శాంసంగ్‌.. ‘గెలాక్సీ సీ9 ప్రొ’ @36,900 | Samsung Galaxy C9 Pro With 6GB of RAM Launched in India | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌.. ‘గెలాక్సీ సీ9 ప్రొ’ @36,900

Published Wed, Jan 18 2017 1:14 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

కొత్త ఫోన్‌తో బాలీవుడ్‌ నటి ప్రాచి దేశాయ్‌ - Sakshi

కొత్త ఫోన్‌తో బాలీవుడ్‌ నటి ప్రాచి దేశాయ్‌

భువనేశ్వర్‌: ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘శాంసంగ్‌ ఇండియా’ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘గెలాక్సీ సీ9 ప్రొ’ను దేశీ మార్కెట్‌లో ఆవిష్కరించింది. నలుపు, బంగారం రంగుల్లో లభ్యంకానున్న ఈ ఫోన్ల ధర రూ.36,900గా ఉంది. ‘గెలాక్సీ సీ9 ప్రొ’ ఫోన్లను ఈ నెల 27 నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక ఇవి ఫిబ్రవరి నెల నుంచి రిటైల్‌ షాపుల్లో అందుబాటులోకి వస్తాయి. ‘గెలాక్సీ సీ9 ప్రొ’లో 6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 16 ఎంపీ ఫ్రంట్‌/రియర్‌ కెమెరా, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీ, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ వంటి పలు ప్రత్యేకతలున్నట్లు కంపెనీ వివరించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement