Finger ring
-
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటీ? ఇది ప్రమాదకరమా..?
స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..ఐఫోన్ ఫింగర్ అంటే..ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్‌ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్‌లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్‌కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులుస్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్‌ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు. విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్. (చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!) -
సరికొత్త ట్రెండ్ ఉంగారాల చెయిన్లు..!
వేళ్లకి ఉంగరాలు, మెడలో గొలుసులు ధరించడం సాధారణమే! చేతులకు ఉంగరాలు.. చెయిన్లు, హ్యాండ్ కఫ్స్ ధరించడం ఇప్పుడు ట్రెండ్. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సుల మీదకు ఈ ఉంగరాలు, చెయిన్ల వరసలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. యువత వేగానికి, స్టయిల్‌కి అద్దంలా భాసిల్లుతున్నాయి. బంగారు వరసలు లైట్ వెయిట్ జ్యువెలరీలో భాగంగా హ్యాండ్ కఫ్స్, చెయిన్స్ డిజైనర్లను ఆధునికత వైపుగా పరుగులు తీయిస్తున్నాయి. ఆభరణాల డిజైనర్లు బంగారు లోహంతో వెస్ట్రన్ స్టైల్ డిజైన్స్‌ను కొత్తగా మెరిపిస్తున్నారు. వెండి వెలుగులు తక్కువ ఖర్చు అనే జాబితాను ఈ తరం పక్కన పెట్టేస్తోంది. ఏ డిజైన్ తమకు మరింత అందాన్ని తీసుకువస్తుందో, నలుగురిలో గుర్తింపును సంపాదిస్తుందో దానినే ఇష్టపడుతోంది. అందుకే సిల్వర్ డిజైన్స్ మరింతగా యువత మదిని గెలుచుకుంటున్నాయి. స్టీల్ మెరుపులు స్ట్రీట్ అండ్ బోహో స్టైల్లో స్టీల్‌తో తయారైన ఆభరణాలను యువత ఎక్కువ ధరిస్తుంటుంది. క్యాజువల్ వేర్, పార్టీవేర్కీ నప్పే ఈ డిజైన్ వరసలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. (చదవండి: తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!) -
సాహా చేతివేలికి సర్జరీ
కోల్‌కతా: భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుడి చేతి ఉంగరం వేలికి మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన డేనైట్ టెస్టు మ్యాచ్‌లో అతని చేతి వేలికి గాయమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం అతని గాయంపై మణికట్టు వైద్య నిపుణుడిని సంప్రదించింది. ఆయన సర్జరీకి సూచించడంతో ముంబైలోని హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సాహా మాట్లాడుతూ ‘ఇది మామూలు గాయమే. కాస్త ఫ్రాక్చర్ అయింది. కోలుకునేందుకు పెద్దగా సమయం పట్టదు. ఐదు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో పాల్గొని ఫిట్నెస్ సంతరించుకుంటాను’ అని అన్నాడు. న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సిరీస్‌కల్లా అతను అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. -
ఉంగరం వేలికి మచ్చ...
అందం వేలికి ఉంగరం చేతికి ఎంతో అందాన్నిస్తుంది. అయితే, ఆ వేలి చుట్టూ నల్లని వలయం ఏర్పడితే మాత్రం ఆ అందం ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండదు. వేలిపై ఉంగరం స్థానంలో ఏర్పడిన మచ్చలను తొలగించాలంటే కొన్ని రోజుల పాటు ఉంగరాన్ని ధరించకుండా ఉండటం తాతాల్కిక పరిష్కారం మాత్రమే. మళ్లీ ఉంగరం ధరించినప్పుడు, మళ్లీ మచ్చ రావడం ఖాయమే కదా! ఈసారి సమస్య తిరిగి రాకుండా.. ఎండ వల్ల లోహం వేడెక్కి, ఉంగరం వుండే ప్రాంతంలో చర్మం మరింత నలుపుగా మారే అవకాశం ఉంది. అంత మాత్రాన ఆ ప్రాంతంలో సన్‌స్క్రీన్ లోషన్ రాయడం అనవసరం. టీ స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి, నల్లని వలయం చుట్టూ రాసి, 15 నిమిషాలు ఉంచండి. ఆరిన తర్వాత కడిగేయండి. వారానికి మూడు రోజులు ఇలా చేస్తూ ఉండండి. ట్యాన్ (ఎండకు కమలడం) వల్ల ఏర్పడిన మచ్చ చర్మం రంగుకు మారుతుంది. కొద్దిగా మాయిశ్చరైజర్ అద్దుకుని, వేళ్లపై రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలు ఉత్తేజితం అయి, ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి. నెల రోజులకు ఒకసారి వేళ్లకు, గోళ్లకు తప్పనిసరిగా పార్లర్లో లేదా ఇంట్లో మేనిక్యూర్ చేయించుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, అందులో 15 నిమిషాలు వేళ్లను ముంచి ఉంచి, తర్వాత మృతకణాలను తొలగించడానికి స్క్రబ్‌తో రుద్దాలి. ఈ పద్ధతి వల్ల ఉంగరం వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.