
ఆపిల్‌ను వెనక్కి నెట్టిన చైనా బ్రాండ్
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్‌కి కంపెనీ చైనా ఆధారిత స్మార్ట్‌ఫోన్ కంపెనీ హువాయి భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచంలో మొబైల్ అమ్మకాల్లో హువాయ్ రెండవస్థానాన్ని ఆక్రమించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. దీంతో ఆపిల్ మూడవ స్థానానికి పడిపోయింది.
తాజా పరిశోధన ప్రకారం ఇప్పటివరకూ ఆపిల్ సొంతమైన రెండవ స్థానాన్ని చైనా బ్రాండ్ హువాయ్ కొట్టేసింది. జూన్, జులై ప్రపంచ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో హువాయ్ ఆపిల్‌ను అధిగమించింది. ఆగస్ట్ అమ్మకాల్లో కూడా ఇదే హవాను కొనసాగించననుంది. గ్లోబల్ గా దాదాపు 13శాతం మార్కెట్‌షేర్‌ను కొల్లగొట్టిన హువాయి..భారత్ మార్కెట్‌లో కూడా తన సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో ఈ సంవత్సరాంతానికి టాప్ -5లో ఉండాలన్న టార్గెట్ నిర్దేశించుకుంది.
జూన్‌లో హువాయి ఇండియా డైరెక్టర్ అల్లెన్ వాంగ్ అందించిన వివరాల ప్రకారం 2016 డిసెంబర్ నాటికి 13.2శాతానికి చేరుకోగా, ఆపిల్ కేవలం 12శాతంతో సరిపెట్టుకుంది. గత ఏడాది దాదాపు 139 మిలియన్లవ స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసినట్టు వాంగ్ ప్రకటించారు. అలాగే హానర్ ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ ఆన్‌లైన్ బ్రాండ్‌గా మారిందని, తమ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంతో సహా 74 దేశాల్లో అమ్ముడవుతోందని వాంగ్ తెలిపారు.
పరిశ్రమ నిపుణుల ప్రకారం, స్మార్ట్‌ఫోన సెగ్మెంట్ లో హువాయ్ భారతదేశంలో అమ్మకాలు రెండింతల వృద్ధిని అంచనావేసింది. అయితే పోటీదారులతో పోలిస్తే ఇది తక్కువేనని ఈ పరిశోధన తెలిపింది.అలాగే 2016 - 2017 మొదటి త్రైమాసికానికి హవావీ అమ్మకాలు రెట్టింపు సాధించినప్పటకీ ప్రత్యర్థులు, చైనా కంపెనీలు ఒప్పో, మరియు వివోలతో పోలిస్తే చాలా తక్కువే. అయినప్పటికీ, భారతదేశంలో పెద్ద ఆటగాళ్లను సవాలు చేసే ఏకైక బ్రాండ్ హువాయి అని తాము విశ్వసిస్తున్నామని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెకర్టర తరుణ్ పాథక్ తెలిపారు.