Style
-
సినిమాటోగ్రాఫర్ పెళ్లికి హాజరైన స్టార్ హీరో కార్తీ (ఫోటోలు)
-
మీసాలు.. గడ్డాలకు భేషైన తైలాలు
మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని మనకో సామెత ఉంది. స్తోమతకు మించి డాబులొలికే దిలాసారాయుళ్ల తీరును ఎద్దేవా చేయడానికి పుట్టిన సామెత అది. ఆనాటి సమాజంలో సంపన్నులైన పెద్దమనుషులు మీసాలకు సంపెంగ నూనెలు, ఇతరేతర సుగంధ తైలాలను పూసుకుంటూ, దర్జా ప్రదర్శించేవారు. ఇదివరకు కాస్త వయసు మళ్లినవాళ్లే ఏపుగా గడ్డాలు పెంచేవాళ్లు. ఇటీవలి కాలంలో కుర్రాళ్లు కూడా ఎడాపెడా గడ్డాలు పెంచేసుకుంటున్నారు. కొందరు అడ్డదిడ్డంగా గడ్డాలు పెంచుకుంటూ, చిరిగిన జీన్స్ తొడుక్కుని వీథుల్లో ఆవారాగా తిరుగుతుంటే, ఇంకొందరు సూటు బూట్లు ధరించి, పద్ధతిగా గడ్డాలను రకరకాల తీరుల్లో కత్తిరించుకుంటూ, గడ్డాలు దట్టంగా పెరగడానికి నానా రకాల పోషక తైలాలు వాడుతున్నారు. గడ్డాల మీద యువతరం మోజు గమనించిన మార్కెట్ శక్తులు ఊరుకుంటాయా? యువకుల మోజును సొమ్ము చేసుకోవడానికి గడ్డాల పోషణకు ప్రత్యేకంగా రూపొందించిన రకరకాల తైలాలను మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. బియర్డ్ ఆయిల్స్, బియర్డ్ క్రీమ్స్ పురుషుల సౌందర్య ఉత్పత్తులలో కీలకంగా మారి΄ోయాయి. తలకు రాసుకునే హెయిరాయిల్స్, బ్రిలియంటైన్స్, జెల్స్‌తో పోల్చుకుంటే మీసాలు గడ్డాలకు పూసుకునే బీర్డ్ ఆయిల్స్, క్రీమ్స్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నా, గడ్డాలరాయుళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. గడ్డం సంరక్షణ, పద్ధతులుగడ్డం వేగంగా పెరగాలంటే ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండిమంచి చర్మ సంరక్షణ నియమాన్ని పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి, జుట్టు పెరుగుదలకు మెరుగైన వాతావరణం ఉంటుంది.టీనేజర్లు రోజుకు రెండుసార్లు తేలికపాటి క్లెన్సింగ్ జెల్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో రంధ్రాలు ఓపెన్ అవుతాయి.అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రకారం గడ్డాన్ని మాయిశ్చరైజింగ్, బీర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం. ముఖం,గడ్డాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రపరచడం, మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం ముఖ్యం.అలాగే గ్రూమింగ్ కోసం మంచి నూనె లేదా కండిషనర్ను పూయడం లాంటివి పాటించాలి.చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేయాలి.వారానికి కనీసం రెండుసార్లు మృతచర్మ కణాలను తొలగించడానికి ,చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది చర్మాన్ని తేమగా , హైడ్రేట్ గా ఉండాలి. ఇందకు తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం.కీలక సూచనలుతాజాపండ్లు, కూరగాయలు , మాంసకృత్తులు, సమతులమైన ఆరోగ్యకరమైన తీసుకోవాలి. B1, B6 , B12 వంటి విటమిన్ లోపాలు టీనేజర్లలో మీసాలు, గడ్డాల పెరుగుదలను ఆలస్యం కావచ్చు. దీన్ని గమనించుకోవాలి.రోజువారీ వ్యాయామం చేయడం, ముఖం శుభ్రంగా ఎప్పటికపుడు కడుక్కోవడం, ఎక్స్ఫోలియేట్ చేయడం లాంటివి చేయాలి. యూకలిప్టస్ బేస్డ్ మాయిశ్చరైజరింగ్, కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా పాటించాలి.చదవండి : తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్‌బాత్ -
దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..
అమావాస్య నాడు జరుపుకునే ఈ వెలుగుల పండుగ అంటే అందరికి ఇష్టం. అన్ని మతాల వారు జరుపుకునే గొప్ప పండుగా. ముఖ్యంగా ఈ దీపాల వెలుగులో అద్భతంగా కనిపించేలా ముస్తాబవ్వాలని మగువలు భావిస్తారు. అందుకోసం స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే సంప్రదాయబద్ధంగా హుందాగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి..దీపావళి అంటే దీపాల వెలుగులు, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు. పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేయడంలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయంగా స్టైలిష్ లుక్‌లో కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి..రిచ్ లుక్ చీర..దీపావళి వెలుగులు విరజిమ్మిలే కనిపించేందుకు రిచ్ లుక్ ఉన్న శారీని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. బంగారు పసుపు, ఎరుపు, నారింజ, ఊదా రంగులు పండుగ వాతావరణాన్ని తలిపించేలా చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న సీక్విన్ చీరలను ఎంచుకుంటే స్టైలిష్‌గా ఉంటారు. అనార్కలి గౌనుగ్రాండ్గా కనిపించేలా డ్రెస్ ధరించాలంటే మాత్రం అనార్కలీని ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పొడవాటి గౌన్లు మొత్తం రూపాన్ని కొత్తగా కనిపించేలా చేయడమే గాక వేడుకకే ఓ లుక్ వస్తుంది. .లెహంగాస్లెహంగాలు సాంప్రదాయ ఆధునిక సౌందర్యాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. క్లాసిక్ చోలిస్ నుండి ట్రెండీ క్రాప్ టాప్స్ వరకు విభిన్న బ్లౌజ్ స్టైల్స్‌తో జత చేస్తే ఆ లుక్కే వేరు. అందుకోసం క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్‌తో అలంకరించిన గ్రాండెడ్ కలర్ లెహంగాలు ఎంచుకోండిచీరకట్టు స్టైల్ డిజైర్వేర్..గ్రాండెడ్ చీరతో డిఫెరెంట్ లుక్‌లో కనిపించాలనుకుంటే..రెడీమేడ్ డ్రెస్డ్ స్కర్ట్‌లను ఎంచుకోండి. వాటిని అద్భుతమైన బ్లౌజ్‌లతో జత చేయండి. సల్వార్ సూట్పండుగలకు ఇష్టమైన, సల్వార్ సూట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి సరైన ఆభరణాలను జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో వివిధ రకాల సల్వార్లు దర్శనమిస్తున్నాయి. మంచి కలర్‌తో కూడిన సల్వార్ సూట్లు వేడుకలను మరింత కలర్‌ఫుల్ మయం చేస్తాయి.(చదవండి: ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!) -
Lakshmi Lehr: అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట!
అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలను క్రియేట్ చేసేవాళ్లను నేర్పరులు అంటారు. ఆ కేటగరీలో లక్ష్మీ లెహర్‌ను చేర్చొచ్చు. పర్ఫెక్షన్ కోసం ప్రపంచంలో ఉన్న ద బెస్ట్‌ని ఆర్డర్ చేయదు. కళ్ల ముందున్న వాటితోనే ప్రపంచానికి ద బెస్ట్‌ని చూపిస్తుంది. అందుకే ఆమె సెలబ్రిటీ స్టయిలిస్ట్ అయింది.లక్ష్మీ ముంబై నివాసి. ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పలు ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ స్టయిలింగ్ కంపెనీ ‘స్టయిల్ సెల్’లో చేరింది. ఆమె సృజనకు, పనితీరుకు అనాయితా ఇంప్రెస్ అయింది. ఆమె స్థాయి స్టార్ స్టయిలింగ్ అని గ్రహించింది. లక్ష్మీని సెలబ్రిటీ సర్కిల్‌కి పరిచయం చేసింది. ముందుగా.. కరీనా కపూర్ ఎయిర్ పోర్ట్ అపియరెన్స్కి స్టయిలింగ్ చేసింది లక్ష్మీ. ఆ కూల్ లుక్స్‌కి.. కరీనాను క్యాప్చర్ చేయడానికి ఫాలో అయిన పాపరాట్సీ ఫిదా అయిపోయారు.కరీనా ఫ్యాన్స్ అయితే క్రేజీ.. చెప్పక్కర్లేదు. ఆ స్టయిల్ని కరీనా కూడా కంఫర్ట్‌గా ఫీలై.. స్పెషల్ అకేషన్స్‌కి ఆమెను స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. లక్ష్మీ స్టయిలింగ్‌ని కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్, రశ్మికా మందన్నా, సమంత, పూజా హెగ్డేలూ కోరుకున్నారు.ఆ సెలబ్రిటీల క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్లు.. అంతెందుకు వాళ్లు గడపదాటాలంటే చాలు లక్ష్మీ వాళ్లను స్టయిలింగ్ చేయాల్సిందే! అంత డిమాండ్‌లో ఉంది ఆమె. సెలబ్రిటీ ఒంటి తీరు, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి స్టయిలింగ్ చేస్తుంది లక్ష్మీ. సింపుల్ చేంజెస్తోనే వైబ్రెంట్‌గా కనిపించేలా వాళ్లను మారుస్తుంది. ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఆమెకు ఫ్యాన్సే! వాళ్లలో రితిక్ రోషన్ ముందుంటాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్. ఆ ఇద్దరికీ లక్ష్మీ స్టయిలింగ్ చేస్తోంది.స్టయిల్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్! స్టయిలింగ్ కోసం ప్రపంచ బ్రాండ్స్ అన్నిటినీ వార్డ్‌రోబ్‌లో నింపక్కర్లేదు. ఉన్న రెండు జతలతో కూడా స్టయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మనకు ఏది నప్పుతుంది.. ఏది సౌకర్యంగా ఉంటుందనే స్పృహ ఉండాలి. అంతేకాదు మనమున్న చోటునూ దృష్టిలో పెట్టుకోవాలి. నలుగురిలో కలసిపోయినట్టు ఉంటూనే మన ప్రత్యేకతతో మెరిసిపోవాలి. అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట. నేను స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీల్లో నాకు.. కరీనా, జాక్వెలిన్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లు అంటే చాలా ఇష్టం! – లక్ష్మీ లెహర్ఇవి చదవండి: ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి! -
స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?
అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, స్టైల్‌కి ఐకాన్ అయిన నటాషా పూనావాల ఎప్పటికప్పుడూ సరికొత్త ఫ్యాషన్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె స్వతహాగానే ఫ్యాషన్‌గా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆమె ఎప్పటికప్పుడూ ట్రెండ్‌ని సెట్ చేసే సరికొత్త డిజైనర్ వర్ దుస్తులతో తుళ్లక్కుమంది. అలానే ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన సమ్మర్ గాలా 2024 కోసం క్రిస్టల్స్‌తో అలంకరించిన గౌనుని ధరించింది. ఈ గాలా ఈవెంట్లో నటాషా ధరించిన మార్టిన్ గ్లాస్ ఆకృతి పర్సు హైలెట్‌గా నిలిచింది. ఈ పర్సు వోడ్కా, జిన్, కాక్టెయిల్ వంటి జ్యూస్‌లనే సర్వ్ చేసే మార్టిన్ గ్లాస్ ఆకృతిలో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఈ పర్సు ఎక్కువగా ఆకర్షించింది. అంతేగాదు సోషల్ మీడియాలో సైతం అందుకు సంబంధించిన ఫోటోల్లో కనిపించిన ఈ పర్సే అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. ఇక్కడ నటాషా ముగ్ధమనోహరంగా ఉండేలా ట్రాన్స్పరేంట్ క్రిస్టల్ గౌనులో మెరిసిపోయింది. అందుకు తగ్గట్లు చేతికి ధరించిన పర్సు ఎవర్ గ్రీన్‌గా ఉంది. అంతేగాదు ఈ మార్టిన్ గాజు ఆకృతి పర్సుని క్రిస్టల్స్‌తో అలంకరించడంతో నటాషా దివి నుంచి భువి వచ్చిన దేవకన్యలా ధగ ధగ మెరిసిపోయింది. ఈ పర్సు ఓపెనింగ్ అద్దం మాదిరిగా ఉంటుంది. జుడిత్ లీబర్ బ్రాండ్‌కి చెందిన ఈ పర్సు ధర ఏకంగా రూ. 4.85 లక్షలు పైనే ఉంటుందట. నటాషా ఎప్పుడూ డిఫెరెంట్ ఫ్యాషన్ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ సారి ఆమె ధరించి గ్లాస్ ఆకృతి పర్సు అందరి మనసులను దోచుకుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను ఈ పర్సు ఎంతగానో ఆకట్టుకుంది. అంతా వాటే ఏ స్టైలిష్ పర్సు అని ప్రశంసిస్తున్నారు కూడా. ఎవరీ నటాషా?భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2023 నాటికి, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విలువ రూ. 1.92 లక్షల కోట్లుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేగాదు ఆమె సైరస్ పూనావల్ల గ్రూప్‌లోని వివిధ కంపెనీల కోసం సృజనాత్మకతతో కూడిన వ్యాపార వ్యూహాలతో లాభాల బాట పట్టించడంలో నటాషా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె తన అత్తగారి గౌరవార్థం 2012లో స్థాపించబడిన కుటుంబ ఫౌండేషన్ అయిన విల్లో పూనావల్లా ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే భారతదేశం కోసం బ్రిటీష్ ఆసియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. పైగా బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్‌కు ఇండియా అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యురాలు కూడా.(చదవండి: హీరోయిన్ కత్రినా అనుసరించే రెండుపూటల భోజనం, షట్పావళి డైట్ ప్లాన్ అంటే..?) -
ఈ హీరోయిన్‌కు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా? (ఫోటోలు)
-
ఫ్యాషన్ ఐకాన్ లేడీస్ : నీతా అంబానీ, ఇషా, శ్లోకా మెహతా (ఫోటోలు)
-
ఇండియన్ కుర్తీ వెస్ట్రన్ కట్స్ అదుర్స్ (ఫొటోలు)
-
Alia Al Rufai: తానొక.. అందమైన ఫ్యాషన్ లేడీ!
బాలీవుడ్లో అనుష్కా శర్మకు మంచి నటిగానే కాదు స్టయిల్ ఐకాన్‌గానూ పేరుంది. ఎయిర్ పోర్ట్ లుక్ నుంచి రెడ్‌కార్పెట్ వాక్ దాకా సందర్భానికనుగుణంగా ఆమె «ధరించే కాస్ట్యూమ్స్‌కి వీర ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాషనిస్టా వెనుక స్టయిలిస్ట్ అలియా అల్ రుఫై కృషి ఉంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..అలియా అల్ రుఫై.. వాళ్లమ్మ ఇండియన్. నాన్న అరబ్. అందుకే తనను తాను హాఫ్ ఇండియన్, హాఫ్ అరబ్‌గా అభివర్ణించుకుంటుంది అలియా. పన్నెండవ ఏట నుంచే ఆమెకు ఫ్యాషన్ మీద ఆసక్తి ఏర్పడింది. కారణం వాళ్లమ్మే. వింటేజ్ స్టయిల్‌కి కంటెంపరరీ టచ్నిచ్చి క్రియేట్ చేసుకునే ఆమె డ్రెస్‌లు, బ్లౌజెస్ అలియాను అమితంగా ఆకట్టుకునేవట. ఆ ఆకర్షణే తన చుట్టూన్న వాళ్ల డ్రెస్ సెన్స్‌ని, కల్చర్స్ని గమనించే గుణాన్ని పెంచిందట అలియాలో. ఆ తపనే ఆమెకు ఫ్యాషన్ మ్యాగజైన్స్నీ పరిచయం చేసింది. వాటి ప్రభావంతో తన డైలీ రొటీన్ డ్రెసెస్లోనే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేది.తన ఫ్రెండ్ సర్కిల్లో కాంప్లిమెంట్స్ అందుకునేది. ఒకసారి బాల్యంలోనే.. ఇతిహాద్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఒక బ్లాంకెట్‌ని ఇంటికి పట్టుకొచ్చేసిందిట దొంగతనంగా! తర్వాత దాన్ని స్కర్ట్‌గా మలచుకుందట. అలా ఆమెకు ఫ్యాషన్ మీదున్న శ్రద్ధ తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ముంబై యూనివర్సిటీలో ఏంబీఏ పూర్తి చేసింది. అయినా ఏదో వెలితి. తనకు జాబ్ శాటిస్ఫాక్షన్ దొరికేది ఫ్యాషన్ రంగంలోనే అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘హార్పర్స్ బజార్’లో జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా ఆఫర్ వస్తే.. రెండో ఆలోచన లేకుండా అందులో చేరింది.అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకోకుండా బాలీవుడ్ నుంచి కాల్ అందుకుంది.. ‘మధుర్ భండార్కర్ తీస్తున్న ‘ఫ్యాషన్’ సినిమాకి స్టయిలిస్ట్‌గా ఉన్న రీతా ధోడీకి అసిస్టెంట్ కావాలి. రాగలరా?’ అంటూ! ‘వై నాట్.. అఫ్కోర్స్’ అంటూ వెంటనే రీతా ధోడీ స్టయిల్ టీమ్‌లో మెంబర్ అయింది. ‘తొలి అవకాశమే కంగనా రనౌత్, ప్రియంకా చోప్రాలతో కలసి పనిచేయడం.. నా అదృష్టం! వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే ‘ఫ్యాషన్’ సినిమా ఫ్యాషన్ ప్రపంచం గురించి నాకెన్నో విషయాలను తెలియజెప్పింది. ఎన్నో మెలకువలనూ నేర్పింది’ అని చెబుతుంది అలియా.ఆ సినిమా ఆమె కెరీర్‌కి మైలు రాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ముందుకే సాగింది. పలు ఫ్యాషన్ షోలకు పనిచేసింది. ఎన్నో ఫ్యాషన్ మ్యాగజైన్స్‌కి ఆర్టికల్స్ రాసింది. అలా ఆమె నైపుణ్యం చూసిన అనుష్కా శర్మ .. అలియాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా నియమించుకుంది. ఆమె అనుష్కా దగ్గర చేరగానే అనుష్కా తీరుతెన్నులే మారిపోయాయి. ఏ డ్రెస్ అయినా అనుష్కా కోసమే డిజైన్ అయిందేమో అన్నంత ఆప్ట్‌గా.. ఏ యాక్ససరీకైనా ఆమె వల్లే అందం వస్తుందేమో అన్నంత గ్రేస్‌ఫుల్‌గా కనిపించసాగింది ఆ నటి.దీన్ని బాలీవుడే కాదు యూరప్ ఫ్యాషన్ ప్రపంచమూ గమనించింది. అలియాకు చాన్స్‌ల వరద కురిపించింది. సెలబ్స్ ఎవరైనా రెడ్‌కార్పెట్ మీద కాలు పెట్టాలంటే అలియా స్టయిలింగ్ చేయాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. అలా దీపికా పదుకోణ్, ఆలియా భట్, కియారా ఆడ్వాణీ, యామీ గౌతమ్, నర్గిస్ ఫక్రీ, శ్రద్ధా కపూర్ వంటి వాళ్లందరికీ అలియా పర్సనల్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది.ఫ్యాషన్‌లో మరింత స్కిల్ సంపాదించుకునేందుకు 2018లో మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ రంగంలో పట్టభద్రురాలైంది."అంకితభావం, హార్డ్‌వర్కే నన్నీ రోజు ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేర్చాయి. బ్యూటీ అంటే నా దృష్టిలో సింప్లిసిటీ! మీ స్కిన్‌తో మీరు ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే అంత అందంగా కనపడతారు. నా వింటేజ్ ఫ్యాషన్‌కి ఇన్స్పిరేషన్ మా అమ్మే అని చెబుతాను. సందర్భానికి తగ్గట్టు ఆమె రెడీ అయ్యే తీరే నాలో ఫ్యాషన్ సెన్స్‌ని పెంచింది. సీజన్స్ మారుతుంటాయి. ఫ్యాషన్ మాత్రం ఇవాల్వ్ అవుతూంటుంది. ఈ సత్యాన్ని గమనిస్తే స్టయిలిస్ట్లకు తిరుగులేదు.నేర్చుకోవడానికి బాలీవుడ్‌ని మించిన ఇండస్ట్రీ లేదు. మెంటర్ కన్నా రెండడుగులు ముందుండాలి ఎప్పుడూ! ఫలానా పని చేయండి అని మెంటర్ ఆర్డర్ వేయగానే ఆల్రెడీ డన్ అనే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. నా ఫిలాసఫీకి వస్తే.. ఈ క్షణంలో బతకడాన్ని మించిన ఆనందంలేదు అంటాను. అదే అందం. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెదుక్కుంటాను!" – అలియా అల్ రుఫైఇవి చదవండి: తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ! -
అందాల రాణివే... నీవెంత జాణవే యాంకర్ శ్రీముఖి ఫోటోలు
-
యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
-
ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె స్టయిలే వేరు; రూ. 50వేలనుంచి 35కోట్ల దాకా
పురుషులతో తామేమీ తక్కువ కాదంటూ చిన్నవయసులో మహిళా పారిశ్రామికవేత్తలుగా పలువురు యువతులు ముందుకు వస్తున్నారు. తమ అభిరుచికి తగ్గట్టు, ఆధునిక శైలిని అవగాహన చేసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో దుస్తుల బ్రాండ్‌తో కోట్లు సంపాదిస్తున్న పరి పూనమ్ చౌదరి ఒకరు. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం! ఫ్యాషన్ పరిశ్రమ ఎప్పుడూ డైనమిక్‌గా ఉండాలి. వినియోగదారుల ప్రాధాన్యతలే మార్కెట్‌కు ప్రాణం. యుక్తవయసులో ఉన్నప్పటినుంచి పరికి మహిళలను ఆకట్టుకునే ఫ్యాషన్, అందమైన దుస్తులను తయారు చేయడం అంటే ఇష్టం. 13 ఏళ్లకు సొంతంగా తనకుంటూ ఒక బ్రాండ్ఉండాలనే ఆలోచన మొదలైంది. ఆ పట్టుదలే 23 ఏళ్లకే దేశంలోనే అత్యంత ప్రియమైన దుస్తుల బ్రాండ్ బునాయ్కు నాంది పలికింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాణిస్తోంది. బునాయ్ ఏర్పాటు, సక్సెస్ సుమారు 5-6 సంవత్సరాలు ఇతర సంస్థలకు పనిచేసినఅనుభవంతో 2016లో పరి చౌదరి కేవలం ముగ్గురితో కలిసి బునాయ్ని లాంచ్ చేసింది. అప్పటినుంచి ఆ టీమ్ అలా పెరుగుతూ వందలాదిమందికి చేరింది. కేవలం 50 వేల పెట్టుబడితో కుర్తా సెట్లు, లెహంగాలు లాంటివాటితో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. రాజస్థానీ, జైపూర్, డిజైన్స్, చందేరి నుండి ఎంబ్రాయిడరీ దాకా వివిధ రకాల ఫ్యాబ్రిక్లను అందిస్తూ, బునాయ్ నైట్‌వేర్, ఇతర యాక్సెసరీస్, జ్యెయల్లరీని జోడించింది. హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్, హ్యాండ్-డైడ్, హ్యాండ్పెయింటెడ్, ఆకర్షణీయంగా అందమైన డిజైన్లు, సిగ్నేచర్ స్టైల్ కలర్స్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆదరణ పొందింది. ఆధునిక శైలి, సంప్రదాయకళను మిళితం చేస్తూ స్టైలిష్ ఫ్యాషన్ ప్రపంచంలో బునాయ్ను పరుగులు పెట్టిస్తోంది. అంతేనా క్లాసిక్ బట్టల నుండి హెయిర్, స్టైలిష్ హోమ్ డెకార్ దాకా మంచి నాణ్యత ,స్టైల్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘బునాయ్’ వినపడేలా చేసింది. 2021లో 12 కోట్టుగా ఉన్న బునాయ్ ఆదాయం కాస్త 2022లో 35 కోట్లకు పెరిగిందంటేనే ఈ బ్రాండ్‌కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇండోర్, జైపూర్‌లో రెండు స్టోర్లను కూడా ప్రారంభించారుబునాయ్ 800 విభిన్న ఉత్పత్తులతో దాదాపు 90K కస్టమర్ల బేస్‌తో రాణిస్తోంది. సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, శివలీకా ఒబెరాయ్, రిధి డోగ్రా, దివ్యాంక త్రిపాఠి లాంటి ప్రముఖులు బునాయ్ స్టైల్స్ ఫ్యాన్స్. అంతేకాదు అనేక బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ , బిజినెస్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది పరి చైదరి. స్థానిక కళాకారులచేత,రాజస్థానీ సంస్కృతి మూలాలతో ముడిపడి ఉన్న ప్రాంతాల ద్వారా ఉత్తమంగా తయారు చేస్తాం. అన్నీ ఉత్పత్తులు ప్రేమతో చేతితో తయారు చేసినవే. మెటీరియల్ నాణ్యతలో కూడా రాజీలేదు. ఫెయిర్‌ట్రేడ్, హెరిటేజ్, మేడ్ ఇన్ ఇండియా,సుస్థిరత ,మహిళా సాధికారత ఇవే తమ కంపెనీ బలం - పరి పూనం చౌదరి పరి చౌదరి విద్య పరి జైపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్లో తన పాఠశాల విద్యను, ఆ తరువాత, IIS విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఫ్యాషన్/అప్పరల్ డిజైన్ చ విజువల్ ఆర్ట్స్ & స్టిల్ ఫోటోగ్రఫీలో నైపుణ్యం సాధించింది. 2019లో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్‌కు వెళ్లింది. ఇక్కడే ఈమె వ్యాపార ఆలోచనలకు మరింత పదును ఏర్పడింది. లగ్జరీ బ్రాండ్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ , ఫ్యాషన్ కొనుగోలు మరియు అమ్మకాలపై దృష్టి సారించింది. బునాయ్ ప్రారంభించే ముందు దాదాపు 3 సంవత్సరాలు అర్బన్ విమెన్ కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో తన అనుభవం ఇతరులకు ఉపయోగపడాలని, ప్రతిభ , వాస్తవికత మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడాలని కోరుకుంటోంది. -
అల్లు అర్జున్ పుష్ప మూవీ.. ఆ స్టైల్ కాపీ కొట్టేశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్‌ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్‌కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్స్, వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అచ్చం అల్లు అర్జున్ లాగే ఆ వాకింగ్ స్టైల్‌ను టాలీవుడ్ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్ స్టైల్‌తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. pushpa walking style appatlone srihari gaaru 👌❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z — celluloidpanda (@celluloidpanda) March 25, 2024 -
Aditi Rao Hydari: స్టైల్ అండ్ లుక్స్‌తో చంపేస్తున్న హైదరాబాదీ బ్యూటీ ఫోటోలు
-
డాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్.. వీడియో వైరల్!
మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్ కావాలనివుంటుంది. అలాగే రచయిత కావాలని, క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్ కామెంట్ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్‌కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్ ‘సూపర్’అని రాశారు. अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH — Temjen Imna Along (@AlongImna) February 27, 2024 -
'అఖండ' హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
‘కంచె’ సినిమాతో తెలుగులో ఎంటరైన ప్రగ్యా జైస్వాల్‌కి ఇక్కడ అభిమానం గణం ఎక్కువే!. మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా ప్లాన్ బి ఉండాలి. అప్పుడే ఎక్కడైనా సంతోషంగా ఉండగలం అంటోని ప్రగ్యా. ఇక ఆమెకు అంతటి ఘనమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌కి కారణం తన గ్లామర్. ఆ గ్లామర్కొక స్టయిల్ని క్రియేట్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్‌దే. ఆ ఫ్యాషన్‌లో ఈ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. సావన్ గాంధీ.. ఢిల్లీకి చెందిన సావన్ గాంధీ కొంత కాలం పలు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పనిచేసి.. తర్వాత తన పేరు మీదే ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించాడు. అందమైన డిజైన్స్‌తో అనతికాలంలోనే సూపర్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.అల్లికలు, కుందన్ వర్క్స్‌లోనూ ఈ బ్రాండ్ ఫేమస్. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ధర లక్షల్లోనే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక ప్రగ్యా ధరించిన చీర ధర ఏకంగా రూ. 1,59,000/-. ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే ఇద్దరు స్నేహితులు.. సంప్రదాయ రాజాభరణాలు, గిరిజన ఆహార్యాన్ని ఆధునిక తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియంను ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి నమూనాలనే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఈనా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఈనా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్ లభించే ఈ పోల్టిస్, క్లచెస్, బకెట్ బ్యాగ్స్‌కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అందుకే, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తగని మోజు. ధర కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. ఇక్కడ ప్రగ్య ధరించి బ్యాగ్ ధర రూ. 9,800 (చదవండి: శృతి హాసన్ ధరించి బ్రౌన్‌కలర్ చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
ఫైనల్లీ.. తన క్రష్ ఎవరో బయటపెట్టిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్ మూవీతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్ఫిట్సే నా ఫ్యాషన్ స్టయిల్ అంటూ రివీల్ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. -
సరికొత్త ట్రెండ్ ఉంగారాల చెయిన్లు..!
వేళ్లకి ఉంగరాలు, మెడలో గొలుసులు ధరించడం సాధారణమే! చేతులకు ఉంగరాలు.. చెయిన్లు, హ్యాండ్ కఫ్స్ ధరించడం ఇప్పుడు ట్రెండ్. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సుల మీదకు ఈ ఉంగరాలు, చెయిన్ల వరసలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. యువత వేగానికి, స్టయిల్‌కి అద్దంలా భాసిల్లుతున్నాయి. బంగారు వరసలు లైట్ వెయిట్ జ్యువెలరీలో భాగంగా హ్యాండ్ కఫ్స్, చెయిన్స్ డిజైనర్లను ఆధునికత వైపుగా పరుగులు తీయిస్తున్నాయి. ఆభరణాల డిజైనర్లు బంగారు లోహంతో వెస్ట్రన్ స్టైల్ డిజైన్స్‌ను కొత్తగా మెరిపిస్తున్నారు. వెండి వెలుగులు తక్కువ ఖర్చు అనే జాబితాను ఈ తరం పక్కన పెట్టేస్తోంది. ఏ డిజైన్ తమకు మరింత అందాన్ని తీసుకువస్తుందో, నలుగురిలో గుర్తింపును సంపాదిస్తుందో దానినే ఇష్టపడుతోంది. అందుకే సిల్వర్ డిజైన్స్ మరింతగా యువత మదిని గెలుచుకుంటున్నాయి. స్టీల్ మెరుపులు స్ట్రీట్ అండ్ బోహో స్టైల్లో స్టీల్‌తో తయారైన ఆభరణాలను యువత ఎక్కువ ధరిస్తుంటుంది. క్యాజువల్ వేర్, పార్టీవేర్కీ నప్పే ఈ డిజైన్ వరసలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. (చదవండి: తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!) -
బుట్టబొమ్మ పూజా హెగ్డే ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ముంబై భామ పూజా హెగ్డే నటి, మోడల్ కూడా. ఆమె స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది కూడా. బుట్టబొమ్మలా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఫ్యాషన్ విషయానికి వస్తే..స్టయిల్ అనేది మనం సెట్ చేసుకొనేదే. ప్రత్యేకంగా ఒక ఫ్యాషన్‌నే ఇష్టపడను. ఎక్కువగా మిక్స్ అండ్ మ్యాచ్‌ను ట్రై చేస్తుంటా అని చెబుతోంది పూజా. స్టయిల్ అనేది మనం సెట్ చేసుకొనేదే. పింక్ సిటీ బై సారికా సారికా కాక్రానియాకు చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్ అంటే ప్యాషన్. అయితే చిన్న వయసులోనే పెళ్లి, వెంటనే ఇద్దరు పిల్లలు కలగడంతో పెళ్లయిన పదిహేడు సంవత్సరాల తర్వాత తన ప్యాషన్ కోసం పనిచేయడం మొదలుపెట్టింది. అలా 2014లో తన పేరు మీదే ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించి, అనతి కాలంలోనే స్టార్స్‌కు తన డిజైన్స్‌ను అందించే స్థాయికి ఎదిగింది. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ధర మాత్రం లక్షల్లోనే. ఆన్ లైన్ కొనుగోలు చేయొచ్చు. పూజాహెగ్డే ధరించిన పింక్ సిటీ బై సారికా చీర ధర రూ 49,850/- అన్మోల్.. 1986, ముంబైలో ఇషూ దత్వానీ ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘అన్మోల్.’ అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌లో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. నలభై ఏళ్లుగా వారి వ్యాపారం అదే జోరుతో సాగుతోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ నగరాల్లోనూ దీనికి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఈ అన్మోల్ జ్యూవెలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!) -
హ్యండ్ల్యూమ్స్తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్ స్టైల్స్!
యువ ఆలోచనల్లో పర్యావరణం కళగా రూపుదిద్దుకుంటోంది. ఫ్యాషన్ వేర్లో ప్రత్యేకతతో పాటు నేచర్ పట్ల బాధ్యతనూ తెలుసుకుంటుంది. మనవైన చేనేతలు పెద్దవాళ్లకే సూట్ అవుతాయన్న ఆలోచన నుంచి మోడర్న్ టర్న్ తీసుకుంటోంది. హ్యాండ్లూమ్స్‌తో ఇండోవెస్ట్రన్ స్టైల్స్ ఆకట్టుకునేలా డిజైన్ చేయిస్తోంది హైదరాబాద్ వాసి, నటి, మోడల్ నిత్యాశెట్టి. హ్యాండ్లూమ్స్‌తో తన జర్నీఎప్పుడూ ప్రత్యేకమే అని చెబుతోంది నిత్య. ప్రొఫెషనల్స్ కాదు...ఈ డ్రెస్సులు ధరించడానికి మోడల్స్ ఎవరూ ప్రొఫెషనల్స్ కాదు. సాఫ్ట్వేర్, వెయిట్రెస్, ఇంటీరియర్ డిజైనర్, డెంటిస్ట్.. ఇలా ఇతర రంగాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు నేను చేసే డ్రెస్సులకు మోడల్స్‌గా చేస్తున్నారు. ఏ రంగంలో ఉన్నవారైనా వీటి ద్వారా దుస్తులు మన క్యారెక్టర్ని చూపాలన్నదే మెయిన్. మేకప్ వంటి హంగులేవీ లేకుండా నేచరల్‌గా మా డిజైన్స్‌ని ప్రెజెంట్ చేయాలయనుకున్నాను. దీనివల్ల అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజున నిర్వహించిన ఫ్యాషన్ షోలో మా డిజైన్స్‌ని కూడా ప్రదర్శించి, మాదైన ప్రత్యేకతను చూపాం. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్ పెట్టి, మా వర్క్‌ని మరింత మందికి చేరువయ్యేలా చూస్తున్నాను. బ్రెజిల్లో జరగబోయే కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పది యూనిట్స్ వెళుతున్నాయి. అందులో మా ఇతిహాస కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్నారు నిత్య. ‘‘హ్యాండ్లూమ్స్ అంటే నేటితరం చీరలు, కుర్తా పైజామా వరకే అనుకుంటారు. కానీ, యువత ధరించేందుకు వీలుగా రెగ్యులర్ వేర్‌గా, ఫ్యాషన్ వేర్‌గా హ్యాండ్లూమ్స్ను తీసుకు రావాలనుకున్నాను. ఇందుకు.. పోచంపల్లి, పుట్టపాక, పెడన, ఒరిస్సా, భువనేశ్వర్ హ్యాండ్లూమ్స్ వారిని కలిశాను. వీటిలో నుంచి చందేరీ, ఇక్కత్, చికంకారి, శిబోరి, బాందినీ, టై అండ్ డై .. వంటివి డ్రెస్ డిజైన్స్‌లో ప్రధానంగా తీసుకున్నాను. హ్యాండ్లూమ్స్‌తో బ్లేజర్లు, ఖఫ్తాన్స్, ప్లాజో, లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్, షర్ట్స్.. నేటి యువతకు మెచ్చేలా మెన్ అండ్ ఉమెన్‌కి క్యాజువల్ అండ్ ఆఫీస్వేర్ ‘ఇతిహాస’ పేరుతో రూపొందిస్తున్నాం. ఈ ఇండో–వెస్ట్రన్ స్టైల్స్‌తో నేటితరానికి మన హ్యాండ్లూమ్స్ని దగ్గర చేయాలని, చేనేతకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నదే నా ఆలోచన. (చదవండి: విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!) -
మనుషులు ఇలా కూడా ఉంటారా? గ్యాస్ లైటర్ సాయంతో రింగురింగుల జుట్టు..
పార్లర్‌కు వెళ్లడం ఖర్చుతో కూడిన పని. అందుకే అమ్మాయిలు/మహిళలు కొన్నిసార్లు ఇంట్లోనే హెయిర్ స్టైలింగ్, ఫేషియల్, ఫేస్ మసాజ్ లాంటి అందాలను ఇనుమడింపజేసే ప్రక్రియలను చేసుకుంటుంటారు. అయితే తాజాగా ఒక భర్త తన భార్యకు రింగురింగుల జుట్టును తీర్చిదిద్దేందుకు ఒక విచిత్రమైన విధానాన్ని అనుసరించాడు. దీనిని చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో @Madan_Chikna హ్యాండిల్లో పోస్ట్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 6 వేలకు పైగా వ్యూస్, లెక్కకుమించిన లైక్స్ వచ్చాయి. పలువురు యూజర్స్ ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రమాదకరమని కొందరు అంటున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై ‘గ్యాస్ లైటర్’లోని మెటల్ భాగాన్ని వేడి చేయడం చూడవచ్చు. తరువాత ఆ వేడిచేసిన లైటర్ సాయంతో భార్య కురులను రోల్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్ని సెకెన్ల అనంతరం అతను ఆమె జుట్టును లైటర్ నుంచి వేరు చేసినప్పుడు, ఆ జుట్టు రింగురింగులుగా మారాడాన్ని గమనించవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఈ విధానం చాలా ప్రమాదకరమని, డబ్బు ఆదా చేయడమనే పేరుతో జుట్టుతో ఆడుకోవడం సరైదని కాదని సూచిస్తున్నారు. సరదాకి కూడా ఇలాంటివి చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని Showed this reel to my wife and she said yeh toh kuch bhi nahi hai and gave five similar examples how more precisely we used to do this 😲 pic.twitter.com/2h0PaZW4UA — Godman Chikna (@Madan_Chikna) September 15, 2023 -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు..!
అమెరికాలోని అలబామాలోని రివర్ ఫ్రంట్ పార్క్‌లో దారుణం జరిగింది. కొందరు యువకులు ఓ సెక్యూరిటీ గార్డ్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఓ బోటును పక్కకు జరపమని సెక్యూరిటీ గార్డ్ అడిగిన నేపథ్యంలో ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. Yo this is wild 😭 A group of white men attacked a black security guard after the security asked them to move their pontoon boat so the big Harriot can dock. They refused to & attacked the security guard. A group of black men seen & went defend him by beating the white men 💯🙌🏾 pic.twitter.com/Qzo3U3Kq1r — Shannonnn sharpes Burner (PARODY Account) (@shannonsharpeee) August 6, 2023 యువకులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. మొదట ఓ యువకుడు సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేశాడు. అనంతరం అతనికి మద్దతుగా వచ్చిన మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా ఆయనపై దాడి చేశారు. చొక్కాలు విప్పుకుని ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. డబ్ల్యడబ్ల్యూఈ స్థాయిలో కుర్చీలతో చొక్కాలు విప్పుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందులో మహిళలు కూడా పాలు పంచుకున్నారు. ఘర్షణలో కొందరిని నదిలో నెట్టేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
శంకర్ తనయ అతిధి ఫ్యాషన్ రేంజ్ మాములుగా ఉండదు!
అదితి శంకర్.. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయగానే పరిచయం చేయాల్సిన అవసరం లేని ఐడెండిటీ ఆమెది. నటనపై నాకున్న ఆసక్తిని నాన్నకు చెప్పినప్పుడు, ఆయన నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించు.. ఏడాదిలోపు అవకాశం వస్తే ఒకే.. లేదంటే ఇండస్ట్రీ పేరెత్తకూడదు అని చెప్పారు. ఆ కండిషన్‌కు ఎస్ చెప్పే ప్రయత్నించాను.. సాధించాను అంటోంది అదితి శంకర్. ఇక డాక్టర్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. ఆ ప్రత్యేకతతో మ్యాచ్ అవడానికి పోటీ పడుతోన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. రుబీనా రుబీనా అఫ్రోజ్.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి సొంతంగా తన పేరుమీద చెన్నైలో ‘రుబీనా వోగ్’ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా కొత్తతరం డిజైన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ బ్రాండ్ డిజైన్స్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. అదే దీని బ్రాండ్ వాల్యూ. వివాహాది శుభకార్యాలకు ముందుగా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకోవచ్చు కూడా. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలు ఉంది. అదితి ధరించిన రుబీనా వోగ్ చీర ధర రూ. 8,500 జేసీఎస్.. జ్యూయల్ క్రియేషన్స్.. పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన డిజైన్స్‌ను అందించే స్టోర్. 2013లో అరవింద్ కట్రేలా దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తోంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. సింపుల్ డిజైన్స్‌తో గ్రాండ్ లుక్‌నిచ్చే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. (చదవండి: ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది) -
యూరోపియన్ స్టైల్లో..సాగర తీరాన ఈట్ స్ట్రీట్స్..
చల్లనిగాలి..సముద్ర అందాలు.. ఇష్టమైన ఆహారం..లైఫ్ బిందాసే కదా..అటువంటి యూరోపియన్ ఫుడ్స్టైల్స్ ఇక విశాఖలో నోరూరించనున్నాయి. ఇష్టమైన వంటకాలను తినాలనే కోరిక ఉండే ఆహారప్రియుల కల త్వరలో నెరవేరనుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యూరోపియన్ స్టైయిల్లో ‘ఈట్ స్ట్రీట్స్’ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగర్‌నగర్ వద్ద ఒకటి, డిఫెన్స్ కాలనీ వద్ద మరొకటి ఏర్పాటుకు సిద్ధమయ్యింది. ఇందుకు అనుగుణంగా టెండర్లను కూడా ఆహా్వనించింది. ఈట్ స్ట్రీట్స్ పేరుతో అందమైన ఆర్చ్‌తో ఆహార ప్రియులను ఆహ్వానించనున్నాయి. మొత్తం రూ.6.24 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్.. వైజాగ్ వాసులకు కొత్త వంటకాల రుచులను పరిచయం చేయనున్నాయి. ఆధునిక పద్ధతిలో.. ఆధునిక పద్ధతిలో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు పెద్దగా ఉపయోగించని ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేశాం. యూరోపియన్ స్టైల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాం. వెరైటీ వంటకాలకు ఈట్ స్ట్రీట్స్ కేంద్రంగా మారనున్నాయి. నగరవాసులు ఆహ్లాదంగా సేద తీరేందుకు ఈట్ స్ట్రీట్స్ రానున్న రోజుల్లో దోహదం చేయనున్నాయి. – సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్ నగర వాసుల కోసం ప్రజలకు ఎప్పటికప్పుడు కొంగొత్తగా విశాఖ నగరాన్ని పరిచయం చేసేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ వ్యూ పాయింట్‌తో పాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మెరిడీయన్ అభివృద్ధి చేస్తున్నాం. కొత్త బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరింతగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఆహార ప్రియులకు కొంగొత్త వంటకాలతో పాటు ప్రశాంతమైన వాతావరణంతో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. అధునాతన పద్ధతిలో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్ నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. టెండర్లు పూర్తి అయిన తర్వాత 6 నెలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నాం. – గొలగాని హరి వెంకట హరికుమారి, జీవీఎంసీ మేయర్ రూ. రూ. 6.24 కోట్లతో.. వాస్తవానికి ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే, ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో పార్క్ హోటల్‌కు ఎదురుగా ఉన్న డిఫెన్స్ కాలనీ వద్ద, సాగర్‌నగర్‌లో ఒకటి ఏర్పాటు చేసేందుకు తాజాగా జీవీఎంసీ అడుగులు వేసింది. డిఫెన్స్ కాలనీ వద్ద రూ. 3.24 కోట్ల వ్యయంతో, సాగర్‌నగర్ వద్ద రూ.మూడు కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. యూరోపియన్ స్టైయిల్లో ఈ ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. 6 నెలల కాలంలో పూర్తి చేయాలని భావిస్తోంది. అన్ని వేళల్లో అందుబాటులో.. జీవీఎంసీ ఏర్పాటు చేయనున్న ఈట్స్ట్రీట్స్ను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. మనకు కావాల్సిన వివిధ రకాల వంటకాలు ఇక్కడ లభించడంతో పాటు అప్పటికప్పుడు మన కళ్ల ముందే తయారుచేయడాన్ని కూడా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది. అంతేకాకుండా విశాలమైన స్థలం...ప్రశాంతంగా వంటకాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకత. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో అందుబాటు ఉండనుంది. ఇష్టమైనవి తింటూ..కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసేలా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ తీర్చిదిద్దనుంది. ఈట్స్ట్రీట్స్ డిజైన్లను కూడా ఇప్పటికే జీవీఎంసీ తయారు చేసింది. మొత్తంగా విశాఖ వాసులకు త్వరలో వెరైటీ వంటకాల కోసం ఈట్ స్ట్రీట్స్ అందుబాటులోకి రానున్నాయి. (చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల చుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..) -
ఆధ్యాత్మిక శోభ
రుద్రాక్ష పేరు తలిస్తేనే మనసులో ఆధ్యాత్మిక సౌరభం నిండిపోతుంది. అందుకే, రుద్రాక్ష ఆభరణాలకూ శోభను చేకూర్చుతుంది. ప్రత్యేక పర్వదినాల్లో ధరించడానికి అనువుగా కొందరు బంగారు, వెండి మాలలుగా తయారు చేయించుకుంటారు. ఫ్యాషన్ ఆభరణాలలోనూ రుద్రాక్ష తనదైన వైవిధ్యాన్ని చూపుతుంది. నేడు వీటిని యువత కూడా తమదైన స్టైల్లో ధరించడానికి ఉత్సాహపడుతున్నారు. -
సెలక్షన్ స్టైల్
ఈ స్టైల్‌కి ప్రత్యేక ఎంపికలు అవసరం లేదు. మిక్స్ అండ్ మ్యాచ్‌కే మొదటిప్రా ధాన్యత.ఆభరణాల ఎంపికకు అసలు పో టీ అక్కర్లేదు.పూసలు, సిల్వర్, ఉడ్ జ్యువెల్రీ ఏదైనా సెలక్షన్ మహా ఈజీ. ఎవరికి వారు తమకంటూ ఓ స్పెషల్ లుక్‌ను క్రియేట్ చేసుకునే సౌలభ్యం ఈ స్టైల్ సొంతం. అందుకే, కాలాలతో పనిలేకుండా యూత్‌ని అమితంగా ఆకట్టుకుంటున్న మోడర్న్ బోహో–చిక్ స్టైల్ ఇది. యువతను అమితంగా ఆకట్టుకునే వాటిలో బోహేమియన్ స్టైల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇది ఫ్రెంచ్ నుంచి వచ్చిన శైలిగా చెబుతుంటారు. ఇది గిరిజన జీవన శైలి కి దగ్గరగా ఉండటం, మనసులను ఉల్లాసంగా ఉంచడంతోపా టు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంటుంది. గతంలో పా ప్, ర్యాప్ ఈవెంట్లలో బోహో–చిక్ ఫ్యాషన్ శైలి దుస్తులను ధరించేవారు. ఇప్పుడు మోడర్న్ స్టైల్‌ను అనుసరిస్తూ జీన్స్‌తో, పలాజోలతో ఇక్కత్ పైస్లీ బ్లౌజులు, బటన్ డౌన్ టాప్స్, ఖఫ్తా న్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటి మీదకు ట్రైబల్ జ్యువెలరీ లేదా ఫ్యాషన్ జ్యువెలరీ మరింత ఆధునిక హంగులతో మది దోచుకుంటున్నాయి. -
లైగర్ ప్లాప్ తో రౌడీలో మార్పు మొదలైందా..?
-
స్మగ్లింగ్‌లో ‘పుష్ప’ను మించిపోయాడు..
ఉక్కునగరం(విశాఖపట్నం): స్టీల్‌ప్లాంట్‌లో పుష్ప సినిమా తరహా దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీఐఎస్ఎఫ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి.. స్టీల్‌ప్లాంట్ స్ట్రక్చరల్ మిల్లో 56 మిల్లీమీటర్ వ్యాసం కలిగిన రౌండ్ బార్లు తయారు చేస్తుంటారు. అలా తయారైన వాటిలో పగుళ్లు, సరైన సైజు లేని వాటిని స్క్రాప్ కింద పక్కన పెడతారు. వాటిని ఎస్ఎస్డీ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ ద్వారా స్టీల్ మెల్ట్షాప్కు తరలించి రీ మెల్టింగ్ చేస్తారు. చదవండి: అదే బావి.. నాడు భర్త, నేడు భార్య గురువారం ఉదయం షిఫ్ట్‌లో సుమారు 6.30 ప్రాంతంలో ఒక మినీ వ్యాను మెయిన్ గేటు అవుట్ గేటు ద్వారా బయటకు వెళ్లడానికి వచ్చింది. అక్కడ తనిఖీ చేస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా వెనుక భాగం అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా షీట్ల కింద సుమారు 40 రౌండ్ బార్ ముక్కలు బయటపడ్డాయి. అవాక్కైన సిబ్బంది వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే గుట్టుగా ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన వాహనం నంబర్‌ను చూస్తే అది కూడా ఒరిజినల్ కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ముఠా బయటపడితేనే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడిని, చోరీ సొత్తును స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. -
ముంబైలో ఘనంగా స్టైల్ ఐకాన్స్ అవార్డుల ప్రధానోత్సవం (ఫొటోలు)
-
చెవికి ముక్కెర
‘ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా..’ అని పాడుకునే రోజులు కావివి. చెవినింటిలో కొత్తగా చేరిన ఆభరణం గురించి మాట్లాడుకోవాలి అంతా. కొత్త ఎప్పుడూ వింతే కాబట్టి ఈ వింత గురించి కొంత మాట్లాడుకుందాం. చెవికి జూకాలు, దుద్దుల నుంచి సెకండ్ స్టడ్ రింగ్స్ కూడా పెట్టేసుకొని ముచ్చటపడిపోయాం ఇన్నాళ్లూ. ఇప్పుడా ముచ్చట మరి కాస్త లోపలికి అదేనండి చెవిలోపలికి దూరింది. గిరిజనుల స్టైల్ ఇప్పుడు అమ్మాయిలకు బాగా నచ్చుతున్నట్టుగా ఉంది. అందుకే చెవి లోపలివైపుగా ఉండే డెయిత్కు ముక్కెరలాంటి రింగ్ ను పెట్టుకుంటున్నారు. ఇవి ప్రెస్ చేసేవి, పూర్తిగా సెట్ చేసేవి వచ్చాయి. చెవికి చుట్టూత స్టడ్స్‌తో నింపే స్టైల్ నుంచి చెవికి మధ్య గోడలా ఉండే అమరికకు అందమైన రింగు తొడిగి అబ్బురపరుస్తున్నారు. ఈ స్టైల్‌నీ మీరూ ట్రై చేయచ్చు. -
కుచ్చు కుచ్చు హోతా హై!
కుచ్చులమ్మ కుచ్చులు మా ఊరు వచ్చాయి కుచ్చులు పెళ్ళి వారందరికీ నచ్చునండీ నచ్చును.వచ్చునండి వచ్చును అమ్మాయిలందరికీ కళ వచ్చును.నీజమే మరి, ఇది కుచ్చుల సీజన్‌కుచ్చు కుచ్చు హోతాహై! పెళ్ళి అంటేనే అందమంతా ఒక చోట రాసులుగా పోసిన కళతో ఉట్టిపడుతుంటుంది. అలాంటి చోట అమ్మాయిలంతా బుట్ట బొమ్మల్లా, యువరాణుల్లా మెరిసిపోతూ ఉంటారు. ‘ఎప్పుడూ వేసినట్టే పట్టు లంగా ఓణీ, చీరకట్టు అంతేనా, ఇంకేమీ స్పెషల్ లేదా..’ అనుకునే అమ్మాయిలు ఈ కొత్త రఫెల్ స్టైల్‌తో మెరిసిపోవచ్చు. లెహంగా, చోళీ కాన్సెప్ట్ పాతదే అయినా దీనికే కుచ్చులున్న దుపట్టాను జత చేసి చూడండి. మేని కళలో వచ్చిన తేడా మీకే తెలిసిపోతుంది. ►డిజైనర్ ష్రగ్ స్టైల్ చోలీ లెహెంగాకు జతగా కుచ్చుల నెటెడ్ దుపట్టా తోడైతే వేదిక ఏదైనా గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. ►షిమ్మర్ చోలీ, లెహెంగా డ్రెస్ ఏ వేడుకనైనా కాంతిమంతం చేస్తుంది. దానికి నెటెడ్ కుచ్చుల దుపట్టా జత చేర్చితే వేడుక కళ వెయ్యింతలు అవుతుంది. ►ప్లెయిన్ కలర్ లెహంగాని మరింత అందంగా చూపించేలా రఫెల్ దుపట్టా తోడైతే వేడుకలో బటర్ఫ్లైలా వెలిగిపోవచ్చు. ►రాసిల్క్ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది. ►రాసిల్క్ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది. ►దండలా కుచ్చిన దుపట్టా, దానికి జత చేసిన లేస్, కుచ్చుల లెహెంగా డ్రెస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ►లెహెంగా చోలీ దుపట్టా.. ఒకే రంగులో ఉన్నా కుచ్చులు జత చేరితే వచ్చే కళే వేరు. పెళ్లింట అది రెట్టింపు వెలుగై వేడుకలో కనువిందు చేస్తుంది. -
దుకుట్టీలు
దుపట్టా జారదు... చేతికి అడ్డం రాదుమోయాల్సిన అవసరం ఉండదుజాగ్రత్త చేసుకోవాల్సిన కష్టం ఉండదుఈ దుపట్టాలు కుట్టిన దుపట్టాలు. దుకుట్టీలు. ►బ్రౌన్ కలర్ సిల్క్ లెహెంగాకు స్టోన్, కట్‌దానా, జర్దోసీ వర్క్ చేసిన గ్రీన్ కలర్ బ్లౌజ్. ఆభరణాల అవసరం లేకుండా బ్లౌజ్ ప్యాటర్న్‌కు నెక్ దగ్గర జత చేసిన దుపట్టా స్టైల్ క్లచ్.ఎంబ్రాయిడరీ చేసిన లేత పచ్చ రంగు సిల్క్ గౌన్, దానికి జత చేసిన జరీ అంచులు గల ముదురు పసుపు దుపట్టా ప్రత్యేక ఆకర్షణ. ►లెహంగా, చోలీ, దుపట్టా ఒకే రంగులో ఉన్న ఇండో వెస్ట్రన్ స్టైల్ లుక్. చోలీకి మెడ భాగంలో జత చేసిన దుపట్టా ఈ డ్రెస్‌కి ప్రధాన ఆకర్షణ. ►లంగా ఓణీ స్టైల్లో డిజైన్ చేసిన వెస్ట్రన్ గౌన్ ఇది. అంటే టూ ఇన్ వన్ ౖస్టైల్ అన్నమాట. దీనికి ఎడమ భుజం మీదుగా దుపట్టా స్టైల్ వచ్చేలా డిజైన్ చేశారు. దీంతో ఇది పూర్తిగా ఇండోవెస్ట్రన్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ►లెహెంగా–ఛోలీని కలుపుతూ డిజైన్ చేసిన అందమైన దుపట్టా. సంప్రదాయ వేడుకల్లో ఈ స్టైల్ హైలైట్‌గా నిలుస్తుంది. ►వెస్ట్రన్ గౌన్‌కి నెటెడ్ దుపట్టా రెండు భుజాలమీదుగా తీసి, నడుము దగ్గర జత చేయడంతో లుక్‌లో భిన్నమైన మార్పు కనిస్తోంది. ►ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్ డిజైనర్ గౌన్‌కి దుపట్టాని భుజం మీదుగా సన్నగా తీసి, కింది భాగం ఫ్లెయిర్ ఎక్కువ ఉండేలా జత చేశారు. ►డిజైనర్ లంగాఓణీలలో ఎన్నో మార్పులు వచ్చాయి. లెహంగాకు నడుము దగ్గర ఓణీని జత చేసి ఓ భిన్నమైన లుక్‌ని తీసుకువచ్చారు. ►జార్జెట్ గౌన్‌కి సింపుల్ ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాను మెడకు హారంలా ఉండేలా జత చేశారు. ►ఇది లెహంగా కుర్తీ స్టైల్. దీనికి దుపట్టా మోడల్ లుక్ వచ్చేలా పవిట, కొంగు భాగాలను హైలైట్ చేస్తూఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు. -
ఈశారీ పార్టీకే!
ఇప్పటివరకు వెస్ట్రన్ పార్టీలకు ..ప్యాంట్లేశాం .. చొక్కాలేశాంటైట్స్ వేశాం.. లూజ్ వేశాంషార్ట్ వేశాం.. లాంగ్ వేశాంరైట్ వేశాం.. రాంగ్ వేశాంకానీ, కొత్త సంవత్సరం కొత్తగా ఏం వెయ్యాలి?!ఈసారి పార్టీకి సంప్రదాయాన్నే కొత్తగా కట్టాలి.హ్యాపీ న్యూ శారీ. ►మిడ్స్లీవ్స్ బ్లౌజ్‌తో శారీ గౌన్ ధరిస్తే పార్టీకి వెస్ట్రన్ లుక్ వచ్చేసినట్టే. ఈ స్టైల్ ఎప్పుడూ పార్టీలో ఎవర్గ్రీన్ కాంబినేషన్. ఇతరత్రా ఆభరణాలు అవసరం లేకుండా కంఫర్ట్ లుక్‌తో పార్టీని ఎంజాయ్ చేయచ్చు. ►లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్, ధోతీ కట్టు శారీ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉన్న స్టైల్. ఇది వెస్ట్రన్ పార్టీలలో బాగా ఆకట్టుకునే స్టైల్ అయ్యింది. ఆధునికత– సంప్రదాయం మేళవించిన ఈ లుక్ నవతరం అమ్మాయిలకు అమితంగా ఆకట్టుకుంటుంది. ►జార్జెట్, షిపాన్, డిజైనర్ సిల్క్ చీరల లుక్ పూర్తి ఆధునికంగా మారిపోవడానికి ఇదో సింపుల్ టెక్నిక్. స్కర్ట్ మీద ధరించే డౌన్ షోల్డర్ టాప్‌ని ఈ శారీకి బ్లౌజ్‌గా వేసుకుంటే చాలు. వేరే ఆభరణాలూ అవసరం లేదు. ►ప్లెయిన్ చీరల కాంబినేషన్ వెస్ట్రన్ పార్టీలకే నప్పుతాయి. వీటికి డిజైనర్ టాప్స్‌ని బ్లౌజ్‌గా ఎంచుకుంటే మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకుంటాయి. ఈ కాంబినేషన్ శారీ గౌన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్టైల్ కట్‌తో కంఫర్ట్‌గా పార్టీలో వెలిగిపోవచ్చు. ►పెద్ద పెద్ద చారలు, ప్రింట్లు, బంగారు రంగు అంచులు ఉన్న చీరలు అయినా సరే ఒక లూజ్ లేదా బెల్ స్లీవ్స్ టాప్‌తో లుక్‌ని ఆధునికంగా మార్చేయవచ్చు. స్కర్ట్స్, ప్యాంట్స్ మీదకు వేసుకునే ఇలాంటి టాప్స్‌ని చీరల మీదకూ ధరించవచ్చు. నెక్ బోసిగా ఉందనుకుంటే బంగారం కాకుండా సిల్వర్ జువెల్రీని వేసుకోవాలి. -
నెమలీ పద.. పద...
నెమలికి తెలియని నడకలివినెమలి పింఛాన్ని మించిన హంగులివి చీరకట్టులో వచ్చిన సరికొత్త స్టైల్.ఓణీ కట్టులోబాణీ మార్పు.ఇక, నెమలీ పద పద! చీరకట్టుకు ఓ అందం ఉంటుంది. ఆ ‘కట్టు’లో ఎన్నో విధానాలు. వాటిలో ఇప్పుడు వెనుకవైపు కుచ్చుళ్లు కొత్తగా సందడి చేస్తున్నాయి. ఆ స్టైల్ నెమలి పింఛాన్ని తలపిస్తోంది. క్రీమ్ కలర్ లెహంగా, బ్లౌజ్.. దీని మీదకు ఎరుపు లేదా గులాబీ రంగు చీరను చుట్టేసి, నడుము వెనుక కుచ్చులను పెట్టి, పూసల బెల్ట్‌ని ధరిస్తే.. వేడుకలో హైలైట్! బామ్మల కాలం నాటి చీరలనూ ఈ స్టైల్‌కి వాడుతున్నారు. -
పువ్వుల వాన
పువ్వుల కాలం వసంతంపువ్వుల ప్రింట్ల కాలం వానకాలమే!అమ్మాయిల వ్యక్తిత్వాన్ని వికసించేలాంటి బోల్డ్ ప్రింట్స్‌తో ఇదిగో పూలవాన. ఇప్పుడంతా రెట్రో అదేనండి పాత తరం స్టైల్ తెగ హుషారెత్తిస్తుంది. ఫ్యాషన్ వేదికల మీదా, వివాహవేడుకలోనూ, సాయంకాలం పార్టీలోనూ అంతటా తానై చూపులను దోచేస్తుంది. ఇది మోడ్రన్ డ్రెస్సుల విషయంలోనే కాదు చీరకట్టులోనూ రెట్రో తెగ ఆకట్టుకుంటోంది.’’’ముఖ్యంగా పువ్వుల ప్రింట్లు వాటిని బంధిస్తున్నట్టుగా పెద్ద పెద్ద అంచుల బార్డర్లతో ఈ వింటేజ్ స్టైల్ చూపు తిప్పుకోనివ్వడం లేదు.’’’పువ్వుల డిజైన్లు, పెద్ద అంచులకు కాంట్రాస్ట్ బ్లౌజ్ జత చేయడమూ ఫ్యాషనే! కాస్త పాతతరం ‘కళ’, ఇంకాస్త ఆధునికపు అలలు చేరి మరింత శోభాయమానంగా కనువిందుచేస్తున్నాయి. ’’’ అలంకరణలోనూ పాత కళను తీసుకురావడం ఇప్పుడు ఆధునిక వనితల అసలు సిసలైన స్టైల్‌గా మారింది. జూకా జాకెట్ జూకాలు చెవులకు పెట్టుకుంటారు. అవి పెద్ద పెద్ద బుట్టలు కావచ్చు, వేలాడే హ్యాంగింగ్స్అవ్వచ్చు. అవే జూకాలు జాకెట్ మీద ఇంపుగా నిలబడితే అది కాస్తా జూకా స్టైల్ అవుతోంది. జూకానే తగిలిస్తే జాకెట్ వెనకాల ముడివేసే హ్యాంగింగ్స్ ప్లేస్‌లో ముచ్చటైన డిజైనర్ జూకాను తగిలిస్తే ఎంత అందంగా ఉంటుందో.. మీ వెనుక అతుక్కుపోయే చూపులు ఇట్టే చెప్పేస్తాయి. మగ్గం వర్క్ జూకా అచ్చు చెవి జూకాను పోలి ఉండే డిజైన్ జాకెట్ మీద జరీ తీగలతో మగ్గం మీద నేసి, కుందన్స్, ముత్యాలు పొందిగ్గా అమర్చితే ఎంతందమో చెప్పగలమా! ప్యాచ్ వర్క్ జూకా ఎక్కువ ఖర్చు లేకుండా జూకాను పోలి ఉండే డిజైనర్ ప్యాచ్‌ని జాకెట్ మీద గ్లూతో అతికించవచ్చు. లేదంటే సూది, దారంతో కుట్టేయవచ్చు. కర్టెసి: భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్ -
ఆజ్ కా లిబాజ్
‘లిబాస్’ అంటే దుస్తులు.అందాన్ని రూపాన్ని ఇచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.రంగులతో అల్లికలతో మెరుపును తెచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపించడానికి కూర్చిన నేటి దుస్తులు ఇవి. కట్‌లోనూ, కుట్టులోనూ ట్రెండ్‌లో ఉన్న దుస్తులు ఇవి.నేటి దుస్తులు. స్త్రీలు మెచ్చే దుస్తులు. ఆజ్ కా లిబాస్. షల్వార్ కమీజ్, అనార్కలీ సూట్స్, పటియాలా కుర్తీస్ ఇన్నాళ్లూ డ్రెస్‌లలో మహరాణుల్లా వెలిగిపోయాయి. ఇప్పుడు వీటి హవా తగ్గి షరారస్, లెహంగాస్, షార్ట్ లెంగ్త్‌లో ఉండే విభిన్నమైన ఫ్రాక్స్, కుర్తీస్ ట్రెండ్‌లోకి వచ్చాయి. వీటికి బెల్‌బాటమ్ ట్రౌజర్స్, కప్రీస్, టులిప్ షల్వార్స్ జత కట్టాయి. అమ్మాయిలు ముఖ్యంగా టీనేజర్స్ వెస్ట్రన్ స్టైల్లో ఉండే షార్ట్ కుర్తీస్, ఫ్రాక్స్.. జీన్స్, ప్యాంట్స్, స్కిన్సీ టైట్స్ మీదకు విరివిగా వాడుతున్నారు. ఇవన్నీ హాటెస్ట్ ట్రెండ్. వెస్ట్రన్ పార్టీలతో పాటు సంప్రదాయ వేడుకల్లో ప్రత్యేకత కలిగించనున్నాయి. వీటిలో మీ ఎంపిక ఏదైనా బెస్ట్ డ్రెస్డ్గా నిలిచిపోతుంది. అయితే, శరీరాకృతిని బట్టి డ్రెస్ ఎంపిక ఎప్పుడూ చక్కగా నప్పుతుంది. షరారా కమీజ్: ఇది 2000 సంవత్సరంలో మంచి కాంబినేషన్‌గా హిట్ అయిన డ్రెస్. ఈ స్టైల్ ఇప్పుడు మళ్లీ వచ్చింది. చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఈ స్టైల్లో కనువిందు చేస్తున్నారు. షరారా బాటమ్ ఎక్కువ కుచ్చులతో ఆకట్టుకుంటుంది. దీని మీదకు స్కర్ట్ లేదా కమీజ్ చక్కగా నప్పుతుంది. ఘరారా మనవాళ్ల కామన్‌గా పిలిచే పేరు. దీనినే షరారా అంటున్నారు. మోకాళ్ల దగ్గర నుంచి బాటమ్ కుచ్చులతో వెడల్పుగా ఉంటుంది. వీటినే వైడ్ లెగ్గ్డ్ ప్యాంట్స్ అని కూడా అంటారు. మందపాటి బ్యాండ్ లేడా లేస్ లేదా గోటా పట్టీతో పై భాగాన్ని, కింది భాగాన్ని విడిగా చూపడానికి వాడతారు. దీంతో ఈ బాటమ్ రెండు భాగాలుగా ఉంటుంది. మీ శరీరాకృతిని బట్టి దీనిని ధరించాలి. ఎందుకంటే ఎత్తు తక్కువ ఉండి, బక్కపలచగా ఉండే శరీరాకృతి గల వారికి ఈ స్టైల్ బాగుంటంది. దీనిని మీదకు క్రాప్ టాప్ వేసుకొని దుపట్టా జత చేస్తే సంప్రదాయ డ్రెస్ అవుతుంది. ఈ షరారా మీదకు కుర్తీ లేదా కమీజ్ కూడా బాగుంటుంది. దీని మీదకు పొడవాటి కుర్తా ధరిస్తే మీ ఆకృతి కూడా పొడవుగా కనిపిస్తుంది. సిగరెట్ ప్యాంట్ విత్ కమీజ్:రెండేళ్ల క్రితం కమీజ్ విత్ ప్యాంట్స్ సూపర్ స్టైల్లో ఉండేవి. కమీజ్కే కాస్త ఆకట్టుకునే బాటమ్స్ జత చేసి స్టైల్‌ని బెటర్ చేశారు. ఫిటింగ్ కోసం సిగరెట్ప్యాంట్స్ సరైన ఫిటింగ్ కోసం ధరిస్తున్నారు. సిగరెట్ ప్యాంట్స్ మీద ఎంబ్రాయిడరీ చక్కగా కనిపిస్తుంది. టులిప్ స్టైల్ ప్యాంట్స్:గ్లామరస్ని పెంచుతూ వెలుగులోకి వచ్చాయి. ఇది షల్వార్ని రీప్లేస్ చేసిందని చెప్వచ్చు. ఈ ప్యాంట్స్ మీదకు ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రాక్స్, కమీజ్‌లు మరింత అందాన్ని పెంచుతాయి. ఎంబ్రాయిడరీ వెర్సస్ లేత రంగులు: ఎలాంటి ఎంబ్రాయిడరీ లేకుండా ఉండే కమీజ్ను ఎంపిక చేసుకొని దానికి బాటమ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన షరారా ధరిస్తే చాలు మీ లుక్‌లో గొప్ప మార్పు కనిపిస్తుంది. ∙కమీజ్ లేదా ఫ్రాక్ డిజైన్స్‌లో నెక్ బోట్ లేదా బార్టట్ నెక్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ∙ఎంబ్రాయిడరీ చేసిన గ్రాండ్ లెహంగాలు, కుర్తీలు ఇప్పుడూ ట్రెండ్‌లో ఉన్నాయి. మీ అభిరుచి మేరకు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఆభరణాల వంటి ఇతర అలంకరణలు డ్రెస్‌కు తగ్గట్టు ఎంచుకుంటే చాలు ఈ ఔట్ఫిట్స్ మీ పూర్తి ఆహార్యాన్ని మార్చివేస్తాయి. ఆభరణాలు: ∙ఈ తరహా డ్రెస్సుల మీదకు టస్సెల్ ఇయర్ రింగ్స్ బాగా నప్పుతాయి. ∙బ్యాంగిల్ సెట్స్‌లో ఏదైనా ఒకటి పెద్దది డిజైనర్ బ్యాంగిల్ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ∙లేత రంగులు ముఖ్యంగా స్కిన్ కలర్స్, పీచ్ లేదా ఆకుపచ్చ కాంబినేషన్స్ పండగ కళను రెట్టింపు చేస్తాయి. ∙గోల్ టిక్కా మెహెందీ డిజైన్లు పండగ సంబరాన్ని మరింత కళగా మార్చుతాయి. – ఎన్.ఆర్ – అయేషా అజహర్, ఫ్యాషన్ డిజైనర్ లఖోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
సైడ్ ఇవ్వండి
అమ్మాయిలు స్టైల్లో చింపేస్తున్నారు.ఎడాపెడా కొత్త డిజైన్లు లాంగించేస్తున్నారు.కుడి ఎడమ తేడా చూపిస్తున్నారు.ఒకప్పుడు పైటలేనండి కుడి పక్క, ఎడమ పక్క.ఇప్పుడు టాప్‌లు కూడా కుడి ఎడమలు అయ్యాయి. కొత్త స్టైల్ వచ్చేసింది కొంచెం సైడ్ ఇవ్వండి. శారీ విత్ ఒన్‌సైడ్ టాప్ చీర కట్టడం లేదంటే లంగా ఓణీనిధరించడం.. ఏముంది కొత్తదనంఅంటారా! బ్లౌజ్ బదులు ఇలా ఒన్‌సైడ్ లాంగ్ కుర్తా లేదా టాప్ వేసుకోండి. లుక్‌లో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. కుర్తీ విత్ ఒన్‌సైడ్ ఏ సీజన్‌కైనా అతివలకు సౌకర్యంగా ఉండే డ్రెస్ కుర్తీ. అందుకే దీంట్లో చెప్పలేనన్ని స్టైల్స్ వచ్చాయి. అవి ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఉంటాయి. అలాగే, దీంట్లోనూ ఒన్‌సైడ్ సింగిల్ కలర్ డిజైనర్ కుర్తీలు వచ్చాయి. అదీ ఒకవైపు మాత్రమే పొడవుగా ఉండే డిజైన్ కుర్తీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. రెండు రంగుల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసే ఈ కుర్తీలలోనూ చాలా వెరైటీలు ఉన్నాయి. లెహెంగావిత్ ఒన్ సైడ్ టాప్ బ్రైట్ కలర్లో డిజైన్ చేసిన లాంగ్ లెహెంగా మీదకు లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ లేదా క్రాప్‌టాప్ సరైన ఎంపిక. అయితే, అదే క్లాత్‌తో ఒక సైడ్లాంగ్ ప్యాటర్న్‌ని జత చేసి, దానికి కొంత ఎంబ్రాయిడరీని కూర్చితే సంప్రదాయ, పాశ్చాత్య రెండు వేడుకులలో స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు. లాంగ్ గౌన్ విత్ ఒన్ సైడ్ టాప్ ప్లెయిన్‌గా ఉండే వెస్ట్రన్వేర్కి మరిన్ని హంగులు అద్దాలంటే సింపుల్ టెక్నిక్ ఉంది. అదే ఒన్‌సైడ్ లాంగ్జాకెట్. ఫ్లోరల్ డిజైన్‌తో ఉండే ఒన్‌సైడ్ లాంగ్ జాకెట్ లేదా టాప్ వెస్ట్రన్ గౌన్ రూపురేఖలే మార్చేస్తుంది. ట్రౌజర్ విత్ ఒన్ సైడ్ టాప్ ట్రౌజర్, క్రాప్టాప్నిబెనారస్ క్లాత్‌తో డిజైన్ చేయాలి. టాప్ పార్ట్‌కి అదే రంగు జార్జెట్ మెటీరియల్‌తో ఒక వైపు మాత్రమే ఇలా కుచ్చులు పెట్టి జత చేస్తే స్టైలిష్ పార్టీవేర్డ్రెస్ రెడీ. డిజైనర్ నెక్ పీస్ సంప్రదాయ దుస్తుల మీదకు బంగారు, ఇమిటేషన్ ఆభరణాలు అందంగా ఉంటాయి. కానీ, ఇండో వెస్ట్రన్ స్టైల్ దుస్తుల మీదకు అట్రాక్టివ్ లుక్‌నిచ్చే ఫ్యాన్సీ ఆభరణాలే ఉండాలి. దాన్ని చాలా సులువుగా మనకు మనంగానే రూపొందించుకోవచ్చు. కావల్సినవి: ∙గులాబీ రంగు నూలు దారం – మీటరు ∙బంతిపువ్వు రంగు నూలు లేస్ విత్ ఉండలు ఉన్నది – మీటరు ∙చైన్ – 1 ∙క్లాంప్స్ – కొన్ని ∙పట్టు కార 1 క్లాంప్స్ని పట్టుకారతో తెరిచి బంతిపువ్వు రంగు నూలు లేసుకు జత చేయాలి. 2 క్లాంప్స్ లేసును పట్టి ఉంచుతాయి. అలాగే చైన్‌ని కూడా జత చేస్తూ పట్టుకారతో క్లాంప్స్ని గట్టిగా నొక్కాలి. 3 చిత్రంలో చూపిన విధంగా నూలు లేస్, క్లాంప్స్, చైన్‌ను మొత్తం జత చేయాలి. 4 క్లాంప్స్ మధ్య నుంచి గులాబీ రంగు దారాన్ని తీయాలి. 5 సరిగా పట్టని చోట క్లాంప్ని మళ్ళీ తెరిచి, సరిచేయాలి. 6 బంతిపువ్వు రంగు నూలు లేసు, క్లాంప్స్, చైన్, గులాబీరంగు నూలు దారం సెట్ చేసి, చివర్లు ముడివేయాలి. చిత్రంలో చూపిన విధంగా ఫ్యాన్సీ నెక్ పీస్ రెడీ. ఆభరణాలు లెస్ ఆభరణాలు అక్కర్లేని సింగారాన్ని ఈ స్టైల్‌తో రప్పించవచ్చు. దుస్తుల ద్వారా చూపించే కొత్తదనానికి ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. దానికి అదనపు హంగులుగా చేతికి గాజులు, మెడలో హారాలు అక్కర్లేదు. చెవులకు జూకాలు, సింపుల్ మేకప్‌తో పార్టీలో అదరగొట్టేయచ్చు. మీరూ ఇలా ట్రై చేయవచ్చు. నిర్వహణ ఎన్.ఆర్. -
ఫ్రాక్ కి..ర్రాక్!
చిన్నప్పుడు చిన్న చిన్న గౌనులు వేసుకున్న ముచ్చట మదిలో అలాగే నిలిచిపోయి ఉందా! ఇప్పుడు అలాంటి చిన్న గౌన్ వేసుకోలేం అని బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడిదే ట్రెండ్‌లో ఉంది. ఫ్రాక్ కి..ర్రాక్ పుట్టిస్తోంది. ఈ ఫ్రాక్ స్టైల్ పాశ్చాత్య, సంప్రదాయ డ్రెస్సులతో అతివలను అమితంగా ఆకట్టుకుంటుంది. ∙వేసవి కాలం చెమట, ఉక్కపోతలు సహజం. ధరించే డ్రెస్ ఎలాంటిదైనా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, అదే సమయంలో స్టైలిష్‌గా తోడయితే ఎంత బాగుండు అనుకునేవారికి కాటన్ ఫ్రాక్ సరైన ఎంపిక. కాటన్ బాటమ్, ఇక్కత్ లేదా ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఎంచుకుంటే చాలు. సమ్మర్లో క్యాజువల్ లుక్‌లోనూ స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు. ∙కాలర్ నెక్ ప్యాటర్న్‌తో ఉన్న ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్‌కి ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రధాన ఆకర్షణ. లాంగ్ జార్జెట్ స్లీవ్స్ బాటమ్‌గా పూర్తి కాంట్రాస్ట్ ధోతీ ప్యాంట్ ధరిస్తే పార్టీకి సిద్ధమే! ∙నైట్ వెడ్డింగ్ పార్టీ. లైట్ల ధగ ధగలతో డ్రెస్ కూడా పోటీపడాలంటే జరీ జిలుగులతో తీర్చిదిద్ది షార్ట్ ఫ్రాక్ ధరించాల్సిందే! ∙ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్ ఎంచుకునేటప్పుడు మరొక చిన్న మెలకువ తెలుసుకోవాలి. ఫ్రాక్ అంచుగా జరీ బార్డర్, ఫ్రంట్ బటన్స్ అయితే లుక్ మరింత ఆకర్షణీయంగా మారిపోతుంది. ∙మెహెందీ కలర్ షార్ట్ ఫ్రాక్ సూట్ మీదకు హెవీ వర్క్‌తో డిజైన్ చేసి దుపట్టా ధరిస్తే సెలబ్రిటీలకు తీసిపోని విధంగా ఎలాంటి వేదికైనా వైబ్రెంట్‌గా వెలిగిపోవాల్సిందే! ∙లెహెంగా మీదకు డిజైనర్ బ్లౌజ్ ధరించడం మామూలే! అదే ప్లెయిన్ లెహెంగా మీదకు బెనారస్ షార్ట్ ఫ్రాక్ ధరిస్తే వేడుకలో ప్రత్యేకంగా నిలవచ్చు. ∙ధోతీ ప్యాంట్ మీదకు చిన్న గౌన్ ధరించి, డిజైనర్ దుపట్టా వేసుకొని, సన్నని డిజైనర్ బెల్ట్ నడుమున చుడితే పెళ్లికి ప్రత్యేక కళ వచ్చేస్తుంది. – నిర్వహణ: ఎన్.ఆర్ -
అంటిస్తాడు.. నటిస్తాడు.. ఉడాయిస్తాడు..
రాజోలు: మోటారు సైకిల్‌పై వస్తాడు.. దానిలో ఉన్న పెట్రోలను కవర్లోకి తీసుకుంటాడు. సమీపంలో ఉన్న తాటాకిళ్లపైకి దానిని విసిరి నిప్పుపెడతాడు. అంతేకాదు. ఇంటికి నిప్పంటుకుందని ఆ ఇంటిలో ఉన్న వాళ్లను అప్రమత్తం చేస్తాడు. సహాయం చేస్తున్నట్టుగా నటిస్తాడు. వాళ్లు తమ వస్తువులను కాపాడుకునే హడావుడిలో ఉండగా.. ఇతడు వాటిని దొంగిలించే పనిలో ఉంటాడు.. ఇలా డబ్బు, బంగారం దొంగతనం కోసం తాటాకిళ్లు లక్ష్యంగా చేసుకుని వాటిని దహనం చేస్తున్న యువకుడిని సోమవారం రాజోలు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రాజోలు పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివకోడు, రాజోలు గ్రామాల్లో ఐదు తాటాకిళ్లకు నిప్పుపెట్టాడు భీమవరానికి చెందిన ఈ యువకుడు. రాజోలు, తదితర ప్రాంతాలకు మోటార్‌సైకిల్‌పై రాత్రి సమయాల్లో వచ్చి మోటార్‌సైకిల్‌లోని పెట్రోలును ఒక కవర్లోకి తీసుకుని దానిని తాటికిళ్లపై వేసి నిప్పు పెట్టేవాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న వారిని ఇల్లు కాలిపోతుందని బయటకు రావాలని తలుపులు తట్టి లేపి, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు బయటకు తెచ్చుకోమని సలహా ఇచ్చి వారికి సాయం చేస్తున్నట్టు నటించి వాటిని దొంగిలించాడు. ఈ ఘటనలకు పాల్పడుతున్నది ఎవరనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు శివకోడు లాకు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. మైనర్ కావడంతో రాజమండ్రి మూడో ఏజేఎఫ్సీఎం కోర్టులో నిందితుడిని హాజరుపర్చినట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. -
స్లీ ఈఈఈఈఈఈ వ్!
పొడవు చేతులండీ... బహు పొడవు చేతులండీ! తన పాదాలను తనే నమస్కరించుకునే పొడవు చేతులండీ! స్టైల్ కొత్తదండీ లాంగ్ లివ్ అండీ!! ►భుజాల మీదుగా దుపట్టాను కప్పుకున్న విధంగా రూపుకడుతుందీ స్టైల్. లాంగ్ స్లీవ్స్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న కేప్ డిజైన్ ఇది. ►పొడవులో లెహంగాతో పోటీపడుతున్న లాంగ్ స్లీవ్స్ ఇప్పుడు అతివల అందానికి కొత్త సొబగులు అద్దుతాయి. ►రాచ కళ ఉట్టిపడేలా, మత్స్య సుందరిని తలపించే రెడ్‌కార్పెట్ డ్రెస్ ఇది. లాంగ్ వెస్ట్రన్ గౌన్‌కి పొడవాటి స్లీవ్స్ ప్రధాన ఆకర్షణ. ► తెల్ల కలువకు బంగారురేకులు తాపడం చేసినట్లుందీ లాంగ్ స్లీవ్స్ బ్లవుజ్. సంప్రదాయ వేడుక... మోడరన్ ఫంక్షన్... దేనికైనా స్పెషల్ అట్రాక్షన్ ఇది. ► లాంగ్ అనార్కలీ గౌన్‌కి దుపట్టాలా అమరిన లాంగ్ స్లీవ్స్ ఈ డ్రెస్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేసింది. ఈవెనెంగ్ వెస్ట్రన్ వేడుకలకు ప్రధాన ఆకర్షణను తెచ్చిపెడుతుంది. ► వెస్ట్రన్ లాంగ్ గౌన్‌కి చీలికలుగా ఉండే లాంగ్ స్లీవ్స్ చూపులను కట్టడి చేస్తుంది. ► పలాజో ప్యాంట్ మీదకు లాంగ్ స్లీవ్స్ డిజైనర్ కేప్! వెస్ట్రన్ వేడుకలో స్టైలిష్‌గా వెలిగిపోయే డ్రెస్. -
పాత పద్ధతిలోనే పింఛన్లు
వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా పంపిణీకి చర్యలు డీఆర్డీ ఏ నుంచి ఎంపీడీఓలకు ఆదేశాలు కాకినాడ సిటీ / రాయవరం: జిల్లాలో సామాజికభద్రతా పింఛన్లను పాత పద్ధతిలోనే వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా జనవరి నెల నుంచి పంపిణీ చేయనున్నారు. 50 రోజుల క్రితం రూ.500, రూ.1000 నోట్లు రద్దుతో ఏర్పడ్డ నగదు కొరత నేపథ్యంలో ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం లబ్ధిదారులకు ప్రతీనెల ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును నగదు రూపంలో చెల్లించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. నేరుగా లబ్ధిదారులకు పింఛను సొమ్మును ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాలకు వేయాలని నిర్ణయించిందే తడువుగా ఇక్కట్లను అంచనా వేయకుండా డిసెంబర్ ఒకటిన లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,75,823 మంది లబ్ధిదారుల్లో 4,48,640 మంది వృద్ధులు, వితంతువులు, చేనేత, కలుగీత, అభయహస్తం, దివ్యాంగుల్లో కొందరికి రూ.వెయ్యి చొప్పున, మరో 27,183 మంది దివ్యాంగులకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉండగా రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం, రూ.100 నోట్లు కొరత ఉన్నందున బ్యాంకు ఖాతాలో వేసిన సొమ్ము లబ్ధిదారులకు అందక, చేతిల్లో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. తమఖాతాల్లో వేసిన సొమ్మును తీసుకునేందుకు పింఛనుదారులు బ్యాంకుల వద్ద గంటల తరబడి లైన్లలో నిల్చున్నా నగదు కొరతతో చేతికందని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు అధికారులు 15 రోజుల తరువాత క్షేత్రస్థాయిలో స్వైపింగ్ మెషీన్లతో వివిధ బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా పింఛన్ల సొమ్ము పంపిణీకి చర్యలు తీసుకోడంతో ఈ పంపిణీ ప్రక్రియ నెల పొడవునా సాగి బుధవారం 28వ తేదీతో ముగిసింది. ఈ నెలలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వెల్లువెత్తిన వ్యతిరేకతతో ప్రభుత్వం జనవరిలో యథావిధిగా పాత పద్ధతిలోనే పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు జనవరి నెలకు విడుదలైన సామాజిక పింఛన్ల సొమ్మును బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంపీడీవోల ఖాతాలకు పంపించారు. ఆయా మండలాల అధికారులు నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి గ్రామాల్లో ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నగదు సిద్ధం చేయండి.. 2017 జనవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పథకంలో పింఛన్లు ట్యాబ్‌ల ద్వారా ఇవ్వనున్న నేపథ్యంలో అవసరమైన నగదు సిద్దం చేయాలని బ్యాంకులకు ఎంపీడీవోలు సమాచారం పంపించారు. ఈ నెల 28వ తేదీకి ఆయా బ్యాంకు శాఖల పరిధిలో అవసరమైన సొమ్మును సిద్ధం చేయాలని ఎంపీడీవోలు వారి పరిధిలోని బ్యాంకులకు సమాచారం అందించారు. దీని ప్రకారం జిల్లాలో ఉన్న 750 బ్యాంకు శాఖల ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసే పింఛన్ సొమ్ము రూ.52కోట్లు ఈ నెలాఖరుకు బ్యాంకు అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. -
‘మిక్స్ అండ్ మ్యాచ్’
ఆసం ఆధునికాన్ని సంప్రదాయంతో కలిపితే? ‘మిక్స్ అండ్ మ్యాచ్’ అవుతుంది. జీన్ ప్యాంట్ మీద కుర్తా... లెహంగా మీద షర్ట్... ఇలా మిక్స్ చేసి, మ్యాచ్ చేసుకుంటే ఏమవుతారు? మిక్సమ్మలు అవుతారు. సంభ్రమం కలిగించే ఆసం మిక్సమ్మలు అవుతారు. ►లాంగ్ స్లీవ్స్ జార్జెట్ అనార్కలీ టాప్‌కి బాటమ్‌గా జీన్స్, కాళ్లకు బూట్లు... లుక్‌ని పూర్తిగా మార్చేసే స్టైల్ వనితల అందానికి కొత్త భాష్యం చెబుతోంది. ► ప్లెయిన్ లెహంగా మీదకు వెస్ట్రన్ క్రాప్ టాప్, వెడల్పాటి బెల్ట్ - ఇది టీనేజర్స్ స్టైల్స్‌కి కొత్త మెరుగులు దిద్దుతోంది. ► సంప్రదాయ చందేరీ లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన వెస్ట్రన్ ఓవర్ కోట్... స్టైల్లో ముందు వర సలో నిలుస్తోంది. ► లాంగ్ స్లీవ్స్ గౌన్‌కు బాటమ్‌గా జీన్స్ ధరిస్తే... ఏ వేదికపైన అయినా హైలైట్‌గా నిలవాల్సిందే! ► ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రంట్ ఓపెన్ నెటెడ్ లాంగ్ కుర్తాకు టామ్ జీన్స్, స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్ ధరిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి సిసలైన కళను తీసుకువస్తుంది. ► ఫ్లోర్ లెంగ్త్ ఫ్రంట్ ఓపెన్ అనార్కలీ ఫ్రాక్‌కి బాటమ్‌గా జెగ్గింగ్, లేదంటే జీన్స్ ధరిస్తే వచ్చే లుక్ ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. ► పటియాలా సల్వార్.. దాని మీద వెస్ట్రన్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే... చూపులను కట్టిపడేయాల్సిందే! ► పొడవాటి సంప్రదాయ కుర్తీకి బాటమ్‌గా డెనిమ్ ప్యాంట్ ఆధునికతకు అద్దం పడుతోంది. క్యాజువల్, స్టైలిష్ వేర్‌గా ఈ గెటప్ నేటి యువతులను బాగా ఆకట్టుకుంటోంది. మిక్స్ అండ్ మ్యాచ్‌కి కొన్ని టిప్స్ ►ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించినప్పుడు.. ►{స్టెయిట్ కట్, స్లీక్ పొనీ టెయిల్, ఒక వైపు మాత్రమే వేసుకునే ఫిష్ టెయిల్ వంటి హెయిర్ స్టైల్స్ బాగా నప్పుతాయి. ►ఈ డ్రెస్సుల మీదకు ఏ ఆభరణాలూ అవసరం లేదు. ధరించాలనుకుంటే సంప్రదాయ ఆభరణాల కన్నా ఫ్యాన్సీ జ్యుయలరీయే ఆకర్షణీయంగా ఉంటుంది. ►ఈ తరహా స్టైల్లో మెరిసినప్పుడు క్లచ్, హ్యాండ్ పర్స్‌ల వంటివి చేతిలో ధరిస్తే లుక్ బాగుంటుంది. -
ప్యాంట్ విత్ లేస్...
డెనిమ్ ప్యాంట్స్ నేటి అమ్మాయిల ఫేవరేట్. వార్డ్‌రోబ్‌లో తప్పక చేరుతున్న క్యాజువల్ వేర్. దీనిని స్టైల్‌గా, స్పెషల్ అనిపించేలా తీర్చిదిద్దాలంటే సింపుల్ అనిపించే ఓ చిన్న ఐడియాను ఆచరణలో పెట్టేయడమే. అదేంటో ఫొటోలో చూస్తే తెలిసిపోతుంది కదా! ఒకవైపు ప్యాంట్‌ని కట్ చేసి దానికి లేస్ డిజైన్ని జత చేయండి. స్టైల్ ప్యాంట్ ఇలా మీ ముందు రెడీ! స్టెప్ 1: బ్లాక్, వైట్.. లేస్ డిజైన్, రంగు ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్యాంట్‌కి ఏ భాగంలో లేస్ జత చేయాలో సరిచూసుకోవాలి. అందుకు మోకాలు, థైస్, పాకెట్, ఫుల్ లె గ్ లెంగ్త్.. మార్క్ చేసిన చోటే ప్యాంట్‌ను కట్‌చేయాలి. ముందే ఎంచుకున్న కాంబినేషన్ లేస్‌ను ప్యాంట్‌కి జత చేసి కుట్టాలి. దీంతో చూడముచ్చటైన లేస్ డెనిమ్ ప్యాంట్ రెడీ అవుతుంది. స్టెప్ 2: ప్యాంట్‌ను కట్ చేయాల్సిన అవసరం లేకుండా పై నుంచి లేస్ డిజైన్‌ను వేయాలనుకున్నవారు ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఫ్లోరల్ ప్రింట్లు ఉన్న లేస్ డిజైన్స్ ఎంచుకోవాలి. ఎంత లెంగ్త్, ఏయే భాగంలో లేస్ వేయాలో మార్క్ చేసుకొని ఆ ప్రకారం లేస్‌ను గమ్‌తో అతికించాలి. తర్వాత కుట్లు వేయాలి. స్టెప్ 3: పొట్టివైన ప్యాంట్లకు అడుగు భాగాన లేస్‌ను జతచేయ వచ్చు. అలాగే డెనిమ్ కెప్రీస్, షార్ట్స్‌కు లేస్ జత చేస్తే ఓ కొత్త స్టైల్ ప్యాంట్ స్పెషల్వేర్గా మీ ముందు ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. -
ఖరీదైన పీసీయే కావాలి..!!
♦ స్టైల్, అధిక ఫీచర్లకే యువత మొగ్గు ♦ ‘మిలీనియల్స్’ అభిరుచులకు అనుగుణంగా మోడళ్లు ♦ మార్చి త్రైమాసికంలో పీసీల్లో వీటి వాటాయే 30% ♦ అమ్మకాలు తగ్గుతున్నా.. ప్రీమియం మోడల్స్‌లో వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చేతిలో స్మార్ట్ఫోనే కాదు. భుజానికుండే ల్యాప్‌టాప్ కూడా ఖరీదైనదే కావాలట!!. ఇదీ నేటి కుర్రకారు ట్రెండ్. పర్సనల్ కంప్యూటర్ను కూడా స్టేటస్ సింబల్‌గా భావించే వారు పెరుగుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. స్టైలిష్‌గా... ఎక్కువ ఫీచర్లతో ఉండే ల్యాప్టాప్లనే యువత ఇష్టపడుతున్నారని, వీటిని నలుగురిలోనూ చూపించడాన్ని స్టైల్ స్టేటస్‌గా భావిస్తున్నారని గణాం కాలు చెబుతున్నాయి. నిజానికి పీసీ మార్కెట్ వృద్ధి రేటు అంతకంతకూ తగ్గుతుండగా ప్రీమియం ఉత్పత్తులు మాత్రం 25-30% వృద్ధిని నమోదు చేస్తున్నాయి. పీసీలను వాడుతున్నవారు హై ఎండ్ మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతుండడమే ఇందుకు కారణ మని చెబుతున్న కంపెనీలు... వీటిపై దృష్టిపెట్టాయి. ప్రీమియం మోడళ్లను తీసుకొస్తున్నాయి. కొద్ది రోజుల వరకు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు నలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారి కలర్‌ఫుల్ కంప్యూటర్లు వచ్చేశాయి. మినీ నోట్‌బుక్స్, అల్ట్రా పోర్టబుల్ ట్యాబ్లెట్స్ వంటి పేర్లతో హల్చల్ చేస్తున్నాయి. డెస్క్టాప్లైతే పెద్ద స్క్రీన్‌తో టూ ఇన్ వన్ల రూపాన్ని సంతరించుకున్నాయి. కొన్ని కంపెనీలైతే ల్యాప్‌టాప్‌లను ట్యాబ్లెట్గా కూడా వాడుకునేలా తయారు చేస్తున్నాయి. 10.4 మిల్లీమీటర్ల మందంతో ప్రపంచంలో అతి పలుచని ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ రూపొందించింది. వినియోగదార్లు వినూత్న డిజైన్, తక్కువ బరువు, అధిక మెమరీ, గట్టిదనం వంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. మెట్రోల్లో ఈ ట్రెండ్ అధికం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇప్పుడిప్పుడే ప్రీమియం ఉత్పత్తుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. యువత అభిరుచే ప్రధానం కంపెనీల నోట ఇప్పుడు మిలీనియల్స్ మాట వినపడుతోంది. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న కుర్రకారుకు కంపెనీలు పెట్టుకున్న ముద్దుపేరే మిలీనియల్స్. వీరే కొత్తదనాన్ని కోరుకుంటున్నారని హెచ్‌పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ విభాగం అధిపతి అనురాగ్ అరోరా చెప్పారు. కంప్యూటర్ అక్షరాస్యతతో పాటు వీరికి కొనుగోలు శక్తి కూడా ఉందని చెప్పారాయన. ‘‘భారత్‌లో పీసీల మార్కెట్ గతేడాదితో పోలిస్తే 2016 మార్చి త్రైమాసికంలో 7.4% తిరోగమనం చెందింది. మార్కెట్ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడి స్థిరపడుతోంది. కాకపోతే రూ.50 వేలు ఆపైన ఉన్న ప్రీమియం విభాగం మాత్రం 25-30 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఇప్పటిదాకా బేసిక్ మోడళ్లు వాడినవారు ప్రీమియం మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’’ అని అరోరా వెల్లడించారు. సగటు ల్యాప్‌టాప్ ధర రూ.35 వేల నుంచి రూ.38 వేలకు ఎగసినట్లు తెలియజేశారు. కాగా గేమింగ్ డెస్క్‌టాప్‌ల రంగంలో తమ కంపెనీ అగ్ర స్థానంలో ఉన్నట్టు ఆసస్ సంస్థ దక్షిణాసియా హెడ్ పీటర్ చాంగ్ చెప్పారు. రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ పేరుతో భారత్‌లో తాము ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. ఇదీ పీసీ మార్కెట్... ⇒ జనవరి - మార్చి మధ్య దేశంలో అమ్ముడైన డెస్క్‌టాప్, ⇒ ల్యాప్‌టాప్‌లు.. 20 లక్షలు. ⇒ వీటిలో ప్రీమియం పీసీల వాటా 30 శాతం... అంటే 60 వేలు ⇒ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు - నెలకు 2-3వేలు ⇒ గేమింగ్ పీసీల మార్కెట్లో అగ్రస్థానం - అసస్ 30 శాతం. అగ్రస్థానంలో హెచ్‌పీ: గార్ట్నర్ పీసీ వాడకంలో వ్యక్తిగత వినియోగదార్ల వాటా 45%కాగా మిగిలిన 55% ఎంటర్ప్రైజెస్ వాటా. పరిశ్రమలో 25% వాటాతో హెచ్పీదే అగ్రస్థానం. ఆన్‌లైన్‌లోనూ ఈ కంపెనీదే పెత్తనం. డెల్ 23.5%, లెనోవో 19.4% వాటాలు ఉన్నాయి. ఏసర్ వాటాను 10.5 నుంచి 12.2 శాతానికి చేరినట్లు గార్ట్నర్ నివేదిక పేర్కొంది. -
బై బై బాయ్స్!
అవకాశాల్లో... ఆసక్తిలో... ఎనర్జీలో... ఎచీవ్‌మెంట్‌లో.. అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా లేనప్పుడు వాళ్లు వేసుకునే డ్రెస్సుల్లో మాత్రం తేడా ఎందుకు?! డైనమిక్‌గా.. స్మార్ట్‌గా.. ముచ్చటగా అనిపిస్తున్నారు. ఒకప్పుడు బాయ్స్ జోన్ అయిన ఈ డ్రెస్సులు ఇప్పుడు అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు. బై బై.. బాయ్స్...!! క్యూట్ గర్ల్స్‌కి డిజైనర్ సూచనలు.. మగవారి వేషధారణలో తప్పనిసరి అయిన దుస్తులు ఇప్పుడు మగువల వార్డ్‌రోబ్‌లో ముందస్తుగా చేరుతున్నాయి. మరీ ముఖ్యంగా కూల్ క్రిస్ప్ షర్ట్స్, టైలర్డ్ బ్లేజర్స్, డెనిమ్స్, సిగరెట్ ప్యాంట్స్.. వంటి మెన్స్‌వేర్ ముందువరసలో ఉంటున్నాయి. మగవారి వస్త్రధారణలో ఎంత బాగున్నా స్త్రీ సహజత్వ మెరుగులు కనిపించేలా తయారైతేనే మరింత స్టైలిష్‌గానూ అందంగానూ కనిపిస్తారు. మగవారి డ్రెస్సింగ్ కదా! అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే స్ట్రీట్ స్టైల్ ట్రెండ్ జాబితాలో చేరిపోయింది. మీ హృదయానికి నచ్చిన డ్రెస్సింగే కాలానికి తగ్గట్టుగా ఉంటే అదే అతి పెద్ద ట్రెండ్‌గా మెరుస్తుంది. ఈ తరహా వస్త్రధారణలో ఉన్నప్పుడు సింపుల్‌గా అనిపించాలి. ఆభరణాలు, మేకప్ నప్పవు. క్యాజువల్ వేర్ కదా అని మరీ ఒంటికి అతుక్కుపోయేలాంటి దుస్తులు ధరించకూడదు. ఎబ్బెట్టుగా కనిపిస్తారు. -
పిక్క ప్యాంటు
ఈ ప్యాంటు లెంగ్త్‌కు ఒక లెక్కుంది. దీని పొడవు పిక్క వరకు ఉంటుంది. తొడుక్కోడానికి అనువుగా ఉంటుంది. చకచక నడకకు సౌకర్యంగా ఉంటుంది. చిటపట చినుకుల్లో చివర్లు తడవకుండా ఉంటుంది. ఈ పిక్క ప్యాంటు బెస్ట్. ‘కాప్రి’ ప్యాంటు పేరున్న ఇదే లేటెస్ట్. కాప్రి ఫ్యాషన్ మోకాళ్లకు కొద్దిగా కిందుగా లేదంటే ఇంకాస్త పిక్కల దాకా.. మరికాస్త పొడవు ఉండే కాప్రి ఎల్లలు దాటి ఎవర్గ్రీన్ జాబితాలో చేరింది. కాప్రి అనే పదం ఇటాలియన్ భాష నుంచి వచ్చిందని, 1950-60లలో అమెరికాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. మొదటిసారి అమెరికన్ నటి గ్రేస్‌కెల్లీ తన సినిమాలో ధరించి ఆకట్టుకున్నా ప్రపంచమంతా కాప్రి వైపు మళ్లేలా చేయడంలో మాత్రం నటి మార్లిన్ మన్రో, ఆడ్రీ హెప్బర్న్లకే సాధ్యమైంది. నాటి నుంచి ప్రతి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో కాప్రి కామ్‌గా చేరిపోయింది. క్యూట్‌గా కనిపించేలా చేసే ఈ ప్యాంట్ మీదకు సింపుల్ టీ షర్ట్ ధరిస్తే చాలు అందంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. పాదాలకు అంతే అందమైన హీల్స్, కిల్లర్ హీల్స్ వంటివి ధరిస్తే ఈవెనింగ్ పార్టీవేర్‌కి ఎంచక్కా అమరిపోతుంది. ఈ లెక్క కాప్రీని కలర్ఫుల్గా మార్చేసింది. కొత్త కొత్త డిజైన్లలో ఒదిగిపోయింది. కాప్రీ ప్యాంట్‌నే త్రీ క్వార్టర్ ప్యాంట్, క్రాప్ ప్యాంట్స్, పెడెల్ పుషర్స్, కామ్ డిగ్గర్స్, ఫ్లడ్ ప్యాంట్స్, జామ్స్, హై వాటర్ కల్టర్స్, టొరెడార్ ప్యాంట్స్... ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. ఇన్ని పేర్లు ఉన్నా కాప్రి అనే పదమే నేడు ప్రపంచమంతా వాడుకలో ఉంది. మీరు కాప్రి ధరిస్తున్నారా?! అయితే డిజైనర్స్ ఇచ్చే సూచనలు తప్పనిసరి... చాలామంది అమ్మాయిలు, మహిళలు కాప్రి ప్యాంట్స్ విషయంలో సరైన అవగాహన ఉండదు. దీనికి కారణం వాస్తవానికి దూరంగా ఉండటం. పొట్టిగా ఉన్నవారు కాప్రి ప్యాంట్స్ ధరిస్తే మరింత పొట్టిగా కనపడతారు.పొడవుగా ఉంటే మరింత హైట్ అనిపిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే... నడుము వెడల్పుగా ఉన్నవారు కాప్రి కాళ్ల భాగం పొడవుగా ఉండేది తీసుకోవాలి. దీనికి షార్ట్ టాప్ సరైన ఎంపిక. స్లిమ్‌గా కనిపించాలంటే లోయర్ లెగ్ పార్ట్ మరీ టైట్‌గా ఉండేది ఎంచుకోకపోవడమే మేలు. లావుగా ఉన్నవారు లెగ్స్‌కి అతుక్కుపోయేలాంటి కాప్రిని ఎంచుకోవద్దు. వీటి వల్ల మరింత లావుగా కనిపిస్తారు. అలాగే స్ట్రెయిట్ కట్ ఉన్నది ఎంచుకోవాలి. లెగ్గింగ్ కాప్రి ధరించాలనుకునేవారికి ఈ జాగ్రత్త తప్పనిసరి.కాప్రి ప్యాంట్ ధరించినప్పుడు పొట్టిగా కనిపిస్తున్నాం అనుకుంటే హీల్స్ ధరించేడమే సేఫ్.కాప్రి ప్యాంట్ మీదకు ట్యూనిక్, చిక్ ఔట్ ఫిట్.. వంటి మంచి రంగు ఉన్న టాప్ ధరిస్తే లుక్ బాగా కనిపిస్తుంది. స్మార్ట్‌గా కనిపించాలంటే నెక్లేస్ లేదంటే ఏదైనా పెద్దబ్యాగ్ చేత పట్టుకుంటే చాలు. ►కాప్రి ప్యాంటు, డిజైనర్ టాప్ ధరించి స్టైల్‌గా వెలిగిపోతున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యాబచ్చన్. క్యాజువల్, కంఫర్ట్ అనిపించే ఈ తరహా డ్రెస్సింగ్ అతివల ఆత్మవిశ్వాసానికి సిసలైన చిరునామా అనిపించుకుంటుంది. ►లేస్, లేదా స్ట్రాప్డ్ లెగ్గింగ్ కాప్రి స్టైల్స్ ప్యాంటు ట్రెండ్‌ని ఫాలో అవుతున్న వారి జాబితాలో చేరుస్తాయి. ► కాప్రి పాయింట్స్ ఇప్పుడు ఇంకాస్త పొడవుగా మారాయి. అదే రంగు లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ ధరిస్తే అఫిషియల్ లుక్‌తో అదరగొట్టేస్తారు. ►జీన్స్ కాప్రి ఎంపిక ఎప్పుడూ స్టైల్లో ముందుంచుతుంది. రఫ్, స్పీడ్, స్టైల్‌తో మీ రూపం ఇట్టే ఆకట్టుకుంటుంది. జీన్స్ కాప్రిలో నటి అక్ష. ► క్యాజువల్ వేర్లో కాప్రి విత్ టాప్ ఈవెనింగ్ వేర్‌గా సౌకర్యాన్నిచ్చే డ్రెస్. ►పార్టీ వేర్‌లోనూ కంఫర్ట్ వెతుక్కునేవారికి కాప్రి ట్రౌజర్ స్టైల్ సరికొత్త స్టైల్ స్టేట్మెంట్. -
రెజ్యూమ్ తో జాబ్ సంపాదించాడు!
ఉద్యోగం కోసం రెజ్యూమ్ లు పట్టుకుని ఇంటర్వూల కోసం కంపెనీల చుట్టూ నిరుద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్న ఈ రోజుల్లో బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడు కేవలం రెజ్యూమ్ ని క్రియేటివ్ గా తయారుచేసి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఇంటర్వూ లేకుండానే జాబ్ సంపాదించాడు. జైన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంబీఏ పూర్తి చేసిన సుముఖ్ మెహతా(21) తన రెజ్యూమ్ తో బ్రిటిష్ మ్యాగజైన్ జీక్యూలో జాబ్ సంపాదించాడు. దీనిపై మాట్లాడిన మెహతా నేటి పోటీప్రపంచంలో ప్రతి ఒక్క విషయాన్ని క్రియేటివ్ గా ఆలోచించడం చాలా కష్టమని అన్నారు. తాను క్రియేటివ్ గా ఆలోచించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. ఎంబీఏ చదివే రోజుల్లో ఎప్పుడూ బోర్ కొట్టించే రెజ్యూమ్ లతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చిందని, ఇన్ఫోగ్రాఫిక్స్ సాయంతో తయారు చేసిన వాటిని డిపార్ట్ మెంట్ డీన్ కు చూపించేవాడినని తెలిపారు. ఆయన బాగున్నాయని చెప్పి ఆ ఏడాది బీ-స్కూల్ విద్యార్థుల రెజ్యూమ్ లు అన్నీ తనతో చేయమన్నట్లు వివరించారు. కాగా, చివరిగా తనకోసం రెజ్యూమ్ తయారుచేసుకున్న'ఎక్స్-ఫ్యాక్టర్' రెజ్యూమ్ తో జీక్యూలో ఇంటర్వూ లేకుండా కొలువు సాధించాడు. -
లాంగా!
లాంగ్గా ఉండే లంగా నిండుగా ఉంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది.. డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. లవ్లీగా ఉంటుంది! గాలికి కదులుతూ సాంగ్లా ఉంటుంది! సమ్మర్‌కి స్టైల్‌గా ఉంటుంది. మిడ్డీలు.. మినీలు.. మైక్రోలను ఈజీగా జయిస్తుంది. ఎప్పటి నుంచో మన కల్చర్‌లో ఉంది!! లాంగ్ లివ్ లంగా! అంతర్జాతీయ వూల్మార్క్ అవార్డ్ పొందిన ఏకైక ఫ్యాషన్ డిజైనర్. ప్రపంచ ఫ్యాషన్ నగరమైన ప్యారిస్ వేదికల మీద వినూత్న వస్త్ర శైలులను ప్రదర్శించి ఔరా! అనిపించిన డిజైనర్. ఈ ఏడాది సమ్మర్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన డిజైనర్ రాహుల్ మిశ్రా! ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రాహుల్ ఢిల్లీకి చెందినవారు. భారతీయ సాంస్కృతిక కళా వైభవాన్ని ఫ్యాబ్రిక్స్ ద్వారా పరిచయం చేసే ఈ వినూత్న డిజైనర్ డెనిమ్, ఖాదీలతో పాటు సిల్క్, ఆర్గంజా, షిఫాన్.. మొదలైన ఫ్యాబ్రిక్స్తోనూ.. నీలం, తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులతో చేసే మ్యాజిక్‌ని ఊహించలేం. గ్రామీణ కళగా ఆకట్టుకునే బంధనీ డిజైన్స్‌ను లావిష్‌గా తీర్చిదిద్దడం, ఎంబ్రాయిడరీ పనితనం, త్రీడీ ఎఫెక్ట్స్ దుస్తుల మీదకు తీసుకురావడంలో రాహుల్ మిశ్రా ప్రత్యేకతే వేరు. ఈ డిజైనర్ ఇస్తున్న కొన్ని సూచనలు... ♦ ఆధునిక మహిళ ఏం కోరుకుంటోంది అనే విషయంపైన ఎక్కువ దృష్టిపెట్టాలి. నేనైతే దీంట్లో భాగంగానే దుస్తుల మీద ప్రాచీన సాంస్కృతిక కళ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇందులో సింప్లిసిటీ, ప్రత్యేకత ఏ మాత్రం మిస్ అవ్వను. ♦ మనవైన ఖాదీ, కాటన్ దుస్తులను ఎంత ఆధునికంగా చూపించగలమో అలాగే సిల్క్, షిఫాన్, నెటెడ్ ఫ్యాబ్రిక్‌తోనూ అంతే కంఫర్ట్ తీసుకురావచ్చు. దానికి తగినట్టుగా దుస్తులను డిజైన్ చేస్తే ప్రజల ఆదరణ కూడా బాగుంటుంది. ♦ ధరించిన దుస్తులు ఎంత ఖరీదైనవి అని కాదు, అవి సౌకర్యంగా ఉండటం ముఖ్యం. -
ఆ ‘మోజు’ పోయింది
కెరీర్ ఆరంభంలో స్టయిల్‌గా ఉండటం, రకరకాల టాటూల మీద మోజు ఉండేదని, ఇప్పుడది పోయిందని భారత స్టార్ విరాట్ కోహ్లి చెప్పాడు. ‘మానసికంగా దృఢంగా ఉండటానికి నేనేం పూజా పునస్కారాలు చేయను. గతంతో పోలిస్తే ఆలోచనా విధానం మారింది. ప్రతిసారీ నెట్స్‌కి వెళ్లినప్పుడు 0.1 శాతమైనా నా ఆటను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో వెళుతున్నాను. జట్టు కోసం ఏదైనా చేయాల్సిందే అనే పట్టుదల వల్లే రాటుదేలాను’ అని కోహ్లి చెప్పాడు. -
‘రాత’ బాగలేకపోయినా... శైలి బాగుండాలి
ఎగ్జామ్ టిప్స్ ⇒ కనీసం రెండు కాపీల హాల్‌టికెట్స్ రెడీ చేసుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్... వంటివి సరైన రీతిలో సిద్ధం చేసుకోవాలి. పరీక్ష హాల్లో ఏదీ ఎవరినీ అడిగే పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. ⇒ జవాబులు రాయడంలో నాణ్యమైన శైలిని ప్రదర్శించడం ముఖ్యం. అవసరమైనంత మార్జిన్లు వదలడం, ప్రశ్నల నంబర్లు సరిగా రాయడం, ప్రతి ప్రశ్న-సమాధానానికి మధ్యలో తగినంత స్థలం వదలడం, సబ్ హెడ్డింగ్స్‌కు, ముఖ్యమైన నిర్వచనాలకు అండర్లైన్ చేయడం మీ జవాబు పత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతుంది. మీ చేతిరాత అంత అందంగా లేకపోయినప్పటికీ పై జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఆ లోపం చాలా వరకూ కనుమరుగవుతుంది. ⇒ అండర్ లైన్ చేయడానికి రెడ్ ఇంక్ వినియోగించవద్దు. మరేదైనా కలర్ ఫర్వాలేదు. తప్పులు గుర్తించడానికి, మార్కులు ఇవ్వడానికి ఎగ్జామినర్ రెడ్ ఇంక్ వినియోగిస్తారు. కాబట్టి విద్యార్థులు రెడ్ ఇంక్ వాడకూడదు. ⇒ విద్యావిధానంలో పరీక్షలనేవి ఒక భాగం. వీటి పట్ల సానుకూల దృక్పథం పెంచుకుంటే మీలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ⇒ ఈ సమయంలో కొంత మంది స్నేహితులు అప్రధానమైన అంశాలను ప్రస్తావించి మీలో భయాన్ని రేకెత్తించే ప్రయత్నం చేయవచ్చు. వాటిని పట్టించుకోకండి. మీ మానసికస్థైర్యాన్ని వినియోగించుకుంటూ పెద్దలు, ఉపాధ్యాయుల సలహా సూచనల మేరకు కృషిచేయండి. ⇒ విద్యార్థులు ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. కేవలం నీళ్ళు మాత్రమే కాకుండా పండ్లు, జావ వంటివి తీసుకోవాలి. -
తమిళనాడు తరహాలో చర్యలు
అక్రమ నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా అక్కడ చట్టం ఉంది ♦ ట్రిబ్యునల్ ఏర్పాటునూ పరిశీలిస్తున్నాం ♦ అక్రమ నిర్మాణాలను అణచివేస్తాం ♦ హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తమిళనాడు తరహాలో చర్యలు తీసుకునే విషయంపై అధ్యయనం చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అక్రమ నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా తమిళనాడులో చట్టం ఉందని, దానిని ఇక్కడ అమలు చేసేందుకు అవసరమైన చట్ట సవరణను తెచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నామని తెలిపింది. అలాగే అక్రమ నిర్మాణాల విషయంలో దాఖలయ్యే కేసులను విచారించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే విషయాన్నీ పరిశీలిస్తున్నామంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను అణచివేసేందుకు చర్యలు ప్రారంభించామని, నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నామని పేర్కొంది. తమ పొరుగువారు సెట్బ్యాక్లు విడిచిపెట్టకుండా అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో చర్యలు తీసుకునేలా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాన్ మహమ్మద్ అలియాస్ షాహాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈమేరకు మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.జి.గోపాల్ కౌంటర్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ గతంలోనే చట్ట సవరణ తెచ్చామని, దాని కింద ఇప్పటికే 31 కేసులు కూడా నమోదు చేశామన్నారు. అక్రమ లేఔట్లలో జరిగిన నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా తమిళనాడులో చట్టం ఉందని, ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేసే విషయమై అధ్యయనం చేస్తున్నామన్నారు. అలాగే పురపాలకశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని గోపాల్ వివరించారు. ఉన్నతస్థాయి పోస్టుల భర్తీ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, తగిన విధంగా స్పందించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులతో టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
మామను ఫాలో అవుతున్న అల్లుడు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే ఓ స్టయిల్ ఐకాన్. స్టైలిష్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అన్నారు. సిగరెట్ గాల్లో ఎగరవేసే రజనీ స్టయిల్‌కు ఫిదా అయినవాళ్లు ఉన్నారు. తాజాగా రజనీ అల్లుడు, యువ హీరో ధనుష్ ...మామను అనుసరిస్తున్నాడు. కాగా రజనీ స్టయిల్‌ను ధనుష్ ఫాలో అవుతున్నాడని ఎప్పటి నుంచి టాక్ ఉంది. 'విఐపీ' సినిమాలో రజనీ స్టైల్స్‌ను అనుకరించాడు కూడా. ఈ మూవీ 'రఘువరన్ బీటెక్' పేరుతో తెలుగులోకి కూడా వచ్చింది. అయితే నటన విషంయంలో ధనుష్‌ను ఎవ్వరూ వంక పెట్టలేరు. ఇటు కోలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. రజనీ స్టయిల్‌ను ధనుష్ అనుకరించడం మానుకోలేదని కోలీవుడ్‌లో ఇంకా గుసగుసలు వినిస్తున్నాయి. రీసెంట్గా రిలీజైన 'మారీ' సినిమా టీజర్ అందుకు నిదర్శనం అంటున్నారు. ధనుష్ మళ్లీ మాస్ గెటప్‌లో రజనీలా సిగరెట్ కాలుస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ధనుష్ విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా రజనీని టాప్ ఆఫ్ డైలాగ్స్ చెబుతూ మతులు పోగొడుతుంది. సోనాక్షీ మెయిన్ రోల్లో ఓ లేడీ ఓరియెంటెండ్ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ తమిళ దర్శకుడికి రజనీ అంటే విపరీతమైన అభిమానం. ఈ డైరెక్టర్.. రజినీ స్టైల్లో సోనాక్షితో డైలాగ్ చెప్పించి నెట్లో ఉంచాడు. మొత్తానికి రజనీ మేనియా కోలీవుడ్, బాలీవుడ్లో నడుస్తోంది. -
హాఫ్ శారీ.. ఫుల్స్టైల్...
బామ్మల నాటి స్టైల్ మళ్లీ నేడు మన అమ్మాయిల మతులు పోగొట్టడానికి రెడీ అయ్యింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిిపిస్తూనే నయా స్టైల్ మార్కులు కొట్టేస్తోంది. అదే హాఫ్ శారీ. పెళ్లికెళ్లాలన్నా, కాలేజీ పార్టీలకు కలర్‌ఫుల్ లుక్ తేవాలన్నా ఫుల్స్టైల్ డ్రెస్ హాఫ్ శారీనే! ఎండాకాలం లంగాఓణీలా..! అని భయపడేవారికి సరికొత్తగా మరింత సౌకర్యవంతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ లంగాఓణీలు. ఫ్యాషన్ దుస్తులలో కొంతకాలంగా నెటెడ్ ఫ్యాబ్రిక్ సృష్టించిన హంగామా చూశాం. వెల్వెట్ మెరుపులూ తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి స్థానాన్ని పట్టు హంగులు కొట్టేశాయి. బెనారస్ మెరుపులు హల్ చల్ చేస్తున్నాయి. మగువలు తమ సింగారాన్ని మెత్తనైన పట్టుతో సంప్రదాయపు, ఆధునికపు వేడుకలకు ఇలా అందంగా అమరే క్లాసిక్లుక్తో మార్చేయవచ్చు. ఇంతకాలం కాంట్రాస్ట్ కలర్స్ ఇంపుగా అనిపించేవి. దీంతో ఇవే మన దక్షిణ భారతీయ ఫ్యాషన్లలో హల్చల్ చేశాయి. ఇప్పుడిక చాలా క్లోజ్డ్ కలర్స్(దగ్గరగా ఉండేవి) అంటే ఉదాహరణకు ఎరుపులో మరికొన్ని షేడ్స్‌ను తీసుకోవచ్చు. ఎరుపు, నారింజ, ముదురు ఎరుపు.. ఇలా తీసుకుంటూ వాటికి బంగారు జరీ పెద్ద అంచులను జత చేర్చి దుస్తులను డిజైన్ చేయడం వల్ల ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. పెద్ద పెద్ద మోటిఫ్స్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. ఏ రంగు ఫాబ్రిక్ తీసుకున్నా దానికి పెద్ద పెద్ద జరీ అంచులను జతగా చేస్తే రిచ్ లుక్ వస్తుంది. అన్నీ డిజైనర్ లుక్‌తో ఆకట్టుకోవాలనే అత్యాశకు పోతే గాఢీ లుక్‌తో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. అందుకని, చిన్న చిన్న మోటివ్స్ ఉన్న ప్లెయిన్ నెటెడ్, చందేరీ, షిఫాన్ ఓణీలు ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. లంగాఓణీలో ఎంత సింపుల్‌గా కనిపిస్తే అంత బాగుంటుంది. అదే సమయంలో క్లాసిక్లుక్తో, రిచ్‌గానూ ఆకట్టుకోవాలనుకునేవారికి ఈ తరహా వేషధారణ బాగా నప్పుతుంది. గ్రామీణ నేపథ్యంతో పాటూ బామ్మల కాలం నాటి ఒరిజినాలిటీని, రంగులను డిజైనింగ్‌లో చూపిస్తే ఇలాంటి అందమైన వేషధారణ మరింత ఆకర్షణీయంగా రూపుకడుతుంది. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ -
భారత్‌కు దూకుడు నేర్పిస్తాడు!
కోహ్లిపై జాన్సన్ ప్రశంస సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ తొలి మూడు టెస్టుల్లో విరాట్ కోహ్లి తన ఆటతో పాటు గొడవతో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా మిషెల్ జాన్సన్‌ను అతను మాటలతో ఎదుర్కొన్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మైదానంలో ఎలా స్పందించినా ఇప్పుడు స్వయంగా జాన్సన్‌కు కూడా కోహ్లి శైలి నచ్చినట్లుంది. ఇకపై అతని కెప్టెన్సీలో భారత జట్టు మరింత దూకుడుగా ఉండగలదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. ‘సాధారణంగా భారత జట్టు దూకుడుగా ఆడదు. అయితే ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీలో అది మారవచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను కోహ్లిని చూస్తున్న నాటినుంచి అతను ఎప్పుడూ ఇంతే దుడుకుగా వ్యవహరిస్తాడు. ఫీల్డింగ్ పెట్టడం మొదలు చాలా అంశాల్లో ధోనితో పోలిస్తే మీకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎక్కడా తగ్గడాన్ని ఇష్టపడడు. ప్రత్యర్థి జట్టు ఎవరైనా కోహ్లి తీరులో మార్పు కనిపించదు’ అని జాన్సన్ వ్యాఖ్యానించాడు. వేగం తగ్గించాను... ఏడాది క్రితం యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన జాన్సన్ ఈసారి మాత్రం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతని బౌలింగ్ వేగం కూడా తగ్గింది. జట్టు అవసరాల కారణంగా సుదీర్ఘ స్పెల్‌లు వేయాల్సి రావడంతో ఇలా జరిగిందని జాన్సన్ చెప్పాడు. ‘చిన్న చిన్న స్పెల్‌లతో నేను ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాను. 150 కిలోమీటర్ల వేగాన్ని ఎక్కువ సేపు కొనసాగించడం అంత సులువు కాదు. అందుకే ఇప్పుడు వేగం తగ్గింది. అయితే సిడ్నీలోనైనా నా తరహాలో చెలరేగేందుకు చిన్న స్పెల్‌లు ఇమ్మని కెప్టెన్, కోచ్‌లను కోరతాను’ అని జాన్సన్ చెప్పాడు. -
స్మైల్ ఈజ్ స్టైల్
స్మైల్‌ని మించిన స్టైల్ లేదు.. ఈ స్టేట్మెంట్ ఓ డిజైనర్ది. రోజుకో ఫ్యాషన్ సృష్టికర్త.. నవ్వుని మించిన స్టైల్ స్టేట్మెంట్ లేదనడం విశేషమే. అయితే అంతకు మించిన విశేషాలు చాలానే ఉన్నాయి నిఖిల్ తంపి దగ్గర. ఫ్యాషన్ డిజైనర్‌గా మూడేళ్లలో స్టార్డమ్ అంటే దాదాపు అసాధ్యమే. అయితే దీన్ని సుసాధ్యం చేశాడు నిఖిల్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్టుగా.. షార్ట్‌టైమ్‌లోనే టాప్ ప్లేస్‌కి చేరుకున్నాడు. నేటి బాలీవుడ్ తారలైన సోనమ్ కపూర్, విద్యాబాలన్‌ల నుంచి ఎవర్గ్రీన్ మాధురీదీక్షిత్ దాకా.. వస్త్ర శైలులను తీర్చిదిద్దాడు. వయసులోనే కాదు అనుభవంలోనూ కుర్రాడే అయిన ఈ ముంబై పోరడు.. నగరంలో తొలిసారి తన డిజైన్లను ప్రదర్శించిన సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... - ఎస్బీ హాయ్ హైదరాబాద్.. ఈ సిటీకి ఇదే తొలిసారి రావడం. నాకు నెట్ ద్వారా ఇక్కడ చాలా మంది కనెక్ట్ అయ్యారు. నా డిజైన్లను అభిమానిస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్. ఫస్ట్ టైమ్ వారికి నా డిజైన్స్‌ను పరిచయం చేస్తున్నా. ఇకపై రెగ్యులర్‌గా ఈ సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌కి నా డిజైన్స్ అందుబాటులోకి తెస్తా. ఓనమాలు తెలీకున్నా.. నేనేమీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయలేదు. అయితే ఒక స్నేహితురాలి కోరిక మేరకు ఆమె లేబుల్ లాంచింగ్ కోసం బాగా హెల్ప్ చేశాను. ఆ సమయంలో డిజైనింగ్‌పై ఏర్పడిన అవగాహన, కొంతమంది సన్నిహితుల సూచనలు నన్ను ఇన్స్పైర్ చేసి ఈ రంగంలోకి వచ్చేలా చేశాయి. ఎంట్రీలెవల్లోనే లాక్మె ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం అక్కడ నుంచి ఒకటొకటిగా వచ్చిన అవకాశాలు నన్ను చాలా స్వల్పకాలంలోనే డిమాండ్ ఉన్న డిజైనర్‌గా మార్చాయి. ఇది ఓవర్‌నైట్ స్టార్డమ్ అనే విషయం నేను అంగీకరిస్తాను. అయితే దీన్ని లాంగ్‌టైమ్ నిలుపుకునేందుకు ప్రయత్నిస్తాను. నానమ్మ స్ఫూర్తి.. మా నాన్నది కేరళ. ట్రెడిషనల్ ఫ్యామిలీ. పొడవాటి జడ, నిండైన విగ్రహం, అందుకు తగ్గట్టుగా కాంచీవరం చీర .. అందంగా మాత్రమే కాదు హుందాగా కూడా మెరిసిపోయేది మా నానమ్మ. ఆమె రూపాన్ని చూస్తూ పలువురు గొప్పగా మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ వస్త్రధారణ నన్ను చిన్నప్పటి నుంచి ఆకట్టుకునేది. ఓ రకంగా నేను డిజైనర్ కావడానికి ఆమే స్ఫూర్తి. కేరళ వస్త్రధారణ థీమ్‌తోనే నేను కథాకళి కలెక్షన్ రూపొందించాను. ఏంజెలినా.. చాన్స్ ఇచ్చేనా.. నాకు యుక్తవయసు నుంచి అభిమాన నటి మాధురీ దీక్షిత్. ఆమె కోసం కేప్టాప్ని డిజైనింగ్ చేయడం మరిచిపోలేని అనుభవం. వయసు పెరిగినా వన్నె తరగని అందం ఆమెది. అలాగే అనుష్కాశర్మ, సోనమ్ కపూర్, విద్యాబాలన్.. వీరందరికి నా డిజైన్స్ ఇవ్వడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. దీపికా పదుకునే, ఏంజలినా జోలిలకూ డిజైన్ చేయాలని నా కోరిక. నవ్వుతూ కనిపించరా.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక స్టైల్ స్టేట్మెంట్ ఏర్పరచుకుంటున్నారు. అయితే నా దృష్టిలో నవ్వుని మించిన స్టైల్ స్టేట్మెంట్ లేదు. ఒక వ్యక్తిని తలచుకోగానే తన స్మైలింగ్ ఫేస్ గుర్తుకు వస్తే చాలు. ప్రతి ఒక్కరిలో ఆ లుక్ గుర్తుండిపోతుంది. అందుకే కీప్ స్మైలింగ్. -
ఇన్వెస్ట్మెంట్ @ బాండ్ స్టయిల్
జేమ్స్‌బాండ్ సినిమాలంటే.. స్టయిల్, గ్యాడ్జెట్స్.. ఫన్. బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంటు బాండ్‌తో పాటు విలన్లకు కూడా ప్రత్యేకత ఉంటుంది. సమస్యలు సృష్టించడంలో ఇటు విలన్లు.. వాటిని ఎదుర్కొనడంలో అటు బాండ్ పాటించే వ్యూహాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. యాభై ఏళ్ల నుంచి అలరిస్తున్న జేమ్స్‌బాండ్ సినిమాల్లో పాత్రలు, ప్లాన్ల నుంచి నేర్చుకోదగిన ఆర్థిక పాఠాలు కూడా కొన్ని ఉన్నాయి. రిస్కును అర్థం చేసుకోవడం.. సినిమాల్లో జేమ్స్‌బాండ్ చేసే స్టంట్లు ప్రాక్టీస్ లేకుండా మనమూ ప్రయత్నిస్తే అంతే సంగతులు. సులువుగా కనిపించినా.. బాండ్ ప్లాన్ల వెనుక అధ్యయనం ఉంటుంది. ఉదాహరణకు.. కెసినో రాయల్ లాంటి సినిమాల్లో విలన్‌తో కార్డ్గేమ్ ఆడేటప్పుడు బాండ్ ఆషామాషీగా ఆడేయడు. విలన్ బాడీ లాంగ్వేజ్‌ను అధ్యయనం చేస్తూ దానికి తగ్గట్లుగా ప్లాన్ చేస్తుంటాడు. అలాగే, మనం ఇన్వెస్ట్మెంట్కి ఏది ఎంచుకున్నా.. అందులో లోటుపాట్లను, రిస్కులను పూర్తిగా తెలుసుకునే ముందడుగు వేయాలి. ప్రక్రియంటూ ఉండాలి.. బాండ్ సినిమాల్లో విలన్లు ముందుగా ఏదో ఒకటి చేస్తారు. దానికి ప్రతిచర్యగా బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ రియాక్ట్ అవుతుంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ విషయంలో తర్వాతెప్పుడో రియాక్ట్ కావడం కాదు.. ముందుగా యాక్షన్ అవసరం. పెట్టుబడిలో అంతరార్థం ఏదైనా లక్ష్యం సాధించడమే. కనుక లక్ష్యాలు నిర్దేశించుకుంటూ.. ప్లానింగ్ చేసుకుంటూ వెళ్లాలి. స్పెషలిస్టుల సాయం తీసుకోవాలి విలన్లను ఎదుర్కొనేందుకు బాండ్ సొంత తెలివితేటలతో పాటు గ్యాడ్జెట్స్ సాయం కూడా కీలకంగా ఉంటుంది. వీటిని స్పెషలిస్ట్ క్యూ తయారు చేసి ఇస్తుంటాడు. అలాగే, ఆర్థిక విషయాల్లో అప్పుడప్పుడు మన సొంత ఆలోచనలతో పాటు ఫైనాన్స్ నిపుణుల అవసరం కూడా ఉంటుంది. సందర్భాన్ని బట్టి స్పెషలిస్టుల సాయం తీసుకోవాల్సిందే. అవకాశాలు అందిపుచ్చుకోవాలి.. ప్రతి బాండ్ సినిమాలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంతా ప్రతికూలంగా ఉన్నా కూడా ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుని బాండ్ బైటపడుతుంటాడు. ఆర్థిక విషయాల్లోనూ ఇదే పాఠం పనిచేస్తుంది. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడు కంగారుపడిపోకుండా కామ్‌గా వ్యవహరించాలి. అంతా అందిన కాడికి అమ్మేసుకుంటున్నప్పుడు.. తెలివైన వారు అవకాశాలను ఒడిసిపట్టుకుంటుంటారు. చౌకగా కొనుక్కుని ఓపికగా అట్టే పెట్టుకుంటూ ఉంటారు. పడినవి ఎల్లకాలం పడిపోయే ఉండవు కాబట్టి అవి మళ్లీ పెరిగినప్పుడు అధిక ధరకు అమ్మి భారీ లాభాలు గడిస్తుంటారు. సమీక్షించుకోవాలి.. బాండ్ సినిమాల్లో ఛోటా మోటా విలన్లు... తమకి అప్పగించిన ప్రాజెక్టుల పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు బడా విలన్‌కు వివరిస్తుంటారు. విలన్లే అయినా.. వాళ్లు కూడా ఖాళీగా కూర్చోకుండా.. తమ ప్రాజెక్టుల బాగోగులు చూసుకుంటుంటారు. అలాగే.. మనం కూడా పెట్టిన పెట్టుబడులు.. లక్ష్యాలకు తగ్గట్లుగా పనిచేస్తున్నాయా లేదా అన్నది సమీక్షించుకుంటూ ఉండటం తప్పనిసరి. నష్టాలు తగ్గించుకోవాలి.. విషయంలో బాండ్ సినిమాల్లో విలన్లు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. ఉదాహరణకు యూ ఓన్లీ లివ్ టై్వస్లో తన రహస్య స్థావరం ఇక ఎందుకూ కొరగాదనుకున్నప్పుడు.. పేల్చేయడానికి విలన్ బ్లొఫెల్డ్ స్విచ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే, ఇన్వెస్ట్మెంట్ సాధనం నుంచి ఎప్పుడు వైదొలగాలి, ఎలా నష్టాలను తగ్గించుకోవాలి అన్న దానిపై కూడా ఇన్వెస్టరుగా అవగాహన ఉండాలి. -
స్టైల్ కోసం ఓ హెల్ప్‌లైన్
సాక్షి, బెంగళూరు : ఇబ్బందుల్లో ఉన్న వారిని రక్షించేందుకు, న్యాయ సలహాలు సూచనలు అందించేందుకు, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఇలా ఇప్పటి వరకు అనేక సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన హెల్ప్లైన్ల గురించి మనం వినే ఉంటాం. అయితే నేటి యువతరం ‘స్టైల్, గుడ్ లుక్’ కోసం పడే ఇబ్బందులను తీర్చేందుకు ఇప్పడు ఓ హెల్ప్‌లైన్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మంత్ర.కామ్ ‘లుక్గుడ్’ పేరిట దేశంలోనే మొట్టమొదటి సారిగా స్టైల్ సలహాలు అందించేందుకు ఓ హెల్ ్పలైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం సాయంత్రమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫాక్రీ, మంత్ర సంస్థ సీఈఓ ముకేష్ బన్సాల్ ఈ హెల్ప్‌లైన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకేష్ బన్సాల్ మాట్లాడుతూ...080-43541999 నంబర్‌తో హెల్ప్‌లైన్ (సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది.)ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌చేసి తమ రోజువారీ వస్త్రధారణపై మాత్రమే కాక పార్టీలు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లకు హాజరుకావడం తదితర ప్రత్యేక సందర్భాల్లో వస్త్రధారణ ఎలా ఉండాలనే విషయంపై సూచనలు సలహాలు పొందవచ్చని తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నిపుణులైన వ్యక్తులు ఈ సలహాలు, సూచనలు అందజేస్తారని వుుకేష్ బన్సాల్ వెల్లడించారు. -
కిల్లర్ హెయిర్ స్టయిల్!
‘వెంట్రుకల గుణం మీద స్టయిల్ ఆధారపడి ఉంటుంది, స్టయిల్ కోసం వెంట్రుకలను ఇబ్బంది పెట్టవద్దు’ ఇలాంటి బోలెడు సలహాలు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన వాళ్లు ఔత్సాహికుల కోసం చెప్పారు. పోర్చుగల్‌లోని లిస్బన్ పట్టణంలో ఇటీవల ‘మెన్స్ హెయిర్ స్టయిల్’ పోటీలు జరిగాయి. పద్దెనిమిది దేశాల నుంచి వెయ్యికి పైగా ఎంట్రీలు వచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్నాలుగు మంది మెన్స్ హెయిర్ స్టయిలిస్ట్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలో ఐర్లాండ్‌కు చెందిన పాల్మాక్ ‘కిల్లర్ కట్’ హెయిర్ స్టయిల్ బహుమతి గెలుచుకుంది. ‘‘ఒక సెలూన్లో బార్బర్‌గా నా కెరీర్ మొదలైంది. తీరికవేళల్లో రకరకాల హెయిర్ స్టయిల్లు ప్రయత్నించేవాడిని. ఆ అలవాటే బహుమతి అందుకునేలా చేసింది’’ అంటున్నాడు పాల్మాక్. ఈయన సెలూన్‌ను మాత్రమే నమ్ముకోకుండా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తన లేటెస్ట్ స్టయిల్స్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెడుతుంటాడు. ‘వెంట్రుకల గుణం మీద స్టయిల్ ఆధారపడి ఉంటుంది, స్టయిల్ కోసం వెంట్రుకలను ఇబ్బంది పెట్టవద్దు’ ఇలాంటి బోలెడు సలహాలు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన వాళ్లు ఔత్సాహికుల కోసం చెప్పారు. మీ వెంట్రుకలు మందంగా ఉంటే, ఈసారి సెలూన్‌కు వెళ్లినప్పుడు- ‘‘కిల్లర్ కట్ చెయ్ గురూ’’ అని అడగండి. ‘‘అదేమిటి?’’ అని అడిగేతే ప్రపంచ తలకట్టు పోటీలో బహుమతి గెలుచుకున్న ‘కిల్లర్ కట్’ గురించి చెప్పండి.‘‘మీ దగ్గర ఇంతుందా!’’ అన్నట్లు బార్బర్ చూస్తే చూడనివ్వండి. కొత్త విషయం చెబితే వినని వారు ఎవరు ఉంటారు చెప్పండి! -
యువ తార షాహిద్ కపూర్
ఫ్యాషన్ ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టింపులు లేవు. మనకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే అత్యుత్తమ ‘ఫ్యాషన్’ అని నేను నమ్ముతాను. స్టైల్ అనేదానికి ప్రత్యేకమైన నిర్వచనం లేదు. ఒకరికి నప్పిన స్టైల్ వేరొకరికి నప్పకపోవచ్చు. స్టైల్ పేరుతో బిగుతైన టీషర్ట్లను ధరించడం నా వల్ల కాదు! మార్పు ఆహ్వానించదగినదేగానీ, మార్పు కోసం మార్పు అనే విధానం కొన్ని సార్లు అంతగా విజయవంతం కాకపోవచ్చు. పర్టిక్యులర్ లుక్‌తో సౌకర్యవంతంగా ఉంటే, దాన్ని కొనసాగించడమే మంచిది. ఫిట్నెస్ - ఫిట్‌నెస్‌కు నా జీవితంలో అధిక ప్రాధాన్యత ఇస్తాను. జిమ్‌లో గడిపిన ప్రతి రోజూ మనసు ఆనందంగా ఉంటుంది. - నేను సినిమాల్లో నటిస్తున్నాను కాబట్టి ఫిట్నెస్తో ఉండాలి లేదా ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి ఫిట్నెస్తో ఉండాలి...అని అంటూ ఉంటారు. నిజానికి ఏ వృత్తిలో ఉన్నా ఫిట్నెస్ అనేది ముఖ్యమే. మొదట్లో నా బాడీ అద్దంలో చూసుకుంటే నాకే జాలిగా అనిపించేది. జిమ్‌కు వెళ్లడం అలవాటైన తరువాత నా బాడీలో మార్పు వచ్చింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది కూడా. జయాపజయాలు... - అపజయాల కంటే జయాలే నన్ను ఎక్కువ భయపెడతాయి. ఒక్క విజయం వచ్చిందటే చాలు దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. - పశంసలు పొందే అర్హత ఉండాలంటే విమర్శలు తట్టుకునే సహనం ఉండాలి. - మన పని మీద రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నప్పుడు.. వెంటనే వాటికి సమాధానం చెప్పాలనే తొందరపాటు కంటే ‘మౌనం’ గా ఉండడమే మేలు. ఆ తరువాత అవసరమైతే గొంతు విప్పవచ్చు. -
నైట్స్‌లో...రైట్ ట్రాక్స్!
రోజుకు 24 గంటలు. అందులో సుమారు 8 గంటలు నైట్ డ్రెస్సులోనే ఉంటారు అతివలు. అయితే.. హాయిగా నిద్రించడానికి, ఇంటా, బయట సౌకర్యంగా తిరగడానికి నైట్ డ్రెస్‌ల ఎంపిక ఎప్పుడూ అంత ప్రత్యేకంగా ఉండదు. కారణం.. ‘ఇంట్లోనే ఉంటాం, ఎవరికీ కనిపించం..కదా! అలాంటప్పుడు ఏ దుస్తులైతేనేం’ అనుకునేవారే ఎక్కువ. కానీ, రాత్రి వేళ ధరించే దుస్తుల ఎంపిక ఎప్పుడూ రైట్ ట్రాక్‌లో ఉండాలి... రేపు అనే భవిష్యత్తుకు నేడు అందమైన కల కనాలంటే అలసిన శరీరానికి కంటి నిండా నిద్ర అవసరం. ‘అందుకు పడకగదిని శుభ్రంగా ఉంచి, మెత్తటి పరుపును సరిచేయడమే కాదు, ఒంటిపై ఉన్న వస్త్రానికీ ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటున్నారు నైట్ దుస్తుల తయారీ నిపుణులు. ‘కేవలం నిద్రించే సమయాలలోనే కాకుండా, రోజంతా ధరించే వీలున్న ‘టైమ్‌లెస్’ దుస్తులు నేడు లభిస్తున్నాయి. వీటి ఎంపికలోనే మనదైన ముద్ర కనిపించాలి. డిజైనర్ స్లీప్ వేర్... రాత్రి ధరించే దుస్తులకే కొన్ని హంగులను జతచేస్తే విలాసవంతమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చు. డిజైనర్ ఎంపిక చేసిన ఫ్యాబ్రిక్‌ను కొనుగోలు చేసి, మీ శరీరాకృతికి తగ్గట్టు సౌకర్యంగా దుస్తులను డిజైన్ చేయించుకుంటే సరి! ప్రపంచ ప్రసిద్ధి పొందిన డిజైనర్ ఆర్మానీ రోబ్స్ నైట్ గౌన్లను సౌకర్యంగానూ, స్టైల్‌గానూ రూపొందించి పేరుపొందాడు. దుస్తుల ఎంపికకు ముందు... రాత్రి పడుకునేముందు కదలికలకు తగ్గ సౌకర్యవంతమైన దుస్తులనే ఎంచుకోవాలి. ‘నైట్ వేర్’ అంటే శరీరమంతా కప్పి ఉంచేవి అనుకోకూడదు. రాత్రి ధరించే దుస్తులు కూడా ఎదుటివారి ప్రశంసలు అందుకునేలా ఉండాలి. అదే సమయంలో మీరు నిద్రించే భంగిమలో దుస్తులు(స్లీప్వేర్) ఇంట్లోవారికైనాసరే ఇబ్బంది కలిగించని విధంగానూ ఉండాలి. కళ్లకు, చర్మానికి ఎంచుకున్న ఫ్యాబ్రిక్, స్టైల్ హాయి గొలిపేలా ఉండాలి. రాత్రి ధరించే దుస్తులు మెత్తని వస్త్రంతో తయారైనవి కావాలనుకుంటారు. వీటిలో కాటన్, సిల్క్, శాటిన్, వెల్వెట్.. దుస్తులు మేలైనవి. లేత రంగులు, చిన్న ప్రింట్లు కంటికి, మెదడుకు హాయిగొలుపుతాయి. చక్కటి నిద్రకు ఉపకరిస్తాయి. చాలామంది ఎక్కువ డబ్బును స్లీప్వేర్ మీద ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఏదో ఒకటిలే అని సరిపెట్టేస్తుంటారు. వేసుకున్న దుస్తుల నాణ్యత, రంగులు, స్టైల్, కొలతలు, ధర.. ఇవన్నీ మెదడుపై ప్రభావాన్ని చూపి నిద్రలేమికి కారణాలు అవ్వచ్చు. అందుకని ఈ అంశాలన్నింటిపైనా దృష్టిపెట్టాలి. స్లీప్ గౌన్లు... వేసవిలో చేతులు లేని కురచ గౌన్లు సరైన ఎంపిక. అదే చలికాలంలో పొడవాటి లేదా మోచేతుల వరకు ఉండే చేతులు, ప్యానల్ ఉన్న గౌన్లను ఎంచుకోవచ్చు. నైట్ గౌన్ లేదా కాటన్ నైట్ గౌన్లను లేస్ సరిగ్గా కనిపించేలా వాడాలి. పర్యావరణ అనుకూలం: నిద్రలేమి సమస్యలు దరిచేరకూడదన్నా, కంటినిండా నిద్ర కావాలన్నా పర్యావరణ అనుకూల దుస్తుల ఎంపిక మేలైనది. చలి, వాన, ఎండ.. కాలాలు ఏవైనా ఎకోఛాయిస్ మేలైన ఎంపిక. రసాయనాల వాడకం లేని నూలు తయారీ వస్త్రాల కోసం సేంద్రియ ఉత్పత్తుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చలిలో వెచ్చదనం, వేడిలో చల్లదనం మేనికి అందిస్తాయి. వేసవికి ప్రత్యేకం: వేసవిలో ముందు వేడిగా, అర్థరాత్రి దాటాక వాతావరణం చల్లగా మారుతుంది. ఈ కాలం ఏసీ, ఫ్యాన్ల వాడకాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వేసవి రాత్రులలో మేనికి గాలి తగిలే, చమటను పీల్చుకునే వస్త్రాలను ఎంచుకోవాలి. కురచ చొక్కాలు, పొడవాటి ప్యాంట్లు లేదా పైజామాలు సరైన ఎంపిక. చేతులు లేని నైట్ గౌన్లు తేలికగా ఉంటాయి. లెగ్గింగ్స్ టి-షర్ట్ సరిజోడి. యువతరానికి వైవిధ్యం: ట్రాక్‌సూట్స్ యువతులకు బాగా నప్పుతాయి. లాంగ్ పైజామా, పైన టీ-షర్ట్ లేదా షార్ట్, టీ-షర్ట్ మంచి ఎంపిక. క్రీడల పట్ల ఆసక్తి చూపే అమ్మాయిలు ట్రాక్ ప్యాంట్ ధరిస్తే బాగుంటుంది. ఎక్కువ కుచ్చిళ్లు ఉన్న పైజామా, హుడీస్ ధరించడం మేలు. ఇంటి నుంచి అలా ఆరుబయట తిరిగి రావాలనుకున్నా ఈ తరహా డ్రెస్‌ల మీద నిరభ్యంతరంగా బయటకు వెళ్లిరావచ్చు. లో దుస్తుల సౌకర్యం: బ్రా, ప్యాంటీస్తో సహా నైట్‌వేర్.. విభిన్న కట్లు, స్టైల్, కలర్స్, మెటీరియ ల్స్, ప్యాటర్న్స్‌లో లభిస్తున్నాయి. కురుచ దుస్తులు ధరించినప్పుడు లో దుస్తులు హైకట్, జి-స్ట్రింగ్స్ ఉండేలా జాగ్రత్తపడాలి. మరీ బిగుతుగా, చమటను పీల్చుకోని లో దుస్తులను ఎంచుకోకూడదు. పైజా మా, నైట్ గౌన్, షార్ట్స్.. ఇలా ఆయా దుస్తులకు అనుగుణంగా లో దుస్తులను ఎంచుకోవాలి. కమిసోల్స్: పొడవైన ‘యు, వి’ నెక్ మోడల్లో ఉండే కమిసోల్స్ మహిళల కోసం మార్కెట్ నిండా ఉన్నాయి. ఇవి అమ్మాయిలే కాదు మధ్య వయస్కులు కూడా ధరించవచ్చు. ఈ డ్రెస్ బయట తిరగడానికి సౌకర్యవంతంగానూ, నిద్రించడానికి హాయిగానూ ఉంటాయి. వీటిలో శాటిన్, కాటన్, లినెన్.. మెటీరియల్‌లో రకరకాల ప్యాటర్న్స్ లభిస్తున్నాయి. పైజామాల ఎంపిక: పైజామాలలో మోకాళ్ల వరకు, మడమల వరకు అని రెండు రకాలవి ఎంచుకోవాలి. అప్పుడే సౌకర్యం, వీలునుబట్టి మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. యోగా ప్యాంట్స్, ట్రాక్ సూట్స్ స్టైల్‌గానూ, సౌకర్యంగానూ ఉంటాయి. షాప్‌కి వెళ్లేముందు మీ శరీర కొలతలను చెక్ చేసుకోండి. దీని వల్ల దుస్తుల ఎంపిక సులువు అవుతుంది కాబోయే అమ్మకు ప్రత్యేకం మొదటి మూడు నెలలు సాధారణ నైట్ దుస్తులు వాడచ్చు. ఆ తర్వాతి నెలలో శరీరాకృతిలో మార్పులకు త గ్గ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. సిగ్గుపడకుండా తమ శరీరాకృతికి తగిన, సౌకర్యంగా ఉండే నైట్ దుస్తుల ఎంపిక చేసుకోవాలి. సాగే గుణం ఉన్న దుస్తులు మూడు జతల చొప్పున తీసుకోవాలి. సహజసిద్ధమైన రంగులు, దేనితోనైనా మ్యాచ్ చేసుకోదగిన టాప్స్ పొడవుగా ఉన్నవి ఎంచుకోవాలి. దీనివల్ల ఎక్కువ ఖర్చుకాదు. డ్రెస్సులు మరీ తక్కువగా ఉన్నాయనే భావన దరిచేరదు. గర్భవతుల కోసం షాపుల్లో ప్రత్యేకమైన విభాగాలు ఉంటాయి. వాటిలో తమకు అనుగుణమైనవి ఎంచుకోవాలి. పెరుగుతున్న పొట్టను మృదువుగా హత్తుకునేలాంటి దుస్తులు ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఇందుకోసం మీరు ‘ప్రెగ్నెన్సీ మ్యాగజీన్స్’ను చూడవచ్చు. తల్లి సౌకర్యం, సంతోషం గర్భస్థ శిశువు ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. నిర్వహణ: నిర్మలారెడ్డి -
స్టూలు వేసుకుని.. స్టైల్‌గా.. .
షూ కింద స్టూల్ తగిలించుకుని నడుస్తున్న ఈ కుర్రాడి పేరు జావో కియాంగ్. చైనాలోని షెన్యాంగ్లో ఉంటాడు. ఇదేదో స్టైల్ కోసం వేసుకున్నది కాదు. ఇతడికి చిన్న వయసులోనే వచ్చిన అనారోగ్య సమస్య వల్ల ఎడమ కాలు సరిగా ఎదగలేదు. దీంతో కుడికాలుతో పోలిస్తే.. ఎడమ కాలు ఈ మేరకు తగ్గింది. నడవడానికి ఇబ్బంది పడుతున్న కియాంగ్‌ను చూసిన అతడి మామకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే అతడి షూలకు ఈ చిన్నపాటి స్టూల్‌ను ఫిట్ చేసేశాడు. దీని సాయంతో కియాంగ్ ఎంచక్కా నడవగలుగుతున్నాడు. -
షగ్ర్... వెచ్చని హగ్
‘ఏమో నాకేం తెల్సు?’ అని భుజాలు ఎగరేయడం... ‘షగ్ర్ ర. ‘చలి బాగా ఎక్కువైంది కదండీ’ అన్నప్పుడుఎవరైనా ‘షగ్ర్ చేశారనుకోండి... ఏమిటర్థం? ఏముందీ... వాళ్లు షగ్ర్ వేసుకుని ఉన్నారని! షగ్ర్ వేసుకున్నమ్మకు చలి తెలిస్తే కదా. స్టెయిల్‌గా ఎన్నిసార్లయినా భుజాలు ఎగరేస్తుంది! షగ్క్రీ, స్వెటర్కీ తేడా అదే! స్వెటర్ స్వెటర్లా ఉంటుంది. షగ్ర్ స్టెయిలిష్ స్వెటర్లా ఉంటుంది. ఈ వింటర్‌కి మీ ఒంటిపైకి ఓ షగ్‌న్రు తెచ్చుకోండి. అప్పుడు చలి మిమ్మల్ని కాదు... మీరే చలిని హగ్ చేసుకోవచ్చు. చలి అదరగొడుతోంది. తట్టు కునేందుకు స్వెటర్ ధరించడం మామూలే! అయితే స్వెటర్ వల్ల ఏ డ్రెస్ వేసుకున్నా ఓ స్టైల్ అంటూ ఉండదు. మరెలా? షగ్ర్ ఉంది కదా!! స్టైల్‌గా కనిపించేలా చేస్తూనే వెచ్చదనాన్ని కలిగించే ఉలెన్ షగ్ర్ ఎన్నో రంగుల్లో, డిజైన్లలో మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇవి భుజాలను మాత్రమే కవర్ చేస్తూ, ఛాతి భాగంలో ఓపెన్‌గా ఉంచుతాయి. వీటిల్లో కొన్ని... బటన్సతో ఉంటాయి. అయితే ఇవి ఎవరికి నప్పుతాయి? వీటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు కూడా తెలుసుకుంటే స్టైల్‌ని మరింత అదరగొట్టచ్చు. చలిని హాయిగా హగ్ చేసుకోవచ్చు. ర్యాంప్ స్టైల్: షగ్ర్ పూర్తిగా పాశ్చాత్య తరహాకు చెందినది. తొలినాళ్లలో నవవధువు ధరించే గౌన్ పై అందంగా చేతులకు, ఛాతీ భాగంలో డిజైన్‌గా ఒదిగిఉండేది. తర్వాత క్రమంగా ర్యాంప్‌ల మీద రకరకాల డ్రెస్‌లపై హొయలుగా స్థిరపడింది. అలా అన్ని దేశాలకూ స్టైల్‌గా వ్యాపించింది. చిన్నపాటి బ్లేజర్లా అనిపించే షగ్ర్ అన్నిరకాల మెటీరియల్లోనూ లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఇవి టీనేజర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఏ కాలమైనా! పొడవుగానూ, పొట్టిగానూ ఉండే షగ్ర్ ఏ కాలమైనా ఏ ఫ్యాబ్రిక్లలోనైనా లభిస్తాయి. ఔట్‌లుక్‌ను స్టైల్‌గా మార్చుతుండటంతో యంగ్‌స్టర్స్‌కి షగ్ర్ అభిమానురాలైంది. పొడవుగా ఉండే టీనేజర్స్‌కి బాగా నప్పుతాయి. వేసుకున్న డ్రెస్ ఫిట్‌గా ఉండాలి. ఆ పైన వదులుగా ఉండే ఉలెన్ షగ్ర్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. అందుకు శరీరాకృతి కూడా ఫిట్‌గా ఉండాలి. యాక్సెసరీస్: మ్యాచింగ్ బ్యాంగిల్స్, చైన్, బ్యాగ్.. ఇలా ఇతర అలంకరణ వస్తువుల్లాగే షగ్‌న్రు ఒక యాక్సెసరీగా వాడుతున్నారు. చలికాలానికి తట్టుకునే విధంగా అయితే లెదర్, ఉలెన్ మెటీరియల్ షగ్ర్ ఎంచుకుంటే రెండు విధాలా మేలు. పాశ్చాత్యం: ఇండియన్ వేర్ కాదు కాబట్టి కట్స్ మనలా చూసుకోవాలి. ర్యాంప్ షోలను గమనిస్తే శారీస్ పైన షగ్ర్ వాడడం చూస్తుంటాం. తమ డిజైన్స్‌కి ఒక స్టేటస్ సింబల్‌గా చూపించడానికి షగ్ర్ వాడతారు. అలాగని ట్రెడిషనల్ డ్రెస్‌ల పైన షగ్ర్ నప్పదు. పూర్తి వెస్ట్రన్వేర్కు మాత్రమే షగ్ర్ మ్యాచ్ అవుతుంది. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండే యంగ్‌స్టర్స్ షగ్స్న్రు హ్యాపీగా ధరించవచ్చు. రంగులు: ముదురురంగులు, డస్టీ, శాండ్, కామిల్, మడ్... కలర్స్ చలికాలానికి బాగా నప్పుతాయి. శుభ్రత: షగ్ర్ లిక్విడ్ డిటర్జెంట్ సోప్ కలిపిన నీటిలో నానబెట్టి, చేతులతో మాత్రమే శుభ్రపరచాలి. శుభ్రం చేయడానికి బ్లీచ్, బ్రష్, వాషింగ్ మెషీన్ వంటివి ఉపయోగించకూడదు. నీరు పోవడానికి గట్టిగా పిండకూడదు. ఉలెన్ దారాలు వదులయ్యే అవకాశం ఉంది. అలాగే ఎండలో ఆరవేయకూడదు. ఐరన్ చేయకూడదు. ఫ్యాబ్రిక్, డిజైన్, నాణ్యత, బ్రాండ్స బట్టి షగ్ర్స వందల రూపాయల నుంచి వేల రూపాయల్లో ధర పలుకుతోంది. టు ఇన్ వన్ లా ఉపయోగపడే షగ్ర్ మీ వార్డరోబ్లో ఉందా! శిల్పారెడ్డి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ నిర్వహణ: నిర్మలారెడ్డి