ఒకరేమో సాప్ట్‌వేర్ ఉద్యోగం వదిలి మీమర్‌గా, మరొకరు సింగర్.. ఇద్దరూ నేడు సోషల్‌మీడియా వేదికగా నవ్వులు పూయిస్తూ, సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రవృత్తినే వృత్తిగా మలిచిన సాహిని శ్రీహర్ష, ప్రతిమ కొరడ దంపతులు నేడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీరికి లక్షల్లో ఫాలోవర్స్‌ని సంపాదించి ట్రెండింగ్‌లో ఉన్న మాటలు, విజువల్ ఫొటోలు, విడియోలతో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏ రంగమైనా సోషల్ మీడియాలో మీమ్స్, వీడియో క్రియేటివిటీతోనే మార్కెట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
ఒకరు డ్యాన్సర్, మరొకరు మీమర్
సోషల్ మీడియాలో సాఫ్ట్‌వేర్ దంపతుల ట్రెండ్
మీమ్స్ మార్కెట్‌లో ఆలోచనలే పెట్టుబడిగా
ప్రవృత్తినే వృత్తిగా మలచుకున్న శ్రీహర్ష, ప్రతిమ
సృజనాత్మకత, కొంగొత్త ఆలోచనలే పెట్టుబడి. మీమ్స్, వీడియోస్‌తో మీమ్ మార్కెటింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరి ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.
డ్యాన్స్, మీమ్స్‌లో ప్రావీణ్యం..
నాకు డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. బీటెక్ అయ్యాక డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా బెంగుళూరులో పనిచేశా. కానీ ఇంట్లో నో చెప్పడంతో 2017–18లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా మారాను. అయితే డ్యాన్స్ వీడియోలు చేయడం అలవాటుగా మారింది. అలా హైదరాబాద్ వచ్చి నచి్చన కంటెంట్‌తో విడియోలు స్టార్ట్ చేశాను. లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లోనే ఉంటూ మరింత ట్రెండింగ్ కంటెంట్‌తో వీడియోలు చేశాను. లైట్ బా అనే మీమ్ పేజ్‌ను స్టార్ట్ చేశాను. మీమ్స్, వీడియోస్‌కి మంచి స్పందన వచ్చింది. కానీ మీమర్‌గా కూడా సంపాదించవచ్చని తెలియదు.
కొంత మంది సలహాలతోనే..
కొంతమంది సోషల్‌మీడియా వ్యక్తులను కలిసినపుడు వారి నుండి కొన్ని సలహాలు తీసుకున్నాను. లైట్ బా పేజీకి 5లక్షల మంది, హర్ష ఈజ్ అవైలబుల్ యూట్యూబ్ ఛానెల్‌కి 3లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌కి 2.6లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో మీమ్ మార్కెటింగ్‌ను మూవీస్, ఒరిజినల్ స్ట్రీమింగ్ సరీ్వస్‌లకు కంటెంట్, ప్రమోషన్ వీడియోస్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాను. యాక్టర్‌గా చేయాలని ఉంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను.
సింగర్ టూ మీమర్...
నేను సింగర్‌ని.. సరిగమపలో 2020లో కంటెస్టెంట్‌గా చేశాను. కొన్ని పాటలు కూడా పాడాను. నాకు హర్షకి సోషల్‌మీడియా వేదికగా పరిచయం ఉందికానీ మాట్లాడుకోలేదు. మ్యూచువల్‌గా ఇద్దరికీ మ్యారేజ్ ప్రపోజల్ వచి్చంది. ఇద్దరి మనసులూ కలిశాయి. పెళ్ళి చేసుకున్నాం. నాకు యాక్టింగ్ తెలీదు. కానీ మీమ్ విడియోస్‌లో చేశారు. హర్ష నా నటన చూసి మెచ్చుకున్నాడు. ఇద్దరం కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాలో మీమ్ వీడియోస్ చేస్తుంటాము. నాకు ఇన్‌స్టాలో 85వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరి వృత్తులు వేరైనా మీమ్ మార్కెంటింగే ఉద్యోగంగా మలుచుకున్నాం. మా కంటెంట్‌తో నెటిజన్లు నవ్వుకుంటే మేము గెలిచినట్టే.
Comments
Please login to add a commentAdd a comment