కోల్‌కతా: భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుడి చేతి ఉంగరం వేలికి మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన డేనైట్ టెస్టు మ్యాచ్‌లో అతని చేతి వేలికి గాయమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం అతని గాయంపై మణికట్టు వైద్య నిపుణుడిని సంప్రదించింది. ఆయన సర్జరీకి సూచించడంతో ముంబైలోని హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సాహా మాట్లాడుతూ ‘ఇది మామూలు గాయమే. కాస్త ఫ్రాక్చర్ అయింది. కోలుకునేందుకు పెద్దగా సమయం పట్టదు. ఐదు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాస శిబిరంలో పాల్గొని ఫిట్‌నెస్ సంతరించుకుంటాను’ అని అన్నాడు. న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సిరీస్‌కల్లా అతను అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment