెండో భార్య, కూతురు మాత్రం చచ్చిపోమని శాపనార్థాలు పెడుతుండటం గమనార్హం. నా వల్ల కాదు, చచ్చిపోయేలా ఉన్నానంటూ రమేశ్ బాధతో విలవిల్లాడుతుంటే ఉరితాడు తీసుకురమ్మంటావా? అని కూతురు అడగడం మరింత షాకింగ్‌గా ఉంది. వీడియో చివర్లో రెండో భార్య సోఫాలో పెద్ద కట్టెతో కూర్చుని ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా రమేశ్ టిక్‌టాక్ డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. దీంతో అతడికి డ్యాన్స్ జోడి డ్యాన్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోలోతో మరింత గుర్తింపు రావడంతో అతడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. ఇటీవలే తునివులో నటించిన రమేశ్ రజనీకాంత్ జైలర్‌లోనూ నటించినట్లు తెలుస్తోంది. చదవండి: పెళ్లిపీటలెక్కిన దర్శకుడు, ఫోటో వైరల్ చాలా త్వరగా వెళ్లిపోయావ్.. మిస్‌యూ: నమ్రత ఎమోషనల్ పోస్ట్ -
నటరాజ వందనం.. శివుడికే అంకితం
సాక్షి, హన్మకొండ: ‘నటరాజ వందనం.. శివుడికి అంకితం చేసిన నృత్య ప్రదర్శన. నా తల్లి మృణాళిని సారాభాయ్ వెలువరించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి రూపొందించింది. సాధారణంగా పురుష దేవతల్లో ఐక్యత కోసం నాయిక అన్వేషణగా ఇది ప్రదర్శితమవుతుంది.’ అని అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయ్ అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్ప ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రం ‘కుడా’ మైదానంలో ‘నటరాజ వందనం’ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నృత్య అనుభవం.. నటరాజ వందనం ప్రదర్శన తీరు, వివిధ ఆలయాల్లోని శిల్పాల్లో నృత్య భంగిమల ప్రత్యేకతల్ని వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు నృత్యమంటే ప్రాణం. ఈ ఇష్టం మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. అమ్మ శాస్త్రీయ నృత్యకారిణి. పుస్తకాలు రచించేది. ఆ అభిరుచి నాకు కూడా అలవడింది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పేరిణి నృత్యం గురించి నాకు తెలుసు. 40 ఏళ్ల క్రితం కూచిపూడి గ్రామానికి చెందిన సీఆర్ ఆచార్యుల వద్ద నేను నృత్యం నేర్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలిచ్చా. శాస్త్రీయ సమకాలీన రచనలు సృష్టించి ప్రదర్శనలిస్తూ వస్తున్నా. 30 ఏళ్లుగా ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సంస్థ ‘దర్పణ అకాడమీ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్’కు కో–డైరెక్టర్‌గా ఉన్నా. 1989లో మహిళా శక్తిని బలోపేతం చేసే సోలో థియేట్రికల్ వర్క్‌లను ప్రదర్శించాం. సామాజిక మార్పు కోసం, మహిళా సాధికారత, పర్యావరణ స్పృహ కలిగించేలా మా ప్రదర్శనలుంటాయి. అనేక రంగస్థల నిర్మాణాల్ని రూపొందించాం. సామాజిక మార్పు, పరివర్తన కోసం కళల్ని ఉపయోగించడమే నా ధ్యేయం. నాట్యాల్లో ప్రత్యేకం.. నాట్యాల్లో నటరాజ వందనం ప్రదర్శన ఒక ప్రత్యేకం. మా అమ్మ మృణాళిని సారాభాయ్ రచించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి దీన్ని కూర్పు చేశాను. పరమాత్మ కోసం ఆత్మ చేసే అన్వేషణే భరతనాట్యం. శివపార్వతుల నృత్యాన్ని చూడడానికి విశ్వం నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రదర్శనను వర్ణం అని కూడా పిలుస్తారు. ఈప్రదర్శనలో నృత్యకారుడు శివుడి తాండవ నృత్య శక్తిని, గంభీరమైన రూపాన్ని చూపిస్తాడు. రామప్పలో ప్రదర్శించాలని కోరిక.. రామప్పలో నటరాజ నృత్య ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కొన్ని కారణాల వల్ల ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ కాకతీయులు ఏలిన వరంగల్ నగరంలో ప్రదర్శించడం కూడా సంతోషంగానే ఉంది. ఇందుకు కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ వారు చాలా సహకారం అందించారు. రామప్ప ఆలయంలోని శిల్పాల నృత్యభంగిమలు ఎంతో ప్రత్యేకమైనవి. పూర్వం పురాతన దేవాలయాల్లోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగేవి. అప్పటి వాళ్లు కళాపిపాసులు. అందుకేనేమో నృత్య ప్రదర్శనలను వివిధ నృత్య భంగిమల్లో శిల్పాలుగా రూపొందించారు. చరిత్రను, పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి. అభిరుచి ఉండాలి.. ఈపోటీ ప్రపంచంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే అభిరుచి ఉండి తీరాలి. లేదంటే మనల్ని మనం నిరూపించుకోలేం. ముందు తరాల వారు శాస్త్రీయ నృత్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండి, ఆర్థిక బలహీనత వల్ల వెనకబడేవారికి నేర్చుకునేలా అవకాశం కల్పించాలి. మన ప్రభుత్వం శాస్త్రీయ కళలకు నిధులివ్వట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అవసరం. మల్లికా సారాభాయ్ గురించి క్లుప్తంగా.. అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, శాస్త్రీ య నృత్యకారిణి మృణాళిని సారాభాయ్ దంపతుల కుమార్తె మల్లికా సారాభాయ్. 1954 మే9న అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే నృత్యం నేర్చుకున్నారు. 15ఏళ్ల వయస్సులో సినీ నటిగా పేరు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో భరతనాట్యం, కూచి పూడి శాస్త్రీయ నృత్యంలో అసాధారణ మైన యువనర్తకిగా గుర్తింపు పొందారు. నాటక, నృత్యరంగంలో చేసిన కృషికిగానూ గుజరాత్ ప్రభుత్వం ఆమెకు గౌరవ్ పురస్కార్ అందించింది. 2010లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. -
డ్యాన్సర్ అక్సాఖాన్ హీరోయిన్గా 'క్షణం ఒక యుగం'.. పోస్టర్ రిలీజ్
యంగ్‌స్టర్స్ నటించిన క్షణం ఒక యుగం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బ్లాక్ బస్టర్ మూవీ ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు గ్రాండ్‌గా విడుదల చేశారు. శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించారు. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. ''సినిమా స్టోరీ నాకు చెప్పారు. చాలా నచ్చింది. అందుకే పోస్టర్ రిలీజ్ చేయడానికి వచ్చాను. కథ చాలా డిఫరెంట్‌గా ఉంది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఇక నటి అక్సాఖాన్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసినందుకు డైరెక్టర్ త్రినాథరావుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమాకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. -
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు.. దటీజ్ కమల్
టీనేజ్‌లో ఇంట్లో నుంచి గెంటేస్తే పట్టుదలగా బార్బర్ షాపులో పని చేశాడు కమల్‌హాసన్. గ్రూప్ డాన్సర్‌గా అవస్థలు పడ్డాడు. నటన నేర్చుకోవడానికి కె. బాలచందర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. కాని సహించి భరించి ప్రయాణం కట్టేవాడే విజేత అవుతాడు. కమల్‌హాసన్ జీవితం, అతని లక్ష్యసిద్ధి ఏ తరానికైనా ఆదర్శమే. ఫ్యామిలీ అంతా విపరీతంగా మెచ్చే ఈ విశ్వ కథానాయకుడు ఇప్పటికీ హీరో. ఎప్పటికీ హీరో. ‘మీ పక్కన కాస్తంత చోటివ్వండి’ అంటాడు కమల్‌హాసన్ ‘సాగర సంగమం’లో జయప్రదతో ఫొటోకోసం నిలబడుతూ. ఆ ఫొటోలో అతను పడడు. కాని భారతీయ సినిమా రంగంలో అతని చోటును నేటికీ కదిల్చేవాళ్లు లేరు. అతని పక్కన చోటు కోసం పాకులాడని వారు లేరు. ‘స్టార్’ లేదా ‘యాక్టర్’ రెండు ముద్రలుంటాయి ఇండస్ట్రీలో. కాని యాక్టర్‌గా ఉంటూ స్టార్ అయినవాడు కమల్‌హాసన్. తెర అంటే ఏమిటి? నటనకు వీలు కల్పించేది. నటించాల్సినది. నటన లేకుండా తెర మీద వెలగడం అంటే పులి గాండ్రించకుండా ఉండటమే. కమల్ గాండ్రించే పులి. పాత్రలను వేటాడే పులి కూడా. ఇండస్ట్రీలో బాల నటులుగా ప్రవేశించినవారికి శాపం ఉంటుంది. యవ్వనంలో రాణించలేని శాపం. దానికి కారణం బాల నటులుగా ప్రవేశించాక చదువు సరిగ్గా నడవదు. అప్పటికే కెమెరా కాటేసి ఉంటుంది. ఏవేవో మెరుపు కలలు. కాని బాల్యంలో ఉన్న ముఖం వయసు పెరిగాక అంత ముద్దు రాకపోవచ్చు. బాల్యంలో ఉన్న ఈజ్ యవ్వనంలో మొద్దుబారవచ్చు. చాలా తక్కువ మందే చిన్నప్పుడు నటించి ఆ తర్వాత పెద్దయ్యాక కూడా స్టార్లు అయ్యారు. నటీమణుల్లో శ్రీదేవి. నటుల్లో కమల్‌హాసన్. నటన అతనిలో జన్మతః ఉంది. నటులు ఏం చేయాలో అతనికి తెలుసు. ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాలో ‘ఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలో ఉన్నా’ అనే పాట ఉంటుంది. ఆ పాటను తీసింది కొబ్బరి చెట్ల మధ్య. అందుకే కమల్ మొదటి లైన్ పాడుతూ కొబ్బరి చెట్ల వైపు చూస్తూ ఇవి పొన్న చెట్లు కావే అన్నట్టుగా చూసి పాట కొనసాగిస్తాడు. న్యుయాన్సెస్ అంటారు దీనిని. కళ అంటేనే అది. ‘సాగర సంగమం’ సూపర్ డూపర్ హిట్ అయ్యాక కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ తీశారు. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ పాట చిత్రీకరణ. అంత మంచి దర్శకుడు విశ్వనాథ్ కూడా ‘ఈ పాటకు మంచి స్టెప్స్ కంపోజ్ చేద్దాం’ అన్నారట పాత్ర ఔచిత్యం మరిచి. అప్పుడు కమల్ ‘సార్... ఈ పాటకు నేను డాన్స్ చేయను. ఎందుకంటే వీడు బాలు కాదు. శివయ్య. వీడికి డాన్సు రాదు’ అన్నారట. అదీ కమల్. ఆ తర్వాత ఆ పాటలో శివయ్య అను కమల్ వేసిన వచ్చీ రాని స్టెప్స్‌ను లోకం మురిసిపోయి చూసింది. కమల్ చార్లీ చాప్లిన్‌ను చూసి నటన మెరుగుపర్చుకున్నాడు. ‘డాన్స్‌మాస్టర్’లో స్వయంగా చాప్లిన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత రాబిన్ విలియమ్స్ నటనతో కూడా ప్రభావితం అయ్యాడు. మంచి నటుడు బ్లాటింగ్ పేపర్ లాంటి వాడు. ఒక్క బొట్టు మంచి దొరికినా పీల్చేసుకుంటాడు. ‘గాడ్‌ఫాదర్’ను మోడల్‌గా పెట్టుకుని మణిరత్నం ‘నాయకుడు’ తీశాడు. గాడ్‌ఫాదర్‌లో మార్లెన్ బ్రాండో చేసింది గొప్పదే. ‘నాయకుడు’లో కమల్ చేసింది కూడా గొప్పే. కొడుకు చనిపోయినప్పుడు తండ్రి దుఃఖాన్ని ఒక్కో నటుడు ఒక్కోలా చేస్తాడు. కమల్ చేసింది ఒక సిలబస్. కమల్ చేసిన అతి ముఖ్యమైన పని ఆహార్యం గురించి శ్రద్ధ పెట్టడం. ఆహార్యం, దేహభాష ఒక పాత్రలో నటుణ్ణి నశింపచేసి పాత్రను సజీవం చేస్తుంది. ప్రతి సినిమాలో ఒకేలా ఉంటూ ఒకే నటన చేస్తూ నటుల్లా వెలిగే వారు ఉన్నారు నేటికీ. కాని కమల్ పాత్రను బట్టి మారుతాడు. అతని శరీర కదలికా మారుతుంది. ఆధునిక మేకప్‌లు రాని రోజుల్లోనే ‘సత్యమే శివం’ వంటి సినిమాల్లో ఆయన ఆహార్యం అద్భుతం. కమల్ తమిళంతో సమానంగా తెలుగులో కూడా సూపర్‌స్టార్. తెలుగులోనే నేరుగా సినిమాలు చేశాడు. ‘మరో చరిత్ర’, ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’ కొన్ని. ఒక గొప్ప నటుడు ఎవడయ్యా అంటే కామెడీ చేయగలిగినవాడు. సీరియస్ నటుడైన దిలీప్ కుమార్ కామిక్ టైమింగ్ అద్భుతం. అమితాబ్ కామెడీకి తిరుగు లేదు. కమల్ కామెడీ చేసి ‘పుష్పక విమానం’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్’, ‘తెనాలి’... లిస్టు పెద్దది. ఒక గొప్ప హీరో తన దర్జాకు తగిన కోస్టార్‌ను పెట్టుకుంటాడు. కాని కమెడియన్ అయిన కోవై సరళతో ‘సతీ లీలావతి’ చేసి హిట్ కొట్టాడు కమల్. సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు కమల్. నిర్మాతగా దర్శకుడుగా హిట్స్ ఫ్లాప్స్ ఇచ్చాడు. లాభపడ్డాడు. నష్టపోయాడు. కాని హీరోగానే ఉన్నాడు. హీరోగానే ఉండటానికి ఎంత ప్రొఫెషనల్‌గా, క్రియేటివ్‌గా ఉండాలో పరిశ్రమకు చూపించాడు. 67 ఏళ్ల వయసులో ‘విక్రమ్’ వంటి హిట్ ఇచ్చాడు. స్టార్లు పుడతారు. గిడతారు. కాని నటులు శాశ్వతం. కమల్ శాశ్వత నటుడు. హ్యాపీ బర్త్‌డే.(నవంబర్ 7న కమల్‌హాసన్ బర్త్‌డే) -
ఒక నడిచే గ్రంథాలయం లాంటి మనిషి
వీఏకే రంగారావు వివిధ విషయాలపై విశేషమైన అవగాహన కల కదిలే గ్రంథాలయం. ఆయనది బహుముఖీన మైన ప్రజ్ఞ. ఒక రచయిత, కాలమిస్ట్, రికార్డ్ కలెక్టర్, డాన్సర్, జంతు ప్రేమి కుడు, సినీ సంగీత సాహిత్య విశ్లేషకుడు, పదాలూ జావళీల మీద పట్టున్నవాడూ ఆయనలో కొలువు దీరి వున్నారు. తెలుగూ, హిందీ పాత సినిమాల గురించీ, పాటల గురించీ సాధికారంగా చెప్పగలిగిన వ్యక్తి రంగా రావు ఒక్కరే. అంతే కాదు, పాటల పుట్టుపూర్వోత్తరాలు పట్టు కోవాలన్నా, నేపథ్య గాయకుల సమాచారం తెలుసుకోవాలన్నా రంగా రావే దిక్కు. రంగారావు సినీ సంగీత సాహిత్య విశ్లేష కులుగా రంగప్రవేశం చేసేనాటికి (1962) సినిమాలన్నా, సినిమా పాటలన్నా ‘మర్యాదస్తుల’కో చిన్నచూపుండేది. సినిమా పాటల్లో సాహిత్య విలువలు ఏం వుంటాయి? అనే అభిప్రాయం ప్రబ లంగా వుండేది. అయితే ఆయన సినిమా పాటల్లో కూడా ఎలాంటి సాహిత్య విలువలున్నాయో, ఏ పదాన్ని ఎలా వాడారో, ఏ పాటలో ఏ సంగతి గొప్పగా వుందో, ఏ కంఠం ఎంత అందంగా పలుకు తోందో, ఏ కంఠంలో ఏ ప్రత్యేకత వుందో, ఏ సంగీత దర్శకుడు ఎంత ప్రతిభ గలవాడో తెలుగు పాఠకులకీ, శ్రోతలకీ విడమరిచి చెప్పారు. అలా ప్రజలలో ఉత్తమాభిరుచిని పెంపొందించారు. అంతే కాదు ఆయన సినిమా పాటల గురించీ, సినిమాల గురించీ రాసిన సంగతులు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సంవత్సరాల వారీగా రాయడం వలన... ఒక రకంగా చరిత్రని దాఖలా పరిచి నట్టయింది. ఇది ముందు తరాల వారికీ, సినిమాల గురించి స్టడీ చేయాలనుకునే వారికీ ఉపయోగపడే ఒక పెన్నిధి. ఇక రికార్డ్ కలెక్టర్‌గా ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఆయన 78 ఆర్ఎంపీ గ్రామ్‌ఫోన్ రికార్డులు సుమారు 52 వేలు సేకరించి వుంచారు. సుమారు 1975 ప్రాంతంలో 78 ఆర్ఎంపీ రికార్డుల విడుదల ఆపేశాక వీటి సేకరణ మొదలు పెట్టానని చెబుతారు. వీటిలో దేశ, విదేశ భాషల రికార్డులున్నాయి. ఆయన దగ్గర సుమారు లక్షా పాతికవేల ట్రాక్స్... అరవైకి పైగా భాషలలో వున్నాయని చెబుతారాయన. ఇందులో కొన్ని భాషలకి లిపి కూడా లేదంటారు. అయితే ఆయన కలెక్షన్లో కేవలం సినిమా పాటలే కాదు అన్ని రకాల పాటలూ వున్నాయి. 1904లో గ్రామ్ ఫోన్ కంపెనీ మొట్ట మొదట విడుదల చేసిన రికార్డు దగ్గర నుండీ వివిధ భాషలలో వచ్చిన ప్రయివేట్ రికార్డులూ, ప్రముఖుల ప్రసంగాలూ, జానపద గీతాలూ, కామిక్ రికార్డులూ, నాటకాలూ, కర్ణాటక సంగీతమూ, హిందుస్థానీ సంగీతమూ; గ్రీకూ, లాటిన్ సంగీతమూ వున్నాయి. ఆయన కాలమిస్ట్‌గా వివిధ ఇంగ్లిష్, తెలుగు పత్రికలలో... సినిమా సంగీతం గురించీ, సంగీత దర్శకుల గురించీ, సినిమాల గురించీ చాలా విలువైన వ్యాసాలు రాశారు. మొట్టమొదట ‘సినీప్రభ’ అనే పత్రికలో ‘రికార్డ్ రివ్యూ’ అనే శీర్షికతో వ్యాసాలు రాసేవారు. ఆంధ్ర పత్రికలో 1962 ప్రాంతంలో ‘సరాగమాల’ అనే శీర్షికతో అప్పుడు మార్కెట్లో విడుదలయ్యే గ్రామ్‌ఫోన్ రికార్డుల సమాచారం గురించి రంగారావు రాసిన కాలమ్ బాగా పాపులర్ అయ్యింది. దీనికి స్ఫూర్తి బాబూ రావ్ పటేల్ ‘ఫిల్మిండియా’లో రాసిన ‘రికార్డ్స్ టు బై’ కాలమ్ అని చెబుతారు రంగారావు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ప్రజామత, ఆంధ్రజ్యోతి, జ్యోతి, విజయచిత్ర, సినిమా రంగం, వార్త వంటి పత్రికలలో సరాగమాల, మానసో ల్లాసం, చిత్రరథుని చైత్రయాత్ర, హంసధ్వని, ఆలాపన అనే శీర్షికలతో వ్యాసాలు రాశారు. ఇంగ్లిష్ ‘స్క్రీన్’ పత్రికలో ‘ది సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్’ శీర్షికతో హిందీ సినిమాల గురించి వ్యాసాలు రాశారు. ఇంకా ఆయన హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మూవీలాండ్, శృతి, మద్రాస్ మెయిల్ వంటి పత్రికలలో ఇంగ్లిష్‌లో వ్యాసాలు రాశారు. పబ్లిషర్‌గా రంగారావు ‘ఆనందమోహన కావ్యమాల’ పేరిట ప్రచురించిన పుస్తకాలు: కందుకూరి రుద్రకవి రాసిన ‘జనార్ద నాష్టకం‘, ఘంటసాల విదేశీ పర్యటన సందర్భంగా వేసిన పుస్తకం – ‘భువన విజయం’, ‘కొండగాలి తిరిగింది’–ఆరుద్ర రాసిన సినీ పాటల సంకలనం. ఆరుద్ర బయోగ్రఫీ –రంగారావే ఇంగ్లిష్‌లో రాసి ప్రచురించారు. ఇంకా ఆయన కొన్ని సంక్షిప్త శబ్దచిత్రాలు రూపొందించారు. అంటే మూడుగంటల సినిమాని గంటకి కుదించి కేసెట్లుగా, ఎల్పీలుగా విడుదల చేశారన్న మాట. పాటలు పాడగల పాత తరం నటీనటులను ఎన్నుకుని ‘అలనాటి అందాలు’ పేరుతో ఎల్పీలు రిలీజ్ చేశారు. బాలసరస్వతి, టంగుటూరి సూర్య కుమారి, భానుమతి, కన్నాంబ, నాగయ్య... వీరందరి పాటలూ అలనాటి అందాలలో వినడం ఒక అనుభవం. ఇవికాక కొన్ని ఎల్పీలు చేశారు. అవి –శ్రీకృష్ణ శరణం మమ, శ్రీరామ నామం శ్రీ కృష్ణ గానం; చిటారు కొమ్మన మిఠాయి పొట్లం – హాస్య గీతాలు, నాపేరు సెలయేరు – ఎల్లారీశ్వరి పాటలు. 2000 సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ మిలీనియం పేరిట ఆయన పొందు పరిచిన మూడు గంటల సినీ సంగీతం అత్యంత అపురూప మైనదీ, అరుదైనదీ. ఆయనకి అన్నమయ్య పదాలూ, క్షేత్రయ్య పదాలూ, సారంగపాణి పదాలూ, జావళీల మీద మక్కువ ఎక్కువ. ఆయన తనని తాను ‘అన్నమయ్య పద సేవకుడిని’ అని చెప్పుకుంటారు. ‘అన్నమయ్య పదాలలో లేనిది లేదు, రానిది రాదు’ అంటారు. ప్రయాణాలన్నా, కొత్తప్రదేశాలన్నా, కొండలూ గుట్టలూ ఎక్కడ మన్నా, ప్రాచీన ఆలయాలను సందర్శించడమన్నా, శాసనాలూ, శిల్పాల వంటివాటిని పరిశీలించడమన్నా అంతులేని ఆసక్తి. మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆయన గురువు. ఆరుద్ర ఆయన మార్గదర్శి. తనకిష్టమైన, తానారాధించే మల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి మహానుభావుల ప్రసక్తి వస్తే నోటమాట రాదు. డగ్గుత్తిక పడిపోతుంది. ఇలాంటి విజ్ఞాన భాండాగారాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆయన కాలమ్స్ రాయడం 2005లో ఆపేశారు. ఆయన దగ్గరున్న సమాచారమంతా ప్రజ లకు చేరే దారేది? ప్రస్తుతం వున్న డిజిటల్ యుగంలో ఆయన వీలైనన్ని వీడియోలూ, ఆడియో బుక్స్ చేసి తన దగ్గరున్న సమా చారాన్ని నిక్షిప్తం చేస్తే, కావలసిన వారికి ఎంతో ఉపయోగ పడుతుంది. డాక్టర్ భార్గవి, వ్యాసకర్త రచయిత్రి, వైద్యురాలు -
వర్షిణి వేదికెక్కి స్టెప్పేసిందంటే చాలు...
కరీంనగర్ (కోల్‌సిటీ) : సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి సొంత ప్రతిభతో యూట్యూబ్ స్టార్ గా రాణిస్తోంది. తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ మల్టీ టాలెంటెడ్ కళాకారిణిగా గుర్తింపు పొందింది. ఆమె గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన వరుమణి వర్షిణి. తెలంగాణ జానద పాటలు, దుమ్మురేపే డీజే సాంగ్స్‌కు వర్షిణి వేదికెక్కి స్టెప్పేసిందంటే చాలు... ఈలలు, చప్పట్లు. యువతను ఉర్రూతలాడించే జానపద నృత్యాలతో ఆకట్టుకుంటున్న వర్షిణీ డ్యాన్సర్‌గా, నటిగా, సింగర్‌గా, యాంకర్, యూట్యూబ్ స్టార్‌గా బహుముఖ రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉత్తమ నృత్యకారిణిగా అవార్డు... జానపద నృత్యంపై ఇంట్రెస్ట్ ఉన్న వర్షిణి... కరోనా లాక్డౌన్ సమయంలో చేసిన నృత్య ప్రదర్శన వీడియోను టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయగా, ఆ వీడియో వైరల్ అయ్యింది. వర్షిణి నృత్య ప్రదర్శకు అబ్బురపడిన ఎన్ఎస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు మైపాల్ ‘ఓ పిల్లగో...’ పాటకు వర్శిణితో నృత్య ప్రదర్శన చిత్రీకరించారు. ఇటీవల చిత్రీకరించిన ‘ఏమి జేద్దునే అవ్వో...’ ఈ పాటలో వర్షిణి చేసిన నృత్య ప్రదర్శనకు మూడు మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చాయి. ‘పున్నాపు వెన్నెల వలలో...’ పాటకు కూడా 10 మిలియన్స్ వరకు వ్యూస్ రావడం గమనార్హం. ఇప్పటి వరకు 135 జానపదం పాటలపై నృత్య ప్రదర్శన చేసిన వర్షిణి, నాలుగైదు షార్ట్‌ఫిల్మ్‌ల్లో కూడా నటించింది. జబర్దస్త్ బృందం వెంకీ–మంకీ, రాజమౌళి ఫేంలో ‘మోరియా మెరియా..’ పాటకు, అలాగే ‘కర్రెకోడి గరం మసాలా...’ పాటలకు ఆకట్టుకునే నృత్యం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జగిత్యాలలోని రాయికల్ మండలంలో వర్షిణిని, ‘ఉత్తమ నృత్యకారిణి’ అవార్డుతో ఆణిముత్యం కల్చరల్ డ్యాన్స్ అకాడమీ సత్కరించింది. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా వర్షిణిని ఘనంగా సత్కరించారు. సినిమాల్లో నటించాలనే కోరిక.. మంచి డ్యాన్సర్, నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి క్రమశిక్షణతో శ్రమిస్తున్నాను. సినిమాల్లో నటించాలని కోరిక. అలాగే వృత్తిపరంగా మంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి, ఉత్తమ టీచర్‌గా ఎదగాలని ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. – వరుమణి వర్షిణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు వాణి, వేణుమాధవ్ కూతురు వర్షిణిని జానపద నృత్యంలో ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న వర్షిణికి నృత్యం అంటే ప్రాణం. అలాగే నటన, యాంకరింగ్ అంటే కూడా చాలా ఇష్టం. కూతురు ఇష్టాలను గుర్తించిన తల్లిదండ్రులు, చదువు తోపాటు జాపనద నృత్యంలో రాణించేలా అండగా నిలుస్తున్నారు. సర్వేశ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో 2వ తరగతి నుంచే ప్రత్యేక నృత్య శిక్షణ తీసుకుంది. -
Nidhi Achha: ఈ టట్టింగ్ బహుత్ అచ్చా హై
సరదాగా చేసే కొన్ని పనులు గుర్తింపుతోపాటు మంచి పేరుని తెస్తాయి. నిధి అచ్చా కూడా ఇలానే సరదాగా చేసిన డ్యాన్స్ అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యేలా చేసింది. డ్యాన్స్‌ని కెరియర్‌గా ఎంచుకోవాలని అనుకోలేదు కానీ అంతర్జాతీయ డ్యాన్స్ పోటీలో విజేతగా నిలిచింది. ముంబైలోని కుర్లాకు చెందిన 23 ఏళ్ల డ్యాన్సర్ నిధి అచ్చా. ఐదేళ్ల వయసు నుంచి నిధికి డ్యాన్స్ అంటే ఇష్టం. దీంతో ఎక్కడ డ్యాన్స్ చూసినా వెంటనే ఆ స్టెప్పులు నేర్చుకునేది. ఇలా నేర్చుకున్న స్టెప్పులకు మరింత సాధన చేసి.. ఇటీవల అంతర్జాతీయ టట్టింగ్–2 కాంపిటీషన్లో విజేతగా నిలిచింది. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, దక్షిణాసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా నుంచి పాల్గొన్న ఒకే ఒక డ్యాన్సర్ నిధి. అబ్బాయిలు ఎక్కువగా ఉండే.. టట్టింగ్ డ్యాన్స్ పోటీల్లో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. నిధికి డ్యాన్స్ మీద ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వెన్ను తట్టి ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే డ్యాన్స్ తరగతులకు హాజరయ్యి మరింత సాధన చేసింది. మూడు వారాలపాటు కఠోర సాధనతో తన ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకుని తండ్రి సాయంతో ఆ డ్యాన్స్ వీడియోలను రికార్డు చేసుకునేది. ఈ సాధనతో అంతర్జాతీయ టట్టింగ్ విన్నర్‌గా నిలిచింది. నిధి టట్టింగ్తోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వీడియోలు పోస్టు చేస్తుంది. అంతేగాక ఎన్జీవోలో వలంటీర్‌గా పనిచేస్తూ.. వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలకు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. టట్టింగ్.. టట్టింగ్ అనేది వీధిలో చేసే ఒక రకమైన డ్యాన్స్. 1960–70లలో క్యాలిఫోర్నియాలో బాగా వాడుకలో ఉన్న డ్యాన్స్ ఇది. జామెట్రికల్ ఆకారంలో... 90 డిగ్రీల కోణంలో చేతులు, వేళ్లను కదిలించడం ఈ డ్యాన్స్‌లో ఉన్న ప్రత్యేకత. ఈజిప్ట్ కళలోని కొన్ని రకాల భంగిమలు టట్టింగ్ను పోలి ఉంటాయి. కేవలం చేతులతో చేసే ఈ డ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. (క్లిక్: ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారా?) -
పేదరికం వెంటాడుతున్నా.. డ్యాన్స్‌లో దుమ్ములేపుతున్న మహబూబ్‌నగర్ కుర్రాడు
సాక్షి, మహబూబ్‌నగర్: డాన్సంటే అతనికి పంచ ప్రాణాలు. ఏ రోజైనా తనను ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు గండేడ్ మండలం బైస్పల్లికి చెందిన యువకుడు భరత్. బైస్పల్లికి చెందిన గత్ప చిన్నయ్య, రుక్కమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు భరత్. ఈ కుటుంబానికి అర ఎకరా పొలమే ఆధారం కావడంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో తల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. భరత్ మాత్రం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నృత్యంలో మరింత రాటుదేలాడు. 40కి పైగా టీవీ షోలు.. భరత్‌కు చిన్నతనం నుంచే డాన్సు అంటే అమితాసక్తి. ఇంటర్ చదివే సమయంలో కోస్గికి చెందిన శ్రీనివాస్ మాస్టర్ చేరదీసి రెండేళ్లు శిక్షణ ఇచ్చాడు. అనంతరం ఆ మాస్టారే.. జీ తెలుగు టీవీ చానల్లో బిన్ని మాస్టర్ కొరిగ్రాఫర్ ఉండే ఆటో జూనియర్ ప్రోగ్రాంలో మొదటి సారి అవకాశం ఇప్పించాడు. ఇప్పటి వరకు మా టీవీ, జీ తెలుగు, జెమిని, ఈటీవీలలో 40కి పైగా డ్యాన్స్ షోల్లో పాల్గొన్నాడు. 2021లో ఢీ షోలో అవకాశం వచ్చింది. అలాగే, పలు రాష్త్రస్థాయి డాన్సు పోటీల్లో అవార్డులు, ప్రశంస పత్రాలు వచ్చాయి. వెంటాడుతున్న పేదరికం.. తండ్రి చిన్నయ్య రంగారెడ్డిలోని ఓ రైస్‌మిల్లులో కూలీ పనిచేసి అక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండడంతో కొడుకు ఎదుగుదలకు ఆర్థిక సహాయం అందించలేకపోతున్నా డు. అయితే, భరత్‌కు టీవీల్లో జరిగే షోల్లో అంతంతమాత్రంగానే డబ్బులు ఇవ్వడం, ఒక్కోసారి అసలు ఇవ్వకపోవడంతో స్నేహితుల వద్ద అప్పు చేసి తనకు కావాల్సినవి సమకూర్చుకుంటున్నాడు. అయితే, ఏప్రిల్ 17న హైద్రాబాద్‌లో జరిగిన ఆలిండియా రూరల్ కాంపిటేషన్స్‌లో సెమీఫైనల్‌కు భరత్ సెలెక్టు అయ్యాడు. ఈనెల 27 భూపాల్‌లో జరిగే పోటీలకు వెళ్లాల్సి ఉంది. డబ్బు లేక ఇంకా టికెట్లు కూడా బుక్ చేసుకోలేదు. దాతలు సహకరిస్తే ప్రతిభ చాటుతా.. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుతానన్న పట్టుదలే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఇప్పటి వరకు స్నేహితుల సహకారంతోనే వెళుతున్నా. ఏదైనా ప్రయివేటు ఉద్యోగం చేద్దామనుకుంటే టీవీ షోలు 15 రోజులు కంటిన్యూగా ఉండడం, మిగతా 15 రోజులకు ఎవరు అవకాశం ఇవ్వడం లేదు. ప్రస్తుతం భూపాల్ వెళ్లడానికి కూడా డబ్బులు లేక టికెట్లు బుక్ చేసుకోలేదు. దాతలు సహకారిస్తే ప్రతిభ చాటి పుట్టిన ఊరు, జిల్లా, ప్రాంతానికి మంచి పేరు తెస్తా. – భరత్, డ్యాన్సర్, బైస్పల్లి గండేడ్ మండలం -
టీనా డిప్రెషన్లో ఉన్నానని చెప్పింది : ఆట సందీప్
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్ విన్నర్ టీనా సాధు మరణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఫిట్‌గా ఉండే టీనా 38ఏళ్ల వయసులోనే మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీనా మరణంపై ఆట సందీప్ అనుమానం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. 'టీనా లేదన్న విషయం ఇంకా నమ్మబుద్ది కావట్లేదు. 5రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎంతో సరదాగా గడిపిన టీనాకు అంత సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆమె చాలా ఫిట్‌గా ఉంటుంది. ఇది గుండెపోటు అయ్యిండదనిపిస్తుంది. నాతో మాట్లాడినప్పుడు డిప్రెషన్లో ఉన్నాను. పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. కలిసినప్పుడు వీటిపై మాట్లాడతానని చెప్పింది. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది' అని పేర్కొన్నారు. దీంతో టీనా మృతిపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఆట సీజన్-1లో సందీప్-టీనాల జోడి టైటిల్ విన్నర్‌గా గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత చదవండి: డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్ ఎక్కువవడం వల్లే.. -
ఎక్కువగా మందు తాగడం వల్లే టీనా మృతి?
డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్ విన్నర్ టీనా సాధు మరణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చిన్నవయసులోనే టీనా మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆట మొదటి సీజన్‌కు విన్నర్‌గా నిలిచిన ఆమె ఆ షో నాలుగో సీజన్‌కు జడ్జిగానూ వ్యవహరించారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోంది. అయితే నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన టీనా యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసిందని, తిరిగి డ్యాన్స్ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని మనసులోని మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించిందని, అయితే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు తెలుపుతున్నట్లుగా ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇక టీనా సోషల్ మీడియాలో చివరిసారిగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by tina sadhu (@tinathestar18) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి: 'ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత -
భర్తపై ఇద్దరి భార్యల ఫిర్యాదు
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఒకరికొకరికి తెలియకుండా రెండు వివాహాలు చేసుకున్న ఓ డాన్సర్‌పై ఇద్దరు భార్యలు శుక్రవారం మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాపురం శెట్టిబలిజ వీధికి చెందిన సుమంత్ అనే వ్యక్తి వృత్తిరీత్యా డాన్సర్. స్టేజ్ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరిలోవకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం కావడం, అది ప్రేమగా మారడంతో కొంత కాలం కిందట పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా సుమంత్‌కు విజయవాడ ప్రాంతానికి చెందిన మరో యువతి పరిచయమైంది. ఆమెను పది రోజుల కిందట పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటికే సుమంత్‌కు పెళ్లయిన సంగతి విజయవాడ యువతికి తెలియదు. అలాగే విజయవాడ యువతితో ఇటీవల పెళ్లి జరిగిందన్న విషయం ఆరిలోవ బాలికకు తెలియదు. చివరకు ఈ విషయాన్ని ఇతర స్నేహితుల ద్వారా గురువారం తెలుసుకున్న మైనర్ బాలిక, విజయవాడ అమ్మాయి లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయింత్రం మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరి వద్ద వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. (చదవండి: పోలీసు ఇంటికే కన్నం) -
యుద్ధభూమిలో ఉన్నాం... నిబంధనలను అతిక్రమిస్తే ప్రాణాలకే ముప్పు
సాక్షి హైదరాబాద్: ‘ఉక్రెయిన్ పౌరులపై రష్యా ప్రస్తుతం అత్యంత దారుణంగా యుద్ధానికి పాల్ప డుతోంది. ఈ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కొందరు భార తీయ విద్యార్థులు నిబంధనలకు అతిక్రమించి బంకర్ల నుంచి బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధగా ఉంది’ అని ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, నృత్యకారిణి, అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న లీదియా జురావ్వోలా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ, చెన్నైలలో చదువుకున్న ఆమె భారతీయ సంస్కృతి, కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి నృత్యాలను నేర్చుకున్నారు. లీదియా ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కర్ణాటక విద్యార్థి నగరంలోని ఫ్రీడమ్ స్క్వేర్ భవనం వద్ద బాంబు దాడిలో మృతి చెందిన సంఘటన తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు.. రష్యన్ బలగాలు ఏ వైపు నుంచి విరుచుకుపడతాయో తెలియదు. కొందరు విద్యార్థులు ఉక్రెయిన్ ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్ల మీదకు వస్తున్నారు. ఏజెంట్లను నమ్మి సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా బంకర్లలోనే ఉండాలి. ప్రతి విదేశీ విద్యార్థి పట్ల ఉక్రెయిన్ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. మా వలంటీర్లు బంకర్ల వద్దకు వెళ్లి ఆహారం, మందులు ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముందే ఫిబ్రవరి 15న భారత ప్రభుత్వం తమ వాళ్లను స్వదేశానికి రావాలని సూచించింది. కానీ చాలా మంది విద్యార్థులు ఫిబ్రవరి 24 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చివరకు అంతర్జాతీయ రాకపోకలు స్తంభించడంతో చిక్కుల్లో పడ్డారు. స్థానిక రేడియోలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరైనా సరే కర్ఫ్యూ సడలించినప్పుడే బంకర్ల నుంచి బయటకు రావాలి. ఉక్రెయిన్‌లో 180 దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నారు. యుద్ధం కారణంగా అందరూ కష్టాల్లోనే ఉన్నారు. వారికి బంకర్లే సురక్షిత స్థావరాలు. ఆయా దేశాల ఎంబసీలు, ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. భారతీయ సంస్కృతిపై ప్రేమతో.. వినితియా నగరానికి చెందిన లీదియాను చిన్నప్పటి నుంచే విషాదం వెంటాడుతోంది. చెర్నోబిల్ అణు ధార్మికత ప్రభావంతో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. నాలుగుసార్లు సర్జరీలు జరిగాయి. కానీ యోగ, ధ్యానం, ప్రాణాయామంతో ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 2014లో జరిగిన యుద్ధంలో ఆమె తల్లిదండ్రులను, కుటుంబాన్ని కోల్పోయారు. అంతకుముందే 2011లోనే ఆమె భారత్‌కు వచ్చారు. నాట్యశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ‘బెల్ నాట్యం కథా కల్పం’ అనే నూతన నృత్యరీతిని పరిచయం చేశారు. ఆమెకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ప్రేమ. ఆ కోణంలోనే తన పేరులో చివరకు ‘లక్ష్మి’ వచ్చేలా పెట్టుకున్నట్లు లీదియా జురావ్వోలా లక్ష్మి పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో లీదియా.. ఆపదలో ఉన్న వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను అందుకొని అవసరమైన సహాయ సహకారాలను అందజేసే విధి నిర్వహణలో లీదియా ఉన్నారు. ఉక్రెయిన్ లోని ఏ మూల నుంచైనా ఇలాంటి అత్యవసర ఫోన్‌కాల్స్ రావచ్చు. వెంటనే వలంటీర్లను అక్కడికి తరలిస్తారు. లీదియాకు మాతృభాష ఉక్రెయిన్‌తో పాటు రష్యన్ భాష కూడా తెలుసు. అందుకే ఎస్ఓఎస్ విధులు అప్పగించారు. విభిన్న రంగాలకు చెందిన మేమంతా ఇప్పుడు మా దేశాన్ని కాపాడుకొనే పనిలో ఉన్నాం. సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు అందరం ప్రాణాలొడ్డి పోరాడుతున్నాం.మాకు ప్రపంచం మద్దతు కావాలి అని ఆమె చెప్పారు. (చదవండి: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం) -
ఇండియన్ షకీరా..12 రోజులపాటు బంధించినా వెనక్కి తగ్గలేదు!
కొలంబియా పాప్ సింగర్, డ్యాన్సర్ షకీరా పాడుతూ చేసిన డ్యాన్స్‌ను టీవీలో చూసింది తొమ్మిదేళ్ల తస్లీమా బానో. ఆ డ్యాన్స్ బాగా నచ్చడంతో ఎంతోఆసక్తిగా గమనించి స్టెప్పులను గుర్తుపెట్టుకుంది. ఒకరోజు వాళ్ల ఇంటికి దగ్గరలో జరుగుతున్న కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ చేస్తుంటే తస్లీమా కూడా డ్యాన్స్ చేసింది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు విపరీతంగా కోపడ్డారు. ‘‘ఇంకోసారి డ్యాన్స్ చేశావంటే ఊరుకోము’’ అని హుకుం జారీ చేశారు. అయినా వినలేదు. దీంతో పన్నెండురోజులపాటు ఒక గదిలో పెట్టి బంధించారు. అయినా తస్లీమా వెనక్కి తగ్గలేదు. తనలోని ప్రతిభతో అందరి మన్ననలు పొందడమేగాక తన తండ్రి మనసు గెలుచుకుని, ఏకంగా ఇండియన్ షకీరాగా ఎదిగింది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో చెందిన నూర్ మహ్మద్, బేగం దంపతుల ముద్దుల కూతురు తస్లీమా భానో. అమ్మవాళ్లు డ్యాన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో.. మొదట్లో వాళ్లకు ఎదురు చెప్పలేక వెనక్కు తగ్గింది తస్లీమా. ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకసారి స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో తస్లీమా డ్యాన్స్పోటీలో పాల్గొంది. మిగతా వారికంటే బాగా డ్యాన్స్ చేయడంతో మొదటి బహుమతి గెలుచుకుంది. అంతేగాక ఆ కార్యక్రమాన్ని చూసిన వారంతా తస్లీమాను చప్పట్లు, అభినందనలతో ముంచెత్తారు.స్కూలు టీచర్లు తనలోని డ్యాన్స్ ప్రతిభను తెగపొగిడేశారు. అక్కడకు వచ్చిన నూర్ మహ్మద్ ఇవన్నీ చూసి.. ‘ఇంతటి ప్రతిభను మేము ప్రోత్సహించకుండా వద్దన్నామా?’ అని గ్రహించి, అప్పటి నుంచి తస్లీమా డ్యాన్స్ చేయడాన్ని ప్రోత్సహించేవారు. కానీ అమ్మకు మాత్రం ఏ మాత్రం ఇష్టం ఉండేదికాదు. అలా తస్లీమా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ‘గోరీ నాఛే’ నుంచి.. ‘గోరీ’గా మారింది తండ్రి ప్రోత్సాహంతో చిన్నచిన్న కార్యక్రమాలలో తన డ్యాన్స్‌లతో అలరించేది తస్లీమా. సాఫీగా సాగిపోతున్న డ్యాన్స్ జర్నీలో ఒక పెద్ద కుదుపు ... 2010లో నూర్‌మహ్మద్ మరణించాడు. హఠాత్తుగా జరిగిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన తస్లీమా ఏడాది పాటు డ్యాన్స్ ప్రపంచాన్ని వదిలేసింది. షాక్ నుంచి కోలుకున్నాక మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. రాజస్థానీ పాట ‘లే ఫొటు లే’ తస్లీమాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత చేసిన ‘గోరీ నాఛే నాగోరీ నాఛే’ పాట రాజస్థాన్‌లోనే సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కపాటతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయింది. కొంతమంది స్టార్ల పేర్లు మారినట్టే.. అభిమానులంతా గోరీ నాగోరీగా పిలుస్తూ తస్లీమాపేరునే మార్చేశారు. ఏ ప్రదర్శనకు వెళ్లినా గోరీ అనిపిలుస్తూ.. ముందు ‘నాగోరీ’ పాటకు డ్యాన్స్ చేయాలని డిమాండ్ చేసేవారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక పాపులర్ పాటలకు స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ, ఇతర డ్యాన్సర్ల కంటే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. రాజస్థాన్‌తోపాటు హర్యాణా, ఢిల్లీ, యూపీలలో తస్లీమాకు మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. నటుడు, ర్యాపర్, సింగర్, డ్యాన్సర్, ప్రొడ్యూసర్‌గా హర్యాణాలో పాపులర్ అయిన సన్నీ చౌదరీతో కలిసి కొన్ని డ్యాన్స్ వీడియోలు చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాది విడుదలైన ‘ఘఘరో’ సాంగ్ ఒక్కరోజులో 16 మిలియన్ల వ్యూస్‌తో రీజనల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రతిభ ఉండాలేగానీ ఎంత పెద్దఅడ్డంకి అయినా మన ‘ఎదుగుదల’ను ఆపలేదని తస్లీమా డ్యాన్స్ జర్నీ స్ఫూర్తినిస్తోంది. -
ప్రముఖ డ్యాన్సర్‌పై చీటింగ్ కేసు.. అరెస్టు వారెంట్ జారీ
ప్రముఖ డ్యాన్సర్ సప్నా చౌదరి వివాదంలో చిక్కుకుంది. ఒక ప్రోగ్రామ్‌ను రద్దు చేసి, టిక్కెట్ హోల్డర్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శంతను త్యాగి బుధవారం చౌదరిపై వారెంట్ జారీ చేశారు. కేసు తదుపరి విచారణ తేదీ అయిన నవంబర్ 22 లోగా దీనిని అమలు చేయాలని పోలీసులను కోరారు. సప్నా చౌదరి గతంలో కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది అయితే కోర్టు దీనిని తిరస్కరించింది. అసలేం జరిగిందంటే.. 2018 అక్టోబర్ 13న లక్నోకు చెందిన సప్నా చౌదరితో డ్యాన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె టీం డబ్బులు వసూలు చేసింది. షో తిలకించేందుకు వేలాది మంది ప్రజలు కూడా తరలివచ్చారు. అయితే ఆ రోజు చౌదరి రాత్రి 10 గంటల వరకు రాలేదు, దీంతో షో రద్దు అయ్యింది. కార్యక్రమం రద్దు కావడంతో జనం అక్కడికక్కడే తోపులాట సృష్టించారు. షో జరగకపోయినా యాజమాన్యం తీసుకున్న రూ.300 టికెట్ సొమ్మును ప్రజలకు తిరిగి ఇవ్వలేదు. దీంతో టికెట్ కొన్న కొందరు ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ డ్యాన్సర్‌తో పాటు, ప్రోగ్రామ్ నిర్వాహకులు జునైద్ అహ్మద్, నవీన్ శర్మ, ఇబాద్ అలీ, అమిత్ పాండే, రత్నాకర్ ఉపాధ్యాయ్‌ల పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. చదవండి: Repeal of farm laws:మోదీకి షాకిచ్చిన కంగనా, వివాదాస్పద వ్యాఖ్యలు -
వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో
సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. క్యాబ్ డ్రైవర్ మహ్మద్ అప్సర్‌తోపాటు రేస్ కోర్స్ బుకీ నహీద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం ఫాతిమా భర్త మృతిచెందడంతో క్యాబ్ డ్రైవర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది, ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ డ్రైవర్‌పై ఫాతిమా ఒత్తిడి తీసుకొచ్చింది. డ్యాన్స్‌లు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని డ్రైవర్ ఫాతిమాకు షరతు పెట్టాడు. చదవండి: బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కాగా దీంతో వివాహ విషయంలో క్యాబ్ డ్రైవర్, ఫాతిమాకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫాతిమాకు మద్యం తాగించి క్యాబ్ డ్రైవర్ ఉరి వేసి హత్య చేశాడు. ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్ ఫాతిమాకు ఏడుగురు సంతానం. ఫాతిమా భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ తల్లి ఫాతిమానే పోషించుకునేది. ప్రస్తుతం ఫాతిమా మరణంతో పిల్లలు అనాథలుగా మారారు. చదవండి: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి కిరాతకంగా... -
మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
-
బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
చాంద్రాయణగుట్ట: ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా(30)కు ఏడుగురు సంతానం. భర్త నదీం చనిపోవడంతో ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం వస్తువులను షిఫ్ట్ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది.ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధనగ్నంగా ఉండటం, పక్కనే బీరు బాటిల్ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో తండ్రి చనిపోవడం, తాజాగా తల్లి చనిపోవడంతో చిన్నారులు అనాథలయ్యారు. -
‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’
న్యూఢిల్లీ: ప్రఖ్యాత భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ తాను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి బాధపడుతున్నానని కనీసం తనలాంటి సీనియర్ సిటిజన్లకు ఒక నిర్థిష్ట కార్డునైనా జారీ చేయాలంటూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజ్ఞప్తి చేశారు. సుధాచంద్రన్ ఒక కారు ప్రమాదంలో తన కాలును కోల్పోయినప్పటికి కృత్రిమ కాలుతో నృత్యం చేసి భారతదేశ గర్వపడే స్థాయికి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. (చదవండి: పైశాచికం: కొట్టి.. జుట్టు కత్తిరించి.. సామూహిక అత్యాచారం) ఈ మేరకు ఆమె వృత్తిరీత్యా ప్రయాణాల నిమిత్తం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిని ప్రతిసారి సెక్యూరిటీ తీరుతో తాను చాలా బాధపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సుధాచంద్రన్ మాట్లాడుతూ....నేనే ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. అంతేకాదు ఒక ప్రమాదంలో కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో చరిత్ర సృష్టించటమే కాక భారతదేశ గరవ్వపడేలా చేశాను. అలాంటి నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థిస్తూ మోదీజికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. (చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!) -
సెంచరీ వయసులో పవర్ లిఫ్టర్‌గా రికార్డు సాధించిన బామ్మ
న్యూయార్క్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ్మగారు తన వయసులోని మిగిలిన మహిళల్లా మూలన కూర్చునే రకం కాదు. సెంచరీ వయసులోనూ సవాళ్లకు సై అనే సాహసి. బరువులెత్తడంలో గొప్ప బలశాలి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పవర్ లిఫ్టర్‌గా ఇటీవలే గిన్నిస్ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఈ అమెరికన్ బామ్మ పేరు ఎడిత్ ముర్వే ట్రయిన్. ఇటీవల ఆగస్టు 8న నూరవ పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే.. ఆగస్టు 5న గిన్నిస్ రికార్డు సాధించింది. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) వృద్ధుల పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రికార్డు బద్దలుకొట్టిన ఎడిత్, చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేమీ కాదు. ఇదివరకు ఆమె ఒక స్థానిక రిక్రియేషన్ క్లబ్లో డాన్ ట్రైనర్‌గా పనిచేసేది. రోజూ డాన్స్ చేయడం వల్లనే తన శారీరకమైన కదలికల్లో చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని చెబుతుందీమె. పోటీల కోసం ప్రత్యేక ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలేవీ పాటించలేదని, రోజూ రాత్రిపూట జిన్‌తో తయారు చేసే ‘మార్టిని’ కాక్టెయిల్ తీసుకోవడం తనకు అలవాటని, బహుశ ఆ అలవాటే తన చురుకుదనానికి కారణం కావచ్చని ఈ బామ్మ చిరునవ్వులు చిందిస్తూ చెబుతుండటం విశేషం. (చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!) -
తండ్రి అడుగుల్లో తనయి.. మొదటి గురువు ఆయనే.. ఆరేళ్లకే
సాక్షి, నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆ చిన్నారికి పట్టుమని 11 ఏళ్లు. అయినా కూచిపూడి నాట్యకళాకారిణిగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలో ప్రదర్శనలు. గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. చిన్నారి నృత్య, అభినయానికి పలువరి ప్రసంశలు కూడా అందుకుంది నెల్లూరుకు చెందిన నృత్యకారిణి విజయ హరిణి. తండ్రి అడుగుల్లో అడుగులువేసి.... మద్దులూరి సురేష్, అలేఖ్య దంపతులు నెల్లూరు రామలింగాపురం వాసులు. సురేష్ వెస్ట్రన్ డ్యాన్సర్‌గా రాణించి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా స్థిరపడ్డాడు. తండ్రి డ్యాన్సును చిన్నప్పటి నుంచి చూసిన హరిణికి డ్యాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. అది గమనించిన తండ్రి తానే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని తనయికి నేర్పాడు. తొలి గురువుగా తాను చేసి ప్రయత్నం ఫలించింది. అతి తక్కువ సమయంలోనే హరిణి నృత్యకళాకారిణిగా ఎదిగింది. తండ్రి తనయుల నృత్య ప్రదర్శన, గిన్నీస్ బుక్‌లో స్థానం నవరసాలను అభినయిస్తూ, కూచిపూడి నృత్యంలో వివిధ అంశాలపై నృత్య రూపకాలతో తన ప్రతిభను చాటింది. పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాలకు అనుగుణంగా ఎదిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందోనని ఈ తండ్రి కూతుళ్లు తమ నృత్యంతోనే జవాబిచ్చారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని నృత్యం మరింత పెనవేసింది. దీంతో విజయ హరిణి కూచిపూడి నృత్యకారిణిగా రాణిస్తుంది. విజయానికి తొలి అడుగు ఇంటి నుండే ప్రారంభమై దేశవ్యాప్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వాలని ఆ చిన్నారి ఆకాంక్ష. కాళికామాత అభినయంలో హరిణి హరిణి నృత్య ప్రస్థానం ఇలా... – 2016లో ఆరేళ్ల వయసులో నెల్లూరు టౌన్ హాలులో మొదటి ప్రదర్శనతో నృత్య కిషోర్ అవార్డును అందుకుంది. – 2018లో తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతీయ పోటీల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. – 2018లో లేపాక్షిలో జరిగిన ఉత్సవాల్లో తెలుగు బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. – 2019లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో నృత్య తరంగిణి అవార్డును మాజీ గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అందుకుంది. – 2019లో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. – 2020లో చెన్నైలో త్యాగయ్య టీవీ ఆధ్వర్యంలో లార్జెస్ట్ కూచిపూడి లెవెన్‌లో తన తండ్రి సురేష్‌తో పాటు పాల్గొని గిన్నీస్బుక్ఆఫ్వరల్డ్ రికార్డులో స్థానం సాధించింది. – ప్రతి ఏడాది షిర్డీలో బాబా ఉత్సవాల్లో బాబా సమాధి వద్ద క్రమం తప్పని నృత్య ప్రదర్శన. హరిణి నృత్య ప్రదర్శన -
మైకేల్ జాక్సన్ స్టెప్పులతో స్ట్రీట్ డ్యాన్సర్ హల్చల్
-
దూసుకుపోతున్న సాఫ్ట్వేర్ కొరియోగ్రాఫర్!
జీవితంలో ఎన్నో సాధించాలని ప్రణాళికలు రూపొందించుకుంటుంటాం. కానీ వాటిలో మనం సాధించగలమన్న నమ్మకం ఉన్న కలను మాత్రమే నిజం చేసుకోగలుగుతామని చెబుతోంది ముంబైకి చెందిన సోనాలి భదౌరియా. కెరియర్ని ఎంచుకునేటప్పుడు ఇష్టమైన డ్యాన్స్‌లో ఎదగాలా? ఉన్నత చదువులు చదవాలా అని సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ చివరికి తనకి ఎంతో ఇష్టమైన డ్యాన్స్‌ను వృత్తిగా మార్చుకుని అందులో రాణిస్తూ లక్షలమంది అభిమానులను సొంతం చేసుకుని యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది సోనాలి. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సోనాలికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎనలేని అభిమానం. టీవీ, రేయోలలో పాటలు వస్తున్నాయంటే వెంటనే ఆ సంగీతానికి తగ్గట్టుగా తన శరీరాన్ని రకరకాల భంగిమల్లో కదిలించేది. తల్లిదండ్రులు కూడా సోనాలి ఆసక్తిని గమనించి డ్యాన్స్‌ను ప్రోత్సహించేవారు. ఇంటర్మీడియట్ అయ్యాక.. డ్యాన్స్‌ను కెరియర్‌గా మలుచుకోవాలో?.. ఇంజినీరింగ్ చేయాలా అన్న సందేహం ఎదురైంది సోనాలికి. అప్పుడు బాగా ఆలోచించి ఇంజినీరింగ్‌ను ఎంచుకుంది. బీటెక్ పూర్తయ్యాక ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేరింది. ఆఫీసులో పనితోపాటు, ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి ‘క్రేజీ లెగ్స్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిసి సోనాలి క్రేజీ క్లబ్లో చేరింది. ఇక్కడే ఆమె డ్యాన్సర్‌గా మారడానికి మొదటి అడుగు పడింది. ఒకపక్క క్రేజీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూl.. మరోపక్క నాట్యంలోని మెళకువలను నేర్చుకుంటూ కఠోర సాధన చేసి వివిధ డ్యాన్స్ కాంపిటీషన్లలో పాల్గొనింది. లీవ్ టు డ్యాన్స్ విత్ సోనాలి అదే సమయంలో ..తనలాగే డ్యాన్స్ గ్రూప్‌లో పనిచేస్తోన్న వ్యక్తి పరిచయమవ్వడంతో అతన్నే పెళ్లి చేసుకుంది. సోనాలికి డ్యాన్స్ పట్ల ఉన్న అంకిత భావాన్ని గమనించిన భర్త ప్రోత్సహించడంతో సోనాలి మరింత క్షుణ్ణంగా డ్యాన్స్ నైపుణ్యాలను ఔపోసన పట్టి స్వయంగా డ్యాన్స్ స్టెప్పులను క్రియేట్ చేయగల స్థాయికి ఎదిగి, ఏకంగా కొరియోగ్రాఫర్‌గా మారింది. దీంతో 2016లో ‘లీవ్ టు డ్యాన్స్ విత్ సోనాలి’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఒక పక్క సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే మరోపక్క తన డ్యాన్స్ వీడియోలను రూపొందించి యూ ట్యూబ్ ఛానల్ల్లో పోస్టుచేసేది. ఆమె డ్యాన్స్ వీడియోలకు మంచి స్పందన లభించడంతో మరిన్ని వీడియోలు అప్లోడ్ చేసేది. ఉద్యోగ బాధ్యతలతో డ్యాన్స్ వీడియోలు అప్లోడ్ చేయడానికి తీరికలేకుండా పోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తి సమయాన్ని డ్యాన్సింగ్ స్కిల్స్ పెంచుకోవడంపై వెచ్చించింది. ఈ క్రమంలోనే 2017లో సోనాలి స్వయంగా కొరియోగ్రఫీ చేసిన ‘నషే సి చా«ద్ గాయి’, ‘షేప్ ఆఫ్ యూ’ సీక్వెన్స్ వీడియోలు యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయ్యాయి. దీంతో సోనాలికి మంచి డ్యాన్సర్గానేగాక, కొరియోగ్రాఫర్‌గా కూడా గుర్తింపు వచ్చింది. అక్కడ నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫ్యాన్ఫెస్ట్లలో సోనాలికి ఆదరణ పెరిగింది. ఒక పక్క డ్యాన్సర్ అవ్వాలన్న కలను నెరవేర్చుకోవడమేగాక, మరోపక్క పెద్దపెద్ద డ్యాన్స్ ఈవెంట్స్, వెడ్డింగ్ ప్రాజెక్టులు చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. వీటితోపాటు డ్యాన్సింగ్ వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఎంతో మందిని డ్యాన్సర్లుగా తీర్చిదిద్దుతోంది. లక్షలమంది సబ్‌స్రై్కబర్స్‌తో.. సోషల్ మీడియా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవాలంటే కొత్త కంటెంట్‌తో వ్యూవర్స్‌ను ఆకట్టుకొంటుండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సోనాలి ఎప్పటికప్పుడూ వినూత్న స్టెప్పులు, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, అదిరిపోయే ఎనర్జీతో డ్యాన్స్ వీడియోలు రూపొందిస్తూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఏడులక్షలకుపైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, 23 లక్షల మంది యూ ట్యూబ్ ఛానల్ సబ్‌స్రై్కబర్స్‌తో దూసుకుపోతూ నేటి యువతరానికి డ్యాన్సింగ్ ఐకాన్‌గా నిలుస్తోంది సోనాలి. -
వైరల్: అంగవైకల్యం ఉన్నా.. స్టెప్పులు ఇరగదీసిన యువతి
ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ ఓ యువతి డాన్స్‌ని ఇరగదీసింది. ఆ యువతి తనకున్న ఒక్క కాలుతో అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వికలాంగ డాన్స్‌ర్ సుభ్రీత్ కౌర్ ఘుమ్మన్ అగ్నిపత్లోని హిట్ సాంగ్ 'చికినీ చమేలీ' డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఆమె చేసిన డాన్స్‌కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుభ్రీత్ మొదటి సారి.. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆమె ఈ షోలో రెండో రౌండ్‌కు అర్హత కూడా సాధించింది. ఇటీవల సుభ్రీత్ అప్పట్లో తాను డాన్స్ చేసిన పాటకు మళ్లీ అదే ఎనర్జీతో స్టెప్పులేసిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో... " నా మొదటి టీవీ నృత్య ప్రదర్శనను 7 సంవత్సరాల తరువాత మళ్లీ చేస్తున్నాను ... మీకు ఇది నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను" అనే క్యాప్షన్తోటి ఈ వీడియోను అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఇప్పటికే 28 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టింది. నెటిజన్లు ఆమె డాన్స్‌కు , ఆత్మధైర్యానికి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by subhreet Kaur Ghumman (@subhreet.ghumman) -
Anam Darbar: సెలబ్రిటీ డాటర్ అట్రాక్టివ్ అనమ్!
తల్లిదండ్రుల సెలబ్రెటీ హోదాను వాడుకుని పాపులర్ అయ్యేవారు కొందరైతే.. సెలబ్రిటీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తమ సొంత ప్రతిభతో స్టార్లుగా మెరుస్తున్నవారు మరికొందరు. ఇటువంటి వారికి ఉదాహరణగా నిలుస్తోంది.. ‘అనమ్ దర్బార్’. ముంబైకి చెందిన 23 ఏళ్ల అనమ్ దర్బార్ 22 లక్షలమంది ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా స్టార్‌గా దూసుకుపోతోంది. ఎంతో క్యూట్‌గా కనిపించే అనమ్ .. మోడల్, డ్యాన్సర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. 2017లో టిక్‌టాక్‌తో సోషల్ మీడియాకు పరిచయమైన అనమ్... కొత్తగా కంటెంట్‌ను క్రియేట్ చేసేది. ట్రెండింగ్ టాపిక్స్‌పై వీడియోలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేది. అంతేగాకుండా లిప్‌సింక్, కామెడీ వీడియోలను సరికొత్తగా చేసి టిక్‌టాక్ ఫాలోవర్స్‌ను తనవైపు తిప్పుకుంది. దీంతో తన వీడియోలు చూసే ఫాలోవర్స్ సంఖ్య ఎనిమిది మిలియన్లకు చేరింది. అయితే కొన్ని కారణాలతో ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చేయడంతో.. అనమ్ తన సొంత యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రాంక్ వీడియోలు, డ్యాన్సింగ్ వీడియోలు, మేకప్ ట్యూటోరియల్స్, ట్రావెల్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనమ్ వీడియోలు బాగా పాపులర్ అవడంతో తన ఫోటో చాలా మ్యాగజీన్ల కవర్ పేజీలపై కనిపిస్తోంది. ఇవేగాక ప్రింట్ షూట్స్‌లో పనిచేస్తూ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టిపెరిగిన అనమ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయేల్ దర్బార్ గారాల పట్టి. పాపులర్ కొరియోగ్రాఫర్, టిక్ టాక్ స్టార్ అవేజ్ దర్బార్‌కు స్వయానా చెల్లెలు. అవేజ్ దర్బార్, జైద్ దర్బార్లు ఇద్దరూ పాపులర్ కొరియోగ్రాఫర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఎంటర్టెయినర్స్కు అనమ్ ఒకరికి చెల్లి అయితే మరొకరి అక్క. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ‘బి యూ ఇన్’, ‘అత్రంగజ్’ డ్యాన్స్ స్టూడియోలను అవేజ్ నిర్వహిస్తున్నాడు. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రెటీలకు డ్యాన్స్ నేర్పించిన ఈ స్టూడియోలలో అనమ్ సభ్యురాలుగా ఉంది. అంతేగాక తన అన్నయ్యలతో కలసి అనేక డ్యాన్స్ వీడియోలు రూపొందించింది. అన్నయ్య ప్రేరణతో.. ముంబైలోనే పెరిగిన అనమ్ కామర్స్ గ్రాడ్యుయేట్. అనమ్ సెలబ్రెటీ కాకముందు కొంచెం లేజీగా ఉండేది. అయితే అవేజ్, అవేజ్ స్నేహితురాలు నగ్మా మిరాజ్కర్ కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తుండడం చూసి.. వారిని ప్రేరణగా తీసుకుని తను కూడా వీడియోలు రూపొందించి టిక్‌టాక్‌లో పోస్టు చేసేది. చూస్తుండగానే బాగా పాపులర్ అయ్యింది. కొద్దికాలంలోనే తన వీడియోలను ఇష్టపడే వారి సంఖ్య లక్షలకు చేరింది. తన వీడియోలతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోన్న అనమ్ ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్‌ను బాగా ఇష్టపడుతుంది. చేతిమీద ఇంగ్లిష్ అక్షరాల్లో ‘పాజిటివిటి’ అని ట్యాటూ వేసుకుని అంతే పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఒకపక్క తన వీడియోలతో సోషల్ మీడియా నెటిజన్లను అలరిస్తూనే మరోపక్క ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, యాడ్లలో నటించడం ద్వారా, ఫ్యాషన్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా బాగానే సంపాదిస్తోంది. తన సంపాదనలో కొంత భాగాన్ని ఎన్జీవోలకు విరాళంగా ఇస్తూ ఎంతోమందికి విద్యాదానం చే స్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్ మాత్రం..
రాజాం: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్సు అదిరిపోతుంది. ప్రత్యేకించి స్టెప్పులంటూ ఏమీ ఉండవు.. కానీ నృత్యం మాత్రం లయబద్ధంగానే సాగుతుంది. ఉన్న చోట నుంచి మనిషి కదలడు.. అయితేనేం దరువుకు తగ్గట్టు నాట్యం రక్తి కడుతుంది. రాజాంకి చెందిన సూర్యప్రకాష్ ప్రత్యేకత ఇది. కేవలం కళ్లు, పెదవులు, ముక్కు, చెవులు, గొంతుతో అతను చేసే అభినయానికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఒక్కసారి సూర్య డ్యాన్సు చూశారంటే వారెవ్వా ఏమి ఫేసు అనకుండా ఉండలేరు. తాజాగా ఓ జాతీయ చానెల్లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలో కూడా ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు. నా పేరు అలుగోలు సూర్యప్రకాష్. మాది రాజాం పట్టణ పరిధిలోని మల్లిఖార్జున కాలనీ. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాకు ముగ్గురు అన్నదమ్ములతో పాటు ఒక సోదరి ఉన్నారు. అందరిలో నా పెద్ద సోదరుడు మాత్రమే ఉన్నత చదువులు చదవగలిగాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సెక్టారులో పనిచేస్తున్నాడు. మిగిలిన సోదరులమంతా కార్పెంటర్లుగా పనిచేసుకుంటున్నాం. నేను రాజాం బజార్‌లోని ప్రభుత్వ యూపీ స్కూల్లో 5వ తరగతి వరకూ మాత్రమే చదివాను. నాకు భార్య శ్రావణికుమారితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం మాకు వివాహం జరిగింది. ఆసక్తితోనే ఫేస్ డ్యాన్సర్‌గా.. నాకు చిన్నప్పటి నుంచి స్టేజీపై నటించాలని ఉండేది. కానీ ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. 1996 నుంచి నాలుగేళ్ల పాటు విశాఖపట్నంలో ఉన్నాను. అక్కడే రైన్కింగ్ కరాటే డోస్ శిక్షణ కేంద్రంలో చేరాను. కరాటేతో పాటు కర్రసాము నేర్చుకున్నాను. 30 సార్లు కరాటే పోటీల్లో పాల్గొనడమే కాకుండా బహుమతులు కూడా సాధించాను. అనంతరం వివాహం జరగడం, ఇతర కారణాలతో కొన్నేళ్లు సాధారణంగా గడిచిపోయాయి. పిల్లలు కొద్దిగా పెద్దవారు కావడంతో పాటు ఆ మధ్య వచ్చిన టిక్ టాక్‌లో ఏదో ప్రదర్శన ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. ఒక అమెరికా టిక్‌టాకర్ తన కళ్లతో అభినయం చేయడం చూశాను. నేను కూడా కష్టపడి కళ్లు, తర్వాత కను బొమ్మలు, ముక్కు, చెవులు, గొంతు వంటి శరీర భాగాలను కదుపుతూ డ్యాన్స్ చేయడం ప్రారంభించాను. హిందీ చానెల్లో ప్రదర్శన.. ప్రారంభంలో చాలా కష్టంగా ఉండేది. రానురానూ పట్టు సాధించడంతో ఏ పాటకైనా మ్యూజిక్కు అనుగుణంగా ముఖంలోని ఏ భాగాన్నై నా కదిలించే సామర్థ్యం వచ్చింది. టిక్‌టాక్‌లో ఈ ప్రదర్శనకు ఎన్నో లైక్‌లు వచ్చాయి. దేశవిదేశాల్లో 1.70 మిలియన్ల నెటిజెన్లు నాకు ఫాలోవర్లుగా మారారు. ఇందులో నా స్నేహితులు నన్ను గుర్తించి టిక్‌టాక్ అవార్డు ఇచ్చారు. అనంతరం నన్ను గుర్తించిన పలు యూట్యూబ్ చానెల్స్‌తో పాటు కొన్ని పెద్ద చానల్లు కూడా నా ఫేస్ డ్యాన్స్‌పై ఆసక్తి చూపినా గురించి ప్రపంచానికి పరిచయం చేశాయి. నటనపై మక్కువతోనే... నాకు నటన అంటే చాలా ఇష్టం. ఏ దో ఒక సినిమాలో చేయాలని ఉంది. గతంలో కన్నడ మూవీలో చేస్తావా అని ఒక కన్నడ నిర్మాత నాకు ఫోన్ చేసి అడిగారు. ఈ ఏడాది మేలో అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంకా ఆ అవకాశం రాలేదు. తెలుగు సినిమాలో ఒక్క సారైనా నటించి నా ప్రతిభ ను చాటుకోవాలని ఉంది. ప్రతిభకు చదువుతో పనిలేదు. పేదరికం అడ్డు కాదు అని నిరూపించడంతో పాటు నేను సొంతంగా నేర్చుకున్న ఫేస్ డ్యాన్స్ కళను పది మందికి తెలియజేయాలని చూస్తున్నాను. జాతీయ స్థాయిలో గుర్తింపు... నెల రోజుల క్రితం ముంబై నుంచి నాకు కలర్స్ చానల్ నుంచి పిలుపు వచ్చింది. వారు ఏర్పాటుచేసిన డ్యాన్స్ డివైన్ షో–3లో నన్ను పాల్గొనాలని కోరారు. నేను అక్కడకు వెళ్లిన తర్వాత జాతీయ స్థాయిలోని ఎంతో మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇస్తుంటే నా ఫేస్ డ్యాన్స్ ఏమంత గుర్తింపు రాదులే అనుకున్నా. నేను స్టేజ్ ఎక్కి ఫేస్ డ్యాన్స్ చేస్తే ఒకటే ఈలలు. నా చిన్ననాటి అభిమాన హీరోయిన్ మాధురీదీక్షిత్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె అప్పట్లో తన కళ్లతో అభిన యం చేసేది. అంతే కాకుండా అక్కడ షోకు న్యాయ నిర్ణేతలుగా, నిర్వాహకులుగా వ్యవహరించిన తుషార్కాలియా, ధర్మేష్, రాఘవ తదితరులుతో మాట్లాడే అవకాశం కూడా కలిగింది. చదవండి: ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
నేడు... రేపటిని చెక్కే ఉలి
‘నీ లక్ష్యాలను, గమ్యాన్ని నిర్ణయించాల్సింది సమాజం కాదు, నువ్వే’ అమ్మ ఈ మాట చెప్పిన క్షణం నుంచి నాకు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. నేను సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో పూర్తి మార్పు వచ్చింది’... ప్రఖ్యాత ఒడిషా శాస్త్రీయ నాట్యకారుడు ప్రేమ్ సాహు చెప్పిన మాట ఇది. అలాగే ‘నిన్నటి రోజున నువ్వు నీ రోజును ఎలా గడిపావో గుర్తు చేసుకో. ఈ రోజు అంతకంటే మెరుగ్గా గడవాలి. ఈ రోజు రేపటి రోజును మరింత మెరుగు పరచాలి. అంటే జరిగి పోయిన రోజు... జరగబోయే రోజును చెక్కే ఉలి కావాలి’ అని చెప్పింది ప్రేమ్సాహు వాళ్ల అమ్మ మంజులత. అబ్బాయేనా! ఒడిశా రాష్ట్రం, కటక్ నగరంలో పుట్టిన ప్రేమ్సాహుకి నాట్యసాధన ఇష్టం. అతడికి నాట్యం నేర్పించడం అతడి తల్లికి ఇష్టం. ముప్పై ఏళ్ల కిందటి కటక్ సమాజానికి మాత్రం ఇష్టం లేదు. ప్రేమ్ నాట్యసాధన చేస్తే నవ్వేవారు. నాట్యముద్రల్లో అతడి వేళ్లు సున్నితంగా ఒదిగిపోయేవి. ‘అబ్బాయి లక్షణాలేమైనా ఉన్నాయా’ అని ముఖం మీదనే నవ్వేవారు. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శన కోసం ఉత్సాహంగా పేరిచ్చే వాడతడు. ప్రాక్టీస్‌కి వెళ్లడానికి క్లాసు టీచర్ని అనుమతి అడిగినప్పుడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నోటి వెంట రాకూడని ఎగతాళి మాటలు వచ్చేవి. టీచర్ల వ్యంగ్యం చాలు తోటి పిల్లలు ప్రేమ్‌ని ఏడిపించడానికి. ప్రేమ్ గురించి మాట్లాడాలంటే అతడి జెండర్ గురించిన మాటలు తప్ప మరేవీ పట్టని సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడుకుకు ధైర్యం చెప్పింది మంజులత. గెలిపించే తెగింపు ఇదిలా ఉండగా ఓ రోజు... ప్రదర్శన తర్వాత మేకప్ గదిలో ఒక సీనియర్ నటుడు ప్రేమ్‌కు దగ్గరగా వచ్చి తాకాడు, ఆ తాకడంలో ఏదో తేడా ఉందని గ్రహించేలోపు అతడు పద్నాలుగేళ్ల ప్రేమ్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ మూల దాక్కుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఉరి మెడకు వేసుకునేలోపే... తల్లి ఎప్పుడూ చెప్పే ధైర్య వచనాలు గుర్తు వచ్చాయతడికి. జీవించి చూపించాలనే మొండిధైర్యం అయితే వచ్చింది. కానీ నలుగురిలో కలవడానికి బిడియపడేవాడు. రోజంతా గదిలోనే ఉంటూ గంటల కొద్దీ నాట్యసాధన చేసేవాడు. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఢిల్లీలోని సాహిత్య కళాపరిషత్‌లో స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవీ ముద్గల్ దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నాడు. హేతుబద్ధమైన విమర్శను స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకోవడం, అసూయతో కూడిన అర్థరహితమైన విమర్శలను మనసుకు పట్టనివ్వకపోవడం కూడా నేర్చుకున్నాడు ప్రేమ్ సాహు. అతడు సాధించిన పరిణతి లండన్‌లోని ఒడిశా సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ ఫెస్టివల్ నిర్వహించిన వేడుకల్లో ప్రేమ్ ఇచ్చిన నాట్యప్రదర్శనలో వ్యక్తమైంది. ఆ ప్రదర్శన పూర్తయిన వెంటనే ఒక వృద్ధ మహిళ వేదిక మీదకొచ్చి ‘మనోహరమైన, మనసు పెట్టి చేసిన నీ నాట్యం చూస్తుంటే నాకు ఏడుపాగలేదు’ అని కన్నీళ్లు తుడుచుకుంది. నాట్యకారులకు ఇంతకంటే గొప్ప ప్రశంస మరొకటి ఉండదని చెప్పాడు ప్రేమ్ సాహు. తనను ఈ స్థాయిలో నిలబెట్టింది తన తల్లి అలవరచిన గుండె ధైర్యమేనని చెప్పాడు. ఆమె సింహం లాంటి «గుండెదిటవు కలిగిన మనిషి అని తల్లిని ప్రశంసించాడు ప్రేమ్ సాహు. తల్లితో ప్రేమ్సాహు ప్రేమ్సాహు -
డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: బెజవాడలో ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గాయత్రి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు గాయత్రి ఇంటికి నీలిమ అనే యువతి వచ్చివెళ్లిన విషయం తెలిసిందే. అయితే నీలిమ భర్త బన్నీతో గాయత్రికి అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం. (చదవండి: ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి) దీంతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా తన భర్తతో వివాహేతర సంబంధంపై గాయత్రితో నీలిమ గొడవ పడింది. మనస్తాపం చెందిన గాయత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా గాయత్రి ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే ఆమెతో ఘర్షణ పడలేదని నీలిమ తెలిపింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసులే తేల్చాలని నీలిమ వ్యాఖ్యానించింది.(చదవండి: టీడీపీ నేత బెదిరింపులు తాళలేక..) -
ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో డాన్సర్ గాయత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి ఇంటి కొచ్చినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు తెలిసింది.(చదవండి: భార్యతో కలిసి అత్తమామల ఉసురు తీశాడు) నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి.. ఇంట్లో చీరతో ఉరివేసుకుంది. ఆ సమయంలో పిల్లలతో కలిసి గాయత్రి భర్త సతీష్ బయటకు వెళ్లారు. గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రితో గొడవ పడిన నీలిమాని పోలీసులు విచారిస్తున్నారు. (చదవండి: టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు) -
కాన్సర్‌తో ప్రముఖ డ్యాన్సర్ కన్నుమూత
ముంబై: భారతీయ ప్రముఖ నాట్యకారుడు అస్తాద్ డెబూ(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముంబైలోని నివాసంలో అస్తాద్ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు.. ‘‘ఈరోజు వేకువజామున ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. నృత్యం పట్ల ఉన్న అంకితభావమే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది. వేలాది మంది గుండెల్లో ఆయనకు స్థానం కల్పించింది. నేడు భౌతికంగా ఆయన దూరమయ్యారు. కానీ అభిమానుల మనస్సుల్లో ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారు’’ అని ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేశారు. (చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) కాగా కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వర్లీలో అస్తాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కథక్, కథాకళి ప్రదర్శనలతో అద్భుతాలు చేసిన అస్తాద్ డెబూ.. భారత, పాశ్చాత్య కలయికతో సరికొత్త నృత్యరూపకాలు సృష్టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. 80,90వ దశకాల్లో ఆయన కెరీర్ తారస్థాయికి చేరుకుంది. అస్తాద్ మృతి పట్ల సినీ ప్రముఖులలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. -
డ్రగ్స్‌తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత
యశవంతపుర: మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్‌కు చెందిన నటుడు కిశోర్ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్శెట్టి ఒక డ్యాన్సర్. బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి, డ్రగ్స్ లింక్‌పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్‌శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్ మిత్రుడు ప్రతీక్‌శెట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదాపడింది. -
తండ్రికి భూమి కొనిచ్చిన కుమార్తె
రోజుకు 80 రూపాయలు సంపాదించే ఓ రైతు కూలీ కుమార్తె సోనాలి. అలాంటిది భారతదేశం నుండి అమెరికా వరకు డాన్స్ షోలలో విన్యాసాలను చూపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. కోల్‌కతాలోని భివాష్ అకాడమీ ఆఫ్ డాన్స్‌కు చెందిన ఇద్దరు నృత్యకారులు సుమంత్ మార్జు, సోనాలి మజుందార్. ఇద్దరూ అమెరికాలోని గాట్ టాలెంట్ షోలో పాల్గొని వారి అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచారు. ‘ఫాటా పోస్టర్ నిక్లా హీరో‘ చిత్రంలోని ‘ధాటింగ్ నాచ్‘ సాంగ్‌కి ఈ జంట అద్భుతమైన నృత్యం చేసింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారంతా సోనాలిని ప్రశంసలతో ముంచెత్తారు. వారంతా ఆమె కుటుంబం గురించి తెలుసుకున్నప్పుడు సోనాలి పట్ల వారికున్న గౌరవం మరింత పెరిగింది. ఆకలితో నిద్రపోయిన రోజులు సోనాలి మాట్లాడుతూ ‘నా తండ్రి రోజూ 80 రూపాయలు సంపాదించే రైతు కూలీ. ఆర్థికలేమి కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు కడుపునిండా తినడానికి ఇంట్లో తిండే ఉండేది కాదు. ఆకలితో నిద్రపోయిన రోజులెన్నో. ఆ ఆకలే ఈ రోజు నాలో ప్రతిభను వెలికి తీయడానికి కారణమయ్యిందేమో అనిపిస్తోంది’ అని సవినయంగా తెలిపింది. తన ప్రతిభతో కుటుంబానికి కీర్తి తీసుకొచ్చింది. 2012 లో భారతదేశంలో గాట్ టాలెంట్ సీజన్ 4 విజేతగా సోనాలి మజుందార్ నిలిచింది. భూమి.. ఇల్లు 2019 లో సోనాలి బ్రిటన్ గాట్ టాలెంట్ లో పాల్గొంది. అక్కడ, తన ఊరి గురించి ప్రస్తావిస్తూ– ‘బంగ్లాదేశ్ సమీపంలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చాను, అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు‘ అని వివరించింది. ఇప్పుడు సోనాలీ సంపాదనతో ఆమె తండ్రి తన ఊళ్లో భూమి కొన్నాడు, ఇల్లు కట్టాడు. రైతు కూలీగా జీవితం వెళ్లిపోతుందనుకున్న ఆ తండ్రి కూతురు కారణంగా నిజమైన రైతు అయ్యాడు. కూతురుని కన్నందుకు ఆ తండ్రి అదృష్టవంతుడు అని గ్రామస్థులు చెప్పుకుంటూ ఉంటారు. కళ్లార్పని ప్రదర్శన అమెరికాలోని గాట్ టాలెంట్ కోసం సోనాలి, సుమంత్ రోజూ 8–10 గంటలు ప్రాక్టీస్ చేశారు. ‘ఈ షోలో పాల్గొనడం అనేది నా కల. మా గురువు బివాష్ సార్ వల్ల నా కల నెరవేరింది. నేను డ్యాన్స్ షో కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కటే అనుకున్నాను. ప్రేక్షకులు కళ్లార్పకుండా చూసేలా ప్రదర్శన ఇవ్వాలి అని’ చెప్పింది సోనాలి. ఆ మాటను షోలో పాల్గొన్న ప్రతీసారీ నిలబెట్టుకుంటోంది సోనాలి. -
ప్రముఖ డాన్సర్ కన్నుమూత
కోల్‌కతా: వెటరన్ డాన్సర్ అమల శంకర్ కన్నుమూశారు. 101 ఏళ్ల వయసులో ఆమె కోల్‌కతాలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు శ్రీనంద శంకర్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. మేం గత నెలలోనే ఆమె బర్తడేని జరిపాం. ముంబాయి నుంచి కోల్‌కతాకు విమానాలు లేవు. చాలా బాధగా ఉంది. మీకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఒక శకం ముగిసింది. లవ్ యూ తమ్మా. థ్యాంక్యూ ఫర్ ఎవ్రీ థింగ్ అని పోస్ట్ చేసింది. చదవండి: అసంపూర్ణం కూడా సంపూర్ణమే! అమలా శంకర్ 1919 జూన్ 27న బంగ్లాదేశ్‌లో జన్మించింది. ప్రముఖ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్‌ను పెళ్లాడింది. ఆమె ఒక గ్రామంలో పుట్టి పెరిగినప్పటికీ ఆమె తాతయ్య అక్షయ్ కుమార్ నందే ఆమెను తనతో పాటు ప్యారిస్ తీసుకువెళ్లారు. ఆమె అక్క ఇంట్నరేషనల్ కలోనియల్ ఎగ్జిబిషన్ నిర్వహించేవారు. ఆమె 11 సంవత్సరాల వయస్సులో ఉదయ్ శంకర్‌ను కలిశారు. అప్పటికే ఉదయ్, అమల కంటే 19 సంవత్సరాలు పెద్ద. తరువాత ఉదయ్ డాన్స్‌లు నచ్చి ఆకర్షితురాలైన అమల అతనికి దగ్గరయ్యింది. ఉదయ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో వారిని ఒప్పించింది. అమల వాళ్ల నాన్న గారు ఆమె ఒక రచయిత కావాలని ఆశ పడ్డారు. ఆమె 14 ఏళ్ల వయసులోనే సాత్ సగోరేర్ పారే అనే పుస్తకాన్ని రాసింది. తరువాత 1942లో ఉదయ్‌ను పెళ్లి చేసుకుంది. ఆయనతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో డాన్స్ షోలు చేశారు. తన భర్త ఉదయ్ రాసి, దర్శకత్వం వహించిన కల్పన అనే కథలో అమల నటించారు కూడా. చాలా సంతోషంగా గడిచిన అమల జీవితం 101 ఏళ్ల వయసులో ముగిసింది. చదవండి: ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్ -
16 ఏళ్ల టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన టిక్ టాక్ స్టార్, డ్యాన్సర్ సియా కక్కర్ (16) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకుపైగా ఫాలోవర్లు, టిక్ టాక్‌లో 10 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఘటన మరువక ముందే మరో నైపుణ్యం ఉన్న ఆర్టిస్ట్ మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె తన వ్యక్తిగత సమస్యల వల్ల ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని, పని పరంగా ఆమె బాగా చేస్తున్నారని సియా మేనేజర్ అర్జున్ సారిన్ చెప్పారు. బుధవారం రాత్రి కూడా ఓ ప్రాజెక్టు విషయమై ఆమెతో మాట్లాడినట్లు చెప్పారు. అప్పుడంతా బాగానే ఉన్నట్లు అనిపించిందని చెప్పారు. ఆమె మరణించడంపై ఫొటోగ్రాఫర్ వైరల్ భయాణి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో మంచి నైపుణ్యం ఉన్న ఆమె ఇలాంటి దారి ఎంచుకోవడం విషాదమన్నారు. -
నాట్యప్రియ
‘‘మా అమ్మాయికి పుట్టుకతోనే నాట్యం వచ్చింది’’ అంటున్నారు మద్దిపట్ల కృష్ణవేణి, సత్యకుమార్ దంపతులు. ఇది వింత కాదు, విచిత్రం అంతకంటే కాదు... నెలల పాపాయిగా ఉయ్యాలలో ఉన్నప్పుడే తల్లి జోలపాటకు అనుగుణంగా కాళ్లు చేతులను కదిలిస్తూ కేరింతలు కొట్టేది. ‘‘నా గొంతు పలికే స్వరానికి అనుగుణంగా లయబద్ధంగా కాళ్లు కదుపుతోంది. పాపాయికి నాట్యం నేర్పిద్దాం’’ అన్నారు కృష్ణవేణి. గోదావరి తీరం, రాజమండ్రి నగరం, రాఘవేంద్రస్వామి మఠం వెనుక ఉన్న వారి ఇంటి గోడలే ఇందుకు సాక్ష్యాలు. ఆ రోజు వాళ్లు అలా అనుకున్నారు... పదిహేనేళ్ల లోపే వారి కలల పంట పరిమళ హరిప్రియ ఆ అమ్మానాన్నలు ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. ఏడు కొండల మీద తిరుమల మాడవీథుల్లో వేంకటేశ్వరుని సన్నిధిలో నాట్య ప్రదర్శన ఇచ్చింది. తిరుమలలో నాట్యప్రదర్శన మూడో ఏట నాట్యసాధన ప్రారంభించిన హరిప్రియ ఇప్పటి వరకు ఐదువందలకు పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతర్జాతీయ వేదికల ఆహ్వానాలు అందుకుంటోంది. నాట్యాన్ని ఎన్ని వేదికల మీద ప్రదర్శించినప్పటికీ పుణ్యక్షేత్రాలలో నాట్యం చేసినప్పుడే పరిపూర్ణత చేకూరుతుందని నమ్మేది హరిప్రియ. ‘‘2018లో ఓ సారి మేమంతా వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాం. దేవుని ఎదుట నాట్యం చేయాలనే కోరిక అంత బలంగా ఉండడమే కారణం కావచ్చు. వరాహస్వామి దర్శనం చేసుకుని బయటకు రాగానే తదాత్మ్యంతో హరిప్రియ పాదాలు వాటంతట అవే కదలసాగాయి. తమాయించుకోలేకపోయింది. ఆ క్షణంలో అక్కడే నాట్యం చేసింది. అలాగే ఈ ఏడాది మరోసారి దర్శనానికి వెళ్లాం. అప్పుడు కూడా వరాహస్వామి ఆలయం సమీపంలోని మాడవీధిలో సూరదాస్, కబీర్దాస్ అభంగాలకు స్వామివారి ఊరేగింపులో నాట్యం చేసింది. ఆ దేవునికి ఆమె సమర్పించిన నాట్యాంజలి అది’’ అన్నారు హరిప్రియ తల్లిదండ్రులు. శృంగేరీ పీఠాధిపతి రచనకు నృత్యాభినయనం శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామి రచించిన ‘గరుడగమన తవ చరణకమల’ గీతం పరిమళ హరిప్రియను అమితంగా ఆకట్టుకుంది. ఈ గీతానికి స్వయంగా నాట్యరీతిని కంపోజ్ చేసిందామె. ఆ నర్తనాన్ని యూట్యూబ్‌లో సుమారు ఆరు లక్షలమంది వీక్షించారు. మీరాబాయి ‘గిరిధర గోపాల’రచనకు కూడా హరిప్రియ స్వయంగా కంపోజ్ చేసిన ప్రదర్శన కూడా వేలాదిమంది కళాభిమానుల ప్రశంసలు అందుకుంది. నాట్యమయూరి శ్రీహరికోటలో ఇస్రో 2018లో నిర్వహించిన కార్యక్రమం, ఉడిపి రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో జరిగిన నృత్యోత్సవంలో ఈ తెలుగింటి చిన్నారి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమిళనాడు, హోసూరు మాధవ మహాసభ ఆధ్వర్యంలోనూ, బెంగళూరులో కూచిపూడి నాట్యపరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మంత్రాలయం, పుట్టపర్తి తదితర క్షేత్రాలలో నాట్యప్రదర్శనలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. తెలంగాణ రాష్ట్రం, శంషాబాద్‌లో చిన్నజీయరు స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో నాట్యం చేసి జీయరు ఆశీస్సులు అందుకుంది. గుంటూరులో 2015లో జాతీయస్థాయి పోటీలలో హరిప్రియ ‘నాట్యమయూరి’ పురస్కారాన్ని, వివిధ సాంస్కృతిక సంస్థల నుండి ‘నర్తన బాల, నాట్యపరిమళ’ పురస్కారాలను అందుకుంది. చదువుకు నాట్యం అడ్డంకి కాదు ‘నాట్యం చదువులో ఒక భాగం అని అనుకుంటున్నప్పుడు, నాట్యం చదువుకు అడ్డంకి ఎలా అవుతుంది?’ అంటోంది హరిప్రియ. ‘‘నాట్య సాధనను నేను నా కోసమే కొనసాగిస్తున్నాను. భావవ్యక్తీకరణకు, నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి నాట్యం ఒక సాధన. తిరుమల మాడ వీధిలో నా నాట్యం చూసి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు ద్వారం లక్ష్మి ఫోను చేసి అభినందనలు తెలిపారు. అదో తీయని అనుభూతి’’ అన్నారు హరిప్రియ. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రభావం హరిప్రియ నాట్య ప్రదర్శనల మీద కూడా ప్రభావాన్ని చూపించింది. ఈ ఏడాది తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన హరిప్రియ వేసవి సెలవుల్లో మస్కట్‌లో నాట్య ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రదర్శన కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి, రాజమండ్రి ఫొటోలు : గరగ ప్రసాద్ ఆన్లైన్ నాట్య శిక్షణ మొదట చింతలూరి శ్రీలక్ష్మిగారి వద్ద మూడు సంవత్సరాలపాటు కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. తరువాత ఘంటసాల పవన్‌కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాను. కేరళ రాష్ట్రం, కొచ్చిన్‌కు చెందిన హేమంత్ లక్ష్మణ్ నుండి ఆన్లైన్లో భరతనాట్యం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో నాట్య సాధన కూడా ఖర్చుతో కూడిన కళగా మారిపోయింది. చాలా కోచింగ్ సెంటర్లు నాట్యాన్ని వ్యాపారాత్మకం చేస్తున్నాయి. నాట్యం చేయగలిగిన ప్రతిభ ఉండి, శిక్షణ తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేనివారి కోసం... నేను పెద్దయ్యాక ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించాలన్నదే నాధ్యేయం. – పరిమళ హరిప్రియ, శాస్త్రీయ నాట్యకారిణి -
బోట్ డ్యాన్సర్.. కొరియోగ్రాఫర్.. విజయ్
బౌద్ధనగర్: లక్ష్యాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడంతోపాటు ఓర్పు, నేర్పు, కష్టపడేతత్వం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రుజువు చేస్తున్నాడు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన వర్ధమాన కొరియోగ్రాఫర్ విజయ్. బోట్ డ్యాన్సర్‌గా రూ.50 రోజువారీ వేతనంతో జీవితాన్ని ప్రారంభించి నేడు సొంతంగా డ్యాన్స్ స్టూడియోను ఏర్పాటు చేసుకుని ఆసక్తిగల చిన్నారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాడు. రోల్‌రిడా ఆల్బమ్స్‌కు నృత్యాలు అందించడంతోపాటు డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్, క్యాస్టూమ్స్ డిజైనర్‌గా ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు విజయ్. బోట్ డ్యాన్సర్‌గా ప్రస్థానం మొదలు.. నిరుపేద కుటుంబానికి చెందిన విజయ్‌కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లంటే ఆసక్తి. లుంబినీ పార్కులో బోట్ డ్యాన్సర్‌గా చేరాడు. రోజుకు కేవలం రూ.50 వేతనం ఇచ్చేవారు. బోట్ డ్యాన్సర్‌గా కొనసాగుతూనే సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడు. వీ9 డ్యాన్స్ స్టూడియో ఏర్పాటు సోదరుడు సంతోష్‌కుమార్ సాయంతో వారాసిగూడలో సొంతంగా వీ9 డ్యాన్స్ స్టూడియోను స్థాపించాడు. హిప్హప్, కాంటెంపరరీ, సెమిక్లాసికల్, లిరికల్ హిప్హప్ తదితర డ్యాన్స్‌ల్లో శిక్షణ ఇస్తున్నాడు. స్టూడియో సక్సెస్ కావడంతో మణికొండ, హబ్సిగూడల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి వేలాదిమందికి శిక్షణ ఇస్తున్నాడు. సినిమా ఇండ్రస్టీ నుంచి పిలుపు.. సినిమా ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో 2012లో సినిమాల్లోకి ప్రవేశించిన విజయ్ డ్యాన్సర్‌గా సుమారు 150 సినిమాల్లో నటించాడు. మిర్చి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల్లో ప్రభాస్, పవన్‌కళ్యాణ్ సరసన స్టెప్పులేశాడు. అనంతరం కొరియోగ్రాఫర్‌గా అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. చచ్చిందిగొర్రె, తమిళతంబి వంటి సినిమాలతోపాటు రోల్‌రిడా ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా తన పనితనానికి పదునుపెట్టాడు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. చిన్నారులతో డ్యాన్స్ పోటీలు నిర్వహించి ‘ఢీ’ తరహా ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాడు. -
డ్యాన్స్ ఆపివేయడంతో యువతిపై కాల్పులు
లక్నో : పెళ్లి వేడుకలో నృత్యం చేయడం ఆపివేసిందనే ఆగ్రహంతో దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో డిసెంబర్ 1న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరో యువతితో కలిసి డాన్స్ చేస్తున్న యువతి నృత్యాన్ని నిలిపివేయడంతో అక్కడి ఉన్న వారిలో నుంచి ఓ వ్యక్తి నృత్యం ఆపితే కాల్చివేస్తానని హెచ్చరించడం కనిపించింది. మరో వ్యక్తి ఆమెపై కాల్పులు జరపాలని అన్నంతలోనే యువతి ముఖంపైకి బుల్లెట్ దూసుకువచ్చింది. బుల్లెట్ ఆమె దవడలోకి దూసుకుపోయిందని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్ద సుధీర్ సింగ్ పటేల్ కుమార్తె పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన సమయంలో వేదికపై ఉన్న పెళ్లి కూతురు మామలు మిథిలేష్, అఖిలేష్‌లకు కూడా గాయాలయ్యాయి. గ్రామ పెద్ద కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. పెళ్లి కూతురు బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
లిస్బన్ క్లబ్ ఘటన.. డీజీపీ ఆరా
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లిస్బన్ క్లబ్ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు. క్లబ్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హరిణి అనే యువతిని అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం, దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు 100కు ఫోన్ చేసిన తరువాత అక్కడికి వచ్చిన పోలీసులు తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. పంజాగుట్ట సీఐతో మాట్లాడిన డీజీపీ.. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన నివేదిక త్వరగా అందించాలని ఆదేశించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇదివరకే తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సయీద్ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. చదవండి : బట్టలూడదీసి పబ్ డ్యాన్సర్‌ను కొట్టారు..! -
బట్టలూడదీసి పబ్ డ్యాన్సర్‌ను కొట్టారు..!
హైదరాబాద్: ఆమె పొట్టకూటి కోసం నగరానికి వచ్చింది. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఓ బార్లో డ్యాన్సర్‌గా చేరింది. తోటి డ్యాన్సర్లు, నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం చేయాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. దానికి ఒప్పుకోకపోవడంతో ఆ యువతి ఒంటిపైనున్న బట్టలూడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు... గుంటూరు జిల్లా సంగడికుంట కాలనీకి చెందిన జి.హరిణి(26) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలసి నగరానికి వచ్చింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఉంటూ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు యత్నించింది. సరైన అవకాశాలు రాకపోవడంతో ఐదునెలల క్రితం బేగంపేటలోని లిస్బన్ క్లబ్లో డ్యాన్సర్‌గా చేరింది. మొదట్లో బాగానే సాగినప్పటికీ కొద్దిరోజుల నుండి తోటి డ్యాన్సర్లు, ఓ మధ్యవర్తి వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి చేయసాగారు. తాను అసాంఘిక కార్యకలాపాలు చేయనని, పొట్టకూటి కోసమే డ్యాన్సర్‌గా చేస్తున్నానని హరిణి స్పష్టం చేసింది. దీంతో ఆమెపై వారు కోపం పెంచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటకు పబ్ మూసేయగానే మధ్యవర్తి సయ్యద్ మాజీద్ హుస్సేన్ అలియాస్ సయీద్(30), తోటి డ్యాన్సర్లు ఎర్రబెల్లి సంధ్య అలియాస్ రితిక(24), జెక్క శ్రావణి అలియాస్ స్వీటీ(20), ఎస్.రేఖ అలియాస్ మధు(25), కొడాలి విజయారెడ్డి అలియాస్ విజ్జు(24)లు ఓ కస్టమర్ వద్దకు వెళ్లాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీనికి హరిణి ఒప్పుకోకపోవడంతో ఒంటిపై బట్టలు ఊడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఆ యువతి అరుస్తూ వారి నుండి తప్పించుకుని బయటకు వచ్చి ‘100’కు ఫోన్ చేసింది. దీంతో వారు మరింత రెచ్చిపోయి పోలీసులకు ఫోన్ చేస్తావా.. అంటూ ఆమె సెల్‌ఫోన్‌ను గుంజుకొని పగలగొట్టారు. పట్టించుకోని పోలీసులు సమాచారం తెలుసుకున్న పంజగుట్ట ఎస్సై, సిబ్బంది అక్కడకు చేరుకుని తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని బాధితురాలు ఆరోపించింది. ‘‘అమ్మాయిని కాపాడండి.. స్టేషన్‌కు తీసుకువెళ్లండి..’అని పబ్‌లోని కస్టమర్లు అన్నప్పటికీ పట్టించుకోకుండా, స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చెయ్యి, అప్పుడు చూద్దాం’అన్నారని బాధితురాలు వాపోయింది. పోలీసుల ముందే నిందితులు తనను పచ్చిబూతులు తిట్టారని, కొట్టడానికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. 10 రోజులక్రితం ఇదే తరహా ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని, పైగా చాలా చులకనగా మాట్లాడారని బాధితురాలు తెలిపింది. పొట్టకూటి కోసం నగరానికి వచ్చామని, తన తండ్రికి కళ్లు కనిపించవని, తల్లి పొలం పనులకు వెళుతోందని రోదిస్తూ తెలిపింది. పబ్‌లో కూడా వేతనం ఉండదని, డ్యాన్స్ చేస్తుండగా కస్టమర్లు ఇచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపింది. ఆమె ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం: ఏసీపీ బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు సయీద్ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
గాయకుడు రఘు, డ్యాన్సర్ మయూరి విడాకులు
యశవంతపుర : కన్నడ గాయకుడు రఘుదీక్షిత్, డ్యాన్సర్ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం రఘు దీక్షిత్‌పై మీటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. కొంతకాలంగా వీరు వేర్వురుగా ఉంటున్నారు. పెద్దలు నిర్ణయం మేరకు సామరస్యంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరు విడాలకుల కోసం కోర్టులు కేసు దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆరు నెలల పాటు అంటే డిసెంబర్‌కు వాయిదా వేశారు. -
పెళ్లి కాలేదన్న వేదనతో డాన్సర్ ఆత్మహత్య
పెరంబూరు: సినీ డాన్సర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక వడపళని, భజన్కోయిల్ వీధికి చెందిన రాధాకృష్ణన్ కుమారుడు సెంథిల్(36) అవివాహితుడు. చాలా కాలంగా సినీరంగంలో డాన్సర్‌గా పనిచేస్తున్నాడు. నృత్యదర్శకుడు, నటుడు లారెన్స్ గ్రూప్‌లోనూ పలు చిత్రాలకు పనిచేశాడు. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ పిల్లలకు డాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా, సరైన సంబంధం కుదరడం లేదు. ఈ విషయం చెప్పి తన స్నేహితులతో బాధ పడుతుండేవాడని తెలిసింది. పెళ్లి కాలేదన్న మానసిక వేదనతో సెంథిల్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో విరుగంబాక్కం పోలీ సులు అక్కడికి వచ్చి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో.. డాన్స్ ఇరగదీశాడు!
కోల్‌కతాకు చెందిన డాన్సింగ్ స్టార్ 14 ఏళ్ల అక్షత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. టీవీల్లో డాన్స్ కార్యక్రమాలు వీక్షించే వారికి అక్షత్ సుపరిచితుడు. ఇండియా’స్ గాట్ టాలెంట్ టీవీ షోలో సల్మాన్ ఖాన్ పాటకు అతడు చేసిన డాన్స్ వీడియో వైరల్ కావడంతో 2014లో అక్షత్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడికి పలు టీవీ షోల్లో పాల్గొనే అవకాశాలు దక్కాయి. తాజాగా బ్రిటన్స్ గాట్ టాలెంట్ షోలో అక్షత్ అదరగొట్టాడు. తన డాన్స్, హావభావాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. జడ్జిలతో పాటు ప్రేక్షకులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని ప్రశంసించారు. కుమారుడి ప్రతిభను కళ్లారా చూసి అక్షత్ తల్లి ఆనంద భాష్పాలు రాల్చారు. అక్షత్ సింగ్ తాజా డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావని జడ్జిలు అడిగిన ప్రశ్నకు అక్షత్ స్ఫూర్తిదాయక సమాధానం ఇచ్చాడు. ‘అందరిని సంతోషంగా ఉంచాలి. కష్టపడితే ఏదైనా సాధించగలమ’ని నిరూపించడానికి ఈ షోలో పాల్గొన్నానని జవాబిచ్చాడు. అక్షత్ మొదటిసారి బెంగాలీ రియాలిటీ షో ‘డాన్స్ బంగ్లా డాన్స్’లో పాల్గొన్నాడు. తర్వాత ఇండియా’స్ గాట్ టాలెంట్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. దీంతో అతడి కుటుంబం ముంబైకి మారింది. -
స్టెప్పుకి మెప్పు
డ్యాన్స్‌లో సరికొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చి దక్షిణాది, ఉత్తరాది తారలతో ఉర్రూతలూగించే స్టెప్పులేయించిన ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అనిపించుకున్నారు ప్రభుదేవా. తండ్రి సుందరం మాస్టారుని ఆదర్శంగా తీసుకుని, ఆయన దగ్గరే సహాయకుడిగా చేసి, ఆ తర్వాత నృత్యదర్శకుడిగా మారారు ప్రభుదేవా. 13 ఏళ్ల వయసులో తొలిసారి ‘మౌనరాగం’(1986) చిత్రంలో ఫ్లూట్ వాయించే కుర్రాడిగా ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా ఆ తర్వాత ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేశాడు. ‘ఇదయం’ (1991) (తెలుగులో ‘హృదయం’)లో చేసిన స్పెషల్ సాంగ్ ‘ఏప్రిల్ మేయిలే..’ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇక ‘జెంటిల్‌మేన్’లో ‘చికుబుకు చికుబుకు రైలే...’ సాంగ్‌లో ప్రభుదేవా వేసిన స్టెప్స్ సూపర్ అననివాళ్లు లేరు. ఇతర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు పలువురు అగ్రహీరోల చిత్రాలకు నృత్యదర్శకుడిగానూ చేశారు ప్రభుదేవా. 16 ఏళ్ల వయసులో తొలిసారి నృత్యదర్శకుడిగా కమల్‌హాసన్ ‘వెట్రి విళా’కి చేసిన ప్రభుదేవా ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా అయ్యాడు. రజనీ ‘దళపతి’లోని ‘చిలకమ్మా చిటికెయ్యంట...’, చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’... వంటి చిత్రాలతో పాటు రీ–ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’ వరకూ ప్రభుదేవా పలు చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. నాగార్జునతో ‘విక్రమ్, కెప్టెన్ నాగార్జున’ వంటి చిత్రాలకు, బాలకృష్ణ, వెంకటేశ్ .. ఇలా అగ్రహీరోలందరితో కొత్త స్టెప్పులు వేయించారు. ఒకవైపు నృత్యదర్శకుడిగా కొనసాగుతూ నటుడిగా మారారు ప్రభుదేవా. దర్శకుడు పవిత్రన్ ‘ఇందు’ చిత్రంలో ప్రభుదేవా తొలిసారి లీడ్ రోల్ చేశారు. శంకర్ ‘ప్రేమికుడు’ హీరోగా ప్రభుదేవాకు పెద్ద బ్రేక్. ఆ సినిమాలో ‘ముక్కాలా ముక్కాబులా..’, ‘ఊర్వశీ ఊర్వశీ.. టేకిట్ ఈజీ పాలసీ..’ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ని నేటి తరం కూడా ఫాలో అవుతోంది. ‘మెరుపు కలలు’, ‘సంతోషం’..వంటి చిత్రాలతో పాటు డ్యాన్స్ బేస్డ్ మూవీస్ ‘స్టైల్’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలు కూడా చేశారు. డైరెక్షన్ మారింది తండ్రి దగ్గర సహాయకుడిగా చేసి, నృత్యదర్శకుడిగా స్టెప్ వేసి, నటుడిగా మరో అడుగు వేసి, ఆ తర్వాత డైరెక్టర్‌గానూ తన కెరీర్ డైరెక్షన్ మార్చారు ప్రభుదేవా. సిథ్ధార్థ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన తొలి చిత్ర ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ హిట్. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’ని తెరకెక్కించారు. చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’కి కూడా దర్శకత్వం వహించారు. తెలుగు ‘పోకిరి’కి రీమేక్‌గా తమిళంలో ‘పోకిరి’, హిందీలో ‘వాంటెడ్’గా ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలు దర్శకుడిగా అతని ప్రతిభను నిరూపించాయి. ఆ తర్వాత పలు తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రభుదేవా. నిర్మాతగా తమిళంలో దేవి, బోగన్తో పాటు మరో మూడు చిత్రాలను రూపొందించారు. మైసూర్లో 1973 ఏప్రిల్ 3న ముగూర్ సుందర్, మహదేవమ్మ సుందర్‌లకు జన్మించిన ప్రభుదేవా పెరిగింది చెన్నైలో. ధర్మరాజ్, ఉడుపి లక్ష్మీనారాయణన్ మాస్టార్ల దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని టీనేజ్లోనే సినిమాల్లోకొచ్చారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్‌ని సొంతం చేసుకున్న ప్రభుదేవా సినీ రంగంలో నృత్యదర్శకుడిగా చేసిన సేవలకు గాను ‘పద్మశ్రీ’ వరించింది. -
జీవితం ఓ ఛాలెంజ్..!
బంజారాహిల్స్: ఆమె జీవితం తెరిచిన పుస్తకం. కాలం కక్షగట్టినా.. పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఎదురు నిలిచారేగానీ వెనక్కి తగ్గలేదు. నాట్యకారిణిగా ఎదగాలని కలలుగన్న ఆమెను విధి వంచించినా వెరవలేదు. అందుకే ఆమె జీవితం భావితరాలకు పుస్తక పాఠంగా మారింది. ‘సుధాచంద్రన్’.. నాట్యమయూరిగా కీర్తి గడించిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి. జీవితాన్ని చాలెంజ్ చేసి తనను తాను మలచుకున్నారు. కాలానికి ఎదురీది సినీ, టీవీరంగాలో ఎదిగారు. అంగవైకల్యం గల వారికి జైపూర్ కృత్రిమ కాళ్లు ఉచితంగా అందజేసేందుకు నిధుల సేకరణ కోసం భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి నగరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. శనివారం మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగే వేడుకలో సుధాచంద్రన్ నాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన మనసులోని మాటను పంచుకున్నారు. ఆ వివరాలు సుధా మాటల్లోనే.. నా జీవితంలో అతి ముఖ్యమైన ప్రతి సంఘటనా అందరికీ తెలిసిందే. ఒక కాలు పోగొట్టుకొని ఇక జీవితంలో ఏమీ సాధించలేనేమోనని కుంగిపోతున్న తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించింది. ‘మయూరి’ సినిమా ద్వారా కొత్త జీవితాన్నిచ్చింది. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ సినిమా షూటింగ్ ద్వారా నగరంతో మంచి అనుబంధం ఏర్పడింది. 1965 సెప్టెంబర్ 27న సుధాచంద్రన్ ఈ భూమ్మీదకు వచ్చింది. భరతనాట్యం అంటే పిచ్చిప్రేమ అనుకోకుండా 1981లో తిరుచరాపల్లి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్నారు. జీవితంలో ఇంకేం సాధించలేననుకున్నాను. అంతా శూన్యంమైపోయిందనుకున్నారు. అప్పుడే అప్పుడే జైపూర్ కృత్రిమ కాలును అమర్చుకున్నాను. ఆత్మవిశ్వాసంతో తిరిగి ప్రదర్శనలు ఇవ్వసాగాను. అలాంటి సమయంలో నా జీవితాన్నే ‘మయూరి’ సినిమాగా తీశారు. 1985లో విడుదలైన ఈ సినిమా ఇటు తెలుగులోను, అటు హిందీలోను హిట్ అయింది. 1986లో నేషనల్ ఫిల్మ్ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాను. తర్వాత పది తమిళ సినిమాల్లో, ఐదు మళయాళ సినిమాల్లో, పది హిందీ సినిమాల్లో నటించాను. భరతనాట్యం నృత్యకారిణిగా ఇప్పటి దాకా మన దేశంతో పాటు అమెరికా, లండన్, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, తదితర 30 దేశాల్లో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పటికీ ఇస్తునే ఉన్నాను. హైదరాబాద్‌లోనూ 25కి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇక్కడికి వస్తే తప్పనిసరిగా చార్మినార్ చూస్తాను. చూడిబజార్లో గాజులు కొనుక్కుంటాను. ప్రతి ప్రదర్శనా ఓ సందేశం నా నృత్య ప్రదర్శనల్లో ఓ సందేశం ఉంటుంది. జైపూర్ ఫుట్ నేపథ్యంగా శిల్పకళావేదికలో ఈ ప్రదర్శన ఇవ్వనున్నాను. ఇందులో కొంత మంది చాలెంజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. ‘బాహుబలి’ కాన్సెప్ట్‌ను ఇందులో ప్రదర్శిస్తున్నాం. ప్రభాస్ శివలింగాన్ని ఎత్తినట్లు ఈ ప్రదర్శనలో నేను జైపూర్ కృత్రిమ కాళ్లు చూపించి ఎవరూ ఆత్మన్యూనతకు గురి కావద్దని చెప్పబోతున్నాను. గతంలో కూడా ముంబై పేలుళ్ల నేపథ్యంలో కాళ్లు, చేతులు కోల్పోయినన వారు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ప్రదర్శనలు ఇచ్చాను. ప్రతి ప్రదర్శనలోనూ ఒక కాన్సెప్ట్‌ను తీసుకుంటున్నాను. ఇందులో ఎక్కువగా అంగవైకల్యం గల వారికి ఉచితంగా సేవలను అందించే సంస్థలు వారికి నిధుల సేకరణ ఉంటాయి. కళాకారులు సాధించిన విజయాల పట్ల సంతృప్తి ఉండదు. అలా ముందుకు సాగిపోయినవారే నిజమైన కళాకారులు. కళాకారులకు సృజనాత్మక శక్తి ఉంటుంది. దాంతో ఎప్పుడూ ఎంతోకొంత అసంతృప్తి అలానే ఉండిపోతుంది. దానికి అంతం ఉండదు. అందుకున్న విజయాలతో సంతృప్తి పడడం మంచిది కాదు. సంతృప్తి పడిపోతే అది అభివృద్ధికి చరమగీతం పాడుతుంది. కాలానికి అనుగుణంగా నడవాలి. భావాలను మార్చుకుంటూ ప్రేక్షకుల న్యాయమైన కోర్కెలను మాత్రం తీరుస్తూ ముందుకు సాగిపోవాలి. నటులైనా, రచయితలైనా, శిల్పి అయినా, లలిత కళలకు సంబంధించిన ఎవరైనా సరే అలాగే ఉండాలి. –సుధా చంద్రన్ నేడు సుధాచంద్రన్ నృత్య ప్రదర్శన పంజగుట్ట: దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటుకు విరాళాలు సేకరణ కోసం, దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపడం కోసం రాజస్థాన్‌కు చెందిన సేవా సంస్థ ‘భగవాన్ మహావీర్ వికలాంగ్ సాహిత్య సమితి’(బీఎంవీఎస్ఎస్) ఆధ్వర్యంలో నేడు జైపూర్ ఫుట్ ప్రచారకర్త మయూరి సుధాచంద్రన్ నృత్యప్రదర్శన ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదికలో జరిగే ప్రదర్శనకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీఎంవీఎస్ఎస్ ప్యాట్రన్ పి.సి. పారక్, అధ్యక్షుడు లక్ష్మీనివాస్ శర్మ, ఉపాధ్యక్షులు ఉషా పారక్, సంజయ్, వికలాంగుల సంఘం ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు కరపత్రాన్ని ఆవిష్కరించారు. -
ఫేమస్ డాన్సర్ ఆత్మహత్య
పలు సూపర్‌హిట్ బాలీవుడ్ చిత్రాల్లో డాన్సర్‌గా కనిపించిన ఫేమస్ డాన్సర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని అభిజిత్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అభిజిత్ మృతదేశం వద్ద లభించిన సూసైడ్ నోట్లో తన బ్యాంక్ అకౌంట్‌ను కుమార్తెకు ట్రాన్స్పర్ చేయమని కొరినట్టుగా పోలీసులు తెలిపారు. కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అభిజిత్ షిండే డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోలు రణవీర్, రణ్‌బీర్‌లతో పలు సూపర్ హిట్ పాటల్లో డాన్స్ చేశాడు అభిజిత్ షిండే. -
సినీ పరిపూర్ణుడు
దాదాపుగా నూరేళ్ల కిందట ప్రాణం పోసుకున్న ఒక పసివాడు చిన్న కారణంగా ఇంట్లోంచి పారిపోయాడు. అన్నం కోసం అలమటించాడు. దొరికిన పనిచేశాడు. ఆకలి మాత్రమే అతడి ఆసక్తి. అదే అతణ్ని ఆఫీస్ బాయ్‌ని చేసింది, ఫైటర్ని చేసింది, డూపును చేసింది, ఫైట్మాస్టర్ని చేసింది, ప్రొడక్షన్ మేనేజర్‌ను చేసింది, నిర్మాతను చేసింది. మూకీల నుంచి చిత్రసీమ పరిణామ క్రమానికి ఒక విలువైన సాక్షిగా నిలబెట్టింది. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలాంటి శతాధిక చిత్రదర్శకులను సినీరంగానికి పరిచయం చేసిన ‘ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్’ కె.రాఘవ సినిమా రంగానికి సంబంధించి ఒక పరిపూర్ణుడు. పరిపూర్ణమైన సినీ జీవితాన్ని అనుభవించి ఆయన వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆయన ‘సాక్షి’తో పంచుకున్న స్వగతం....... ‘‘కాకినాడ దగ్గరి కోటిపల్లి మా ఊరు. అదే మా ఇంటిపేరు కూడా. సాధారణ రైతు కుటుంబం. నాకు చదువు అబ్బలేదు. బడిలో చెప్పే పాఠం ఏమీ అర్థమయ్యేది కాదు. దాంతో దెబ్బలు పడేవి. కోపమొచ్చేసి, ఇంట్లోంచి పారిపోదామనుకున్నాను. అప్పుడు నాకు ఎనిమిదేళ్లుంటాయి. స్టేషన్లో కనబడిన రైలు ఎక్కేశాను. అది ఎటు పోతుందో తెలియదు. తీరా అది కలకత్తాలో ఆగింది. వీధులెంబడి పిచ్చివాడిలా తిరిగాను. భాష తెలియదు, మనుషులు తెలియదు, పైగా ఆకలి! నడుస్తూ నడుస్తూ ఒక ఎల్తైన బిల్డింగు గేటు దగ్గర ఆగాను. అది మోతీలాల్ చమేరియా స్టూడియో! ఆ రోజుల్లో మూకీ సినిమా తీయాలంటే డెబ్రీ కెమెరా వాడేవారు. దాన్ని తిప్పడానికి ‘ట్రాలీ పుల్లర్’ కావాలి. ఆ పనికి కుదిరాను. షూటింగుల సమయంలో భోజనం అక్కడే చేసేవాణ్ని. అలా రెండు మూడేళ్లు గడిచాయి. టాకీలు రానే వచ్చాయి మూకీల కాలం పోయి, టాకీలు వస్తాయని ప్రచారం జరుగుతుండేది. దీంతో అక్కడ పనిచేసేవాళ్లు తమ పనిపోతుందేమో అని భయపడేవారు. నేనూ అలాగే అనుకొని, మళ్లీ రైలెక్కేశాను మద్రాస్ వెళ్లిపోదాం, అక్కడైతే పని బాగా దొరుకుతుందని. కానీ టికెట్ లేని కారణంగా, మధ్యలోనే కొట్టి దించేశారు. చూస్తే బెజవాడ! ఇక్కడ పనేం దొరుకుతుంది? మారుతి థియేటర్ కనబడితే వెళ్లి చేరాను. కస్తూరి శివరావు నటుడు కాకమునుపు మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పని చేసేవారు. ఆయనకు నేను అసిస్టెంట్‌ని. హాల్లో మధ్యలో టేబులుంటుంది. పైన ఆయన, కింద నేను. దృశ్యాన్ని బట్టి ఆయన చెబుతుంటే, నేను అవసరమైనప్పుడల్లా గొంతు కలపాలి. ‘తందానతాన’ లాగ! ఏడాదికంతా ఒకే సినిమా ఆడేది. షోకు ఆయనకు పది రూపాయలిస్తే, అందులోంచి నాకు రెండో మూడో ఇచ్చేవారు. పరిచయం పెరిగాక, ‘రారా భోంచేద్దాం’ అనేవారు. కాలం గిర్రున తిరిగింది. టాకీలు రానే వచ్చాయి. బెజవాడలోనే రాజకుమారి ‘టాకీస్’ కొత్తగా ప్రారంభమైంది. మారుతి కూడా టాకీస్ అయ్యింది. దాంతో అనౌన్సరు అక్కర్లేకుండా పోయాడు. ఇక, అసిస్టెంటు ఏం చేస్తాడు? ఛలో మద్రాస్! తిప్పినవాళ్లంతా గొప్పవాళ్లయ్యారు కొన్నాళ్లు రఘుపతి వెంకయ్య నాయుడు ఆఫీసులో బాయ్‌గా పనిచేశాను. మరి కొన్నాళ్లు టంగుటూరి ప్రకాశం పంతులు కారు తుడిచాను. బతుకుదెరువులో భాగంగా ‘స్టంట్’ సోము, ‘స్టంట్’ స్వామినాథన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాను. కత్తి తిప్పడాలు సాధన చేశాను. కొన్ని సినిమాల్లో ఫైటర్స్‌లో ఒకడిగా ఉన్నాను. తర్వాత ఫైట్ మాస్టర్ అయ్యాను. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహిస్తున్న ‘పల్నాటి యుద్ధం’(1947) చిత్రానికి స్టంట్ మాస్టర్‌గా చేస్తున్నప్పుడు, షూటింగ్ ఇంకా కొంచెం ఉందనగానే రామబ్రహ్మం గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎల్వీ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఆయనైతేనే మిగతా భాగానికి న్యాయం చేయగలరని అందరం అనుకున్నాం. అలా ఆయన దాన్ని పూర్తిచేశారు. ఈ దశలోనే మీర్జాపురం రాజా ‘మనదేశం’(1949) చిత్రాన్ని నిర్మించ తలపెట్టినప్పుడు దర్శకుడిగా ఎవరిని తీసుకుందాం అనే చర్చ వస్తే, ఎల్వీ ప్రసాద్ పేరు సూచించాను. ఆయనకు దర్శకుడిగా అదే తొలి చిత్రం. ఇందులోనే ఒక చిన్న కానిస్టేబుల్ పాత్రకు ఒక యువకుడిని అనుకున్నారు. ‘రాఘవా! ఒక మనిషొస్తాడు, ఆయనకు మెడ్రాస్ తెలీదు, స్టేషన్‌కెళ్లి తీసుకురా,’ అన్నారు. అలా ఎన్టీ రామారావును సులభంగా గుర్తుపట్టి, సెంట్రల్ నుంచి ఆళ్వారుపేటకు 4వ నెంబరు బస్సులో తీసుకొచ్చాను. ఐద్రూపాయల అద్దెతో ఒక గుడిసె లాంటి గది చూసిపెట్టాను. అదీ చెల్లించడం కష్టమే అంటే టీవీ రాజు (అప్పటికి ఇంకా సంగీత దర్శకుడు కాలేదు)ను జతచేసి, చెరో రెండున్నర ఇచ్చుకునేట్టుగా ఏర్పాటుచేశాను. ‘పాతాళ భైరవి’(1951) సహా కేవీ రెడ్డి అన్ని చిత్రాలకు స్టంట్స్ సమకూర్చాను. దర్శకుడు పి.పుల్లయ్య కూడా స్టంట్‌మాస్టర్‌గా ఎంతో ప్రోత్సహించారు. చిన రాఘవ అని ఇంకొకాయన ఉండటంతో, ‘పోరాటాలు: పెద రాఘవ’ అని టైటిల్స్‌లో పడేది. ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్ లాంటి వాళ్లకు డూప్‌గా నటించాను. పద్మినీ పిక్చర్స్‌కు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. వాళ్ల తరఫున శివాజీ గణేషన్ నటించిన ‘వీరపాండ్య కట్టబొమ్మన్’, ‘భలే పాండ్య’ తమిళ చిత్రాలతో పాటు హిందీలో షమ్మీ కపూర్ నటించిన ‘దిల్ తేరా దీవానా’ లాంటి సినిమాల నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించాను. ‘లవకుశ’కు రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించాను. పంపిణీదారుల నుంచి డబ్బులు వసూలు చేసే పని! ఈ దశలోనే పాండిచ్చేరికి చెందిన (నిర్మాత ఎం.కె.రాధ చెల్లెలు) హంసారాణితో నా పెళ్లి జరిగింది. బాలచందర్ ప్రవేశం ‘రాఘవ చెప్తే శివాజీ గణేషన్ వింటాడు,’ అన్న నమ్మకంతో ఓసారి కె.బాలచందర్ నా దగ్గరికొచ్చారు. ఆయన రాసిన డ్రామా (మేజర్ చంద్రకాంత్) ఆ రాత్రి వేస్తున్నారు. అది శివాజీ చూడాలి. ఈయన ఒప్పుకున్నారు. వెళ్లాం. చూశాం. బ్రహ్మాండంగా ఉంది. ‘రాఘవా, దీని హక్కులు తీసుకో బాగా ఆడుతుంది’ అన్నారు శివాజీ. ఎంతివ్వొచ్చు? ఒక పదివేలు. అంత డబ్బు నా దగ్గర లేదు. వాళ్ల తమ్ముడు షణ్ముగంతో ఆయనే డబ్బిప్పించారు. ఈ మొత్తం తీసుకెళ్లి బాలచందర్ చేతిలో పెడితే ఆయనకు మతిపోయింది. అన్ని భాషల రైట్స్ నాకే ఇచ్చేశారు. ఇదే డ్రామాను మరో రోజు హిందీ నటుడు అశోక్‌కుమార్ చూశారు. హిందీలో తీయాలని నన్ను కలిశారు. శివాజీకి విషయం చెప్పాను. డబ్బు వాళ్లిచ్చిందే కదా! హిందీ వరకే నలభై వేలకు అమ్మేశాం. ఇప్పుడు అసలు సమస్యొచ్చింది. ఇంతలో ఏవీఎం వారు దాన్ని సినిమాగా తీయడానికి ముందుకొచ్చారు. ప్రధానమైన అంధుడి పాత్ర తనకిస్తే హక్కులు ఇచ్చేద్దామన్నారు శివాజీ. ఆయన్ని తీసుకోవడం ఎందుకో ఏవీఎం చెట్టియార్‌కు ఇష్టం లేదు. మంచి అవకాశం. బాలచందర్ టెన్షన్. ఆ పాత్ర ఆయనకే ఇస్తున్నట్టు శివాజీతో నమ్మబలికాం. తమిళం హక్కులు ఇచ్చేశాం. మేజర్ సుందరరాజన్ ఆ పాత్ర పోషించారు. సినిమా హిట్టయ్యింది. శివాజీకి విషయం తెలిశాక కోపం, తిట్లు మామూలే.ఆ సినిమానే ఎన్.ఎన్.భట్, ఏకామ్రేశ్వర్రావు తెలుగులో నిర్మిద్దామనుకుని, హక్కులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నన్నూ ఒక భాగస్వామిగా కలుపుకున్నారు. ‘ఎన్.ఎన్.భట్ ఫిలింస్’ పతాకంపై తెలుగులో సుఖ దుఃఖాలు(1967)గా వచ్చిన ఆ చిత్రమే నిర్మాతగా నా తొలి అడుగు. ఎస్వీయార్ ప్రధాన పాత్ర పోషించారు. చిన్న పాత్రలు వేస్తున్న వాణిశ్రీకి దీంతోనే బ్రేక్ వచ్చింది (‘ఇది మల్లెల వేళయనీ’). జగత్ హీరోలు ఎంజీఎం వారి ‘టార్జాన్ గోస్ టు ఇండియా’ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు నేను చూశాను. అందులో భాగంగా రోమ్ వెళ్లినప్పుడు, ‘డాక్టర్ నో’, ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘షుగర్ కోల్ట్’ లాంటి సినిమాలు చూశాను. వాటి స్ఫూర్తితో ఒక సినిమా తీద్దామనుకున్నాను. ఏకామ్రేశ్వర్రావు కూడా జత కలిశాడు. అలా ఫల్గుణా మూవీస్ బ్యానర్‌పై ‘జగత్ కిలాడీలు’(69) ప్రారంభించాం. ఐఎస్ మూర్తి దర్శకుడు. ఎస్వీయార్, వాణిశ్రీ, కృష్ణ నటించారు. తర్వాత శోభన్‌బాబుతో ‘జగజ్జెట్టీలు’ మొదలెట్టాం. దర్శకుడు నందన్‌రావు. ఈయన దగ్గర అసిస్టెంట్‌గా దాసరి నారాయణరావు ఉండేవాడు. 15 రోజుల్లో డైలాగ్స్ రాశాడు. అలా అతడు నా దృష్టిలో పడిపోయాడు. సినిమా కూడా హిట్టయ్యింది. తర్వాత, శోభన్‌బాబుతోనే ‘జగజ్జంత్రీలు’ (దర్శకుడు లక్ష్మీదీపక్) నిర్మించాం. వద్దంటే డబ్బు వచ్చి పడింది. నా కుమారుడి పేరు మీదుగా సొంతంగా ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించి దాసరికి అవకాశం ఇచ్చాను. తాత–మనవడు, రామయ్య కృష్ణయ్య ఎస్వీయార్, రాజబాబు ‘తాత–మనవడు’ తీశాం (1972). బాగా ఆడింది. తర్వాత దాసరే దర్శకుడిగా ‘సంసారం సాగరం’, ‘తూర్పు పడమర’ నిర్మించాను. నెమ్మదిగా దాసరి బిజీ అయిపోయాడు. ‘తూర్పు పడమర’ సినిమాకు కోడి రామకృష్ణ అప్రెంటిస్‌గా చేరాడు. అతనికి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’(82) సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చాను. 500 రోజులు ఆడుతూనే ఉంది. చిరంజీవి టాప్‌లోకి వెళ్లిపోయాడు. తర్వాత ‘తరంగిణి’ తీశా. కొత్తవాడు సుమన్‌ను తీసుకున్నాం. సినిమా ఏడాది ఆడింది. తర్వాత, సూర్యచంద్రులు, చదువు సంస్కారం, అంతులేని వింత కథ, త్రివేణి సంగమం, ఈ ప్రశ్నకు బదులేది, యుగకర్తలు, అంకితం లాంటి చిత్రాలు నిర్మించాను. రాజశ్రీ, గుహనాథన్, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి, బందెల ఈశ్వరరావు లాంటి దర్శకులను పరిచయం చేశాను. నెమ్మదిగా కె.రాఘవ అంటే ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ అయ్యింది. ఎక్కడి నుంచి ఎక్కడికో... నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. జీవితం ఎటు తోస్తే అటు వెళ్లాను. డబ్బు వచ్చినా, నా బుద్ధి ఎటువైపూ మారలేదు. మద్యం, పొగ, కనీసం టీ కాఫీల జోలికి కూడా పోలేదు. వందేళ్ల వయసుకు వచ్చాను. ఫిలింనగర్ హౌజింగ్ సొసైటీలో మొదటి గృహప్రవేశం నేను చేశాను. మూకీల నుంచి సినిమా ప్రయాణాన్ని దగ్గరినుంచి చూశాను. రఘుపతి వెంకయ్య దగ్గర బాయ్‌గా పనిచేసినవాణ్ని ఆయన పేరు మీదుగా ఉన్న ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను తీసుకున్నాను. సంభాషణ: రాజిరెడ్డి రాఘవగారు ఓ డిక్షనరీ – కోడి రామకృష్ణ రాఘవగారంటే నాకెంతో అభిమానం. మా గురువుగారిని (దాసరి నారాయణరావు) దర్శకునిగా పరిచయం చేస్తూ ‘తాత–మనవడు’ సినిమా తీశారాయన. ఆయన బ్యానర్లో ఓ సినిమా అయినా చేయాలన్నది నా డ్రీమ్. ‘తూర్పు– పడమర’ సినిమాకి రాఘవగారు నిర్మాత. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. ఆ షూటింగ్లో ఆయనతో చనువు ఏర్పడింది. నా డ్రీమ్ చేరుకోవాలన్న ప్రయత్నంలో సమయం కుదిరినప్పుడల్లా ఆయనకు కథలు చెబుతుండేవాణ్ని. ఓ రోజు నటులు నగేశ్గారికి డబ్బింగ్ చెప్పించాల్సి వచ్చింది. విమానం లేట్ కావడంతో నగేశ్గారు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లంతా వెళ్లిపోయారు. నేను డబ్బింగ్ చెప్పిస్తానని రాఘవగారికి చెప్పా. ‘సీనియర్లు లేకుండా నగేశ్గారితో డబ్బింగ్ చెప్పించడం కష్టం’ అన్నారు. నేను చెప్పిస్తానని నమ్మకంగా చెప్పా. 400 అడుగుల లూప్ డైలాగ్‌ని అనుకున్న టైమ్ కంటే గంట ముందే చెప్పించేశా. ‘నిన్ను డైరెక్టర్ని చేస్తానయ్యా’ అన్నారు రాఘవగారు. ఓ రోజు ఆఫీసుకి తీసుకెళ్లారు. ‘డైరెక్టర్ రూం’ అని బోర్డు ఉన్న గదిలోకి తీసుకెళ్లి, ‘ఇక్కడే.. దాసరిగారు కూర్చొని ‘తాత–మనవడు’ తీసి హిట్ కొట్టారు. నీకు డైరెక్టర్‌గా అవకాశం ఇస్తున్నా. సిల్వర్ జూబ్లీ సినిమా తీయాలి’ అన్నారు. ఏడాదిన్నరపాటు కథతో, ఆయనతో ట్రావెల్ చేసి, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీసి హిట్ కొట్టా. ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో రాఘవగారు ‘ఇండస్ట్రీకి ఇంత మంచి డైరెక్టర్ని ఇచ్చిన దాసరిగారికి రుణపడి ఉన్నా’ అన్నారు. రాఘవగారంటే యూనివర్శిటీ.. డిక్షనరీ. ఆయన పని చేస్తూ, చేయించే వారు. షూటింగ్లో ఏనాడూ రెస్ట్ తీసుకోలేదు. ఒక అనాథలా చెన్నై వచ్చారు కె.రాఘవగారు. లైట్ బోయ్ నుంచి కష్టపడి చాలా విభాగాల్లో పనిచేసి ఆఖరికి నిర్మాత అయ్యారు. వన్నాఫ్ ది లెజెండ్స్‌గా నిలిచిన దాసరికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన గొప్ప నిర్మాత ఆయన. – కైకాల సత్యనారాయణ రాఘవగారి నిర్మాణంలో వచ్చిన ‘తూర్పు పడమర’లో నటించాను. ఆయనతో నాకు విశేషమైన అనుబంధం ఉంది. నిర్మాత అనే పదానికి నిర్వచనం రాఘవగారు. – మోహన్‌బాబు మూకీ, టాకీ, డిజిటల్ యుగం.. ఇలా సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులనూ చూసిన మహానుభావుడు. తల్లిదండ్రుల అండ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పైకి వచ్చిన వ్యక్తి. జీవితంలో అద్భుత విజయాలు సాధించారు. – ఆర్. నారాయణమూర్తి రాఘవగారు నిర్మించిన ‘తరంగణి’ ద్వారా నేను హీరోగా పరిచయం అయ్యాను. ఆయన నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. రాఘవగారు, తమ్మారెడ్డి భరద్వాజగారిలాంటి వారి వల్లే నా జీవితం మంచి మలుపు తిరిగింది. సినిమా రంగం హైదరాబాద్ రావడంలో రాఘవగారి కృషి చాలా ఉంది. – సుమన్ -
ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్ అయ్యాను: భానుశ్రీ
శ్రీనగర్‌కాలనీ: నా అసలు పేరు స్వప్న. డ్యాన్సర్‌గా ఎదిగాక భానుశ్రీగా మార్చుకున్నాను. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొరియోగ్రాఫర్ అవుతానని ఇంట్లో చెప్పాను. అయితే ఒప్పుకోలేదు. దాంతో నేను దాచుకున్న కొంత డబ్బుతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చేశాను. నేను ముక్కుసూటి మనిషిని.. దేనికీ భయపడను. నా వ్యక్తిత్వాన్ని నమ్ముతూ నిజాయతీగా ముందుకెళ్తాను. నాకు తెలిసిన వాళ్ల ద్వారా డ్యాన్సర్ కార్డ్ తీసుకున్నాను. తెలిసిన అమ్మాయితో కలిసి రూమ్ తీసుకొని ఉన్నాను. కొన్ని రోజులకు నా గొలుసు ఎవరో దొంగతనం చేశారు. బాధతో రూమ్ నుంచి వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. డ్యాన్సర్‌గా శక్తి, డార్లింగ్ తదితర సినిమాలకు పనిచేశాను. సీరియల్.. సినిమా డ్యాన్సర్‌గా ఎదిగాక కొన్ని షోలలో పాల్గొన్నాను. తర్వాత జాబిలమ్మ సీరియల్లో లీడ్ రోల్ చేశాను. బాహుబలి సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. అందులో తమన్నా స్నేహితురాలిగా నటించాను. బాహుబలి తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కాటమరాయుడు, సుబ్రమణ్యం ఫర్ సేల్, మహానుభావుడు తదితర చిత్రాల్లో నటించాను. పెద్ద సినిమాల్లో నటించడంతో చిన్న సినిమాల్లో హీరోయిన్గా అవకాశం లభించింది. ఇద్దరి మధ్య 18, మౌనం, ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. బాహుబలి సినిమాలో నటించాక వరంగల్‌లో నాకు సన్మానం చేశారు. ‘సినిమాల్లో వద్దు. నీకు చాన్స్‌లు రావు’ అన్నవాళ్లే నన్ను అభినందిస్తూ సన్మానం చేయడం సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ మూవీలో హీరోయిన్గా చేస్తున్నాను. నేనే ప్రపోజ్ చేశా... డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు శివశంకర్‌రెడ్డితో పరిచయమైంది. తనది కడప. నిజాయతీగా ఉండేవాడు. కష్టాల్లో తోడుగా ఉండి భరోసా ఇచ్చాడు. స్టైలింగ్‌లో సూచనలిస్తూ స్నేహితుడిగా మారాడు. శివ వ్యక్తిత్వం, ఆప్యాయత నచ్చాయి. కొన్ని రోజులకు నేనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పాను. శివతోనే నా ప్రయాణం. శివ తోడు నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. నా స్వీయ తప్పిదం... బిగ్‌బాస్‌లో అవకాశం రావడం నా అదృష్టం. అందులో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. చాలామంది ఇది గేమ్ డైరెక్షన్ అనుకుంటారు. కానీ నిజాయతీగా ఉండే రియాల్టీ షో. ప్రతిరోజూ నూతనంగా ఉండేది. కొత్త టాస్క్‌లతో ఉత్సాహంగా గడిపేవాళ్లం. నా ముక్కుసూటి తనంతో షోలో నన్ను అభిమానిస్తూ సన్నిహితంగా ఉండేవారు. బిగ్‌బాస్‌లో నెలరోజులకు పైగా ఉండడం సంతోషంగా అనిపించింది. ఓ టాస్క్‌లో కౌషల్‌తో చిన్న వాగ్వాదం జరిగింది. నా స్వీయ తప్పిదంతోనే వాగ్వాదం పెద్దదైంది. దీంతో నాకు మైనస్ మార్క్స్ పడ్డాయి. -
ఫలించిన అమ్మ 'తపస్'
కలెక్టరేట్ : కడుపున బిడ్డ పడగానే.. అబ్బాయా.. అమ్మాయా.. అని ఏ తల్లీఆలోచించదు. పుట్టిన చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుతూ భవిష్యత్తులో ప్రయోజకులను చేయాలని ఎన్నో కలలు కంటుంది. అలాంటిది.. పుట్టిన బిడ్డకు మానసిక ఎదుగుదల లేదని తెలిస్తే.. ఎంత ఎదిగినా పసి ప్రాయంలోనేఉండిపోతాడని గుర్తిస్తే.. ఆ మాతృమూర్తి గుండె తట్టుకుంటుందా..? కానీ భవాని తట్టుకున్నారు. అమ్మగా తన బిడ్డకు అండగా నిలిచారు. విద్య నేర్పేగురువయ్యారు. ‘డౌన్ సిండ్రోమ్’ కొడుకును అంతర్జాతీయ వేదికలపై డ్యాన్స్ ప్రదర్శనలిచ్చే స్థాయికి తీసుకెళ్లారు. తన కొడుక్కు ‘తపస్’ అని పేరు పెట్టుకుని ఆ బాలుడిని పెంచేందుకు పెద్ద తపస్సే చేస్తోందా తల్లి. బిడ్డ వైకల్యానికికుంగిపోకుండా విధిని ఎదిరించి నిలిచిన తల్లి భవాని, ఆమె చూపిన బాటలో పయనిస్తున్న తపస్పై ‘సాక్షి’ కథనం.. విజయవాడకు చెందిన భవాని, లోకేష్ దంపతులు 2006లో నగరానికి వచ్చి దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన మూడేళ్లకు తపస్ జన్మించాడు. అతడు (డౌన్ సిండ్రోమ్ బాయ్) మానసిక దివ్యాంగుడు. ప్రతి 800 మంది శిశువుల్లో ఒకరు జన్యులోపంతో ఇలా జన్మిస్తారని, వీరికి ఐక్యూ చాలా తక్కువ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అతడి వైకల్యం గురించి విన్న ఆ దంపతులు మొదట ఆందోళనకు గురయ్యారు. తర్వాత దేవుడిచ్చిన శాపాన్ని అధిగమించాలనుకున్నారు. తల్లే గురువుగా మారి.. మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు ఆత్మవిశ్వాసంతో వారికి కొత్త జీవితం ఇవ్వడం ఎలాగో ఆలోచించారు తపస్ తల్లిదండ్రులు లోకేష్, భవానీ దంపతులు. పుట్టినప్పటి నుంచి తపస్ ఇంటికే పరిమితమయ్యాడు. తల్లి భవానీయే గురువుగా మారి అక్షరాలు నేర్పిస్తోంది. తపస్‌కు డ్యాన్స్ అంటే ఇష్టమని గుర్తించిన ఇంటి వద్దే ‘తపస్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్’ను ప్రారంభించారు. తన బిడ్డలాంటి పిల్లలకు ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తపస్‌కు డాన్స్ మీద ఉన్న మక్కువతో సులువుగా నేర్చుకున్నాడు. తల్లి భవాని ఇచ్చిన ప్రోత్సాహంతో అతడు పలు వేదికలపై డ్యాన్స్ పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడు. గతేడాది వెస్ట్రన్ డాన్స్ ప్రదర్శనకు టీఎస్ఎఫ్ఏ (తెలుగు షార్ట్‌ఫిలిం అవార్డ్స్) నుంచి తపస్ పురస్కారం అందుకున్నాడు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా’ పేరిట రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పోటీల్లో సాఫ్ట్‌బాల్ పోటీల్లోనూ రెండో స్థానంలో నిలిచాడు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ‘బాలోత్సవ్’లోను తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. కాకినాడలో నిర్వహించిన ‘క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్’లో ప్రముఖులచే సత్కారం సైతం అందుకున్నాడు. ఇటీవల జూన్ 11న నాన్ స్టాప్‌గా 35 నిముషాలు డ్యాన్స్ చేసిన తొలి డౌన్ సిండ్రోమ్ కిడ్‌గా ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్’ను సైతం తపస్ సొంతం చేసుకుని ఔరా అనిపించాడు. ఏ స్కూల్లో చేర్చుకోవడం లేదు తపస్లోని ప్రతిభను గుర్తించి ఎన్నో అవార్డులు వరించినా ‘డౌన్ సిండ్రోమ్ బాయ్’ అనే కారణంతో ఏ స్కూల్లోను చేర్చుకోవడం లేదు. దీంతో ఇంట్లోనే చదువు చెబుతున్నాను. ఓ అకాడమీ ప్రారంభించి ఇలాంటి పిల్లలకు ఉచితంగా డాన్స్‌లో శిక్షణ ఇస్తున్నా. మానసిక వికలాంగుల తల్లిదండ్రులు ధైర్యం కోల్పోకుండా పిల్లలకు అండగా నిలవాలి. వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయినా తపస్ లాంటి ఎందరో చిన్నారుల భవిష్యత్‌కు బాటలు వేయాలని ఉంది. – భవాని, తపస్ తల్లి -
డాక్టర్ కాదు.. డ్యాన్సర్ అవ్వమన్నారు
అదితీ రావ్ హైదరీ నటిగా బాలీవుడ్లో మంచి మార్కులు వేయించుకున్నారు. డ్యాన్సర్‌గా ఇంకో రెండు మార్కులు ఎక్కువే కొట్టేస్తున్నారు. డ్యాన్స్‌లో ఇంత ప్రావీణ్యం రావడానికి మా స్కూల్ వాళ్లు చేసిన కంప్లైయింట్ లాంటి కాంప్లిమెంటే కారణం అంటున్నారు అదితీ. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘సాధారణంగా ‘మీ అమ్మాయి సరిగ్గా చదవడంలేదు’ అంటూ స్కూల్ నుంచి కంప్లైంట్స్ వింటుంటాం. కానీ నా విషయంలో వేరే లాంటి కంప్లైంట్ ఇంటికి వచ్చింది.మా స్కూల్లో టెన్త్ క్లాస్ తర్వాత ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటామో స్కూల్ వాళ్లకు ఇన్ఫార్మ్ చేయాలి. నాకు డాక్టర్ అవ్వాలని ఉందని ఇంట్లో చెబితే మా పేరెంట్స్ స్కూల్ వాళ్లకు లెటర్ రాశారు. దానికి బదులుగా.. ‘మీ అమ్మాయి డాక్టర్ అయ్యి అందరికీ సేవ చేయాలనుకుంటోంది. చాలా సంతోషం. కానీ కొంతమంది పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ లాంటి స్పెషల్ టాలెంట్ వరంలా లభిస్తుంది. అదితి ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందంటే.. ఒకవేళ తను డ్యాన్స్ కంటిన్యూ చేయకపోతే తనకు ఉన్న స్పెషల్ టాలెంట్‌ను వృథా చేసుకున్నట్టే. మీ అమ్మాయిని డాక్టర్ కాదు.. డ్యాన్సర్‌ని చేయండి’ అని స్కూల్ వాళ్లు రాశారు. కళ్ల చుట్టూ అక్షరాల్ని కట్టేయకుండా కాళ్లకు గజ్జెలు కట్టుకోమని స్కూల్ వాళ్లే ప్రోత్సహించారు. అలా స్కూల్ వాళ్లు ఇచ్చిన కాంప్లిమెంట్ వల్ల నేనీ రోజు మంచి డ్యాన్సర్‌ని అయ్యాను’’ అని అదితీ రావ్ పేర్కొన్నారు. -
మహిళా డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లిన కానిస్టేబుల్
-
డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లిన ఖాకీ
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ మహిళా డ్యాన్సర్‌పై పోలీసు కానిస్టేబుల్ డబ్బులు వెదజల్లిన వీడియో వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమానికి సెక్యూరిటీగా ఏర్పాటు చేసిన పోలీసుల్లో ఒకరు అత్యుత్సాహం కనబరచడంతో ఆయనపై అధికారులు వేటు వేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రైఫిల్ ధరించిన పోలీసు కానిస్టేబుల్ మహిళా డ్యానర్లపై డబ్బులు చల్లుతూ వీడియోలో కనిపించారు. ఆయనతో పాటు పలువురు మహిళా డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లను విసిరారు. కాగా,2015లో గుజరాత్‌లోని వడోదరలో పెళ్లి వేడుకల్లో బాగంగా జరిగిన కార్యక్రమంలో మహిళా డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లుతూ ఇద్దరూ కానిస్టేబుళ్లు కనిపించడం దుమారం రేపింది. అదే ఏడాది వారణాసిలోనూ డ్యానర్లపై డబ్బులు విసురుతూ పోలీసు సిబ్బంది పట్టుబడ్డారు. -
మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తిన ఆర్జేడీ నేత