
రిలయన్స్ అధినేత,బిలియనీర్ ముఖేష్ అంబానీ ,నీతా అంబానీ (nita ambani) విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వ్యాపార కుటుంబ వారసత్వంతోపాటు, వ్యాపార దక్షతతో భారీ వ్యాపార సామ్రాజ్యం వారి సొంతం. అంబానీ భార్య నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు.
ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ కూడా ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపార నాయకుల' జాబితాలో పేరు దక్కించుకున్నారు. ఫిలాంత్రఫిస్ట్‌గా కూడా అనేక దాతృత్వ కార్యక్రమాల్లో ముందుంటారు. నీతా అంబానీ దగ్గరున్న చీరలు, డైమండ్ నగలు, చెప్పులు, వాచెస్, వజ్రాలు పొదిగిన హ్యాండ్ బ్యాగ్‌లు, లిప్‌స్టిక్‌ల అద్భుతమైన కలెక్షన్ లెక్కేలేదు. హ్యాండ్ బ్యాగ్‌లు కూడా వజ్రాలతో పొదిగి ఉంటాయి. చానెల్, గోయార్డ్ మరియు జిమ్మీ చూ కెర్రీ వంటి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల హ్యాండ్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి
నీతా అంబానీ టీ రూ. 3 లక్షల విలువైన ప్రత్యేకమైన కప్పు
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఉదయంఆ మె తాగే టీ కప్పు కూడా చాలా విశేషమైనదేట. నీతా ఒక చాయ్ ప్రేమికురాలు ఉదయం టీని ప్రత్యేకమైన టీ కప్పులోనే తాగుతుందట. ఈ విషయాన్ని ఒక సందర్భంలో స్వయంగా నీతా అంబానీనే వెల్లడించారు. దీన్ని జపాన్‌లో పురాతన క్రాకరీ బ్రాండ్ నోరిటెక్ నుండి 50 పింగాణీ కప్పుల సెట్ కొనుగోలు చేశారు. దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు, అంటే ఒక్కో కప్పు ధర రూ. 3 లక్షలు. ఈ కప్పులు ప్రత్యేకమైన పద్ధతిలో, బంగారం , ప్లాటినం పూత పూసిన అంచులతో తీర్చిదిద్దారు. ఈ డిజైన్ చాలా అరుదుగా లభిస్తుంది మరియు నోరిటెక్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
చదవండి: ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
అంతేకాదు నీతా అంబానీ షాపింగ్ కోసం ఎక్కువ శ్రీలంక వెళతారట. ముఖ్యంగా వంటగది సామాగ్రిని శ్రీలంక దేశం నుంచి కొనుగోలు చేస్తారట. ఇది భారతదేశంలో కంటే శ్రీలంకలో ఉత్పత్తులను చౌకగా చేస్తుంది. భారతదేశంలో సాధారణంగా రూ. 67,000 నుండి రూ. 1.6 లక్షల వరకు ఖరీదు చేసే డిన్నర్ సెట్ శ్రీలంకలో రూ. 25వేల నుంచి రూ. 42 వేల మధ్య లభిస్తుందట. నీతా అంబానీకి కూడా బ్రాండెడ్ వాచీలంటే చాలా ఇష్టం. ఆమె వాచెస్ కలెక్షన్‌లోబల్గారి, కార్టియర్, రాడో, గూచీ, కాల్విన్ క్లైన్ , ఫాసిల్ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. ఈ బ్రాండ్ల వాచీల ధర రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అలాగే పెడ్రో, గార్సియా, జిమ్మీ చూ, పెల్మోరా, మార్లిన్ బ్రాండ్‌ల నుండి బూట్లు, చెప్పులను ధరిస్తారు.ఈ బ్రాండ్ల షూలు రూ. 1 లక్ష నుండి ప్రారంభమవుతాయి అంటే నీతా లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌ను అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!