
మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను(Square Waves) గమనించారా? వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారా? అయితే ఆ అలల గురించి తెలిస్తే వణికిపోతారు. సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన అలలలో చదరపు అలలు ప్రధానమైనవి. వీటిని స్క్వేర్ వేవ్స్, క్రాస్ సీ లేదా గ్రిడ్ వేవ్స్ అని కూడా అంటారు. ఇవి అత్యంత అరుదుగా ఏర్పడినప్పటికీ, ఎంతో శక్తివంతమైనవి.
సముద్రంలో చాలావరకూ అలలు ఒడ్డుకు చేరుకున్నాక తీరప్రాంతానికి అడ్డంగా , సమాంతరంగా వీడిపోతాయి. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలోని సముద్రాలలో నీటి ఉపరితలంపై చదరంగం బోర్డు లాంటి అలలు ఏర్పడటం అరుదుగా జరుగుతుంటుంది. పై నుండి ఈ అలను చూస్తే, చతురస్రాకారపు అలలను ఏర్పరిచేవిధంగా నీటి అడుగున ఏదో గ్రిడ్ ఉన్నట్లు అనిపిస్తుంది. సముద్ర తీరంలోని లైట్‌హౌస్(Lighthouse) లేదా కొండప్రాంతాల నుంచి సముద్రంపైకి డ్రోన్‌ను ఎగురవేసినపపుడు సముద్రంలో ఇటువంటి అలలను గుర్తించవచ్చు.
One of the most dangerous wave in ocean the Square Waves. These are also known as cross-sea or grid waves. If you see them, get out of the water. Though rare, they are associated with strong and powerful rip tides. pic.twitter.com/davAmfTNbZ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 2, 2025
సముంద్రంలోని నీటి అడుగున జరుగుతున్న ఏ పరిస్థితుల కారణంగానూ ఈ అలలు ఏర్పడవు. సముద్రంలోని నీరు కదులుతున్న తీరుతెన్నులను అనుసరించి ఈ స్క్వేర్ వేవ్స్ ఏర్పడతాయి. రెండు సముద్రాల ఖండన సమయంలో ఈ విధమైన చదరపు తరంగాలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలోని వాతావరణ స్థితిగతుల(Weather conditions) కారణంగానూ ఇలాంటి అలలు ఏర్పడతాయి. రెండు వ్యతిరేక అలలు ఢీకొన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన నమూనాలో అల ఉద్భవిస్తుంది. చతురస్రాకార అలల రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఆ అలులు ఎంతో ప్రమాదకరమైనవి.
సముద్రంలో చతురస్రాకారను అలలు కనిపిస్తే, వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఈతగాళ్లు కూడా ఇటువంటి అలలకు దూరంగా ఉండాలి. ఈ అలలు పడవ ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ అలలు ప్రపంచవ్యాప్తంగా పలు బీచ్‌లలో కొద్ది నిమిషాల్లో కనిపించి అదృశ్యమవుతుంటాయి. చతురస్రాకార అలలు ఫ్రాన్స్‌లోని ఐల్ డి రేలో తరచూ కనిపిస్తుంటాయి. దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఇవి కనిపిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ