స్మార్ట్ ఫోన్ అడిక్షన్‌తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్‌లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..
ఐఫోన్ ఫింగర్ అంటే..
ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్‌ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్‌లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్‌ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్‌కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..
ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులు
స్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్‌ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు.
విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్.
(చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!)
Comments
Please login to add a commentAdd a comment