Huawei
-
ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్ ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి చైనా దిగ్గజం హువావే తెరలేపింది. మేట్ ఎక్స్‌టీ పేరుతో ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రెండు దశల్లో ఫోల్డ్ చేసేలా 3కే రిజొల్యూషన్, ఓఎల్ఈడీ స్క్రీన్‌తో ఇది రూపుదిద్దుకుంది. పూర్తిగా ఫోల్డ్ చేస్తే 6.4 అంగుళాల స్మార్ట్ ఫోన్‌గా వాడుకోవచ్చు. కొంత భాగం ఓపెన్ చేస్తే 7.9 అంగుళాలు, పూర్తిగా తెరిస్తే 10.2 అంగుళాల ట్యాబ్లెట్ పీసీ మాదిరి సింగిల్ స్క్రీన్‌గా మారిపోతుంది. 27 లక్షల పైచిలుకు యూనిట్లకు ప్రీ ఆర్డర్లు ఉన్నాయి.ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లకు ప్రైమరీ స్క్రీన్, కవర్ డిస్ప్లే మాత్రమే ఉన్నాయి. ట్రై–ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 2.35 లక్షలు. ప్రస్తుతానికి చైనాకే పరిమితం. సెపె్టంబర్ 20 నుంచి కస్టమర్ల చేతుల్లోకి రానుంది. బరువు 298 గ్రాములు. పూర్తిగా ఫోల్డ్ చేసినప్పుడు 3.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 ఎంపీ టెలిఫోటో లెన్స్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్‌ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్‌ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్‌లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
సంచలనం..భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే భారత్‌కు గుడ్ బై చెప్పింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలపై కేంద్రం కఠిన వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ తరుణంలో హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ కార్యకాలాపాల్ని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..మా కంపెనీ అన్నీ నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్‌లో కార్యకాలాపాల్ని నిర్వహిస్తుంది. కానీ స్పష్టమైన కారణాల్ని హైలెట్ చేస్తూ భారత్‌లో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు హానర్ సీఈఓ ఝావో మింగ్ తెలిపారు. కానీ ఆ స్పష్టమైన కారణలు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈడీ దెబ్బ.. హువావే అబ్బా ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో, ఒప్పో, షావోమీలపై దాడులు, దర్యాప్తులు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో హువావే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అమెరికాలో సైతం 2018లో హానర్ భారత్‌లో ౩ శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అదే సమయంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తరువాత అక్కడ సైతం మార్కెట్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ అమెరికాలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు కష్టంగా మారింది. అందుకే హువావే గతేడాది నవంబర్‌లో తన హానర్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన ఆస్తుల్ని చైనాకు చెందిన షెన్జెన్ జిక్సిన్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అమ్మేసింది. -
టెస్లా కంటే తోపు కారును లాంచ్ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..
Huawei Unveils Aito M5 Hybrid Car Claims It Is Better Than Tesla Model Y: అమెరికన్ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ టెస్లాకు ధీటైన ఎలక్ట్రిక్ కారును ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. టెస్లానే కాకుండా దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల సంస్థలకు పోటీగా నిలుస్తోందని హువావే ప్రకటించింది. హువావే ఐటో ఎమ్5 ఇటీవల చైనీస్ కంపెనీ హువావే అనేక దేశాల్లో ప్రతికూలతలు ఎదురైనాయి. అమెరికా లాంటి దేశాలు హువావేపై నిషేధాన్ని విధించాయి. ప్రస్తుతం హువావే ఆవిష్కరించిన ‘ఐటో ఎమ్5’ కారుతో ఆయా దేశాల్లో పునరాగమనం చేసేందుకు ప్రయత్నాలను చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐటో ఎమ్5 కారును హువావే ప్రదర్శించింది. ఇక్కడ ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ కారు. విద్యుత్, ఇంధనంతో నడిచేలా ఐటో ఎమ్5ను హువావే ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్ల పరంగా ఈ వాహనం టెస్లా మోడల్ వైని అధిగమించగలదని కంపెనీ పేర్కొంది. ఈ కారులో హువావే రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్ హర్మోని ఒఎస్తో పనిచేయనుంది. ఈ కారులో డబుల్ లేయర్డ్ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఉన్నట్లు తెలుస్తోంది. 200కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో సుమారు 1000 కిమీ మేర ప్రయాణిస్తోందని హువావే పేర్కొంది. ఇది ఒక హైబ్రిడ్ కారు కావున ఒకవేళ ఛార్జింగ్ జీరో అయినా కూడా నిర్విరామంగా ప్రయాణం కొనసాగించవచ్చును. ఐటో ఎమ్5 ధర ఎంతంటే..! ఈ కారు విద్యుత్, ఇంధనం రెండింటితోనూ నడుస్తోంది. ఐటో ఎమ్5 ధర 250,000 యువాన్ (సుమారు రూ. 29,45,915)గా ఉంది. కాగా టెస్లా వై మోడల్ ధర 280,752 యువాన్ (సుమారు రూ. 33,07,887)గా ఉంది. అంటే హువావే ఆవిష్కరించిన కారు టెస్లా వై మోడల్ కంటే తక్కువ ధరలో లభించనుంది. చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి 20, 2022 నాటికి కస్టమర్లకు కారును డెలివరీ చేయడం ప్రారంభిస్తామని హువావే ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన హువావే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. హువావే లాంచ్ చేసిన మొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా హువావే పీ50 పాకెట్ నిలవనుంది. ఈ ఫోన్ సాధారణ ఫ్లిప్ ఫోన్‌లాగా ఉండనుంది. హువావే పీ50 పాకెట్ తొలుత చైనా మార్కెట్లలో లభించనుంది. వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా లభించనుంది. క్రిస్టల్ వైట్ , అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఎడిషన్‌ను డచ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ ఐరిస్ వాన్ హెర్పెర్తో హువావే జతకట్టింది. 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్; ప్రీమియం ఎడిషన్ 12జీబీ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. హువావే పీ50 పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 1.06 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హువావే పీ50 పాకెట్ ఫీచర్స్..! 6.9-అంగుళాల ప్రైమరీ OLED డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ హర్మోని ఆపరేటింగ్ సిస్టమ్ 40ఎంపీ+ 13ఎంపీ + 32ఎంపీ రియర్ కెమెరా 10.7ఎంపీ ఫ్రంట్ కెమెరా 8జీబీ ర్యామ్+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4000mAh బ్యాటరీ కెపాసిటీ 40W ఫాస్ట్ ఛార్జింగ్ చదవండి: షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే! -
అదిరిపోయిన ఎలక్ట్రిక్ కారు.. 700 కి.మీ రేంజ్, ధర కూడా తక్కువే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహన ధరలు తగ్గడం వల్లే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో పోటీ తారస్థాయికి చేరుకుంది. చాలా కంపెనీలు తక్కువ ధరకే ఎక్కువ దూరం వెళ్లే కార్లు, స్కూటర్లు, బైకులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. 700 కి.మీ రేంజ్ చాలా ఎలక్ట్రిక్ కార్లు కంపెనీలు ఎక్కువగా కిమీ రేంజ్ మీద దృష్టి సారిస్తున్నాయి. థర్మల్ మేనేజ్ మెంట్, కొత్త బ్యాటరీ టెక్నాలజీల సహాయంతో మార్కెట్లోకి కార్లను తీసుకొనివస్తున్నాయి. తాజాగా చైనాలో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్యువి కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు అని కంపెనీ వాగ్దానం చేసింది. అవతార్ ఈ11(AVATR E11)గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కేవలం నాలుగు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అని సంస్థ పేర్కొంది. హువావే, క్యాటెల్, చంగన్ ఆటోమొబైల్స్ అనే మూడు కంపెనీల జాయింట్ వెంచర్ అయిన అవతార్ టెక్నాలజీ ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. (చదవండి: Evaru Meelo Koteeswarulu: షోలో కోటి రూపాయలు గెలిచినా దక్కేది ఇంతేనా!) ఈ జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేసిన మొదటి హై ఎండ్ ప్యూర్ ఆల్ ఎలక్ట్రిక్ వేహికల్ ఇది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కారు స్పోర్టీ డిజైన్ తో వస్తుంది. AVATR E11 ఎలక్ట్రిక్ ఎస్యువి పొడవు 4.8 మీటర్లు. ఈ కారును చైనా మార్కెట్లో 300,000 యువాన్ల ధరకు లాంఛ్ చేశారు. ఇది మన దేశంలో దాదాపు ₹35 లక్షలకు సమానం. ఈ ఆల్ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని వచ్చే ఏడాది మూడవ త్రైమాసికంలో డెలివరీ చేయలని చూస్తున్నారు. రాబోయే మరో మూడు సంవత్సరాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు తెలిపారు. మన దేశంలోకి ఎప్పుడు తీసుకొనివస్తారు అనే విషయం మీద స్పష్టత లేదు. (చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!) -
ఇక ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్
నవంబర్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఓఎస్ ఫోన్లలో ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫారం వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 వినియోగిస్తున్నట్లైతే యూజర్లు వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ తెలిపింది. అప్డేట్ చేయని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. నవంబర్ 1,2021 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 ఉంటే వాట్సాప్ పనిచేయదని చెప్పింది. ఇక యాపిల్ విషయానికి వస్తే ఐఓఎస్ 9 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న జాబితా: ఆపిల్: iPhone 6, iPhone 6s plus, iPhone SE ఎల్ జి: Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II, Dual Optimus L5, Best L5 II, Optimus L5, Dual Best L3 II, Optimus L7, Optimus L7, Dual Best L7 II, Optimus F6, Enact Optimus F3, Best L4 II, Best L2 II, Optimus Nitro HD, Optimus 4X HD and Optimus F3Q. హువావే: Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2. శామ్ సంగ్: Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core and Galaxy Ace 2. జడ్ టీఈ: Grand S Flex, ZTE V956, Grand X Quad V987 and Grand Memo. సోనీ: Xperia Miro, Xperia Neo L, and Xperia Arc S. Alcatel, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, and Wiko Darknight, Lenovo A820 UMi X2, Run F1, THL W8 వంటి బ్రాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి -
లిప్‌స్టిక్ ఇయర్ బడ్స్‌ను చూశారా...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే యూరప్ మార్కెట్లలోకి కొత్త హువావే నోవా 9 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా సరికొత్త హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్, ఫ్రీబడ్స్ లిప్‌స్టిక్ ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేసింది. హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ ఈ-సిమ్ సపోర్ట్‌ను పొందనుంది. యూరప్ మార్కెట్లలో హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ ధర సుమారు రూ. 21600గా ఉండనుంది. పలు స్ట్రాప్స్ ఆప్షన్స్‌తో హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ రానుంది. హువావే లాంచ్ చేసిన ఉత్పత్తుల్తో ఇయర్‌బడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్ చూడటానికి లిప్‌స్టిక్ ఆకృతిలో ఉంది. మహిళ కొనుగోలుదారులను ఆకర్షించేందుకుగాను లిప్‌స్టిక్ షేప్‌లో హువావే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్‌బడ్స్ ధర సుమారు రూ. 21000 వరకు ఉండనుంది. కాగా ఈ గాడ్జెట్స్‌ను భారత మార్కెట్లలోకి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫేస్బుక్.. పేరు మార్చడం అంత ఈజీనా? మరి ఆ కంపెనీల సంగతి ఏంది? హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ 42మీ.మీ*46మీ.మీ డయల్ అమ్లోడ్ డిస్ప్లే విత్ అల్ట్రా కర్వ్డ్ 3డీ గ్లాస్ 32ఎమ్బీ ర్యామ్+4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 14 రోజులవరకు బ్యాటరీ బ్యాకప్ బ్లూటూత్, జీపీఎస్ టెంపరేచర్ సెన్సార్, ఆప్టికల్ హర్ట్ రేట్ రీడర్ హువావే ఫ్రీబడ్స్ లిప్‌స్టిక్ ఫీచర్స్.. ఆక్టివ్ నైక్ క్యాన్సిలేషన్ 22 గంటల మ్యూజిక్ ప్లే 410mAh బ్యాటరీ చదవండి: ఫేస్బుక్ నెత్తిన మరో పిడుగు..! -
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ‘హువావే’ అంటారు. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్, సైడ్–టచ్ ఫీచర్లుకు సంబంధించిన మోడల్ కోసం పేటెంట్ ఫైల్ చేసింది హువావే. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డింగ్ ఫోన్‌ని ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్‌తో రూపొందించారు. ఈ నేపథ్యంలో ‘హువావే’ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్ ద్వారా ఎక్స్ట్రాస్క్రీన్ కలిసొస్తుంది. రకరకాల ఐకాన్ల కోసం, సింగిల్ లైన్ మెసేజ్‌లు చదువుకోవడం కోసం ఉపయోగపడుతుంది. -
షాకింగ్ సేల్స్ : కేవలం నిమిషంలోనే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు
స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ విడుదల చేసిన హానర్ 50, హానర్ 50 సిరీస్ స్మార్ట్ఫోన్లు కేవలం నిమిషంలోనే అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల్ని హానర్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2జీ, 4జీ, ఇప్పుడు 5జీ విప్లవం మొదలైంది. దీంతో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీ పై దృష్టిసారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేయగా తాజాగా హువాయే సబ్ బ్రాండ్ గా పేరొందిన హానర్ కంపెనీ చైనా కేంద్రంగా హానర్ 50, హానర్ 50ప్రో, హానర్ 50ఎస్ఈ ఫోన్లపై శుక్రవారం రోజు ఫ్రీ ఆర్డర్‌ను ప్రకటించింది. అలా ఆర్డర్ ప్రకటించింది లేదో కేవలం నిమిషం వ్యవధిలోనే హానర్ 50 సిరీస్ ఫోన్లు అమ్ముడయ్యాయి. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ హానర్ 50ప్రో ఫీచర్స్ విషయానికొస్తే 6.72అంగుళాలు 120 హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 12జీబీ ర్యామ్ తో 778జీ ప్రాసెసర్ 108 ఎంపీ - 8ఎంపీ-2ఎంపీ-2ఎంపీతో కెమెరా సెటప్ 32 ఎంపీ + 12ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 4,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది 50ప్రో ధర : ఇండియన్ కరెన్సీలో రూ. 42,380గా ఉంది. హానర్ 50 ఫీచర్స్ అండ్ ప్రైస్ హానర్ 50 సైతం 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో 6.57 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 778జీ ఎస్ఓసీ 12జీబీ ర్యామ్ వేరియంట్ తో వస్తుంది క్వాడ్ రేర్ కెమెరా సెటప్ తో పాటు 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది 32ఎంపీ తో సింగిల్ సెల్ఫీ కెమెరా 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 30,922కే అందిస్తుంది. హానర్ 50ఎస్ఈ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ హానర్ 50ఎస్ఈ 6.78 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ నుంచి 128జీబీ వరకు స్టోరేజ్ 16 ఎంపీల సెల్ఫీ కెమెరా 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీల రేర్ కెమెరా సెటప్ 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 27,480కే అందిస్తుంది. -
Huwaie Driverless Car: హువాయ్ విప్లవాత్మక ప్రకటన
షెంజెన్: ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ హువాయ్ విప్లవాత్మక ప్రకటన చేసింది. వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఆపకుండా.. డ్రైవర్ లెస్ కార్ల టెక్నాలజీకి శరవేగంగా పావులు కదుపుతోంది. 2025 నాటికల్లా డ్రైవర్‌లెస్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, చైనీస్ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్ టెక్నాలజీస్ ఆటోమోటివ్ స్పేస్‌లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు హింట్ అందుతూనే వస్తోంది. అయితే ఏకంగా డ్రైవర్‌లెస్ కార్లను తయారు చేస్తామనే ప్రకటనతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చోంగ్క్వింగ్ ఛాంగన్ ఆటోమొబైల్ కో లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రెండు కంపెనీలతో హువాయ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీగా పేరున్న హువాయ్.. స్మార్ట్ఫోన్ల అమ్మకం ద్వారా హవా చాటేది. అయితే ట్రంప్ హయాంలో ఆంక్షలు, ప్రత్యేకించి హువాయ్‌తో అమెరికా వర్తకానికి పెనుముప్పు ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో హువాయ్ దూకుడు మొదలుపెట్టింది. ఇక హువాయ్‌తో పాటు జియోమి, ఒప్పో కూడా వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు యాపిల్ కూడా ఈ రంగం తీరుతెన్నులపై ఒక అంచనాకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: స్మార్ట్ వాచ్.. 54 శాతం భారీ తగ్గింపు -
గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!
ప్రస్తుతం వీడియో కాలింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌లో గూగుల్ డ్యుయో యాప్ ఒకటి. ఇందులో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ చేసి మాట్లాడుకొనే సౌకర్యం ఉంటుంది. తాజాగా గూగుల్ డ్యుయో సేవలు కొన్ని మొబైల్ ఫోన్ లలో నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. గూగుల్ చేత ధృవీకరణ చేయబడని కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్లే సర్వీసెస్ కోసం గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేస్తుంది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం సర్టిఫైడ్ చేసిన ఫోన్లు సురక్షితమైనవి, గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండే యాప్ లు ఎటువంటి ఆటంకం లేకుండా ఇందులో పని చేస్తాయి.(చదవండి: వాట్సాప్ పై కేంద్రం ఆగ్రహం) ఒకవేళ గనుక గూగుల్ యాప్స్‌కు సంబంధించిన సర్టిఫికేట్ గూగుల్ ఇవ్వకుంటే వాటిలో ఈ యాప్స్ పనిచేయవు. గతంలో ఇలాగే కొన్ని మొబైల్ ఫోన్లలో గూగుల్ మెస్సేజెస్ సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు అదే తరహాలో త్వరలో గూగుల్ డ్యుయో సేవలు నిలిచపోనున్నాయి. గూగుల్ డ్యుయో సేవలు హువావే బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో నిలిచిపోనున్నట్లు సమాచారం. మిగతా నోకియా, శాంసంగ్, వన్‌ప్లస్, వివో, ఒప్పోతో పాటు ఇతర బ్రాండ్లలో ఈ యాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలుస్తోంది. ఈ సేవలు మార్చి 31 నుంచి నిలిచిపోనున్నట్లు సమాచారం. డేటా భద్రపర్చుకొండి మీరు డ్యుయో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ‘త్వరలో డ్యుయో ఆగిపోనుంది. ఎందుకంటే మీరు గూగుల్ ధృవీకరించని డివైజ్ ఉపయోగిస్తున్నారు. మీ ఖాతాను ఈ డివైజ్ నుంచి తొలగించడం జరుగుతుంది’ అనే మెస్సేజ్ పని చేయని ఫోన్లలో వస్తుంది. ఒకవేళ కనుక ఈ మెసేజ్ వస్తే వెంటనే మీరు మీ పూర్తీ డేటాను సేవ్ చేసుకొని వేరొక చోట భద్రపర్చుకోవడం మంచిది. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, జూమ్, జియోమీట్, స్నాప్‌ఛాట్ వంటి వాటిని వాడుకోవచ్చు. -
మార్కెట్లోకి హువావే 5జీ మొబైల్స్
చైనా: ప్రముఖ టెక్ కంపెనీ హువావే నోవా 8 ప్రో, హువావే నోవా 8 స్మార్ట్ఫోన్లను చైనాలో విడుదల చేసింది. ఈ రెండు 5జీ స్మార్ట్ఫోన్లు 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ఈ ఫోన్లు కీరిన్ 985 ప్రాసెసర్ చేత పనిచేస్తాయి. హువావే నోవా 8లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-హెచ్డి + డిస్ప్లే ఉంది. మరోవైపు, హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల డిస్ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. లాంచ్‌కి ముందు చైనా టెలికాం సైట్లో హువావే నోవా 8 యొక్క ఫీచర్స్ లీక్ అయ్యాయి.(చదవండి: లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర) హువావే నోవా 8 ప్రో స్పెసిఫికేషన్లు హువావే నోవా 8 ప్రో హార్డ్‌వేర్ ఫ్రంట్‌లోని నోవా 8తో సమానంగా ఉంటుంది. కానీ డిస్ప్లే, బ్యాటరీ మరియు ఫ్రంట్ కెమెరాలో తేడాలు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ (నానో) హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల పూర్తి-హెచ్డి + ఒఎల్ఇడి డిస్ప్లే (1,236x2,676 పిక్సెల్స్) తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్10 ఆధారిత ఈఎంయుఐ 11తో నడుస్తుంది. 5జీ హ్యాండ్‌సెట్‌లో హిసిలికాన్ ఆక్టా-కోర్ కిరిన్ 985 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. హువావే నోవా 8 ప్రోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి 16 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా. హువావే నోవా 8ప్రో 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2, యుఎస్బి టైప్-సి పోర్ట్, ఎన్ఎఫ్సి ఉన్నాయి. ఇది 184 గ్రాముల బరువు ఉంటుంది. ధర సుమారు రూ.49,600. హువావే నోవా 8 ఫీచర్స్: డిస్ప్లే: 6.57 అంగుళాలు ప్రాసెసర్: హిసిలికాన్ కిరిన్ 985 ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్ రియర్ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సల్ ర్యామ్: 8జీబీ స్టోరేజ్: 128జీబీ బ్యాటరీ కెపాసిటీ: 3800ఎంఏహెచ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 ధర: రూ.37,200 -
శాంసంగ్‌ను దాటిన హువావే
లండన్: స్మార్ట్‌ఫోన్స్ విక్రయాల్లో ప్రపంచ టాప్ సెల్లర్‌గా హువావే నిలిచినట్టు పరిశోధన సంస్థ కెనలిస్ వెల్లడించింది. శాంసంగ్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) హువావే 5.58 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు కెనలిస్ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం తగ్గుదల. శాంసంగ్ విషయానికి వస్తే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30 శాతం అమ్మకాలు తగ్గి 5.37 కోట్ల యూనిట్లు నమోదైంది. హువావేకు కోవిడ్–19 కలిసి వచ్చిందని కెనలిస్ తెలిపింది. చైనాలో ఈ కంపెనీ అమ్మకాలు గడిచిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధి చెందాయి. కంపెనీ మొత్తం విక్రయాల్లో చైనా వాటా 70 శాతముంది. చైనా రికవరీ హువావేకు కలిసి వచ్చింది. శాంసంగ్‌కు యూఎస్, యూరప్, బ్రెజిల్, భారత్ ప్రధాన మార్కెట్లు. చైనా నుంచి సమకూరుతుంది తక్కువే. -
హార్ట్ బీట్‌ను పసిగట్టే స్మార్ట్‌వాచ్
సాక్షి, ముంబై: చైనా మొబైల్స్ తయారీదారు హువావే కొత్త స్మార్ట్‌వాచ్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జీటీ 2 స్మార్ట్‌వాచ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీటీ 2 వాచ్ 42 ఎంఎం వేరియంట్ లభ్యత వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే 46 ఎంఎం వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర రిటైల్ దుకాణాలతో సహా ఇ-కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. జీటీ2 స్మార్ట్‌వాచ్ ఫీచర్లు 1.2 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్ప్లే, రౌండ్ డయల్ హువావే కిరిన్ ఎ1 చిప్, 3డీ గ్లాస్, బ్లూటూత్ 5.1 వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్ ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్ ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, 15 వర్కవుట్ మోడ్స్, ధరలు 46 ఎంఎం స్పోర్ట్ (బ్లాక్) రూ.15,990, లెదర్ స్ట్రాప్ మోడల్ రూ.17,990, మెటల్ స్ట్రాప్ రూ.21,990. 42 ఎంఎం వేరియంట్ ప్రారంభ ధర రూ. 14,990 డిసెంబర్ 12 - 18 వరకు వినియోగదారులు ప్రీ బుక్ చేసుకోవచ్చు. అలాగే ముందస్తు బుకింగ్‌లో మొత్తం నగదు చెల్లించిన వారికి 6999 రూపాయల విలువైన హువావే ఫ్రీలేస్ ఉచితంగా అందిస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభ్యం. 19 వ తేదీ అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు మొదటి సేల్కు అందుబాటులో వుంటుంది. హువావే మినిస్పీకర్ (రూ .2,999) గెలుచుకునే అవకాశం కూడా వుంది. 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వుంటుందని కంపెనీ తెలిపింది.అంతేకాదు తమ స్మార్ట్‌వాచ్ వినియోగదారుని హార్ట్ బీట్‌ను మానిటర్ చేస్తుందని, హృదయ స్పందన రేటు 100 బిపిఎమ్ కంటే ఎక్కువ లేదా 50 బిపిఎమ్ కంటే తక్కువ 10 నిమిషాలకు మించి ఉంటే వినియోగదారుడిని అలర్ట్ చేస్తుందని, స్విమ్మింగ్ చేస్తున్నపుడు కూడా ఈ వాచ్ పనిచేస్తుందని హువావే వెల్లడించింది. -
హువావే ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ ట్యాబ్లెట్ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ డివైజెస్ తయారీ సంస్థ హువావే.. తాజాగా ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ పేరుతో ట్యాబ్లెట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదలచేసింది. కాలేజీకి వెళ్ళేవారు, పని నిపుణులు, కళాకారులు, పిల్లలకు సరిపోయే విధంగా దీనిని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ డివైజ్ ధర రూ. 21,990 వద్ద నిర్ణయించింది. శక్తివంతమైన 8–కోర్ ప్రాసెసర్, 10.1 అంగుళాల డిస్ప్లే, 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో స్పెసిఫికేషన్లుగా వెల్లడించింది. నూతన ట్యాబ్ సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ వెబ్ సైట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ‘5జీ’ ట్రయల్స్‌కు అనుమతి దక్కేనా..! భారత్‌లో 5జీ ట్రయల్స్‌కు హువావే ఆసక్తిని వెల్లడించగా.. జాతి ప్రయోజనాల ఆధారంగా ఈ అంశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నామని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ అన్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. 4 నెలల్లో స్పెక్ట్రమ్ వేలం ఉండనుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
హువావే ‘మేట్ 30’ ఆవిష్కరణ
మ్యూనిక్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తన అధునాతన ‘మేట్ 30’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను గురువారం ఆవిష్కరించింది. ‘మేట్ 30’, ‘మేట్ 30 ప్రో’ పేరిట తొలి సెకండ్ జనరేషన్ ‘5జీ’ స్మార్ట్ఫోన్లను పరిచయంచేసింది. వీటిలో గూగుల్ లైసెన్స్ పొందిన యాప్స్ అయిన మ్యాప్స్, జీ మెయిల్, యూట్యూబ్ లేవని ప్రకటించింది. కిరిన్ 990 ప్రాసెసర్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మేట్ 30 స్మార్ట్‌ఫోన్.. 6.62 అంగుళాల డిస్ప్లే, 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 799 యూరోలుగా ప్రకటించింది. ‘మేట్ 30 ప్రో’ ధర 1,199 యూరోలుగా నిర్ణయించింది. -
హువావే వై 9 ప్రైమ్ లాంచ్
చైనా రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. హువావే వై 9 ప్రైమ్ పేరుతో నేడు (ఆగస్టు 1, గురువారం) ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. పాప్ అప్ కెమెరా సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా కంపెనీ తెలిపింది. ధర రూ.15,990 గా ఉంచింది. అమెజాన్‌లో ప్రైమ్ కస్టమర్లకు ఆగస్టు 7వ తేదీ నుంచి, మిగిలిన వారికి 8వ తేదీనుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యంతోపాటు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ పే ద్వారా కొంటే రూ.500 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే జియో కస్టమర్లకు రూ.2200 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. హువావే వై9 ప్రైమ్ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే ఆక్టాకోర్ కిరిన్ 710 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 4 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 16+ 8+ 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4 000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ ఫోన్లలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఉండవట
శాన్ఫ్రాన్సిస్కో: చైనా టెలికాం దిగ్గజం హువావేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్బుక్ సహా, తమ యాప్‌లు వాట్సాప్, ఇన్‌స్ట్రామ్ ప్రీ-ఇన్‌స్టాల్‌గా లభించవని ప్రకటించింది. మార్కెట్లోకి రానున్న హువావే స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు వీటిని తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్డేట్స్ ఇస్తామని ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ నిర్ణయంపై ట్విటర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు హువావే నిరాకరించింది. హుహావేపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువావేకు ఎలాంటి సాయం చేయొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు భవిష్యత్‌లో తమ సేవలను అందించబోమని ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు. దీంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వారు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ, 90రోజుల తర్వాత గూగుల్ ప్లేస్టోర్ యాక్సెస్‌ను కూడా హువావే కొత్త ఫోన్లకు ఉండదు. కాగా సాధారణంగా ఫేస్బుక్, ట్విటర్లాంటి సోషల్ మీడియా యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌గా ప్రస్తుత స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. ఇందుకు ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. సోషల్ మీడియాకు చిన్నా పెద్ద దాసోహం అంటున్న ప్రస్తుత తరుణంలో ఈ యాప్‌లు లేని స్మార్ట్ఫోన్లపై కొనుగోలు దారుల ఆసక్తి ఏ మేరకు ఉంటుందనేది ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో హువావే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు భారీగా ప్రభావితం కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఆంక్షల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొనే సత్తా తమ వద్ద ఉందని హువావే ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హువావేకు భారీ ఊరట : రష్యాతో కీలక ఒప్పందం
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువావే కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు కీలక డీల్‌ను కుదుర్చుకుంది. 2019-20 నాటికి 5జీ టెక్నాలజీకోసం రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రెండుకంపెనీలు ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2019-20 నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన 5జీ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్ వెల్లడించింది. రష్యా చైనా దేశాల వ్యూహాత్మక బంధం ఈ ఒప్పందంతో మరింత బలపడిందంటూ సంతోషం వ్యక్తం చేశారు హువావే అధినేత గువోపింగ్. కాగా అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందంటూ హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా టెక్నాలజీ వినియోగించి తమ దేశంపైనే గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికాలో తయారయ్యే టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించరాదంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో హువావే పలు ఇబ్బందుల్లో పడిపోయింది. అమెరికా కనుసన్నల్లో నడిచే పాశ్చాత్య దేశాలు జాతీయ భద్రతా ప్రమాదం పేరుతో హువావేను బ్లాక్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం హువావేకుభారీ ఊరట నివ్వనుంది. -
పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్!
బీజింగ్ : చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేను ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చైనా యువత భారీ షాకిచ్చింది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియా యూజర్లు, యువత కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ టెక్ దిగ్గజం హువావేకు అక్కడి యూజర్లు మద్దతుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు. ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వంపై అక్కడి యువత మండిపడుతోంది. ట్విటర్, వైబోలాంటి సోషల్ మీడియా వేదికల్లో ఆపిల్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు లభిస్తున్నాయి. దీంతో చైనా అంతటా యాంటీ ఆపిల్ ఉద్యమం ఊపందుకుంది. హువావేపై ట్రంప్ సర్కార్ కావాలనే వేధింపులకు పాల్పడుతోందని యూజర్లు మండి పడుతున్నారు. అలాగే ఆపిల్ ఐఫోన్ కొనాలన్న తన ఆలోచనను మార్చుకుని హువావే ఫోన్‌ను కొనుగోలు చేయనున్నామని మరో యూజర్ ప్రకటించారు. మరోవైపు ఈ నిర్ణయం స్వల్పకాలంలో చైనాలో ఆపిల్ అమ్మకాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ తిరస్కరించింది. దీంతో అమెరికా-చైనా ట్రేడ్ వార్ మరింత ముదురుతున్న ఆందోళన నెలకొంది. కాగా హువావేపై ఆంక్షలను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రేడ్ వార్ : హువావే స్పందన
చైనీస్ టెలికం దిగ్గజం హువే టెక్నాలజీస్‌పై విధించిన ఆంక్షలపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ ధీటుగా స్పందించారు. తమ బలాన్ని అమెరికా ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తోందనీ, ఇది తగదని గట్టిగానే హెచ్చరించారు. ఇలాంటి చర్యల ద్వారా తమ సామర్ధ్యాలను ఏమాత్రం దెబ్బతీయలేరంటూ చైనీస్ స్టేట్ మీడియా సీసీటీవీతో పేర్కొన్నారు. హువావేపై నిషేధం సడలింపు హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా హువావేపై అమెరికా గుర్రుగా ఉన్న నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్డ్‌వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా గత వారం హువేను వాషింగ్టన్ ప్రభుత్వం వాణిజ్యపరమైన(ట్రేడ్) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో గూగుల్ తదితర కంపెనీలు బిజినెస్ డీలింగ్స్‌ను రద్దుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా సడలిస్తూ వాషింగ్టన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. -
హువావే పీ 30 ప్రొ, పీ 30 లైట్ లాంచ్
చైనా మొబైల్ మేకర్ హువావే భారతీయ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో సరికొత్త డివైస్లతో దూకుడును ప్రదర్శిస్తోంది. ఇటీవలే పీ 30 సిరీస్‌లో భాగంగా హువావే పీ 30, పీ 30 ప్రొ పారిస్‌లో ఆవిష్కరించిన సంస్థ తాజాగా పీ30 ప్రొ, పీ 30 స్మార్ట్ఫోన్లను మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్‌లో విడుదలైన హువావే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీతో పాటు ట్రిపుల్ బ్యాక్ కెమెరా, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఇందులో అందిస్తోంది. హువావే పీ30 ప్రొ ఫీచర్లు 6.47 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హువావే కిరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 40+ 20+ 8 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే పీ 30 లైట్ ఫీచర్లు 6.15 ఫుల్హెచ్డీ డిస్ప్లే కిరిన్ 710 సాక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 24+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ, 6జీబీ రెండు వేరియంట్లలో హువావే పీ 30 లైట్ లభ్యమవుతుంది. కాగా 4జీబీ వేరియంట్ ధర రూ. 19,990గా ఉండగా, 6జీబీ వేరియంట్ ధర రూ. 22,990గా ఉంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది. హువావే పీ30 ప్రొ స్మార్ట్‌ఫోన్ ధర రూ.71,990 గా ఉంది. -
హువావే వై6(2019)
మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ వై6 2019 ను రష్యా మార్కెట్లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో డ్యూ డ్రాప్ నాచ్‌డిస్‌ప్లే , మీడియా టెక్ హీలియో ఏ22 సాక్ ప్రాసెసర్ దీన్ని లాంచ్ చేసింది. రూ.9,770 ధర నిర్ణయించింది. హువావే వై6 2019 ఫీచర్లు 6.09 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 మీడియా టెక్ హీలియో ఏ22 సాక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3020 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ కెమెరాతో ‘హానర్’ స్మార్ట్‌ఫోన్
హువావే సబ్ బ్రాండ్ హానర్ ప్రకటించిన విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోకి అడుగపెట్టబోతోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన హానర్ వ్యూ20ని ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 22) లాంచ్ చేస్తోంది. అలాగే ఈ నెల 29న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌కు ప్రారంభమైనాయని కంపెనీ ప్రకటించింది. అద్భుతమైన ఫీచర్లు, ప్రపంచంలోనే భారీ కెమెరాతో తొలి స్మార్ట్‌ఫోన్‌గా, వ్యూ సిరీస్‌లో టాప్ ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వ్యూ20 నిలవనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,500. 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,600గా ఉంది. ఇక ఈ డివైస్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ వ్యూ20 ఫీచర్లు 6.4 ఇంచెస్ డిస్ప్లే కిరిన్ 980 ఆక్టాకోర్ సాక్ ఆండ్రాయిడ్ 9 1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో ఇప్పటికే లాంచ్ కాగా హానర్ వ్యూ 20 మోషినో రెడ్ ఎడిషన్‌ను లేటెస్ట్ గా విడుదల చేసింది. Sung too many tunes about reimagining your memories? Upgrade to newer inventions with the #WorldsFirstTechnology of 48MP AI Camera on the #HONORView20!#SeeTheUnseen launching on 29th January! Pre-book!#HONOR Store: https://t.co/rxo3bqIoma@amazonIN : https://t.co/6UArGjoHOJ pic.twitter.com/rvH7NVJ66s — Honor India (@HiHonorIndia) January 21, 2019