ఆవిష్కరించిన హువావే ప్రారంభ ధర రూ.2.35 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి చైనా దిగ్గజం హువావే తెరలేపింది. మేట్ ఎక్స్‌టీ పేరుతో ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రెండు దశల్లో ఫోల్డ్ చేసేలా 3కే రిజొల్యూషన్, ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో ఇది రూపుదిద్దుకుంది. పూర్తిగా ఫోల్డ్ చేస్తే 6.4 అంగుళాల స్మార్ట్ ఫోన్‌గా వాడుకోవచ్చు. కొంత భాగం ఓపెన్ చేస్తే 7.9 అంగుళాలు, పూర్తిగా తెరిస్తే 10.2 అంగుళాల ట్యాబ్లెట్ పీసీ మాదిరి సింగిల్ స్క్రీన్‌గా మారిపోతుంది. 27 లక్షల పైచిలుకు యూనిట్లకు ప్రీ ఆర్డర్లు ఉన్నాయి.
ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లకు ప్రైమరీ స్క్రీన్, కవర్ డిస్‌ప్లే మాత్రమే ఉన్నాయి. ట్రై–ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 2.35 లక్షలు. ప్రస్తుతానికి చైనాకే పరిమితం. సెపె్టంబర్ 20 నుంచి కస్టమర్ల చేతుల్లోకి రానుంది. బరువు 298 గ్రాములు. పూర్తిగా ఫోల్డ్ చేసినప్పుడు 3.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 ఎంపీ టెలిఫోటో లెన్స్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment