
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఈ నెల 6న పారిస్ ఒలింపిక్స్‌లో తన సత్తా చూపనున్న నేపథ్యంలో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ శామ్‌సంగ్ ఇండియా ‘ఛీర్స్ ఫర్ నీరజ్ ’ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
తాజా ఒలింపిక్స్‌లో కోట్లాది మంది భారతీయుల ఆశాకిరణమైన నీరజ్ చోప్రాకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా శుభాకాంక్షలు తెలపొచ్చన్నారు. అంతేకాక 98704–94949 నెంబరుకు ’NEERAJ’ అని వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా, అలాగే తమ సోషల్ soమీడియా చానెల్‌కు ట్యాగ్ చేయడం ద్వారా అందించవచ్చని వెల్లడించారు.
ఇవి చదవండి: ఆకట్టుకున్న పర్ఫ్యూమ్ మేకింగ్..
Comments
Please login to add a commentAdd a comment