వేళ్లకి ఉంగరాలు, మెడలో గొలుసులు ధరించడం సాధారణమే! చేతులకు ఉంగరాలు.. చెయిన్లు, హ్యాండ్ కఫ్స్ ధరించడం ఇప్పుడు ట్రెండ్. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సుల మీదకు ఈ ఉంగరాలు, చెయిన్ల వరసలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. యువత వేగానికి, స్టయిల్‌కి అద్దంలా భాసిల్లుతున్నాయి.
బంగారు వరసలు
లైట్ వెయిట్ జ్యువెలరీలో భాగంగా హ్యాండ్ కఫ్స్, చెయిన్స్ డిజైనర్లను ఆధునికత వైపుగా పరుగులు తీయిస్తున్నాయి. ఆభరణాల డిజైనర్లు బంగారు లోహంతో వెస్ట్రన్ స్టైల్ డిజైన్స్‌ను కొత్తగా మెరిపిస్తున్నారు.
వెండి వెలుగులు
తక్కువ ఖర్చు అనే జాబితాను ఈ తరం పక్కన పెట్టేస్తోంది. ఏ డిజైన్ తమకు మరింత అందాన్ని తీసుకువస్తుందో, నలుగురిలో గుర్తింపును సంపాదిస్తుందో దానినే ఇష్టపడుతోంది. అందుకే సిల్వర్ డిజైన్స్ మరింతగా యువత మదిని గెలుచుకుంటున్నాయి.
స్టీల్ మెరుపులు
స్ట్రీట్ అండ్ బోహో స్టైల్‌లో స్టీల్‌తో తయారైన ఆభరణాలను యువత ఎక్కువ ధరిస్తుంటుంది. క్యాజువల్ వేర్, పార్టీవేర్‌కీ నప్పే ఈ డిజైన్ వరసలు వందల రూపాయల నుంచి మార్కెట్‌లో లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment