Samsung India
-
‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని మేల్కొలిపే ఒలింపిక్స్ వైపు యువత దృష్టిని మరింతగా మళ్లించేందుకు ‘టుగెదర్ ఫర్ టుమారో, ఎనేబ్లింగ్ పీపుల్’ పేరిట ఓ కొత్త కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిని పారిస్‌లో లాంచ్ చేసినట్టు నిర్వాహక సంస్థ శామ్సంగ్ ఇండియా సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు.దీనిలో భాగంగా ఒలింపిక్ క్రీడా స్ఫూర్తిని పంచడంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని అందించే విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం తాము నిర్వహించిన సాల్వ్ ఫర్ టుమారో పోటీ విజేతలను ప్రచార కర్తలుగా వినియోగించుకోనున్నామని అన్నారు. -
ఇండియా ఛీర్స్ ఫర్ నీరజ్..
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఈ నెల 6న పారిస్ ఒలింపిక్స్‌లో తన సత్తా చూపనున్న నేపథ్యంలో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ శామ్సంగ్ ఇండియా ‘ఛీర్స్ ఫర్ నీరజ్ ’ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.తాజా ఒలింపిక్స్‌లో కోట్లాది మంది భారతీయుల ఆశాకిరణమైన నీరజ్ చోప్రాకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా శుభాకాంక్షలు తెలపొచ్చన్నారు. అంతేకాక 98704–94949 నెంబరుకు ’NEERAJ’ అని వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా, అలాగే తమ సోషల్ soమీడియా చానెల్‌కు ట్యాగ్ చేయడం ద్వారా అందించవచ్చని వెల్లడించారు.ఇవి చదవండి: ఆకట్టుకున్న పర్ఫ్యూమ్ మేకింగ్.. -
శాంసంగ్ లాభం 58% డౌన్
న్యూఢిల్లీ: శాంసంగ్ ఇండియా కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం తగ్గింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,713 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,540 కోట్లకు తగ్గిందని కంపెనీల రిజిష్ట్రార్(ఆర్ఓసీ)కి శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం..., 60 శాతం ఆదాయం మొబైల్ ఫోన్లదే... ఈ కంపెనీ మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధి చెందింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.61,066 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.73,086 కోట్లకు పెరిగింది. దీంతో భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాల ఆదాయం రూ.59,371 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.70,628 కోట్లకు చేరింది. దీంట్లో 60 శాతం ఆదాయం (రూ.43,088 కోట్లు)మొబైల్ ఫోన్ల విభాగం నుంచే వచ్చింది. టీవీ, కెమెరాల విభాగం ఆదాయం రూ.5,016 కోట్లు, గృహోపకరణాల విభాగం ఆదాయం రూ.7,408 కోట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 55,284 కోట్ల నుంచి 27% వృద్ధితో రూ.70,228 కోట్లకు పెరిగింది. వడ్డీ భారం రూ.711 కోట్ల నుంచి రూ.1,059 కోట్లకు ఎగసింది. -
షావోమిలోకి శాంసంగ్ సేల్స్ అధినేత
శాంసంగ్ ఇండియా సేల్స్ అధినేత దీపక్ నక్రా, దాని ప్రత్యర్థి కంపెనీ షావోమిలో జాయిన్ అయ్యారు. భారత్‌లో షావోమి ఆఫ్‌లైన్ మార్కెట్‌ను విస్తరించేందుకు దీపక్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. దీపక్ నక్రా షావోమిలో చేరినట్టు ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తన లింక్డిన్ పేజీలో తెలిపారు. ''షావోమి ఇండియా ఆఫ్‌లైన్ సేల్స్‌ను దీపక్ లీడ్ చేస్తున్నారని తెలుపడం చాలా ఆనందదాయకంగా ఉంది. పలు టాప్ హ్యాండ్సెట్ బ్రాండులు, టెలికాం ప్రొవైడర్లలో దీపక్ పనిచేశారు. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఈయనకు 20 ఏళ్ల అనుభవముంది'' అని మను కుమార్ జైన్ తెలిపారు. గత 9 నెలల క్రితమే తన ఆఫ్‌లైన్ ప్రయాణాన్ని ప్రారంభించామని, అతికొద్ది సమయంలోనే 20శాతం వృద్ధి చెందామని మను కుమార్ చెప్పారు. తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు దీపక్ సాయపడతారని నమ్మకముందని, రెండేళ్ల క్రితం తమ ఆన్లైన్ సేల్స్ అధినేతగా జాయిన్ అయిన రఘు, తమన్‌ని నెంబర్ 1 స్థానానికి చేర్చినట్టు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ షేరులో షావోమి, శాంసంగ్‌కు దగ్గర్లో ఉంది. 2017 మూడో త్రైమాసికంలో శాంసంగ్ 23 శాతం మార్కెట్ షేరుతో టాప్‌లో ఉండగా... 22 శాతం మార్కెట్ షేరుతో షావోమి రెండో స్థానంలో నిలిచింది. 2012 నుంచి ఇదే తొలిసారి. రెండు కంపెనీలు దగ్గర్లో మార్కెట్ షేరును నమోదుచేయడం. ఆన్లైన్ సెగ్మెంట్లో షావోమి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ సెగ్మెంట్‌పైనా దృష్టిసారించింది. ఆఫ్‌లైన్ మార్కెట్‌ను కూడా తన సొంతం చేసుకునేందుకు కఠినతరమైన ప్లాన్లను కూడా రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఎంఐ హోమ్స్ పేరుతో వచ్చే రెండేళ్లలో వీటిని లాంచ్ చేయనుంది. -
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లపై కన్నేసిన శాంసంగ్
శాంసంగ్ ఇండియా భారీగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. దేశవ్యాప్తంగా టాప్ కాలేజీలనుంచి వీరిని ఎంపిక చేయనుంది. 5 జీ నెట్వర్క్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ సహా వివిధ కేటగిరీల్లో దాదాపు వెయ్యిమందిని నియమించుకోనుంది. 2018నాటికి టాప్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వీరిని ఎంపిక చేయాలని యోచిస్తోందని శాంసంగ్ అధికారి ఒకరు ప్రకటించారు. ముఖ్యంగా ఐఐటీలతోపాటు ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బిట్స్ పిలాని, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలు ఇందులో ఉన్నాయని తెలిపారు. 5జీ నెట్వర్క్ సహా ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్, బయోమెట్రిక్స్, సహజ భాషా ప్రాసెసింగ్, రియాలిటీ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అగ్మెంటెడ్ రియల్టీ నెట్వర్క్లకోసం ఈ ఇంజనీర్లను నియమించాలని భావిస్తోంది. -
శాంసంగ్.. ‘గెలాక్సీ సీ9 ప్రొ’ @36,900
భువనేశ్వర్: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘శాంసంగ్ ఇండియా’ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ సీ9 ప్రొ’ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. నలుపు, బంగారం రంగుల్లో లభ్యంకానున్న ఈ ఫోన్ల ధర రూ.36,900గా ఉంది. ‘గెలాక్సీ సీ9 ప్రొ’ ఫోన్లను ఈ నెల 27 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఇవి ఫిబ్రవరి నెల నుంచి రిటైల్ షాపుల్లో అందుబాటులోకి వస్తాయి. ‘గెలాక్సీ సీ9 ప్రొ’లో 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 6 జీబీ ర్యామ్, 16 ఎంపీ ఫ్రంట్/రియర్ కెమెరా, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి పలు ప్రత్యేకతలున్నట్లు కంపెనీ వివరించింది. -
సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించిన శాంసంగ్ ఇండియా
న్యూఢిల్లీ: శాంసంగ్ ఇండియా తాజాగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇందులో భాగంగానే 535 సర్వీస్ వ్యాన్లను ప్రారంభించింది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,000 తాలుకాల్లోని గ్రామాల్లో సంచరించనున్నాయి. అలాగే కంపెనీ 250కి పైగా సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అలాగే మరో 250కి పైగా రెసిడెంట్ ఇంజినీర్లను నియమించుకుంది. దీంతో కంపెనీ సర్వీస్ పాయింట్ల సంఖ్య 3,000కు పైగా చేరింది. శాంసంగ్ కస్టమర్ ఈ సర్వీస్ వ్యాన్ల సాయంతో కంపెనీ సేవలను త్వరితగతిన పొందొచ్చని శాంసంగ్ ఒక ప్రకటన లో తెలిపింది. కాగా శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈవో హెచ్‌సీ హాంగ్.. నోయిడాలోని కంపెనీ తయారీ ప్లాంటులో ఈ కస్టమర్ సర్వీస్ వ్యాన్లను ఆవిష్కరించారు. -
కొత్త ఫోన్లపై శాంసంగ్ ఫోకస్
భారత్.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు అతి పెద్ద మార్కెట్. స్మార్ట్ ఫోన్ల కంపెనీల్లో రారాజుగా ఉన్న అటు శాంసంగ్ నుంచి అన్ని కంపెనీ చూపు భారత్ వైపే. దీంతో తన రారాజు స్థానాన్ని కొనసాగించడంతో పాటు, మార్కెట్ షేరును మరింత దోచేయడానికి భారత్ లో కొత్త కొత్త ఫోన్ల ఆవిష్కరణలపై శామ్ సంగ్ దృష్టిసారించేందుకు సిద్ధమైంది. వినూత్న లక్షణాలతో, తన స్థానాన్ని స్థిరంగా కొనసాగిస్తూ.. మార్కెట్ షేరును మరింత సొంతచేసుకోనుందని కంపెనీకి చెందిన టాప్ అధికారులు చెప్పారు. వివిధ ధరల్లో అన్ని విభాగాల్లో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించే దృష్టిని కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇన్నోవేషన్ అనేది ప్రధానమైన అంశంగా.. వినూత్న లక్షణాలతో కొత్త ప్రొడక్ట్ లను భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్టు శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ మార్కెటింగ్) మను శర్మ తెలిపారు. 2015 జనవరిలో 35శాతం ఉన్న మార్కెట్ షేరును ప్రస్తుతం 48.3శాతానికి పెంచుకున్నామని ప్రకటించారు. కొత్త స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణతో గతేడాది నుంచి 10 శాతానికి పైగా మార్కెట్ షేరును దక్కించున్నామని వెల్లడించారు. 4జీ మార్కెట్లో శామ్ సంగ్ మార్కెట్ షేరు 60శాతానికి పైగానే ఉందని, స్మార్ట్, ఫీచర్ వంటి అన్నిరకాల ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ లో కూడా 30శాతం మార్కెట్ షేరును కలిగిఉంది. టర్బో స్పీడ్ టెక్నాలజీ(టీఎస్టీ), స్మార్ట్ గ్లో, తర్వాతి తరం కలర్ ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లతో శామ్ సంగ్ నుంచి కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. టీఎస్టీ టెక్నాలజీ డివైజ్ ల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని, డబుల్ ర్యామ్ డివైజ్ లకంటే 40శాతం వేగంగా నేటివ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోగలుగుతారని శాంసంగ్ పేర్కొంది.